ర్యాపిడో డ్రైవర్‌కు షాకిచ్చిన మహిళ.. ఇదో వింత కథ! | Viral Video: Woman sends sealed package through Rapido | Sakshi
Sakshi News home page

ర్యాపిడో డ్రైవర్‌కు షాకిచ్చిన మహిళ.. ఇదో వింత కథ!

Feb 6 2026 8:52 AM | Updated on Feb 6 2026 9:03 AM

Viral Video: Woman sends sealed package through Rapido

ర్యాపిడో.. వాడుకున్న వాళ్లకి వాడుకున్నంత అంటే ఇదేనేమో. ఇప్పటి వరకు మనుషుల డ్రాపింగ్‌, పికప్‌, పార్సిల్‌, ఫుడ్‌ సర్వీసులకే బైక్‌లను బుక్‌ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కానీ, తాజాగా ఓ మహిళ చేసిన పనికి ర్యాపిడో బైక్‌ డ్రైవర్‌ ఖంగుతిన్నాడు. చెత్త బాక్స్‌ను ఇచ్చి.. పడేయమని చెప్పడం వివాదానికి దారి తీసింది. దీంతో, సదరు మహిళపై నెటిజన్లు మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఘటనకు సంబంధించి కరణ్ నిషాద్ అనే యువకుడు ఈ వింత అనుభవాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నాడు. వీడియో ప్రకారం..‘ర్యాపిడో పోర్టర్ సర్వీస్ ద్వారా ఒక మహిళ బైక్‌ బుక్ చేసింది. అనంతరం, సదరు మహిళ వద్దకు వచ్చిన డెలివరీ బాయ్‌కు ఒక సీలు చేసిన కార్డ్‌బోర్డ్ బాక్స్‌ను అప్పగించింది. లోపల వస్తువులు ఉన్నాయని భావించిన కరణ్.. పేమెంట్ గురించి అడిగాడు. ఇంతలో పేమెంట్‌ ఆన్‌లైన్‌లో చెల్లించినట్లు ఆమె సమాధానమిచ్చింది. అనంతరం, అతను ఆ పార్శిల్‌ను తీసుకుని డ్రాప్ లొకేషన్‌కు బయలుదేరాడు.

తీరా లోకేషన్‌కు చేరుకోగానే.. అక్కడ ఎవరూ కనిపించలేదు. అక్కడంగా నిర్మానుష్యంగా చెత్తా చెదారాలతో నిండిపోయి ఉంది. ఒక పెద్ద చెత్త కుప్ప మాత్రమే ఉంది. దీంతో, ఎవరికి పార్సిల్ ఇవ్వాలో అర్థం కాక అతను వెంటనే సదరు మహిళకు ఫోన్ చేశాడు. ‘మేడమ్, ఇక్కడ ఎవరూ లేరు.. ఈ ప్యాకెట్ ఎవరికి అందజేయాలి?’ అని ప్రశ్నించాడు. దానికి ఆమె ఇచ్చిన సమాధానం విని అతను షాక్‌కు గురయ్యాడు. ‘అందులో ఉన్నదంతా చెత్తే.. అక్కడ పారేయండి’ అని ఆమె చాలా నిర్లక్ష్యంగా బదులిచ్చింది. ఆమె మాటలు విన్న కరణ్ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. మనం ఏ కాలంలో ఉన్నాం? ఇప్పుడు ఇతరుల ఇంటి చెత్తను కూడా మేమే డెలివరీ చేయాలా? అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.  

దీంతో, ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. డెలివరీ యాప్‌లను ఇలాంటి పనులకు వాడటం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కొందరు దీనిపై ఫన్నీ కామెంట్స్‌ చేస్తుండగా.. మరికొందరు మాత్రం మండిపడుతున్నారు. కష్టపడి పని చేసే డెలివరీ భాగస్వాములను ఇలా తక్కువ చేసి చూడటం కరెక్ట్‌ కాదని కామెంట్స్‌ చేస్తున్నారు. కనీస మర్యాద ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగింది అనే విషయం మాత్రం తెలియరాలేదు. 

Advertisement
 
Advertisement
Advertisement