జాతీయ రహదారులపై ప్రయాణించే.. ప్రయాణికులకు మరింత సౌకర్యం & పరిశుభ్రత కల్పించాలనే లక్ష్యంతో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఓ కొత్త కార్యక్రమం ప్రారంభించింది. దీని ద్వారా రూ. 1000 విలువైన ఫాస్ట్‌ట్యాగ్ రీచార్జ్ ఉచితంగా పొందవచ్చని ప్రకటించింది. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎన్‌హెచ్‌ఏఐ 'క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్' పేరుతో ప్రారంభించిన ఈ కార్యక్రమం 2026 జూన్ 30 వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమం ఉద్దేశ్యం ఏమిటంటే.. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాలలోని మరుగుదొడ్ల పరిశుభ్రతను మెరుగుపరచడం.
జాతీయ రహదారులపై ప్రయాణించే వారిలో చాలామంది.. టోల్ ప్లాజాలలో ఉన్న మరుగుదొడ్లను ఉపయోగిస్తున్నారు. అయితే కొన్ని చోట్ల పరిశుభ్రత లోపించడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఎన్‌హెచ్‌ఏఐ ప్రజల సహకారం కోరుతోంది. కాబట్టి ఎవరైనా.. టోల్ ప్లాజాలలో మరుగుదొడ్డి అపరిశుభ్రంగా ఉందని గమనిస్తే.. ఫోటో తీసి రాజ్‌మార్గయాత్ర యాప్ లేటెస్ట్ వెర్షన్ ద్వారా జియో-ట్యాగ్ చేసిన ఫోటోలను పేరు, ప్రదేశం, వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ (VRN) & మొబైల్ నంబర్‌తో సహా వివరాలతో అప్‌లోడ్ చేయాలి.
సంబంధిత అధికారులు ఫోటోలను పరిశీలించి.. సమాచారం నిజమని ద్రువీకరిస్తే, ఫోటోలను షేర్ చేసిన వారి వెహికల్ నెంబర్‌కు రూ. 1000 విలువైన ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్ బహుమతిగా లభిస్తుంది. ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని.. రహదారులపై పరిశుభ్రతను మెరుగుపరచడానికి సహకరిస్తారని ఎన్‌హెచ్‌ఏఐ భావిస్తోంది.
Report & Get Rewarded!
To enhance commuter convenience and hygiene standards across National Highways, NHAI is conducting the ‘Clean Toilet Picture Challenge’ till 30th June 2026. The initiative encourages National Highway users to report any unclean toilet facilities at Toll… pic.twitter.com/fu3cmstoSZ— NHAI (@NHAI_Official) February 12, 2026


