భద్రాచలం: శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం ముందుగానే వచ్చిందా అన్నట్లుగా భద్రగిరి మురిసింది.
భక్తిశ్రద్ధలతో అర్చకులు, అధికారులు పసుపు, కుంకుమలు దంచగా, తలంబ్రాల తయారీలో మహిళల ఉత్సాహం.. మరో వైపున శ్రీరామనామ స్మరణలు చేస్తూ గోటి తలంబ్రాలతో పాదయాత్రగా వచ్చిన భక్తజనం.. వెరసి మిథిలా స్టేడియం కళకళలాడింది.
ఆనందోత్సాహాల నడుమ రామయ్య పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. వసంతం చల్లుకున్న శ్రీ సీతారాములు దర్శనమివ్వగానే ‘మా రామయ్య పెళ్లికొడుకాయెనే’ అంటూ భక్తులు మురిసిపోయారు.


