విజయ్‌ దేవరకొండ నయా ట్రెండ్‌ : డైమండ్‌ ఎమరాల్డ్‌ నెక్లెస్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌ | Vijay DeverakondaA Unique Diamond Emerald Necklace Encrusted On His Sangeet Ceremony | Sakshi
Sakshi News home page

విజయ్‌ దేవరకొండ నయా ట్రెండ్‌ : డైమండ్‌ ఎమరాల్డ్‌ నెక్లెస్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌

Mar 3 2026 2:54 PM | Updated on Mar 3 2026 3:07 PM

Vijay DeverakondaA Unique Diamond Emerald Necklace Encrusted  On His Sangeet Ceremony

Virosh Wedding సినిమా స్టార్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల  పెళ్లి సందడిలోని ప్రతీ వేడుకు ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పెళ్లి తరువాత సొంత ఊరిలో కొత్త దంపతుల సత్యనారాయణ వ్రతం, భోజనాల విశేషాల సందడి ముగియముందే ఈ జంట  సంగీత్  వేడుక ఫోటోలను పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి.  పదండి దాని  సంగతులేంటో తెలుసుకుందాం.

రష్మిక ఎప్పటిలాగానే డైమండ్‌ ఆభరణాలతో నిండుగా కనిపించింది. ఇక విజయ్ దేవరకొండ తన 'సంగీత్' వేడుకలో ధరించిన స్పెషల్‌ హారం  అందరి దృష్టిని ఆకర్షించింది.  విజయ్ మెడలోని ప్రత్యేకమైన పచ్చ నెక్లెస్ దృష్టిని ఆకర్షించింది. విజయ్ దేవరకొండ పెళ్ళిలో రాకుమారుడిలా నగలతో  కొత్త ఫ్యాషన్‌ ట్రెండ్‌కు  నాంది పలికాడు. తన వెడ్డింగ్‌  లుక్స్‌తో అభిమానులను ఆశ్చర్యపరచడమే కాకుండా, తన సంగీత్ వేడుకలో అతని ఫ్యాషన్ స్టేట్‌మెంట్ కూడా చాలామంది దృష్టిని ఆకర్షించింది. విజయ్ ,రష్మిక ఫల్గుణి షేన్ పీకాక్ దుస్తుల్లో నాట్య మయూరాల్లా విన్యాసాలు చేశారు. విజయ్ ముదురు నీలం రంగులో ఉన్న కుర్తా-పైజామా సెట్‌ను ఎంబ్రాయిడరీ కోటుతో ధరించగా, రష్మిక  సిల్వర్‌  కలర్‌ లెహంగాను ధరించింది.

యూనిక్‌ ఎమరాల్డ్‌  నెక్లెస్‌
విజయ్  ప్రత్యేకమైన వజ్రాలు పొదిగిన పచ్చ నెక్లెస్ మాత్రం స్పెషల్‌ ఎట్రాక్షన్‌. విజయ్ నెక్లెస్‌లో మధ్యలో భారీ పచ్చ లాకెట్టు అందంగా అమిరిందిన. ఆ లాకెట్టు పైన ఒక పెద్ద డైమండ్‌ క్యాప్‌ మరింత వన్నెతెచ్చింది. అలాగే ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌గా భావిస్తున్న  విజయ్  పదహారు రాళ్ల  డైమండ్‌ రింగ్‌ చాలా విలక్షణమైంది.ఆ ఉంగరంలో ప్రేమకు చిహ్నంగా బ్రాండ్  క్రిస్‌క్రాస్ X మోటిఫ్ కూడా ఉంది. ఈ వజ్రపు ఉంగరం ధర సుమారు రూ. 15 లక్షలు ఫిబ్రవరి 26, 2026న, తెలుగు, కొడవ సంప్రదాయల ప్రకారం వివాహ వేడుక జరిగితన తరువాత తమ పెళ్లి ఫోటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. 

(విజయ్‌పై మాజీ అసిస్టెంట్ సెల్వరాజ్ సంచలన ఆరోపణలు)

Advertisement
 
Advertisement
Advertisement