బ్యాంక్‌లకు ఆర్‌బీఐ గవర్నర్‌ సూచన | Public Awareness on KYC For Safe Banking Says RBI Governor | Sakshi
Sakshi News home page

బ్యాంక్‌లకు ఆర్‌బీఐ గవర్నర్‌ సూచన

Feb 13 2026 4:52 PM | Updated on Feb 13 2026 5:03 PM

Public Awareness on KYC For Safe Banking Says RBI Governor

'ఆర్థిక అక్షరాస్యత వారం'ను ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా ముంబైలో ప్రారంభించారు. ఈ నెల 13 వరకు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరగనుంది. ఇందులో భాగంగా ఆర్థిక్ష అక్షరాస్యతపై అవగాహన కల్పించనున్నారు. ఒకటికి మించిన మాధ్యమాల్లో అవగాహన, ప్రచార కార్యక్రమాలను ఆర్‌బీఐ నిర్వహించనుంది.

2016 నుంచి ఆర్‌బీఐ ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సురక్షిత కేవైసీ (కస్టమర్‌ గురించి వివరాలు తెలుసుకోవడం), సమ్మిళిత బ్యాంక్‌ ప్రాధాన్యాన్ని గవర్నర్‌ మల్హోత్రా ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేవైసీ, ఈ–కేవైసీ, సెంట్రల్‌ కేవైసీ ప్రాధాన్యాన్ని కస్టమర్లకు ఈ కార్యక్రమంలో భాగంగా తెలియజేయడంపై బ్యాంక్‌లు దృష్టి సారించాలని కోరారు. అదే సమయంలో కేవైసీ సంబంధిత మోసాలు, దుర్వినియోగాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement