breaking news
sangeet Ceremony
-
తొలి మహిళా తవిల్ కళాకారిణి..! ఏ ఆర్ రెహమాన్ సైతం..
సంగీతంలో పెర్కషన్ వాయిద్యాలు వాయించడం అంత సులభం కాదు. చాలామటుకు వాటిని మగవాళ్లే వాయిస్తుంటారు. సింపుల్‌గా చెప్పాలంటే పెర్కషన్ కళాకారులుగా మగవాళ్లే ఉంటారు ఎందుకంటే వాటిలో కొన్ని వాయిద్యాలు అత్యంత బరువుతో ఉంటాయి. పైగా వాయించాలంటే అపారమైన ఓపిక, శారీరక నొప్పులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే వాటిలో అత్యంత కష్టతరమైన వాయిద్యం తవిల్..అలాంటి వాయిద్యాన్ని అద్భుతంగా ఆలపిస్తూ..గుర్తింపు తెచ్చుకుంటోంది ఓ మహిళా కళాకారిణి. అంతేగాదు ఈ తవిల్ వాయిద్యాన్ని ఆలపిస్తున్న తొలి మహిళా కళాకారిణి కూడా ఆమెనే కావడం విశేషం. ఎవరామె అంటే..ఆ అమ్మాయే ఆరు తరాల సంగీతకారుల కుటుంబం నుంచి వచ్చిన అమృతవర్షిణి మణిశంకర్. తమిళనాడులోని తిరువూరు, మన్నార్గుడికి చెందిన ఆమె, తండ్రి నాగస్వరం కళాకారుడు ఎపి మణిశంకర్ కాగా, తల్లి జయంతి శంకర్ వయోలిన్ విద్వాంసురాలు. ఎనిమిదేళ్ల వయసు నుంచే తవిల్ నేర్చుకుంటూ తరతరాల నాటి సంప్రదాయాన్ని ధిక్కరించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. మహిళలు అరుదుగా అభ్యసించే వాయిద్యాన్ని ఆమె అలవోకగా వాయిస్తుంది. ఇంతవరకు మహిళా తవిల్ కళాకారులు ఎవ్వరూ లేరని చెప్పిన తల్లిదండ్రుల మాటలు ఆమెలో ఆశ్చర్యాన్ని, ఆసక్తిని పెంచాయట. ఆ నేపథ్యంలోనే ఈ వాయిద్యాన్ని వాయించడం పట్టుదలతో నేర్చుకుంది అమృతవర్షిణి. ఆమె కోవిలూర్ కె.జి. కళ్యాణ సుందరం ఆధ్వర్యంలో ఈ వాయిద్యాన్ని వాయించడంలో శిక్షణ తీసుకుంది. ప్రస్తుతం ఆధునాతన శిక్షణను తీసుకుంటోంది. ఇందులో మరింత రాణించేలా తవిల్ కళాకారుడు తంజావూరు టి.ఆర్. గోవిందరాజన్ వద్ద సలహాలు సూచనలు తీసుకుంటూ తన నైపుణ్యానికి మెరుగులు దిద్దుకుంటోంది. ఇక అమృత వర్షిణి గురువు సలహాల మేరకు ఈ వాయిద్యాన్ని నేలపై ఉంచడానికి బదులు తన ఒడిలో ఉంచి వాయించడం ప్రారంభించింది. దాదాపు 60 కిలోలు బరువు ఉండే వాయిద్యం ఎక్కువసేపు వాయించడానికి అపారమైన ఓర్పు అవసరం. ఎందుకంటే భుజం, కాళ్లలో నొప్పి అధికమవుతుంది. పైగా వేళ్లు రక్తస్రావం అవుతాయి కూడా. అవన్నీ నయం అవడానికే సుమారు పది రోజులు పడుతుంది. కచేరికి ముందు వేళ్ల చుట్టూ టేప్ చుట్టి..ధ్వనిని ఉత్పత్తి చేసే క్యాప్‌లను తొడిగేందుకు జిగురు రాసుకోవాల్సి ఉంటుందట. అయితే ఇప్పుడు ఆధునిక ఆడియో వ్యవస్థల కారణంగా కాస్త ప్రదర్శన సులభతరం అయ్యిందని, శారీరక ఒత్తిడి కూడా తగ్గిందని అంటోంది.బహిరంగ ప్రదర్శనలివ్వడం అప్పటి నుంచే..పదకొడేళ్ల ప్రాయం నుంచి అమృతవర్షిణి బహిరంగ ప్రదర్శనలివ్వడం ప్రారంభించింది. తొలి ప్రదర్శన హరిధ్వర్మంగళంలోని అరుల్మిగు ముత్తుమైరామ్మన్ ఆలయంలో జరిగింది. 2020లో తమిళనాడు విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహించిన కళా ఉత్సవ్ పోటీ (వాయిద్య విభాగం)లో మూడవ స్థానం దక్కించుకుంది. 2022లో మళ్ళీ పాల్గొన్నప్పుడు బ్యానర్‌పై తన చిత్రాన్ని చూసుకుని మురిసిపోయానంటోంది. View this post on Instagram A post shared by Indian Women Blog (@indianwomenblog) ప్రస్తుతం ఆమె సంగీత కచేరీల నిమిత్తమే టూర్లకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈసారి ఈ వారాంతంలో బెంగళూరులో జరిగే మహీంద్రా పెర్కషన్ ఫెస్టివల్లో ప్రదర్శించే ‘ఉమెన్ హూ డ్రమ్’ అనే పూర్తి మహిళల పెర్కషన్ బృందంలో భాగం కానుంది. ఇది పూర్తిగా మహిళా సంగీత కళాకారులతో కూడిన బృందం. ప్రముఖ సంగీత విద్యాంసుడి నుంచి పిలుపు..అన్నింటికంటే అత్యంత విశేషమైనది “రెహమాన్ సర్ 'వండర్మెంట్ టూర్' కచేరీలో అమృతవర్షిణిని వాయించమని కోరడం. అదే తనకు తొలిసారి అని ప్రేక్షకుల ముందు సోలోగా ప్రదర్శన ఇవ్వడం అంటూ తనకు ఆ అవకాశం ఎలా వచ్చిందో గుర్తుచేసుకుంది 18 ఏళ్ల అమృతవర్షిణి. గత అక్టోబర్‌లో రెహమాన్ సార్ ఇన్‌స్టాగ్రామ్‌లో తనను ఫాలో అవ్వడం చూసి.. చాలా ఆశ్చర్యపోయిందట. కొంతకాలం తర్వాత, ఆయన మేనేజర్ స్వయంగా ఫోన్ చేసి ఫిబ్రవరిలో రెండు రోజులు చెన్నైలో ఉండి కచేరీలో పాల్గొనాలని చెప్పడం ఎప్పటికీ మర్చిపోను అని భావోద్వేగంగా చెప్పుకొచ్చింది. మహిళలు వాయించలేని సంగీత పరికరాన్ని వాయించడం సాధన చేయడమే గాక..అందులో రాణిస్తూ..ఏకంగా ప్రముఖ సంగీత విద్వాంసుల నుంచి పిలుపు అందుకోవడం మాములు విషయం కాదు కదా..!. ఇది నిజంగా మహిళా సాధికారతకు, ఆమె అజేయమైన శక్తికి నిర్వచనం కూడా. (చదవండి: మిర్చి హోలీ'..రంగు పులుముకున్న పుడమి తల్లి..!: ఆనంద్ మహీంద్రా) -
సంగీత్ వేడుకలో చిన్నారి స్టెప్పులు వైరల్, 82 లక్షల మంది ఫిదా!
‘పెళ్లి’ అంటేనే సంబరాల సందడి. ముచ్చట్లు, మురిపాలతో వధూవరులతో పాటు బంధు మిత్రులుకు మరింత ఉత్సాహాన్నిచ్చే వేడుక. సంగీత్, మెహిందీ అంటూ సాగే ప్రీ వెడ్డింగ్ సంబరాల్లో అలాంటి అరుదైన క్షణాలకు కొదవే ఉండదు. తాజాగా అలాంటి హృదయాన్ని ఆకట్టుకునే దృశ్యం ఒకటి ఆవిష్కృతమైంది. అదేంటో ఒకసారి చూసేద్దామా.సాధారణంగా పెళ్లి వేడుకల్లో వధూవరులే ప్రధాన ఆకర్షణగా ఉంటారు, కానీ ఈ చిన్ని డ్యాన్సర్ ఇద్దరు "చీర్ లీడర్స్" (తాతయ్యలు) అందరి దృష్టిని తమవైపు తిప్పుకున్నారు. వధువు అయేష్ణా ప్రసాద్ సంగీత్ వేడుక ఉత్సాహ పూరిత వాతావరణంలో జరుగుతోంది. ఇంతలో చక్కటి దుస్తుల్లో మెరిసిపోతున్న ఆ చిన్నారి, తన ఇద్దరు తాతయ్యల (అమ్మనాన్న, నాన్న నాన్న) చేతులు పట్టుకుని స్టేజ్ పైకి వచ్చింది. వారిద్దరి మధ్యలో నిలబడి ఎంతో ఆత్మవిశ్వాసంతో స్టెప్పులేసింది. ఆ వయసులోనూ ఆ ఇద్దరు తాతాయ్యలు చిన్నారి ఉత్సాహానికి తగ్గట్టుగా, కొరియోగ్రఫీని ఫాలో అవుతూ డ్యాన్స్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.హైలైట్ ఏంటంటే పాట మధ్యలో వచ్చే ఒక డ్రమాటిక్ బీట్‌కు, ఇద్దరు తాతయ్యలు ఆ పాపను గాలిలోకి ఎత్తారు. ఆ సమయంలో ఆ చిన్నారి తన చేతులను చాపి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ డ్యాన్స్ ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఏకంగా 82 లక్షల (8.2 మిలియన్) మందికి పైగా ముఖాల్లో చిరు నవ్వులు పూయించింది.నెటిజన్ల సంబరంఈ వీడియో చూసి నెటిజన్లు తెగ సంబర పడిపోయారు. స్వచ్ఛమైన ప్రేమ, ఉత్సాహంపై ఆనందం వ్యక్తం చేశారు. "ఈ చిన్నారికి ఇది జీవితాంతం గుర్తుండి పోయే అద్భుతమైన జ్ఞాపకం (Core memory)." అని ఒకరు వ్యాఖ్యానించారు.(విజయ్ దేవరకొండ నయా ట్రెండ్ : డైమండ్ ఎమరాల్డ్ నెక్లెస్ స్పెషల్ ఎట్రాక్షన్) View this post on Instagram A post shared by Anjali Damani Choreography (@anjalidamanichoreography) "తమ తాతయ్యలను కోల్పోయిన వారికి, ఈ వీడియో చూస్తుంటే తమ నెరవేరని కల నెరవేరినట్లు అనిపిస్తోంది." అని మరొకరు భావోద్వేగానికి లోనయ్యారు. 'అంజలి దమానీ కొరియోగ్రఫీ' షేర్ చేసిన ఈ వీడియో, సంజు రాథోడ్ పాడిన 'షకీ' (Shaky) అనే పాపులర్ మరాఠీ సాంగ్‌కు వీరు స్టెప్పులేశారు.ఇదీ చదవండి: వెజ్ బిర్యానీ షాప్ ఫ్రీజర్‌లో డెడ్‌బాడీ, షాకైన ఓనర్ -
విజయ్ దేవరకొండ నయా ట్రెండ్ : డైమండ్ ఎమరాల్డ్ నెక్లెస్ స్పెషల్ ఎట్రాక్షన్
Virosh Wedding సినిమా స్టార్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి సందడిలోని ప్రతీ వేడుకు ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పెళ్లి తరువాత సొంత ఊరిలో కొత్త దంపతుల సత్యనారాయణ వ్రతం, భోజనాల విశేషాల సందడి ముగియముందే ఈ జంట సంగీత్ వేడుక ఫోటోలను పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. పదండి దాని సంగతులేంటో తెలుసుకుందాం.రష్మిక ఎప్పటిలాగానే డైమండ్ ఆభరణాలతో నిండుగా కనిపించింది. ఇక విజయ్ దేవరకొండ తన 'సంగీత్' వేడుకలో ధరించిన స్పెషల్ హారం అందరి దృష్టిని ఆకర్షించింది. విజయ్ మెడలోని ప్రత్యేకమైన పచ్చ నెక్లెస్ దృష్టిని ఆకర్షించింది. విజయ్ దేవరకొండ పెళ్ళిలో రాకుమారుడిలా నగలతో కొత్త ఫ్యాషన్ ట్రెండ్‌కు నాంది పలికాడు. తన వెడ్డింగ్ లుక్స్‌తో అభిమానులను ఆశ్చర్యపరచడమే కాకుండా, తన సంగీత్ వేడుకలో అతని ఫ్యాషన్ స్టేట్మెంట్ కూడా చాలామంది దృష్టిని ఆకర్షించింది. విజయ్ ,రష్మిక ఫల్గుణి షేన్ పీకాక్ దుస్తుల్లో నాట్య మయూరాల్లా విన్యాసాలు చేశారు. విజయ్ ముదురు నీలం రంగులో ఉన్న కుర్తా-పైజామా సెట్‌ను ఎంబ్రాయిడరీ కోటుతో ధరించగా, రష్మిక సిల్వర్ కలర్ లెహంగాను ధరించింది.యూనిక్ ఎమరాల్డ్ నెక్లెస్విజయ్ ప్రత్యేకమైన వజ్రాలు పొదిగిన పచ్చ నెక్లెస్ మాత్రం స్పెషల్ ఎట్రాక్షన్. విజయ్ నెక్లెస్‌లో మధ్యలో భారీ పచ్చ లాకెట్టు అందంగా అమిరిందిన. ఆ లాకెట్టు పైన ఒక పెద్ద డైమండ్ క్యాప్ మరింత వన్నెతెచ్చింది. అలాగే ఎంగేజ్మెంట్ రింగ్‌గా భావిస్తున్న విజయ్ పదహారు రాళ్ల డైమండ్ రింగ్ చాలా విలక్షణమైంది.ఆ ఉంగరంలో ప్రేమకు చిహ్నంగా బ్రాండ్ క్రిస్క్రాస్ X మోటిఫ్ కూడా ఉంది. ఈ వజ్రపు ఉంగరం ధర సుమారు రూ. 15 లక్షలు ఫిబ్రవరి 26, 2026న, తెలుగు, కొడవ సంప్రదాయల ప్రకారం వివాహ వేడుక జరిగితన తరువాత తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. (విజయ్‌పై మాజీ అసిస్టెంట్ సెల్వరాజ్ సంచలన ఆరోపణలు) -
ప్రియురాలు సోఫీ షైన్‌తో గబ్బర్ శిఖర్ పెళ్లి.. సంగీత్ నైట్ ఫోటోలు
-
శిఖర్ ధావన్ -సోఫీ షైన్ సంగీత్ నైట్, ఫోటోలు వైరల్
Shikhar&Sophie టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్, ప్రియురాలు సోఫీ షైన్ (Sophie Shine) పెళ్లి సందడి మొదలైంది. అయేషా ముఖర్జీతో విడాకుల తరువాత ధావన్ తన జీవితంలో మరో కీలక అడుగు వేయబోత్తున్నాడు. భారత క్రికెట్ జట్టులో తనదైన శైలిలోబ్యాటింగ్ చేస్తూ ‘గబ్బర్’గా పాపులర్ అయిన శిఖర్ ధావన్, వ్యక్తిగత జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్నిప్రారంభించబోతున్నాడు. తన ప్రేయసి సోఫీ షైన్ (ఐరిష్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్) తో కలిసి ఏడడుగులు వేసేందుకు ఆయన సిద్ధమయ్యాడు. ఫిబ్రవరి 19 గురువారం ధావన్ తన సంగీత్ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఇవి నెట్టింట సందడిగా మారాయి. అభినందనల వెల్లువ కురుస్తోంది. View this post on Instagram A post shared by Shikhar Dhawan (@shikhardofficial)తన ఇన్‌స్టా హ్యాండిల్లో శిఖర్ ధావన్ సోఫీ షైన్ సంగీత్ నైట్ నుండి ఫోటోలను షేర్ చేశాడు. ఆ ఫోటోల్లో శిఖర్ తెల్లటి షేర్వానీలో అందంగా కనిపించగా, సోఫీ బ్లింగీ గా బంగారు రంగు లెహంగాలో కళకళలాడింది. ఈ ఏడాది జనవరి 2న ఈ జంట నిశ్చితార్థం చేసుకున్నారు. ఫిబ్రవరి 19న వివాహం చేసుకోవచ్చని ముందుగా ఊహాగానాలు వచ్చాయి. ప్రస్తుతం వెడ్డింగ్‌డేట్‌పై ధృవీకరణ లేనప్పటికీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా జరిగిన సంగీత్ నైట్ ఫోటోలు మాత్రం ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఎవరీ సోఫీ షైన్సోఫీ షైన్ 1990 లో జన్మించిన ఐరిష్ మహిళ. సోఫీ ఐర్లాండ్‌లో చదువుకుంది. ప్రఖ్యాత లిమెరిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నత విద్యను పూర్తి చేసింది.ఆమె గ్లామర్ ప్రపంచం నుండి రాలేదు, శిఖర్ లాగా కాకుండా, కార్పొరేట్ ప్రపంచంలో తనకంటూ ఒక పేరు తెచ్చుకోవడానికి ఆమె చాలా కష్టపడింది.మమార్కెటింగ్ మరియు మేనేజ్మెంట్ విద్యార్థిని అయిన ఆమె తొలుత బహుళజాతి కంపెనీలో పనిచేసింది. అనంతరం నార్తర్న్ ట్రస్ట్ కార్పొరేషన్లో చేరింది.దుబాయ్‌లోని ఒక రెస్టారెంట్లో మొదటి సారి కలిశారు. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా సోఫీ షైన్, శిఖర్ ధావన్‌తో సన్నిహితంగా కనిపించినప్పుడు వీరి డేటింగ్ బజ్ ప్రారంభమైంది.కాగా శిఖర్ 2012లో అయేషాను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు జోరావర్ అనే కుమారుడు ఉన్నాడు. 2021లో వారు విడాకులు తీసుకున్నారు. -
బెస్ట్ ఫ్రెండ్ సంగీత్ వేడుకలో రాధికా అంబానీ స్టెప్పులు
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కోడలు, అనంత్ అంబానీ భార్య రాధికా అంబానీ తన డ్యాన్స్‌తో అందర్నీ మెస్మరైజ్ చేసింది. బెస్ట్ ఫ్రెండ్ సంగీత్ వేడుకలో రాధిక అంబానీ తనదైన శైలిలో ఆకట్టుకుంది. స్టైలిష్ లుక్‌తో అందర్నీ కట్టి పడేసింది. స్నేహితులు కృష్ణ పరేఖ్, యష్ సింఘాల్ సంగీత్ వేడుకలో అనంత్ అంబానీ,రాధికా అంబానీతో కలిసి తమ స్నేహితులతో కలిసి సందడి చేశారు. అంతేకాదు అనార్కలి డిస్కో చలి అంటూ ప్రెండ్స్‌తో కలిసి సూపర్ స్టెప్పులేసింది రాధిక. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. రాధికా అంబానీ తన స్నేహితుల బృందంతో కలిసి విలాసవంతమైన సంగీత్ వేడుకలో నృత్యం చేసింది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఇటీవల ముంబైలో ట్రైడెంట్ ఒబెరాయ్ హోటల్లో జరిగిన విలాసవంతమైన సంగీత్ వేడుకలో 'అనార్కలి డిస్కో చలి'కి తన అద్భుతమైన స్టెప్పులేసింది. 2012 చిత్రం హౌస్‌ఫుల్ 2 మూవీలోని ఈ పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేసింది. ఈ వివాహానికి రాధిక అంబానీ స్టైలిష్ లుక్ మరో ప్రత్యేక ఆకర్షణ అని చెప్పవచ్చు. సిల్వర్ కలర్ లెహెంగాలో అందంగా ముస్తాబైంది. డైమండ్ బ్యాంగిల్స్ , చెవిపోగులతో తన లుక్ మరింత గ్రాండ్‌గా ఉండేలా జాగ్రత్తపడింది. దిల్ ధడక్నే దో చిత్రంలోని గల్లన్ గుడియాన్ లాంటి పాటలకు కూడా ఆమె ఉత్సాహంగా స్టెప్పులు వేస్తూ కనిపించింది. మరో వీడియోలో, ఆమె భర్త అనంత్ అంబానీ, వరుడు యష్ సింఘాల్, వారి స్నేహితులతో కలిసి నృత్యం చేస్తూ కనిపించారు. ఇదీ చదవండి: సబీర్ భాటియా లవ్ స్టోరీ : స్టార్ హీరోయిన్‌తో లవ్? కానీ పెళ్లి మాత్రం! View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) కాగా వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ చ శైలా మర్చంట్ దంపతుల కుమార్తెరాధికా మర్చంట్. అలాగే అంబానీముఖేష్ , నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీని ప్రేమించి పెళ్లి చేసుకుంది.వివాహం తర్వాత తన అంబానీ ఇంటి పేరుతో కలిపి రాధికా అంబానీగా మారిపోయింది. యూరప్‌లో క్రూయిజ్‌తో సహా రెండుసార్లు ప్రీ వెడ్డింగ్ వేడుకల పాటు గత ఏడాది జూలై 12న అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఇది "ఇండియాస్ వెడ్డింగ్ ఆఫ్ ది ఇయర్"గా నిలిచింది. ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక డిసెంబరులో రిలీజ్ చేసిన " మోస్ట్ స్టైలిష్ పీపుల్ ఆఫ్ 2024" జాబితాలో అనంత్-రాధికా అంబానీ కపుల్‌ని చేర్చడం విశేషం. -
సిద్ధార్థ్ చోప్రా సంగీత్ పార్టీలో ప్రియాంక చోప్రా,నిక్ (ఫొటోలు)
-
అద్భుత క్యాప్షన్‌తో సంగీత్ ఫొటోలు షేర్ చేసిన పీవీ సింధు (ఫోటోలు)
-
అనురాగ్ కశ్యప్ కూతురి సంగీత్ వేడుక..ప్రముఖుల సందడి (ఫోటోలు)
-
Sai Pallavi: పూజా కన్నన్ సంగీత్.. చెల్లితో కలిసి చిందేసిన సాయిపల్లవి (ఫోటోలు)
-
Justin Bieber: అనంత్-రాధికలతో స్టార్ సింగర్ హ్యాపీ మూమెంట్స్ (ఫోటోలు)
-
అనంత్ అంబానీ సంగీత్ వేడుకలో జాన్వీ కపూర్ (ఫొటోలు)
-
అనంత్ అంబానీ వేసుకుంది మామూలు డ్రెస్ కాదు! తెలిస్తే..
త్వరలో పెళ్లి చేసుకోబోతున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ సంగీత్ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి అంబానీ స్నేహితులు, బంధువులతో పాటు, సినీ తారలు, క్రికెటర్లు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.సంగీత్ వేడుకలో కనిపించిన అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ ఇద్దరూ కూడా ప్రత్యేకమైన దుస్తులతో కనిపించారు. ఇవి మాస్టర్ కౌచర్స్ అబూ జానీ సందీప్ ఖోస్లా డిజైన్ చేసిన దుస్తులని తెలుస్తోంది. అనంత్ అంబానీ ధరించిన జాకెట్ బంగారంతో తయారైనట్లు తెలుస్తోంది. రాధిక మర్చెంట్ ధరించిన ఆఫ్ షోల్డర్ బ్లౌజ్, లెహంగా స్వరోవ్స్కి స్ఫటికాలతో అలంకరించారు.#WATCH | Anant Ambani and Radhika Merchant arrive at Jio World Centre in Mumbai for their 'Sangeet ceremony' pic.twitter.com/yzODKut59g— ANI (@ANI) July 5, 2024జూలై 12న ముకేశ్, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక వివాహం జరగనుంది. జూలై 14 వరకు వీరిద్దరి వివాహ వేడుకలు జరగనున్నాయి. వీరి పెళ్ళికి పలువురు పారిశ్రామిక వేత్తలు, ఇతర సెలబ్రిటీలు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. -
అనంత్ అంబానీ-రాధిక సంగీత్‌లో మెరిసిన బ్యూటీ క్వీన్స్
-
సంగీత్‌లో అదిరిపోయే స్టెప్పులేసిన అంబానీ కుటుంబం
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల వివాహ వేడుకల్లో భాగంగా ఇటీవల అంబానీ కుటుంబం ఘనంగా సంగీత్ జరుపుకుంది. ఈ సందర్భంగా ఇంటిల్లిపాది సభ్యులు డ్యాన్స్‌తో సందడి చేశారు. ఈ మేరకు విడుదలైన ఒక వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.అనంత్-రాధికల వివాహం జులై 12న ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. జులై 13న ‘శుభ్ ఆశీర్వాద్’, జులై 14న ‘మంగళ్ ఉత్సవ్’ కార్యక్రమంతో వేడుకలు ముగియనున్నాయి. త్వరలో పెళ్లి పీటలెక్కే జంట ఇప్పటికే రెండుసార్లు అంగరంగ వైభవంగా ప్రీవెడ్డింగ్ వేడుకలు నిర్వహించుకుంది. ఇటీవల ఇటలీ నుంచి ఫ్రాన్స్ వరకు దాదాపు 4500 కిలోమీటర్లు క్రూయిజ్‌లో ప్రయాణిస్తూ రెండో ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. గతంలో ఈ జంట జామ్‌నగర్‌లో తమ మొదటి ప్రీవెడ్డింగ్ వేడుకలను జరుపుకున్నారు. ఇటీవల అంబానీ కుంటుంబం 50 పేద జంటలకు సామూహిక వివాహాలను కూడా జరిపించింది. అందుకు అవసరమైన పూర్తి ఖర్చులను భరించింది. వివాహాల అనంతరం కొత్త జంటలకు అవసరమయ్యే ఇంటి సామగ్రిని అందించింది.ఇదీ చదవండి: దేశంలోనే అతిపెద్ద ఐపీఓకు రిలయన్స్ సిద్ధం..? -
అనంత్- రాధిక సంగీత్: జంటగా మెరిసిన క్రికెటర్లు.. హార్దిక్ మాత్రం ఒంటరిగా! (ఫోటోలు)
-
వరలక్ష్మి శరత్‌కుమార్ - నికోలయ్ సచ్దేవ్ సంగీత్ వేడుకల్లో ప్రముఖులు (ఫోటోలు)
-
'అనంత్, రాధిక' సంగీత్ ఫంక్షన్.. సందడి చేసిన ప్రముఖులు (ఫోటోలు)
-
అనంత్-రాధిక సంగీత్.. అదరగొట్టేందుకు స్టార్ సింగర్ రెడీ
అనంత్ అంబానీ, రాధి మర్చెంట్ వివాహ వేడుకలు ఇప్పటికే మొదలైపోయాయి. ఇటీవలే మామేరు సెలబ్రేషన్స్ పూర్తయ్యాయి. ఈ రోజు (శుక్రవారం) సాయంత్రం సంగీత్ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో యుఎస్ సింగర్ జస్టిన్ బీబర్ ప్రదర్శన ఉంటుంది. సంగీత్‌లో పాటలు పాడేందుకు బీబర్ రూ.83 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం.ఈ రోజు సాయంత్రం జరగనున్న సంగీత్ కార్యక్రమంలో పాటలు పాడటానికి బీబర్ ముంబై చేరుకున్నారు. దీనికి సంబందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో బీబర్ గులాబీ రంగు స్వెట్‌షర్ట్, ఎరుపు రంగు బకెట్ టోపీని ధరించి ఉండటం చూడవచ్చు.అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లిఅనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి ఈ నెల 12న పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే శుక్రవారం సాయంత్రం ముంబైలోని బీకేసీలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్లో సంగీత్ నిర్వహించనున్నారు. దీనికి కుటుంబం, బాలీవుడ్ ప్రముఖులతో పాటు ఇతర సెలబ్రిటీలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
పెళ్లికూతురు గారి రోలర్ స్కేట్స్ డ్యాన్స్
‘పెళ్లి కూతురు డ్యాన్స్’ అనేది మనకు కొత్తేమీ కాదు. అయితే అస్సాంకు చెందిన అమ్రిన్ ఖురానా ఒక అడుగు ముందుకు వేసి రోలర్ స్కేట్స్ ధరించి చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అయింది. ‘బార్ బార్ దేఖో’ సినిమా లోని ‘ఆస్మాన్’ పాటకు ఆమె చేసిన డ్యాన్స్‌కు నెటిజనులు ఫిదా అయ్యారు. ‘ఆల్ ఎబౌట్ డ్యాన్స్’ అనే డ్యాన్స్ స్కూల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో తక్కువ టైమ్‌లోనే 1.7 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ‘మైండ్ బ్లోయింగ్’ ‘ఎనర్జీ ప్యాక్డ్ డ్యాన్స్’ ‘బ్రైడ్ ఆన్ వీల్స్’... ఇలాంటి కామెంట్స్ మాట ఎలా ఉన్నా ‘పెళ్లి సమయంలో ఇలాంటి ప్రయోగాలు చేసి ప్రమాదాలు కొని తెచ్చుకోవడం ఎందుకు!’ అని మందలించిన వారు కూడా ఉన్నారు. -
శర్వానంద్ పెళ్లి వేడుకల్లో రామ్ చరణ్ సందడి.. ఫోటోలు వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, రక్షితా రెడ్డిల పెళ్లి వేడుక ఘనంగా జరుగుతోంది. రాజస్థాన్‌లో జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఈ జంట ఒక్కటి కానుంది. వీరి పెళ్లి వేడుకలకు లీలా ప్యాలెస్‌ను అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. అంతకుముందే కాబోయే వధూవరులిద్దరి కుటుంబాలు పెళ్లి సంబరాల్లో మునిగి తేలారు. (ఇది చదవండి: ‘మేమ్ ఫేమస్' నటుడిగా మంచి గుర్తింపుని ఇచ్చింది: కిరణ్ మచ్చ) శుక్రవారం రాత్రి జరిగిన హల్దీ, సంగీత్ వేడుకల్లో పలువురు తారలు కూడా పాల్గొన్నారు. శర్వానంద్ క్లోజ్ ఫ్రెండ్ రామ్ చరణ్ కూడా సంగీత్‌కు హాజరైన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. జైపూర్‌లో జరుగుతున్న ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు శర్వానంద్ స్నేహితులు రామ్ చరణ్, అఖిల్ అక్కినేని, రానా దగ్గుబాటితో పాటు పలువురు తారలు హాజరైనట్లు తెలుస్తోంది. కాగా.. శర్వానంద్ సినిమాల విషయానికి వస్తే.. అతడు చివరగా ఒకే ఒక జీవితం చిత్రంలో నటించాడు. ప్రస్తుతం ఈ హీరో టాలెంటెడ్ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు. (ఇది చదవండి: శర్వానంద్ పెళ్లి సందడి షురూ.. హల్దీ వేడుక వీడియో వైరల్) #RamCharan at his best friend #sharwanand wedding 🤩🤩 @alwaysramcharan pic.twitter.com/DENC7Fbhf8 — Telugu Box office (@TCinemaFun) June 2, 2023 Ram Charan at #Sharwanand and Rakshita 's Sangeet function 😍❤️#SharwaRakshitaWedding @ImSharwanand pic.twitter.com/37pcknNccz — ❤️ (@RakeShPrabhas20) June 2, 2023 Man Of The Masses @AlwaysRamCharan 🦁 Joined his Best Buddy @ImSharwanand's Wedding at JAIPUR ❤️✨🤩#GameChanger #SharwaRakshithaWedding pic.twitter.com/etjM8U1aNp — 𝐀𝐤𝐚𝐬𝐡𝐡 𝐑𝐂™ (@AlwaysAkashRC) June 2, 2023 #Congress TPCC State General Secretary Patel Ramesh Reddy Family With Man Of Masses #RamCharan 🦁🔥 pic.twitter.com/IM7vaIsGD0 — Raees (@RaeesHere_) June 2, 2023 -
కియారా వేసుకున్న ఈ డ్రెస్ డిజైన్ చేయడానికి అన్ని వారాలు పట్టిందా?
బాలీవుడ్ లవ్‌బర్డ్స్ కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హొత్ర ఇటీవలె పెళ్లిపీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 7వ తేదీన రాజస్థాన్ జైసల్మేర్‌లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో సిద్-కియారాల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇక రీసెంట్గా పెళ్లి, మెహందీ, సంగీత్.. ఇలా ఒక్కో వేడుకకు సంబంధించిన ఫోటోలను కియారా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేస్తుంది. తాజాగా సంగీత్ వేడుకలో సిద్ధార్థ్‌తో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. ఆ రాత్రి గురించి ఏం చెప్పాలి.. సమ్‌థింగ్ రియల్లీ స్పెషల్’ అంటూ రాసుకొచ్చింది. ఈ క్రమంలో కియారా అవుట్‌ఫిట్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. కంప్లీట్ గోల్డ్ అండ్ సిల్వర్ రంగులో ఉన్న ఈ లెహంగాకు 98,000కు పైగా క్రిస్టల్స్‌తో ప్రత్యేకంగా డిజైన్ చేశారు. సుమారు 4,000 గంటలు (దాదాపు 24 వారాలు)కష్టపడి ఈ లెహంగాను తీర్చిదిద్దారు మనీష్ మల్హోత్రా అండ్ టీం.ప్రస్తుతం కియారా సంగీత్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
అతియాశెట్టి- కేఎల్ రాహుల్ సంగీత్ వేడుక.. ఫోటోలు వైరల్
-
పెళ్లి వాయిదా: సంగీత్ జరిపించిన ఫ్రెండ్స్
కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. కానీ కరోనా దెబ్బకు పెళ్లిళ్లు కూడా వాయిదా పడక తప్పట్లేదు. లేదూ.. పెళ్లి జరిగి తీరాల్సిందే అంటే 20 మంది కంటే ఎక్కువ ఉండటానికి వీల్లేదని అధికారులు షరతు విధిస్తున్నారు. దీంతో ఎంతో కోలాహలంగా జరగాల్సిన వివాహాలు గుట్టుచప్పుడుగా జరుగుతున్నాయి. ఇదిలావుంటే ఓ జంట మాత్రం పెళ్లికి ముందు జరగాల్సిన సంగీత్ కార్యక్రమాన్ని కూడా ఎంతో మందితో కలిసి సందడిగా, వైభవంగా జరుపుకుంది. దీనికి పోలీసులు ఎలా అనుమతిచ్చారని ఆశ్చర్యపోకండి. వాళ్లు సంగీత్ జరుపుకుంది ఆన్లైన్లో. గజల్ బవ అనే యువతికి హేమంత్ అనే వ్యక్తితో ఈ వీకెండ్లో వివాహం జరగాల్సి ఉంది. (సంగీత్ వేడుకల్లో బిగ్‌బాస్ భామ) అయితే ప్రస్తుత విషమ పరిస్థితుల వల్ల దాన్ని వాయిదా వేసుకున్నారు. కానీ ఆమె స్నేహితులు మాత్రం సంగీత్ పార్టీ జరగాల్సిందేనని సంకల్పించారు. ఈ తంతుకు ఆన్లైన్ వేదికగా మారింది. ఇంకేముందీ.. ఓ పంజాబీ పాటకు ఎవరింట్లో నుంచి వాళ్లు డ్యాన్స్ చేస్తూ సంగీత్ నిర్వహించారు. దీనిపై కాబోయే పెళ్లికూతురు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ వీడియోను ట్విటర్లో పంచుకుంది. నెటిజన్లు సైతం వారి వర్చువల్ సంగీత్‌ను అభినందించకుండా ఉండలేకపోతున్నారు. (బయటకొచ్చినందునే బతికిపోయారు) -
పెళ్లి వాయిదా: సంగీత్ జరిపించిన ఫ్రెండ్స్
-
హ్యాపీ బర్త్‌డే ఇషా : ‘సంగీత్’ పై ఆసక్తికర వార్త
సాక్షి, ముంబై: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, నీతాల ముద్దుల తనయ ఇషా అంబానీ వివాహం వేడుక అంశం మరోసారి వార్తల్లో కిచ్చింది. త్వరలోనే అంగరంగ వైభవంగా జరగనున్న ఇషా, ఆనంద్ పిరామల్ (ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ పిరామల్ ఇండస్ట్రీస్ చైర్మన్ అజయ్ పిరామల్ తనయుడు)మూడుముళ్ల సంబరానికి ముందస్తు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు ఈ కార్పొరేట్ కుటుంబాలు ప్లాన్ చేశాయి. పెళ్లిలో ప్రధాన ఘట్టమైన సంగీత్ ను స్పెషల్ ఎట్రాక్షన్‌తో చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయనున్నాయని మీడియాలో పలు అంచనాలు గుప్పుమన్నాయి. డిసెంబర్ 8, 9 తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహించనున్న సంగీత్ కార్యక్రమానికి ప్రముఖ పాప్ సింగర్ ప్రదర్శన ఇవ్వనున్నారట. అంతేకాదు ఇందుకు ఆమె భారీగా పారితోషికాన్ని కూడా ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రీ రాయల్ వెడ్డింగ్ బాష్‌ను ఉదయపూర్‌లో ప్లాన్ చేశారట. ప్రముఖ ఇంటర్నేషనల్ పాప్ స్టార్ బియాన్సే ఈ సంగీత్ కార్యక్రమంలో తన ప్రదర్శనతో హల్ చల్ చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందుకోసం ఆమెకు రూ.15 కోట్లు పారితోషికం ఆఫర్ చేశారని తెలుస్తోంది. కాగా డిసెంబర్10న ముంబైలో వీరు పెళ్లి పీటలెక్కనున్నారట. ఈ లవ్‌బర్డ్స్ నిశ్చితార్థ కార్యక్రమాన్ని గత నెలలో ఇటలీలో అధికారికంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు అక్టోబర్ 23 ఇషా అంబానీ 27వ పుట్టిన రోజు. -
సంగీత్‌లో అదరగొట్టిన చెస్ క్వీన్
సాక్షి, హైదరాబాద్ : చెస్ క్వీన్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ హారిక ద్రోణవల్లి పెళ్లి పీటలెక్కుతోంది. రేపు(ఆగస్టు 19న) ఈమె వివాహం అంగరంగ వైభవంగా జరుగబోతుంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సివిల్ ఇంజినీర్ కార్తీక్ చంద్రను ఆమె పెళ్లాడుతోంది. హైదరాబాద్‌లో ఆమె సంగీత్ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. సంగీత్‌లో పాల్గొన్న ప్రముఖులు, సన్నిహితులు, క్లోజ్ ఫ్రెండ్స్ ఆట పాటలతో సందడి చేశారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు సైతం ఆమె కుటుంబ సభ్యులతో పాల్గొని, సంగీత్‌ను ఎంజాయ్ చేశారు. ఈ సంగీత్‌లో చెస్ క్వీన్ వేసిన స్టెపులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. చెక్ క్వీన్ అ..ఆ మూవీలోని ఓ సాంగ్‌కు డ్యాన్స్ వేసి అదరగొట్టారు. ఆహా నా పెళ్లంట.. ఓహోనా పెళ్లంట అనే పాటలకే వేసిన డ్యాన్స్‌లు కూడా సంగీత్‌ను సూపర్బ్ అనిపించాయి. హారిక జనవరి 12న గుంటూరులో జన్మించింది.చిన్నప్పటి నుంచే చెస్‌పై ఇష్టం పెంచుకున్న హారిక అద్భుతంగా రాణించింది. అండర్-9 నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించింది. ఆ తర్వాత పలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఎన్నో పతకాలు సాధించింది. 2008లో జూనియర్ ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన హారిక.. 2011లో గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా సంపాదించింది. కామన్వెల్త్, ఆసియా చాంపియన్‌గా కూడా నిలిచిన హారిక 2012, 2015, 2017 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో కాంస్య పతకాలు సాధించింది. కోనేరు హంపి తర్వాత గ్రాండ్ మాస్టర్ హోదాను పొందిన రెండో మహిళా క్రీడాకారిణి రికార్డు కెక్కింది. -
పెళ్లి చేసుకోబోతున్న ప్రముఖచదరంగ క్రీడాకారిణి
-
సంగీత్ వేడుకలో తమన్నా
ముంబై: టాలీవుడ్ అందాల తార తమన్నా భాటియా సోదరుడి మెహందీ ఫంక్షన్లో తళుక్కున మెరిసింది. తమన్నా సోదరుడు, అమెరికాలో డాక్టర్‌గా పనిచేస్తున్న ఆనంద్ భాటియా వివాహం కృతికా చౌదరితో త్వరలో జరగనుంది. ఈ నేపథ్యంలో జూన్29న శుక్రవారం ముంబైలో అత్యంత ఉత్సాహంగా సంగీత్ వేడుక జరిగింది. ఈ సంగీత్ వేడుకలో అమ్మడు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలించింది. మెహిందీ చేతులతో మురిసిపోతూ, గార్జియస్ తమన్నా అభిమానులకు కనువిందు చేసింది. ప్రస్తుతం తమన్నా ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మిల్కీ బ్యూటీ తమన్నా అందం, అభినయంతో తెలుగు, తమిళ, హిందీ భాషలలో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రధానంగా బాహుబలి మొదటి భాగంలో అవంతిక పాత్ర ద్వారా పలువురిని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. -
కుమార్తె సంగీత్ వేడుకలో ఇరగదీసిన రాధిక
తమిళసినిమా(చెన్నై): సినీనటి రాధిక కూతురు రెయాన, మిథున్ల వివాహ సంగీత్ వేడుక కార్యక్రమం శుక్రవారం రాత్రి స్థానిక నుంగంబాక్కంలోని తాజ్హోటల్లో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి దక్షిణాది సినీ ప్రముఖులు పులువురు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. లతారజనీకాంత్, భాగ్యరాజ్ పూర్ణిమ, సుహాసిని, త్రిష, రమ్యకృష్ణ, శోభన, మధుబాల, స్నేహ, ప్రసన్న, నమిత, ఐశ్వర్యాధనుష్, దర్శకుడు సుందర్.సి, కుష్బు, జయం రవి, లక్ష్మి మంచు, వెంకటేశ్, శ్రీకాంత్, వందన, శాంత కార్యక్రమానికి హాజరయ్యారు. సంగీత్ వేడుకలో భాగంగా పలువురు సినీతారలు ఉత్సాహంగా డాన్సులు చేశారు. ముఖ్యంగా పెళ్లికూతురి తల్లి రాధిక చేసిన నృత్యాలు అలరించాయి. -
కత్తి పట్టిన క్రికెటర్
రాజ్‌కోట్: గ్రౌండ్‌లోనే కాదు వెలుపల కూడా తాను అదుర్స్ అని టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా నిరూపించుకున్నాడు. ఫంక్షన్లో స్టెప్పులేసి అదరగొట్టాడు. ఇంతకీ ఫంక్షన్ ఎవరిది అంటారా? జడేజాదే. అసలు విషయం ఏంటంటే రీవా సోలంకితో ఇవాళ జడేజా వివాహం జరగనుంది. అందులో భాగంగా శనివారం రాత్రి సంగీత్ వేడుక నిర్వహించారు. జడేజా తనకు కాబోయే భార్యతో కలిసి చిందులేశాడు. అంతేకాదు కత్తితో విన్యాసాలు చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఒంటి చేత్తో కత్తిని తిప్పుతూవుంటే అక్కడున్నవారు అతడిపై డబ్బులు విసిరి అభిమానం చాటుకున్నారు. బ్యాట్ తోనే కాదు కత్తితోనూ సత్తా చాటగలనని నిరూపించుకున్నాడు. ఫిబ్రవరి 5న రీవా సోలంకితో జడేజా ఎంగేజ్మెంట్ జరిగింది. ఇవాళ వారిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. ఐపీఎల్ లో గుజరాత్ లయన్స్ ఆడుతున్న జడేజా శనివారం ముంబైతో జరిగిన మ్యాచ్ లో లేడు. 21న సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లోనూ కొత్త పెళ్లికొడుకు ఆడకపోవచ్చని సమాచారం. ఆదివారం సాయంత్రం జరిగే రిసెప్షన్‌కు లయన్స్ జట్టు ఆటగాళ్లు హాజరయ్యే అవకాశం ఉంది. -
చిందేసిన జయప్రద, జయసుధ
హైదరాబాద్: సీనియర్ నటీమణులు జయప్రద, జయసుధ స్టెప్పులతో పాత రోజులను గుర్తు చేశారు. హుషారుగా డాన్స్ చేసి అలరించారు. మాజీ ఎంపీ జయప్రద తనయుడు సిద్ధార్థ వివాహ వేడుకల్లో భాగంగా మంగళవారం రాత్రి సంగీత్ కార్యక్రమం నిర్వహించారు. శంషాబాద్ లోని సుచిర్ టింబర్ లీఫ్ ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకకు సినిమా, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సమాజ్ వాది పార్టీకి చెందిన మాజీ నేత అమర్ సింగ్, సినీ నటుడు మోహన్ బాబు, ఆయన కుమార్తె మంచు లక్ష్మి, సంగీత దర్శకురాలు శ్రీలేఖ తదితరులు హాజరయ్యారు. నాటి అందాల తారలు జయసుధ, జయప్రద పదం కలిపి ఆటపాటలతో ఈవెంట్ కు జోష్ పెంచారు. నెల 27న హైదరాబాద్ లో సిద్ధార్థ, ప్రవల్లికా రెడ్డి వివాహం జరగనుంది. సిద్ధార్థ్ జయప్రద సోదరి కుమారుడు. జయప్రద అతడిని దత్తత తీసుకున్నట్లు సమాచారం. సిద్ధార్ధ్ తమిళంలో 'ఉయిరే ఉయిరే' అనే చిత్రంలో హీరోగా నటించాడు. ఈ చిత్రం నితిన్ హీరోగా నటించిన 'ఇష్క్' చిత్రానికి రీమేక్ కాగా అందులో అతడి సరసన హన్సిక కథానాయికగా నటించింది. -
పెళ్లివస్త్రాల్లో మెరిసిన భజ్జీ, బస్రా


