'మిర్చి హోలీ'..రంగు పులుముకున్న పుడమి తల్లి..! | Anand Mahindra shares stunning aerial view of Guntur chilli fields | Sakshi
Sakshi News home page

'మిర్చి హోలీ'..రంగు పులుముకున్న పుడమి తల్లి..!: ఆనంద్‌ మహీంద్రా

Mar 5 2026 2:03 PM | Updated on Mar 5 2026 2:09 PM

Anand Mahindra shares stunning aerial view of Guntur chilli fields

హోలీ వేడుకును అందరు పలు విధాలుగా జరుపుకుంటారు. సహజసిద్ధమైన రంగులతో కొందరు..ప్రకృతిని ఆస్వాదించేలా కొందరు సెలబ్రేట్‌ చేసుకున్నారు. కానీ వాటన్నింటికంటే మన పుడమి తల్లి జరుపుకునే హోలీ వేడుకకు మించిన రంగుల పండుగ మరొకటి ఉండదు. సరిగ్గా చూస్తే దానిలో దాచుకున్న అద్భుతం హే రంగులే.. హే రంగులే ..అన్నట్లుగా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అందుకు సంబంధించిన వీడియోని పారిశ్రామిక దిగ్గజం షేర్‌ చేస్తూ అందర్నీ ప్రకృతి రమ్యత గూర్చి ఆలోచింపచేసేలా చేశారు.

ఆ వీడియోలో మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా "హోలీ వేళ తప్పక వీక్షించాల్సిన వీడియో" అనే క్యాప్షన్‌ జోడించి మరి పోస్ట్‌  చేశారు. ఆకాశం నుంచి చూస్తే..రంగుల వస్త్రాన్ని కప్పుకున్న నేల తల్లిలా అందంగా కనిపిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో అద్భుతమైన ఎర్రమిరప పంట వైమానిక క్లిప్‌. రైల్వేలైన్‌ ఇరువైపులా ఎండబెట్టిన మిరపకాయలు షీట్‌లు కనిపిస్తాయి. 

అది చూస్తే ఒకవైపు పచ్చదనం..మరోవైపు ఎరుపు రంగు కలగలసి అద్భుతమైన పెద్ద కాన్వాస్‌ని పోలి ఉంటుంది. భారతదేశంలోని వ్యవసాయ రంగం నుంచి పుట్టుకొచ్చే రంగులే వేరు. బెలూన్‌ రైడ్‌, స్థానిక సంగీతం, నృత్య ప్రదర్శనలకు మించిన సహజసిద్ధమైన రంగుల ప్రదర్శన అని, తానెప్పుడు దీన్ని చూడలేదని రాసుకొచ్చారు మహీంద్రా పోస్ట్‌లో. పర్యాటకులను ఆకర్షించేలా తమ ఆదాయాన్ని పెంచుకునేలా స్థానిక రైతులు చేస్తే బాగుండనని, అయితే ఆ దిశగా ఎవ్వరూ ఆలోచించడం లేదని కూడా అన్నారు. 

నెటిజన్లు కూడా ఈ పోస్ట్‌పై స్పందిస్తూ..ఇలా పోస్టలు పెట్టారు. గుంటూరు మిర్చి పొలాలు ఇప్పటికే భారతదేశ సహజ హోలీ కాన్వాస్‌లు. సరైన ప్రణాళికతో రైతులకు మద్దతు ఇచ్చేలా..ఆంధ్రుల గర్వాన్ని ప్రదర్శించే ప్రపంచ స్థాయి వ్యవసాయ-పర్యాటక ఉత్సవంగా మార్చొచ్చు అని పోస్టులు పెట్టారు.

 

(చదవండి: తొలి మహిళా తవిల్‌ కళాకారిణి..! ఏ ఆర్‌ రెహమాన్‌ సైతం..)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement