ఒకప్పుడు క్లాస్‌ టాపర్‌..కానీ ఇవాళ..! | Life Takes Unexpected Turns, Class Topper Becomes Ride Driver, Video Of Conversation With Friend Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

ఒకప్పుడు క్లాస్‌ టాపర్‌..కానీ ఇవాళ..!

Mar 5 2026 10:57 AM | Updated on Mar 5 2026 11:50 AM

Passenger discovers Rapido rider is his class topper Goes Viral

జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. మెరుగైన స్టూడెంట్‌ గొప్ప ఉద్యోగంలో ఉంటాడని, యావరేజ్‌ స్టూడెంట్‌ ఏ ఉద్యోగం లేకుండా ఉంటాడని అనుకుంటాం. కానీ విధి చాలా పక్కా స్క్రిప్ట్‌తో మన అంచనాలను తలకిందులు చేస్తూ మన రాతన నిర్దేశిస్తుంది. అందుకు ఈ మిత్రులు కథే ఓ ఉదాహరణ. ఇప్పుడు ఆ ఇద్దరు మిత్రులు మధ్య జరిగిన సంభాషణ నెట్టింట వైరల్‌గా మారి..నెటిజన్లను ఆలోచింపచేసేలా చేసింది. 

ఈ మిత్రుల సంభాషణను భారత్ మాతా కే సేవక్ సోష్‌ల్‌ మీడియా ఎక్స్‌లో షేర్‌ చేసింది. ఉమర్‌ అనే వ్యక్తి రైడ్‌ని బుక్‌ చేసుకున్నాడు. అయితే ఆ రైడర్‌ పేరు ఎందుకనో ఆసక్తిగా అనిపించిది. ఆ రైడర్‌ పేరు చందన్‌గా మొబైల్‌లో కనిపించడంతో ఒకప్పటి తన క్లాస్‌మేట్‌ చందన్‌నే. ఆ..! క్లాస్‌ టాపర్‌ కదా వీడేనా వాడు అని ఆలోచిస్తూ ఉండగానే..బుక్‌చేసుకున్న రైడర్‌ రానే వచ్చాడు. 

అతడు ఊహించనట్లుగానే ఆ రైడర్‌ తన క్లాస్‌మేట్‌ కావడంతో ఒక్కసారిగా షాక్‌ అవుతాడు. అతడిని కలిసిన ఆనందంతో ఎప్పటి నుంచి రైడర్‌గా పనిచేస్తున్నావ్‌ రా అని అడుగుతాడు. వెంటనే సదరు రైడర్‌ చందన్‌ ముందు ఓటీపీ చెప్పరా అని సమాధానమిస్తాడు. ఆ తర్వాత చందన్‌ మాట్లాడుతూ..జీవితం ఎప్పుడూ ఓ ప్లాన్‌ ప్రకారం జరిగిపోదురా. అయిన పర్లేదు మిత్రమా..! నువ్వు నాగురించి ఏం బాధపడొద్దు. అయినా నువ్వు నా ఫ్రెండ్‌వి. నేను నీకు ఎలాంటి ఛార్జ్‌ చేయను అని అంటాడు. 

అప్పుడు ఉమర్‌ నువ్వు మన క్లాస్‌ టాపర్‌వి కదరా ఇలా..అంటూ ఆగిపోగా..చందన్‌ నవ్వుతూ..జీవితం చాలా విచిత్రమైనది..అయినా నేను కూడా ఎప్పుడు అనుకోలేదు. నువ్వే నా కస్టమర్‌వి అవుతావని అని నవ్వుతూ అంటాడు. ఆ తర్వాత రా కూర్చో..నేను నిన్ను సురక్షితంగా డ్రాప్‌ చేస్తాను అని బదులిస్తాడు. 

ఆ పోస్ట్‌ చాలా ఆలోచనాత్మక సందేశాన్ని ఇచ్చింది. మార్కులు, డిగ్రీలు లేదా టాపర్‌గా ఉండటం అనేవి మన భవిష్యత్తుని నిర్ణయించవు. అలాగే నిజాయితీగా పనిచేస్తే ఏ ఉద్యోగం చిన్నది కాదు. ముందు మనల్ని మనం చిన్నబుచ్చుకోకుండా గౌరవప్రదంగా భావిస్తే.. ప్రతి ఉద్యోగానికి ఓ గౌరవం ఉంటుంది అనే విషయాన్ని నొక్కిచెప్పింది అంటూ నెటిజన్లు పోస్టులు పెట్టారు. కొందరు మాత్రం క్లాస్‌ టాపర్‌ ఇలా రాపిడో రైడర్‌గా మారడం ఓకింత బాధను కలిగించింది అని పోస్టులు పెట్టడం గమనార్హం.

 

(చదవండి: శాంతిలాంటి వాళ్లు ఎందరో..! ఏం జరిగినా..టెన్షన్‌గా పనికి వచ్చేయాలి..)


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement