అనంత్‌-రాధిక సంగీత్‌.. అదరగొట్టేందుకు స్టార్‌ సింగర్‌ రెడీ | Justin Bieber Perform Tonight at Anant Ambani and Radhika Merchant Sangeet Ceremony | Sakshi
Sakshi News home page

అనంత్‌-రాధిక సంగీత్‌.. అదరగొట్టేందుకు స్టార్‌ సింగర్‌ రెడీ

Jul 5 2024 4:21 PM | Updated on Jul 5 2024 4:56 PM

Justin Bieber Perform Tonight at Anant Ambani and Radhika Merchant Sangeet Ceremony

అనంత్ అంబానీ, రాధి మర్చెంట్ వివాహ వేడుకలు ఇప్పటికే మొదలైపోయాయి. ఇటీవలే మామేరు సెలబ్రేషన్స్ పూర్తయ్యాయి. ఈ రోజు (శుక్రవారం) సాయంత్రం సంగీత్ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో యుఎస్ సింగర్ జస్టిన్ బీబర్ ప్రదర్శన ఉంటుంది. సంగీత్‌లో పాటలు పాడేందుకు బీబర్‌ రూ.83 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం.

ఈ రోజు సాయంత్రం జరగనున్న సంగీత్ కార్యక్రమంలో పాటలు పాడటానికి బీబర్‌ ముంబై చేరుకున్నారు. దీనికి సంబందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో బీబర్ గులాబీ రంగు స్వెట్‌షర్ట్, ఎరుపు రంగు బకెట్ టోపీని ధరించి ఉండటం చూడవచ్చు.

అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లి
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి ఈ నెల 12న పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే శుక్రవారం సాయంత్రం ముంబైలోని బీకేసీలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌లో సంగీత్ నిర్వహించనున్నారు. దీనికి కుటుంబం, బాలీవుడ్ ప్రముఖులతో పాటు ఇతర సెలబ్రిటీలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement