బీఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్.. రోజుకు 3జీబీ డేటా! | BSNL Rs 2799 Annual Plan Details Explained | Sakshi
Sakshi News home page

బీఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్.. రోజుకు 3జీబీ డేటా!

Feb 13 2026 7:59 PM | Updated on Feb 13 2026 8:15 PM

BSNL Rs 2799 Annual Plan Details Explained

రూ.2626 యాన్యువల్ ప్లాన్ పరిచయం చేసిన బీఎస్ఎన్ఎల్ మరో వార్షిక రీఛార్జ్ ప్లాన్ ప్రకటించింది. 365 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్ కొంత ఎక్కువ డేటా కావాలనుకునేవారికి ఉపయోగకరంగా ఉంటుంది.

బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన కొత్త రూ. 2766 ప్లాన్ ద్వారా రోజుకు 3 జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత కాల్స్ మాత్రమే కాకుండా రోజుకు 100 ఎస్ఎంఎస్‌‌లు పొందవచ్చు. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 365 రోజులు.

రూ. 2,626 రీఛార్జ్ ప్లాన్
దేశ్ కా నెట్‌వర్క్, దేశ్ కా భరోసా అంటూ.. బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన ప్లాన్ కోసం వినియోగదారులు 2,626 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. 365 రోజుల వరకు చెల్లుబాటు అయ్యే ఈ ప్లాన్ ద్వారా.. రోజుకు 2.6 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌‌లు పొందవచ్చు. అపరిమిత కాల్స్ యధావిధిగా లభిస్తాయి. అయితే ఈ ఆఫర్ కేవలం ఫిబ్రవరి 24 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement