కెనడాలో నివసిస్తున్న భారతీయ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నాన్సీ గ్రేవాల్ (Nancy Grewal) దారుణ హత్యకు గురయ్యారు. కెనడాలోని లాసల్లె పోలీసులు ఈ హత్యను నిర్ధారించారు. దర్యాప్తు కొనసాగుతోంది. పంజాబీ మూలానికి చెందిన 45 ఏళ్ల నాన్సీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ పంజాబ్‌లో జరుగుతున్న పరిణామాలపై తన అభిప్రాయాలను, ముఖ్యంగా ఖలిస్తానీలను విమర్శిస్తూ పాపులర్ అయ్యారు. ప్రసిద్ధి చెందింది.ఈ హత్య కెనడాలోని భారతీయ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలో ఆగ్రహాన్ని రేకెత్తించింది .
ఘటన వివరాలు ఇలా ఉన్నాయి
మార్చి 3, 2026, రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో. కెనడాలోని లాసల్లే (LaSalle) నగరంలోని టాడ్ లేన్ (Todd Lane) ప్రాంతంలోని ఆమె నివాసంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమెను కత్తితో పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఎసెక్స్-విండ్సర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆమె మరణించారు.

షల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. రాజకీయ అంశాలపై ఆమె చాలా నిర్మొహమాటంగా, కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడేవారు. సోషల్ మీడియా వేదికల ద్వారా పలు వివాదాస్పద అంశాలపై స్పందించేవారు. ముఖ్యంగా భారత్-కెనడా ఉద్రిక్తతల మధ్య ఖలిస్తానీ సానుభూతి పరులను ఆమె బహిరంగంగానే ఖండించేవారు. అకాలీదళ్ నాయకత్వంపై, ముఖ్యంగా బిక్రమ్ సింగ్ మజితియాపై ఆమె తరచుగా విమర్శలు చేసేవారు. అలాగే జైలులో ఉన్న ఎంపీ అమృత్‌పాల్ సింగ్, డేరా బియాస్ అధిపతి గురీందర్ సింగ్ ధిల్లాన్‌కు వ్యతిరేకంగా కూడా ఆమె మాట్లాడారు. దీంతోపాటు 2025 జూన్‌లో భటిండాలో అనుమానాస్పద స్థితిలో మరణించిన మరో ఇన్‌ఫ్లుయెన్సర్ కాంచన్ కుమారి (కమల్ కౌర్ భాభి) మరణంపై కూడా ఆమె గళమెత్తారు.
(విజయ్ దేవరకొండ నయా ట్రెండ్ : డైమండ్ ఎమరాల్డ్ నెక్లెస్ స్పెషల్ ఎట్రాక్షన్)
లాసల్లే పోలీసులు ఈ కేసును యాక్టివ్ ఇన్వెస్టిగేషన్‌గా పరిగణిస్తున్నారు. టాడ్ లేన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తమ ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ దృశ్యాలను పోలీసులకు అందించి సహకరించాలని కోరారు. ప్రస్తుతానికి నిందితుడి ఆచూకీ ఇంకా లభించలేదు. ఎవరికైనా సమాచారం తెలిస్తే పోలీసులకు లేదా 'క్రైమ్ స్టాపర్స్'కు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఇదీ చదవండి: సంగీత్ వేడుకలో చిన్నారి స్టెప్పులు వైరల్, 82 లక్షల మంది ఫిదా!


