స్టాండర్డ్‌ ఇంజనీరింగ్‌ కొత్త ప్లాంటు | standard engineering establishment new plant | Sakshi
Sakshi News home page

స్టాండర్డ్‌ ఇంజనీరింగ్‌ కొత్త ప్లాంటు

Feb 14 2026 3:39 AM | Updated on Feb 14 2026 7:46 AM

standard engineering establishment new plant

రూ. 240 కోట్ల పెట్టుబడి 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హై–ప్రెసిషన్‌ ఇంజనీరింగ్‌ సేవల సంస్థ స్టాండర్డ్‌ ఇంజనీరింగ్‌ టెక్నాలజీ (గతంలో స్టాండర్డ్‌ గ్లాస్‌ లైనింగ్‌ టెక్నాలజీ) రూ. 240 కోట్లతో కొత్త ప్లాంటు ఏర్పాటు చేస్తోంది. మొదటి దశలో రూ. 120 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు సంస్థ ప్రమోటర్‌ కందుల నాగేశ్వరరావు తెలిపారు. ఇది వచ్చే ఏడాది వ్యవధిలో అందుబాటులోకి రాగలదని చెప్పారు.

 అలాగే ఇప్పుడున్న ప్లాంట్లపై దాదాపు రూ. 60 కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు, ఇప్పటికే రూ. 20 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు  కంపెనీ కొత్త లోగోను ఆవిష్కరించిన సందర్భంగా వివరించారు. ఈ ఏడాదిలో  సుమారు రూ. 760–800 కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తున్నట్లు, ప్రస్తుతం 95 రకాల ఉత్పత్తులను అందిస్తున్నట్లు నాగేశ్వరరావు చెప్పారు. ఆదాయంలో ఎగుమతుల వాటా 13 శాతంగా ఉన్నట్లు వివరించారు.  
శుక్రవారం షేరు సుమారు 2 శాతం క్షీణించి రూ. 129.70 వద్ద క్లోజయ్యింది. 

Advertisement
 
Advertisement
Advertisement