డబ్బుతోనే పిల్లలను చెడగొడుతున్నారు.. ‘రిచ్‌ డాడ్‌’ వార్నింగ్‌! | Robert Kiyosaki Warns Parents Stop Spoiling Kids with 5 Cs, Says It Will Destroy Your Child Financial Independence | Sakshi
Sakshi News home page

డబ్బుతోనే పిల్లలను చెడగొడుతున్నారు.. ‘రిచ్‌ డాడ్‌’ వార్నింగ్‌!

Feb 13 2026 2:04 PM | Updated on Feb 13 2026 2:40 PM

Rich Dad Poor Dad Robert Kiyosaki Warns Parents Stop Spoiling Kids with 5 Cs

ప్రఖ్యాత ఇన్వెస్టర్‌, బెస్ట్ సెల్లర్ పుస్తకం ‘రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్‌ కియోసాకి (Robert Kiyosaki) తరచూ తన ఆర్థిక అభిప్రాయాలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఈసారి ఆయన.. తల్లిదండ్రులు డబ్బుతో తమ పిల్లల జీవితాలను ఎలా చెడగొడుతున్నారో వివరించారు.

5 ‘సీ’లతో పిల్లల జీవితాలు నాశనం
తల్లిదండ్రులు తమ పిల్లల జీవితాలను ఎలా నాశనం చేస్తున్నారో కియోసాకి తన సోషల్ మీడియా వేదిక ‘ఎ‍క్స్‌’ (ట్విటర్‌)లో చేసిన పోస్టులో వివరించారు. పిల్లలు ఆర్థికంగా చెడిపోవడానికి కారణమైన ఐదు ‘సీ’(C)ల గురించి ప్రస్తావించారు.

1. క్యాష్‌ (మనీ): తల్లిదండ్రులు పిల్లలకు డబ్బు ఇస్తారు. కానీ వారు స్వయంగా సంపాదించాలని ఆశించరు. దీంతో పిల్లల్లో ఆర్థిక బాధ్యత తగ్గుతుంది.

2. కాలేజ్‌ : పిల్లల ఉన్నత విద్యకు తల్లిదండ్రులే పూర్తిగా ఖర్చు భరిస్తారు. దీంతో ఉన్నత విద్య కోసం కష్టపడే అలవాటు పిల్లలకు తగ్గిపోతుంది.

3. కారు: కళాశాల ఫీజులతో పాటు, కారు కొనివ్వడం, బీమా, నిర్వహణ ఖర్చులు కూడా తల్లిదండ్రులే భరిస్తున్నారు.

4. కాండో (ఇల్లు): కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు తొలి ఇంటిని కూడా తామే స్వయంగా కొనిస్తున్నారు.

5. క్యాష్‌(ట్రస్ట్ ఫండ్): పిల్లల భవిష్యత్తు కోసం ట్రస్ట్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నారు. ఫలితంగా పిల్లలు బడ్జెట్ చేయడం, పెట్టుబడి పెట్టడం వంటి ఆర్థిక నైపుణ్యాలు నేర్చుకోరు.

ఆస్తి కరిగిపోతుంది..
కియోసాకి అభిప్రాయం ప్రకారం.. మొదటి తరం కష్టపడి సంపాదిస్తుంది. రెండో తరం సౌకర్యవంతమైన జీవితం గడుపుతుంది. కానీ అదే అలవాట్లు మూడో తరానికి వెళ్తే కుటుంబ ఆస్తి క్రమంగా క్షీణిస్తుంది. కష్టపడి పనిచేయడం, సంపాదించడం, పెట్టుబడి పెట్టడం, బడ్జెట్ నిర్వహించడం వంటి అలవాట్లు చిన్నప్పటి నుంచే నేర్పాలని ఆయన సూచిస్తున్నారు.

భారతీయ కుటుంబాల్లో ఇదే పరిస్థితి
రాబర్ట్‌ కియోసాకి చెప్పిన పరిస్థితి భారతీయ కుటుంబాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. భారతదేశంలో పిల్లలు ఉద్యోగం పొందిన తర్వాత కూడా ఇల్లు లేదా కారు కొనుగోలు సమయంలో తల్లిదండ్రులు తమ పొదుపులను, కొన్నిసార్లు ప్రావిడెంట్ ఫండ్ లేదా పదవీ విరమణ నిధుల నుంచే ఉపసంహరించుకుని సహాయం చేస్తుంటారు. ఇది తల్లిదండ్రుల ప్రేమగా కనిపించినా, దీర్ఘకాలంలో పిల్లల్లో ఆర్థిక స్వావలంబనను దెబ్బతీసే ప్రమాదం ఉందని కియోసాకి హెచ్చరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement