Cash
-
కోట్లు పంచుకుందాం.. టికెట్ ఇవ్వండి
పారిస్: రూపాయి రూపాయి నువ్వేం చేయగలవంటే?. బంధాలు, బంధుత్వాలను తుంచేస్తా అని చెప్పిందట. డబ్బు ఉందన్న అహంతో కొందరు తమ ఆత్మియులను ఆమడ దూరం పెట్టేసిన వైనాలు మనందరం చూశాం. అయితే అదే డబ్బు శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తుందని ఫ్రాన్స్‌లోని ఓ ఘటన నిరూపించింది. సాధారణంగా మన పర్సు, క్రెడిట్ కార్డులను కొట్టేసిన వాళ్లు మనకు కనబడితే చితకబాదుతాం. కానీ ఫ్రాన్స్‌లో 40 ఏళ్ల ఓ వ్యక్తి మాత్రం తన క్రెడిట్ కార్డును కొట్టేసిన వ్యక్తులను అక్కున చేర్చుకునేందుకు తహతహలాడుతున్నాడు. ఇందులో ఒక ఆర్థిక కోణం, నగదు ప్రేమ దాగి ఉంది. ఈయన దగ్గర కొట్టేసిన క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసిన ఒక లాటరీ టికెట్‌కు జాక్‌పాట్ తగిలింది. ఏ లక్షో రెండు లక్షలో కాకుండా ఏకంగా రూ.4,53,00,000ల జాక్‌పాట్ తగిలింది. టికెట్ ఎలా చేజిక్కించుకోవాలి? జాక్‌పాట్ తగిలిన టికెట్‌ను కౌంటర్లో ఇచ్చేసి నగదుగా మార్చుకునే అవకాశం ఆ దొంగలకు లేదు. ఎందుకంటే సంబంధిత టికెట్ కొనుగోలు పత్రాలు వాళ్ల వద్ద లేవు. ఆ టికెట్ కొనేందుకు ఉపయోగించిన క్రెడిట్ కార్డ్ వాళ్లది కాదు. దొంగతనం చేశారు కాబట్టి ఒకవేళ టికెట్ పట్టుకుని కౌంటర్ వద్దకు వస్తే పోలీసులు పట్టుకెళ్తారు. దీంతో దొంగలు ఆ రూ. 4.53 కోట్ల విలువైన లాటరీటికెట్ను నగదుగా మార్చుకునే అవకాశం కోల్పోయారు. కానీ ఆ అవకాశం క్రెడిట్ కార్డ్ యజమాని అయిన జీన్ డేవిడ్.ఈ అనే వ్యక్తికి ఉంది. కానీ అతని వద్ద టికెట్ లేదు. ఇందుకు ఆయనో పథకం వేశారు. క్రెడిట్ కార్డ్ కొట్టేసిన దొంగలపై ఎక్కడాలేని ప్రేమ ఒలకబోస్తున్నారు. ‘‘నా క్రెడిట్ కార్డులు దొంగలించిన మీపై నాకు ఇప్పుడు కోపం లేదు. గతంలో మీపై పోలీస్ కేసు పెట్టాను. కావాలంటే ఆ కేసును ఇప్పుడు ఉపసంహరించుకుంటా. అయితే మీరు ఆ లాటరీ టికెట్‌ను నాకు ఇచ్చేయండి. కావాలంటే అందులో సగం మొత్తాన్ని మీకు వాటాగా ఇచ్చేస్తా’’అని ఒక చక్కటి ఆఫర్ ఇచ్చారు. అయితే ఇంకా తమ కౌంటర్ వద్దకు ఎవరూ రాలేదని లాటరీ నిర్వహణ సంస్థ లా ఫ్రాంకైస్ డీస్ జీయక్స్(ఎఫ్‌డీజే) శనివారం ప్రకటించింది. ఆలసించిన ఆశాభంగం క్రెడిట్ కార్డ్ యజమాని జీన్ డేవిడ్ తన లాయర్ ద్వారా మరోసారి ఒక సవివరమైన ప్రకటన ఇప్పించారు. ‘‘ఆ ఇద్దరు దొంగలు లేకుండా ఈ లాటరీ విజయం సాధ్యమయ్యేదే కాదు. వాళ్లు టికెట్ కొన్నారు కాబట్టే ఇవాళ ఇంత సొమ్ము మన పరం అయ్యే సదవకాశం దక్కింది. అందుకే దొంగల్లారా.. దయచేసి ఆ లాటరీ టికెట్ మాకు ఇచ్చేయండి. మీ వద్ద ఉన్నా అది మీకు ఉపయోగపడదు. మాకు ఇచ్చేస్తే మీకూ అందులో వాటా తప్పకుండా ఇస్తాం. డీల్ కుదుర్చుకుందాం. మా ఆఫీస్‌కు వచ్చేయండి. మీరు ఆలస్యం చేస్తే ఆ టికెట్‌ను నగదుగా మార్చుకునే క్లెయిమ్ గడువు తీరిపోతుంది. అప్పుడు మనందరికీ దక్కేది సున్నా. కాలం మించిపోతోంది. సమయం లేదు మిత్రమా. త్వరగా వచ్చి ఒడంబడిక చేసుకుని డబ్బు తీసుకెళ్లండి. ఆ డబ్బుతో మేం సెటిల్ అవుతాం. మీరూ సెటిల్ అవ్వండి’’అని లాయర్ పియరీ డెబూసన్ చెప్పారు. ఈ వింత ప్రకటన చూసి ఫ్రాన్స్ ప్రజలు సామాజిక మాధ్యమాల్లో తమకు నచ్చినట్లు పోస్ట్‌లు పెడుతున్నారు.సిటీలో కొట్టేసి.. టౌలూస్ నగరానికి చెందిన జీన్ డేవిడ్ ఫిబ్రవరి మూడో తేదీన కారులో తన బ్యాక్‌ప్యాక్‌ను ఉంచేసి వెళ్లాడు. కారు తెరచి దొంగలు ఆ బ్యాక్‌ప్యాక్‌ను, అందులోని పర్సు, క్రెడిట్ కార్డులను కొట్టేశారు. ఆ కార్డుతో ఒక చిల్లర దుకాణంలో లాటరీ టికెట్ కొన్నారు. ‘‘ఇల్లూ, చెప్పుకోవడానికి అడ్రస్ కూడా లేని ఇద్దరు వ్యక్తులు మా దుకాణానికి వచ్చి కాంటాక్ట్‌లెస్ విధానంలో 52.50 యూరోలతో ఒక లాటరీ టికెట్, మరికొన్ని సిగరెట్లు కొన్నారు. టికెట్ కొన్న ఆనందంలో వాళ్లు సిగరెట్లు కూడా మర్చిపోయి వెళ్లారు’’అని టబాక్ దిస్ థెర్మాస్ దుకాణ యజమాని చెప్పారు. -
ఉబర్ ఆటో బుకింగ్.. ఇక ఓన్లీ క్యాష్ పేమెంట్!
ఉబెర్, ఓలా, రాపిడో వంటి రైడ్ హెయిలింగ్ సర్వీస్ ద్వారా ఆటో బుక్ చేసినప్పుడు పేమెంట్ ఆయా రైడ్ యాప్‌లకు కాకుండా నేరుగా తమకే క్యాష్ రూపంలో ఇవ్వాలని డ్రైవర్లు పట్టుబడుతూ ఉంటారు. ఈ విషయంలో అటు డ్రైవర్లకు, ఇటు ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రముఖ క్యాబ్ అగ్రిగేటర్ సంస్థ ఉబర్ (Uber) కీలక నిర్ణయం తీసుకుంది.ఉబర్ (Uber) ఆటో రైడ్లకు పేమెంట్ విషయంలో కీలక మార్పులు చేసింది. తమ యాప్ ద్వారా ఆటోలు బుక్ చేశాక ఇకపై నేరుగా డ్రైవర్‌కే చెల్లింపులు చేయాలని, ఆటో డ్రైవర్‌కు, ప్రయాణికుడికి మధ్య జరిగే లావాదేవీల విషయంలో ఉబర్ ఎటువంటి జోక్యం చేసుకోదని పేర్కొంది. ‘సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్’ (SaaS) విధానానికి మారుతున్న క్రమంలో ఉబర్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త విధానాన్ని ఫిబ్రవరి 18 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఉబెర్ తన అధికారిక బ్లాగ్ పోస్ట్‌లో ఈ మార్పును వివరించింది. తన కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, డ్రైవర్లు, ప్రయాణికుల మధ్య ఘర్షణను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది.కొత్త మార్పులు ఇవే.. ప్రయాణికులను సమీపంలోని ఆటో డ్రైవర్లతో అనుసంధానించే పని మాత్రమే ఉబర్ చేస్తుంది. ఇంతకు ముందు మాదిరి ఉబర్‌కు డిజిటల్ చెల్లింపులు ఇక ఉండవు. నేరుగా డ్రైవర్‌కే నగదు రూపంలో లేదా యూపీఐ (UPI) రూపంలో ప్రయాణికులు చెల్లించాల్సి ఉంటుంది. ఆటో ట్రిప్‌లకు ఉబర్ క్రెడిట్స్, ప్రమోషన్ ఆఫర్లు వర్తించవు. డ్రైవర్ల నుంచి ఉబర్ ఎటువంటి కమీషన్ తీసుకోదు. కేవలం ప్లాట్‌ఫామ్‌ను మాత్రమే అందిస్తుంది. ఎటువంటి క్యాన్సిలేషన్ ఛార్జీలు ఉండవు. ఉబర్ కేవలం ఛార్జీని సూచిస్తుంది. కానీ తుది మొత్తాన్ని డ్రైవర్, ప్రయాణికులే పరస్పరం నిర్ణయించుకోవాలి. కానీ భద్రత విషయంలో మాత్రం ఉబర్ ప్రమేయం ఉంటుంది. -
ఏటీఎం నగదు ఉపసంహరణ మరింత భారం
ఏటీఎం ద్వారా నగదు ఉపసంహరించేవారికి త్వరలో ఛార్జీలు పెంచనున్నాయి. ఏటీఎం లావాదేవీలకు ఇంటర్ చేంజ్ ఫీజును పెంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) యోచిస్తోంది. ఇది ఏటీఎం ద్వారా చేసే నగదు ఉపసంహరణలను మరింత ఖరీదైనవిగా చేస్తుంది. ఐదు లావాదేవీల ఉచిత పరిమితి ముగిసిన తర్వాత చేసే నగదు లావాదేవీలకు గరిష్ట రుసుమును రూ.21 నుంచి రూ.22కు పెంచాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సిఫారసు చేసినట్లు తెలిసింది. అంతేకాకుండా ఏటీఎం ద్వారా చేసే నగదు లావాదేవీలకు ఇంటర్ చేంజ్ ఫీజు(ఇతర బ్యాంకు ఏటీఎం ద్వారా చేసే లావాదేవీలు) రూ.17 నుంచి రూ.19కి, నగదు రహిత లావాదేవీలకు రూ.6 నుంచి రూ.7కు పెరగవచ్చని సమాచారం.పెరుగుదల ఎందుకు?ద్రవ్యోల్బణం, అధిక రుణ వ్యయాలు, రవాణా, నగదు భర్తీకి సంబంధించిన ఖర్చుల కారణంగా బ్యాంకులు ఛార్జీలు పెంచుతున్నాయి. ఏటీఎం ఆపరేటర్లకు, ముఖ్యంగా మెట్రోయేతర ప్రాంతాల్లో నిర్వహణ ఖర్చులను భరించడానికి, ఏటీఎం సేవల సుస్థిరతకు సాయపడడానికి ఈ పెంపు అవసరమని బ్యాంకులు భావిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబించేలా ఇంటర్ చేంజ్ ఫీజులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటారు.ఇదీ చదవండి: ప్రభుత్వ డివైజ్‌ల్లో ఏఐ టూల్స్ నిషేధం!వినియోగదారులపై ప్రభావంఈ సిఫార్సులను ఆర్బీఐ ఆమోదిస్తే వినియోగదారులు ఉచిత పరిమితికి మించి ఏటీఎం లావాదేవీలకు చెల్లించే ఫీజు పెరుగుతుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలు అంతగా అభివృద్ధి చెందని గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఏటీఎంల నుంచి తరచూ నగదు ఉపసంహరించుకునే వారిపై ఇది ప్రభావం చూపుతుంది. ప్రతిపాదిత ఫీజుల పెంపు ప్రభావాన్ని అంచనా వేయడానికి ఆర్బీఐ కమిటీ ఏర్పాటు చేసింది. దీని ప్రభావాన్ని అంచనా వేయడానికి నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది. బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు ఈ పెరుగుదలకు మద్దతు ఇస్తున్నాయి. -
రాజ్యసభలో నోట్ల కలకలం
సాక్షి, న్యూఢిల్లీ: కరెన్సీ నోట్ల వ్యవహారం శుక్రవారం రాజ్యసభను కుదిపేసింది. అధికార, విపక్ష సభ్యుల వాగ్వాదం, మాటల యుద్ధంతో దుమారం రేగింది. పరస్పర విమర్శలతో వాతావరణం వేడెక్కింది. ఉదయం సభ సమావేశమవగానే చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు అభిõÙక్ మను సంఘ్వీ సీటు నుంచి రూ.500, రూ.100 నోట్ల కట్ట దొరికినట్టు ప్రకటించారు. ‘‘గురువారం సభ వాయిదా పడ్డాక భద్రతా సిబ్బంది రోజువారీ తనిఖీలో 222 నంబర్ సీటు వద్ద నోట్ల కట్ట దొరికింది. అది తెలంగాణ నుంచి ఎంపికైన సంíఘ్వీకి కేటాయించిన స్థానం. అవి అసలైనవో, నకిలీవో తెలియదు. నిబంధనల ప్రకారం దీనిపై విచారణకు ఆదేశించా. దీన్ని సభ ముందుంచడం నా బాధ్యత. కనుక మీ దృష్టికీ తీసుకొస్తున్నా’’ అని వివరించారు. ‘‘అవి తమవేనని ఎవరైనా చెబుతారేమోనని చూశా. కానీ ఇప్పటికైతే ఎవరూ ముందుకు రాలేదు. ఇలా నోట్ల కట్టలను కూడా ఎక్కడో పెట్టి మర్చిపోయేన్ని డబ్బులున్నాయేమో మరి!’’ అన్నారు. చైర్మన్ ప్రకటన సభలో తీవ్ర గందరగోళానికి దారితీసింది. కాంగ్రెస్ సభ్యులు ఏకంగా సభలోకే నోట్ల కట్టలు తెస్తున్నారంటూ బీజేపీ ఎంపీలు విమర్శలకు దిగారు. దీనిపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. పెద్దపెట్టున నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. చైర్మన్ సింఘ్వీ పేరు చెప్పడాన్ని విపక్ష నేత మల్లికార్జున ఖర్గే తీవ్రంగా తప్పుబట్టారు. విచారణ జరగకుండానే నేరుగా సభ్యుని పేరు బయట పెట్టి ఆయన గౌరవం తగ్గిస్తారా అంటూ ఆక్షేపించారు. అందులో తప్పేముందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు ప్రశ్నించారు. ఏ సభ్యుని సీట్లో నోట్లు దొరికాయో చెబితే అభ్యంతరపెట్టడం ఎందుకన్నారు. ‘‘ఇలా సభలోకి నోట్ల కట్టలు తేవడం సరికాదు. దీనిపై సమగ్ర విచారణ జరగాల్సిందే’’ అన్నారు. పార్లమెంటులోకి రసాయనాలు వెంట పెట్టుకుని వచి్చన ఉదంతాలను ధన్‌ఖడ్ గుర్తు చేశారు. ‘‘అందుకే విద్రోహ నివారణ తనిఖీలు కఠినంగా జరగాలన్నది నా ఉద్దేశం. భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. ఆ కోణంలోనే పకడ్బందీగా రోజువారీ తనిఖీలు జరుగుతున్నాయి’’ అని వివరించారు. ‘‘సదరు సభ్యుడు గురువారం సభకు హాజరయ్యారు. ఆయన పేరు ప్రస్తావించినంత మాత్రాన విచారణపై ప్రభావమేమీ చూపదు’’ అని చెప్పారు. ఇది సభ గౌరవ మర్యాదలకు సంబంధించిన విషయమని సభా నాయకుడు జేపీ నడ్డా అభిప్రాయపడ్డారు. ‘‘దీనిపై విపక్ష సభ్యులు తలో అభిప్రాయం వెలిబుచ్చడం సరికాదు. అంతా ఒక్కతాటిపైకి వచ్చి దీన్ని ఖండిస్తూ తీర్మానం చేద్దాం’’ అని సూచించారు. ‘‘కొన్ని అంశాలపై చర్చ కోసం అత్యుత్సాహం చూపిస్తారు. ఇలాంటి కొన్ని అంశాలనేమో దాచేసే ప్రయత్నం చేస్తారు’’ అంటూ విపక్షాలపై విమర్శలు గుప్పించారు. వాటిని ఖర్గే తీవ్రంగా ఖండించారు. ఆ అలవాటు అధికార పక్షానిదే తప్ప తమది కాదన్నారు. అధికార పక్ష ఎంపీలను కేంద్ర మంత్రులే తమపైకి ఉసిగొల్పుతున్నారని తిరుచ్చి శివ (డీఎంకే) ఆరోపించారు. ‘‘వాటిని నేను కళ్లారా చూశాను. ఇది ఎంతవరకు సమంజసం?’’ అని ప్రశ్నించారు. దాంతో సభలో మరింత గందరగోళం నెలకొంది. దర్యాప్తుకు తాము అడ్డుచెప్పడం లేదని ఖర్గే స్పష్టం చేశారు. సభలో ప్రత్యేకంగా చర్చ అవసరం లేదని మాత్రమే చెబుతున్నామన్నారు. ‘‘ఈ రోజు నోట్లు దొరికాయి. రేపు ఇంకేమీ దొరుకుతాయో తెలియడం లేదు’’ అని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దీనిపై లోతైన విచారణ జరగాల్సిందేనన్నారు. పరిస్థితి సద్దుమణిగాక జీరో అవర్ కొనసాగింది.గ్లాస్ సీలింగ్ వేయాలేమో: సింఘ్వీ నోట్ల వ్యవహారంపై బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని సింఘ్వీ మండిపడ్డారు. గురువారం రాజ్యసభకు వచి్చనప్పుడు తన వద్ద కేవలం ఒకే ఒక్క రూ.500 నోటుందని ఆయన స్పష్టం చేశారు. ‘‘నేను మూడు నిమిషాలే సభలో ఉన్నా! మధ్యాహ్నం 12.57 గంటలకు సభలో ప్రవేశించా. ఒంటిగంటకే సభ వాయిదా పడింది. 1:30 దాకా క్యాంటీన్లో ఉండి వెళ్లిపోయా’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘‘ఇంకొకరి సీటు వద్ద నోట్ల కట్ట ఎలా వేస్తారు? ఇకపై గంజాయి వంటివి కూడా పెడతారేమో. ఇకపై సభ్యులు ఎవరి సీటుకు వారు వైర్ ఫెన్సింగో, గ్లాస్ సీలింగో ఏర్పాటు చేసి, దానికి తాళం వేసి కీస్ తమతో పాటు ఇంటికి తీసుకెళ్లాలేమో!’’ అంటూ విమర్శలు గుప్పించారు. ‘‘దీనిపై విచారణ జరగాలి. భద్రతా వైఫల్యముంటే ఆ విషయాలూ వెలుగులోకి రావాలి’’ అని సింఘ్వీ డిమాండ్ చేశారు. -
Maharashtra Assembly Elections 2024: పోలీసు వాహనాల్లో డబ్బు మూటలు
బారామతి: పోలీసు వాహనాల్లో నగదును తరలించి అధికార మహాయుతి కూటమి అభ్యర్థులను అందజేస్తున్నారని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఆరోపించారు. పవార్ శనివారం నాడిక్కడ తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. పోలీసు వాహనాల్లో డబ్బును తరలిస్తున్నారనే అంశంపై తాను చాలా మాట్లాడాలని అనుకున్నా.. తనకు సమాచారమిచ్చిన అధికారుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సంయమనం పాటిస్తున్నట్లు తెలిపారు. చాలా జిల్లాల నుంచి డబ్బు తరలింపుపై అధికారులు సమాచారం అందించారని వివరించారు. అధికార మహాయుతి కూటమిలో శివసేన (షిండే), బీజేపీ, ఎన్సీపీ (అజిత్ పవార్)లు భాగస్వామ్యపక్షాలుగా ఉన్న విషయం తెలిసిందే. లడ్కీ బహిన్ యోజన తదితర జనాకర్షక పథకాలు అధికార కూటమికి అనుకూలిస్తాయని అనుకుంటున్నారా? అని అడగ్గా.. ‘ఈ పథకం కింద నగదును అందుకున్నామని పలువురు మహిళలు చెబుతున్నారు. మీరు సంతోషంగా ఉన్నారా? అని ప్రశ్నించగా.. కిరోసిన్, వంటనూనెల ధరలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక చేతితో ఇచ్చి మరో చేతితో లాక్కొంటున్నారని వాపోయారు’ అని శరద్ పవార్ బదులిచ్చారు. ఇలాంటి పథకాల్లో తర్కం లేదని, ఇవన్నీ వంచనతో కూడినవి పవార్ ఆరోపించారు. కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం మహారాష్ట్ర ర్యాంకింగ్ పడిపోయిందని, ఇది పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని ఆయన అన్నారు. దీనికి ప్రభుత్వాన్ని మార్చడమొకటే పరిష్కారమని పేర్కొన్నారు. మహారాష్ట్రను ఆర్థికంగా బలోపేతం చేయగల మహా వికాస్ అఘాడి (ఎంవీఏ... కాంగ్రెస్, ఎన్సీపీ– ఎస్పీ, శివసేన– యూబీటి)కి అధికారాన్ని కట్టబెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆర్థికరంగాన్ని బలోపేతం చేయడంపై ప్రధాని, ఆయన సహచరులు దృష్టి పెట్టడం లేదని, రాజకీయాలతో సమస్యలకు పరిష్కారాలు లభించవని చురకలంటించారు. -
మహారాష్ట్ర: రూ. 5 కోట్ల నగదు పట్టివేత
పూణె: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలయ్యింది. ఇంతలో పూణె సమీపంలో ఓ కారులో భారీగా నగదు పోలీసులకు పట్టుబడింది. ఖేడ్ శివ్పూర్ టోల్ ప్లాజా సమీపంలో ఓ వాహనంలో రూ. 5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ వాహనం ఎక్కడి నుంచి వచ్చింది? డబ్బులు ఎక్కడికి తరలిస్తున్నారనేదానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఇన్నోవా వాహనంలో భారీగా డబ్బు తరలిస్తున్నట్లు సమాచారం అందిన వెంటనే పోలీసులు అప్రమత్తమై, ఖేడ్ శివపూర్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపధ్యంలో ఒక ఇన్నోవా కారులో తనిఖీలు చేసినప్పుడు భారీగా నగదు బయటపడింది. విషయం తెలుసుకున్న ఆదాయపు పన్ను శాఖ ఉన్నతాధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు గంటల పాటు నోట్లను లెక్కించారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు.ఇది కూడా చదవండి: ‘చియోంగ్‌చియాన్’పై అధ్యయనం -
ఏటీఎంల్లో డిపాజిట్ చేయాల్సిన రూ.2 కోట్లతో ఉద్యోగి పరార్
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి దానవాయిపేటలో ఘరానా మోసం జరిగింది. హెచ్డీఎఫ్సీ బ్రాంచ్ పరిధిలో ఉన్న ఏటీఎంలలో డిపాజిట్ చేయాల్సిన రూ.2 కోట్లతో హిటాచి క్యాష్ మేనేజ్మెంట్ సంస్థ ఉద్యోగి వాసంశెట్టి అశోక్ పరారయ్యాడు. 19 ఏటీఎంల్లో ఫిల్లింగ్ చేయాల్సి ఉండగా డబ్బుతో హుడాయించాడు. అశోక్‌పై 'ఇటాచి ప్రైవేట్ ఏజెన్సీ' అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన రాజమండ్రి సౌత్ జోన్ పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సమీపంలో ఉన్న టోల్ గేట్లు వద్ద తనిఖీలు చేస్తున్నారు. -
భారీగా నగదు, బంగారం పట్టివేత
కావలి/టంగుటూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లా పరిధిలో పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు, బంగార దొరికాయి. కావలి వద్ద చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారిపై ఉన్న గౌరవరం టోల్‌ప్లాజా సమీపంలో కావలి రూరల్ సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు గురువారం తెల్లవారుజామున తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా నగదు, బంగారాన్ని పట్టుకున్నారు. వీటిని తరలిస్తూ పట్టుబడిన వారంతా తెలంగాణలోని మిర్యాలగూడకు చెందిన వారే కావడం గమనార్హం. ఈ వివరాలను కావలి డీఎస్పీ వెంకటరమణ మీడియాకు వెల్లడించారు. చెన్నై వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును తనిఖీ చేయగా.. మిర్యాలగూడకు చెందిన మహిళలు తేజ, సుమతి వద్ద రూ.72.50 లక్షల నగదు బయటపడిందని చెప్పారు. వీటికి సంబంధించి ఎలాంటి పత్రాలు చూపించకపోవడంతో నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే చెన్నై వెళ్తున్న మరో ట్రావెల్స్ బస్సును తనిఖీ చేయగా మిర్యాలగూడకే చెందిన శివమ్మ, యాదమ్మ వద్ద రూ.60 లక్షలను గుర్తించి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మరో బస్సులో వెళ్తున్న మిర్యాలగూడకే చెందిన పర్వీన్ వద్ద రూ.29 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చెన్నై నుంచి మిర్యాలగూడ వెళ్తున్న కారును తనిఖీ చేయగా.. మోహన్, ప్రభాకర్ అనే వ్యక్తుల వద్ద కిలోన్నర బంగారం బయటపడిందని చెప్పారు. ఈ బంగారానికి సంబంధించి రసీదులు చూపించకపోవడంతో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నగదు, మొత్తం బంగారం విలువ కలిపి రూ.2.62 కోట్లు ఉంటాయని వెల్లడించారు. అలాగే చెన్నై నుంచి మిర్యాలగూడకు కారులో వెళ్తున్న మద్దిశెట్టి మల్లేశ్, చంద్రకళ వద్ద 1.238 కేజీల బంగారు బిస్కెట్లను ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద సింగరాయకొండ పోలీసులు పట్టుకున్నారు. -
ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు పట్టుకున్న నగదు, లిక్కర్, డ్రగ్స్, ఇతర ప్రలోభావాల విలువ రూ.8889 కోట్లుంటుందని ఎన్నికల కమిషన్(ఈసీ) తెలిపింది. ఈ మేరకు ఈసీ శనివారం(మే18) ఒక ప్రకటన విడుదల చేసింది. డ్రగ్స్,లిక్కర్ పట్టుకోవడంపై ఈసారి ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపింది. గుజరాత్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఇండియన్ కోస్ట్‌గార్డ్ సంయుక్తంగా మూడు రోజుల్లో రూ.892 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నట్లు ఈసీ వెల్లడించింది. -
రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
ముంబై: మహారాష్ట్రలోని నాందేడ్ పట్టణంలో ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) 72 గంటలపాటు నిర్వహించిన సోదాల్లో రూ.170 కోట్ల విలువైన సొత్తు లభ్యమైంది. పట్టణంలోని భండారీ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆదినాథ్ అర్బన్ మలీ్టస్టేట్ కో–ఆపరేటివ్ బ్యాంకు కార్యాలయాల్లో ఐటీ అధికారులు ఈ నెల 10వ తేదీన సోదాలు ప్రారంభించారు. 12వ తేదీ ఈ సోదాలు ముగిశాయి. వందలాది మంది అధికారులు సోదాల్లో పాల్గొన్నారు. రూ.14 కోట్ల నగదు, 8 కిలోల బంగారం సహా మొత్తం రూ.170 కోట్ల విలువైన సొత్తు స్వా«దీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నగదును లెక్కించడానికి 14 గంటలు పట్టినట్లు సమాచారం. పెద్ద ఎత్తున పన్ను ఎగవేసినట్లు భండారీ ఫైనాన్స్, ఆదినాథ్ బ్యాంకుపై ఆరోపణలున్నాయి. నాందేడ్ టౌన్లో ఈ స్థాయిలో ఐటీ సోదాలు జరగడం, భారీగా సొమ్ము దొరకడం ఇదే మొదటిసారి. -
నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజల మద్దతు లేదేని, ఓటమి ఖాయమని తేలిపోవడంతో చంద్రబాబు తన నల్ల ఖజానా గేట్లు ఎత్తేశారు. పచ్చ నోట్ల వరద పారిస్తున్నారు. ఇందుకు నిదర్శనాలివి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు, ఎన్నికల అధికారుల తనిఖీల్లో తెలుగుదేశం పార్టీ నేతలు, అనుచరుల వద్ద భారీ మొత్తంలో అక్రమ నగదు, కానుకలు పట్టుబడ్డాయి.వెలుగులోకి రాని అక్రమాలు, పట్టుబడకుండా టీడీపీ నేతల వద్ద గుట్టలు గుట్టలుగా ఉన్న అక్రమ సొమ్ముకు లెక్కే లేదు. ఎన్నికల కమిషన్ (ఈసీ)ని బురిడీ కొట్టిస్తూ కొత్తదారుల్లో పచ్చ నోట్లు వెదజల్లుతున్నారు. అందుకోసం షెల్ కంపెనీల నుంచి రామోజీరావుకు చెందిన మార్గదర్శి, నారాయణ విద్యా సంస్థలు, ఇతర టీడీపీ నేతల వ్యాపార సంస్థల్లోకి భారీగా అక్రమ నిధులు మళ్లిస్తున్నారు.గొల్లపూడిలో దొరికింది పెద్దమొత్తమే!భవానీపురం (విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి వసంత కృష్ణప్రసాద్ అనుచరుడు ఆలూరి సురేష్ ఇంటిపై ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసు అధికారుల దాడిలో దొరికింది రూ. కోటి అని చెబుతున్నప్పటికీ, ఇంకా పెద్దమొత్తంలోనే నగదు బయటపడినట్లు భావిస్తున్నారు. సురేష్ ఇంట్లో భారీ మొత్తంలో నగదు ఉన్నట్లు భవానీపురం పోలీసులకు అందిన సమాచారాన్ని ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారిణి సుధకు తెలియజేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసులు బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో గొల్లపూడి టెలికాం కాలనీలోని సురేష్ ఇంట్లో సోదాలు చేశారు.దాదాపు నాలుగు గంటలపాటు సోదాలు చేసి, సురేష్‌ను విచారించారు. సొమ్మును లెక్కించేందుకు కౌంటింగ్ మిషన్ కూడా తెప్పించారు. దీంతో పెద్ద మొత్తమే దొరికి ఉండవచ్చని భావిస్తున్నారు. సాయంత్రం 6.30 తరువాత ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారిణి సుధ బయటకు వచ్చి తమ సోదాలో కోటి రూపాయలు దొరికాయని ముక్తసరిగా చెప్పారు. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు దాటవేసి వెళ్లిపోయారు. అసలు ఈ డబ్బు సురేష్ వద్దకు ఎలా వచ్చింది, ఇతర విషయాలు గోప్యంగా ఉంచడం అనేక అనుమానాలకు తావిచ్చింది. మైలవరం నియోజకవర్గంలో పంచాయితీరాజ్ డీఈఈగా ఉన్న సుధకు ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్‌తో పరిచయాలు ఉండటం వల్లే ఇంత గోప్యంగా వ్యవహరించారన్న అనుమానాలు కలుగుతున్నాయి. కృష్ణప్రసాద్ ఇదే విధంగా తన సామాజికవర్గానికి చెందిన పలువురి వద్ద పెద్ద మొత్తంలో డబ్బు డంప్ చేసినట్లు సమాచారం.ఉప్పందించింది దేవినేని ఉమా వర్గమే!ఎన్టీఆర్ జిల్లా కవులూరుకు చెందిన ఆలూరి సురేష్ కొన్నేళ్లుగా గొల్లపూడిలో శ్రీనివాస లారీ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ నడుతున్నాడు. గతంలో టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, బొమ్మసాని సుబ్బారావు వెంట ఉండేవారు. వసంత కృష్ణప్రసాద్ టీడీపీలోకి వచ్చి మైలవరం అభ్యర్ధిగా పోటీ చేస్తుండటంతో ఆయనకు అనుచరుడిగా మారారు. సురేష్ బుల్లెట్ బైక్ వెనుక నంబరు కూడా లేదు. ‘మన మైలవరం..మన వసంత’ అని స్టిక్కర్ ఉంది. మైలవరం నియోజకవర్గంలో కృష్ణప్రసాద్‌కు, మాజీ మంత్రి దేవినేని ఉమా వర్గానికి పడదు. దీంతో దేవినేని వర్గమే సురేష్ వద్ద ఉన్న డబ్బు సమాచారాన్ని పోలీసులకు చేరవేసి ఉంటారని భావిస్తున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఓటర్లకు టీడీపీ పంపిణీ చేస్తున్న ఓటర్ల స్పిప్పులు ఇవి. ఎన్నికల్లో ఓటర్ల స్లిప్పుల పంపిణీ సాధారణమే. కానీ అక్కడే ఉంది చంద్రబాబు మాయోపాయం. ఓటర్లకు పంచుతున్న ఆ ఓటరు స్లిప్పుల మీద హోలోగ్రామ్ ముద్రించారు. ఈ డబ్బు ఇచ్చేందుకు ప్రతి బూత్‌కు ఓ ఏజెంటును నియమించారు. ఓటరు స్లిప్పును ఆ ఏజెంటుకు ఇస్తే, ఆయన దానికి స్కాన్ చేసి, ఓటరు ఖాతాలో రూ.3 వేలు వేస్తారు. ఇలా నియోజకవర్గంలోని 1.70 లక్షల మంది ఓటర్లకు ఓటుకు రూ.3 వేలు చొప్పున రూ. 51 కోట్ల పంపిణీకి చంద్రబాబు బరితెగించారన్నది సుస్పష్టం. పోలింగ్ రోజు వరకు మద్యం పంపిణీ, చోటా మోటా నేతలు, బూత్ కమిటీలకు యథేచ్ఛగా డబ్బుల పందేరం అదనం. ఇలా నియోజకవర్గంలో ఎన్నికల అక్రమాలకు చంద్రబాబు రూ.100 కోట్లతో పకడ్బందీ స్కెచ్ వేసినట్టు స్పష్టమైంది. మాచర్లలో పోలీసులు దాడులు చేసి టీడీపీ నేతల ఇళ్లలో ఉన్న ఈ స్లిప్పులను స్వాధీనం చేసుకోవడంతో చంద్రబాబు పన్నాగం బట్టబయలైంది. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్‌కు అత్యంత సన్నిహితుడు ఆలూరి సురేశ్ బాబు నివాసంలో ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసు అధికారులు తనిఖీ చేసి, రూ.కోటి స్వాధీనం చేసుకున్నారు. ఆయన విజయవాడలోని స్వీట్ మ్యాజిక్ హోటల్స్ భాగస్వామి. మైలవరం నియోజకవర్గంలో ఓట్లు కొనేందుకే ఈ నిధులు అక్రమంగా తరలించినట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులకు దొరికింది రూ. కోటే అయినా, స్వీట్ మ్యాజిక్ హోటల్స్ యజమానుల ద్వారా షెల్ కంపెనీలను ఉపయోగించి దాదాపు రూ.10 కోట్ల వరకు తరలించాలని కుతంత్రం పన్నినట్టు భావిస్తున్నారు. మిగిలిన నిధుల కోసం పోలీసులు సోదాలు ముమ్మరం చేశారు.రాష్ట్రం అంతటా మాచర్ల ఫార్మూలానే!మాచర్ల ఫార్మూలానే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని చంద్రబాబు పకడ్బందీ ప్రణాళిక రచించారు. హోలోగ్రామ్‌లు ముద్రించిన ఓటర్ల స్లిప్పులతో ఓట్లు కొనుగోలుకు రంగం సిద్ధం చేశారు. దీంతోపాటు మద్యం, నేతలకు ముడుపులకూ నల్ల ధనాన్ని తరలిస్తున్నట్లు సమాచారం. ఇలా నియోజకవర్గానికి రూ.100 కోట్లు చొప్పున 175 నియోజకవర్గాలకు మొత్తం రూ.17,500 కోట్లు వెదజల్లి ఎన్నికల అక్రమాలకు బరితెగించాలన్నది చంద్రబాబు లక్ష్యం. అందుకోసం ఎంతకైనా తెగించాలని, ఎంతటి బీభత్సమైనా సృష్టించాలని ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం. ఈమేరకు నియోజకవర్గాల్లో దౌర్జన్యాలకు, చివరికి హత్యలకు కూడా తెగించేందుకు టీడీపీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందుకోసం ఓ రిటైర్డ్ రాష్ట్ర పోలీస్ బాస్, రిటైర్డ్ డీఐజీ, సస్పెన్షన్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్‌లతో ఓ ముఠాను తయారు చేసి పచ్చ పన్నాగం అమలు బాధ్యతను అప్పగించారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో చంద్రబాబుతో కలసి చదువుకున్న ఓ రిటైర్డ్ ప్రొఫెసర్, ఓ రిటైర్డ్ ఐఏఎస్ (ఈయన చంద్రబాబు కేసుల్లో సహా నిందితుడు కూడా), టీడీపీ ప్రభుత్వంలో సలహాదారుగా వ్యవహరించిన ఆర్థిక నిపుణుడు ఈ కుట్ర అమలు కోసం టీడీపీ నేతలతో సమన్వయం చేస్తున్నట్లు సమాచారం.అంతా చంద్రబాబు, లోకేశ్ కనుసన్నల్లోనేఎన్నికల అక్రమాలకు పాల్పడేందుకు నల్ల ధనం తరలింపు వ్యవహారం మొత్తం చంద్రబాబు, లోకేశ్ కనుసన్నల్లోనే సాగుతోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో యథేచ్చగా కుంభకోణాలకు పాల్పడి కొల్లగొట్టిన నిధులను చంద్రబాబు వివిధ షెల్ కంపెనీల ద్వారా తరలించారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం ద్వారా కొల్లగొట్టిన నిధులను షెల్ కంపెనీల ద్వారా హైదరాబాద్‌లోని నాలుగు బ్యాంకుల్లో ఉన్న టీడీపీ ఖాతాల్లో జమ చేసిన విషయాన్ని సీఐడీ అధికారులు ఇప్పటికే ఆధారాలతోసహా గుర్తించిన విషయం తెలిసిందే. అదే విధంగా అమరావతి భూములు, మద్యం, ఇసుక, ఫైబర్ నెట్ తదితర కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన లక్షల కోట్ల రూపాయలను షెల్ కంపెనీల ద్వారా తరలించారు. ఆ అక్రమ ఖజానా నుంచే ప్రస్తుతం ఎన్నికల అక్రమాల కోసం నిధులను వివిధ రూపాల్లో తరలిస్తున్నారన్నది తేటతెల్లమవుతోంది. మార్గదర్శి, నారాయణ, రాయల్ మెరైన్ సీఫుడ్స్, సోమా అగ్రిటెక్, స్వీట్ మ్యాజిక్... ఇలా వివిధ సంస్థల ద్వారా నియోజకవర్గాలకు తరలిస్తున్న వేల కోట్ల రూపాయలు చంద్రబాబు అక్రమ ఖజానా నుంచి మళ్లిస్తున్నవేనన్నది సుస్పష్టం. పోలింగ్‌నాటికి చంద్రబాబు ఇంకెంతగా బరితెగిస్తారో.. ఈ అక్రమాలను ఈసీ, పోలీసులు ఎలా కట్టడి చేస్తారో అన్నది చూడాల్సిందే.ఇటీవలి కాలంలో పట్టుబడ్డ ‘పచ్చ’ ధనంలో ప్రధానమైనవి మరికొన్ని..» అనంతపురం జిల్లా కదిరిలో టీడీపీ అభ్యర్థి కందికుంట ప్రసాద్ వాహనంలో తరలిస్తున్న రూ.2 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. » బాపట్ల టీడీపీ అభ్యర్థి వేగేశ్న నరేంద్రవర్మకు చెందిన రాయల్ మెరైన్ ఫుడ్స్ కంపెనీ కంటైనర్లలో భారీ మొత్తంలో తరలిస్తున్న నగదును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. » ఏకంగా చంద్రబాబు రాజగురువు రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల నుంచే గుట్టుచప్పుడు కాకుండా నల్లధనం పంపిణీ జరుగుతుండటం గమనార్హం. విశాఖపట్నంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్ సిబ్బంది అక్రమ నిధులు తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. రాష్ట్రంలోని 37 మార్గదర్శి చిట్‌ఫండ్స్ శాఖల ద్వారా నెలకు రూ.200 కోట్ల టర్నోవర్ అని అక్రమంగా చూపిస్తూ.. కొన్ని నెలలుగా టీడీపీ ఎన్నికల అక్రమాలకు భారీగా నల్లధనాన్ని వెదజల్లేలా సాగిస్తున్న కుట్ర బట్టబయలైంది. » టీడీపీ సీనియర్ నేత, నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణకు చెందిన విద్యా సంస్థల తరపున ఏర్పాటు చేసిన ఇన్‌స్పైరా కంపెనీ వ్యవహారాల ముసుగులో ఎన్నికల అక్రమాలకు భారీగా నల్లధనాన్ని మళ్లించిన బాగోతం ఇటీవల బట్టబయలైంది. పోలీసులు సోదాల్లో నగదుతోపాటు, షెల్ కంపెనీల ద్వారా భారీగా నల్లధనం తరలించినట్లు వెలుగులోకి వచ్చింది.» బీజేపీ తరపున పోటీ చేస్తున్న చంద్రబాబు ముఠా సభ్యులు సీఎం రమేశ్, సుజనా చౌదరి నల్లధనం పంపిణీకి ఏకంగా ప్రత్యేక వ్యవస్థను నెలకొల్పారు. ఓట్ల కొనుగోలు, ఇతర అక్రమాల కోసం సుజనా చౌదరికి ఉమ్మడి కృష్ణా జిల్లా, సీఎం రమేశ్‌కు ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యతలను అప్పగించారు.» బాపట్ల జిల్లా పర్చూరు టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు తన నోవా అగ్రిటెక్ కంపెనీ బ్యాంకు ఖాతాల్లోకి అక్రమ నిధులు మళ్లించి, ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డ బాగోతం కూడా డీఆర్ఐ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. కంపెనీ వ్యాపార లావాదేవీల ముసుగులో ఓట్లు కొనుగోలు, ఇతర ఎన్నికల అక్రమాలకు నిధులు తరలించిన కుతంత్రం ఆధారాలతోసహా బయటపడింది. -
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
సాక్షి,హైదరాబాద్: ఐదు ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం సోమవారం(మే 6)రైతు బంధు నిధులు విడుదల చేసింది. రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకుగాను రూ.2 వేల కోట్ల దాకా ప్రభుత్వం విడుదల చేసినట్లు సమాచారం. మూడు రోజుల్లో మొత్తం రైతుబంధు చెల్లింపు ప్రక్రియ పూర్తవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఐదు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు రైతు బంధు నిధులు ఇప్పటికే విడుదల చేశారు. తాజాగా ఐదెకరాల పైన ఉన్నవారికి నగదు బదిలీ ప్రారంభించారు. -
కందికుంట అడ్డంగా దొరికినా..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: శ్రీసత్యసాయి జిల్లా కదిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ కారులో సుమారు రూ.2 కోట్ల నగదు పట్టివేత వ్యవహారంలో పోలీసుల తీరు చర్చనీయాంశంగా మారింది. నగదు తరలింపులో కందికుంట పాత్రపై పక్కా ఆధారాలు లభ్యమైనప్పటికీ ఆయనపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు తాత్సారం చేస్తున్నారు. ప్రస్తుత పరిణామాలను గమనిస్తే కేసును పక్కదోవ పట్టించి.. కందికుంటను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కందికుంట వెంకటప్రసాద్ కారులో సుమారు రూ.2 కోట్ల నగదును అనంతపురం నుంచి కదిరికి తరలిస్తుండగా.. నాలుగు రోజుల కిందట అనంతపురం విద్యుత్ నగర్ సర్కిల్లో పోలీసులు పట్టుకున్న విషయం విదితమే. అది కందికుంట డబ్బేనని కారు డ్రైవర్ వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఇదే కారుకు ఎన్నికల ప్రచారానికి అనుమతి తీసుకున్నారు. ఇన్ని ఆధారాలున్నప్పటికీ కందికుంటపై చర్యలు తీసుకోవడానికి జాప్యమెందుకన్నది అంతుచిక్కని విషయం. ఈ కేసును నీరుగార్చేందుకు కుట్ర జరుగుతోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో క్లిష్టమైన కేసులను ఇట్టే ఛేదించిన అనంతపురం పోలీసులు ఈ కేసు విషయంలో ఎందుకో దోబూచులాడుతున్నారు. కేసు నుంచి కందికుంటను తప్పించేందుకు ఏమైనా ప్లాన్ వేస్తున్నారా అన్న అనుమానాలు నెలకొన్నాయి. నాలుగు బైకులు పట్టుకుంటేనే హడావుడిగా ప్రెస్‌మీట్ పెట్టిమరీ వివరాలు వెల్లడించే పోలీసు అధికారులు.. సుమారు రూ.2 కోట్ల నగదు పట్టుబడిన విషయంలో మాత్రం ఎందుకు నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తున్నారో అర్థం కావడంలేదు.రోజుకో మలుపు భారీస్థాయిలో నగదు పట్టుబడిన ఈ కేసు మలుపులు తిరుగుతోంది. దీనిపై కిందిస్థాయి పోలీసులు ముందుకెళ్లకుండా పైస్థాయి అధికారులు బంధనాలు వేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే కదిరి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటరి్నంగ్ అధికారి (ఆర్వో)కి సమాచారం ఇచ్చామని పోలీసులు చెప్పారు. వాస్తవానికి వారు ఆర్వోకి సమాచారం ఇవ్వనేలేదు. కందికుంట ఎవరి ద్వారానైనా పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నారా? లేదా పోలీసులకే దీనిపై ‘ప్రత్యేక శ్రద్ధ’ ఉందా అన్నది తేలడం లేదు. అనంతపురం పోలీసు ఉన్నతాధికారుల వద్ద ఈ కేసు విషయంపై కిందిస్థాయి పోలీసులు చర్చించడానికి కూడా భయపడుతున్నట్టు తెలుస్తోంది. కందికుంట కారులో మూడు బ్యాగులు ఉన్నట్టు పలు టీవీ చానళ్ల విజువల్స్‌లో స్పష్టంగా కనిపిస్తుండగా, పోలీసులు మాత్రం రెండు బ్యాగులే ఉన్నట్లు చెబుతున్నారు. మూడో బ్యాగులోనూ డబ్బులు ఉన్నాయా, ఒకవేళ ఉంటే ఎక్కడికి వెళ్లాయన్నది తేలాల్సి ఉంది. గతంలో హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారిపై భారీస్థాయిలో హవాలా నగదు పట్టుబడిన కేసులో రెండురోజుల్లోనే నిందితులను పట్టుకుని కోర్టులో హాజరుపరిచారు. అదే ఈ కేసులో మాత్రం ‘అనంత’ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాలు కలుగుతున్నాయి. ఆర్వోకి సమాచారం ఇవ్వకుండానే ఇచ్చామని ఒక సీఐ చెప్పడం కూడా అనుమానాలకు తావిస్తోంది.ఆర్వోకి సమాచారం ఇచ్చాం డబ్బుకు సంబంధించి విచారణ చేస్తున్నాం. ఇందులో ఉన్నది రెండు బ్యాగులే. ఒకవేళ ఉంటే మూడో బ్యాగు బట్టల బ్యాగ్ అయి ఉండొచ్చు. ఆర్వో దగ్గరకు మా అధికారులు వెళ్లారు. ఆర్వో నిర్ణయాన్ని బట్టి తదుపరి చర్యలు ఉంటాయి. ఈలోగా మిగతా విచారణ జరుగుతూనే ఉంటుంది. – ఈ నెల 2వ తేదీన అనంతపురం టూటౌన్ సీఐ క్రాంతికుమార్‘సాక్షి’కి చెప్పిన వివరాలు నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు కందికుంట వెంకటప్రసాద్‌కు సంబంధించి సీజ్చేసిన రూ.2 కోట్ల కేసు వివరాలు ఇప్పటివరకు నాకు అందలేదు. నేను కదిరి ఆర్వోగా ఉన్నాను. కేసు అనంతపురంలో బుక్ చేశారు. అయినా నేను పోలీసులను అడిగాను. కానీ ఇప్పటివరకు వివరాలు ఇవ్వలేదు. పోలీసులు ఇచ్చే వివరాలను బట్టి మాత్రమే చర్యలు తీసుకోగలం. – ఈ నెల 3వ తేదీన కదిరి రిటరి్నంగ్ అధికారి సన్నీ వంశీకృష్ణ వెల్లడి -
ఆ ఫార్చూనర్ కందికుంటదే!
అనంతపురం: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ను రూ.2 కోట్ల వ్యవహారం ఇరకాటంలో పడేసింది. అనంతపురం నుంచి కదిరికి ఆయన కారులో తరలిస్తున్న సుమారు రూ.2 కోట్లను మంగళవారం పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. అభ్యర్థి కారులోనే నగదును తరలిస్తుండటం చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో తనకు అనుకూలమైన వాతావరణం లేకపోవడంతో కందికుంట ప్రలోభాలకు తెరతీశారు.డబ్బు ఎరవేసి ఓట్లు దండుకోవాలని పన్నాగం పన్నారు. ఈ క్రమంలోనే అనంతపురం నుంచి కదిరికి డబ్బు తరలిస్తుండగా..పోలీసు తనిఖీల్లో పట్టుబడింది. నగదు తరలింపు వ్యవహారాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. నగదు లభించిన ఏపీ 39 ఆర్క్యూ 0999 నంబరు ఫార్చూనర్ కారు కందికుంట ప్రసాద్ పేరుతోనే రిజిస్టర్ అయింది. దీంతో ఎన్నికల సంఘం కందికుంటకు నోటీసులు ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. అనంతపురం పోలీసులు ఆయనకు నోటీసులు ఇవ్వనున్నారు. నగదు తరలించడానికి కారణాలేమిటి? తదితర అంశాలను ప్రస్తావిస్తూ కందికుంటకు నోటీసులు జారీచేసి వివరణ తీసుకోనున్నారు. బెంగళూరు ఎయిర్‌పోర్టు నుంచి అనంతపురానికి కందికుంట వాహనంలోనే రాంబాబు రాక డబ్బు తరలింపు వ్యవహారంలో హైదరాబాద్‌కు చెందిన కందికుంట ప్రధాన అనుచరుడు రాంబాబు కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. కందికుంట ఫార్చూనర్ కారు సోమవారం కదిరి నుంచి బెంగళూరు ఎయిర్‌పోర్టుకు వెళ్లి.. అక్కడ రాంబాబును ఎక్కించుకుని అనంతపురం వచ్చింది. రాంబాబు సోమవారం రాత్రి నగరంలోని ఓ త్రీస్టార్ హోటల్లో బసచేశారు. మంగళవారం ఉదయం రాంబాబును అదే ఫార్చునర్ కారులో తీసుకెళ్లి రాంనగర్లో వదలి పెట్టారు. తర్వాత కందికుంట వాహన డ్రైవర్ ఆనంద్‌కుమార్ రాంనగర్‌లోని ఒక ఇంటికి వెళ్లి, అప్పటికే బ్యాగుల్లో ఉంచిన నగదును కారులో పెట్టుకున్నాడు. ముందు ఒక కారు (పైలట్ వాహనం), వెనుక కందికుంట ఫార్చునర్ కారు వెళ్లేలా ప్రణాళిక రచించుకున్నారు. అనంతపురంలోని విద్యుత్‌నగర్ సర్కిల్‌కు వెళ్లాక ముందు ఉన్న కారులో పోలీసులు తనిఖీ చేశారు. వెనుక ఉన్న కందికుంట కారు డ్రైవర్ పోలీసులను చూసి భయపడి కారులో ఉన్న నగదు బ్యాగులు పోలీసులకు అప్పగించాడు. దీంతో పోలీసులు ఆ కారు రిజి్రస్టేషన్ వివరాలు పరిశీలించగా అది కందికుంటదని తేలింది. అప్పటికే ముందున్న కారులోని వ్యక్తులు వేగంగా వెళ్లిపోయారు. ఆ కారులో వెళ్లింది ఎవరన్న అంశంపై పోలీసులు దృష్టి సారించారు. ఈ నగదు తరలింపు వ్యవహారంలో కందికుంట అనుచరుడు రాంబాబుతో పాటు మరోవ్యక్తి ఉన్నట్లు తెలుస్తోంది.ఆదాయపన్ను అధికారుల విచారణ ప్రారంభం పోలీసుల తనిఖీల్లో రూ.10 లక్షల కంటే ఎక్కువగా నగదు పట్టుబడితే ఆదాయపన్ను విభాగానికి సమాచారం అందించాల్సి ఉంటుంది. దీంతో పోలీసులు దాదాపు రూ.2 కోట్ల నగదు పట్టుబడిన విషయాన్ని ఆదాయపన్ను శాఖకు తెలిపారు. ఆ శాఖ అధికారులు కూడా విచారణ ప్రారంభించారు. నగదుకు సంబంధించిన లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. వారి విచారణ పూర్తయిన తరువాత చట్టపరంగా చర్యలు తీసుకోనున్నారు. ఏది ఏమైనా కందికుంట వెంకటప్రసాద్ చుట్టూ రూ.2 కోట్ల ఉచ్చు బిగుస్తోందని విశ్లేషకులు అంటున్నారు. కందికుంటకు అసలే నియోజకవర్గంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయన కారులోనే డబ్బు పట్టుబడింది. దీంతో ఆయన ఎన్నికల సంఘంతో పాటు పోలీసులు, ఆదాయపన్ను అధికారులకు సమాధానం చెప్పాల్సి ఉంది. ఈ పరిణామాలతో కందికుంట ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు సొంత టీడీపీ వారు చెబుతున్నారు. -
ఎన్ఎస్ఈలో కొత్తగా 4 సూచీలు
నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎన్ఎస్ఈ) తాజాగా నగదు విభాగంతోపాటు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్‌అండ్‌వో)లో నాలుగు ఇండెక్సులను కొత్తగా ప్రవేశపెడుతోంది. నిఫ్టీ టాటా గ్రూప్ 25 శాతం క్యాప్, నిఫ్టీ500 మల్టిక్యాప్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ 50:30:20, నిఫ్టీ500 మల్టిక్యాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 50:30:20, నిఫ్టీ మిడ్‌స్మాల్ హెల్త్‌కేర్ పేరుతో కొత్త సూచీలను రూపొందించింది. ఇవి ఈ నెల 8 నుంచి అమల్లోకి రానున్నాయి. నిఫ్టీ500 మల్టిక్యాప్ ఇండియా ఇండెక్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా, టాటా మోటార్స్ కీలకంగా నిలవనున్నాయి. ఇన్ఫ్రా ఇండెక్స్‌లో ఎల్అండ్టీ, ఆర్ఐఎల్, భారతీ ఎయిర్టెల్ ప్రాధాన్యత వహించనున్నాయి. -
బంగారం, మద్యం, నగదు.. ఈసీ ఇప్పటిదాకా పట్టుకున్నది ఎంతంటే..
కోల్‌కతా: ఈనెల లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించినప్పటి నుంచి పశ్చిమ బెంగాల్లో దాదాపు రూ.140 కోట్ల విలువైన బంగారం, డ్రగ్స్, మద్యంతోపాటు వివిధ వస్తువులు, రూ. 7 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన వివరాల ప్రకారం.. శనివారం (మార్చి 30) వరకు స్వాధీనం చేసుకున్న నగదు మొత్తం రూ.7.87 కోట్లు. అలాగే రూ. 33.86 కోట్ల విలువైన 12.7 లక్షల లీటర్ల మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇక రూ. 18.28 కోట్ల విలువైన 3.5 కిలోల మాదక ద్రవ్యాలు, రూ. 27.32 కోట్ల విలువైన బంగారం పట్టుబడినట్లు పేర్కొన్నారు. అలాగే ఇప్పటివరకు సుమారు రూ.36 కోట్ల విలువైన ఇతర వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. లెక్కలో చూపని నగదుతో సహా మొత్తం ఎలక్షన్ కమిషన్ స్వాధీనం చేసుకున్న బంగారం, మద్యం, ఇతర వస్తువుల విలువ రూ.147.19 కోట్లు ఉంటుందన్నారు. ఇదిలా ఉండగా, కోల్‌కతా పోలీసులు నగరంలోని జోరాబాగన్ ప్రాంతంలో చేపట్టిన తనిఖీలలో రూ.82 లక్షల విలువైన సుమారు 15 కిలోల బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. ఈ బంగారు కడ్డీలు బంగ్లాదేశ్ సరిహద్దు గుండా స్మగ్లింగ్ చేసినట్లు తెలుస్తోంది. -
ఈడీ సోదాలు.. వాషింగ్ మెషిన్లో రూ. 2.5 కోట్ల నగదు
న్యూఢిల్లీ: విదేశీ మారక ద్రవ్య(ఫెరా) నిబంధనల ఉల్లంఘన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జరిపిన సోదాల్లో భారీగా డబ్బు పట్టుబడింది. అయితే ఈసారి దొరికిన డబ్బు బీరువాల్లోనో, లాకర్లోనో కాదు వాషింగ్‌మెషిన్‌లో ప్రత్యక్షమైంది. ఢిల్లీలోని క్యాప్రికార్నియన్ షిప్పింగ్ కంపెనీకి చెందిన ఆఫీసుల్లో ఈడీ మంగళవారం ఏకకాలంలో సోదాలు జరిపింది. ఈ సోదాల్లో వాషింగ్‌మెషిన్‌లో దాచి ఉంచిన రెండున్నర కోట్ల రూపాయలను ఈడీ పట్టుకుంది. ఇవి కాకుండా పలు డాక్యుమెంట్లు, హార్డ్ డిస్కులను ఈడీ స్వాధీనం చేసుకుంది. రూ.1800 కోట్ల మేర సింగపూర్ కంపెనీలకు అక్రమ చెల్లింపులు చేసినట్లు క్యాప్రికార్నియన్ షిప్పింగ్ కంపెనీపై ఆరోపణలున్నాయి. ఇదీ చదవండి.. తీహార్ జైలుకు కల్వకుంట్ల కవిత -
Up: నగదు కోసం ఆశ.. సొంత సోదరుడితోనే పెళ్లి !
లక్నో: ఇప్పటికే పెళ్లైన ఒక సోదరి ఈసారి ఏకంగా తన సొంత సోదరుడినే వివాహం చేసుకుంది. అయితే ఇది సీరియస్‌గా కాదు. ఓ స్కీమ్ కింద ఉత్తరప్రదేశ్ ప్రభుత్వమిచ్చే నగదు కోసం ఆశపడి వారిద్దరు ఉత్తుత్తి పెళ్లి చేసుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహారాజ్గంజ్జిల్లాలోని లక్ష్మిపూర్ బ్లాక్‌లో ఈ వింత ఘటన జరిగింది. మొత్తం 38 జంటలు సామూహిక వివాహాల్లో పాల్గొంటే అందులో అన్నా చెల్లెలు పాల్గొని పెళ్లి తంతు కానిచ్చేశారు. అగ్ని సాక్షిగా ఏడడుగులు నడిచారు. పెళ్లి సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన కానుకలను తీసుకున్నారు. నగదు వస్తుందని మధ్యవర్తులు చెప్పడం వల్లే వారు ఈ పెళ్లికి సిద్ధపడినట్లు తెలిసింది. అయితే ఈ బోగస్ పెళ్లి విషయాన్ని అధికారులు కనిపెట్టారు. అన్నాచెల్లెళ్లకు ఇచ్చిన బహుమతులు తిరిగి తీసుకుంటున్నామని, వారికి రావాల్సిన నగదు బహుమతిని కూడా ఆపివేస్తున్నామని బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ చెప్పారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, యూపీలో ముఖ్యమంత్రి సామూహిక వివాహ్ యోజన కింద పెళ్లికూతురు బ్యాంకు ఖాతాలో రూ.35వేలు ప్రభుత్వం వేస్తుంది. వీటికి తోడు పెళ్లి కోసం మరో 16 వేల ఖర్చుపెడుతుంది. ఈ మొత్తం నుంచి కొత్త జంటకు కానుకలు ఇస్తారు. ఆర్థికంగా వెనుకబడిన పేదల కోసం ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాన్ని అమలు చేస్తోంది. ఇదీ చదవండి.. 10 పాయింట్లలో బీహార్ గొప్పతనం -
తగ్గిన నగదు చలామణి
ముంబై: వ్యవస్థలో నగదు చలామణి కొంత తగ్గింది. ఫిబ్రవరి 9తో ముగిసిన వారంలో నగదు చలామణి వృద్ధి 3.7 శాతానికి పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలానికి వృద్ధి 8.2 శాతంగా ఉన్నట్టు ఆర్బీఐ తన తాజా నివేదికలో వెల్లడించింది. తాజాగా నగదు చలామణి వృద్ధి నీరసించడానికి రూ.2,000 నోట్ల ఉపసంహరణ కారణమని పేర్కొంది. నగదు చలామణి అంటే ప్రజల వద్ద వినియోగంలో ఉన్న కాయిన్లు, నోట్లు. వాణిజ్య బ్యాంకులు జనవరిలో డిపాజిట్లకు సంబంధించి రెండంకెల వృద్ధిని చూపించగా, రూ.2,000 నోట్ల ఉపసంహరణ ఈ వృద్ధికి మద్దతుగా నిలిచినట్టు ఆర్బీఐ తెలిపింది. రిజర్వ్ మనీ (చలామణిలో ఉన్న నోట్లు, కాయిన్లు, ఆర్బీఐ వద్దనున్న బ్యాంక్‌ల డిపాజిట్లు) ఫిబ్రవరి 9తో ముగిసిన వారంలో 5.8 శాతానికి తగ్గింది. ఏడాది క్రితం ఇదే కాలంలో ఇది 11.2 శాతంగా ఉంది. ఇందులో బ్యాంకుల డిపాజిట్లు కాకుండా, చలామణిలో ఉన్న కాయిన్లు, నోట్ల వరకే చూస్తే వృద్ధి 3.7 శాతం కాగా, ఏడాది క్రితం 8.2 శాతంగా ఉంది. 2023 మే 19న రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ఆర్బీఐ ప్రకటించడం తెలిసిందే. ఈ ఏడాది జనవరి 31 నాటికి వ్యవస్థలోని మొత్తం రూ.2,000 నోట్లలో 97.50 శాతం తిరిగి బ్యాంకుల్లోకి వచ్చాయి. ఇప్పటికీ రూ.8,897 కోట్ల విలువ చేసే రూ.2,000 నోట్లు ప్రజల వద్దే ఉన్నాయి. 2023 మే 19 నాటికి వ్యవస్థలో చలామణిలోని మొత్తం రూ.2,000 నోట్ల విలువ రూ.3.56 లక్షల కోట్లుగా ఉంది. అయితే, ఈ నోట్ల జమ, మారి్పడి సేవలను 2023 అక్టోబర్ 7 నుంచి బ్యాంకులు నిలిపివేశాయి. -
యువరాజ్ సింగ్ ఇంట్లో చోరీ, ఇపుడు ఎందుకు వైరల్?!
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తల్లి ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. పంచకులలోని మానసా దేవి కాంప్లెక్స్‌లోని తమ ఇంట్లో నగదు, నగలు మాయమైనట్లు యువరాజ్ తల్లి షబ్మాన్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పంచకుల ఇంటి నుంచి సుమారు 70వేల విలువైన నగదు, నగలు చోరీకి గురయ్యాయని, తన ఫిర్యాదులో వెల్లడించారు. ఈ ఘటన ఆరు నెలల క్రితమే జరిగినప్పటికీ, ఇప్పుడు ఇంటర్నెట్లో ఇదే వార్త హల్చల్ చేస్తోంది. యువరాజ్ తల్లి, షబ్నమ్ సింగ్ ఇప్పటికే పోలీసులలో కేసు నమోదు చేశారు. హౌస్ కీపింగ్ సిబ్బంది, సాకేత్డికి చెందిన లలితా దేవి,బీహార్‌కు చెందిన వంట మనిషి సిల్దార్ పాల్‌పై అనుమానాలు లేవనెత్తారు.దీనిపై విచారణ ఇంకా కొనసాగుతోంది. తాజాగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు చేయడంతో యువరాజ్ సింగ్ ఇంట్లో చోరీ ఘటన మళ్లీ వైరల్ అవుతోంది. ఫోన్లో వ్యక్తిగత సమాచారం ఉందని, దుర్వినియోగం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. యువరాజ్ సింగ్ తల్లి ఫిర్యాదు మేరకు గతేడాది సెప్టెంబర్ ఈ చోరీ జరిగింది. తమ సిబ్బందిలోఇద్దరు ఇంటి నుంచి వెళ్లిన ఆరు నెలలకే దొంగతనం జరిగిందని ఆమె పేర్కొన్నారు. గురుగ్రామ్‌లో ఉంటున్న సమయంలో నిందితులు తమ ఇంటిని విడిచిపెట్టినట్లు ఫిర్యాదులో తెలిపారు. కాగా యువరాజ్ సింగ్ మాజీ నటి , మోడల్ అయిన హాజెల్ కీచ్‌ను 2016, నవంబరులో పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు కుమారుడు ఓరియన్, కుమార్తె ఆరా ఉన్నారు. -
దేశంలో వర్చువల్ ఏటీఎంలు.. ఇకపై ఏటీఎం మెషిన్లతో పనిలేదు!
మన దేశంలో యూనిఫైడ్ ఫేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) సేవల కారణంలో చేతిలో నగదుతో ఇప్పుడు పెద్దగా అవసరం ఉండటం లేదు. తగినంత ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లో యూపీఐ యాప్ ఉంటే చాలు. క్షణాల్లో చెల్లింపులు పూర్తవుతున్నాయి. కానీ ఇలాంటి సేవల వల్ల డెబిట్‌కార్డ్, క్రెడిట్ కార్డ్‌ల అవసరం తగ్గి పోయింది. ఒక వేళ ఏదైనా మారుమూల ప్రాంతానికి వెళితే ఇంటర్నెట్ నెట్ వర్క్ సరిగ్గా లేకపోతే యూపీఐ పేమెంట్స్ లావాదేవీలు సవ్యంగా జరగవు. చేతిలో డెబిట్ కార్డ్ ఉంటే ఏటీఎం సెంటర్‌కి వెళ్లి డబ్బులు డ్రా చేసుకోవచ్చు. కానీ ఇదంతా వ్యయప్రయాసలతో కూడుకున్న పని. కాబట్టే, ఇకపై మనదేశంలో ఫిజికల్ ఏటీఎం స్థానంలో వర్చువల్ ఏటీఎంలు రాబోతున్నాయి. ఈ వర్చువల్ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకునేందుకు స్మార్ట్‌ఫోన్ తప్పని సరిగా అవసరం. చండీగఢ్‌కు చెందిన ఫిన్‌టెక్ కంపెనీ పేమార్ట్ ఇండియా వర్చువల్, కార్డ్‌లెస్, హార్డ్‌వేర్ లెస్ మనీ విత్ డ్రాయిల్ సేవతో ముందుకు వచ్చింది. వినియోగదారులకు డబ్బులు కావాలంటే ఏటీఎం మెషిన్, పిన్ నెంబర్ అవసరం లేదు. వర్చువల్ ఏటీఎం వినియోగించాలంటే ఇవి తప్పని సరి ఈ వర్చువల్ ఏటీఎం ద్వారా డబ్బుల్ని డ్రా చేసుకునేందుకు స్మార్ట్‌ఫోన్, మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. డబ్బుల్ని డ్రా చేసే సమయంలో మీ బ్యాంక్ అకౌంట్‌తో రిజిస్టర్ చేసిన ఫోన్ నెంబర్ సాయంతో మొబైల్ బ్యాంకింగ్‌లో లాగిన్ అవ్వాలి వర్చువల్ ఏటీఎంలో డబ్బుల్ని ఎలా డ్రా చేయాలంటే? వర్చువల్ ఏటీఎంలో డబ్బుల్ని డ్రా చేయాలంటే ముందుగా మీ సమీపంలో ఉన్న కిరాణా స్టోర్లకు పేమార్ట్ అనుమతులు ఉండాలి. మీ మొబైల్లో పేమార్ట్తో వర్చువల్ ఏటీఎం కోసం నమోదు చేసుకున్న దుకాణదారుల జాబితా, పేర్లు, లొకేషన్, ఫోన్ నంబర్లతో సహా అందుబాటులో ఉంటాయి. అందుబాటులో ఉన్న కిరాణ స్టోర్‌లో www.vatm.inని ఉపయోగించాలి. ఇందులో లాగిన్ అయిన వెంటనే మీకు కావాల్సిన మొత్తాన్ని ఎంటర్ చేసి అంనతరం ఫోన్‌కి వచ్చిన ఓటీపీని నమోదు చేయాలి. డబ్బుల్ని డ్రా చేసుకునేందుకు డెబిట్ కార్డ్ లేదా సాంప్రదాయ ఏటీఎం మెషీన్ లేదా కియోస్క్, యూపీఐ ఆప్షన్ అవసరం లేదు. కిరాణా స్టోర్ యజమాని వర్చువల్ ఏటీఎంలా పనిచేస్తారని పేర్కొన్నారు. ఈ వర్చువల్ ఏటీఎం ఎవరు ఉపయోగించుకోవచ్చు? ‘వర్చువల్ ఏటీఎం సేవలు ఆరు నెలలుగా ఐడీబీఐ బ్యాంక్‌తో విజయవంతంగా కొనసాగుతున్నాయని పేమార్ట్ వెల్లడించింది. కస్టమర్లకు ఈ వర్చువల్ ఏటీఎం సేవల్ని అందించేందుకు ఫిన్‌టెక్ సంస్థ ఇండియన్ బ్యాంక్ , జమ్మూ - కాశ్మీర్ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రస్తుతం, చండీగఢ్, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబైలలో ఎంపిక చేసిన ప్రదేశాల్లో అందుబాటులో ఉన్నాయి.మార్చి నెలలో పేమార్ట్ తన భాగస్వామి బ్యాంకులతో వర్చువల్ ఏటీఎం సేవల పైలట్ ప్రోగ్రామ్‌లను ప్రారంభించాలని యోచిస్తోంది. ప్రస్తుతానికి ఈ వర్చువల్ ఏటీఎంని ఉపయోగించడానికి కస్టమర్ ఎలాంటి ఛార్జీని చెల్లించాల్సిన అవసరం లేదని నారంగ్ తెలిపారు. వర్చువల్ ఏటీఎంలలో ఎంత డబ్బు డ్రా చేసుకోవచ్చు? ఒక వినియోగదారు ప్రతి లావాదేవీకి కనిష్టంగా రూ. 100 నుంచి గరిష్టంగా రూ. 2,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. వర్చువల్ ఏటీఎంల ద్వారా విత్‌డ్రా చేసుకోవడానికి గరిష్ట పరిమితి నెలకు రూ. 10,000. చిన్న మొత్తాలను పొందడానికి వర్చువల్ ఏటీఎం ఉపయోగపడుతుంది. షాప్కీపర్ చేతిలో పెద్ద మొత్తంలో నగదు ఉండకపోవచ్చు కాబట్టి పెద్ద మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవడానికి ఈ ఫీచర్ అంతగా ఉపయోగపడదు. వర్చువల్ ఏటీఎంలతో బ్యాంక్ వచ్చే లాభం వర్చువల్ ఏటీఎంల వల్ల మారుమూల గ్రామాల్లో బ్యాంక్‌లు కస్టమర్లకు సేవల్ని ఉపయోగించికుంటారు. తద్వారా, బ్యాంకులు పెట్టే నిర్వహణ ఖర్చు తగ్గుతుంది.ఇంకా, వర్చువల్ ఏటీఎం ఉన్న కిరాణా స్టోర్ యజమాని కస్టమర్లు డబ్బులు ఎంత డ్రా చేస్తే అంత మొత్తంలో కమిషన్ పొందే సదుపాయం ఉంది. -
బనియన్ల నిండా బంగారం, నగదే
సాకక్షి, కర్నూలు: సినీ ఫక్కీలో ఒంటిపై చొక్కా లోపల ధరించిన బనియన్లలో భారీగా బంగారం, నగదు పెట్టుకుని దర్జాగా బస్సులో నిద్రిస్తున్న నలుగురిని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.1,84,53,500 నగదు, 4.565 కిలోల బంగారం, 5కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... అక్రమంగా బంగారం తరలిస్తున్నారని స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టెబుల్ ఖాజాహుసేన్ సమాచారం ఇవ్వడంతో కర్నూలు జిల్లా అమకతాడు టోల్‌ప్లాజా వద్ద కృష్ణగిరి, వెల్దుర్తి ఎస్ఐలు ఎం.చంద్రశేఖర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి సీఐ గురువారం అర్ధరాత్రి వాహన తనిఖీ చేపట్టారు. హైదరాబాద్ నుంచి కోయంబత్తూరుకు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సులో తనిఖీలు చేయగా, అమర్‌ప్రతాప్ పవార్(నంద్యాల), శబరి రాజన్(సేలం, తమిళనాడు), వెంకటేష్ రాహుల్(కోయంబత్తూరు), సెంథిల్‌కుమార్ (కోయంబత్తూరు) సినీ ఫక్కీలో బంగారం తరలిస్తున్నట్లు గుర్తించారు. వారు పథకం ప్రకారం తమ ఒంటిపై ధరించిన బనియన్‌కు పెద్ద జేబులు ఏర్పాటు చేసుకుని వాటిలో బంగారం, వెండి, నగదు పెట్టుకుని, దానిపై చొక్కా వేసుకుని ఎవరికీ అనుమానం రాకుండా ప్రయాణిస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అమర్‌ప్రతాప్ పవార్ నుంచి రూ.1,20,80,000, శబరి రాజన్ నుంచి 5 కిలోల వెండి బిస్కెట్లు, వెంకటేష్ రాహుల్ నుంచి 3.195 కిలోల బంగారం, రూ.19,23,500 నగదు, సెంథిల్‌కుమార్ నుంచి 1.37కిలోల బంగారం, రూ.44,50,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారం, వెండి విలువ రూ.2,74,54,800 ఉంటుంది. బంగారం, వెండి, నగదు తరలిస్తున్న వారి వద్ద ఎటువంటి పత్రాలు లేకపోవడంతో ఆర్ఐ మస్తాన్, వీఆర్వో గిడ్డయ్య ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి సీజ్ చేశారు. నలుగురి నుంచి వివరాలు నమోదు చేసుకుని పంపించారు. కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ శుక్రవారం ఉదయం సెట్ కాన్ఫరెన్స్‌లో స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టెబుల్ ఖాజాహుసేన్‌తోపాటు తనిఖీల్లో పాల్గొన్న వెల్దుర్తి సర్కిల్ సిబ్బందిని అభినందించారు. కాగా, గత నెల 26న రాత్రి ఇదే టోల్‌ప్లాజా వద్ద హైదరాబాద్ నుంచి అనంతపురానికి వెళుతున్న ట్రావెల్స్ బస్సులో కూడా ఓ వ్యక్తి నుంచి రూ.43.20లక్షలు స్వాదీనం చేసుకున్నారు. -
చెల్లి పెళ్లి సొమ్ముతో ఆన్లైన్ గేమ్ ఆడి..
ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాకు చెందిన ఒక బీఎస్సీ విద్యార్థి ఆన్లైన్ గేమ్ ఆడి సుమారు రూ.5.5 లక్షలు పోగొట్టుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ మొత్తాన్ని అతని సోదరి పెళ్లి కోసం కుటుంబ సభ్యులు ఉంచారు. ఆన్లైన్ గేమ్‌లో రూ. 5 లక్షలకు పైగా మొత్తాన్ని పోగొట్టుకున్న తర్వాత ఆ కుర్రాడు కిడ్నాప్ నాటకం ఆడాడు. ఆన్లైన్ గేమ్‌లో భారీగా సొమ్మును పోగొట్టుకున్న తర్వాత అతనిని కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో కిడ్నాప్ నాటకం ఆడి, తప్పుడు కథనాన్ని సృష్టించాడు. ఇటావా జిల్లాలోని ఫ్రెండ్స్ కాలనీలో ఈ ఘటన సంచలనం సృష్టించింది. బీఎస్సీ విద్యార్థి కిడ్నాప్‌పై పోలీసులకు ఫిర్యాదు అందడంతో పోలీసులు కూడా రంగంలోకి దిగారు. పోలీసుల విచారణలో.. కుటుంబసభ్యులు మందలింపుతో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తేలింది. బీఎస్సీ చదువుకుంటున్న తమ కుర్రాడు కిడ్నాప్‌కు గురైనట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సిటీ ఎస్పీ, సిటీ సీఓ దర్యాప్తు చేపట్టి ఆ విద్యార్థి ఆచూకీ తెలసుకున్నారు. ఆ కుర్రాడు తాను కిడ్రాప్ అయినట్లు నాటకం ఆడాడని ఇటావా ఎస్పీ సంజయ్ కుమార్ తెలిపారు. ఫిబ్రవరి నెలలో ఈ కుర్రాడి సోదరి వివాహం జరగనుంది. ఈ నేపధ్యంలో కుటుంబ సభ్యులు అతని ఖాతాలో సుమారు రూ.5 లక్షలు జమ చేశారు. ఆన్లైన్ గేమ్ ఆడిన ఆ కుర్రాడు తన దగ్గరున్న సొమ్మునంతా పోగొట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆ కుర్రాడిని తీవ్రంగా మందలించారు. దీంతో ఆ కుర్రాడు తన సోదరుడు, ఒక బంధువు సహకారంతో కిడ్నాప్ డ్రామా ఆడాడు. జనవరి ఒకటిన రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇటావా పరిధిలోని ఘూగల్‌పూర్‌లో ఉంటున్న ఆ కుర్రాడి బంధువు శివం యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన బంధువు సంజీవ్‌కుమార్ యాదవ్ కుమారుడు అంకిత్ యాదవ్‌ను గుర్తుతెలియని దుండగులు కారులో కిడ్నాప్ చేశారని అతను తన మొబైల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు ఘూఘల్‌పూర్‌కు చేరుకున్నారు. ఇటావా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు అదనపు పోలీసు సూపరింటెండెంట్ మార్గదర్శకత్వంలో అంకిత్ యాదవ్‌ను వెదికేందుకు పోలీసుల బృందం ఏర్పాయ్యింది. వీరికి ఈ ఘటన అనుమానాస్పదంగా కనిపించడంతో శివమ్ యాదవ్, అతని కుటుంబ సభ్యులను పోలీసు బృందం విచారించింది. ఈ నేపధ్యంలో అంకిత్ యాదవ్‌ను వెదికి పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఓటీపీలతో రూ.6.90 లక్షలకు కుచ్చుటోపీ
పెద్దదోర్నాల: ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదు మొత్తం మీ అకౌంట్లోకి జమ చేస్తామని నమ్మించిన సైబర్ నేరగాళ్లు బ్యాంక్ అకౌంట్లోని నగదు మొత్తాన్ని కాజేసిన ఘటన ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని ఐనముక్కలలో ఆదివారం వెలుగు చూసింది. ఈ ఘరానా మోసంలో గ్రామానికి చెందిన ఇద్దరు సోదరులు నగదు పోగొట్టుకున్నారు. ఎస్సై అంకమరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 14వ తేదీన గ్రామానికి చెందిన చిట్యాల ఆంజనేయరెడ్డి అనే యువకుడికి గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదు మొత్తం ఒక్కసారే అకౌంట్లో పడుతుందని, ఫోన్ పే ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి మాట్లాడాలని సూచించాడు. తొలుత అకౌంట్ నుంచి కొంత మొత్తం కట్ అయి తిరిగి పడుతుందని మోసగాళ్లు నమ్మబలికారు. తనది ఆండ్రాయిడ్ ఫోన్ కాకపోవడంతో ఆ యువకుడు గ్రామానికి చెందిన లింగాల శ్రీను నంబర్ నుంచి గుర్తు తెలియని నంబర్‌కు కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడాడు. అయితే.. శ్రీను అకౌంట్లో అమౌంట్ తక్కువగా ఉందని చెప్పడంతో శ్రీను తమ్ముడు లింగాల రమేష్ నంబర్ నుంచి ఫోన్‌చేసి కాన్ఫరెన్స్ కాల్ కలిపి ముగ్గురూ సైబర్ నేరగాళ్లతో మాట్లాడారు. అతని మాటలు నమ్మిన రమేష్ తన ఫోన్‌కు వచ్చిన ఓటీపీ నంబర్లతో పాటు ఫోన్‌పేకు సంబంధించిన పాస్‌వర్డ్‌ను చెప్పటంతో లింగాల రమేష్ అకౌంట్లోని రూ.6.90 లక్షల నగదు మాయమైంది. అయితే.. మాయమైన డబ్బు నుంచి రూ.79 వేల నగదు తిరిగి బాధితుడి అకౌంట్‌కు జమ అయినట్లు ఎస్సై తెలిపారు. తమకు వచ్చిన ఫోన్ నంబర్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అది స్విచ్చాఫ్ వస్తుండటంతో తాము మోసపోయినట్టు సోదరులు గ్రహించారు. హుటాహుటిన పోలీస్ స్టేషన్‌తో పాటు స్థానిక బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితులకు ఢిల్లీ, మధ్యప్రదేశ్ నుంచి ఫోన్లు వచ్చాయని, ఏ రాష్ట్రానికి ఫోన్ చేయాలనుకుంటే అదే భాషలతో మాట్లాడే వాళ్లతో ఫోను చేయిస్తారని, డబ్బులు వస్తాయని నమ్మకంగా ఆశ చూపి అకౌంట్లలోని డబ్బులు మాయం చేస్తారని ఎస్సై తెలిపారు. గుర్తు తెలియని నంబర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. -
ఒడిశా ఐటీ దాడుల మొత్తం రూ.351 కోట్లు
న్యూఢిల్లీ/భువనేశ్వర్: ఒడిశా కేంద్రంగా మద్యం వ్యాపారం చేస్తున్న సంస్థకు సంబంధించిన ప్రాంతాల్లో ఆదాయ పన్ను(ఐటీ) అధికారులు చేసిన సోదాల్లో దొరికిన నగదు మొత్తం రూ.351 కోట్లకు చేరింది. దేశంలో ఒక దర్యాప్తు సంస్థ ఒకేసారి చేసిన సోదాల్లో ఇంతటి భారీస్థాయిలో కరెన్సీ బయటపడటం ఇదే తొలిసారి! బౌద్ధ్ డిస్టిల్లరీ ప్రైవేట్ లిమిటెడ్, దాని ప్రమోటర్లు, ఇతరులకు సంబంధించిన చోట్ల ఐటీ అధికారుల సోదాలు ఐదోరోజైన ఆదివారమూ కొనసాగాయి. మద్యం వ్యాపారం ద్వారా పొందిన దాంట్లో లెక్కల్లో చూపని ఆదాయం గుట్టుమట్లను ఐటీ శాఖ రట్టుచేస్తోంది. తనిఖీల్లో భాగంగా రాంచీలోని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ధీరజ్ ప్రసాద్ సాహూ సంబంధిత ప్రాంతాల్లోనూ ఐటీ అధికారులు చెక్‌చేశారు. ఇక్కడ ఎంత మొత్తంలో నగదు, ఇతర పత్రాలు లభించాయనేది అధికారులు వెల్లడించలేదు. ‘ఈ అంశం ధీరజ్ సాహూ కుటుంబ విషయం. దాదాపు వందేళ్లకు పైగా వారి కుటుంబం ఉమ్మడి వ్యాపారం చేస్తోంది. అందులో సాహూకు చిన్న వాటా ఉంది. ఏదేమైనా ఆయనకు సంబంధించిన చోట్ల సోదాలు జరిగాయికాబట్టి ఆయన ఈ విషయంలో వివరణ ఇవ్వాల్సిందే. అందుకే ఆయన నుంచి వివరణ తీసుకున్నాం. కాంగ్రెస్ పారీ్టకి ఈ సోదాలకు సంబంధం లేదు’’ అని జార్ఖండ్ కాంగ్రెస్ ఇన్చార్జ్ అవినాశ్ పాండే ఆదివారం స్పష్టంచేశారు. విపక్షాలపై అమిత్ విమర్శలు ఐటీ దాడులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. ‘‘ దర్యాప్తు సంస్థలను కేంద్రం దురి్వనియోగం చేస్తుందని ఇన్నాళ్లూ విపక్షాలు ఎందుకు అన్నాయో ఇప్పుడు అర్థమవుతోంది. విపక్షాలు తమ అవినీతి, అక్రమ సొమ్ము వ్యవహారం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతోనే ఇన్నాళ్లూ విషప్రచారం చేశాయి. తీరా ఇప్పుడు కరెన్సీ కట్టలు బయటపడ్డాక కాంగ్రెస్, టీఎంసీ, జేడీయూ, డీఎంకే, ఆర్జేడీలు మౌనం వహిస్తున్నాయి’’ అమిత్ వ్యాఖ్యానించారు. -
ఏమీ చేయకుండా నెలకు రూ. 9 లక్షలు.. ఫలించిన కుర్రాడి ఐడియా!
ప్రపంచంలో డబ్బు సంపాదించడానికి జనం వివిధ పద్ధతులను అవలంబిస్తుంటారు. ఇలా సంవత్సరానికి కోట్లాది రూపాయలు సంపాదిస్తుంటారు. వీరిలో సంపాదనకు చక్కటి మార్గాలను కనుగొన్నవారు కూడా ఉన్నారు. వారిలో ఒకరే కరుణ్ విజ్. అతను భారతీయుడే అయినప్పటికీ ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్నారు. కరుణ్ విజ్ ప్రతి నెలా సగటున రూ.9 లక్షలు సంపాదిస్తున్నారు. ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు కరుణ్ సంపాదనకు లాభసాటి మార్గాన్ని కొనుగొన్నారు. 33 ఏళ్ల కరుణ్ మొదటి నుంచి ప్రాపర్టీ ఓనర్‌గా మారాలనుకునేవారు. రియల్ ఎస్టేట్.. మంచి లాభదాయకమైన వ్యాపారమని కరుణ్ కాలేజీ రోజుల్లోనే గ్రహించారు. ఈ సమయంలో కరణ్.. దేశంలోని ఇన్స్టిట్యూట్ల చుట్టుపక్కల ఉండే ఇళ్లకు సంబంధించి ఒక ఆలోచన చేసేవారు. మొత్తం ఇంటిని ఒకరికే అద్దెకు ఇవ్వకుండా.. గదుల ప్రాతిపదికన రెంట్ వసూలు చేయడం లాభదాయకమని భావించారు. ఇంటినంతటికీ అద్దెదారుకు అద్దెకు ఇవ్వకుండా విద్యార్థుల కోసం ప్రత్యేక గదులుగా మలచి, అద్దెకు ఇవ్వడం ఎంత ప్రయోజనకరమనేది గ్రహించారు. మీడియాకు తెలిసిన వివరాల ప్రకారం కరుణ్ కెనడాలో మొత్తం 28 గదులు కలిగిన నాలుగు ఇళ్లను కలిగి ఉన్నాడు. అతను వాటిని అద్దెకు ఇచ్చాడు. దీంతో ప్రతినెలా రూ.9 లక్షలకు పైగా మొత్తాన్ని ఆర్జిస్తున్నారు. అయితే ఈ ఆస్తులను కొనుగోలు చేసేందుకు కరుణ్ దాదాపు రూ.19 కోట్లు పెట్టుబడి పెట్టారు. 2016వ సంవత్సరంలో తన 26 ఏళ్ల వయస్సులో కరుణ్ కెనడాలోని అంటారియోలో తన మొదటి పెట్టుబడి పెట్టారు. ఈ క్రమంలో దాదాపు రూ.2.7 కోట్ల విలువైన ఆస్తిని కొనుగోలు చేసి, ఏడుగురు కాలేజీ విద్యార్థులకు అద్దెకు ఇచ్చారు. కరుణ్ కేవలం అద్దె ఆదాయంపై మాత్రమే ఆధారపడటం లేదు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత కరుణ్ అప్లికేషన్స్ ఇంజనీర్‌గా పనిచేశారు. ప్రస్తుతం అమెరికాలోని ఒక కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అద్దెల ద్వారా వచ్చే ఆదాయం, తన జీతం సొమ్ముతో కరుణ్.. దక్షిణ అంటారియోలో భారీగా ఆస్తులను కూడబెట్టారు. ఇది కూడా చదవండి: ఢిల్లీలో మరింత దిగజారిన గాలి నాణ్యత -
తనిఖీల జప్తులో తెలంగాణ టాప్.. ఏకంగా 659 కోట్ల స్వాధీనం
సాక్షి, న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వచ్చినప్పటి నుంచి జరుగుతున్న తనిఖీల్లో పట్టుబడ్డ సొమ్ము జాబితాలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా చేస్తున్న తనిఖీల్లో రూ.1,760 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) తెలిపింది. 2018లో స్వాధీనం చేసుకున్న రూ.239.15 కోట్లతో పోలిస్తే ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న సంపద 7 రెట్లు ఎక్కువ అని పేర్కొంది. సోమవారం వరకు తెలంగాణలో రూ.225.23 కోట్ల నగదు, రూ.86.82 కోట్ల విలువైన మద్యం, రూ.103.74 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.191.02 కోట్ల విలువైన బంగారం సహా విలువైన లోహాలు, రూ.52.41 కోట్ల విలువైన ఉచితాలకు సంబంధించిన వస్తువులతో కలిపి మొత్తం రూ.659.20 కోట్ల విలువైన సంపదను పట్టుకున్నట్లు సీఈసీ వెల్లడించింది. అధికారులు స్వాధీనం చేసుకున్న వాటిలో ఉచితాలు మినహా నగదు, మద్యం, డ్రగ్స్, బంగారంలో రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలతో పోలిస్తే తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. రాజస్తాన్‌లో రూ.650.70 కోట్లు, మధ్యప్రదేశ్‌లో రూ.323.70 కోట్లు, ఛత్తీస్‌గఢ్‌లో రూ.76.9 కోట్లు, మిజోరంలో రూ.49.6 కోట్లు పట్టుబడినట్లు ఈసీ తెలిపింది. ఓటర్లను ప్రభావితం చేసేందుకు వినియోగించే ఉచితాలకు సంబంధించిన వస్తువుల జప్తు రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అధికంగా ఉంది. రాజస్తాన్‌లో రూ.341.24 కోట్లు, మధ్యప్రదేశ్‌లో రూ.120.53 కోట్ల విలువైన ఉచితాలను అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. ఈసారి ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ విధానం.. ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని సులభతరం చేసిందని ఈసీ పేర్కొంది. -
కరెన్సీ కట్టలు..
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నగదు తరలింపుపై సిటీ పోలీసులు డేగకన్ను వేశారు. కేవలం రాజకీయ సంబంధిత సొమ్మే కాదు.. భారీ మొత్తంలో తీసుకువెళ్తున్న వారినీ విడిచిపెట్టడం లేదు. గురువారం సాయంత్రం గుడిమల్కాపూర్ రోడ్లో తనిఖీలు చేసిన ఆసిఫ్‌నగర్ అధికారులు రెండు వాహనాల్లో తరలిస్తున్న రూ.1,78,30,000 స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు తీసుకువెళ్తున్న ఇరువురూ ప్రవాస భారతీయులుగా (ఎన్నారై) గుర్తించామని శుక్రవారం సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ బి.బాలస్వామి వెల్లడించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ► షేక్‌పేట్‌లోని గుల్షన్ కాలనీకి చెందిన అన్నదమ్ములు మహ్మద్ షానవాజుద్దీన్, మహ్మద్ షాబుద్దీన్ కొన్నేళ్లుగా సౌదీలో వ్యాపారం చేస్తున్నారు. ఎన్నారైలు అయిన వీరు ఇటీవల నగరానికి వచ్చారు. శివార్లలో ఉన్న ఓ భూమి కొనుగోలు చేయడానికి బేరసారాలు పూర్తి చేశారు. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ తర్వాత కొంత మొత్తం అడ్వాన్స్‌గా చెల్లించారు. శుక్రవారం మిగిలిన రూ.1.78 కోట్లు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంది. దీనికోసం గురువారం తమ ఖాతాలు ఉన్న బ్యాంక్‌కు వెళ్లారు. బ్యాంక్ మేనేజర్ వారించినా.. ► సాధారణ సమయాల్లోనే అంత మొత్తం నగదు రూపంలో ఇవ్వడం కష్టసాధ్యమని, ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తుండటంలో ఇవ్వకూడదని, ఒకవేళ ఇచ్చినా పోలీసుల తనిఖీల్లో చిక్కితే స్వాధీనం చేసుకుంటారని బ్యాంకు మేనేజర్ వారించారు. తమ డబ్బు తాము డ్రా చేసుకుంటామని, ఇచ్చి తీరాలంటూ వాగ్వాదానికి దిగిన ఇరువురూ ఆ మొత్తం బ్యాంకు నుంచి తీసుకున్నారు. ఇలా డ్రా చేసిన నగదును ఇరువురూ తమ కార్లలో పెట్టుకుని బయలుదేరారు. కార్లలో తనిఖీ చేయగా.. ► ఎన్నికల తనిఖీల్లో భాగంగా ఆసిఫ్‌నగర్ ఏసీపీ ఎల్.రాజావెంకట్‌రెడ్డి ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ జి.వెంకటేశ్వర్లు నేతృత్వంలోని బృందం అనేక చోట్ల వాహన తనిఖీలు చేస్తోంది. గురువారం సాయంత్రం గుడిమల్కాపూర్ రోడ్‌లోని సాయిబాబా దేవాలయం వద్ద ఈ తనిఖీలు చేపట్టారు. అటుగా వచ్చిన ఇన్నోవా, ఆమ్నీ కార్లను ఆపి తనిఖీ చేశారు. రెండింటిలోనూ కలిపి రూ.1,78,30,000 కనిపించడంతో ఈ మొత్తం స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం కేసును ఆదాయపు పన్ను శాఖకు పంపారు. వీరిద్దరూ తమ వద్ద ఉన్న అగ్రిమెంట్ ఆఫ్ సేల్, బ్యాంకు డ్రా పత్రాలు చూపించారు. ► నిబంధనల ప్రకారం రూ.2 లక్షలకు మించి నగదు రూపంలో లావాదేవీలు చేయకూడదు. దీనికి తోడు ఇది ఎన్నికల సీజన్ కావడంతో ఇంత మొత్తం తరలించకూడదు. ఈ నగదును వీరు ప్రలోభాలకు వాడకపోయినా... వీరికి భూమిని అమ్మిన వ్యక్తో లేక అతడి నుంచి తీసుకున్న మరొకరో ఇలా దుర్వినియోగం చేసే అవకాశం లేకపోలేదు. రసీదు ఉన్నప్పటికీ.. స్వాధీనం చేసుకున్న భారీ మొత్తాలను ఆదాయపు పన్ను శాఖకు అప్పగిస్తాం అని ఓ అధికారి వివరించారు. -
జప్తు చేసింది రూ.1.7 కోట్లే!
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ కలిపి మొత్తం రూ.59.93 కోట్ల నగదు, 156 కిలోల బంగారం, 454 కిలోల వెండిని స్వాధీనం చేసుకోగా... అందులో రూ.1.76 కోట్లు మాత్రమే లెక్కలు లేని నగదుగా తేల్చి జప్తు చేశామని ఆదాయపు పన్ను శాఖ హైదరాబాద్ ప్రాంత డైరెక్టర్ జనరల్ (ఇన్వెస్టిగేషన్) సంజయ్ బహదూర్ వెల్లడించారు. ఇప్పటికే రూ.10.99 కోట్ల నగదును సంబంధిత యజమానులకు అప్పగించామని, మిగిలిన నగదు విషయంలో దర్యాప్తు పురోగతిలో ఉందన్నారు. బుధవారం ఆయన ఆయకార్ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ఫిర్యాదుల స్వీకరణకు రాష్ట్రస్థాయిలో టోల్ ఫ్రీ నంబర్ 1800–425– 1785తో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ల్యాండ్‌లైన్ నంబర్ 040–234262201/ 23426202 లేదా వాట్సాప్/టెలిగ్రామ్ నంబర్ 7013711399ను సంప్రదించవచ్చని చెప్పారు. అభ్యర్థుల అఫిడవిట్ల పరిశీలన నామినేషన్లు ముగిసిన తర్వాత అభ్యర్థులు తమ అఫిడవిట్లలో తెలిపిన ఆస్తులు, అప్పుల వివరాలను ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ సహకారంతో తనిఖీ చేస్తామని డీజీ సంజయ్ బహదూర్ తెలిపారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఆరు నెలల్లోగా అభ్యర్థుల ఖర్చులపై ఈసీకి నివేదిక అందజేస్తామని పేర్కొన్నారు. ‘రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సహకారంతో బ్యాంకు ఖాతాల నుంచి రూ.10లక్షలకు పైగా నగదు ఉపసంహరణలను పరిశీలిస్తాం. వీసా కోసం ఎవరైనా బంధువుల ఖాతాల నుంచి తమ ఖాతాకి నగదు బదిలీ చేసుకుంటే వారికి మినహాయింపు ఇస్తున్నాం. వ్యాపారంలో ఎవరికైనా అసాధారణ రీతిలో భారీగా ఆదాయం పెరిగినట్టు చూపినా మూలాలను పరిశీలిస్తాం. బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయిన వెంటనే విత్‌డ్రా చేసినా పరిశీలన జరుపుతాం. శంషాబాద్, బేగంపేట విమానాశ్రయాల్లో ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్స్ ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నాం. ఇతర చిన్న విమానాశ్రయాల్లో విమానాల తనిఖీల బాధ్యత జిల్లా కలెక్టర్లదే’అని ఆయన చెప్పారు. ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఈఎస్ఎంఎస్) అనే యాప్ ద్వారా స్వా«దీనం చేసుకున్న నగదుకు సంబంధించిన లెక్కలను పరిశీలన చేస్తున్నట్టు తెలిపారు. -
తెలంగాణ ఎన్నికలు.. 11 రోజుల్లో ఎంత డబ్బు సీజ్ చేశారంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల సందర్భంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఎన్నికల కోడ్ వచ్చినప్పటి (అక్టోబర్ 9) నుంచి ఈ రోజు వరకు (శుక్రవారం) వరకు 11 రోజుల్లో తనిఖీల్లో మొత్తం రూ.286 కోట్ల 74 లక్షల 1,370 విలువ గల సొత్తు సీజ్ చేశారు. నిన్న ఒక్కరోజే తనిఖీల్లో రూ. 42 కోట్ల 93 లక్షల 5,700 విలువ గల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. గడిచిన 24 గంటల్లో రూ. 28 కోట్ల 73 లక్షల 55, 200 విలువ గల బంగారం, వెండి వజ్రాలను సీజ్ చేశారు. రూ. 8 కోట్ల 8 లక్షల 2,070 నగదును నిన్న ఒక్కరోజే సీజ్ చేయగా, కోటి 68 లక్షల 45,982 విలువ గల మద్యం సీజ్ చేశారు. చదవండి: ప్రవల్లిక ఆత్మహత్య కేసులో మరో బిగ్ ట్విస్ట్ -
ఎన్నికల వేళ: ఊరికెళుతూ బంగారం, డబ్బు తీసుకెడితే పరిస్థితి ఏంటి?
తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. దీంతో ఒక వ్యక్తి సగటున రూ.50 వేలకు మించి నగదు వెంట తీసుకెళ్లే అవకాశం ఉండదు. నిర్దేశించిన మొత్తం కంటే పైసా ఎక్కువున్నా అందుకు సంబంధించిన ఆధారాలను అధికారులకు చూపించాలి. లేకుంటే సదరు నగదును సీజ్ చేస్తారు. పక్కా ఆధారాలను చూపించినప్పుడు ఆ డబ్బును రిలీజ్ చేస్తారు. పరిమితికి మించి తీసుకెళితే ఎలాంటి పత్రాలను చూపించాలనే దానిపై స్పష్టత కావాలని ఎన్నికల అధికారిని కోరిన ఎఫ్‌జీజీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి సాక్షి, హైదరాబాద్: యాభై వేలకు పైగా డబ్బు తీసుకెళ్తున్నప్పుడు ఎలాంటి రుజువు పత్రాలు ఉండాలో తెలపాలని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ).. ఎన్నికల అధికారిని కోరింది. బంగారం ఎంత పరిమితిలో తీసుకెళ్లాలో వివరించాలని, దానికి ఎలాంటి ఆధార పత్రాలుండాలో తెలపాలని పేర్కొంది. ఈమేరకు గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఎఫ్‌జీజీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి లేఖ రాశారు. కేంద్ర ఎన్నికల సంఘం గైడ్‌లైన్స్ ప్రకారం పట్టుకున్న బంగారం, డబ్బును కమిటీతో విచారించి 48 గంటల్లో తగిన నిర్ణయం తీసుకోవాలన్నారు. కొన్ని సందర్భాల్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ప్రజలు, వ్యాపారులను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో వైన్‌షాపుల యాజమానులు డబ్బులను డిపాజిట్ చేసే క్రమంలో పట్టుకుంటున్నారని వెల్లడించారు. పండగలు, పెళ్ళిళ్ళ సీజన్లో నగదును తీసుకెళ్తారని, వంశపారంపర్యంగా వచ్చిన ఆభరణాలకు రశీదులుండవని పద్మనాభరెడ్డి అధికారి దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల నిబంధనల పేరుతో ప్రజలను, వ్యాపారులను ఇబ్బంది పెట్టొద్దని, వీటిపై పోలీసులు, కింది స్థాయి అధికారులకు తగిన సూచనలు, సలహాలివ్వాలని తెలిపారు. నేరస్తులను పట్టుకోవాలని, అమాయకులను ఇబ్బంది పెట్టొద్దని సీఈవోను కోరారు. -
తెలంగాణ: ఎన్నికల వేళ కట్టలే కట్టలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల సందర్భంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎలక్షన్ కోడ్ ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా నగదు, బంగారం, మద్యం తరలింపుపై పోలీసులు, ఎన్నికల అధికారులు నిఘా నిరంతరం కొనసాగుతోంది. తనిఖీల్లో భారీగా నగదు, మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.200 కోట్లు దాటిన పట్టుబడిన మొత్తం విలువ. నిన్న ఒక్కరోజే రూ.70 కోట్లకు పైగా విలువగల సొత్తును సీజ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియో జకవ ర్గాల పరిధిలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేర కు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు. స్థానిక పోలీ సులతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 373 ఫ్లయింగ్ స్క్వా డ్లు, 374 స్టాటిక్ సర్వైవలెన్స్ టీమ్‌లు, 95 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. -
ఒకే రోజు రూ.35 కోట్లు జప్తు
సాక్షి, హైదరాబాద్, సికింద్రాబాద్, నిజాంపేట్, రఘునాథపల్లి: రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు జరిపిన తనిఖీల్లో బుధవారం ఒకే రోజు రికార్డు స్థాయిలో మొత్తం రూ.35.52 కోట్ల విలువ చేసే నగదు, మద్యం, ఇతర వస్తువులను జప్తు చేశారు. దీంతో బుధవారం నాటికి రాష్ట్రంలో జప్తు చేసిన నగదు, ఇతర వస్తువుల మొత్తం విలువ రూ.165.81 కోట్లకు పెరిగిపోయింది. బుధవారం రూ.6.25 కోట్ల నగదును జప్తు చేయగా, మొత్తం స్వాధీనం చేసుకున్న నగదు రూ.77.87 కోట్లకు పెరిగింది. 7వ తేదీ నుంచి నుంచి ఇప్పటివరకు మొత్తం రూ.8.99 కోట్లు విలువ చేసే 59,091 లీటర్ల మద్యం, 18,088 కిలోల నల్లబెల్లం జప్తు చేశారు. రూ.3 కోట్ల విలువైన గంజాయి పట్టివేత బుధవారం రూ.3 కోట్లు విలువ చేసే 1,086 కేజీల గంజాయిని పట్టుకోగా, ఇప్పటి వరకు జప్తు చేసిన మొత్తం గంజాయి విలువ రూ.7.55 కోట్లకు పెరిగింది. కాగా ఇప్పటి వరకు జప్తు చేసిన మొత్తం బంగారం, ఇతర ఖరీదైన లోహాల విలువ రూ.62.73 కోట్లకు చేరింది. బుధవారం రూ.2.3 కోట్లు విలువ చేసే ల్యాప్‌టాప్‌లు, కుక్కర్లు, వాహనాలను జప్తు చేయగా, ఇప్పటివరకు జప్తు చేసిన ఇలాంటి వస్తువుల మొత్తం విలువ రూ.8.64 కోట్లకు చేరింది. దీంతో జప్తు చేసిన మొత్తం నగదు, ఇతర వస్తువుల విలువ రూ.165.81 కోట్లకు చేరినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, 2018లో జరిగిన రాష్ట్ర శాసనసభ సాధాణ ఎన్నికల్లో మొత్తం రూ.97 కోట్ల నగదు, రూ.34 కోట్లు విలువ చేసే ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు వికాస్‌రాజ్ తెలిపారు. గిఫ్ట్ ఆర్టికల్స్, బెడ్‌షీట్స్ స్వాధీనం హైదరాబాద్ దక్కన్, దానాపూర్–సికింద్రాబాద్ రైళ్లలో పార్శిల్ సర్వీసు ద్వారా సికింద్రాబాద్‌కు చేరుకున్న 30 భారీ కాటన్ పార్శిళ్ల స్టెయిన్లెస్ స్టీల్ గిఫ్ట్ ఆర్టికల్స్, బెడ్షీట్లను రైల్వేపోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. 26 కాటన్ పార్శిళ్లల్లో రూ.1.29 కోట్ల విలువ చేసే 2,160 కిలోల స్టెయిన్ లెస్ స్టీల్ ఆర్టికల్స్, మరో నాలుగు కాటన్ పార్శిళ్లల్లో రూ.78 వేల విలుచేసే దుప్పట్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మరో కేసులో సికింద్రాబాద్ జనరల్ బజార్‌కు చెందిన కిషోర్‌సింగ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని నుంచి 538 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. రూ. 2.25 కోట్ల విలువైన చీరల పట్టివేతబాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధి ప్రగతినగర్‌లోనిపంచవటి అపార్ట్మెంట్ ఆవరణలో ఉన్నఏపీ 16టీవీ 3280 నంబరు గల లారీలో సరుకును పరిశీలించగా భారీ మొత్తంలో చీరలు పట్టుబడ్డాయి. వీటి విలువ రూ.2,25,98,500 ఉంటుందని అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి పంచవటి అపార్ట్మెంట్లో ఓ రాజకీయపార్టీ సమావేశం జరిగిందని పోలీసుల విచారణలో తేలింది. రూ.1.37 కోట్ల బ్యాంక్ డబ్బు సీజ్ జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని కోమళ్ల టోల్ ప్లాజా వద్ద క్యూ ఆర్ కోడ్ సరిగా లేని బ్యాంకు నగదు రూ.1,37,50,000ను పోలీసులు సీజ్ చేశారు. -
తెలంగాణ: 8 రోజుల్లో ఎంత సీజ్ చేశారంటే..
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. ఎలక్షన్ కోడ్ ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా నగదు, బంగారం, మద్యం తరలింపుపై పోలీసులు, ఎన్నికల అధికారులు నిఘా నిరంతరం కొనసాగుతోంది. తనిఖీల్లో భారీగా నగదు, మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల తనిఖీలో లెక్కపత్రం లేని సొమ్ము రూ. 100 కోట్లు దాటింది. ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుండి ఈ రోజు ఉదయం వరకు పట్టుబడ్డ వాటి విలువ రూ.130 కోట్లు. పట్టుబడిన నగదు అక్టోబర్ 9 నుండి నిన్నటి వరకు సీజ్ చేసిన అమౌంట్ రూ. 71,55,58,094 నిన్న ఒక్కరోజు సీజ్ చేసిన అమౌంట్ రూ.12,58,59,177 పట్టుబడిన మద్యం నిన్న ఒక్కరోజు పట్టుబడిన మద్యం విలువ రూ.1,10,98,610 (మద్యం : 7998 లీ, 625 కిలోల నల్ల బెల్లం, 4 కిలోల అల్లం) అక్టోబర్ 9 నుండి నిన్నటి వరకు పట్టుబడిన మద్యం విలువ రూ.7,75,79,917 (మద్యం-52091 లీటర్లు, 1280 కిలోల నల్ల బెల్లం, 530 కిలోల అల్లం) మత్తు పదార్థాలు నిన్న ఒక్కరోజు పట్టుబడిన పట్టుబడిన మత్తు పదార్థాలు రూ.1,60,43,125 (560 కిలోల గంజాయి) అక్టోబర్ 9 నుండి నిన్నటి వరకు పట్టుబడిన మత్తు పదార్థాలు రూ.4,58,04,720 (1694 కిలోల గంజాయి) పట్టుబడిన బంగారం, వెండి, వాటితో చేసిన ఆభరణాలు, వస్తువులు నిన్న ఒక్కరోజు పట్టుబడ్డ వాటి విలువ రూ.4,93,88,430 (8.110 కిలోల బంగారం & 29.08 కిలోల వెండి) అక్టోబరు 9 పట్టుబడిన వాటి విలువ 40,08,44,300 (72.267 కిలోల బంగారం & 429.107 కిలోల వెండి,- 42.203 క్యారట్ల వజ్రాలు) ఉచిత వస్తువులు నిన్న ఒక్కరోజు పట్టుపడ్డ వాటి విలువ రూ.1,61,02,900 (3900 కిలోల బియ్యం వగైరా) అక్టోబర్ 9 నుండి పట్టుబడ్డ వాటి విలువ రూ.6,29,04,500 ( 43700 కిలోల బియ్యం, 627 చీరలు, 80 కుట్టు యంత్రాలు, 87 కుక్కర్లు వగైరా) మొత్తం స్వాధీనాల విలువ నిన్న ఒక్కరోజు మొత్తం స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ. 21,84,92,242 ఇప్పటివరకు మొత్తం సీజ్ చేసిన వాటి విలువ రూ. 1,30,26,91,531 చదవండి: ప్రవళిక ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ -
నల్లగొండలో తీగ లాగితే సిటీ డొంక కదిలింది!
హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో ఆదివారం చిక్కిన హవాలా గ్యాంగ్ తీగ లాగితే... హైదరాబాద్‌లోని ఉత్తర మండల కేంద్రంగా దందా చేస్తున్న సూత్రధారులు చిక్కారు. నలుగురిని అదుపుతోకి తీసుకుని, వారి నుంచి రూ.2.09 కోట్ల నగదు స్వాదీనం చేసుకున్నట్లు టాస్‌్కఫోర్స్ ఓఎస్డీ పి.రాధా కిషన్ రావు సోమవారం వెల్లడించారు. గుజరాత్‌కు చెందిన దినేష్ కుమార్, సచిన్ కుమార్ నగరానికి వలసవచ్చారు. వీరు ఉత్తరాదికి చెందిన హవాలా ముఠాలతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. వారి ఆదేశాల మేరకు సిటీలోని వివిధ ప్రాంతాలతో పాటు రాష్ట్రం, ఇతర రాష్ట్రాలకు నగదు సరఫరా చేస్తున్నారు. తమ వద్ద పని చేసే విపుల్‌కుమార్ భాయ్, అమర్ సిన్హా జాలలకు రూ.3.04 కోట్లు అప్పగించారు. తమ కారు కింది భాగంలో ప్రత్యేక అర ఏర్పాటు చేసుకున్న వీరు అందులో నగదు నింపారు. ఆ మొత్తాన్ని చెన్నై తరలిస్తుండగా.. ఆదివారం నల్లగొండ జిల్లా, దామరచర్ల మండలం, వాడపల్లి వద్ద పోలీసులకు చిక్కారు. విచారణలో సూత్రధారులు నగరంలో ఉన్నట్లు తెలిసింది. దీనిపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.సైదులు నేతృత్వంలో ఎస్సైలు బి.అశోక్‌రెడ్డి, పి.గగన్‌దీప్, జి.నవీన్‌తో కూడిన బృందం రంగంలోకి దిగింది. లోతుగా ఆరా తీయగా దినేష్ కుమార్ పాటిల్, సచిన్‌కుమార్ విష్ణుభాయ్ పాటిల్, జితేందర్ పాటిల్, శివ్‌రాజ్ నవీన్ భాయ్ మోడీ, మీట్ రాకేష్ పాటిల్, తఖోర్ నాగ్జీ ఈ హవాలా దందాలో కీలకమని తేలింది. నల్లగొండ జిల్లాలో తమ నగదు చిక్కిన విషయం తెలుసుకున్న వీరు తమ వద్ద ఉన్న నగదును బ్యాగుల్లో పెట్టి మరోప్రాంతానికి తరలించే ప్రయత్నం చేశారు. ఈ విషయం గుర్తించిన టాస్‌్కఫోర్స్ టీమ్ గాం«దీనగర్ ప్రాంతంలో నిఘా వేసింది. అటుగా వెళ్తున్న కారు, ద్విచక్ర వాహనాన్ని అడ్డుకుని తనిఖీ చేయగా రూ.2.09 కోట్లు లభించాయి. నిందితులతో పాటు నగదును తదుపరి చర్యల నిమిత్తం గాం«దీనగర్ పోలీసులకు అప్పగించారు. -
రూ. 2.47 కోట్లు పట్టివేత
సాక్షి నెట్ వర్క్: ఎన్నికల నేపథ్యంలో సరైన పత్రాలు లేకుండా, లెక్కలు చూపకుండా తరలిస్తున్న నగదును ఎక్కడికక్కడ పోలీసులు పట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో రూ. 2 కోట్ల 47 లక్షల రూపాయల మొత్తం పట్టుబడింది. పట్టుబడ్డ నగదును సీజ్ చేసి ఎన్నికల అధికారులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంగారం జేపీ సినిమాస్ వద్ద స్థానికుడు సి.మురళీ నుంచి రూ.2.76 లక్షలు స్వాదీనం చేసుకున్నారు. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో తాళ్లూరి థియేటర్ రోడ్డులో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వాహనదారుడి వద్ద నుంచి రూ.7.12 లక్షలు, మరో వ్యక్తి నుంచి రూ.5 లక్షల నగదు గుర్తించి స్వా«దీనం చేసుకున్నారు. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కళ్యాణ్‌నగర్‌లో బైక్‌పై వెళ్తున్న ముస్తఫా అలీఖాన్ అనే వ్యక్తి నుంచి రూ.5 లక్షలు స్వా«దీనం చేసుకున్నారు. ముషీరాబాద్ స్టేషన్ పరిధిలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న షేక్ అన్సార్ ఆలీ, షేక్ అహ్మద్ ఆలీ నుంచి రూ.9.5 లక్షల రూపాయల నగదు పట్టుబడింది. ఘట్కేసర్ శివారెడ్డిగూడలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న గోపాల్‌రెడ్డి నుంచి రూ. 3లక్షలు స్వాదీనం చేసుకున్నారు. అన్నోజిగూడలోని హైవేపై తనిఖీలు చేస్తున్న క్రమంలో బైక్‌పై వెళ్తున్న వెంకటాపూర్‌కు చెందిన నీరుడి లింగం నుంచి రూ.5లక్షలు స్వాదీనం చేసుకున్నారు. మేడిపల్లి ప్రాంతానికి చెందిన వేణు నంబరు ప్లేట్ లేని ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఉప్పల్ పోలీసులు తనిఖీ చేసి రూ. 6,22,500ను స్వాధీనం చేసుకున్నారు. మియాపూర్‌లోని ప్రశాంత్ నగర్‌కు చెందిన సిట్టికుంట కృష్ణాకర్రెడ్డి నుంచి రూ. 8 లక్షల 63 వేల 200 నగదును స్వాదీనం చేసుకున్నారు. చెన్నాపురం చౌరస్తా వద్ద జవహర్‌నగర్ పోలీసుల తనిఖీల్లో భాగంగా ఓ కారులో రూ.6 లక్షలు తరలిస్తుండగా వాటిని సీజ్ చేశారు. కోదాడ పట్టణంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా హుజూర్నగర్ మండలం మదావరాయినిగూడెంకు చెందిన వస్త్ర వ్యాపారి వినయ్ వద్ద రూ.10 లక్షల నగదు పట్టుబడింది. ఎల్బీనగర్లో రూ. 28,99,640 పట్టివేత ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో.. వనస్ధలిపురంకు చెందిన దినేష్ సింగ్ ఠాకూర్ వద్ద రూ.3,62,000 లక్షలు, రామంతాపూర్ కు చెందిన కాటం లెనిన్ బాబు వద్ద రూ.1.80 వేలు, ఎన్టీఆర్నగర్కు చెందిన ముఖేష్పాండే వద్ద రూ.13,58,640, వనస్ధలిపురంకు చెందిన వెదిర్ అశోక్ వద్ద రూ.3లక్షలు, కొత్తపేట నివాసి దంతూరి అరుణ్ రాజ్ వద్ద రూ.4,69,500, విజయవాడకి చెందిన కామోదుల అజయ్‌కుమార్ వద్ద రూ.2,29,500 లక్షలు దొరికినట్లు ఎల్బీనగర్ పోలీసులు తెలిపారు. నల్లగొండలో కోటిన్నర స్వాధీనం నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి పీఎస్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పాయింట్లో బి.ఎన్.రెడ్డికి చెందిన కన్నెకంటి వెంకటనారాయణ, మూరుకొండ శ్రీనివాసరావు నుంచి రూ.కోటి యాభై లక్షలు స్వాదీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలూ లేకపోవడంతోనే సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. -
బ్యాంకు లాకర్లో రూ.18 లక్షలు చెదల పాలు: లాకర్ కొత్త నిబంధనలు తెలుసా?
బ్యాంకు నిబంధనలు తెలుసుకోకుండా సురక్షితంగా ఉంటాయనుకుని బ్యాంక్ లాకర్లో పెట్టుకున్న సొమ్ము చెదల పాలు కావడం తీవ్ర విషాదాన్ని నింపింది. కష్టపడి సంపాదించిన సొమ్ము సర్వ నాశనం కావడంతో బాధిత మహిళ ఆవేదనకు అంతులేకుండా పోయింది. అల్కా పాఠక్ తన కుమార్తె పెళ్లి కోసం దాదాపు ఒకటిన్నర సంవత్సరాల పాటు రూ. 18 లక్షల నగదు, కొన్ని ఆభరణాలను లాకర్లో దాచింది. అయితే ఆర్బీఐ నిబంధలన ప్రకారం KYC ధృవీకరణ , వార్షిక లాకర్ నిర్వహణ కోసం ఆమెను బ్యాంక్ అధికారులు పిలిచినప్పుడు ఈ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.బాధిత మహిళ ట్యూషన్లు చెబుతూ,చిన్న వ్యాపారం చేస్తూ, ఒక్కో రూపాయి పొదుపు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇండియా టుడే నివేదిక ప్రకారం లాకర్లో ఉంచిన రూ. 18 లక్షలను చెదపురుగులు తినేశాయి. ఈ విషయంపై స్పందించిన బ్యాంకు సిబ్బంది ఈ ఘటనను ఉన్నతాధికారులకు ఈ విషయం తెలియజేశామని అన్నారు. అల్కా పాఠక్‌కు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. ఆర్బీఐ తాజా నిబంధనల ప్రకారం బ్యాంకు లాకర్లలో నగదు భద్రపర్చడానికి వీల్లేదు. నగలు, డాక్యుమెంట్లు మాత్రమే భద్రపర్చుకోవాలి. ఈ నేపథ్యంలో ఆమెకు ఎలాంటి న్యాయం జరుగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. (Today Gold and Silver: బంగారం నేలచూపులు, షాకిస్తున్న వెండి) లాకర్‌కు సంబంధించి తాజా నిబంధనలు బ్యాంకు లాకర్లలో నగదు నిల్వ చేయకూడదు. కేవలం నగలు, పత్రాలు వంటి విలువైన వస్తువులు నిల్వ చేసుకొనేందుకు, చట్టబద్ధమైన ప్రయోజనాల కోసమే మాత్రమే దీన్ని వినియోగించాలి. చట్టవిరుద్ధమైన ప్రమాదకర పదార్ధాలను అసలు ఉంచకూడదు. ఏదైనా అనుమానం వచ్చినప్పుడు, కస్టమర్‌పై 'తగిన చర్య' తీసుకునే హక్కు బ్యాంకులకు ఉంటుంది. అగ్నిప్రమాదం, దొంగతనం, దోపిడి, దోపిడీ, భవనం కూలిపోవడం మొదలైన వాటికి బ్యాంకుదే బాధ్యత. ఉద్యోగి మోసం చేయడం వల్ల నష్టం జరిగితే బ్యాంకు కూడా బాధ్యత వహిస్తుంది. ఇలాంటి కేసుల్లో 'సేఫ్ డిపాజిట్ లాకర్’ ప్రస్తుత వార్షిక ఫీజుకు వంద రెట్లు ఖాతాదారుడికి నష్టపరిహారంగా చెల్లించాలి. కానీ వరదలు, భూకంపాలు , ఇతర ప్రకృతి వైపరీత్యాల కారణంగా లాకర్ కంటెంట్‌కు ఏదైనా నష్టం లేదా నష్టానికి బ్యాంక్ బాధ్యత వహించదు. అలాగే లాకర్ అద్దెను మూడేళ్లపాటు చెల్లించకపోతే, కస్టమర్‌కు సమాచారం అందించి, కస్టమర్ అనుమతి తర్వాత బ్యాంక్ 'డ్యూ ప్రొసీజర్‌ను అనుసరించి' లాకర్‌ను తెరిచే అధికారం ఈ నిబంధనలు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. అలాగే ఇప్పటికే లాకర్ ఉన్న వినియోగదారులు బ్యాంకులకు కొత్త ఒప్పంద పత్రం సమర్పించాల్సి ఉంటుంది. దీనికోసం వినియోగదారుడు రూ. 200 స్టాంప్ పేపర్‌పై నోటరీ చేయించి బ్యాంకులో ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్బిఐ నిర్దేశించిన ఈ గడువు జూన్‌తో ముగిసిపోగా తాజాగా ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు దీన్ని పొడిగించింది. అంతేకాదు కొత్త నిబంధనల ప్రకారం నష్టపరిహారం పొందాలంటే గడువులోగా సెల్ఫ్ డిక్లరేషన్ పత్రాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లాకర్లలో ఉంచకూడని వస్తువులు , సెల్ఫ్ డిక్లరేషన్ కరెన్సీ నోట్లు, ఆయుధాలు, పేలుడు సామగ్రి, మాదక ద్రవ్యాలు రేడియేషన్ పరికరాలు చట్ట విరుద్ధమైన వస్తువులు ఉంచకూడదు. దీనికి సంబంధించి అక్రమ, నిషేధిత వస్తువులను లాకర్లో దాచిపెట్టనని ఖాతాదారుడు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. ప్రాథమిక నిబంధనలకు లోబడి లాకర్‌ను వినియోగిస్తానంటూ సంబంధిత ఒప్పంద పత్రంపై సంతకం చేయాలి. అలా బ్యాంకులో లాకర్ తీసుకున్న తరువాత ఈ అగ్రిమెంట్ కాపీని బ్యాంకు నుంచి తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. -
రూ.18 లక్షల నగదును చెద పురుగులు తినేశాయి
లక్నో: బ్యాంకు లాకర్లో దాచిన రూ.18 లక్షల నగదును చెద పురుగులు తినేసిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మొరాబాబాద్లో జరిగింది. మొరాదాబాద్‌కు చెందిన మహిళ అల్కా పాఠక్ తన కుమార్తె పెళ్లి కోసం పొదుపు చేసిన రూ.18 లక్షల నగదును గత ఏడాది అక్టోబర్‌లో బ్యాంకు ఆఫ్ బరోడా శాఖలోని లాకర్లో భద్రపర్చింది. లాకర్ అగ్రిమెంట్‌ను నవీకరించుకోవాలని, కేవైసీ వివరాలు ఇవ్వాలని ఇటీవల బ్యాంకు సిబ్బంది ఆమెకు ఫోన్ చేసి చెప్పారు. అల్కా పాఠక్ బ్యాంకుకు వెళ్లి తన లాకర్‌ను తెరిచి చూసు కోగా, చెత్తాచెదారమే కనిపించింది. నగదును చెదపురుగులు కొరికేసి ముక్క లు ముక్కలు చేశాయి. మొత్తం సొమ్మంతా పనికి రాకుండా పోయింది. ఈ ఘటనపై బ్యాంకు సిబ్బంది స్పందించారు. ఉన్నతాధికారులకు ఈ విషయం తెలియజేశామని అన్నారు. అల్కా పాఠక్‌కు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. ఆర్బీఐ తాజా నిబంధనల ప్రకారం.. బ్యాంకు లాకర్లలో నగదు భద్రపర్చడానికి వీల్లేదు. నగలు, డాక్యుమెంట్లు మాత్రమే భద్రపర్చుకోవాలి. -
డబ్బున్న భర్త దొరకాలన్న ఆమె కోరిక ఎలా తీరింది? అందుకోసం ఏం చేసింది?
చాలామంది యువతులు తమ అభిరుచులను నెరవేర్చుకునేందుకు ధనవంతుడైన భర్త రావాలని కోరుకుంటుంటారు. ఇదేవిధంగా అమెరికాలో నివాసం ఉంటున్న ఇజీ అనాయా తన 7 ఏళ్ల వయసులో తను ఎలాగైనా ధనవంతుడి భార్యని కావాలని నిర్ణయించుకుంది. ఇది ఆమె ముందున్న కల. ఆమె పెరిగి పెద్దయ్యాక ఈ కలను నెరవేర్చుకోవడానికి మార్గాలను అన్వేషించి, చివరికి విజయం సాధించింది. నేడు ఆమె ఒక ధనవంతునికి భార్యగా మారి, అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోంది. ప్రతిరోజూ ఉదయం ఆమె జిమ్‌కి వెళ్లే ముందు తన తన పిల్లలను అత్యంత ఖరీదైన జీపు రాంగ్లర్ రూబికాన్‌లో ఎక్కించుకుని, వారిని స్కూల్లో దింపుతుంది. ఆమె ఖరీదైన దుస్తులు కొనుగోలు చేసేందుకు తరచూ షాపింగ్ చేస్తుంటుంది. ప్రతిరోజూ విలాసవంతమైన భోజనాల కోసం ఖరీదైన రెస్టారెంట్లకు వెళ్తుంది. ఆమె తాజాగా తన వ్యక్తిగత జీవితంలోని పలు రహస్యాలను బయటపెట్టింది. బ్రూక్లిన్‌లో నివాసముంటున్న అనాయాకు ప్రస్తుతం 43 ఏళ్లు. ఆమె కేటర్స్ న్యూస్‌తో మాట్లాడుతూ ‘నేను నా జీవనశైలి గురించి నా 7 సంవత్సరాల వయస్సులోనే కలలుగన్నాను. నా చిన్నతనంలో ధనవంతులైన ఆడవాళ్లను చూసినప్పుడు ఏదో ఒక రోజు నేను కూడా వాళ్లలా మారాలి అని అనుకునేదాన్ని. ఎలాగైనా అలాంటి విలాసవంతమైన జీవితాన్ని గడపాలని భావించేదానిని. నా 33 ఏళ్ల వయస్సులో ఈ కల నెరవేరింది. నేను అనుకున్నవన్నీ నిజం అయ్యాయి’ అని తెలిపింది. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం అనయ ఒక ధనవంతుడిని తన ‘షుగర్ డాడీ’గా మార్చుకుంది. యూరోపియన్, అమెరికన్ దేశాలలో డేటింగ్లో వచ్చిన కొత్త కాన్సెప్ట్ ఇది. తమ అవసరాలను తీర్చుకునేందుకు కాలేజీకి వెళ్లే యువతులు ధనవంతులతో డేటింగ్ చేస్తారు. ఇందుకు బదులుగా వారు ఆ ధనవంతుల నుంచి డబ్బు, బహుమతులను పొందుతారు. ఈ విధంగా వచ్చిన సొమ్ముతో వారు తమ అభిరుచులను నెరవేర్చుకుంటారు. అయితే అనాయా విషయంలో ఇందుకు భిన్నంగా జరిగింది. దీని గురించి అనాయా మాట్లాడుతూ ‘నేను నా షుగర్ డాడీని 10 సంవత్సరాల క్రితం ఆన్లైన్లో కలిశాను. మేము దాదాపు ఆరు నెలల పాటు డేటింగ్ చేశాం. ఆ తర్వాత వివాహం చేసుకున్నాం. ఈ రోజు నేను అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నాను’ అని చెప్పింది. అదేవిధంగా ఆమె టిక్‌టాక్‌లో తన కథను వివరించింది. ‘నేను ఉదయాన్నే నిద్ర లేస్తాను. తరువాత మా పిల్లలను పాఠశాలకు తీసుకువెళతాను. అనంతరం నేను జిమ్‌కి వెళ్తాను. నాకు నచ్చినది ఏదైనా వెంటనే కొంటాను. ఎంత ఖరీదు అయినా వెనుకాడను. మా దగ్గర డబ్బుకు లోటు లేదు కాబట్టి నాకు ఇష్టమైనవన్నీ కొనుక్కోవచ్చు. మేము ప్రతి వారాంతంలో పారిస్ లాంటి విలాసవంతమైన ప్రదేశాలలో గడుపుతాం. నేను పుట్టుకతో ధనవంతురాలిని కాదు. పేద కుటుంబంలో పుట్టారు. నాకు కార్పొరేట్ ప్రపంచానికి చెందిన కొందరి నుండి సాయం లభించింది. దీంతో నేను అన్ని విషయాల్లోనూ అభివృద్ధి చెందాను. అయితే నేను దీని కోసం నేను నా స్నేహితులకు దూరం కావాల్సి వచ్చింది. నేను మాన్హాటన్కు వెళ్లి, కార్పొరేట్ ప్రపంచంలో పని చేయడం మొదలుపెట్టాను. స్వచ్ఛంద కార్యక్రమాలకు, ఇతర కార్యక్రమాలకు వెళ్లాను. అప్పుడే నేను ఒక వ్యక్తిని కలుసుకున్నాను అతనిని నా ‘షుగర్ డాడీ’గా మార్చుకున్నాను. మనం ఎలా జీవించాలనుకుంటున్నామో, అలా మనల్ని మనమే నిలబెట్టుకోవాలి’ అని తెలిపింది అనాయా. ఇది కూడా చదవండి: గాంధీ హత్య కుట్రను వంటవాడు ఎలా భగ్నం చేశాడు? -
ఛత్తీస్‌గఢ్‌లో డబ్బు కట్టలతో కాంగ్రెస్ ఎమ్మెల్యే.. బీజేపీ ఫైర్..
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే డబ్బు కట్టల ముందు కూర్చున్న వీడియో రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. చంద్రాపూర్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే రామ్ కుమార్ యాదవ్ డబ్బు కట్టల ముందే కూర్చున్నారు. దీనిపై రాష్ట్ర బీజేపీ మండిపడింది. అవినీతి మయంగా రాష్ట్ర ప్రభుత్వం మారిపోయిందనడానికి ఇదే నిదర్శనమని ఆరోపించింది. कांग्रेस विधायक जी के सामने रखे नोटों की गड्डी वाले इस वीडियो को स्वीकार करेगी या वीडियो पर कोई संदेह है तो जाँच के लिये CBI को सौंपने का साहस दिखायेगी?? या फिर कोयला वाले वीडियो की तरह मेरे ऊपर FIR दर्ज करायेगी?? ये हैं कांग्रेस के छत्तीसगढ़ में चंद्रपुर के विधायक रामकुमार… pic.twitter.com/HGKSrHXTEm — OP Choudhary (@OPChoudhary_Ind) September 17, 2023 ఛత్తీస్‌గఢ్ బీజేపీ జనరల్ సెక్రటరీ ఓపీ చౌదరి ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో రామ్ కుమార్ చౌదరి బెడ్‌పై కూర్చున్నారు. ఇందులో ఆయన ముందే డబ్బుల కట్టలు ఉన్నాయి. వాటి పక్కనే మరో వ్యక్తి కూర్చుని ఉన్నారు. ఇది కాస్త బయటకు రావడంతో రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. చంద్రపూర్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే రామ్ కుమార్ పేదవానిగా తనను తాను చెప్పుకున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ఉన్న ఇంట్లోనే ఉంటున్నట్లు కూడా పేర్కొన్నారు. తన తండ్రి ఇప్పటికీ పశువుల కాపరేనని పలుమార్లు అన్నారు. కానీ ప్రస్తుతం డబ్బుల కట్టలు వెలుగులోకి రావడం వివాదాస్పదంగా మారింది. తనపై బురదజల్లేందుకు ఆ వీడియోను సృష్టించారని ఎమ్మెల్యే రామ్ కుమార్ చౌదరి ఆరోపించారు. ఇదీ చదవండి: ఒడిశాను వణికిస్తున్న స్క్రబ్ టైఫస్ -
ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటే కారుణ్య నియామకం వర్తించదు
సాక్షి, హైదరాబాద్: సర్వీ సులో ఉన్న ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటే ఆ ఉద్యోగి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందే అర్హత లేదని ఆర్టీసీ తేల్చి చెప్పింది. ఆయా కేసుల్లో మానిటరీ బెనిఫిట్ కింద కుటుంబ సభ్యులకు నగదు మాత్రమే అందిస్తామని స్పష్టం చేసింది. ఉద్యోగి సర్విసులో ఉండగా సహజ మరణం పొందితేనే కారుణ్య నియామకం (బ్రెడ్ విన్నర్ స్కీం) కింద కుటుంబ సభ్యుల్లో అర్హులైన ఒకరికి ఉద్యోగం ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు 2008లో జారీ చేసిన సర్క్యులర్‌ను ఉటంకిస్తూ కొత్త సర్క్యులర్‌ను జారీ చేసింది. అలాగే స్టాఫ్ బెనెవలెంట్ ట్రస్ట్ (ఎస్బీటీ) పథకం కింద చనిపోయిన ఉద్యోగుల కు అందించే ఎక్స్‌గ్రేషియాను సైతం సర్విసులో ఉండగా ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగుల కుటుంబాలకు అందించడం సాధ్యం కాదని ఆ సర్క్యులర్‌లో ఆర్టీసీ పునరుద్ఘాటించింది. ఇవి మినహా ఎస్ఆర్బీఎస్, ఈడీఎల్‌ఐఎఫ్, ఇతర బెనిఫిట్స్‌ను సెటిల్మెంట్ రూపంలో అందించనున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేస్తున్న తరుణంలో పాత సర్క్యులర్లను కోట్ చేస్తూ ఆర్టీసీ కొత్తగా సర్క్యులర్ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. నాడు అనుమతించి... సాధారణంగా ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో కారుణ్య నియామకానికి వెసులుబాటు ఉంది. ఆర్టీసీలో కూడా అది అమలులో ఉంది. కొన్నేళ్లుగా ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి బాగో లేకపోవటంతోపాటు ఖాళీలు లేవన్న సాకుతో కారుణ్య నియామకాలను సంస్థ పెండింగ్‌లో పెట్టింది. కానీ ఆ వెసులుబాటు మాత్రం అమలులోనే ఉంది. 2019లో దీర్ఘకాలం ఆర్టీసీ సమ్మె జరిగిన సమయంలో కొందరు ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురై ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారి కుటుంబ సభ్యులకు అప్పట్లో కారుణ్య నియామకాలకు సంస్థ అనుమతించింది. కానీ ఇప్పుడు సాధ్యం కాదని స్పష్టం చేస్తూ ఆర్టీసీ సర్క్యులర్ జారీ చేయడం గమనార్హం. ఎస్బీటీ పథకం ఉన్నా... ఆర్టీసీ ఉద్యోగులు ఎస్బీటీ పథకం కింద ప్రతినెలా వేతనంలో రూ.100 చొప్పున ఆ పథకం ట్రస్టుకు జమ చేస్తారు. ట్రస్టును ఆర్టీసీనే నిర్వహిస్తుంది. ఉద్యోగులు పదవీ విరమణ పొందినప్పుడు వారు నెలనెలా చెల్లిస్తూ పోగు చేసిన మొత్తాన్ని వడ్డీతో కలిపి సంస్థ చెల్లిస్తుంది. ఒకవేళ ఉద్యోగి సర్వీసు పూర్తి కాకుండానే మరణిస్తే ఆ మొత్తంతోపాటు రూ. లక్షన్నర ఎక్స్‌గ్రేషియా కూడా చెల్లిస్తుంది. ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించడం సాధ్యం కాదని ఆర్టీసీ స్పష్టం చేసింది. ఇందుకు 1983లో జారీ చేసిన సర్క్యులర్‌ను కోట్ చేసింది. -
అక్కాచెల్లెళ్లకు క్యాష్ గిఫ్ట్ ఇస్తున్నారా.. ఐటీ రూల్స్ ఏంటో తెలుసా?
తోబుట్టువుల మధ్య అపురూపమైన బంధానికి అపూర్వ ప్రతిక రక్షా బంధన్. సోదరుల క్షేమాన్ని కాంక్షిస్తూ తమ బంధం జన్మ జన్మలకూ కొనసాగాలని కోరుతూ అక్కాచెల్లెళ్లు రాఖీలు కడతారు. ఇక తమ సోదరీమణులకు ఐశ్వర్యం, సౌభాగ్యాలు కలగాలంటూ అన్నాతమ్ముళ్లు తమ శక్తిమేరకు బహుమతులు ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. ఇదీ చదవండి: ఈపీఎఫ్‌వో అలర్ట్: వివరాల అప్డేషన్కు కొత్త మార్గదర్శకాలు బహుమతులు లేకుండా రాఖీ పండుగ అసంపూర్ణంగా ఉంటుంది. అయితే కాలంతో పాటు ట్రెండ్స్ మారుతున్నాయి. కానీ స్థిరంగా ఉన్న ఒక విషయం కొనసాగుతోంది. అదే సోదరులు తమ సోదరీమణులకు బహుమతిగా డబ్బు ఇవ్వడం. కాబట్టి ఈ రక్షా బంధన్ సందర్భంగా సోదరికి ఎంత డబ్బు బహుమతిగా ఇవ్వవచ్చు.. దీనిపై ట్యాక్స్ ఉంటుందా.. ఆదాయపు పన్ను శాఖ నిబంధనలు ఎలా ఉన్నాయి.. నిపుణులు ఏం చెబుతున్నారు...? తెలుసుకుందాం. రూ.2 లక్షలకు మించితే.. ఆదాయపు పన్ను చట్టాలు లేదా మరేవైనా ఇతర చట్టాల ప్రకారం ఒక వ్యక్తి మరొక వ్యక్తికి బహుమతి ఇవ్వడానికి ఎటువంటి పరిమితి లేదు . అది నగదు బహుమతికైనా సరే ఎలాంటి పరిమితి ఉండదు. అయితే రూ. 2 లక్షలకు మించి నగదు ఇచ్చిపుచ్చుకోవడానికి వీలు లేదు. కాబట్టి రూ.2లక్షలకు మించి బహుమతి ఇచ్చేవారు నగదు రూపంలో కాకుండా బ్యాంకింగ్ మార్గాల ద్వారా ఇవ్వవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ట్యాక్స్ ఉంటుందా? ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 56(2)(x) ప్రకారం బహుమతులు గ్రహీతల చేతిలోకి వెళ్లాక పన్ను ఉంటుంది. అయితే కొంతమంది నిర్దిష్ట బంధువుల నుంచి వచ్చే బహుమతులకు మాత్రం ఈ నిబంధనకు మినహాయింపు ఉంటుంది. ఇక షేర్ల విషయానికి వస్తే పన్నుల ప్రభావం లేకుండా షేర్లను సోదరికి బదిలీ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీని ప్రకారం.. అక్కాచెల్లెళ్లకు క్యాష్ గిఫ్ట్ ఇస్తే.. ఇచ్చేవారికి కానీ, తీసుకునేవారికి కానీ ఎలాంటి ట్యాక్స్ పడదు అని పేర్కొంటున్నారు. -
బీబీసీ యజమాని ఎవరు? సంస్థకు సొమ్ము ఎలా వస్తుంది?
గత ఫిబ్రవరిలో ఆదాయపు పన్ను శాఖ బృందం ‘సర్వే’ కోసం బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) కార్యాలయాలను పరిశీలించింది. ఢిల్లీ, ముంబైలలోని బీబీసీ కార్యాలయాల్లో పరిశీలనలు మాత్రమే జరుగుతున్నాయని, సోదాలు చేయడం లేదని (సీబీడీటీ )సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ సీనియర్ అధికారి ఒకరు నాడు స్పష్టం చేశారు. అయితే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అవకతవకలను తనిఖీ చేసేందుకు పన్ను అధికారులు పలు పత్రాలను పరిశీలిస్తున్నట్లు అప్పట్లో మరో అధికారి తెలిపారు. ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్' అనే డాక్యుమెంటరీని బీబీసీ ప్రసారం చేసిన కొన్ని వారాల తర్వాత ఐటీ అధికారులు ఈ చర్యలు చేపట్టడం విశేషం. అలాగే భారత ప్రభుత్వం బీబీసీ వలసవాద మనస్తత్వం కలిగి ఉందని ఆరోపించింది. యజమాని ఎవరు? బీబీసీ 1922, అక్టోబరు 18 న ఒక ప్రైవేట్ కంపెనీగా ఆవిర్భవించింది. అప్పట్లో దీనిని బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీగా పిలిచేవారు. ప్రారంభంలో ఈ వ్యాపారంలో తనను తాను నిరూపించుకోవడానికి బీబీసీ ఎన్నో కష్టాలు పడింది. 1926 సార్వత్రిక సమ్మె సమయంలో విస్తృతమైన కవరేజ్ అందించి, బీబీసీ బ్రిటిష్ ప్రజల ఆదరణను చూరగొంది. అదే సంవత్సరంలో, పార్లమెంటరీ కమిటీ సిఫార్సు ద్వారా బీబీసీ ప్రైవేట్ కంపెనీ నుండి పబ్లిక్ కార్పొరేషన్‌గా మార్పుచెందింది. దీనితో కంపెనీ.. పార్లమెంటుకు జవాబుదారీతనం కలిగివుండాలని నిర్ణయించారు. కానీ బీబీసీ దాని పని తీరు విషయంలో స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. బీబీసీని జాన్ రీత్ (1889–1971) స్థాపించారు. 1922లో బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీగా సంస్థను స్థాపించినప్పుడు దాని మొదటి జనరల్ మేనేజర్‌గా, 1927లో పబ్లిక్ కార్పొరేషన్‌గా మారినప్పుడు దాని మొదటి డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరించారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో నాజీ ప్రచార సాధనాలను ఎదుర్కొనేందుకు బ్రిటిష్ ప్రభుత్వం మరో సమాచార మంత్రిత్వ శాఖను సృష్టించింది. దీనికి జాన్ రీత్ను సమాచార మంత్రిగా నియమించింది. ఐరోపాలో హిట్లర్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయడం, బ్రిటిష్ ప్రజలను మానసికంగా యుద్ధానికి సిద్ధం చేయడం అతని పనిగా ఉండేది. డబ్బు ఎక్కడ నుండి వస్తుంది? బీబీసికి వచ్చే నిధులలో ఎక్కువ భాగం వార్షిక టెలివిజన్ ఫీజు ద్వారా వస్తుంది. ఇదే కాకుండా, బ్రిటన్ పార్లమెంట్ కూడా బీబీసీకి గ్రాంట్ల ద్వారా నిధులు సమకూరుస్తుంది. బీబీసీకి ఇతర ఆదాయ వనరులు బీబీసీ స్టూడియోస్, బీబీసీ స్టూడియోవర్క్స్. భారతదేశంలో ఎప్పుడు ప్రారంభమైంది? బీబీసీ భారతదేశంలో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో 1940 మే 11న ప్రారంభమైంది. విశేషమేమిటంటే, ఈ తేదీన విన్స్టన్ చర్చిల్ బ్రిటన్ ప్రధానమంత్రి అయ్యారు. భారతదేశంలో బీబీసీని ప్రారంభించడం వెనక ఉద్దేశ్యం భారత ఉపఖండంలోని సైనికులకు వార్తలను అందించడమే. బీబీసీ హిందీ డాట్ కామ్ 2001లో ప్రారంభమమైంది. ఇది కూడా చదవండి: అమేథీతో గాంధీ- నెహ్రూ కుటుంబానికున్న సంబంధం ఏమిటి? -
గిరిజన మహిళపై థర్డ్‌డిగ్రీ..
నాగోలు: ఒంటరిగా ఉన్న ఓ గిరిజన మహిళను అనుమానించారు. అంతటితో ఆగకుండా బలవంతంగా అర్ధరాత్రివేళ స్టేషన్‌కు తీసుకెళ్లారు. రాత్రంతా స్టేషన్లో నిర్బంధించి లాఠీలు, బూటు కాళ్లతో తంతూ చిత్రహింసలకు గురి చేశారు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరగ్గా, ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం పడమటిపల్లితండాకు చెందిన వడిడ్త్యా లక్ష్మి, భర్త శ్రీను చనిపోవడంతో ముగ్గురు పిల్లలతో మీర్‌పేటలోని నందిహిల్స్‌కు వచ్చింది. స్థానికంగా ఇళ్లలో పనికి కుదిరి ఇక్కడే నివాసముంటోంది. ఇటీవల లక్ష్మి పెద్ద కూతురుకు పెళ్లి సంబంధం కుదిరింది. ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. ఈనెల 30న పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. పెళ్లి ఖర్చుల కోసమని దేవరకొండలోని బంధువుల ఇంటికి ఈ నెల 15వ తేదీన వెళ్లింది. వారి వద్ద రూ.3లక్షల నగదు అప్పుగా తీసుకుంది. అక్కడి నుంచి ఎల్బీనగర్కు బస్సులో వచ్చింది. అప్పటికే అర్ధరాత్రి అయ్యింది. మీర్‌పేటకు వెళ్లేందుకు ఆటోలు, బస్సులు అందుబాటులో లేకపోవడంతో ఎల్బీనగర్ చౌరస్తాలో రోడ్డు పక్కన లక్ష్మి నిలబడింది. అదే సమయంలో పెట్రోలింగ్ వాహనం ఆమె వద్దకు వచ్చి ఆగింది. ఎక్కడకు వెళుతున్నావు...చేతిలో డబ్బు ఎక్కడిదని పోలీసులు గట్టిగా ప్రశ్నించారు. ఊరి నుంచి వస్తున్నానని, ఆటో కోసం ఎదురుచూస్తున్నానని చెప్పినా పోలీసులు వినలేదు. కూతురు పెళ్లికార్డు చూపించినా పట్టించుకోలేదు. అర్ధరాత్రి వేళ లక్ష్మిని ఎల్బీనగర్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ క్రమంలో లక్ష్మికి పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులకే ఎదురు మాట్లాడతావా అంటూ లక్ష్మిపై హెడ్ కానిస్టేబుల్ శివశంకర్, మహిళా కానిస్టేబుల్ సుమలత, మరో ఇద్దరు సిబ్బంది లాఠీలు, బూటు కాళ్లతో దాడి చేశారు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం ఉదయం ఆటోలో పోలీసులు లక్ష్మిని ఇంటికి పంపించారు. లక్ష్మి నడవలేని పరిస్థితిని గమనించిన ఆమె కుటుంబసభ్యులు స్థానిక వైద్యుడిని ఇంటికి పిలిపించి వైద్యం చేయించారు. పూజ ఫిర్యాదు.. పోలీసులపై అట్రాసిటీ కేసు లక్ష్మి కూతురు వడ్త్యా పూజ ఫిర్యాదు మేరకు దాడి చేసిన పోలీసులపై ఎల్బీనగర్ స్టేషన్లో అట్రాసిటీ కేసు నమోదైంది. పూజ ఫిర్యాదు ప్రకారం...ఈనెల 15వ తేదీన తల్లి లక్ష్మి తన పెళ్లికి కోసం రూ. 3లక్షల అప్పుగా తేవడానికి మేనమామ చంద్రుని వద్దకు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. సాయంత్రం వరకు నేనే నా తమ్ముడు అమ్మకోసం ఎదురుచూశాం. కానీ ఆమె రాలేదు. 16వ తేదీన ఎల్బీనగర్ స్టేషన్ అమ్మ ఉన్నట్టు సమాచారం తెలిసి కొంతమందితో కలిసి వెళ్లాను. అమ్మ గురించి పోలీసులను అడిగితే తనను కులం పేరుతో దూషించారని, తల్లిపై పోలీసులు తొడలు, మోకాలు ఇతర శరీర భాగాలపై తీవ్రంగా కొట్టి గాయాలు చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొంది. తన తల్లి వద్ద ఉన్న రూ. 3లక్షల నగదు, బంగారు చెవి రింగులు కూడా కనిపించడం లేదని ఆ ఫిర్యాదులో వివరించింది. ఈ మేరకు ఎల్బీనగర్ పోలీసులు 354, 324, 379,సెక్షన్3(1) (ఆర్)(ఎస్), 3(2)(వీఏ), అట్రాసిటీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. లక్ష్మికి సొంత ఖర్చులతో వైద్యం చేయిస్తా.. గాయపడిన లక్ష్మి వైద్య ఖర్చులు మొత్తం తానే భరిస్తానని ఎల్బీనగర్ ఏసీపీ జానకిరెడ్డి తెలిపారు. లక్ష్మిని వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించామన్నారు. డబ్బు, ఆభరణాలు లాక్కొన్నారు ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి, రాత్రంతా అక్కడే ఉంచి చితకబాదారు. తన చేతిలోని నగదు, మూడున్నర తులాల బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్ పోలీసులు బలవంతంగా తీసుకున్నారు. ఈ క్రమంలో వారితో వాగ్వాదం జరిగింది. నాపై దాడి చేసిన ఎస్ఐపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. – బాధితురాలు లక్ష్మి అర్ధరాత్రి ముఠాగా సంచరిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ముఠాగా ఏర్పడి అర్ధరాత్రి ఎల్బీనగర్ చౌరస్తాలో సంచరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు పెట్రోలింగ్ సమయంలో పోలీసులు గుర్తించారు. దీంతో వారిపై ఐపీసీ సెక్షన్ 290 కింద కేసు నమోదు చేసి ఈనెల 16న రిమాండ్‌కు తరలించారు. అయితే మర్నాడు ఉదయం లక్ష్మి మినహా మిగిలిన నిందితులు జరిమానా చెల్లించారని ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి తెలిపారు. – ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి ఇద్దరి సస్పెన్షన్.. జరిగిన సంఘటనపై ప్రాథమిక విచారణ చేసిన రాచకొండ పోలీస్ కమిషనర్ దేవేంద్రసింగ్ చౌహాన్ ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్‌కానిస్టేబుల్ శివశంకర్, మహిళా కానిస్టేబుల్ సుమలతలను సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేస్తామని, ఇతరుల పాత్ర రుజువైతే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ తెలిపారు. గవర్నర్, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం: మాజీ మంత్రి రవీంద్రనాయక్ గిరిజన సంఘాల నేతలు, ఇతర ప్రజాసంఘాల నాయకులు గురువారం బాధితురాలు లక్ష్మితో కలిసి ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రవీంద్ర నాయక్ మాట్లాడుతూ జరిగిన ఘటనపై గవర్నర్, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు. దాడి చేసిన పోలీసులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గణేష్, ప్రధానకార్యదర్శి బాలు, ఆల్ ఇండియా బంజారాసేవా సంఘం రాష్ట్ర అధ్య క్షుడు రాజు, గిరిజన విద్యార్థి నేత వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంక్ ఖాతాల్లోంచి డబ్బునలా కాజేస్తున్నారు!
కడప అర్బన్: ఆధార్ కార్డుకు అనుసంధానమైన వేలి ముద్రలను డూప్లికేట్ చేసి వారి బ్యాంక్ అకౌంట్లలోంచి నగదు కాజేస్తున్న ఐదుగురు సైబర్ నేరగాళ్లను వైఎస్సార్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ప్రకాశం జిల్లాకు చెందిన నల్లగళ్ల వెంకటే‹Ù, గుంటూరుకు చెందిన మాల్యాద్రి మల్లఅజయ్, గంటా కళ్యాణ్, పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన షేక్ జానీ, పసుపులేటి గోపి ఉన్నారు. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ బుధవారం మీడియాకు వివరాలను వెల్లడించారు. గతేడాది డిసెంబర్లో కడప నగరానికి చెందిన శంకరయ్య తన ఎస్బీఐ బ్యాంకు ఖాతా నుంచి రూ.5,500 విత్ డ్రా అయినట్టు కడప సైబర్ క్రైమ్ ఆఫీస్‌లో ఫిర్యాదు చేయడంతో నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఈ ఫిర్యాదు నమోదైంది. కాగా, ఈ నెల 15న ఓ వ్యక్తి వాట్సాప్, ఇంటర్నెట్ కాల్స్ ద్వారా శంకరయ్యకు ఫోన్ చేసి ‘నువ్వు ఫిర్యాదు చేయడం వల్ల నా అకౌంట్ ఫ్రీజ్ చేశారు. రేపటిలోగా నా అకౌంట్‌ను అన్‌ఫ్రీజ్ చేయించకుంటే చంపేస్తాం’ అంటూ బెదిరించాడు. దీనిపై బాధితుడు కడప చిన్నచౌక్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వైఎస్సార్ జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ తుషార్‌డూడీ ఆధ్వర్యంలో స్పెషల్ టీంలను నియమించి విచారణ చేపట్టారు. అలా వారి ఖాతాలకు నగదు బదిలీ ఈ నేరం ఆధార్ ఎనేబుల్ సిస్టం(ఏఈపీఎస్)ద్వారా ఫిర్యాది బయోమెట్రిక్(వేలిముద్రలు)లను నకిలీవి సృష్టించి వాటి సాయంతో కస్టమర్ సరీ్వస్ పాయింట్స్(బిజినెస్ కరస్పాండెంట్స్)లోని బయోమెట్రిక్ డివైస్‌లో స్కాన్ చేసి ఫిర్యాది ఆధార్ కార్డు లింక్ చేసి ఉన్న బ్యాంకు అకౌంట్ నుంచి రూ.5,500 విత్‌డ్రా చేసినట్టు పోలీసులు గుర్తించారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నగదు విత్‌డ్రా జరిగిన ప్రదేశం కడప పట్టణంలో ఉందని గుర్తించారు. అలాగే అనుమానితుల ఫోన్ నంబర్లను ట్రాక్ చేసి కడప ఓల్డ్ బైపాస్ వద్ద నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో వెంకటేష్(బిజినెస్ కరెస్పాండెంట్) బ్లాక్ మార్కెట్ ద్వారా ఏపీ, తెలంగాణ ప్రజల వేలిముద్రలు, ఆధార్‌కార్డులు, బ్యాంక్ ఖాతాల వివరాలను సేకరించి, నిందితుల సాయంతో బాధితుల బ్యాంక్ ఖాతాల నుంచి నగదును తమ ఖాతాలకు బదిలీ చేసేవారు. నిందితుల నుంచి కారు, నాలుగు సెల్ఫోన్లు, నేరాలకు ఉపయోగించే డివైస్‌లను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. నిందితులపై 4 ఎఫ్ఐఆర్లు, 412(నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్) ఎన్సీఆర్పీ పిటిషన్లు నమోదైనట్లు, దేశంలో మొత్తం 416 మంది బాధితులను గుర్తించారు. -
లాటరీలో రూ. 18 కోట్ల జాక్‌పాట్.. ఒక్క ఈమెయిల్‌తో జీవితాలు తారుమారు
ఆ జంటకు లాటరీ తగలడంతో వారిద్దరూ ఆ సొమ్మును ఇష్టం వచ్చినట్లు ఖర్చుచేస్తూ, ఎంజాయ్ చేశారు. ఇంతలో వారికి వచ్చిన ఒక ఈమెయిల్ వారి జీవితాలను దుర్భరం చేసింది. తమకు లాటరీలో £1.8 మిలియన్(18 కోట్లు) వచ్చిన విషయం, ఆ తరువాత భర్తకు వచ్చిన ఒక ఈమెయిల్ తమను ఎలా విడదీసినదీ ఆ మహిళ తెలిపింది. భారీ మొత్తంతో ఇల్లు కొనుగోలు రోజర్, లారా గ్రిఫిథ్స్లు 2005లో నేషనల్ లాటరీలో జాక్‌పాట్ కొట్టారు. ఆ సొమ్ములోని కొంత మొత్తంతో వారు ఒక ఇంటిని కొనుగోలు చేశారు. ఎంజాయ్ చేసేందుకు మిగిలిన మొత్తం ఖర్చు చేశారు. దీంతో వెనక్కి తిరిగిచూసుకుంటే తమ దగ్గర అస్సలు డబ్బులు మిగలలేదని లారా తెలిపింది. చాలామంది మాదిరిగానే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లయ్యిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దుబాయ్‌లో ఎంజాయ్ లాటరీ సొమ్ము అందిన కొన్ని వారాలకు రోజర్£18,000తో సాఫ్ట్-టాప్ ఆడీ కొనుగోలు చేశాడు. లారా తాము దుబాయ్‌లో ఎంజాయ్ చేసేందుకు, బిజినెస్ క్లాస్‌లో విమాన ప్రయాణం కోసం టిక్కెట్లు కొనుగోలు చేసింది. ఫైవ్‌స్టార్ హోటల్లో బస చేసేందుకు ఏర్పాట్లు చేసింది. రోజర్ మాట్లాడుతూ తాము 10 రోజుల్లో £15,000 ఖర్చు చేశామని తెలిపారు. ఆమెకు హ్యాండ్ బ్యాగ్లన్నా, షాపింగ్అన్నా ఇష్టమని అన్నారు. దంతాలను తెల్లగా మార్చుకునేందుకు.. డైలీస్టార్ తెలిపిన వివరాల ప్రకారం రోజర్ తన దంతాలను తెల్లగా మార్చుకునేందుకు ఖర్చు చేశాడు. కూల్‌గా కనిపించేందుకు డిజైనర్ దుస్తులు కొనుగోలు చేశారు. బొటెక్స్ కోసం ఒకసారి £300 ఖర్చు చేశాడు. టాటూల కోసం £500కు మించిన మొత్తాన్ని ఖర్చు చేశాడు. లాటరీ గెలుచుకున్న ఎనిమిదేళ్ల తరువాత అంటే 2013 నాటికల్లా వారి దగ్గరున్న డబ్బంతా ఖర్చయిపోయింది. వారి అనుబంధం కూడా ముగిసింది. రోజూ విలాసవంతమైన పార్టీలు 14 ఏళ్ల పాటు దాంపత్య జీవితం గడిపాక వారు విడిపోయారు. తమ ఆర్థిక దుస్థితికి కారణం నువ్వంటే నువ్వని పరస్పరం ఆరోపించుకున్నారు. లారా మాట్లాడుతూ లాటరీ గెలుచుకున్న తరుణంలో తమ మధ్య వివాదాలు లేవన్నారు. తాము రోజూ పార్టీలు చేసుకునేవారమన్నారు. ఆనందంగా కాలం గడిపామన్నారు. అయితే డబ్బును ఎలా కాపాడుకోవాలో తమకు తెలియలేదన్నారు. బూడిదైన భవనం.. భారీగా నష్టం తాము లాటరీ సొమ్ములోని £670,000తో నార్త్ యార్క్‌షైర్‌లో కొనుగోలు చేసిన భవనం 2010లో కాలి బూడిదయ్యిందన్నారు. తాము ఆ ఇంటికి తక్కువ మొత్తానికే బీమా చేయించామన్నారు. ఆ సొమ్ము వచ్చినప్పుడు తన భర్తకు వచ్చిన ఒక ఈమెయిల్ తాను చూశానని లారా తెలిపింది. దానిలో భర్త అతని స్నేహితుడిని మరో యువతి ఫోన్ నంబర్ అడిగినట్లు ఉందన్నారు. అదే తమ జీవితాలను దుర్భరం చేసిందన్నారు. తాను తన భర్త అతని స్నేహితుడి మధ్య జరిగిన సంభాషణను గమనించానని లారా పేర్కొన్నారు. తన భర్త ఒక యువతి ఫోన్ నంబర్ అడిగిప్పుడు అతని స్నేహితుడు ఆమెతో ఎంజాయ్ చేసేందుకు భర్తకు సలహాలు ఇచ్చాడని లారా తెలిపింది. దూరమైన భర్త దీనిని తాను గమనించానని తెలిసినా తన భర్త తనను క్షమాపణలు కోరలేదని, పైగా అతని బ్యాగు సద్దుకుని, తనపై అరుస్తూ, తనను నిందిస్తూ వెళ్లిపోయాడని లారా తెలిపింది. తరువాత ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడని, ఫేస్బుక్లో అతనిని సంప్రదించేందుకు ప్రయత్నించగా తనను బ్లాక్చేశాడని లారా తెలిపింది. వారం రోజుల పాటు అతనిని ద్వేషించానని, ఆ తరువాత అతనిని మనసులోనే క్షమించేశానని, ఎందుంటే అతనిని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానని లారా పేర్కొంది. ఇది కూడా చదవండి:‘గే లవ్ ఫాంటసీలో ఒబామా’.. మాజీ ప్రియురాలి లేఖలో మరిన్ని వివరాలు.. -
పెళ్లి డబ్బులకు కిడ్నాప్ డ్రామా.. రూ. 10 లక్షల కోసం తండ్రికి వీడియో బెదిరింపు
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రెండు రోజుల క్రితం కిడ్నాప్ అయిన విద్యార్థిని ఉదంతంలో అసలు నిజం వెలుగు చూసింది. నిజానికి ఆ యువతి కిడ్నాప్‌కు గురి కాలేదని తేలింది. ఆమె డబ్బుల కోసం స్వయంగా ఫేక్ కిడ్నాప్ డ్రామా ఆడిందని వెల్లడయ్యింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం విద్యార్థి హన్సికా వర్మ ఇంజినీరింగ్ ఎంట్రన్ పాసయ్యింది. అడ్మిషన్ కోసం ఆమె రూర్కీలోని ఇంజినీరింగ్ కాలేజీకి వెళ్లాల్సి ఉంది. ఇంతలోనే ఆమె ఇంటి నుంచి మాయమయ్యింది. రూ. 10 లక్షలు డిమాండ్ తరువాత ఆమె తండ్రి మొబైల్ ఫోనుకు ఒక వాట్సాప్ వీడియో మెసేజ్ వచ్చింది. దానిలో హన్సిక తాళ్లతో బందీగా కనిపిస్తోంది. ఈ వీడియోను పంపిన ఆగంతకులు హన్సిక తండ్రిని రూ. 10 లక్షలు డిమాండ్ చేశారు. అయితే హన్నిక తండ్రి ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేశారు. తక్షణం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే ఈ కిడ్నాప్ డ్రామా వెనుక అసలు సంగతి వెల్లడి కావడంతో అంతా ఆశ్చర్యపోయారు. హన్సిక తన ప్రియుడిని రహస్యంగా ప్రేమ వివాహం చేసుకునేందుకే ఈ డ్రామా ఆడిందని పోలీసుల దర్యాప్తుల్లో వెల్లడయ్యింది. ఆమె దగ్గర డబ్బులు లేకపోవడంతో ఆ ప్రేమ జంట ఫేక్ కిడ్నాపింగ్‌కు ప్లాన్ చేశారు. దాని ప్రకారమే హన్నిక ఒక బెదిరింపు వీడియోను తండ్రికి పంపించి, డబ్బులు డిమాండ్ చేసింది. పెళ్లికి దారితీసిన ఇన్స్టాగ్రామ్ ప్రేమ కాన్పూర్ జాయింట్ పొలీస్ కమిషనర్ ఆనంద్ ప్రకాష్ తివారీ ఆధ్వర్యంలో హన్సికను ఆమె ప్రియుడు రాజ్ సింగ్‌ను అరెస్టు చేశారు. వారి నుంచి వారికి సంబంధించిన మ్యారేజ్ సర్టిఫికెట్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హన్నిక, రాజ్‌లు మే 22న వివాహం చేసుకుని, దానిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వెల్లడయ్యింది. ఈ ఉదంతంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వారిద్దరికీ పరిచయం అయ్యిందని, అది ప్రేమకు,తరువాత పెళ్లికి దారితీసిందని పోలీసులు తెలిపారు. అయితే ప్రస్తుతం పోలీసులు ఆ సర్టిఫికెట్ నిజమైనదో కాదో తేల్చేపనిలో ఉన్నారు. ఇది కూడా చదవండి: ఆ భారీ షాపింగ్ మాల్లో కనిపించని క్యాషియర్.. మరి పేమెంట్ ఎలాగంటే.. -
రక్షించండి ప్రభో! పరిస్థితి మరీ దారుణంగా ఉంది.. పాక్ ప్రధాని ఆవేదన
పాకిస్థాన్‌లో నగదు నిల్వలు అడుగంటిపోయాయి. ఐఎమ్ఎఫ్ నుంచి రావాల్సిన నగదు అందకపోవడంతో ఆ దేశం పరిస్థితి అధ్వానంగా తయారైంది. దీనిపై తాజాగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్యారిస్ వేదికగా స్పందించారు. 'యుద్దాలకు ఇవ్వడానికి ప్రపంచ రుణదాతల దగ్గర డబ్బులు ఉంటాయి.. కానీ సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్‌కు ఇవ్వడానికి మాత్రం ఉండవు' అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్యారిస్‌లో రెండు రోజులపాటు జరుగుతున్న గ్లోబల్ ఫైనాన్సింగ్ ప్యాక్ట్‌లో ఈ మేరకు ఆయన మాట్లాడారు. 'యుద్ధం జరుగుతున్న దేశానికి ఏమైనా ఇవ్వడానికి ముందుకు వస్తారు. ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలకు కూడా కావాల్సినవన్నీ సమకూర్చుతారు. వేల మంది ప్రాణాలను రక్షించడానికి మాత్రం నిధులను ఇవ్వడానికి వెనకంజ వేస్తారు. పాకిస్థాన్ విషయానికి వచ్చే సరిగా భిన్నంగా ప్రవర్తిస్తున్నాయి సంపన్న దేశాలు. మా దేశంలో ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది' అని షరీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది వరదలతో నష్టపోయిన పాక్‌ను రక్షించడానికి, ప్రజల ప్రాణాలను కాపాడటానికి వేల కోట్లు సొంత జేబు నుంచి ఖర్చు చేశామని షెహబాజ్ షరీఫ్ గుర్తు చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి గ్లోబల్ ఫైనాన్సింగ్ ప్యాక్ట్ చర్చలు జరుపుతుంది. ప్రధానంగా వాతావరణ విపత్తుల కారణంగా చితికిపోయిన దేశాలకు ఆర్థిక సహాయం చేయడానికి ముందుంటుంది. జూన్ చివరి నాటికి ఐఎమ్ఎఫ్ నుంచి పాక్‌కు రావాల్సిన 6.5 బిలియన్ డాలర్ల రుణ కార్యక్రమం గడువు ముగుస్తుంది. గత సంవత్సరం నవంబర్ నుంచి పెండింగ్‌లో ఉన్న 1.1 బిలియన్ డాలర్ల రుణాన్నైనా విడుదల చేయాలని ఐఎమ్ఎఫ్కు షరీఫ్ విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి నిలిచిపోయిన నిధులపై ప్రశ్నించగా తనను పాక్ ఆర్థిక మంత్రి చెంపపై కొట్టాడని ఓ విలేఖరి ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: State Dinner Menu: వైట్ హౌస్‌లో మోదీకి అదిరే ఆతిథ్యం.. డిన్నర్ మెనూలో ఏముందంటే.. -
సామాన్యులకు భారీ ఊరట?..ఇంటికే వచ్చి రూ. 2వేల నోట్లను తీసుకెళ్తారట!
మీ వద్ద రూ.2000 నోట్లున్నాయా? వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు ఇబ్బంది పడుతున్నారా? అయితే మీకో శుభవార్త. రూ.2000 నోట్ల సమస్యకు పరిష్కారంగా ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వినియోగదారులకు బంపరాఫర్ ప్రకటించింది. మీరు ఎక్కడి నుంచైనా సరే అమెజాన్ పే క్యాష్‌లో నెలకు రూ.50,000 వరకు రూ.2000 నోట్లను డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న కస్టమర్లు అమెజాన్ పే బ్యాలెన్స్ అకౌంట్‌ను ఉపయోగించి ఆన్లైన్లో కావాల్సిన నిత్యవసర వస్తువుల్ని కొనుగోలు చేసుకోవచ్చు. లేదంటే స్నేహితులు, ఇతర కుటుంబ సభ్యులకు చెందిన బ్యాంక్ అకౌంట్లకు ఆ డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చని తెలిపింది. రూ.2,000 నోట్లను ఎలా డిపాజిట్ చేయాలి? ఈ సందర్భంగా అమెజాన్ పే’లో క్యాష్ ఎలా డిపాజిట్ చేయాలో అమెజాన్ తెలిపింది. ఆర్డర్ పెట్టుకున్న వస్తువు డెలివరీ అయ్యే సమయంలో నగదు చెల్లిస్తుంటాం. ఆ సమయంలో డెలివరీ అసోసియేట్‌కు మన వద్ద ఉన్న రూ.2000 నోట్లను వారికి ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం అసోసియేట్లు మనం ఎంత విలువైన రూ.2,000 నోట్లను ఇచ్చామో.. ఆ మొత్తాన్ని మన బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేస్తారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. రూ.2,000 నోటు ఉపసంహరణ మేలో రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయించింది. ప్రజలు సెప్టెంబర్ 30లోపు కరెన్సీని డిపాజిట్ చేసుకోవచ్చు, లేదంటే మార్చుకోవచ్చని ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. అత్యధిక విలువ కలిగిన కరెన్సీని ఉపసంహరించుకోవడం వల్ల ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల పరిణామాలు ఉండవని హామీ ఇచ్చారు. ప్రతికూల అంశాలు తక్కువగా ఉంటాయని, ఆ సమయంలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని ఆర్బీఐ తక్షణమే పరిష్కరిస్తుందని పునరుద్ఘాటించారు. చదవండి : ఎయిర్టెల్ యూజర్లకు బంపరాఫర్.. ఫ్రీగా ఓటీటీ సబ్ స్క్రిప్షన్లు.. ఎలా అంటే? -
ఇసుక లోడ్‌కెళ్లొచ్చే లోపు.. భార్య రష్మి సహా రూ.2 లక్షల నగదు అదృశ్యం
హైదరాబాద్: భార్య కనిపించడం లేదని భర్త ఫిర్యాదు చేసిన సంఘటన శనివారం భానూర్–బీడీఎల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి కథనం ప్రకారం మెదక్‌కు చెందిన రాజేశ్వర్ పటాన్చెరు మండలం పాశమైలారం ఉంటూ వ్యాపారం చేసుకుంటున్నాడు. గత నెల 23న ఒడిశా రాష్ట్రానికి చెందిన రష్మితో వివాహమైంది. శనివారం రాజేశ్వర్ ఇసుక లోడ్ ఖాళీ చేయించడానికి వెళ్లి తిరిగి ఉదయం 9.30 గంటలకు తన ఇంటికి రాగా, భార్య రష్మి అదృశ్యమైంది. ఫోన్ స్వీచ్ ఆఫ్ రావడంతోపాటు ఇంట్లోని రూ.2 లక్షల నగదు కనిపించడం లేదని రాజేశ్వర్ పేర్కొన్నాడు. ఆమె ఆచూకీ కోసం తెలిసిన, బంధువులను విచారించినా ఫలితం లేకపోయింది. దీంతో రాజేశ్వర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఈ దీవుల్లో హాయిగా ఉండండి.. రూ. 70 లక్షల అందుకోండి!
ఎవరైనా మీకు ఉచితంగా వసతి సదుపాయం కల్పిస్తూ, వ్యాపారం చేసుకునేందుకు భారీ మొత్తంలో సొమ్ము ఇస్తామంటే కాదంటారా? నిజంగా ఇటువంటి అవకాశం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచిస్తున్నారా? అవును మీరు విన్నది నిజమే. అటువంటి అద్భుత అవకాశం ఇప్పుడు మీ ముందు ఉంది. ఐర్లాండ్ ప్రభుత్వం అక్కడి ప్రజలకు సుదూరతీరంలో ఉన్న ఐలాండ్లలో నివసించేందుకు అద్భుత అవకాశం కల్పిస్తోంది. అక్కడి నివసించేందుకు ఆసక్తి చూపేవారికి భారీ మొత్తంలో సొమ్ము అందిస్తోంది. జూలై 1 నుంచి జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలను వీడి రిమోట్ ఐలాండ్‌లో ఉండాలనుకునేవారికి రూ. 70 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. రద్దీ ప్రాంతాలను వీడి గ్రామీణ ప్రాంతాలలో నివాసం ఉండాలనుకునేవారికి ఇది నిజంగా బంపర్ ఆఫర్. ఐర్లాండ్ ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకానికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ ఫథకానికి ఐర్లాండ్ ప్రభుత్వం ‘అవర్ లివింగ్ ఐలాండ్ పాలసీ’ అని పేరు పెట్టింది. మెట్రో యూకే రిపోర్టును అనుసరించి ఇప్పటి వరకూ మొత్తం 23 ఐలాండ్లను ఇందుకోసం సెలెక్ట్ చేశారు. ఆయా ఐలాండ్లలో ఉండేందుకు జనం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఐలాండ్లు రద్దీ ప్రాంతాలకు దూరంగా కొండలు, నదులు, అడవుల మధ్య ఉన్నాయి. ఇక్కడ ఉండేవారి కోసం ప్రభుత్వం ఇళ్లు, భూములు ఇవ్వడంతోపాటు వ్యవసాయం లేదా వ్యాపారం చేసుకునేందుకు లక్షల రూపాయలు అందజేస్తోంది. ప్రభుత్వ ఉద్దేశ్యం ఏమిటంటే.. నిజానికి గ్రామీణ ప్రాంతాల్లోని వారు వివిధ కారణాలతో పట్టణాలకు వలస వెళుతున్నారు. ఫలితంగా గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. అక్కడి ఇళ్లు, రోడ్లు వృథాగా మిగులుతున్నాయి. ఇటువంటి పరిస్థితులను నివారించేందుకు ప్రభుత్వం ఈ ఆఫర్ అందజేస్తోంది. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని ఐలాండ్లకు వెళ్లేందుకు సుముఖత చూపిస్తారని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునేవారు కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. 1993కు ముందు నిర్మించిన ప్రాపర్టీ కొనుగోలు చేయాల్సివుంటుంది. ప్రభుత్వం అందించే సొమ్మును ఇంటి నిర్మాణం లేదా రెనోవేషన్ కోసం మాత్రమే వినియోగించాలి. ప్రతీ ఐలాండ్‌లో నివసించేందుకు ప్రత్యేక నిబంధనలున్నాయి. వాటిని అక్కడ ఉండాలనుకునేవారు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. కొన్ని ఐలాండ్లలో నివసించేందుకు విదేశీయులకు ఏమాత్రం అనుమతి లేదు. కాగా ఈ విధానం ప్రస్తుతం ఐర్లాండ్ ప్రభుత్వం మాత్రమే అమలు చేయడం లేదు. పలు అభివృద్ధి చెందిన దేశాలు ఇటువంటి అద్భుత ఆఫర్లను అందిస్తున్నాయి. ఈ జాబితాలో స్పెయిన్, ఇటలీ, చిలీ, మారిషస్, గ్రీస్, క్రొయేషియా మొదలైన దేశాలున్నాయి. ఈ దేశాలు శివారు ప్రాంతాల్లో ఉండేందుకు ఇష్టపడేవారికి వ్యాపారం చేసుకునేందుకు ఆర్థిక మద్దతు అందిస్తున్నాయి. ఇది కూడా చదవండి: బంగారు నగరంలో చీకటి సామ్రాజ్యం.. -
తల్లి అకౌంట్నుంచి మొత్తం వాడేసిన చిన్నది: పేరెంట్స్ గుండె గుభిల్లు!
న్యూఢిల్లీ:మారాం చేస్తున్న పిల్లలకు అన్నం తినిపించాలన్నా, అల్లరి చేసినా, ఎలాంటి ఆటంకం లేకుండా పనిచేసు కోవాలన్నా తల్లిదండ్రులకు అందుబాటులో ఉన్న మంత్రం దండం స్మార్ట్‌ఫోన్. ఇది ప్రస్తుత కాలంలో పిల్లలకు అడిక్షన్‌లా మారిపోయింది. ఇది ప్రమాదకర ధోరణి అని, పిల్లలకు, మైనర్లకు స్మార్ట్‌ఫోన్ దూరంగా ఉంచాలని నిపుణులు పదేపదే హెచ్చిరిచ్చుస్తున్నారు. తాజాగా పేరెంట్స్ గుండెలు గుభిల్లుమనే స్టోరీ ఒకటి ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా లాంగ్ గ్యాప్ తరువాత ఇటీవల బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) ఇండియాలో మళ్లీ షురూ అయిన నేపథ్యలో ఈ షాకింగ్ న్యూస మరింత ఆందోళన రేపుతోంది ఇన్సైడర్ ప్రకారం చైనాకు చెందిన టీనేజ్ బాలిక (13) మొబైల్ గేమ్స్ కారణంగా తల్లి ఖాతాలోని మొత్తం సొమ్మును ఖతం చేసేసింది. అయితే స్కూలు నుంచి ఫోన్ వచ్చేవరకు బాలిక ఈ కుటుంబం ఈ విషయాన్ని పసిగట్టలేదు. స్కూల్లో ఎక్కువసేపు ఫోన్లో గడుపుతున్న బాలికను విచారించగా విషయం బైటపడింది. పే టూ ప్లే గేమ్స్‌కు బాలిక అడిక్ట్ అయిందని గుర్తించిన టీచర్ బాలిక తల్లిని అప్రమత్తం చేసింది. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. వెంటనే బాలిక తల్లి యివాంగ్‌కు బ్యాంక్ ఖాతాను చెక్ చేసుకోగా అందులో కేవలం రూ. 5( 0.5 యువాన్ )మాత్రమే మిగలడంతో లబోదిబో మంది. (రిటర్న్ టు ఆఫీస్ గూగుల్ వార్నింగ్: ఉద్యోగులేమంటున్నారంటే!) నాలుగు నెలల్లో కుటుంబం దాచుకున్న సొమ్మునంతటినీ మొబైల్‌గేమ్స్‌కు తగలేసింది. అంతకాదు తన క్లాస్మేట్స్ గేమ్స్‌కు కూడా ఈమే చెల్లింపులు చేసింది ఇంటిలో డెబిట్ కార్డు కనిపించడంతో దాన్ని తన స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకున్నానని, దాని పాస్‌వర్డ్‌ను తల్లి తనకు చెప్పిందని బాలిక చెప్పింది. ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే తల్లికి అనుమానం రాకుండా తన స్మార్ట్‌ఫోన్‌లో మొబైల్ గేమ్స్ లావాదేవీలకు సంబంధించిన, మెసేజ్‌లు, ఇతర రికార్డులు అన్నింటినీ డిలీట్ చేసింది. (మరోసారి అభిమానులను ఫిదా చేసిన ఆనంద్ మహీంద్ర) అయితే తన సహవిద్యార్థులకు డబ్బులు ఇచ్చినట్లు ఒప్పుకుంది. వాళ్లు కూడా గేమ్ ఆడేందుకు డబ్బు డిమాండ్ చేశారనీ, వారికి పంపకపోతే, ఇబ్బంది పెట్టేవారని సదరు బాలిక వెల్లడించింది. అలాగే టీచర్‌కి చెబితే టీచర్ తన పేరెంట్స్‌కికి చెబితే, వారికి కోపం వస్తుందేనని భయపడినట్టు చెప్పుకొచ్చింది. కాగా ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ యాప్స్ వైపు ఆకర్షితులవుతున్న యూత్ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. చైనాతో సహా అనేక దేశాలు గేమింగ్ వ్యసనంనుంచి మైనర్లను కాపాడే చర్యలను చేపడుతున్నాయి. -
ఎక్కడివీ కరెన్సీ కట్టలు?
హైదరాబాద్: నగరంలోని ఓ వ్యక్తి ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంతో రూ.1.65 కోట్ల నగదు బయటపడిన ఘటన గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి జరిగింది. ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. రెజిమెంటల్ బజార్లో నివసించే భైరి శ్రీనివాస్ అభిజిత్ ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లు ఉత్పత్తి చేసే కంపెనీలో డీజీఎంగా పని చేస్తున్నారు. శనివారం రాత్రి 8 గంటల సమయంలో ఆయన ఇంట్లోని గ్రౌండ్ ఫ్లోర్లో అగ్ని ప్రమాదం జరిగింది. అదే సమయంలో శ్రీనివాస్‌తో పాటు కుటుంబ సభ్యులు విశాఖపట్టణంలో ఉన్నారు. స్థానికులు వెంటనే గోపాలపురం పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలను ఆరి్పవేశారు. గ్రౌండ్ ప్లోర్లోని గదిలో ఉండే పనికిరాని వస్తువులు, కొంత చెక్క సామగ్రి మంటల్లో కాలిపోయాయి. మంటలు పూర్తిగా ఆరిపోయిన తర్వాత రాత్రి 12 గంటల సమయంలో గోపాలపురం పోలీసులకు ఇదే ఇంట్లో కోట్ల రూపాయల నగదు ఉందనే సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్‌గౌడ్ ఉన్నతాధికారులకు సమాచారం అందించి ఇంటిని స్థానికులు, పోలీసులతో పాటు బంధువుల సమక్షంలో తెరిచారు. మొదటి అంతస్తులోని బెడ్రూంలో గాలించారు. మంచం కింద, అల్మారా తదితర ప్రాంతాల్లో గాలించగా రూ.1.65 కోట్ల నగదు లభించింది. ఇందులో 50 మాత్రమే రూ.2 వేల కరెన్సీ నోట్లు ఉండగా.. మిగతావి రూ.500, రూ.200 నోట్లు ఉన్నాయి. పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు, వెండి సామగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాత్రి 2 గంటల సమయంలో నగదును, ఆభరణాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. హవాలా నగదేనా? పోలీసులు స్వాదీనం చేసుకున్న నగదు హవాలా మార్గంలో తరలించేందుకు ఉన్నదేననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఓ కంపెనీలో డీజీఎంగా పనిచేసే వ్యక్తి ఇలా ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో నగదు ఇలా ఉంచుకుంటారా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. సాధారణంగా డబ్బు ఇంట్లో ఉండే చాలా భద్రంగా దాచుకుంటారు కానీ.. కేవలం బ్యాగుల్లో, అల్మారాలో నిర్లక్ష్యంగా దాచి ఉంచడంతో ఇవి ఎక్కడికైనా తరలించేందుకు దాచిపెట్టి ఉంటారని, తరచుగా ఇలా డబ్బు తరలించే వాళ్లే ఇలా ఉంచుతారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు భైరి శ్రీనివాస్‌కు ఫోన్ చేస్తే దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు తన వద్ద ఉన్నాయని వచి్చన తర్వాత అన్నీ చూపిస్తానని ముక్తసరిగా జవాబిచ్చారు. నగదును ఆదాయ పన్ను శాఖ అధికారులకు స్వాదీనం చేస్తామని, అన్ని రకాల పత్రాలు పరిశీలించిన తర్వాత సక్రమంగా సంపాదించినది అని తేలితే వారికి అప్పగిస్తారని ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్‌గౌడ్ తెలిపారు. ఆది నుంచీ అనుమానాలే.. భైరి శ్రీనివాస్ 10 ఏళ్లుగా ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. గత 6 ఏళ్ల క్రితం తాను ఉండే ఇంటితో పాటు పక్కనే ఉండే మరో ఇల్లు కొనుగోలు చేశారు. ఈ రెండు ఇళ్లు సుమారు రూ.3 కోట్ల విలువ చేస్తాయి. శ్రీనివాస్ స్వస్థలం అయిన వైజాగ్‌లో కూడా గత కొద్ది రోజుల క్రితమే విలువైన ఇల్లు నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు. అనతికాలంలోనే కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఎలా సంపాదించారని స్థానికులు సందేహాలు వెలిబుచ్చుతున్నారు. హవాలా వ్యాపారం చేస్తున్నారా? అనే అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. -
ఆర్బీఐ కీలక నిర్ణయం..బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక!
ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు వద్ద తమ దగ్గర ఖాతాదారులు క్లెయిమ్ చేయకుండా ఉండిపోయిన డిపాజిట్లను తగ్గించుకునేందుకు 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేలా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కార్యక్రమం జూన్ 1 నుంచి మొదలవుతుందని ఆర్బీఐ ప్రకటించింది. ఇటీవల అన్ క్లయిమ్ డిపాజిట్లపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కరాద్ పార్లమెంట్లో మాట్లాడుతూ.. ప్రభుత్వ బ్యాంకుల్లో క్లయిం చేయని డిపాజిట్లు వేల కోట్లలో పేరుకుపోయాయని వాటిని ఆర్బీఐ ఆధ్వర్యంలోని ‘డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్’కు బ్యాంకులు బదిలీ చేసినట్లు తెలిపారు. తాజాగా, ఆర్బీఐ బ్యాంకుల్లో మూలుగుతున్న వేలకోట్ల డిపాజిట్లపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా బ్యాంక్‌లు తమ దగ్గర అన్క్లెయిమ్డ్గా ఉన్న టాప్–100 డిపాజిట్లను ఖాళీ చేయడంపై (తిరిగి చెల్లించడం/క్లియరెన్స్) దృష్టి పెడతాయని వెల్లడించింది. పదేళ్లుగా ఎలాంటి లావాదేవీలు లేని సేవింగ్స్/కరెంట్ ఖాతాల్లోని డిపాజిట్లు, గడువు ముగిసిపోయి పదేళ్లు అయినా తీసుకోకుండా ఉండిపోయిన టర్మ్ డిపాజిట్ల మొత్తాన్ని బ్యాంక్‌లు అన్క్లెయిమ్డ్ డిపాజిట్లుగా పరిగణిస్తుంటాయి. పదేళ్లు ముగిసిన అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను బ్యాంక్‌లు ‘డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్’కు బదిలీ చేయాల్సి ఉంటుంది. ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు ప్రతీ జిల్లా పరిధిలో టాప్–100 అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల సంబంధీకులను గుర్తించి చెల్లింపులు చేసేందుకు చర్యలు చేపడతాయని ఆర్బీఐ తన ప్రకటనలో పేర్కొంది. రూ.35వేల కోట్లు.. ఏదైనా బ్యాంకు ఖాతాలోని నగదు పదేళ్లుగా లేదా అంతకు ముందు నుంచీ వాడుకలో లేకుండాపోతే, దాన్ని అన్క్లెయిమ్డ్ డిపాజిట్‌గా పరిగణిస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి అటువంటి 10.24 కోట్ల ఖాతాలకు చెందిన రూ.35,012 కోట్లను ప్రభుత్వరంగ బ్యాంకులు ఆర్బీఐకు మరలించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వీటిలో ఎస్బీఐవే అత్యధికంగా రూ.8,086 కోట్లు ఉండగా.. రూ.5,340 కోట్లతో పంజాబ్ నేషనల్ బ్యాంకు రెండో స్థానంలో నిలిచింది. చదవండి👉 కడుపు నిండా తిండి పెట్టి.. ఉదయాన్నే చావు కబురు చల్లగా చెప్పిన ఐటీ సంస్థ! -
Karnataka Assembly elections 2023: కర్ణాటకలో ఐటీ దాడులు..
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆదాయ పన్ను శాఖ అధికారులు వివిధ ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో భారీగా సొత్తు బయటపడింది. రూ.15.3 కోట్ల నగదుతోపాటు రూ.7.08 కోట్ల విలువైన 10.14 కిలోల బంగారాన్ని పట్టుకున్నట్లు ఐటీ సీఈవో కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన మార్చి 29 నుంచి ఇప్పటి వరకు మొత్తం రూ.365 కోట్ల సొత్తు స్వాధీనం చేసుకున్నట్లయిందని పేర్కొంది. -
మామిడిచెట్టులో కరెన్సీ కట్టల బ్యాగు
-
హైదరాబాద్ లో పట్టాపగలు చోరీకి పాల్పడిన చిన్నారి..
-
ఎన్నికలొచ్చినయ్.. ఓటర్లను తడిపేస్తున్నరు
-
ఎన్నికలొచ్చినయ్.. ఓటర్లను తడిపేస్తున్నరు
బెంగళూరు: ఎన్నికలొస్తే ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నానారకాల ప్రయత్నాలు సాగుతుంటాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. అక్కడి అన్ని పార్టీలకు కీలకమే. జాతీయ పార్టీలైతే.. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు సెమీఫైనల్‌గా భావిస్తున్నాయి. ఈ తరుణంలో ప్రచారం జోరందుకోగా.. అదే సమయంలో ఓటర్లపై విపరీతమైన ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. కన్నడనాట ప్రస్తుతం క్యాష్, మద్యం, డ్రగ్స్ జోరు కనిపిస్తోంది. కేంద్రం ఎన్నికల సంఘం మార్చి 29వ తేదీన ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. నాటి నుంచి ఎన్నికల కోడ్ అమలుకాగా.. ఉచిత హామీలతో పాటు ప్రచారంలో ప్రలోభాల పర్వం తారాస్థాయిలో జరుగుతోంది. ఈ క్రమంలో భారీగా నగదు, డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. గురువారం ఒక్కరోజే నిప్పాణి, భద్రావతి, గడగ్, నరగుండ్ ఏరియాల్లో మొత్తంగా రూ.4.45 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇది మాత్రమే కాదు.. 62వేల లీటర్ల మద్యం( రూ.కోటి 89 లక్షల విలువ) సైతం ఎక్సైజ్ శాఖ స్వాధీనం చేసుకుంది. ఇది స్టాటిక్ సర్వేలెన్స్ టీం.. ధార్వాడ్ నియోజకవర్గంలో 45 లక్షల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. అలాగే.. బెంగళూరు నగరంలోని బైటరాయణపుర నియోజకవర్గంలో 34 లక్షల విలువ చేసే ఉచిత కానుకలను ఓటర్లకు పంచుతుండగా ఫ్లైయింగ్ స్క్వాడ్ టీం స్వాధీనం చేసుకోవడం గమనార్హం. మరోవైపు.. బెలగావి ఖానాపూర్ తాలుకాలో ఏకంగా రూ.4.61 కోట్ల క్యాష్, 21 లక్షల విలువ చేసే బంగారం, మరోచోట 19 లక్షల విలువ చేసే బంగారం స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 12 కోట్లు విలువ చేసే కానుకలను సైతం స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా రూ.27.38 కోట్ల నగదును రూ. 26.38 కోట్ల విలువైన మద్యాన్ని రూ.88 లక్షల డ్రగ్స్‌ను, రూ.9.87 కోట్లు విలువ చేసే బంగారం రూ.12.49 లక్షల ఇతర వస్తువులను అధికారులు గత 24 గంటల్లో స్వాధీనం చేసుకున్నారు. న్యామతి తాలూకాలోని జీనహళ్లి చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనీఖీలు చేపట్టారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్తుండగా.. వాళ్ల తీరు అనుమానాస్పదంగా అనిపించడంతో ప్రశ్నించారు. తనిఖీలు చేస్తే.. నడుముకు దండలాగా ఏడున్నర లక్షల రూపాయల 500 నోట్ల కట్టలను కట్టుకోవడాన్ని గుర్తించారు. నగదు ఎక్కడిది అని పోలీసులు వారిని ప్రశ్నించగా.. ఎన్నికలొచ్చినయ్.. ఎటు చూసినా లిక్కర్, నోట్ల కట్టలే!నిందితులు సరైన సమాధానం చెప్పలేకపోయారు. దీంతో స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లో ఎక్కువ డబ్బు పెట్టుకుంటున్నారా.. ఏమవుతుందో తెలుసా?
దేశంలో ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలే ఎక్కువగా జరుగుతున్నాయి. అయినప్పటికీ చాలా మంది ఇప్పటికీ డబ్బును బ్యాంకుల్లో కాకుండా ఇంట్లోనే పెట్టుకుంటున్నారు. ఇంట్లో ఎంత డబ్బు నిల్వ ఉంచవచ్చనే దానిపై పరిమితులు ఉన్నాయి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. ఇంట్లో నిల్వ చేసే డబ్బుపై ఎలాంటి పరిమితి లేదు. ఇదీ చదవండి: గ్యాస్ వినియోగదారులకు ఊరట.. ధరల పరిమితిపై కేంద్రం పరిశీలన! అయితే ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేసినప్పుడు మాత్రం ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో లెక్క చెప్పాలి. దానికి సంబంధించిన పత్రాలు సమర్పించాలి. ఆ డబ్బు లెక్కలోకి రానిదై ఉండకూడదు. ఇంట్లో ఉంచిన డబ్బుకు పత్రాలు సరిపోలకపోతే ఆదాయపు పన్ను అధికారులు మొత్తం డబ్బుపై 137 శాతం వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో లెక్కలోకిరాని ఆ డబ్బును స్వాధీనం చేసుకోవచ్చు కూడా. ఇదీ చదవండి: Physics Wallah Viral Video: బోరుమన్న ఫిజిక్స్ వాలా మాజీ టీచర్లు! నాటకం బాగుందన్న నెటిజన్లు! నిబంధనలు ఏం చెబుతున్నాయి? అటువంటి జరిమానాలు పడకూడదంటే నగదుకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ రూపొందించిన నియమాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఏ వ్యక్తి అయినా ఏదైనా రుణం లేదా డిపాజిట్ రూ. 20,000లకు మించి నగదు రూపంలో తీసుకునేందుకు వీలు లేదు.ఈ నిబంధన ఆస్తి లావాదేవీలకు కూడా వర్తిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షలకు మించిన నగదు లావాదేవీలు జరిగితే దానికి సంబంధించి లెక్కా పత్రాలు గనుక లేకపోతే ఐటీ అధికారులు జరిమానా విధిస్తారు. ఒకేసారి రూ. 50,000లకు మించి డిపాజిట్ లేదా విత్‌డ్రా చేసేటప్పుడు పాన్ నంబర్లు, ఆధార్, ఇతర వివరాలను తప్పనిసరిగా సమర్పించాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఆదేశాలు ఉన్నాయి. ఇదీ చదవండి: Get 1 Electric Scooter: రూ.38 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. భారీ డిస్కౌంట్! ఇక ఆస్తుల అమ్మకం లేదా కొనుగోలుకు సంబంధించి రూ. 30 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో నగదు రూపంలో చెల్లించినా, తీసుకున్నా విచారణకు లోబడి ఉండాల్సి ఉంటుంది. క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ని ఉపయోగించి ఒకేసారి లక్ష రూపాయల కంటే ఎక్కువ లావాదేవీలు చేసినా విచారణ ఉంటుంది. -
ఫుల్ ట్రాఫిక్..అందరూ చూస్తుండగానే రూ.40 లక్షలు స్వాహా!
అందరూ చూస్తుండగానే ఏ మాత్రం భయం లేకుండా చోరికి యత్నించారు. అదికూడా ఒక బైకర్ని అనుసరించిన ముగ్గురు దుండగులు ట్రాఫిక్ సిగ్నల్ వద్దకు రాగానే సొత్తు చోరీ చేసి ఉడాయించారు. ఈ ఘటన మార్చి1న సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రెండు కార్లు వాటి మధ్యలో ఓ బైక్ ఆగి ఉన్నాయి. ఇంతలో ముగ్గురు దుండగులు కామ్‌గా ఆ వాహనదారుడి వద్దకు వచ్చి గమనించడం ప్రారంభించారు. ఇంతలో అతని భూజానికి తగిలించి ఉన్న బ్యాగ్‌ని నెమ్మదిగా ఓపెన్ చేసి సుమారు రూ. 40 లక్షలు కొట్టేశారు. జస్ట్ నాలుగే నాలుగు నిమిషాల్లో డబ్బుల కొట్టేసి జారుకున్నారు. ఈ ఘటన మొత్తం సమీపంలోని సీసీటీవీలో రికార్డు అయ్యింది. కాసేపటికి అసలు విషయం తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు రంగలోకి దిగిన పోలీసులు సమీపంలో సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించడంతో ఈ ఘటన మొత్తం బయటపడింది. దీంతో పోలీసులు ఆ నిందితుల్లో ఇద్దర్ని అదుపులోకి తీసుకుని సుమారు రూ. 38 లక్షలు రికవరీ చేశారు. నిందితులను ఆకాశ్, అబిషేక్గా గుర్తించారు. ఆ ముఠా వాహనదారులే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. (చదవండి: ఆర్ఎస్ఎస్ ఓ రహస్య సమాజం: రాహుల్ గాంధీ) -
ఏటీఎంలో నోట్ల వరద.. 8,000 డ్రా చేస్తే రూ.20 వేలు
సాక్షి, చెన్నై: తమిళనాడులో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. చెన్నై సమీపంలోని అంబత్తూరులో ఓ ఏటీఎంలో నోట్లు పోటెత్తాయి. నమోదు చేసిన మొత్తం కంటే రెట్టింపు స్థాయిలో నోట్లు రావడంతో బ్యాంక్ అధికారులు సైతం విస్మయంలో పడ్డారు. వివరాలు.. అంబత్తూరులో ఓ జాతీయ బ్యాంక్ పక్కనే ఉన్న ఏటీఎంలో ఓ ఖాతాదారుడు రూ. 8 వేల డ్రా చేసేందుకు యత్నించగా.. ఆయనకు రూ. 20 వేలు వచ్చాయి. ఇలా 10 మంది ఖాతాదారులకు ఇలా అధిక మొత్తం రావడంతో బ్యాంక్ అధికారులకు సమాచారమిచ్చారు. తమకు అధికంగా వచ్చిన మొత్తాన్ని బ్యాంక్‌కు ఇచ్చేశారు. కాగా రూ. 200 నోట్లు నిల్వ ఉంచాల్సిన స్థానంలో, రూ. 500 నోట్లను ఏటీఎంలో పొందు పరచడంతోనే లెక్కల్లో తేడా వచ్చి ఖాతాదారులకు అధికంగా నగదు చేతికి వచ్చినట్లు విచారణలో తేలింది. దీనిపై బ్యాంక్ ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. -
నిర్జన ప్రదేశంలో.. ఏకంగా రూ. 10 లక్షల నోట్ల కట్టలు
సాక్షి, బనశంకరి: అనుమానాస్పదంగా కారు నిలిపి నగదు లెక్కిస్తున్న సమయంలో పోలీసులు దాడిచేసి రూ.10లక్షలు స్వాధీనం చేసుకున్నారు. హెబ్బగోడి పోలీస్‌స్టేషన్ పరిధిలోని నిర్జీన ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు శుక్రవారం ఇన్నోవా కారును రోడ్డు పక్కన నిలిపి కరెన్సీనోట్లు లెక్కిస్తున్నారు. గస్తీలో ఉన్న పోలీసులు అనుమానంతో ఆరా తీశారు. వారిద్దరూ హుసూ్కరు గ్రామపంచాయతీ బిల్‌కలెక్టర్ మల్లేశ్, నెలమంగల రాజేశ్‌గా తేలింది. లెక్కిస్తున్న నగదుకు సంబంధించి వివరాలు చెప్పాలని పోలీసులు కోరగా నీళ్లు నమిలారు. దీంతో నగదును స్వా«దీనం చేసుకొని ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. హెబ్బగోడి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి కోర్టుకు నగదు అప్పజెప్పారు. (చదవండి: వాళ్లు పుట్టెడు దుఃఖంలో ఉంటే అక్కడకు వెళ్లి నవ్వుతావా? ఇదేం పద్ధతి? రాహుల్‌పై బీజేపీ ఫైర్..) -
Demonetisation: ఇప్పటికీ క్యాషే కింగ్!
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు. ఆరేళ్ల క్రితం మోదీ సర్కారు తీసుకున్న సంచలన నిర్ణయం. అప్పటికి దేశవ్యాప్తంగా చలామణిలో ఉన్న కరెన్సీలో 86 శాతం వాటి రూ.1,000, రూ.500 నోట్లదే. కేంద్రం నిర్ణయంతో అవి ఒక్క దెబ్బతో రద్దయ్యాయి. కానీ ఆర్థిక లావాదేవీల్లో ఇప్పటికీ నగదుదే పెద్ద వాటా! పైగా నోట్ల రద్దు నాటితో పోలిస్తే జనం దగ్గరున్న నగదు ఏకంగా రెట్టింపైందని తాజా గణాంకాలు చెబుతుండటం ఆసక్తికరం. నోట్ల రద్దుకు కాస్త ముందు, అంటే 2016 నవంబర్ 4న చలామణిలో ఉన్న కరెన్సీ విలువ కేవలం 17.74 లక్షల కోట్ల రూపాయలు. రద్దు నిర్ణయం తర్వాత అది ఏకంగా రూ.9 లక్షల కోట్లకు పడిపోయింది. కానీ తాజాగా 2022 డిసెంబర్ 23 నాటికి ఏకంగా 32.42 లక్షల కోట్ల రూపాయల విలువైన కరెన్సీ చలామణిలో ఉందని రిజర్వు బ్యాంకు గణాంకాలే చెబుతున్నాయి. రద్దయిన నోట్లు మార్చుకోవడానికి అప్పట్లో 52 రోజుల గడువు ఇవ్వడం తెలిసిందే. ఆ గడువు లోపల రూ.15.3 లక్షల కోట్ల విలువైన పెద్ద నోట్లు, అంటే 99.3 శాతం వెనక్కొచ్చాయని ఆర్బీఐ పేర్కొంది. అలాంటప్పుడు నోట్ల రద్దుతో సాధించింది ఏమిటన్న ప్రశ్నలు అప్పట్లోనే తలెత్తాయి. రద్దు అనంతరం కొత్తగా రూ.2,000 నోటు ప్రవేశపెట్టడం తెలిసిందే. రూ.500 నోట్లను సరికొత్త రూపంలో తిరిగి జారీ చేసినా రూ.1,000 నోట్లను మాత్రం పునరుద్ధరించలేదు. ఒకవైపు డిజిటల్ చెల్లింపుల్లో భారత్ కొన్నేళ్లుగా ప్రపంచంలోనే అగ్ర స్థానంతో దూసుకుపోతున్నా మరోవైపు నగదు చలామణి కూడా అంతకంతకూ పెరుగుతుండటం ఆసక్తికరమే. అయితే నగదు చలామణి క్రమంగా తగ్గుతోందని ఎస్బీఐ తాజా సర్వే ఒకటి తేల్చింది. ‘‘మొత్తం చెల్లింపుల్లో నగదు వాటా 2015–16 ఆర్థిక సంవత్సరంలో 88 శాతం కాగా 2021–22 నాటికి అది 20 శాతానికి తగ్గింది. 2026–27 కల్లా కేవలం 11 శాతానికి పరిమితమవుతుంది. అదే సమయంలో 2015–16లో కేవలం 11.26 శాతంగా నమోదైన డిజిటల్ చెల్లింపులు 2021–22 నాటికి ఏకంగా 80 శాతానికి ఎగబాకాయి. 2026–27 కల్లా 88 శాతానికి చేరతాయి’’ అని అది పేర్కొంది. -
బిహార్ సీఎం నితీశ్ దగ్గర ఎంత డబ్బు ఉందో తెలుసా?
పాట్నా: బిహార్ సీఎం నితీశ్ కుమార్ తన ఆస్తుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లో పొందుపరిచారు. వీటి ప్రకారం ఆయన వద్ద మొత్తం రూ.75.53 లక్షలు విలువ చేసే స్థిరాస్థులు చరాస్థులు ఉన్నాయి. గతేడాదితో పోల్చితే ఈ మొత్తం రూ.18,000 పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వ వైబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం నితీశ్ కుమార్ వద్ద రూ.28,135 క్యాష్ ఉంది. బ్యాంకుల్లో మరో రూ.51,586 డిపాజిట్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సహా మంత్రులందరూ తమ ఆస్తులకు సంబంధించిన వివరాలను ప్రతి ఏటా డిసెంబర్ చివర్లో ప్రభుత్వ వెబ్సైట్లో పొందుపరచాలని సీఎం నితీశ్ కొత్త రూల్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయనతో పాటు మంత్రులంతా తమ ఆస్తుల వివరాలను డిసెంబర్ 31న పొందుపరిచారు. అయితే సీఎం కంటే చాలా మంది మంత్రులు సంపన్నులుగా ఉన్నారు. డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ వద్ద రూ.75వేల నగదు(మార్చి 31,2022 వరకు) ఉంది. ఆయన భార్య రాజశ్రీ వద్ద రూ.1.25లక్షల నగదు ఉంది. తేజస్వీ సోదరుడు, బిహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ వద్ద రూ.1.7 లక్షల క్యాష్ ఉంది. ఆయన స్థిరాస్థులు, చరాస్థుల విలువ మాత్రం రూ.3.2కోట్లుగా ఉంది. చదవండి: హై రిస్క్ దేశాల నుంచి వచ్చినవారికి అక్కడ వారం రోజుల క్వారంటైన్ -
ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. 700 మిలియన్ డాలర్లు క్యాష్ పేఔట్!
వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కీలక ప్రకటన చేసింది. తమ ఉద్యోగులకు 700 మిలియన్ డాలర్ల వన్-టైమ్ క్యాష్ పేఔట్ చేస్తున్నట్లు ప్రకటించింది. నివేదికల ప్రకారం.. ఫ్లిప్‌కార్ట్ సంస్థ స్టాక్ ఆప్షన్స్ కలిగి ఉన్న దాదాపు 25,000 ఉద్యోగులకు 700 మిలియన్ డాలర్ల వన్-టైమ్ క్యాష్ పేఔట్ చేయనుంది. ఫోన్‌పే (PhonePe), మింత్రా (Myntra), ఫ్లిప్‌కార్ట్ (Flipkart) సంస్థలోని ప్రస్తుత ఉద్యోగులే కాకుండా మాజీ సిబ్బందికి కూడా ప్రయోజనం చేకూరునుంది. ఫ్లిప్‌కార్ట్‌లోని టాప్ 20 ఉద్యోగులు, కంపెనీలో అత్యంత సీనియర్ సిబ్బంది స్థాయి వారికి ఈ చెల్లింపులో దాదాపు 200 మిలియన్ డాలర్ల వరకు అందుకోనున్నారు. అమెజాన్ నుంచి ఫోన్‌పే (PhonePe) పూర్తిగా వేరు కావడంతో ఈ చెల్లింపు జరుగుతన్నట్లు తెలుస్తోంది. ఫోన్‌పేను 2015లో ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే 2020లో ఫోన్‌పే విలువను అన్‌లాక్ చేయడానికి దాన్ని ప్రత్యేక సంస్థగా మార్చింది. అయినప్పటికీ ఫోన్‌పేలో అధిక వాటాను కొనసాగించింది. ఇటీవల డిసెంబర్ 23న ఫోన్‌పేలోని తన వాటాలన్నింటినీ ప్రస్తుత వాటాదారులకు విక్రయిస్తున్న కీలక ప్రకటన చేసింది ఫ్లిప్‌కార్ట్. ప్రస్తుతం ఈ కామర్స్ దిగ్గజం అందిస్తున్న ఈ క్యాష్ పేఔట్ దేశీయ ప్రైవేట్ రంగంలో అతి పెద్ద ఆఫర్‌గా నిలిచింది. చదవండి: Meesho Shopping Survey: ఆన్లైన్ షాపింగ్ అంటే ఆ ఒక్కరోజే, ఎగబడి కొనేస్తున్నారు! -
స్కార్పియో-ఎన్ను అలా వాడేసిన కేటుగాళ్లు: వైరల్ వీడియో
కోలకతా: కొట్టేసిన సొమ్మును అక్రమ రవాణాకోసం కేటుగాళ్లు కొత్త కొత్త మార్గాలతో పోలీసులను బురిడీ కొట్టించాలని చూసి భంగ పడుతూ ఉంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. మహీంద్రా స్కార్పియో-ఎన్లో అక్రమ డబ్బును రవాణా చేయడానికి ప్రయత్నిస్తున్న కొంతమంది వ్యక్తులను పశ్చిమ బెంగాల్ పోలీసులు పట్టుకున్నారు. బ్లాక్ కలర్ మహీంద్రా స్కార్పియో-ఎన్ వాహనంలో 98 లక్షల రూపాయల విలువైన దోపిడీ డబ్బును అక్రమంగా తరలించాలని పోలీసులకు చిక్కారు. నల్లటి పాలిథిన్ ప్యాకెట్లలో డబ్బును ప్యాక్ చేసి స్టెఫినీ టైర్లో దాచిన వైనాన్ని పోలీసులు చేధించారు. చెక్‌పోస్టు తనిఖీల్లో భాగంగా స్కార్పియో-ఎన్లో నగదు పట్టు బడింది. నమోదైన యూజర్‌తో పాటు ఎస్‌యూవీలో ఉన్న వారిపై నల్లధనం అక్రమ రవాణా, దోపిడీ కేసు నమోదు చేశారు. బ్లాక్ కలర్ స్కార్పియో-ఎన్ వాహనంలోని స్టెఫినీ టైర్లో దాచిన నగదు అంటూ ఒక యూ ట్యూబ్ (Raftaar 7811) వైరల్ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. -
హలో మేము సైబర్ క్రైమ్ పోలీసులం అంటూ..రూ.35 వేలు కాజేశారు!
సాక్షి, శంషాబాద్ రూరల్: హలో.. మేము సైబర్ క్రైమ్ నుంచి మాట్లాడుతున్నాము.. మీ వీడియో ఇంటర్నెట్లో అప్లోడ్ అయింది.. వెంటనే తొలగించాలంటూ ఓ వ్యక్తిని మాటలతో మభ్య పెట్టి రూ.35,450 కాజేసిన సంఘటన మంగళవారం శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఏ.శ్రీధర్‌కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని బుర్జుగడ్డతండాకు చెందిన వాన భాస్కర్ గైడ్‌గా పని చేస్తున్నాడు. గత నెల 28న అతడికి ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు నీకు సంబందించిన వీడియో నెట్లో అప్లోడ్ అయ్యిందని, దీన్ని తొలగించుకోవాలని చెబుతూ అతనికి ఓ ఫోన్ నంబరు ఇచ్చారు. దీంతో బాధితుడు సదరు ఫోన్ నంబర్ కాల్ చేయగా వీడియో తొలగించడానికి డబ్బులు కావాలని డిమాండ్ చేశారు. దీంతో అతను తన ఫోన్‌పే ద్వారా రూ.21వేలు పంపించాడు. ఇలా పలు దఫాలుగా మొత్తం రూ.35,450 ముట్టజెప్పాడు. ఈ డబ్బులను తిరిగి చెల్లిస్తామని చెప్పిన నేరగాళ్లు తర్వాత మరింత డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. (చదవండి: అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు.! ప్రియుడితో కలిసి భార్యే..) -
Viral: కట్నంగా రూపాయి చాలు.. 11 లక్షలు, బంగారు ఆభరణాలు వెనక్కి
ముజఫర్‌నగర్: కట్నంగా ముట్టజెప్పిన రూ.11 లక్షలు, బంగారు ఆభరణాలను వద్దంటూ వెనక్కిచ్చి ఆదర్శంగా నిలిచాడో యువకుడు. కేవలం రూ.1 కట్నం తీసుకుని శెభాష్ అనిపించుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో రెవెన్యూ అధికారిగా పనిచేసే సౌరభ్ చౌహాన్‌కు లఖాన్ గ్రామం ఓ మాజీ జవాను కూతురుతో శుక్రవారం పెళ్లయింది. వరకట్నం కింద వధువు తల్లిదండ్రులు రూ.11 లక్షల కట్నం, ఆభరణాలు ఇవ్వగా కట్నం అక్కర్లేదంటూ తిరిగిచ్చేశాడు. ‘‘మీ దీవెనగా జ్ఞాపకం పెట్టుకుంటా’నంటూ వారినుంచి కేవలం ఒక్క రూపాయి తీసుకున్నాడు. దాంతో ఆహూ తులు సౌరభ్‌పై అక్షింతలతోపాటు ప్రశంస జల్లులు కూడా కురిపించారు. సమాజంలో మంచి మార్పు కోసం ముందడుగు వేశాడంటూ మెచ్చుకున్నారు. -
సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తికి... రూ.2.11 కోట్లు, కారు
రోహ్తక్: ధర్మపాల్ అలియాస్ కాలా.. హరియాణా రాష్ట్రం రోహ్తక్ జిల్లా చిరీ గ్రామ వాస్తవ్యుడు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ప్రజల విజ్ఞప్తి మేరకు పోటీ చేశాడు. కేవలం 66 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాడు. ఈ ఓటమి గ్రామస్తులను కదిలించింది. ఆయనకు మద్దతుగా నిలిచారు. ధర్మపాల్‌ను ఆదుకోవడం తమ బాధ్యతగా భావించారు. అందరూ కలిసి రూ.2.11 కోట్ల విరాళాలు సేకరించారు. గ్రామంలో ప్రత్యేకంగా సభ ఏర్పాటు చేసి, ధర్మపాల్‌ను ఘనంగా సత్కరించి, రూ.2.11 కోట్ల నగదు అందజేశారు. అంతేకుండా ఖరీదైన స్కార్పియో కారు కూడా బహూకరించారు. ఈ సన్మాన సభలో చిరీలోని అన్ని కులాల పెద్దలు పాల్గొన్నారు. ధర్మపాల్ ఒంటరివాడు కాదని, ఓటమితో కుంగిపోవాల్సిన అవసరం లేదని తెలియజెప్పడానికే నగదు, కారు అందజేశామని కులపెద్ద భలేరామ్ చెప్పారు. గ్రామస్తుల ఔదార్యాన్ని చూసి ధర్మపాల్ కళ్లు చెమర్చాయి. జనం కోసమే తాను జీవిస్తానని, వారి బాగు కోసం కృషి చేస్తానని చెప్పాడు. ఆయన గతంలో లఖాన్ మాజ్రా బ్లాక్ సమితి చైర్మన్‌గా పనిచేశాడు. -
నోట్ల రద్దుకు 6 ఏళ్లు.. ప్రజల వద్ద ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయో తెలుసా!
నోట్ల రద్దు, కరోనా దెబ్బకు పరిస్థితులు మారడంతో ప్రజలు డిజిటల్ చెల్లింపుల వైపుకు మొగ్గుచూపారు. అందుకు నిదర్శనంగా ఇటీవల డిజిటల్ లావాదేవీలు కూడా రికార్డ్ స్థాయిలో నమోదవడం. అయితే అటు డిజిటల్ చెల్లింపులు చేస్తున్న ప్రజలు ఇటు నగదు వినియోగంపై ఫోకస్ పెడుతున్నారు. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా చేతిలో నగదు నిల్వకు కూడా ప్రాధాన్యమిస్తునన్నారు. ప్రస్తుతం ప్రజల వద్ద రికార్డ్ స్థాయిలో నగదు ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి. వామ్మె అంత నగదు ఉందా! నోట్ల రద్దు జరిగిన ఆరేళ్ల తర్వాత 2022 అక్టోబర్ 21 నాటికి ప్రజల వద్ద ఉన్న నగదు రూ. 30.88 లక్షల కోట్ల కొత్త గరిష్ట స్థాయికి చేరుకుందని ఆర్బీఐ తన తాజా నివేదికలో పేర్కొంది. కాగా 2016 నాటికి నవంబర్ నాటికి ప్రజల వద్ద రూ.17.70 లక్షల కోట్లు ఉండగా.. ఇటీవల ఆ వాటా అది 71 శాతం వరకు పెరిగి రికార్డ్ స్థాయికి చేరుకుంది. సాధారణ వ్యాపార లావాదేవీలు, వస్తువులు సేవల కోనుగోలు కోసం వినియోగించే డబ్బును ప్రజల వద్ద ఉన్న నగదుగా లెక్కిస్తారు. కాగా చెలామణిలో ఉన్న కరెన్సీ నుంచి బ్యాంకుల్లో నగదును తీసివేసిన తర్వాత ఈ సంఖ్య వచ్చింది. ఆర్థిక వ్యవస్థలో నగదు వినియోగం క్రమంగా పెరుగుతోంది. కొత్త కొత్త డిజిటల్ చెల్లింపు సాధనాలు అందుబాటులోకి వస్తున్నప్పటికీ.. నగదు చలామణి సైతం అదే స్థాయిలో పెరుగుతండడం గమనార్హం. ఆర్థిక వ్యవస్థలో అవినీతితో పాటు నల్లధనం (బ్లాక్ మనీ) తగ్గించడమే లక్ష్యంగా అప్పట్లో రూ.500, రూ.1000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: ట్విటర్ ఉద్యోగుల తొలగింపు సరైంది కాదు, అలా చేసుండాల్సింది: కేంద్రం ఆగ్రహం! -
మునుగోడులో తులం బంగారం, రూ.30వేలు అని ఊరించి.. రూ.3వేలతో
సాక్షి, నల్లగొండ(మర్రిగూడ): ఓటర్లను కొనుగోలు చేసేందుకు ప్రధాన పార్టీలు ముందస్తుగా డబ్బులు, బంగారం ఎర చూపినప్పటికీ తీరా ఎన్నిక దగ్గర పడడంతో రూ.3వేలతోనే సరిపుచ్చడంతో నిర్ఘాంతపోవడం ఓటర్ల వంతు అయింది. మునుగోడు ఉప ఎన్నికలో ఎంతో ఆశతో ఎదురు చూసిన ఓటర్లకు రాజకీయ నాయకులు షాకిచ్చారు. ఇంటికి తులం బంగారం, ఓటుకు రూ.30వేలు ఇస్తామని ఆయా ప్రధాన పార్టీలు గుట్టుగా ప్రచారం చేసినప్పటికీ ఓటరు ఊహకు అందకుండా రూ.3వేలతో సరిపుచ్చారని పలువురు పేర్కొంటున్నారు. ఎవరు ఎక్కువ తాయిలాలు ముట్టజెప్తే వారికే ఓటు వేయాలన్న ఆలోచనతో సగటు ఓటరు ఆలోచిస్తున్నాడు. కొన్ని గ్రామాల్లో ప్రధాన పార్టీలైన ప్రధాన పార్టీల నాయకులు పోటాపోటీగా ఓటర్లకు నగదు అందించాలని చూసినా పలుచోట్ల ఓ పార్టీ నాయకులను మరో పార్టీ నాయకులు అడ్డుపడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆశించిన విధంగా డబ్బులు అందకపోవడంతో ఓటర్లు నిరుత్సాహానికి గురైనట్లు తెలుస్తోంది. -
Munugode Bypoll: ఆఖరి అస్త్రాలు సందిస్తున్నారు.. పోటాపోటీగా పంపకాలు!
నల్లగొండ : మునుగోడు ఉపఎన్నికలో పోటాపోటీగా పంపకాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఓటర్లను ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున మద్యం పంచి, సిట్టింగులు నిర్వహించిన పార్టీలు.. ఆఖరి అస్త్రంగా డబ్బు పంపిణీని ప్రారంభించాయి. మొన్నటివరకు ఒక్కో ఓటుకు రూ.5వేలు, రూ.10 వేలు ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఓ పార్టీ ఓటుకు రూ.3వేల చొప్పున, మరో పార్టీ రూ.4వేల చొప్పున పంపిణీ చేసినట్టు తెలిసింది. కొన్నిచోట్ల రూ.3వేల చొప్పున సమానంగా పంపిణీ జరిగింది. సోమవారం రాత్రి నుంచే పార్టీలు ఓటర్లకు డబ్బులు పంపిని ప్రారంభించాయి. రెండో విడత కూడా డబ్బులు పంపిణీ చేసేందుకు పార్టీలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మొదటి విడత రూ.3వేలు, రూ.4వేలు చొప్పున పంపిణీ చేసిన పార్టీలు తిరిగి రెండో విడత ఎంత పంచుతాయో. నేరుగానే ఇంటింటికి తిరిగి నగదును పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. ఓటరు ఎటువైపో.. గత రెండు మాసాల నుంచి ఆయా పార్టీలు కులాల వారీగా సమావేశాలు, సభలు పెట్టి ఎన్నో హామీలు ఇచ్చాయి. కొన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించారు కూడా. ప్రచారాల్లో ఏ పార్టీ మీటింగ్ పెట్టినా జనం భారీగానే హాజరయ్యారు. దీంతో ఓటరుకు ఆయా పార్టీలు డబ్బులు నేరుగా పంపిణీ చేస్తున్నా ఏ పార్టీకి ఓటు వేస్తారన్నదానిపై అంతుచిక్కడం లేదు. అభ్యర్థులు మాత్రం ఎవరి నమ్మకంలో వారు ఉన్నారు. మునుగోడు నియోజకవర్గంలో 7 మండలాలు, రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో 298 పోలింగ్ బూత్‌లు ఉండగా 2,41,805 మంది ఓటర్లు ఉన్నారు. -
తప్పనిసరి పరిస్థితిలో దొంగతనం జరిగిందని ఫిర్యాదు.. తీరా దొంగ ఎవరంటే?...
ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడంటరు కదా. మన మధ్య, మనతోనే ఉంటూ మోసం చేస్తే ఈ సామెత వాడుతుంటాం ఔనా! అచ్చం అలాంటి సంఘటన ఒక వ్యాపారవేత్తకి ఎదురైంది. అసలేం జరిగిందంటే...ముంబైకి చెందిన వ్యాపారవేత్త అబ్దుల్‌కాదర్ షబ్బీర్ ఘోఘవాలా ఇంట్లో బంగారు ఆభరణాలు ఒక్కొక్కటిగా మాయం అవ్వడం జరిగింది. దీన్ని సదరు వ్యాపారవేత్త గుర్తించాడు కూడా. ఇలా కొద్ది నెలలోనే చాలా నగలు పోయాయి. కానీ అతను పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఇష్టపడలేదు. ఇంట్లో వస్తువులు ఏదో మంత్రం వేసినట్లు మాయవుతున్నాయని అనుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు పెద్దమొత్తంలో నగదు చోరికి గురైంది. దీంతో ఇక చేసేదేమి లేక వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ వ్యాపారవేత్త ఇంట్లో బంగారు ఆభరణాలు, నగదుకి సంబంధించి దాదాపు 40 లక్షలకు పైనే దొంగతనం జరిగింది. పోలీసులు వెంటనే ఇంత పెద్ద మొత్తంలో దొంగతనం జరిగాలంటే వ్యాపారవేత్తకు తెలిసిన వ్యక్తి చేసి ఉండాలి లేదా ఇంట్లో ఉండే వ్యక్తే అయ్యి ఉండాలన్న అనుమానంతో ఆ దిశగా దర్యాప్తు చేశారు. తీరా విచారణ చేస్తే అసలు దొంగ ఆ వ్యాపారవేత్త 12 ఏళ్ల మేనకోడలే ఈ దొంగతనానికి పాల్పడినట్లు తెలిసింది. దీంతో వ్యాపారవేత్త ఒక్కసారిగా షాక్ తిన్నాడు. పోలీసుల విచారణలో సదరు వ్యాపారవేత్త మేనకోడలు గుజరాత్‌లోని సూరత్‌లో ఉండే తన బంధువుని తన మావయ్య ఇంట్లో దొంగతనం చేయమని చెప్పినట్లు తెలిసింది. దీంతో సదరు బంధువుని అతనికి సహకరించిన ఇద్దరు స్నేహితులని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ. 40 లక్షలు వరకు రికవర్ చేశారు. ఐతే సదరు వ్యాపారవేత్త మేనకోడలుపై ఎలాంటి చర్య తీసుకోలేదని, ఈ దొంగతనంలో ఆమె పాత్ర ఎంత వరుకు ఉందో నిర్థారించిన తర్వాత జువైనల్ జస్టీస్ బోర్డుకు వివరణాత్మక నివేదికను పంపుతామని పోలీసులు తెలిపారు. (చదవండి: దగ్గు సిరప్కి కంపెనీకి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి...ఉత్పత్తికి చెక్!) -
ఐసీఐసీఐ బ్యాంకులో12 కోట్లు కొట్టేసి.. షికార్లు.. చివరికి...!
సాక్షి, ముంబై: థానేలోని మన్పాడ ప్రాంతంలోని ఐసీఐసీఐ బ్యాంకులో రూ. 12 కోట్ల నగదు కొట్టేసిన కేటుగాడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు అల్తాఫ్ షేక్‌ను పుణెలో పోలీసులు అరెస్టు చేసినట్లు బుధవారం విచారణ అధికారి వెల్లడించారు. వేషం మార్చి, న్యూలుక్లో షికార్లు కొడుతున్న నిందితుడికి సంఘటన జరిగిన సుమారు రెండున్నర నెలల తరువాత పోలీసులు చెక్ పెట్టారు. అతడి వద్ద నుంచి 9 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. సోమవారం థానే , నవీ ముంబై పోలీసులు సంయుక్త ఆపరేషన్‌లో షేక్‌ను అరెస్టు చేశారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఈ భారీ చోరికి నిందితుడు భారీ ప్లానే వేశాడు. ముంబైకి చెందిన షేక్ ఐసీఐసీఐ బ్యాంకులో కస్టోడియన్‌గా పని చేసేవాడు. కస్టోడియన్‌గా అంటే లాకర్ తాళాలకు కేర్‌టేకర్‌గా ఉండేవాడు. ఈ నేపథ్యంలో బ్యాంకులో ఉన్న నగదు చూసి అతనికి బుద్ధి పక్కదారి పట్టింది. ఎలాగైనా సొమ్మును తస్కరించాలని గత ఏడాది కాలంగా ప్లాన్ వేశాడు. ఈ క్రమంలో సిస్టంలోని లూప్ హోల్స్‌ని గమనించాడు. అలాగే సీసీటీవీ ఫుటేజీని ట్యాంపరింగ్ చేసి, ఏసీ డక్ట్ ద్వారా మొత్తం దోపిడీని ప్లాన్ చేశాడు. అంతేకాదు తనను ఎవరూ గుర్తించకుండా బురఖా వేసుకొని మరీ నగదు దోచేశాడు. ఈ వ్యవహారంలో సహకరించిన షేక్ సోదరి నీలోఫర్‌తో పాటు మరో ముగ్గురు నిందితులు అబ్రార్ ఖురేషీ, అహ్మద్ ఖాన్, అనుజ్ గిరిను పోలీసులు అరెస్టు చేశారు. అలారం సిస్టమ్‌ను డియాక్టివేట్ చేసి, సీసీటీవీని ధ్వంసం చేసిన తర్వాత, షేక్ బ్యాంక్ ఖజానాను తెరిచి, నగదును కొట్టేసి అక్కడినుంచి పారి పోయాడు. ఈ ఏడాది జూలై 12న ఈ చోరీ జరిగింది. అయితే డీవీఆర్ సెక్యూరిటీ డబ్బు కూడా కనిపించకుండా పోయిందని సిబ్బంది గ్రహించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చిందని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు షేక్‌ను అరెస్టు చేసి చోరీకి గురైన మొత్తం 12.20 కోట్లలో సుమారు 9 కోట్లను రికవరీ చేయగలిగారు, మిగిలిన మొత్తాన్ని త్వరలోనే రికవరీ చేస్తామని చెప్పారు. ఈ కేసులో మరింత మందిని అరెస్టు చేసే అవకాశం ఉందని, విచారణ కొనసాగుతోందని అధికారి తెలిపారు. -
కలెక్టర్ కార్యాలయం పేరు చెప్పి బ్యాంక్ ఖాతాలు ఖాళీ!
అనంతపురం శ్రీకంఠం సర్కిల్: గుర్తు తెలియని అగంతకుడి చేతిలో ఏఎన్ఎం, వలంటీరు ఇద్దరూ మోసపోయారు. ఉన్నతాధికారులు ఫోన్ చేశారని భావించి అగంతకుడికి వివరాలు అందజేసి, వారి బ్యాంక్ ఖాతాలోని నగదు అపహరణకు కారకులయ్యారనే అపవాదును మూటగట్టుకున్నారు. ఘటనకు సంబంధించి ఇరువర్గాలు అనంతపురం నాల్గో పట్టణ పోలీసులను ఆశ్రయించాయి. ఇరువర్గాలను విచారించిన అనంతరం ఇది సైబర్ నేరస్తుడి పనిగా సీఐ జాకీర్ హుస్సేన్ నిర్ధారించారు. గురువారం వివరాలను విలేకరులకు ఆయన వెల్లడించారు. రుద్రంపేటలోని సచివాలయం–2 పనిచేస్తున్న ఏఎన్ఎం ఎర్రమ్మ, వలంటీర్ మమతకు ఇటీవల గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి కలెక్టర్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు. కోవిడ్‌తో మృతి చెందిన బాధిత కుటుంబసభ్యులకు అందించే పరిహారం విషయంలో ఫోన్ చేశానని, వారి వివరాలు, ఫోన్ నంబర్లు ఇవ్వాలని కోరాడు. ఇది నిజమని భావించిన ఏఎన్ఎం, వలంటీర్ వెంటనే అగంతకుడు అడిగిన సమాచారాన్ని అందజేశారు. ఇదే విషయాన్ని బాధిత కుటుంబసభ్యులకు తెలిపి, కలెక్టర్ కార్యాలయం నుంచి ఫోన్ కాల్ వస్తే వారు అడిగిన వివరాలు అందజేయాలని సూచించారు. సచివాలయం సిబ్బంది చెప్పిన ప్రకారమే పామిడి ఓబుళమ్మ మనవరాలు భారతి తనకు వచ్చిన ఫోన్ కాల్ అందుకుని అవతలి వ్యక్తి అడిగిన వివరాలు అందించింది. కాసేపటికి ఆమె బ్యాంక్ ఖాతాలోని రూ.58 వేలు మాయమయ్యాయి. అలాగే కరోనాతో మృతి చెందిన లక్ష్మీనరసమ్మ కుమారుడు మాధవ ఖాతాలో నుంచి రూ.46 వేల కాజేశాడు. ఇరువురి ఖాతాలోనూ నగదు మాయం కావడంతో వారు ఏఎన్ఎం, వలంటీర్‌ను నిలదీశారు. తమ బ్యాంక్ ఖాతాలోని నగదు కాజేసింది మీరేనంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో మోసపోయామని భావించిన బాధితులు, సచివాలయ సిబ్బంది ఉమ్మడిగా నాల్గో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. (చదవండి: ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీలో అదే హాట్ టాపిక్) -
గేమింగ్ యాప్ స్కాం: గుట్టలకొద్దీ నగదు,కళ్లు చెదిరే వీడియో
కోలకతా: కోలకత్తా గేమింగ్ యాప్ స్కాంలో ఈడీ దాడుల్లో గుట్టల కొద్దీ నగదు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. గేమింగ్ యాప్ స్కాంలో ఈడీ ఏకంగా రూ. 17 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. ఈ నగ్గెట్స్` అనే గేమింగ్ యాపప్‌కు సంబంధించిన కుంభకోణంలో కోలకతాకు చెందిన గేమ్ ఆపరేటర్స్ కార్యాలయాల్లో శనివారం ఈడీ తనిఖీలు చేపట్టింది. మనీలాండరింగ్ ఆరోపణలతోసాగిన ఈసెర్చ్ ఆపరేషన్ కోల్‌కతాకు చెందిన వ్యాపారవేత్త ఇంటినుంచి సుమారు రూ. 17 కోట్లను రికవరీ చేసింది. గార్డెన్ రీచ్ ప్రాంతంలోని ఒకదానితో సహా ఆరు చోట్ల దాడులు చేపట్టింది. రూ. 2వేల నోట్లు, రూ.500 నోట్ల కుప్పలను లెక్కించేందుకు ఈడీ మనీకౌంటింగ్ మెషీన్ల సహాయం తీసుకోవాల్సి వచ్చింది. అంతేకాదు గంటల తరబడి కొనసాగుతున్న లెక్కింపులో నగదును తరలించేందుకు పెద్ద పెద్ద ట్రంక్ పెట్టెలను తీసుకొస్తుండటం గమనార్హం. ప్రజలను నమ్మించి మోసగించి అక్రమాలను పాల్పడిన "ఈ-నగ్గెట్స్" అనే గేమింగ్ యాప్‌ను నిందితుడు నిసార్ ఖాన్ ప్రమోట్ చేశారని దర్యాప్తు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే దీనికి, ఆపరేటర్లకు ఇతర "చైనీస్ నియంత్రిత" యాప్‌లతో లింక్‌లు ఉన్నాయో లేదో దర్యాప్తు చేస్తోంది. కాగా 2021, ఫిబ్రవరిలో కంపెనీ, దాని ప్రమోటర్లపై కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేశారు. ఫెడరల్ బ్యాంక్ ఫిర్యాదు మేరకు ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ యాప్ డౌన్ లోడింగ్, గేమింగ్ ప్రాసెస్‌లో రివార్డు పేరుతో డబ్బు ఎరగా వేశారు. మొదట్లో విత్ డ్రా చేసుకునే అవకాశం బాగానే కల్పించారు. ఎంత ఎక్కువ డబ్బు డిపాజిట్ చేస్తే అంత మొత్తంలో రివార్డ్స్ ఇచ్చి ప్రజలకు ఆశలు కల్పించారు. దీంతో యూజర్లు పెద్ద మొత్తంలో డబ్బును డిపాజిట్ చేయడం ప్రారంభించడంతో అక్రమాలకు తెరలేచింది. #WATCH | Kolkata, WB: Stacks of cash amounting to several crores have been recovered from the residence of businessman Nisar Khan during ED's raid ongoing for several hours pic.twitter.com/o2qXzNSmDR — ANI (@ANI) September 10, 2022 #WATCH | Kolkata, WB: Trunks being carried into the residence of businessman Nisar Khan to collect crores in cash that have been recovered during ED's raid ongoing for several hours pic.twitter.com/jJjV3ZJRN6 — ANI (@ANI) September 10, 2022 -
కన్నుపడితే లూటీ ! 40 ఏళ్లుగా దొంగతనాలే వృత్తి
బనశంకరి: 40 ఏళ్లకు పైబడి దొంగతనాలకు దోపిడీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను శనివారం రాజాజీనగర పోలీసులు అరెస్ట్‌చేశారు. దొంగ ప్రకాష్ (54), కోలారు, శివమొగ్గ బళ్లారిలో మొత్తం మూడు వివాహాలు చేసుకోగా ఇతడికి 7 మంది సంతానం. ఇప్పటి వరకు ఇతనిపై 160 కి పైగా దొంగతనం కేసులు నమోదయ్యాయి. బెంగళూరు, కోలారు, బళ్లారి, శివమొగ్గ, చిత్రదుర్గ, గుల్బర్గా తో పాటు గోవా, కేరళలో చోరీలకు తెగబడ్డాడు. 20 సార్లకు పైగా జైలుకెళ్లి వచ్చాడు. 10 ఏళ్ల వయసులో తొలిసారి 1978లో ప్రకాష్ 10 ఏళ్ల బాల్యంలోనే తొలి చోరీ చేశాడు. తరువాత సహోదరుడు వరదరాజ్, పిల్లలు బాలరాజ్, మిథున్, అల్లుడు జాన్ కలిశారు. ఈ నెల 22 తేదీన రాజాజీనగరలో ప్రకాష్ చోరీకి పాల్పడి పోలీసులకు పట్టుబడ్డాడు. కేజీల కొద్దీ పసిడి దోపిడీ 1978–1986 వరకు 100 ఇళ్లలో చోరీలు చేశాడు. అప్పట్లో ప్రకాష్ కేరళ కొట్టాయంలో 2.5 కిలోల బంగారం చోరీ, శేషాద్రిపురంలో బంగారు దుకాణం గోడ కు కన్నం వేసి రెండున్నర కిలోల బంగారు నగల ఆభరణాలు దోపిడీ, మరో బంగారు షాపునకు కన్నం వేసి 4 కిలోల పసిడి నగలు లూటీ, 20 కిలోల వెండి చోరీకి పాల్పడ్డాడు. అనుచరులైన జోసెఫ్, ఆనందన్, బాషా సహకరించారు. దోచుకున్న నగదును పంచుకుని జల్సాలు చేసేవారు. వైరముడి, నాగేశ్ అనే అనుచరులతో కలిసి ప్రకాష్ 1989లో మైసూరులో 20 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. 1992 లో నాగేశ్ తో కలిసి మహారాష్ట్ర కొల్హాపురలో రెండు బంగారు దుకాణాలకు కన్నంవేసి 17 కిలోల బంగారు ఆభరణాలు దోపిడీచేశారు. 1992లో శివమొగ్గ ఫైనాన్స్ కార్యాలయం నుంచి రూ.3 కోట్లు నగదు దోపిడీకి పాల్పడ్డాడు. 1997లో గోవాలో 7 కిలోల స్వర్ణాభరణాలను ఎత్తుకెళ్లాడు. 2006 నుంచి ప్రకాష్ తన పిల్లలైన మిథున్, బాలరాజ్ తో పాటు అల్లుడు, అతని పిల్లలతో కలిసి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. విలాసవంతమైన ఇళ్లు, జ్యువెలరీ దుకాణాలు, ఫైనాన్స్ కార్యాలయాలను ఎంచుకుని కొల్లగొడతాడు. ప్రతిసారి పోలీసులకు పట్టుబడి జైలుకెళ్లినప్పటికీ బయటికి వచ్చి కొత్త ముఠాను ఏర్పాటు చేసుకునేవాడు. (చదవండి: మహిళలను వేధించే పోకిరీలకు జైలు శిక్ష!) -
శ్రీలంక అధ్యక్షుడి నివాసంలో సుమారు రూ. 39 లక్షల నగదు..
శ్రీలంక అధ్యక్షుడు నివాసాన్ని నిరసనకారులు ముట్టడించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వారు అధ్యక్షుడు నివాసంలో సుమారు రూ.39 లక్షల కొత్త నోట్ల నగదును కనుగోన్నారని అధికారులు తెలిపారు. అంతేగాదు నిరసనకారులు అధ్యక్షుడి భవనం నుంచి స్వాధీనం చేసుకున్న ఈ సొమ్మును పోలీసులుకు అప్పగించినట్లు వెల్లడించారు. ఆ నగదును సోమవారం కోర్టుకి అప్పగించినట్లు అధికారులు తెలిపారు. అధ్యక్షుడి భవనంలో పెద్ద మొత్తంలో నగదుతోపాటు, పత్రాలతో కూడిన ఒక సూట్‌కేసును కూడా వదిలిపెట్టినట్లు పేర్కొన్నారు. మార్చి 31న నిరసనకారులు ఆయన వ్యక్తిగత ఇంటి పై దాడులు చేయడంతో...అప్పటి నుంచి ఆయన ఈ అధికారిక నివాసంలో తలదాచుకుంటున్నారు. నిరసనకారులు ఆందోళనల నడుమ ఆయన ఆ భవనం వదిలి వెళ్లిపోక తప్పలేదు. ప్రస్తుతం శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స పరారీలో ఉన్నాడని, శ్రీలంక నేవీ ఓడలో ఆయన వెళ్లిపోయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇంతవరకు అధ్యక్షుడి ఆచూకి కానరాలేదు. ఐతే నిరసకారుల డిమాండ్ల మేరకు గోటబయ రాజపక్స రాజీనామ చేసినట్లు రణిల్ విక్రమసింఘే కార్యాలయం అధికారికంగా పేర్కొంది. ఆ తదనంతరం నూతన ప్రధానిగా నియమితులైన విక్రమసింఘే కూడా రాజనామ చేస్తున్నట్లు ప్రకటించారు. ఐతే శ్రీలంక పార్లమెంట్ ఒక ఎంపీని ఎన్నకునేంతవరకు విక్రమసింఘేనే తాత్కాలికి ప్రధానిగా నవంబర్ 2024 వరకు కొనసాగుతాడు. (చదవండి: ప్రధాని నివాసాన్ని ఆక్రమించుకుని.. బెడ్‌పై రెజ్లింగ్ చేసిన లంకేయులు..) -
24 గంటలు ఆగాలంటూ..
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాల్లో నగదు కోల్పోయిన వారు 24 గంటల్లోపు ఫిర్యాదు చేయాలని పోలీసులు చెబుతున్నారు.. ఇలాంటి కేసుల్లో తక్షణం స్పందిస్తూ వాలెట్స్‌లో ఉన్న నగదు వెనక్కు వచ్చేలా చేస్తున్నారు. దీంతో తెలివి మీరిన సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తు వేస్తున్నారు. 24 గంటలు ఆగండి మీ డబ్బు తిరిగి వచ్చేందస్తుందని చెప్పడం. గ్యాస్ బుక్ చేయడానికి ప్రయత్నించి రూ.1.58 లక్షలు పోగొట్టుకున్న అత్తాపూర్ యువతి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇదీ జరిగిన వ్యవహారం... అత్తాపూర్ ప్రాంతానికి చెందిన యువతి మంగళవారం గ్యాస్ బుక్ చేయడానికి ప్రయత్నించారు. అందుకు అవసరమైన నంబర్ కోసం గూగుల్‌లో వెతగ్గా ఓ సైబర్ నేరగాడు పొందుపరిచిన నంబర్ కనిపించింది. దానికి కాల్ చేసిన యువతి నుంచి కొన్ని వివరాలు తెలుసుకున్న సైబర్ నేరగాడు క్యూఆర్ కోడ్స్ పంపాడు. ఇలా నాలుగు లావాదేవీల్లో రూ.1,58,736 కాజేశారు. తన బ్యాంకు ఖాతా నుంచి డబ్బు పోయిన విషయం గమనించిన యువతి సదరు సైబర్ నేరగాడికి ఫోన్ చేసి ప్రశ్నించింది. సాంకేతిక పొరపాటు వల్ల జరిగిందని చెప్పిన అతడు 24 గంటలు ఆగితే నగదు తిరిగి ఖాతాలోకి వచ్చేస్తుందని చెప్పాడు. దీంతో బుధవారం వరకు వేచి చూసిన ఆమె గురువారం సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఎందుకు ఇలా చెప్తారంటే... యువతి నుంచి కాజేసిన డబ్బు తొలుత సైబర్ నేరగాడికి సంబంధించిన వాలెట్‌లోకి చేరుతుంది. ఆ నగదు అక్కడే ఉండగా విషయం పోలీసుల వరకు వెళితే అధికారులు వాలెట్ నిర్వాహకుడి సంప్రదించడం ద్వారా ఫ్రీజ్ చేయడానికి, తిరిగి బాధితురాలి ఖాతాలోకి పంపడానికి ఆస్కారం ఉంటుంది. అదే ఫిర్యాదు చేయడం 24 గంటలు ఆలస్యమైతే సైబర్ నేరగాడి పని తేలికవుతుంది. వాలెట్లో ఉన్న నగదు బోగస్ వివరాలతో తెరిచిన బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించడానికి, డ్రా చేసుకోవడానికీ నేరగాడికి సమయం చిక్కుతుంది. పోలీసుల దర్యాప్తులో నేరగాడు చిక్కినా నగదు రికవరీ మాత్రం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో తాజాగా సైబర్ నేరగాళ్లు 24 గంటలు ఆగండి అంటూ కొత్త పంథా అనుసరిస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. ఎవరైనా ఇలాంటి నేరాల్లో బాధితులుగా మారిన వెంటనే స్పందించి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. గూగుల్‌లో కనిపించే నంబర్లనూ నమ్మవద్దని స్పష్టం చేస్తున్నారు. (చదవండి: నడిరోడ్డుపై దారుణం...వివాహిత పై యువకుడి దాడి) -
ఖరీఫ్‌కు ముందే ‘వైఎస్సార్ రైతు భరోసా’
సాక్షి ప్రతినిధి, గుంటూరు, కొరిటెపాడు: భూమిని నమ్ముకుని వ్యవసాయం చేసే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. రైతులు ఖరీఫ్‌కు సమాయత్తమవుతుండగా ముందుగానే పెట్టుబడి సాయం అందించేందుకు రంగం సిద్ధం చేసింది. 2022–23 ఆర్ధిక సంవత్సరానికి గాను ‘వైఎస్సార్ రైతు భరోసా’ నగదు అందజేసేందుకు వ్యవసాయాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి అర్హులైన అన్నదాతల ఖాతాల్లో జమ చేయనున్నారు. గుంటూరు జిల్లాలో 1,12,843 మంది రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం కింద రూ.84.63 కోట్లు జమ కానుంది. పల్నాడు జిల్లాలో 2,43,492 మంది రైతులకుగాను రూ. 182.62 కోట్ల జమ కానున్నాయి. బాపట్ల జిల్లాలో 1,63,692 మంది రైతులకు రూ. 122.76 కోట్ల లబ్ధి కలగనుంది. ముందస్తుగా సాయం... ఖరీఫ్ సాగులో దుక్కులు దున్నేందుకు, విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా ప్రభుత్వం ముందస్తుగా పెట్టుబడి సాయం అందిస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఖాతాలో డాక్టర్ వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద ప్రతి ఏటా రూ.13,500 ప్రభుత్వం పెట్టుబడి సాయంగా అందిస్తోంది. ఇందులో భాగంగా 2022–23 సంవత్సరానికి ఎంపికైన రైతుల బ్యాంకు ఖాతాల్లో తొలి విడతగా సోమవారం పీఎం కిసాన్తో కలిపి రూ.7,500 జమ చేసేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మండల వ్యవసాయాధికారి పర్యవేక్షణలో ఏఈఓలు, సచివాల య అగ్రికల్చర్ అసిస్టెంట్లు గ్రామాల్లో రైతులకు వైఎస్సార్ రైతు భరోసా పథకం మార్గదర్శకాలపై అవగాహన కల్పించారు. ఈ మేరకు అర్హులైన రైతుల జాబితాను స్థానిక రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించారు. అర్హులందరికీ వర్తించేలా... వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్ పథకం కింద ప్రభుత్వం ఏటా మూడు విడతల్లో రూ.13,500 సాయాన్ని అందిస్తోంది. మే నెలలో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4 వేలు, మిగిలిన రూ.2 వేలు జనవరి మాసంలో జమ చేస్తోంది. భూ యజమానులకు మాత్రమే పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో రూ.6 వేలు చొప్పున నిధులు మంజూరు చేస్తోంది. ఎలాంటి భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతో పాటు, దేవదాయ, అటవీ, వక్ఫ్ తదితర ప్రభుత్వ భూములను సాగు చేస్తున్న రైతులకు రూ.13,500 చొప్పున వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ధీమాతో సాగుకు సై... వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగ చేసేలా విత్తు మొదలు పంట విక్రయించే వరకు అన్నదాతకు అండగా నిలుస్తోంది. ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తూ భరోసా కల్పిస్తోంది. బ్యాంకులు కూడా విరివిగా రుణాలు ఇస్తుండటంతో రైతులు ధీమాతో సాగుకు సై అంటున్నారు. (చదవండి: ప్రాణాలను సైతం లెక్కచేయని సేవామూర్తులకు శుభాకాంక్షలు: సీఎం జగన్) -
పరుగులు పెట్టించిన ‘ఫిర్యాదు’.. తూచ్... బీరువాలోనే ఉన్నాయి..!
మాకవరపాలెం(అనకాపల్లి జిల్లా): నగదు, బంగారం చోరీకి గురయ్యాయని పొరపాటున ఇచ్చిన ఫిర్యాదు పోలీసులను పరుగులు పెట్టించింది. తమ్మయ్యపాలేనికి చెందిన రొంగల బుల్లిబాబు శనివారం ఉదయాన్నే నిద్ర లేచేసరికి ఇంట్లో బీరువా తలుపులు తెరిచి ఉండడంతో ఇందులోని 25 తులాల బంగారం, రూ.లక్ష నగదు చోరీకి గురయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చదవండి: తల్లితో సహజీవనం.. ఏడాది కాలంగా కుమార్తెపై అత్యాచారం.. దీంతో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తమ్మయ్యపాలెం చేరుకున్నాయి. ఏఎస్పీ మణికంఠచందోల్ కూడా వచ్చి పరిశీ లించారు. అయితే బీరువాలోని మరో అరలోనే బంగారం, నగదు ఉన్నట్టు క్లూస్ టీం గుర్తించింది. దీంతో బుల్లిబాబు సరిగా వెతకకుండా తొందర పడి ఫిర్యాదు చేశానని తెలపడంతో పోలీసులు వెనుదిరిగారు. -
‘గ్యాంగ్’ సినిమా చూపించారు.. ఇన్నోవా కార్లలో వచ్చి..
కోలారు(కర్ణాటక): కోలారు జిల్లా కేంద్రం భైరేగౌడ నగర్ ఐటీ, సీబీఐ అధికారులమం టూ చొరబడిన దుండగులు గ్యాంగ్ సినిమా తరహాలో భారీగా దోచుకుని పరారయ్యారు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో రెండు ఇన్నోవా కార్లలో ఐదుగురు వ్యక్తులు ఏపీఎంసీ మాజీ అధ్యక్షుడు రమేష్ ఇంటికొచ్చారు. ఐటీ, సీబీఐ అధికారులమని, తలు పులు తెరవాలన్నారు. చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌లో యువతి పరిచయం.. స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి తలుపులు తీయడంతో ఇంట్లోకి వెళ్లిన వెంటనే రమేష్, కుటుంబ సభ్యులను పిస్టల్‌తో బెదిరించి వారి నోట్లో గుడ్డలు కుక్కి తాళ్లతో కట్టి వేశారు. ఇంట్లో ఉన్న రూ.25 లక్షలు, కిలో బంగారం, కొంత వెండి సామగ్రిని దోచుకున్నారు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల హార్డ్ డిస్క్‌ను తీసుకుని కార్లలో పరారయ్యారు. కొంతసేపటికి రమేష్ దంపతులు గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వా రు వచ్చి కట్లు విప్పారు. వెంటనే కోలారు నగ ర పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్పీ దేవరాజ్ విచారణ జరిపారు. పోలీసు జాగిలాలు, వేలిముద్రల నిపుణులతో ఆధారాలను సేకరించారు. దోపిడీ దొంగలు హిందీలో మాట్లాడినట్లు బాధితులు తెలిపారు. -
కరీంనగర్: రూ.34 లక్షలు.. కాదు కాదు.. రూ.14లక్షలు...!
సాక్షి కరీంనగర్: కరీంనగర్‌లోని ముకరాంపురలో గల సేవా మ్యూచ్‌వల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీలో సోమవారం తెల్లవారుజామున వెలుగుచూసింది. మూడు గంటల్లోనే పోలీసులు ఈ చోరీని ఛేదించారు. దీనికి సంబంధించిన వివరాలను సీపీ సత్యనారాయణ వెల్లడించారు. సేవా మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీలో వడ్డీ లేకుండా రుణాలు అందిస్తూ తిరిగి వసూలు చేస్తుంటారు. 19న శనివారం, 20న ఆదివారం బ్యాంకుకు సెలవు కావడంతో వసూలు చేసిన నగదు మొత్తం సొసైటీ కార్యాలయంలోని క్యాష్ చెస్ట్‌లో భద్రపరిచారు. సోమవారం ఉదయం కార్యాలయం షట్టర్ తాళం పగలగొట్టి ఉండడం గమనించిన స్థానికులు నిర్వాహకులకు సమాచారం అందించారు. వారు వెళ్లి చూడగా నగదు, బంగారు నగలు భద్రపరిచిన చెస్ట్ కనిపించలేదు. ఉదయం 11 గంటలకు పోలీసులకు సమాచారమందించగా, వన్‌టౌన్ పోలీసులు హుటాహుటిన చేరుకున్నారు. అడిషనల్ డీసీపీ (లా అండ్ ఆర్డర్), టౌన్ ఏసీపీ తుల శ్రీనివాసరావు, వన్‌టౌన్ సీఐ సీహెచ్ నటేశ్, ఎస్సై ఎస్.శ్రీనివాస్ నేరం జరిగిన ప్రాంతాలను పరిశీలించారు. సేవా సొసైటీని పరిశీలిస్తున్న అధికారులు మూడు గంటల్లోనే.. చోరీ కేసులో పోలీసులు డాగ్‌స్క్వాడ్‌తో పాటు సీసీ కెమెరాలు పరిశీలించారు. వెంటనే నిందితుడికి సంబంధించిన సీసీ వీడియోలను సోషల్ మీడియాల్లో సర్క్యులేట్ చేయడంతో పలువురు గుర్తు పట్టి పోలీసులకు సమాచారమందించారు. నిందితులు నగరం దాటకముందే పట్టుకోవాలన్న ఉద్దేశంతో అప్పటికప్పుడు 5 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలించారు. మధ్యాహ్నం 2 గంటలకు కరీంనగర్ బస్టాండ్‌లో నిందితులు నగరానికి చెందిన షేక్ సాధిక్(24), మహమ్మద్ షాబాజ్(22)లను పట్టుకున్నారు. వారి నుంచి రూ.14.03 లక్షలు, 13 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇందులో సాధిక్ ఆటోడ్రైవర్ కాగా, షాబాజ్ ఇదివరకే సెల్‌ఫోన్ దొంగతనం కేసులో నిందితుడిగా పోలీసులు గుర్తించారు. -
ఈరోజు వివక్ష లేదు...లంచాలకు తావులేదు: సీఎం జగన్
-
వివక్ష లేదు.. లంచాలకు తావులేదు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సంక్షేమ పథకాల్లో అర్హత ఉండి మిగిలిపోయిన వారికి మంగళవారం ఆయన నగదు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని.. 9,30,809 మందికి వారి ఖాతాల్లో రూ. 703 కోట్లను జమచేస్తున్నామని తెలిపారు. చదవండి: 2021 రివైండ్: టీడీపీకి పరాభవ ‘నామం’ ‘‘గతంలో పథకాలకోసం ప్రజలు ఎదురుచూసేవారు. ఇప్పుడు ప్రజలనే నేరుగా వెతుక్కుంటూ పథకాలు వస్తున్నాయి. ఈ పథకాలు అమలు చేసేటప్పుడు మనం కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడ్డం లేదు. అర్హత ఉంటే చాలు, సంక్షేమ పథకాలు అందరికీ దక్కుతాయన్న కోణంలోనే ప్రతి అడుగూ వేస్తున్నాం. ఇంకా ఎక్కడైనా అర్హులైన ఉండి కూడా దరఖాస్తు చేసుకోలేకపోవడమో, అర్హత నిర్ధారణలో జరిగిన పొరపాట్లవలనో, నిర్ణీత సమయంలోగా దరఖాస్తు చేసుకోకపోవడంవల్లో, బ్యాంకు ఖాతాలు సరిగ్గా లేపోవడం వల్లో ఇలా ఏ కారణాలు అయినా సరే అర్హులందరికీ కూడా సంక్షేమ పథకాలు అందనట్టు అయితే అటువంటి వారు అందరూ కూడా మిస్‌కాకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నామని’’ సీఎం పేర్కొన్నారు. ఇది గొప్ప విప్లవాత్మక మార్పు: ‘‘గతంలో ప్రభుత్వాలు.. ఎలా కత్తిరించాలి.. అనిఆలోచించేవి. ఎవరూ మిగిలిపోకూడదు, అర్హులకు అందరికీ అందలాన్న తపన, తాపత్రయం ఈ ప్రభుత్వంలో ఉంది. దేశంలో తొలిసారిగా మిస్ అయిన వారికి కూడా ఒక అవకాశం ఇచ్చి, వారికి కూడా నెలరోజుల్లోపు దరఖాస్తులు చేసుకోమని చెప్పి, పరిశీలనలు చేసి వారిక్కూడా రావాల్సిన డబ్బును అందిస్తున్నాం. పెన్షన్లు, రేషన్‌కార్డులు, ఇతర పథకాల లబ్ధిదారులను తీసుకున్నా.. గత ప్రభుత్వంతో కంటే లబ్ధిదారుల సంఖ్యలో కాని, వారికి ఇస్తున్న మొత్తంలోగాని విపరీతమైన మార్పు ఉంది. విప్లవాత్మకంగా ఈ మార్పునకు శ్రీకారం చుట్టడం జరిగింది. టీడీపీ హయాంలో పెన్షన్ల రూపంలో ఎన్నికలకు 2 నెలలముందు వరకూ కేవలం రూ.1000లు మాత్రమే ఇచ్చేవారు. అది కూడా ఎన్నికలకు 6 నెలలకు ముందు వరకూ కేవలం 39 లక్షలమందికి, నెలకు రూ.400 కోట్లు ఇచ్చేవారు. ఇవాళ 61లక్షల పెన్షన్లకు పెంచాం. పెన్షన్‌ను రూ.2250లకు పెంచాం. రూ.1450 కోట్లు నెలకు కేవలం పెన్షన్లకోసమే ఖర్చు చేస్తున్నాం. ఎవ్వరూ ఇబ్బంది పడకూడదని తెల్లవారుజామునే వాలంటీర్ వచ్చి గుడ్మార్నింగ్చెప్పి.. చేతిలో పెన్షన్ పెట్టబోతున్నారు. ఈ ఒకటో తారీఖు నుంచి రూ.2500కు పెంచబోతున్నాం. గతంలో పథకాలను ఎగ్గొట్టేందుకు, లంచాలు గుంజేందుకు జన్మభూమి కమిటీలు పెడితే... గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి సోషల్ఆడిట్ ద్వారా అర్హులందరికీ న్యాయం ఇవాళ న్యాయం జరుగుతుంది. గతంలో ఆత్మాభిమానం చంపుకుని వృద్ధులు, వికలాంగులు పెన్షన్లకోసం తిరిగే వారు. వివక్ష లేకుండా, లంచాలకు తావు లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తున్నాం. కోవిడ్ వల్ల ప్రభుత్వ రాబడి తగ్గినా, ఖర్చులు పెరిగినా పేదలకు అండదండలు అందించేందుకు మన ప్రభుత్వం అడుగులు ముందుకేసిందని’’ సీఎం అన్నారు. వివిధ పథకాల్లో మిస్ అయిన వారికి ఇవాళ ఇస్తున్న ప్రయోజనాలు ఇవీ: ♦వైఎస్సార్ చేయూత కింద 2,50,929 మందికి రూ. 470.40 కోట్లు ఇవాళ అందిస్తున్నాం ♦వైఎస్సార్ ఆసరా కింద 1,136 మందికి రూ. 7.67 కోట్లు ఇస్తున్నాం ♦వైఎస్సార్ సున్నావడ్డీ కింద మహిళలకు 59,661 మందికి రూ. 53,51కోట్లు అందిస్తున్నాం ♦వైఎస్సార్ సున్నావడ్డీ పంటరుణాలు కింద 2019–20 ఏడాది కింద 62,622 మందికి రూ. 9.01కోట్లు, ఖరీఫ్ 2020 కింద 58,821 మందికి 10.06 కోట్లు ఇస్తున్నాం ♦వైఎస్సార్ రైతు భరోకకింద 2,86,059 మందికి రూ. 58.89 కోట్లు ఇస్తున్నాం ♦జగనన్న విద్యా దీవెన కింద 31,940 మందికి రూ.19.92 కోట్లు ఇస్తున్నాం ♦వైఎస్సార్ వసతి దీవెన కింద 43,010 మందికి రూ. 39.82 కోట్లు ఇస్తున్నాం ♦వైఎస్సార్ కాపు నేస్తం కింద 12,983 మందికి రూ.19.47 కోట్లు ఇస్తున్నాం ♦వైఎస్సార్ వాహన మిత్ర కింద 8,080 మందికి రూ.8.09 కోట్లు ఇస్తున్నాం ♦వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద 3,788 మందికి రూ. 3,79 కోట్లు ఇస్తున్నాం ♦వైఎస్సార్ నేతన్న నేతన్న నేస్తం కింద 794 మందికి రూ.1.91 కోట్లు అందిస్తున్నాం ♦ఇవికాక 90 రోజుల్లో ఇళ్లపట్టాలు 1,10,986 కు ఇస్తున్నాం ఇవికాకుండా 1,51,562 లక్షల మందికి పెన్షన్‌కార్డులు ఇస్తున్నాం, ఏప్రిల్ 2021 నుంచి ఇచ్చిన పెన్షన్‌కార్డులు కలుపుకుంటే 4,96,059 మందికి పెన్షన్‌కార్డులు ఇచ్చాం. బియ్యంకార్డులు 3,07,599 మందికి ఇస్తున్నాం. ఆరోగ్యశ్రీ కార్డులు 1,14,129 మందికి ఇస్తున్నాం. డిసెంబర్ నుంచి మే వరకూ అమలైన పథకాల్లో అర్హత ఉండి మిస్ అయిన వారికి జూన్ లోనూ, అలాగే జూన్ నుంచి నవంబర్ వరకూ అమలైన పథకాల్లో మిస్ అయిన వారికి డిసెంబర్‌లోనూ అందించే కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభిస్తున్నామని’’ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
వెయ్యి కోట్ల పన్ను ఎగవేత.. లెక్కించేందుకు నాలుగు రోజులు?
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని పెర్ఫ్యూమ్ వ్యాపారి పియూష్ జైన్ ఇల్లు, ఫ్యాక్టరీ, కార్యాలయం, కోల్డ్ స్టోరేజీ, పెట్రోల్ బంకలపై ఐటీ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. వ్యాపారి ఇంట్లో తనిఖీలు చేస్తుండగా అధికారుల కళ్లు బైర్లు కమ్మేలా నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. తనిఖీల్లో భాగంగా పీయూష్ ఇంట్లోని రెండు బీరువాల్లో కట్టలు కట్టలుగా బయటపడ్డ నోట్లను చూసి అధికారులు నోరెళ్లబెట్టారు. ఆ డబ్బును లెక్కించేందుకే దాదాపు నాలుగు రోజులు పట్టిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా 257కోట్ల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. చదవండి: ఒమిక్రాన్ అప్డేట్స్: ఒక్కరోజే 156 కొత్త కేసులు, మహారాష్ట్రను దాటేసిన ఢిల్లీ ఇక, సోదాల్లో 16 విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాన్పుర్‌లో 4, కన్నౌజ్‌లో 7, ముంబయిలో 2, దిల్లీలో ఒక ఆస్తికి చెందిన పత్రాలను గుర్తించారు. మరో రెండు ఆస్తులు దుబాయిలో ఉన్నట్లు తేలింది. కన్నౌజ్‌లో పీయూష్ జైన్ పూర్వీకుల ఇంట్లో 18 లాకర్లను అధికారులు గుర్తించారు. మరో 500 తాళాలు కూడా దొరికాయని సమాచారం. పన్ను ఎగవేత మొత్తంగా 1000కోట్ల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. చదవండి: ముందు ప్రేమ, ఆపై దూరం.. తట్టుకోలేక ఒకరినొకరు పొడుచుకున్న ప్రేమికులు సంబంధిత వార్త: గుట్టల్లా నోట్ల కట్టలు.. రూ.150 కోట్లకు పైనే, షాక్‌లో అధికారులు.. ఫోటోలు వైరల్! -
వామ్మో!...పైప్‌లైన్‌లో నోట్ల కట్టలు..!!
మనం సినిమాల్లో బ్లాక్‌మనీని కారు టైర్లలోనూ, గోడల్లోనూ దాచడం చూసి ఉంటాం. కానీ నిజజీవితంలో అలా దాచేవాళ్లను చూడటం చాలా అరుదు. మహా అయితే పలానా అధికారి ఇంట్లో ఇంత సోమ్ము స్వాధీనం చేసుకున్నాం అని విని ఉంటాం తప్ప ఎలాంటి చోట్ల వాళ్లు దాచుతారో చూసి ఉండం. కానీ కర్ణాటకలోని పీడబ్ల్యూడీ ఇంజనీర్ అవినీతి సోమ్మును ఎక్కడా దాచాడో చూస్తే అవాక్కవ్వాల్సిందే.! బెంగళూరు: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ అధికారులపై రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన చర్యలలో భాగంగా కల్బుర్గి జిల్లాలోని పీడబ్ల్యూడీ జాయింట్ ఇంజనీర్ శాంతగౌడ్ బిరాదార్ నివాసంపై దాడులు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపారు. అంతేకాదు పబ్లిక్ వర్క్స్ డెవలప్మెంట్ (పీడబ్ల్యూడీ)కి చెందిన ఇంజనీర్ నివాసంలో తాము ఒక ప్లంబర్ సాయంతో పైప్లైన్ల నుంచి కరెన్సీ నోట్లను తీశామని అధికారులు వెల్లడించారు. (చదవండి: పాపం ఎంత దాహం వేసిందో!.....ఆ కోబ్రా గ్లాస్‌తో తాగేస్తోంది) పైగా తమకు పైపులైన్లో నగదు దాచినట్లు సమాచారం రావడంతోనే ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ మేరకు సుమారు రూ. 25 లక్షల నగదు, భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే అవినీతి నిరోధక శాఖ ఇప్పటి వరకు దాదాపు 15 మంది అధికారులపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులకు సంబంధించన సోదాలు నిర్వహించినట్లు తెలిపింది. ఇటీవల బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంపై కూడా అవినీతి నిరోధక శాఖ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంతో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ.." రాష్ట్ర ప్రభుత్వం అవినీతిని ఏ రూపంలోనూ సహించదు. అవినీతి నిరోధక శాఖ ఇచ్చే నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం వారిపై తగిన చర్యలు తీసుకుంటుంది" అని చెప్పారు. (చదవండి: పెళ్లి బాజాలతో.. 65 కోళ్లు మృతి!..ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదేనేమో!!) -
నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్.. కూతురు వివాహానికి దాచుకున్న డబ్బులను
సాక్షి, బంజారాహిల్స్: ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నారు. తన ఆటోలో ప్రయాణికుడు మర్చిపోయిన నగదు బ్యాగ్‌ను పోలీసులకు అందజేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ధూల్‌పేటలో నివసించే రాంరాజ్ తివారీ అనే అర్చకుడు సోమవారం ఉదయం తన కూతురు వివాహానికి సంబంధించి రూ.1.25 లక్షల నగదుతో పాటు వివాహ పత్రికలను ఓ బ్యాగులో సర్దుకొని బంజారాహిల్స్‌రోడ్ నెం. 12లోని గుడిలో పూజ చేయించేందుకు షేక్‌పేటలో ఆటో ఎక్కారు. ఆటో దిగిన అర్చకుడు డబ్బులు ఉన్న బ్యాగ్‌ను ఆటోలోనే మర్చిపోయారు. కొద్ది దూరం వెళ్లిన ఆటో డ్రైవర్ హుస్సేన్ ప్రయాణికుడు మర్చిపోయిన బ్యాగును గమనించారు. చదవండి: ఎమ్మెల్యే కారుకే సైడ్ ఇవ్వవా’.. స్పందించిన ఎండీ వీసీ సజ్జనార్ ఆ నగదు బ్యాగ్‌ను తీసుకొని నేరుగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. అదే సమయంలో ఆటోలో తన బ్యాగ్‌ను మర్చిపోయానని ఫిర్యాదు చేసేందుకు రాంరాజ్ తివారీ పోలీస్ స్టేషన్‌కు రాగా విషయం తెలిసింది. అప్పటికప్పుడే ఆ నగదు సంచిని పోలీసులు రాంరాజ్ తివారీకి ఆటో డ్రైవర్ చేతుల మీదుగా బంజారాహిల్స్ ఎస్ఐలు కె. ఉదయ్, అజయ్ కుమార్‌లు అప్పగించారు. ఆటో డ్రైవర్ నిజాయితీని బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ శివచంద్ర అభినందించి ప్రోత్సాహక బహుమతిని అందజేశారు. -
రెండున్నర లక్షలు మాయం.. డబ్బుకోసం వెతుకుతుండగా బాత్రూంలోకి వెళ్లి..
సాక్షి, బంజారాహిల్స్: నగదు దొంగిలించాడు కానీ.. పట్టుబడితే శిక్షిస్తారేమోనన్న భయంతో ఆ డబ్బును బాత్రూంలోని కమోడ్‌లో పడేసి ఫ్లష్ నొక్కాడు. దీంతో అక్షరాలా రూ.రెండున్నర లక్షలు మరుగుదొడ్లోని మ్యాన్హోల్లోకి వెళ్లిపోయాయి. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. జూబ్లీహిల్స్ రోడ్ నం.18లో నివసించే ప్రకాశ్‌చంద్ జైన్ అనే వ్యాపారి దీపావళి సందర్భంగా ఈ నెల 2వ తేదీన రాత్రి బంధుమిత్రులతో కలిసి ఇంట్లో లక్ష్మీదేవి పూజలు నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం అమ్మవారి ఎదుట రూ. 3.50 లక్షల నగదు కట్టలు ఉంచాడు. పూజల అనంతరం ఏర్పాటుచేసిన విందు కోసం 18 మంది కేటరింగ్ సిబ్బంది వచ్చారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో విందు ముగిశాక ప్రకాశ్‌చంద్‌తో పాటు కుటుంబ సభ్యులు బంధుమిత్రులను పంపించేందుకు గేటు వరకు వెళ్లారు. చదవండి: (ఆస్ట్రేలియా నుంచి నిత్యం వీడియో కాల్స్.. నగ్న వీడియోలు, ఫొటోలతో) అదే సమయంలో అక్కడ పనిచేస్తున్న కేటరింగ్ బాయ్ షేక్ చాంద్ రజాక్ అమ్మవారి ఎదుట పెట్టిన డబ్బు కట్టలను ఎవరూ చూడకుండా తన జేబులో పెట్టుకున్నాడు. పది నిమిషాల్లో తిరిగి వచ్చిన ప్రకాశ్‌చంద్‌కు నగదు కట్టలు కనిపించలేదు. దీంతో డబ్బుకోసం అందరూ వెతుకుతుండగా తనను ఎక్కడ పట్టేస్తారోనని రజాక్ వెంటనే బాత్రూంలోకి వెళ్లి రూ. 2.50 లక్షలను వెస్ట్రన్ టాయ్లెట్లో పడేసి ఫ్లష్ నొక్కాడు. దీంతో డబ్బు కట్టలన్నీ డ్రెయినేజీ పైపుల్లోంచి మ్యాన్హోల్లోకి వెళ్లాయి. దొంగలించిన నగదులో రూ. 75 వేలను తన ప్యాంట్ జేబులో దాచుకోగా దొంగను గుర్తించిన యజమాని వాటిని తీసుకొని మిగతా డబ్బుకోసం ఆరా తీశారు. కమోడ్‌లో పడేసానని చెప్పగానే అందులో చూడగా రూ. 500 నోట్లు నాలుగు తేలుతూ కనిపించాయి. ఘటనకు సంబంధించి బుధవారం యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు రజాక్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. (చదవండి: TS: మానవత్వం చాటుకున్న వైఎస్ షర్మిల) -
రైతు బతుకులో నిప్పులు పోసిన గ్యాస్.. బీరువాలో దాచిన రూ. 6 లక్షలు..
సాక్షి, సూర్యపేట: ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై గుడిసె దగ్ధం కావడంతో ఓ రైతు కుటుంబం బతుకు బుగ్గిపాలైంది. గుడిసెలోని నగదుతోపాటు సామాగ్రి కాలిపోయి కట్టుబట్టలు మిగలడంతో కన్నీరుమున్నీరవుతోంది ఆ కుటుంబం. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రిలో గురువారం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం,.. నేలమర్రి గ్రామానికి చెందిన కప్పల లక్ష్మయ్య, నాగమణి దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు. లక్ష్మయ్య సూర్యాపేట మండల కేటీ అన్నారం గ్రామంలో తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని ఇటీవల విక్రయించగా వారం రోజుల క్రితం రూ.9 లక్షలు వచ్చాయి. ఇందులో నుంచి రూ. 3 లక్షలను గ్రామంలోని ఓ పెద్దమనిషి వద్ద ఉంచి మిగతా రూ. 6 లక్షలు గుడిసెలోని బీరువాలో దాచారు. అయితే గురువారం లక్ష్మయ్య తన భార్యతో కలిసి పొలం పనులకు వెళ్లాడు. అనంతరం లక్ష్మయ్య పెద్ద కుమార్తె వంట చేసేందుకు ఇంట్లోని గ్యాస్ సిలిండర్‌ను వెలిగించగా, గ్యాస్‌లీక్ కావడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు లేచి గుడిసెకు అంటుకున్నాయి. లక్ష్మయ్య కుమార్తె బయటకు వచ్చికేకలు వేయగా చుట్టుపక్కల వారు వచ్చి మంటలు ఆర్పే లోగా రూ. 4 లక్షల విలువైన సామగ్రితోపాటు బీరువాలో ఉన్న రూ.6 లక్షల నగదు పట్టాదారు పాసుపుస్తకాలు అగ్రికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న మునగాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
రిస్కలను సరిగ్గా అంచనావేయకపోతే ఇబ్బందులు
కోల్‌కతా: వ్యవస్థలో నగదు లభ్యత సమృద్ధిగా ఉన్నందున సమస్యలను (రిస్కలను) సరిగ్గా అంచనా వేయకపోతే ఆందోళనకు దారితీస్తుందన్నారు ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా. ‘‘బ్యాంకింగ్ వ్యవస్థలోకి డిపాజిట్లు వచి్చపడుతున్నాయి. కానీ, రుణాల వృద్ధి పుంజుకోవాల్సి ఉంది. దీంతో బ్యాంకులు ప్రత్యామ్నాయ పెట్టుబడి వేదికలైన టీ బిల్లులవైపు చూడాల్సి వస్తుంది. కానీ, ఈ ప్రత్యామ్నాయ మార్కెట్ పరిధి తక్కువ. దీంతో రిస్‌్కలను సరిగ్గా అంచనా వేయలేకపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ, బ్యాంకింగ్ వ్యవస్థ నిరర్థక ఆస్తుల (ఎన్పీఏలు) రూపంలో తగినంత అనుభవాలు నేర్చుకున్నందున.. అండర్‌రైటింగ్ ప్రమాణాల విషయంలో రాజీ ఉంటుందని నేను అనుకోవడం లేదు’’ అని ఖారా బెంగాల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇం డస్ట్రీ నిర్వహించిన వెబినార్‌లో భాగంగా చెప్పారు, -
‘హెలికాప్టర్ నిండా డబ్బుతో ఘనీ పారిపోయాడు’
మాస్కో: తాలిబన్ల అక్రమణతో అఫ్గనిస్తాన్ అధ్యక్షుడు అశ్రఫ్ ఘనీ ఆదివారం దేశం విడిచిపారిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా ఘనీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అధ్యక్షుడు అశ్రఫ్ ఘనీ భారీగా నగదు నిండిన నాలుగు కార్లతో పలాయనం చిత్తగించాడని పేర్కొంది. అంతేకాదు హెలికాప్టర్ పట్టకపోవడంతో కొంత నగదును విడిచిపోవాల్సి వచ్చిందంటూ కాబూల్‌లోని రష్యా రాయబార కార్యాలయం సోమవారం ప్రకటించింది. తాలిబన్లు కాబూల్‌లోకి ప్రవేశించడంతో ఘనీ నాలుగు కార్లు, హెలికాప్టర్ నిండా నగదుతో దేశం విడిచి పారిపోయాడని రష్యా వ్యాఖ్యానించింది. రక్తపాతాన్నినివారించాలని భావించినట్టు అతను పేర్కొన్నాడని తెలిపింది. రష్యన్ రాయబార కార్యాలయ ప్రతినిధి ఇస్చెంకో తన వ్యాఖ్యలను రాయిటర్స్‌తో ధృవీకరించారు. నాలుగుకార్లు డబ్బుతో నిండి ఉన్నాయి, డబ్బులో కొంత భాగాన్ని హెలికాప్టర్లో నింపడానికి ప్రయత్నించారు, కానీ సరిపోక పోవడంతో వదిలేశారన్నారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే కాబూల్‌లో దౌత్యపరమైన ఉనికిని నిలుపుకుంటామనీ, తాలిబన్లతో సంబంధాలు పెంచుకోవాలని భావిస్తున్నామని రష్యా ప్రకటించింది. వారిని దేశపాలకులుగా గుర్తించడం తొందరపాటు కాకపోయి నప్పటికీ, తాలిబన్ల ధోరణిని నిశితంగా గమనిస్తుందని ప్రకటించడం విశేషం. తాలిబన్లతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉంటామని చైనా ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. కాగా అధ్యక్షుడు అశ్రఫ్ ఘనీ తొలుత తజకిస్తాన్‌కు వెళ్లిపోయినట్లు రిపోర్టులు వచ్చాయి. అలాగే ఘనీ, ఆయన భార్య, చీఫ్ ఆఫ్ స్టాఫ్, దేశ భద్రతా సలహాదారు ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్‌కు పారిపోయారని అల్ జజీరా వార్తా సంస్థ వెల్లడించింది. ప్రస్తుతానికి ఘనీ ఎక్కడ తలదాచుకున్నదీ స్పష్టత లేదు. -
బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. ఏటీఎంలలో నగదు లేకుంటే జరిమానా
ముంబై: మనం బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే బ్యాంకులు ఏం చేస్తాయి. అడిషనల్ ఛార్జీలను వసూలు చేస్తాయి.ఇప్పుడు బ్యాంకులు నిర్వహిస్తున్న ఏటీఎంలలో నగదు అందుబాటులోకి లేదంటే ఆర్బీఐ భారీ ఎత్తున జరిమానా విధించేందుకు సిద్ధపడింది. నగదు ఉండని ఖాళీ ఏటీఎంలతో ప్రజలకు ఎదురవుతున్న అవస్థలను పరిష్కరించడంపై రిజర్వ్ బ్యాంక్ దృష్టి సారించింది. ఇకపై ఒక నెలలో మొత్తం 10 గంటలకు మించి ఏటీఎంలలో నగదు అందుబాటులో లేకుంటే బ్యాంకులకు జరిమానా విధించనుంది. ఈ నిబంధన ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు (డబ్ల్యూఎల్‌ఏవో) ఎప్పటికప్పుడు ఏటీఎంలలో నగదు లభ్యతను పర్యవేక్షించి, సమయానికి భర్తీ చేసేలా తమ యంత్రాంగాలను పటిష్టం చేసుకోవాలని ఆర్బీఐ సూచించింది. ఈ నిబంధనల ఉల్లంఘనను తీవ్రంగా పరిగణిస్తామని, జరిమానా కూడా విధిస్తామని హెచ్చరించింది. ఒక నెలలో పది గంటలకు మించి ఏ ఏటీఎంలోనైనా నగదు లేకపోతే, ఒక్కో ఏటీఎంకు రూ. 10,000 చొప్పున పెనాల్టీ ఉంటుంది. వైట్ లేబుల్ ఏటీఎంల విషయంలో సదరు ఏటీఎంలకు సంబంధించిన నగదు అవసరాలు తీర్చే బ్యాంకులే జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత దాన్ని డబ్ల్యూఎల్‌ఏవో నుంచి వసూలు చేసుకోవచ్చు. 2021 జూన్ ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకులకు చెందిన 2,13,766 ఏటీఎంలు ఉన్నాయి. చదవండి: ఆ పని చేయండంటున్న స్వర్ణ పతక వీరుడు నీరజ్ చౌప్రా -
చూస్తుండగానే 4 లక్షలు హాంఫట్
సాక్షి, దొడ్డబళ్లాపురం(బెంగళూరు): స్కూటర్ డిక్కీలో ఉన్న నగదును దుండగులు క్షణాల్లో చోరీ చేశారు. కోడిగుడ్ల వ్యాపారం చేసే దొడ్డపట్టణానికి చెందిన రమేశ్ బుధవారం కర్ణాటక బ్యాంకులో రూ.4 లక్షలు డ్రా చేసి స్కూటర్ డిక్కీలో పెట్టుకున్నాడు. కోర్టు రోడ్డులోని హీరోహోండా షోరూం ముందు స్కూటర్ నిలిపి టీస్టాల్‌లోకి వెళ్లాడు. అప్పటికే వెంటాడిన దుండగులు క్షణాల్లో నగదుతో బైక్‌పై ఉడాయించారు. రమేశ్‌తోపాటు స్థానికులు దుండగులను పట్టుకోవాలని ప్రయత్నించినా లాభం లేకపోయింది. సీటీవీ కెమెరా పుటేజీ ఆధారంగా పోలీసులు దుండగుల కోసం గాలింపు చేపట్టారు. -
corona patient: బిల్ చూసి మైండ్ బ్లాక్.. ఏంటీ 22 కోట్లా!
వాషింగ్టన్: కోవిడ్ సోకిన ఓ వ్యక్తికి వైరస్ నుంచి విముక్తి లభించినా, బల్ రూపంలో భారీ షాక్ ఎదురైంది. ట్రీట్మెంట్ అనంతరం ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన బిల్ చూడగానే అతని మైండ్‌బ్లాంక్ అయింది. దేవుడా.. అంటూ గుండె పట్టుకోవాల్సి వచ్చింది. ఇంతకీ ఆ వ్యక్తికి కరోనా చికిత్సకు అయిన ఖర్చు ఎంతో తెలుసా? 3 మిలియన్ల డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం అక్షరాలా రూ.22 కోట్లండి. ఇక ఆ బిల్లును సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసి తన బాధను నెటిజన్లతో పంచుకున్నాడు. అమెరికాలో ఓ వ్యక్తి కరోనా సోకిందని ఆస్పత్రిలో చేరాడు. ఈ క్రమంలో నాలుగు నెలల చికిత్స అనంతరం అతను వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఇక డిశ్చార్జ్ సమయంలో అతనికిచ్చిన 3 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.22 కోట్లు) బిల్ చూసి బెంబేలిత్తిపోయాడు. ఆ రసీదుని వీడియో తీసి ‘టిక్‌టాక్’లో పోస్టు చేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారి కొద్ది రోజుల్లోనే దాదాపు 10 మిలియన్ల వ్యూస్‌ను సంపాదించుకుంది. కాగా అగ్రరాజ్యంలో వైద్యం కోసం భారీగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ప్రపంచంలోనే అత్యత్తమ సౌకర్యాలు, వైద్య సదుపాయాలు ఉంటాయి. అందుకే ఆ దేశంలో ఆరోగ్య బీమా తీసుకుంటే ఆస్పత్రుల్లో భారీగా బిల్లు తగ్గే అవకాశం ఉంటుందని నిపుణలు చెబుతున్నారు. చదవండి: ప్రియుడి 23 లక్షల బైక్‌ను తగలబెట్టేసిన ప్రియురాలు -
రేపే పోలింగ్ : భారీ నగదు, నగలు పట్టివేత
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఎత్తున నగలు నగదు పట్టుబడింది. అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని గంటల్లో పప్రారంభం కానున్న నేపథ్యంలో మొత్తం 428 కోట్ల రూపాయల విలువైన నగదు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. స్వాధీనం చేసుకున్న వాటిలో 225.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకోగా, బంగారంతో సహా విలువైన లోహాలు 176.11 కోట్లు ఉన్నట్టు వెల్లడించింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మద్యం కూడా పట్టుబడింది. గత 24 గంటలలో కరూర్, కోయంబత్తూర్, తిరుప్పూర్ , చెన్నైలు భారీ దాడులు నిర్వహించినట్టు ఎన్నికల అధికారి ఒకరు తెలిపారు. ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గత కొన్ని వారాలుగా ఈ దాడులు జరిగాయన్నారు. ఇందులో కరూర్ అగ్రస్థానంలో ఉండగా, కోయంబత్తూర్, తిరుప్పూర్, చెన్నై తరువాతి స్థానాల్లో నిలిచాయి. తాజాగా రాణిపేట జిల్లాలో రూ. 91.56 లక్షలు, చెన్నైలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో 1.23 కోట్ల రూపాయలు, సేలం వీరపాండి వద్ద 1.15 కోట్ల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా గత నెలలో, ఆదాయపు పన్ను శాఖ 16 కోట్లకు పైగా అక్రమ నగదును స్వాధీనం చేసుకుంది.అలాగే ఎన్నికల నిఘాలో భాగంగా రాష్ట్రంలో పలు సంస్థలపై దాడుల తరువాత సుమారు రూ. 80 కోట్ల బ్లాక్ మనీని గుర్తించింది. కాగా 234 నియోజకవర్గాల్లో మంగళవారం పోలింగ్ షురూ కానుంది. తమిళనాట సింగిల్-ఫేజ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే ప్రచార పర్వం ముగిసి నసంగతి తెలిసిందే. -
పెళ్లైన మరుసటి రోజే షాకిచ్చిన వధువు..
పెద్దపప్పూరు(అనంతపురం జిల్లా): పెళ్లైన మరుసటిరోజే భర్త ఇంటి నుంచి నగదు, నగలు తీసుకుని నవ వధువు ఉడాయించిన ఘటన కమ్మవారిపల్లిలో సంచలనం రేకెత్తించింది. పోలీసుల సమాచారం మేరకు.. పెద్దపప్పూరు మండలం కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన పయ్యావుల కేశవమురళి భార్య ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. ఇతనికి ఇద్దరు సంతానం. పిల్లల సంరక్షణ కోసమంటూ గత నెల 28న నల్లమాడ మండలం శ్రీరెడ్డివారిపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళను పెద్దల సాక్షిగా పెళ్లి చేసుకున్నాడు. మరుసటి రోజు భర్త ఇంటికి కాపురానికి వచ్చిన ఆమె.. ఇంటిలో ఉన్న మూడు తులాల బంగారు నగలు, రూ.80వేలు తీసుకుని పారిపోయింది. ప్రియుడితో కలిసి భార్య ఒడిశాలో ఉన్నట్లు తెలుసుకుని బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసి, వివాహిత కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: తెల్లారితే ముహూర్తం.. వరుడికి వధువు షాక్..! ప్రేమనాటకం.. పెళ్లనగానే ప్రేయసి పరార్ -
తగినంత నగదు ఉండేలా చూసుకోండి..
న్యూఢిల్లీ: ఒకటో తారీఖు దగ్గరపడటంతో జీతాల వేళ వేతన జీవులు ఇబ్బంది పడకుండా చూడటంపై కేంద్రం దృష్టి సారించింది. ఒక్కసారిగా విత్‌డ్రాయల్స్‌కు డిమాండ్ పెరిగే అవకాశం ఉండటంతో తగినంత స్థాయిలో నగదు నిల్వలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు సూచించింది. అలాగే వివిధ పథకాల కింద రైతులు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల ఖాతాల్లోకి బదిలీ చేసే నగదును ఆయా వర్గాలు విత్‌డ్రా చేసుకునేందుకు వీలుగా బ్యాంకుల శాఖలను తెరిచి ఉంచాలని పేర్కొంది. కరోనావైరస్ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తే రాబోయే రోజుల్లో వివిధ పథకాల లబ్ధిదారులు విత్‌డ్రాయల్స్ కోసం పెద్ద ఎత్తున బ్యాంకులకు వచ్చే అవకాశం ఉందని సీనియర్ బ్యాంక్ అధికారి ఒకరు తెలిపారు. దీంతో పాటు జీతాల విత్‌డ్రాయల్స్‌కు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి 10 దాకా బ్యాంకుల్లో రద్దీ ఉంటుందని వివరించారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే డిమాండ్‌కి తగినంత స్థాయిలో శాఖలతో పాటు ఏటీఎంలలో కూడా నగదు నిల్వలు ఉండేలా చూసుకోవాలని బ్యాంకులకు ఆర్థిక శాఖలో భాగమైన ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో శాఖలను కూడా తెరిచి ఉంచాలని కూడా ఆదేశించినట్లు వివరించాయి. రాష్ట్రాలకూ లేఖలు..: బ్యాంకుల సిబ్బంది, ఆర్బీఐ ఉద్యోగులు, నగదు సరఫరా చేసే సంస్థల సిబ్బంది, ఏటీఎం మెయింటెనెన్స్ ఉద్యోగులు, నగదు వ్యాన్లు మొదలైన వాటి రాకపోకలకు ఆటంకాలు కలగకుండా చూడాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కూడా డీఎఫ్ఎస్ లేఖ రాసింది. లాక్‌డౌన్‌పరమైన ఆంక్షల కారణంగా వీరు ఇబ్బందులు పడకుండా చూసేందుకు అధికారులు, పోలీసులకు తగు సూచనలు చేయాలని పేర్కొంది. -
ఆదివారం కదా అని పిజ్జా ఆర్డర్ చేస్తే..
సాక్షి, బెంగళూరు: ఆన్లైన్ పుడ్ డెలివరీ యాప్ ద్వారా పిజ్జా ఆర్డర్ చేసిన టెకీకి చుక్కలు కనిపించిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం కదా అని..పిజ్జా తిందామని ఆశపడి ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఓ ఐటీ ఉద్యోగి ఏకంగా రూ.95వేలు పోగొట్టుకున్నాడు. రెండు బ్యాంక్ అకౌంట్ల నుంచి అక్రమార్కులు ఈ మొత్తాన్ని కొట్టేశారు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని కోరమంగళ 1వ బ్లాక్‌లో నివాసం ఉండే ఐటీ ఉద్యోగి షేక్ డిసెంబర్ 1వ తేదీన మధ్యాహ్నం ఓ ఫుడ్ డెలివరీ యాప్‌లో పిజ్జా ఆర్డర్ చేశాడు. అయితే ఎంత సేపటికీ పిజ్జా రాకపోవడంతో ఆ యాప్‌కు చెందిన కస్టమర్ కేర్ నంబర్‌కు ఫోన్ చేశాడు. అంతే అదే ఆయన చేసిన తప్పయిపోయింది. ఫోన్ లిఫ్ట్ చేసిన అవతలి వైపు తాము పిజ్జాలను ఆన్లైన్లో డెలివరీ చేయడం లేదని, కావాలంటే ఆ మొత్తాన్ని రీఫండ్ చేస్తామని నమ్మబలికాడు. ఇందుకు ఒక లింక్‌ను కూడా షేర్ చేశాడు. సదరు లింక్‌ను ఓపెన్ చేసి ఫోన్‌పే, బ్యాంక్ ఖాతా వివరాలను నమోదు చేయమని చెప్పాడు. ఆ మోసగాడి వలలో పడిన షేక్ తూ.చ తప్పకుండా అతడు చెప్పినట్టే చేశారు. సరిగ్గా ఈ అదనుకోసం చూస్తున్న కేటుగాళ్లు షేక్‌కు చెందిన హెచ్డీఎఫ్సీ ఖాతా నుంచి రూ.45వేలు, ఆంధ్రా బ్యాంక్ నుంచి రూ.50వేలు మొత్తం రూ.95వేలను కాజేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన షేక్ స్థానిక మడివాలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అంతేకాదు ఇలాంటి కేసులు తమ వద్దకు చాలా వస్తున్నాయనీ, నకిలీలింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని మడివాలా పోలీసులు సూచించారు. -
భిక్ష కాదు...లక్ష, కాదు కాదు మూడు లక్షలు...!!
బాప్రే....! భిక్ష...అంటే భిక్ష కాదు.. లక్ష!!. కాదు కాదు మూడు లక్షలు...!!. ఈ దృశ్యం చూస్తుంటే మీకేమనిపిస్తోంది..? ఆరుబయట హుండీ డబ్బులు లెక్కిస్తున్నట్లు లేదూ...!. కానీ ఇది ఓ యాచకుడు ‘కష్టపడి’ సంపాదించిన భిక్షను లెక్కిస్తున్న చిత్రం!. తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలోని ముక్తిలింగవారి వీధిలో అప్పల సుబ్రహ్మణ్యం (75) ఒక పాడుబడిన ఇంట్లో ఉంటున్నాడు. అయినవాళ్లు ఆదరణ లేకపోవడంతో యాచకుడిగా మారాడు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం మృతి చెందాడు. కుటుంబసభ్యులు వచ్చి దహన కార్యక్రమాలు పూర్తి చేశారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం ఇంట్లో సంచులను వెతగ్గా అందులో సుమారు రూ.3 లక్షల వరకూ ఉన్నట్లు గుర్తించారు. కాగా రాజమండ్రిలోని యాచిస్తూ జీవనం గడుపుతూ మరణించిన ఓ వృద్ధ సాధువు జోలె సంచిలో రూ. లక్షా 80 వేల నగదు లభ్యమైన విషయం తెలిసిందే. చదవండి: సాధువు మృతి.. సంచిలో లక్షా 80 వేలు! -
వచ్చే క్వార్టర్‌కల్లా మెరుగుపడతాం
న్యూఢిల్లీ: నిధుల లభ్యతపరంగా ప్రస్తుతం తీవ్ర ఒత్తిళ్లు ఉన్నప్పటికీ సెప్టెంబర్ త్రైమాసికానికల్లా పరిస్థితులు మెరుగుపడగలవని ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఆశిస్తోంది. లిక్విడిటీ(ద్రవ్య లభ్యత) సమస్యల నుంచి బైటపడేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని సంస్థ డైరెక్టర్ (ఫైనాన్స్) ఎస్కే గుప్తా వెల్లడించారు. వివిధ సర్కిల్స్‌లో చీఫ్ జనరల్ మేనేజర్స్ (సీజీఎం)కు రాసిన లేఖలో ఆయన ఈ విషయాలు పేర్కొన్నారు. టారిఫ్‌ల పరమైన పోరుతో టెలికం రంగంలో గతంలో ఎన్నడూ లేనంత తీవ్ర పోటీ నెలకొందని గుప్తా చెప్పారు. ‘లిక్విడిటీ ఒత్తిళ్లను అధిగమించేందుకు బీఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. సమీప భవిష్యత్‌లో కంపెనీ పరిస్థితి మెరుగుపడగలదని అంచనా వేస్తున్నాం’ అని మే 16న రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. పోటీ సంస్థల కారణంగా ఆదాయానికి గండిపడుతున్నా.. కస్టమర్ బేస్‌ను కాపాడుకోగలుగుతున్నామని గుప్తా వివరించారు. -
దుస్తుల్లో రూ.1.36 కోట్లు తరలింపు
సాక్షి ప్రతినిధి, చెన్నై: దుస్తుల్లో దాచి రహస్యంగా రూ. 1.36 కోట్లు తీసుకెళుతున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు వ్యక్తులను చెన్నై ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్ సమీపంలోని వాల్టాక్స్ రోడ్లో సోమవారం ఉదయం అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురిని అధికారులు చూశారు. వారిని దగ్గర్లోని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ప్రశ్నించారు. తనిఖీ చేయగా వారు ధరించిన దుస్తుల నుంచి కట్టలు కట్టలుగా రూ. 1.36 కోట్ల నగదు బయటపడింది. వీరిని విజయవాడకు చెందిన బాషా, శ్రీనివాసులు, ఆంజనేయులు, షేక్ సలీంగా గుర్తించారు. నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలూ లేకపోవడంతో ఎన్నికల్లో పంచేందుకు తరలిస్తున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు. -
ఆధారం లేకుంటే అంతే మరి!
సాక్షి, శ్రీకాకుళం : సార్వత్రిక ఎన్నికలకు నగరా మోగిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో డబ్బే కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులతోపాటు పోలీసులు గట్టి నిఘా పెట్టారు. భారీగా నగదు చేతులు మారే అవకాశం ఉన్నందున నగదు తరలింపును అడ్డుకోవడంపై అధికార యంత్రాంగం పూ ర్తిగా దృష్టి సారించింది. నియోజకవర్గాల వారీగా తనిఖీలు ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా పలుచోట్ల చెక్‌పోస్టులను ఏర్పాటు చే సింది. పోలీసులతోపాటు రెవెన్యూ అధికారులు విస్తృతంగా తనీఖీలు చేపడుతున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. జిల్లాల్లో ఇప్పటికే కొంత నగదుతోపాటు బంగారం, గంజాయి, మద్యం తరలింపులను పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యులకు కూడా ఇబ్బందులు ఎదువరయ్యే అవకాశాలే లేకపోలేదు. ఆధారాలు తప్పనిసరి... ఎన్నికల సంఘం సామాన్యులకు కొంత వెసులుబాటు ఇచ్చింది. వివిధ అవసరాల కోసం ఒక వ్యక్తి రూ.50వేల వరకు తన వెంట తీసుకెళ్లవచ్చు. దీనికి ఎలాంటి ఆధారాలు అక్కర్లేదు. అయితే రూ.50వేల కంటే ఎక్కువ నగదు తరలించే సమయంలో మాత్రం కచ్చితంగా సంబంధిత ఆధారాలను తనిఖీలు జరిపే అధికారులకు చూపించాల్సి ఉంటుంది. లేకుంటే అవస్థలు తప్పవు. తనిఖీల సందర్భంలో సదరు వ్యక్తులు వాగ్వాదానికి దిగినా, అనుచితంగా ప్రవర్తించినా అవన్నీ సీసీ కెమెరాలు, అప్పటికీ పోలీసులు బాడీకి అమర్చకున్న బాడీ కెమెరాల్లో రికార్డు అవుతాయి. అయితే సరైన ఆధారాలు చూపిస్తే డబ్బుకు ఎలాంటి ఢోకా ఉండదు. ఆధారాలు లేకపోతేనే ఇబ్బంది. సీజ్ చేస్తే మాత్రం తిప్పలు తప్పవు.. నగదు పట్టుబడిన సమయంలో తగిన ఆధారాలు చూపకపోతే ఆ వ్యక్తులకు తిప్పలు తప్పవు. సదరు వ్యక్తులు ఏ అవసరం కోసం ఎక్కడి నుంచి ఎక్కడికి నగదు తరలిస్తున్నారో విషయాలు ఆధారాలతో సహా వివరించాలి. తగు ఆధారాలను చూపించాలి. ఆధారాలు సంతృప్తికరంగా ఉంటే చెక్‌పోస్టుల వద్దే వదిలేస్తారు. లేదంటే డబ్బుతోసహా సంబంధిత వ్యక్తిని తహసీల్దార్ వద్ద హాజరుపరుస్తారు. పోలీసులు సీజ్ చేసిన నగదును తొలుత ట్రెజ రీలో డిపాజిట్ చేసి, ఐటీ అధికారులకు సంబంధిత ఫైల్‌ను అప్పగిస్తారు. వారు మ రోసారి ఆధారాలు ఆడుగుతారు. వారికి గాని సక్రమమైన ఆధారాలు చూపకపోతే వారు తిరిగి ఆ ఫైల్‌ను పోలీసులకు పంపుతారు. ఐటీ అధికారుల క్లియరెన్స్ సరి. లేదంటే మాత్రం పోలీసులు కేసు ఫైల్ చేసి, చార్జిషీట్ నమోదుచేస్తారు. కాగా పన్ను కింద ముప్పై శాతం చెల్లించుకుని మిగిలిన మొత్తాన్ని కొన్ని కేసుల్లో తిరిగి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. నేతల వాహనాల కదలికలపై నిఘా.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల, రాజకీయ పార్టీల నాయకుల కదలికలపై పోలీసు శాఖ డేగ కన్ను వేయనుంది. ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థుల తరఫున క్రియాశీలకంగా వ్యవహరించే నాయకులు, వారి వాహనాలపై గట్టి నిఘా వేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికలు ముగిసేవరకు పోలీసులకు సెలవులు ఇవ్వరాదని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి, మఫ్టీ అవతారంలో జిల్లాలోని పలు చోట్ల గట్టి నిఘా పెట్టినట్లు భోగట్టా. -
ఏటీఎంలో నో క్యాష్ : ఎస్బీఐకి ఫైన్
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకుల సేవింగ్ ఖాతాల్లో మినిమం బాలెన్స్ లేకపోతే కస్టమర్లను ఛార్జీలతో బాదేయడం మనకు తెలిసిందే. అయితే ఏటీఎంలో సరిపడినంత నగదు ఉంచడంలో ఫెయిలైన అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐకి భలే షాక్ తగిలింది. కస్టమర్ ఫిర్యాదును విచారించి వినియోగదారుల ఫోరం ఎస్బీఐకు జరిమానా విధించింది. అంతేకాదు ఇంటర్నెట్ ఫెయిల్యూర్, ఎస్బీఐ కస్టమర్ కాదు లాంటి కుంటిసాకులతో తప్పించుకోజూసిన బ్యాంకునకు మొట్టికాయలు కూడా వేసింది. వివరాల్లోకి వెడితే రాయపూర్‌కు చెందిన వినియోగదారుడు ఏటీఎంలో నగదు విత్ డ్రా కోసం వెళ్లినపుడు నో క్యాష్ అవైలబుల్ మెసేజ్ వెక్కింరిచింది. మూడుస్లారు ఇలాంటి చేదు అనుభవం ఎదురు కావడంతో చిర్రెత్తుకొచ్చిన సదరు కస్టమరు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. 2017 ఏడాదిలో మే, జూన్ నెలలో ఒకసారి, మరోసారి ఇలా మూడుసార్లు ఏటీఏంలో నగదు తీసుకోలేకపోయాననీ, ఈ వ్యవహారంలో తనకు న్యాయం చేయాల్సిందిగా కన్జ్యూమర్ ఫోరంలో ఫిర్యాదు చేశారు. దీన్ని విచారించిన కోర్టు అన్నిబ్యాంకులు ఏటీఏం సేవలపై ఏడాదికి ముందే ఫీజు నుకస్టమర్ల వద్దనుంచి వసూలు చేస్తున్నపుడు..ఏటీఏంలో నగదు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ఆయా బ్యాంకులకు ఉందని వినియోగదారుల ఫోరం తన తీర్పులో పేర్కొంది. మూడు సందర్భాల్లో ఏటీఎంలో క్యాష్ లభించపోవడంపై ప్రశ్నించింది. అయితే కేవలం ఇంటర్నెట్ వైఫల్యమని, దీనికి సర్వీసు ప్రొవైడర్ బాధ్యత వహించాలన్న ఎస్బీఐ వాదనను కూడా తోసి పుచ్చింది. అలాగే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయని యూజర్ల నుంచి ఏడాదిలో ముందే ఛార్జి వసూలు చేస్తున్నపుడు ఏటీఎంలలో నగదు లేకుండా ఏలా చేస్తారని ప్రశ్నించింది. రూ.2500 ఫైన్ చెల్లించాలని ఆదేశించింది. కాగా ఎస్బీఐ నెలకు రూ. వెయ్యి-మూడువేల వరకు కనీస నిల్వను ఉంచని పొదుపు ఖాతాల ఖాతాదారుల నుంచి జీఎస్టీ తోపాటు 5-15శాతం జరిమానా వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2017-18 సంవత్సరంలోని ఎనిమిది నెలల కాలంలో 41కోట్ల మంది సేవింగ్స్ ఖాతాదారులను కలిగి ఉన్న ఎస్బీఐ దాదాపు రూ.1772 కోట్లను జరిమానా రూపంలో వసూలు చేసింది. -
ఎన్నికల ఎఫెక్ట్: భారీగా నగదు, మద్యం పట్టివేత
సాక్షి, హైదరాబాద్: పోలింగ్‌కు కొద్ది గంటల సమయం మాత్రమే ఉండటంతో అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించడానికి చివరి ప్రయత్నం చేస్తున్నారు. వారిని వలలో వేసుకోవడానికి నగదు, మద్యం పంచుతున్నారు. దీంతో నిఘా పెంచిన పోలీసులు, ఎన్నికల అధికారలు దాడులు ముమ్మరం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అధికారులు చేపట్టిన తనిఖీల్లో భారీగా నగదు, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పలు చోట్ల నగదును తరలిస్తూ పట్టుబడ్డ వారిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో రూ.3.13 కోట్ల నగదు, రూ.60 లక్షల విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇబ్రహీంపట్నంలో పోలీసులు తనిఖీల్లో ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.5 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నగదు బీఎస్పీ అభ్యర్థికి సంబంధించిందని పోలీసులు గుర్తించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పోలీసుల రాకను గుర్తించి రూ.4 లక్షల నగదును కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు. ఆ నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉప్పల్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. పోలీసుల తనిఖీల్లో పెద్ద ఎత్తున నగదును తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.19 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం త్రీటౌన్ అభిరామ్ అపార్ట్మెంట్లో పోలీసులు భారీగా నగదును పట్టుకున్నారు. డోర్నకల్ కూటమికి చెందిన అభ్యర్థి అనుచరుల నుంచి రూ.26 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీబీనగర్‌లో ప్రత్యేక ఎన్నికల అధికారులు, పోలీసుల విస్తృత తనిఖీలు చేపట్టారు. అధికారలు సోదాల్లో రూ. 2,81,000 నగదు, పెద్ద ఎత్తున మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. ఉప్పల్ రామంతాపూర్‌లో టీడీపీ కార్యాలయంపై ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసులు దాడులు జరిపారు. అధికారుల సోదాల్లో భారీగా నగదు, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. -
చిన్న షేర్లు కరెక్షన్‌లోనే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెద్ద నోట్ల రద్దు తర్వాత బంగారం, రియల్టీల్లో నగదు పరమైన పెట్టుబడులు చాలా వరకూ తగ్గాయి. డిజిటల్ ఇన్వెస్ట్మెంట్స్– అంటే స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు విపరీతంగా పెరిగాయి. దీంతో ఒక్కసారిగా మిడ్, స్మాల్ క్యాప్స్ షేర్లలోకి పెట్టుబడులు వచ్చాయి. ఒకదశలో లార్జ్ క్యాప్స్ షేర్ల కంటే ఇవే జోరు మీదున్నాయి కూడా. కానీ, ప్రస్తుతం మిడ్, స్మాల్ క్యాప్స్ షేర్ల విలువలు బాగా పెరిగిపోయాయని.. దీంతో ఈ ఏడాది జనవరి నుంచి మిడ్, స్మాల్ క్యాప్స్ షేర్లు తిరోగమనంలో సాగుతున్నాయని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అండ్ పోర్ట్‌ఫోలియో మేనేజర్ (ఈక్విటీస్) లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. ఎన్నికల వరకూ అంటే 2–3 త్రైమాసికాల వరకూ పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని.. ఆ తర్వాతే మళ్లీ పరిస్థితి మెరుగుపడే అవకాశముందని ఆయన అంచనా వేశారు. విపణిలోకి కొత్తగా ఈక్విటీ సేవింగ్ ఫండ్‌ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో మాట్లాడారు. ‘మిడ్, స్మాల్ క్యాప్స్‌లో పెట్టుబడులు జోలికి వెళ్లకపోవటమే మంచిది. ఒకవేళ పెట్టాల్సి వస్తే మాత్రం ఐదేళ్ల కాలపరిమితికి మించి ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం’ అని సూచించారు. కాగా వచ్చే నెల 3–17 మధ్య ఫ్రాంక్లిన్ ఇండియా ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ (ఎఫ్ఐఈఎస్ఎఫ్) అందుబాటులో ఉంటుందని కనీసం పెట్టుబడి రూ.5 వేలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. మెటల్, ప్రైవేట్ బ్యాంక్‌లే మేలు.. :ఆయిల్ ధరలు, వడ్డీ రేట్లు పెరగడం, తగిన వర్షపాతంపై అనుమానాలు, వస్తు సేవల పన్ను (జీఎస్టీ), పెద్ద నోట్ల రద్దు వంటివాటితో మార్కెట్లలో ప్రతికూల వాతావరణం నెలకొందని దీంతో కంపెనీలు పెద్దగా లాభాల్లో లేవని.. మొండి బకాయిల (ఎన్పీఏ) భారంతో ప్రభుత్వ రంగ బ్యాంక్‌లూ ఇబ్బందుల్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ప్రైవేటు బ్యాంకులు, మెటల్ కంపెనీలు, ఆటోమొబైల్ కంపెనీల్లో పెట్టుబడులు ఉత్తమమని సూచించారు. 2014–17 మధ్య కాలాన్ని మార్కెట్ల సంవత్సరంగా అభివర్ణించవచ్చన్నారు. ఆయిల్ ధరల పెరుగుదల, ఎన్నికల ప్రభావంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకూ మార్కెట్లు ఒడిదుకుల్లోనే కొనసాగుతాయని తెలిపారు. ఉదాహరణకు 2014లో 6 వేల పాయింట్లుగా ఉన్న నిఫ్టీ, ఎన్నిక సమయంలో తగ్గి.. ప్రస్తుతం మళ్లీ రికార్డు స్థాయిలకు చేరుకుందన్నారు. ఎన్నికల దృష్ట్యా మార్కెట్ ఒడిదుడుకులు తప్పవని విశ్లేషించారు. -
నగదు పరిమితి @ రూ.కోటి!
అహ్మదాబాద్: ప్రజలు గరిష్టంగా రూ.కోటి వరకూ నగదును కలిగిఉండేలా నిబంధనల్ని సవరించాలని జస్టిస్ ఎంబీ షా నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ పరిమితిని దాటి నగదు కలిగిఉంటే మొత్తం డబ్బుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సూచించింది. ప్రజలు గరిష్టంగా కలిగిఉండే నగదు పరిమితిని తొలుత రూ.15 లక్షలు, ఆ తర్వాత రూ.20 లక్షలకు పెంచాలని కొన్నిరోజుల క్రితం కేంద్రానికి సిట్ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై జస్టిస్ షా గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజలు గరిష్టంగా రూ.కోటి మేర నగదును ఉంచుకునేలా నిబంధనల్ని సవరించాలని సిఫార్సు చేశాం. ఈ పరిమితిని మించి నగదు దొరికితే మొత్తం డబ్బుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సూచించాం’ అని చెప్పారు. ఇటీవల తమిళనాడులోని ఓ సంస్థలో ఐటీ దాడుల్లో భారీ ఎత్తున నగదు, బంగారం దొరకడంపై స్పందిస్తూ.. ‘అధికారులు దాడుల్లో స్వాధీనం చేసుకుంటున్న నగదును చూడండి రూ.160 కోట్లు.. 177 కోట్లు. దీనిబట్టి రూ.20 లక్షల నగదు పరిమితి ప్రయోజనకరం కాదని అర్థమవుతోంది’ అని వ్యాఖ్యానించారు. 2014లో నల్లధనం కట్టడికి సుప్రీంకోర్టు ఆదేశాలతో జస్టిస్ ఎంబీ షా(రిటైర్డ్) నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. -
ఇన్వెస్కో ఇండియా గ్రోత్ ఆపర్చూనిటీస్
దీర్ఘకాలంలో మంచి నిధిని సమకూర్చుకోవాలని ఆశించే వారు పరిశీలించ తగిన పథకాల్లో ఇన్వెస్కో ఇండియా గ్రోత్ ఆపర్చూనిటీస్ కూడా ఒకటి. సెబీ ఆదేశాలకు పూర్వం ఈ పథకం పేరు ‘ఇన్వెస్కో ఇండియా గ్రోత్’గా ఉండేది. సెబీ మ్యూచువల్ ఫండ్ పథకాల్లో మార్పులు, చేర్పులకు ఆదేశించిన నేపథ్యంలో ఈ పథకం పెట్టుబడుల విధానమూ మారిపోయింది. గతంలో మల్టీక్యాప్ ఫండ్‌గా ఉన్న ఇది ఎక్కువగా లార్జ్‌క్యాప్‌లో 70–80 శాతం పెట్టుబడులు పెట్టేది. ఇప్పుడు మార్పుల నేపథ్యంలో లార్జ్ అండ్ మిడ్‌క్యాప్‌గా మారిపోయింది. అంటే లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్‌లో 35 శాతం చొప్పున కనీసం ఇన్వెస్ట్ చేయాలి. గత కొన్ని నెలలుగా ఈ పథకం తన పోర్ట్‌ఫోలియోకు మార్పులు చేసింది. మిడ్‌క్యాప్ విభాగంలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసింది. ఫిబ్రవరి నుంచి చూస్తే మిడ్‌క్యాప్స్‌లో 27–34 శాతం మధ్య పెట్టుబడులు ఉన్నాయి. ఈ పథకం ప్రామాణిక సూచీ బీఎస్ఈ 100 నుంచి బీఎస్ఈ 250గా మారిపోయింది. పెట్టుబడుల విధానం ఈ పథకం గతంలో స్టాక్స్ ఎంపికకు బాటమ్ అప్ విధానాన్ని అనుసరించేది. మారిన సమీకరణాల నేపథ్యంలో బాటమ్ అప్, టాప్డౌన్ విధానాలను అనుసరించనుంది. ఆయా రంగాలకు సంబంధించిన అంశాలతో పని లేకుండా స్టాక్స్‌వారీగా ఎంపిక విధానం నుంచి, ఆర్థిక, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా స్టాక్స్ ఎంపికగా విధానం మారిపోయింది. అయినప్పటికీ ఈ పథకం మెరుగైన రాబడులను ఇస్తుందన్న అంచనా ఉంది. స్టాక్స్ ఎంపికలో మంచి ట్రాక్ రికార్డు, అన్ని కాలాల్లోనూ మంచి రాబడులను అందించిన పథకం కావడమే ఈ అంచనాలకు బలం. అధిక రిస్క్ తీసుకునే వారు, మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో ఎక్స్పోజర్ ఎక్కువగా ఉన్నా ఫర్వాలేదనుకునే వారు ఈ పథకాన్ని నిస్సంకోచంగా ఎంచుకోవచ్చు. గత పనితీరు ఏడాది నుంచి ఐదేళ్ల కాలంలో ఈ పథకం రాబడులు నూతన ప్రామాణిక సూచీ అయిన బీఎస్ఈ 250తో పోలిస్తే మెరుగ్గా ఉండడం గమనార్హం. ఏడాది కాలంలో ఇన్వెస్కో ఇండియా గ్రోత్ ఆపర్చూనిటీస్ 17.9 శాతం వార్షిక రాబడులను ఇస్తే, ప్రామాణిక సూచీ రాబడులు 14.9 శాతంగా ఉన్నాయి. మూడేళ్ల కాలంలో ఈ పథకం రాబడులు 11.3 శాతం అయితే, ప్రామాణిక సూచీ రాబడులు 11.8 శాతం. ఐదేళ్ల కాలంలో ఈ పథకం 18.7 శాతం చొప్పున వార్షిక రాబడులను ఇవ్వగా, ప్రామాణిక సూచీ రాబడులు 17.3 శాతంగా ఉన్నాయి. అంటే కేటగిరీని మించి రాబడులను అందించినట్టు తెలుస్తోంది. పథకం కింద ఉన్న నిధుల్లో 95 శాతాన్ని ఇన్వెస్ట్ చేసి నగదు నిల్వలను తక్కువే ఉంచుకుంది. 20 రంగాల నుంచి సుమారు 41 స్టాక్స్‌ను పోర్ట్‌ఫోలియోలో కలిగి ఉంది. బ్యాంకింగ్ రంగానికి ఈ పథకం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. 24 శాతం ఎక్స్పోజర్ కలిగి ఉంది. ఫైనాన్స్, పెట్రోలియం, సాఫ్ట్వేర్ రంగాల్లోనూ చెప్పుకోతగ్గ ఎక్స్పోజర్ తీసుకుంది. -
కూతురిని అమ్మేసి.. ఆపై కట్టుకథ..
సాక్షి, హైదరాబాద్ : నగరంలో దారుణం చోటుచేసుకుంది. నవమాసాలు మోసి పెంచిన కన్న తల్లి రెండేళ్ల కూతురిని 20వేలకు అమ్మేసింది. ఈ విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాలివి.. ఆ పాపను కొందరు బ్రోకర్లు ఓ ఎంపీటీసీ భర్తకు రూ. 80వేలకు అమ్మారు. భర్త కొడతాడనే భయంతో ఓ కట్టుకథ చెప్పింది. గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి పాపను ఎత్తుకెళ్లారని ఆ మహిళ భర్తకు చెప్పి బోరున ఏడ్చింది. దీం అతను వెంటనే ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఆ ప్రాంతంలోని సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్టు చేసి పాపను తల్లిదండ్రులకు అప్పగించారు. -
అలా వచ్చాయి.. ఇలా పోయాయి!
సాక్షి, హైదరాబాద్: ‘మనకు తెలియకుండా మన ఖాతాలో భారీ మొత్తంలో నగదు జమై.. తిరిగి క్షణాల్లో మరో ఖాతాకు బదిలీ అయితే ఎలా ఉంటుంది’.. నిరుద్యోగ ఎస్సీ యువతకు స్వయం ఉపాధి యూనిట్లపై రాయితీలిచ్చే ఎస్సీ కార్పొరేషన్లో ఇలాంటి ఘటనే జరిగింది. ఈ ఏడాది మార్చి 31న రూ.1,500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రుణ రూపంలో కార్పొరేషన్ ఖాతాలో జమ చేసింది. ఏమైందో ఏమోగానీ.. మరుసటి రోజే ఆ మొత్తం తిరిగి ప్రభుత్వ ఖాతాకు వెళ్లిపోయింది. రుణం కావాలని కార్పొరేషన్ దరఖాస్తు చేసుకోకుండానే రుణంరావడం, వెళ్లడంతో ఆ శాఖలో అయోమయం నెలకొంది. నిధులు క్యారీ ఫార్వర్డ్ 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.1,418.88 కోట్లకు ఎస్సీ కార్పొరేషన్ ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సర్కారు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలను కార్పొరేషస్ ప్రారంభించింది. కానీ ఆర్థిక సంవత్సరం చివరి వరకూ నిధులు విడుదల కాకపోవడంతో పలు కార్యక్రమాలు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఈక్రమంలో ఆర్థిక సంవత్సరం చివరి రోజైన మార్చి 31న ఆ శాఖ ఖాతాలో రూ.1,500 కోట్లు రుణ రూపంలో రావడం.. మరుసటి రోజు తిరిగి సర్కారు ఖాతాకు వెళ్లిపోవడం జరిగింది. ఆ శాఖ ఖాతా స్టేట్మెంట్ను చూసిన కార్పొరేషన్ ఉన్నతాధికారులు.. రుణం రావడం, తిరిగి పోవడం చూసి అవాక్కయ్యారు. అయితే ఆ శాఖ బడ్జెట్లో రుణం జతకావడంతో 2018–19 ఆర్థిక సంవత్సరం గత నిధులు క్యారీఫార్వర్డ్ అయ్యాయి. దీంతో నిధులు లేక నిలిచిపోతాయనుకున్న పథకాలను అమలు చేసే అవకాశం లభించింది. ఈ సారీ రూ.1,500 కోట్లతో ప్రణాళిక 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.1,560.77 కోట్లతో వార్షిక ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి ఎస్సీ కార్పొరేషన్ నివేదించింది. కాగా, ఇటీవల కార్పొరేషన్‌కు రూ.250.57 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు బీఆర్ఓ (బడ్జెట్ రిలీజింగ్ ఆర్డర్) కూడా విడుదలైంది. కానీ వీటిని ఎలా ఖర్చు చేయాలనే అంశంపై స్పష్టత లేకపోవడంతో నిధులున్నా ఖర్చు చేయలేక కార్పొరేషన్ అయోమయంలో పడింది. -
ప్రజల వద్ద 18.5 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుతం ప్రజల వద్ద ఉన్న నగదు స్థాయి గరిష్టానికి చేరుకుందనీ, 2016లో నోట్ల రద్దు తర్వాత జనం చేతుల్లో ఉన్న డబ్బుకు రెండింతలకుపైగా ఇప్పుడు ఉందని ఆర్బీఐ పేర్కొంది. 2016 నవంబర్ 8 అర్ధరాత్రి నుంచి పాత రూ.1,000, పాత రూ. 500 నోట్లను ప్రభుత్వం చలామణి నుంచి ఉపసంహరించడం తెలిసిందే. 2016 డిసెంబర్ 9 నాటికి ప్రజల వద్ద ఉన్న నోట్ల విలువ 7.8 లక్షల కోట్ల రూపాయలు కాగా, ఈ ఏడాది మే 25 నాటికి 18.5 లక్షల కోట్ల రూపాయల విలువైన నోట్లు జనం దగ్గర ఉన్నా యని ఆర్బీఐ వెల్లడించింది. అలాగే నోట్లరద్దు అనంతర రోజులతో పోలిస్తే ప్రస్తుతం రెండింతలకు పైగా నగదు చలామణిలో ఉందంది. 2017 జనవరి 6 నాటికి రూ. 8.9 లక్షల కోట్లు చలామణిలో ఉండగా, ఈ నెల 1 నాటికి అది రూ. 19.3 లక్షల కోట్లకు చేరుకుందంది. ప్రజల్లో ఉన్న నగదు, బ్యాంకుల వద్ద ఉన్న నగదు.. రెండింటినీ కలిపి చలామణిలో ఉన్న నగదుగా పరిగణిస్తారు. రెండు, మూడు నెలల క్రితం అనేక రాష్ట్రాల్లో నగదు కొరత ఏర్పడినా, ఆర్బీఐ గణాంకాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉండటం గమనార్హం. కొందరు వ్యక్తులు వివిధ కారణాలతో భారీ స్థాయిలో డబ్బును బ్యాంకుల నుంచి ఉపసంహరించుకుని, చలామణిలోకి తేకుండా దాచిపెట్టడం వల్లే కృత్రిమ కొరత ఏర్పడి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
కర్ణాటకలో ఐటీ దాడులు.. 10 కోట్లు స్వాధీనం
న్యూఢిల్లీ/బెంగళూరు: బెంగళూరు, దావ ణగెరే, మైసూర్లలోని కాంట్రాక్టర్ల ఇళల్లో జరిపిన సోదాల్లోరూ.4.01కోట్ల నగదు, 6.5 కిలోల నగలు లభ్యమైనట్లు ఐటీ శాఖ తెలిపింది. ఓ బ్యాంకులోని బినామీ లాకర్లో దాచి ఉంచిన రూ.6.76 కోట్ల నగదును గుర్తించింది. దీంతో గత రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా జరిపిన తనిఖీల్లో సుమారు రూ.20.14 కోట్ల నగదు పట్టుబడినట్లయింది.మరోవైపు, శుక్రవారం దేవనహళ్లి తాలూకా బాలేపుర చెక్‌పోస్టులో నిర్వహించిన తనిఖీల్లో ఓ వాహనంలో 58 కేజీల బంగారం పట్టుబడింది. ఫారూక్ జైన్ అనే వ్యక్తి దేవనహళ్లి నుంచి హొసకోట వైపు బొలెరోలో వెళ్తుండగా, పోలీసులు ఆపి తనిఖీ చేయగా ఈ బంగారం బయటపడింది. -
బిజినెస్ రంగంలో నయా ట్రెండ్..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని శివార్లలోని ఆదిభట్ల ప్రాంతంలో ఉన్న ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేసే వెంకటేశ్వర్రావు అదనపు ఆదాయం కోసం వ్యాపార మార్గం పట్టాడు. అన్నిరంగాల వారికి అవసరమయ్యే పని అయితే ఆదరణ ఉంటుందని గుర్తించి.. రెస్టారెంట్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఆలోచనను తన తోటి నలుగురు సహచరులకూ చెప్పాడు. జీతానికి తోడుగా మరింత ఆదాయం సంపాదించవచ్చనే వారూ ముందుకు వచ్చారు. తలా రూ.5 లక్షల చొప్పున పెట్టుబడి పెట్టి రెస్టారెంట్ ప్రారంభించారు. ఇలా కేవలం వెంకటేశ్వర్రావు, అతడి స్నేహితులు మాత్రమేకాదు.. హైదరాబాద్‌లో ఎంతో మంది ఐటీ ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం బిజినెస్ అడుగులు వేస్తున్నారు. అందులో కొందరు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడుతుంటే.. మరికొందరు రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు వంటివి ప్రారంభిస్తున్నారు. ఇలా ‘అదనపు’ మార్గం పడుతున్నవారిలో సగం మంది వరకు కేవలం తమ వాటా పెట్టుబడి పెట్టి, లాభాలు పంచుకుంటుండగా... మిగతావారు నేరుగా వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. ఇక బ్యాంకు రుణాలతో ఇళ్లు కొనుగోలు చేసి, అద్దెకివ్వడం.. ఈ అద్దె సొమ్ముతోనే రుణ వాయిదాలు కట్టేసి ఇళ్లు సొంతం చేసుకోవడం వంటివి చేస్తున్నవారూ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. సగం మందికిపైగా.. హైదరాబాద్‌లోని ఐటీ సంస్థల్లో సుమారు 6 లక్షల మంది వరకు ఉద్యోగులు ఉన్నట్టు అంచనా. ఇందులో సగం మందికిపైగా తమ ఉద్యోగానికి తోడు అదనపు సంపాదన మార్గంపై దృష్టి సారించారని ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. ఇందులో చాలా మంది తమ ఆదాయాన్ని మంచి రాబడులు ఇచ్చే పెట్టుబడులకు, భూములు, ఇళ్ల కొనుగోళ్లకు మళ్లిస్తుండగా.. కొందరు నేరుగా వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. ఐదారుగురు టెకీలు కలసి హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు వంటివి నెలకొల్పుతున్నారు. ముఖ్యంగా టెకీల్లో సగం మంది వరకు స్టాక్ మార్కెట్లో, పెద్దగా రిస్కు లేని మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెడుతున్నారు. మరో 20 శాతం మంది వరకు రియల్ ఎస్టేట్, ఫ్లాట్లు, ఇళ్ల, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, ఐస్‌క్రీం పార్లర్లు వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతున్నారు. నలుగురు కలసి.. వరంగల్‌కు చెందిన వెంకటేశ్వర్రావు అనే టెకీ.. ముగ్గురు సహచరులతో కలసి రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించారు. నలుగురు కలసి తలా పది లక్షలు వేసుకుని, బ్యాంకుల నుంచి మరో రూ.24 లక్షలు రుణం తీసుకుని పెట్టుబడి పెట్టారు. రూ.60 లక్షలతో శామీర్‌పేట ప్రాంతంలో ఎకరం భూమిని కొనుగోలు చేసి.. విల్లాల కోసం డెవలప్మెంట్కు ఇచ్చారు. ఏడాది తిరిగేలోపు అక్కడ భూమి విలువ పెరగడంతోపాటు విల్లాల నిర్మాణం కూడా పూర్తయ్యే దశకు వచ్చింది. దానిని విక్రయించడంతో వారికి పెట్టుబడి పోను ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున లాభం వచ్చింది. ఇలా చాలా మంది టెకీలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. మరికొందరు సొంతంగా ఫ్లాట్ల బిజినెస్ చేస్తున్నారు. కొందరు తమ వద్ద ఉన్న సొమ్ముతో, బ్యాంకు రుణాలతో ఇళ్లను కొనుగోలు చేసి.. అద్దెకు ఇస్తున్నారు. ఆ అద్దెలనే రుణ వాయిదాలుగా చెల్లిస్తూ.. ఇళ్లను సొంతం చేసేసుకుంటున్నారు. ఇంకొందరు బిల్డర్లకు పెట్టుబడిగా డబ్బులు సమకూర్చి.. లాభాల్లో 10 శాతం వరకు వాటాగా తీసుకుంటున్నారు. ‘ఫుడ్’ వ్యాపారాలే ఎక్కువ.. చాలా మంది టెకీలు.. పెట్టుబడి తక్కువగా ఉండటం, సులభంగా వ్యాపారం చేయగలగడం, నష్టాలు వచ్చే అవకాశాలు లేకపోవడంతో రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టుల వంటి వ్యాపారాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇలా ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉండే ఆదిభట్ల, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో.. రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, కెఫేల వంటివాటిని ప్రారంభించారు. నలుగురైదుగురు కలసి ఒక్కొక్కరు రూ.రెండు మూడు లక్షల వరకు పెట్టుబడులు పెట్టి.. ఈ వ్యాపారాలు పెడుతున్నారు. ఎవరైనా తెలిసినవారిని పెట్టుకుని వాటిని నడిపిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో వెళ్లి వాటిని చూసుకుంటున్నారు. కొందరు టెకీలు బార్లు, పబ్బుల వంటివాటిల్లోనూ పెట్టుబడులు పెట్టి.. వాటాలు తీసుకుంటున్నారు. ఐస్‌క్రీమ్‌లు.. మిల్క్ షేక్‌లు.. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో టెకీగా పనిచేసిన శివప్రసాద్ కొత్త కాన్సెప్ట్‌తో వ్యాపారంలోకి దిగారు. ఏపీలోని విశాఖపట్నం, విజయవాడల్లో మిల్క్‌షేక్, షేకెన్ స్లైస్ పేరుతో ఔట్లెట్లు ప్రారంభించారు. ఒక్కోదానికి రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టగా.. రోజుకు రూ.30 వేల వరకు విక్రయాలు జరుగుతున్నాయి. అందులో రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు లాభం ఉంటోందని శివప్రసాద్ చెప్పారు. ఇప్పుడు హైదరాబాద్‌లోనూ రెండు ఔట్లెట్లు పెట్టేందుకు శివప్రసాద్ ప్రయత్నిస్తున్నారు. ఇక బాగా క్రేజ్ ఉన్న ఐస్‌క్రీమ్ పార్లర్లవైపు కూడా టెకీలు దృష్టి సారించారు. ఖమ్మంకు చెందిన రమేశ్ రూ.12 లక్షలు పెట్టుబడి పెట్టి జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రముఖ ఐస్‌క్రీం పార్లర్లో 20శాతం వాటా తీసుకున్నారు. హోం డెలివరీ చేయడానికి ఓ ప్రత్యేకమైన యాప్ సైతం తయారు చేయించారు. ఆయన పదో తరగతి స్నేహితులు వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. వేతనాల్లో పెరుగుదల తక్కువగా ఉండటంతోనూ.. ఐటీ ఉద్యోగాల్లో భారీగా వేతనాలు అందడం వాస్తవమే అయినా.. కొంతకాలంగా వేతనాల్లో పెరుగుదల తక్కువగా ఉంటోందని కొందరు టెకీలు పేర్కొంటున్నారు. కొన్నేళ్ల కింద ఏటేటా వేతనాల పెరుగుదల భారీగా ఉండేదని.. ఇప్పుడు ఏటా ఐదు నుంచి పది శాతం మేర మాత్రమే వేతనాలు పెరుగుతున్నాయని అంటున్నారు. దీనికితోడు తమ ఆదాయాన్ని మంచి పెట్టుబడిగా పెట్టి.. మరింత ఆదాయం పొందాలన్న ఆలోచన కారణంగా వ్యాపారాల వైపు దృష్టి సారిస్తున్నట్టు చెబుతున్నారు. -
ఏటీఎంలకు మోదీ పంచ్!!
సాక్షి, బిజినెస్ విభాగం : వైట్ లేబుల్ ఏటీఎంల (డబ్ల్యూఎల్ఏ) గురించి మనకి తెలిసిందే. అందరికీ ఆర్థిక సేవలను అందుబాటులోకి తీసుకురావడం కోసం ఆర్బీఐ పలు నాన్ బ్యాంకింగ్ సంస్థలకు డబ్ల్యూఎల్ఏ లైసెన్స్‌లిచ్చింది. కాకపోతే లైసెన్స్లిచ్చిన సంస్థలకు ఆ ఏటీఎంలలో పెట్టడానికి క్యాష్ మాత్రం ఇవ్వటం లేదు. పెద్ద నోట్ల రద్దు, ఇంటర్చేంజ్ చార్జీల తగ్గింపు వంటి అంశాలు తమ కార్యకలాపాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయని ఆపరేటర్లు వాపోతున్నారు. ఇండీక్యాష్దే తొలి ఏటీఎం డబ్ల్యూఎల్ఏ ఏటీఎంల ఏర్పాటుకు 2013లో ఆర్బీఐ లైసెన్స్‌లను జారీ చేసింది. టాటా గ్రూప్‌కు చెందిన ఇండీక్యాష్ తొలిగా ఈ ఏటీఎంలను ఏర్పాటు చేసింది. బీటీఐ పేమెంట్స్, హిటాచీ పేమెంట్స్ వంటి పలు సంస్థలు డబ్ల్యూఎల్ఏ ఏటీఎంలను నిర్వహిస్తున్నాయి. అయితే ఆర్బీఐ, ఆపరేటర్లు అంచనా వేసిన మాదిరి కాకుండా ఏటీఎంల ఏర్పాటు చాలా నెమ్మదిగా ఉంది. ఇండీక్యాష్, బీటీఐ పేమెంట్స్ సంస్థలకు వరుసగా 8,500, 4,800 ఏటీఎంలున్నాయి. ఇవి రెండూ లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమయ్యాయి. ‘ఏటీఎంల ఏర్పాటు సులువేమీ కాదు. అందుకే మేం లక్ష్యాలను చేరుకోలేకపోయినా రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) మాపై జరిమానా విధించడం లేదు. ఎవ్వరూ లక్ష్యాలను అందుకోలేదు. ఆర్బీఐ ఒకవేళ జరిమానా విధిస్తే సంస్థలు వాటి లైసెన్స్‌ను తిరిగి అప్పగించే అవకాశముంది’ అని ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ డబ్ల్యూఎల్ఏ హెడ్ నశ్విన్ నొరొన్హా తెలిపారు. పెద్ద నోట్ల రద్దు వల్ల తలెత్తిన నగదు కొరత డబ్ల్యూఎల్ఏ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం చూపిందని ఎఫ్ఐఎస్ ఏటీఎం అండ్ అలైడ్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ రాధా రామదొరై పేర్కొన్నారు. లక్ష్యాలను చేరుకోలేకపోవడానికి నోట్ల రద్దు ప్రధాన కారణమని బీటీఐ పేమెంట్స్ ఆరోపించింది. దీని వల్ల 8–10 నెలల పాటు వ్యాపారాన్ని కోల్పోయామని పేర్కొంది. ‘మూడో ఏడాది డీమోనిటైజేషన్ వల్ల సవాళ్లను ఎదుర్కొన్నాం. కొత్త ఏటీఎంలను ఏర్పాటు చేయడం తెలివి తక్కువ చర్య’ అని బీటీఐ పేమెంట్స్ సీఈవో, ఎండీ కె.శ్రీనివాస్ తెలిపారు. డీమోనిటైజేషన్‌కు ముందు జోరుగానే.. పెద్ద నోట్ల రద్దు తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందని డబ్ల్యూఎల్ఏ ఆపరేటర్లు చెప్పారు. ‘డీమోనిటైజేషన్‌కు ముందు వృద్ధి వేగంగా ఉంది. కానీ నోట్ల రద్దు తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. అందుకని నగదు సరఫరా ఉన్న ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడం ప్రారంభించాం’ అని టాటా కమ్యూనికేషన్ పేమెంట్ సొల్యూషన్స్ సీఈవో సంజీవ్ పటేల్ తెలిపారు. శ్రేయీ ఇన్ఫ్రా తన డబ్ల్యూఎల్ఏ ఏటీఎం కార్యకలాపాలను మూసివేయడానికి నోట్ల రద్దే కారణం. 9,000 ఏటీఎంల ఏర్పాటుకు లైసెన్స్ దక్కించుకున్న శ్రేయీ మార్చిలో తన లైసెన్స్‌ను వెనక్కు ఇచ్చేసింది. ‘అందరికీ ఆర్థిక సేవలను అందుబాటులోకి తీసుకురావడం కోసం డబ్ల్యూఎల్ఏ మోడల్‌ను ఆవిష్కరించారు. ప్రసుత్త ఇంటర్చేంజ్ ధరలు, డబ్ల్యూఎల్ఏ ఏటీఎంలకు నగదు కొరత వంటి అంశాల నేపథ్యంలో ఈ మోడల్ ఆశించినంత స్థాయిలో వృద్ధి సాధించలేకపోయింది’ అని హిటాచీ పేమెంట్ సర్వీసెస్ ఎండీ లోనీ ఆంటోనీ తెలిపారు. ఇంటర్చేంజ్ చార్జీలు రూ.15కి తగ్గింపు డబ్ల్యూఎల్ఏ ఆపరేటర్లు ప్రతి లావాదేవీకీ బ్యాంకుల నుంచి కొంత ఫీజు వసూళ్లు చేస్తాయి. దీన్ని ఇంటర్చేంజ్ చార్జీ అంటారు. అయితే దీన్ని రూ.18 నుంచి రూ.15కి తగ్గించారు. ఇది డబ్ల్యూఎల్ఏ ఆపరేటర్లపై ప్రతికూల ప్రభావం చూపించింది. ‘గ్రామాల్లో నగదు సరఫరా వ్యయాలు ఎక్కువ. దీని వల్ల మెట్రోలతో పోలిస్తే ఆయా ప్రాంతాల్లో ట్రాన్సాక్షన్ చార్జీలు ఎక్కువగా ఉండాలి’ అని బీటీఐ పేమెంట్స్ పేర్కొంది. ‘డబ్ల్యూఎల్ఏ నెట్వర్క్ నిర్వహణకు అయ్యే ఖర్చు ట్రాన్సాక్షన్ ఫీజు రూ.20 కన్నా ఎక్కువగా ఉంది. పరిశ్రమ ఇంటర్‌బ్యాంక్ చార్జీల పెంపునకు డిమాండ్ చేస్తోంది’ అని ఎన్సీఆర్ కార్పొరేషన్ ఎండీ నౌరోజ్ దస్తూర్ తెలిపారు. డబ్ల్యూఎల్ఏ మోడల్ వ్యాపారానికి యూనిట్ స్థాయి లాభదాయకత అవసరమని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ (సీఏటీఎంఐ) అభిప్రాయపడింది. ఉచిత లావాదేవీల పరిమితిని పరిశీలించాలి రిజర్వు బ్యాంక్ 2014లో తీసుకువచ్చిన ఏటీఎంల ఉచిత లావాదేవీలపై పరిమితిని ఒకసారి పునఃపరిశీలించాలని ఆపరేటర్లు కోరారు. ‘పరిమితి వల్ల ఏటీఎంల వినియోగంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. మాల్వేర్ దాడులు, మోసాలు వంటి సమస్యల నుంచి ఏటీఎంల భద్రతకు అవసరమైన ఇన్వెస్ట్మెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఏటీఎంల నిర్వహణ వ్యయాలు అధికంగా ఉండటం, నగరాల్లో ట్రాన్సాక్షన్లు తగ్గడం వంటి అంశాలు ఏటీఎంలపై ప్రతికూల ప్రభావం చూపాయి’ అని సీఏటీఎంఐ ట్రెజరర్, యూరోనెట్ సర్వీసెస్ ఇండియా ఎండీ హిమాన్సు పుజారా పేర్కొన్నారు. కాగా ఇంటర్చేంజ్ ఫీజును పెంచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని డబ్ల్యూఎల్ఏ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు. ఆర్బీఐ ఇంటర్చేంజ్ చార్జీల విధింపు ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)కి అప్పగించింది. ఎన్పీసీఐ స్టీరింగ్ కమిటీ ప్రభుత్వ రంగ బ్యాంకులకు అనుకూలంగా ఉంటుంది. బ్యాంకులేమో ఇంటర్చేంజ్ చార్జీల పెంపును అడ్డుకుంటున్నాయి’ అని ఆయన తెలిపారు. -
సైనికుల ఇళ్లలో చోరీ.. అధికారులు షాక్..!
సాక్షి, టీనగర్: రక్షణ కల్పించే సైనికుల ఇళ్లకు భద్రతా కరువైంది. మిలటరీ క్వార్టర్స్‌లో వరుసగా మూడు ఇళ్లలో నగదు, నగలు చోరీకి గురయ్యాయి. ఈ ఘటన చెన్నై పోర్ట్ రైల్వేస్టేషన్ సమీపంలోని నేవీ నగర్లో చోటుచేసుకుంది. వివరాలివి.. ఈ నేవీ నగర్లో మిలిటరీ, నేవీ సైనికులు నివశిస్తున్నారు. ఇక్కడ సాయుధ సైనికులు అన్ని వేళలా రక్షణ చర్యలు చేపడుతుంటారు. కానీ, ఆదివారం ఉదయం నేవీ అధికారులు సర్కార్తీజి, అఖిలేష్‌కుమార్, సెంథిల్‌కుమార్ ఇళ్ల తాళాలు పగులగొట్టి ఉన్నాయి. సమీపంలో నివశించే అధికారులు దీన్ని గమనించి షాక్‌కు గురయ్యారు. వారు వెంటనే పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. క్లూస్ టీం నిపుణులతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించారు. అయితే వేరే ఊర్లకు వెళ్లిన అధికారులు వచ్చిన తర్వాతే నగదు, నగలు ఏమేరకు చోరీకి గురయ్యాయనే విషయం తెలుస్తుందని పోలీసులు తెలిపారు. -
మందు కోసం ఓ యువకుడి దుశ్యర్య..
సాక్షి, అన్నానగర్: మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన ఓ యువకుడు బంధువుల ఇంటికి నిప్పుపెట్టాడు. ఈ ఘటన చెన్నైలోని కుమారపురం సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. మంటలు పెట్టిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. తక్కలై సమీపం కుమారపురం, శాంతమ్మ(70) భర్త మృతిచెందడంతో తక్కలై సమీపం కుమారపురం ఒంటరిగా నివశిస్తోంది. ఈమె బంధువుల కుమారుడు రఘు(33) . అతను కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇతను శాంతమ్మ ఇంటి సమీపంలో నివసిస్తున్నాడు. రఘుకి మద్యం సేవించే అలవాటు ఉంది. తరచూ శాంతమ్మ దగ్గర మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలని వేధించేవాడు. ఎప్పటిలాగే మంగళవారం రఘు మద్యం సేవించడానికి నగదు అడిగాడు. ఇందుకు శాంతమ్మ అంగీకరించలేదు. ఆవేశంతో రఘు శాంతమ్మ ఇంటికి మంటలు అంటించి పరారయ్యాడు. గమినించిన స్థానికులు వెంటనే మంటలను ఆర్పారు. అంతలోనే ఇంటి పైకప్పు మొత్తం కాలి బూడిదైంది. కొట్రికాడు పోలీసులు కేసు నమోదు చేసి రఘుని అరెస్టు చేశారు. -
బ్యాంకులు హ్యాండ్సప్
కడపలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు.. ఇటీవల ఆర్బీఐని నగదు కావాలని అభ్యర్థించింది. అంతే.. మూడు లారీల్లో రూ.2 కోట్లను పంపారు! అదేంటి లారీల్లో ఎందుకు పంపారంటారా? పంపినవన్నీ రూ.10 నాణేలు మరి! కూలీలను పెట్టి మరీ ఆ బస్తాలను దించుకుంది బ్యాంకు యాజమాన్యం. ఆర్బీఐ వద్ద తగినన్ని నోట్లు లేకపోవడంతో ఇలా నాణేల్ని పంపాల్సి వచ్చింది! – నోట్ల కష్టాలకు ఇదో ఉదాహరణ సాక్షి, బిజినెస్ విభాగం : పెద్ద నోట్ల రద్దు.. జనం నెత్తిన ఓ పిడుగు! దాచుకున్న డబ్బులు చేతికివ్వలేని బ్యాంకులపై జనం విశ్వాసం తగ్గటానికదే నాంది. ఆ తర్వాత ఒక్కొక్కరిగా ఎగవేతదారులు బయటపడటంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది. ఇంతలో.. ఎఫ్ఆర్డీఐ బిల్లు వస్తోందంటూ కథనాలు ఖాతాదారుల్ని కంగారెత్తించాయి. రెండు లక్షలకన్నా ఎక్కువ డిపాజిట్ చేసినవారికి వచ్చిన ఐటీ నోటీసులు.. ఆ కంగారును మరింత పెంచాయి. ఇక వీటన్నిటినీ మరిచిపోయే దెబ్బకొట్టాడు నీరవ్ మోదీ. రూపాయి హామీ లేకుండా ఏకంగా 11,400 కోట్లను దేశం దాటించేసి తానూ పరారైన నీరవ్.. భారతీయ బ్యాంకుల ఆయువుపట్టుపై కొట్టాడు. ఆ దెబ్బ జనం విశ్వాసానికి రాసిన మరణ శాసనమే! నిపుణుల మాటల్లో చెప్పాలంటే.. వీటి నుంచి మన బ్యాంకులు తేరుకోవటం అంత తేలికేంకాదు!! నిపుణుల హెచ్చరికలు పక్కనపెడదాం! మనకు తక్షణం ఎదురవుతున్న ప్రమాదమేంటి? ఇంకేముంది. మళ్లీ పెద్ద నోట్ల రద్దునాటి పరిస్థితే. అప్పట్లోనైతే కొత్త నోట్లు లేవు. కాబట్టి ఏటీఎంల్లో, బ్యాంకుల్లో కటకట. మరి 15 నెలల తర్వాత.. అదికూడా వేల కోట్ల నగదును ముద్రించి పంపించాక కూడా ఎందుకిలా? ఎందుకంటే వరస పరిణామాలతో బెంబేలెత్తుతున్న జనం.. బ్యాంకుల్లో డిపాజిట్లను తగ్గించేశారు. కొందరు మానేశారు. వేతన జీవులు జీతం పడితే రెండ్రోజుల్లోనే ఖాళీ చేసేస్తున్నారు. చేతికందిన నోట్లను ఇళ్లలో ఉంచుకుంటున్నారు తప్ప వడ్డీకి ఆశపడి బ్యాంకుల్లో వేయటం లేదు. నగదు దందాలు మరింత పెరిగిపోయాయి. ఖాతాదారులు బ్రాంచీకి వచ్చి విత్‌డ్రా చేసినా తామేమీ చేయలేమని చేతులెత్తేస్తున్నాయి పలు బ్యాంకులు. మున్ముందు డిపాజిట్ల పరిస్థితి ఇలాగే సాగితే..? అమ్మో!! ఆ సంక్షోభాన్ని ఊహించలేం!! తగ్గిన డిపాజిట్లు.. పెరిగిన విత్‌డ్రాలు పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు కొరతతో మూతపడ్డ ఏటీఎంలలో 25 శాతం ఇప్పటికీ తెరుచుకోలేదు. నిజానికి గతేడాది మే తర్వాత పరిస్థితులు చాలావరకూ సద్దుమణిగాయి. మళ్లీ నగదు వ్యవస్థ కళకళలాడింది. కాకపోతే ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ (ఎఫ్ఆర్డీఐ) బిల్లు రానుందని వచ్చిన కథనాలు ఖాతాదారుల్లో వణుకు పుట్టించాయి. ఈ బిల్లుతో డిపాజిట్లకు గ్యారంటీ ఉండదని, బ్యాంకులు తమ ఇష్టానుసారం డిపాజిట్లను ఉంచేసుకుంటాయని కథనాలొచ్చాయి. దీనికితోడు 2 లక్షలకన్నా ఎక్కువ డిపాజిట్ చేసినవారికి ఐటీ నోటీసులు. వీటన్నింటినీ మించి నీరవ్ మోదీ దెబ్బ! ఈ పరిణామాలన్నీ బ్యాంకులపై జనానికి ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీశాయి. దీంతో కొత్త డిపాజిట్లు తగ్గాయి. అదే సమయంలో నగదు విత్‌డ్రాలు పెరిగాయి. బ్యాంకుల్లో దాచుకున్న ఎఫ్‌డీలతోపాటు జన్‌ధన్ ఖాతాలనూ రద్దు చేసుకొని నగదు వెనక్కి తీసుకుంటున్నారు. ఈ దెబ్బకు బ్యాంకులలో గల్లా పెట్టెలు ఖాళీ అయ్యాయి. ‘‘బ్యాంకింగ్ వ్యాపారం, ఆదాయంలో 70 శాతం ప్రభుత్వ రంగ బ్యాంక్‌లదే. దీన్ని కూకటివేళ్లతో సహా పెకిలించేందుకు కొందరు కార్పొరేట్లు పథకం వేశారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని 60 శాతం బ్యాంకుల్లో డబ్బుల్లేవు’’అని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ ఫెడరేషన్ నేషనల్ అడ్వైజర్ హర్షవర్ధన్ మాడభూషి చెప్పారు. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకుల్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉందని ‘సాక్షి’ప్రతినిధితో పేర్కొన్నారు. సేవింగ్స్ ఖాతాల నుంచి ఒక్కసారిగా సొమ్ము విత్‌డ్రా అవుతుండటమే నగదు కొరతకు ప్రధాన కారణమని మరో అధికారి చెప్పారు. ‘‘గతంలో సేవింగ్స్ ఖాతాలో వేతనం పడ్డాక నాలుగైదు రోజుల వరకూ ఖాతాల్లో సగానికి పైగా డబ్బుండేది. కానీ పెద్దనోట్ల రద్దు తర్వాత అకౌంట్లో జీతం పడిన 10 గంటల్లోపు డ్రా చేసేస్తున్నారు’’అని ఎస్బీఐ చీఫ్ మేనేజర్ ఒకరు వ్యాఖ్యానించారు. పరిస్థితి మారిందిలా.. నిజానికి దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో ఎప్పుడూ రుణాలకన్నా డిపాజిట్లు దాదాపు 40 లక్షల కోట్ల మేర అధికంగా ఉంటాయి. ఆర్బీఐ గణాంకాల ప్రకారం డిసెంబర్ నాటికి డిపాజిట్లు రూ.125 లక్షల కోట్లు కాగా మొత్తం రుణాలు రూ.85 లక్షల కోట్లు. కానీ తర్వాత ఈ పరిస్థితి పూర్తిగా మారింది. అందువల్లే ఇబ్బందులు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ‘‘తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో 6,552, తెలంగాణలో 4,875 బ్యాంక్ బ్రాంచీలున్నాయి. వీటిల్లో 8 కోట్ల ఖాతాలున్నాయి. ఇక్కడ రూ.లక్ష కోట్ల వరకు డిపాజిట్లుంటే.. రూ.90 వేల కోట్ల వరకు రుణాలుంటాయి’’అని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రీజినల్ రూరల్ బ్యాంక్ ఆఫీసర్స్ జనరల్ సెక్రటరీ ఎస్.వెంకటేశ్వర్ రెడ్డి చెప్పారు. ‘‘డిపాజిట్ల కంటే విత్‌డ్రాలు పెరిగాయి. దీంతో అనధికారికంగా నగదు ఉపసంహరణలపై నియంత్రణ పెట్టాం. రోజుకు గ్రామాల్లో రూ.5 వేలు, పట్టణాల్లో రూ.10–30 వేలకు మించి ఇవ్వటం లేదు’’అని ఓ బ్యాంకు ఉన్నతాధికారి చెప్పారు. బ్యాంక్‌లకు రాని రూ.2 వేల నోట్లు సాధారణంగా జాతీయ బ్యాంక్‌కు రోజుకు రూ.60 లక్షల నగదు కావాలి. ఇందులో రూ.30 లక్షలు బ్యాంకులో పంపిణీకి, 20 లక్షలు ఏటీఏంలో పంపిణీకి, రూ.10 లక్షలు రిజర్వ్‌గా ఉపయోగపడతాయి. కానీ గత ఆరేడు నెలలుగా వచ్చే నగదు రూ.20 లక్షలకు మించట్లేదని ఓ సీనియర్ బ్యాంక్ అధికారి చెప్పారు. ‘‘ఆరేడు నెలలుగా బ్యాంకుల్లో రూ.2 వేల నోట్ల డిపాజిట్లు పూర్తిగా తగ్గిపోయాయి. సగటున బ్యాంక్ బ్రాంచీకి రోజూ రూ.10 లక్షల విలువైన రూ.2 వేల నోట్లు వస్తాయి. కానీ రెండు నెలలుగా ఇవి 4 లక్షలకు పడిపోయాయి. జనం తమ వద్దకు వచ్చిన రూ.2 వేలు, రూ.500 నోట్లను తమ వద్దే ఉంచుకుంటున్నారు’’అని ఆయన చెప్పారు. గత ఆరేడు నెలలుగా జన్‌ధన్ ఖాతాల్లోని సొమ్మును కూడా ఖాతాదారులు విత్‌డ్రా చేసుకుంటున్నట్లు ప్రముఖ ప్రైవేటు బ్యాంకు అధికారి ఒకరు చెప్పారు. జీరో సొమ్ముతో జన్‌ధన్ ఖాతాలు ఆరంభమైనా.. తర్వాత వీటిల్లో కనీసం రూ.100 ఉంచాలన్న నిబంధన పెట్టారు. దీంతో చాలా మంది ఖాతాలు మూసేశారు. ఖాళీ ఖాతాలను నిర్వహించడం, పర్యవేక్షించడం భారంగా మారుతుండటంతో 40 శాతం ఖాతాల్ని తొలగించే పనిలో ఉన్నామని మరో బ్యాంకు అధికారి చెప్పారు. ఏటీఎంలను చూస్తే తెలియదా? దేశవ్యాప్తంగా 17 లక్షల ఏటీఎంలు ఉంటే.. నగదు కొరత కారణంగా అందులో దాదాపు 60 శాతం పనిచేయటం లేదు. వీటిలో తెలుగు రాష్ట్రాల్లో 2.07 లక్షల ఏటీఎంలు ఉన్నాయి. ఇక్కడా అదే పరిస్థితి ఉందని, పట్టణ–గ్రామీణ ప్రాంతాల్లోనైతే 80 శాతం వరకూ ఏటీఎంలు పడకేశాయని ఏటీఎం సెక్యూరిటీ గార్డు ప్రతినిధుల సంఘం పేర్కొంది. లక్ష కోసం మూడ్రోజుల ప్రదక్షిణ విజయవాడలోని ఆంధ్రాబ్యాంకు బ్రాంచీకి రెండ్రోజుల కిందట ఓ ఖాతాదారు వెళ్లి తన డిపాజిట్‌ను ఉపసంహరించుకున్నాడు. లక్ష రూపాయల నగదు అడిగాడు. వారు ఆ డబ్బులివ్వటానికి మర్నాడు రమ్మన్నారు. నగదు లేదని మూడురోజులుగా తిప్పుతున్నారు తప్ప తన పని కాలేదని సదరు వ్యక్తి వాపోయాడు. ఇక శ్రీకాకుళంలో ఓ విద్యార్థిని కాలేజీ ఫీజుకు డబ్బులు విత్‌డ్రా చేసుకోవటానికి ఎస్బీఐకి వెళ్తే.. వారు 15 వేలు కావాల్సిన చోట 5 వేలిస్తామని, 8 వేలిస్తామని బేరం పెట్టారు. చివరకు ఆమె నాలుగు గంటలపాటు అదే పనిగా కూర్చుని తన అవసరాన్ని చెప్పటంతో డిపాజిట్లు వచ్చేదాకా చూసి సాయంత్రానికిచ్చారు. ‘‘గత 3 నెలలుగా గుంటూరు జిల్లాలో జాతీయ బ్యాంక్‌ల నుంచి ఏకంగా రూ.2,800 కోట్లు విత్‌డ్రా చేశారు. వరంగల్‌లో గడిచిన 10 రోజుల్లో రూ.9 కోట్ల నగదు విత్‌డ్రా చేసుకున్నారు. డిపాజిట్లు అందులో సగం కూడా లేవు’’అని ఓ బ్యాంకు అసోసియేషన్ అధ్యక్షుడు వివరించారు. దేశంలో మొత్తం బ్యాంకు శాఖలు: 1,35,946 సేవింగ్స్ ఖాతాలు: 38.8 కోట్లు కరెంట్ ఖాతాలు: 2.83 కోట్లు జన్‌ధన్ ఖాతాలు: 31.11 కోట్లు -
నగదు బదిలీ వద్దు రేషనే మాకు ముద్దు!
సాక్షి, న్యూఢిల్లీ : జార్ఖండ్‌లో నేరుగా ప్రజలకు రేషన్ సరకులను సరఫరా చేయడానికి బదులుగా నగదు బదిలీ చేయడం పట్ల 97 శాతం ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జార్ఖండ్‌లోని రాంచీ జిల్లా, నగ్రీ సమతి స్థాయిలో పైలెట్ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం నగదు బదిలీ పథకాన్ని గతేడాది అక్టోబర్‌లో ప్రవేశపెట్టింది. అప్పటి వరకు దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాలు నేరుగా రేషన్ షాపులకు వెళ్లి తమకు కావాల్సిన బియ్యాన్ని రూపాయికి కిలో చొప్పున తీసుకొని వచ్చేవి. ఇప్పుడు ఆ కుటుంబాలు కేంద్రం నుంచి బ్యాంకులో డబ్బులు పడేవరకు నిరీక్షించాలి. బ్యాంకు వరకు వెళ్లి డబ్బులు వచ్చాయో, లేదో ముందుగా విచారించాలి. డబ్బులు వచ్చినా అంత తక్కువ డబ్బు లావాదేవీలను బ్యాంకులు తిరస్కరిస్తున్నాయి. దాంతో కుటుంబాలు ప్రజ్ఞా కేంద్రాలకు వెళ్లి డబ్బులు తీసుకోవాల్సి వస్తోంది. ఆ డబ్బులు తీసుకొని రేషన్ షాపులకు వెళ్లి కిలోకు 32 రూపాయలు చెల్లించి సరకులను కొనుగోలు చేయాల్సి వస్తోంది. జార్ఖండ్‌లో ఇంటి నుంచి బ్యాంకులు దాదాపు నాలుగున్నర కిలోమీటర్లు ఉండగా, బ్యాంకుల నుంచి ప్రజ్ఞా కేంద్రాలు 4.3 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో కాలి నడకన ఆ రెండు చోట్లకు వెళ్లి అక్కడి నుంచి రేషన్ దుకాణాలకు వెళ్లి సరకులు తీసుకోవడానికి ఒకరికి 12 గంటల సమయం పడుతుందని పేద కుటుంబాలు వాపోతున్నాయి. ఊతకర్ర లేకుండా అడుగుకూడా వేయలేని జంత్రీదేవీ లాంటి వృద్ధులు ప్రతి నెలా కిలోమీటర్ల కొద్ది నడిచి రేషన్ సరకులు తెచ్చుకోవాలంటే చెప్పలేని గోసవుతోందని, దీనికి బదులు ఒక్కసారి ప్రాణం పోయినా బాగుండని వాపోతున్నారు. ఇక దౌరీదేవీ కాయకష్టం చేయడం వల్ల చేతి వేళ్లపై వేలిముద్రలు చెదిరి పోయాయని, ఆధార్ కార్డు వేలి ముద్రలతో పోలిక సరిపోక పోవడం వల్ల గత నాలుగు నెలలుగా ఆమెకు రేషన్ సరకులు ఇవ్వడం లేదట. రేషన్ సరకులు అందక ఒక్క జార్ఖండ్‌లోనే నలుగురు పిల్లలు మరణించిన విషయం తెల్సిందే. సమితి పరిధిలోని 13 గ్రామాల పరిధిలోని 244 కుటుంబాల అభిప్రాయలను విద్యార్థి వాలంటీర్లు సేకరించడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఒక్క జార్ఖండ్‌లోనే అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి పైలెట్ ప్రాజెక్టలని నిర్వహిస్తున్నాయి. రేషన్ సరుకులు అన్యాక్రాంతం కాకుండా నిరోధించేందుకే తాము నగదు బదిలీ పథకాన్ని తీసుకొచ్చామని, దీనివల్ల ఏకంగా 56 వేల కోట్ల రూపాయలు మిగిలాయని కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది. లబ్ధిదారులకే రేషన్ సరకులు అందక పోవడం వల్లనే ఈ నిధులు మిగిలాయన్నది వాస్తవం. -
కారులోని రూ.5.36 లక్షలు అపహరణ
సాక్షి, తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలోని ఎమ్డీవో కార్యాలయం వద్ద చోరీ జరిగింది. జగ్గరగుంటపాలెం పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ కారులో బుధవారం ఎండీఓ కార్యాలయానికి వచ్చాడు. కారును కార్యాలయం ముందు పార్కు చేసి సంతకం పెట్టేందుకు లోపలికి వెళ్లాడు. తిరిగొచ్చేసరికి కారులో ఉన్న రూ.5.36 లక్షలు అపహరణకు గురయ్యాయి. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
బ్యాంకుల్లో డబ్బుల్లేవ్ !
నల్లధనం నిర్మూలిస్తామని, ప్రతి భారతీయుడికీ బ్యాంకు ఖాతాలో లక్షలాది రూపాయలు అప్పనంగా అప్పగిస్తామని ఆశలు రేపి అధికారానికి వచ్చిన కేంద్ర పాలకులు ఇప్పుడు మధ్యతరగతి బతుకులతో ఆటలాడుకుంటున్నారు. నల్లడబ్బు నిర్మూలనను ఎప్పుడో గాలికి వదిలేశారు. ప్రజల ఖాతాల్లోంచి అవసరమైన డబ్బులు కూడా తీసుకోనీయకుండా వారి కనీస స్వేచ్ఛను కూడా హరింపచేస్తూ ఆర్థిక వ్యవస్థను, ప్రజల అవసరాలను అతలాకుతలం చేస్తున్నారు. న్యాయంగా తాము సంపాదించిన డబ్బును కూడా బ్యాంకుల్లో నుంచి తీసుకోకుండా చేయడం, పెద్ద నోట్ల రద్దు జరిగి సంవత్సరం ముగిసిన తర్వాత కూడా జనం డబ్బుకు కటకటలాడటం.. ఇవన్నీ అచ్చేదిన్‌లో భాగమేనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు? -
ట్రావెల్స్ బస్సులో రూ.కోటి 3 లక్షలు స్వాధీనం
సాక్షి, నల్లగొండ : ఓ బస్సులో డబ్బులు పోయాయన్న ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తుంటే అదే బస్సులో కోటి రూపాయలు పోలీసులకు దొరికాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చిట్యాలలో జరిగింది. చిట్యాల శివారులోని ఓ హోటల్ ముందు ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులో నుంచి పోలీసులు రూ.కోటి మూడు లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బులు ఓ జ్యువెలరీ షాప్ యజమానికి చెందినవిగా అనుమానిస్తున్నారు. అంతకుముందు అదే బస్సులో రూ.17లక్షలు చోరీ జరిగాయంటూ ఫిర్యాదు అందింది. వాటి కోసం వెతుకుతుంటే వాటి కోసం వెతుకుతుంటే బస్ టాప్ పైన ఈ డబ్బు కనిపించింది. సరైన ధ్రువపత్రాలు లేకపోవడంతో డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ శాఖకు ఈ డబ్బులు అప్పగించనున్నట్టు చిట్యాల సిఐ పాండురంగారెడ్డి తెలిపారు. ఈ బస్సు హైద్రాబాద్ నుంచి చెన్నైకి వెళ్తున్నది. -
అజ్ఞాతవాసుల సర్వే
నెల్లూరు సిటీ: రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏడునెలలుగా గుట్టుచప్పుడు కాకుండా 50 మందితో నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ఇంటింటి సర్వే చేయిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే చాలాచోట్ల వ్యక్తుల పేర్లు, మతం, కులం, ఆధార్, ఫోన్ నంబర్, ఓటర్‌కార్డు.. ఇలా సమగ్ర వివరాలను సేకరించారు. ఎవరైనా సర్వే ఎందుకని అడిగితే నగరపాలకసంస్థ తరఫున చేస్తున్నామని చెబుతున్నారు. కార్పొరేషన్ నుంచి వచ్చామని చెప్పడంతో ప్రజలు సైతం వారికి పూర్తి వివరాలు అందజేస్తున్నారు. కార్పొరేటర్లు, టీడీపీ డివిజన్ ఇన్చార్జి ఆధ్వర్యంలో గుట్టుచప్పుడు కాకుండా ఈ తంతు జరుగుతోందని తెలిసింది. నారాయణ ఆదేశాలతోనే.. మంత్రి నారాయణ ఆదేశాలతోనే సర్వే చేస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ముందస్తు ప్రణాళికలో భాగంగానే కార్పొరేషన్ పేరును వాడుకుంటూ చేయిస్తున్నారని తెలిసింది. ఈ విషయం నగరపాలక సంస్థలో పలువురు అధికారులకు తెలిసినా మున్సిపల్ శాఖ మంత్రికి సంబంధించిన వ్యవహారం కావడంతో స్పందించడం లేదని చెబుతున్నారు. ఇలా బయటపడింది నగరంలోని 50వ డివిజన్లో ఉన్న సం తపేటలో కొత్తూరుకు చెందిన పర్వేజ్ అనే వ్యక్తి కొంతకాలం క్రితం సర్వే చేశాడు. ఇటీవల అతను మళ్లీ డివి జన్‌కు వెళ్లి హౌస్ఫర్ఆల్ కింద ఇళ్లు మంజూరు చేయిస్తానని నమ్మబలి కాడు. ప్రతి దరఖాస్తుదారుడు రూ.2, 000 చెల్లిస్తే ఇళ్లు మంజూరవుతుందని చెప్పారు. కొందరు కార్పొరేషన్ సిబ్బంది కదా అని నగదు ఇచ్చారు. బీజేపీ నాయకుడు కప్పిర శ్రీనివాసులు దృష్టికి ఈ విషయం వెళ్లడంతో బుధవారం ఉదయం ఆయన సంతపేటలో పర్వేజ్‌ను పట్టుకుని నిలదీశారు. అతను కార్పొరేషన్ నుంచి వచ్చినట్లు చెప్పొకొచ్చాడు. శ్రీనివాసులు కార్పొరేషన్ అధికారులకు ఫోన్ చేసి మాట్లాడగా తమకు సంబంధం లేదని చెప్పారు. దీంతో అతను మాటమార్చి తాను మంత్రి నారాయణ కోసం సర్వే చేస్తున్నట్లు వెల్లడించాడు. పర్వేజ్ వద్ద సర్వే పుస్తకం కూడా ఉండటంతో శ్రీనివాసులు అతడిని కార్పొరేషన్ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడి అధికారులకు చూపించి అడగ్గా వారు తమకు తెలియదని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో అక్కడే టౌన్‌ప్లానింగ్ అధికారులతో సమావేశంలో ఉన్న మంత్రి నారాయణ వద్దకు పర్వేజ్‌ను తీసుకెళ్లారు. నారాయణ తాను ఇలాంటి వాటిని ప్రోత్సహించే ప్రసక్తే లేదని, నాలుగోనగర పోలీసులను పిలిపించి అతడిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. దీంతో పర్వేజ్‌ను పోలీసులు పోలీసు స్టేషన్‌కు తరలించారు. సర్వే పుస్తకాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా సర్వే వ్యవహారం బయటపడటంతో మంత్రి వర్గం ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వ్యవహారం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. సర్వే చేసిన కొందరు ప్రభుత్వ పథకాలు ఇప్పిస్తామంటూ ప్రజల నుంచి నగదు వసూలు చేసినట్లు సమాచారం. -
ఢిల్లీలో భారీగా పట్టుబడ్డ బంగారం, నగదు
-
ఢిల్లీలో భారీగా పట్టుబడ్డ బంగారం, నగదు
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో బంగారం, నగదు భారీగా పట్టుబడిన ఘటన కలకలం రేపుతోంది. యు అండ్ ఐ వాల్ట్స్ లిమిటెడ్ సంస్థలో నిర్వహించిన సోదాల్లో పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. భారీ మొత్తంలో నగదు, బంగారాన్ని ఢిల్లీ డైరెక్టరేట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు, బంగారం.. గుట్కా తయారీదారునివిగా గుర్తించారు. గుట్కా తయారీతో పాటు బిల్డర్‌గా పని చేస్తున్న ఆ వ్యక్తి నుంచి ఇప్పటి వరకు రూ.61కోట్ల నగదు, బంగారం సీజ్ చేశారు. -
ఇచ్చింది చాలదు.. ఇంకా పట్రా
సాక్షి, బలిజిపేట: ఆన్లైన్ చేసేందుకు వీఆర్వోకి రూ.వెయ్యి ఇచ్చా. అయినా ఆన్లైన్ చేయలేదు. నిలదీస్తే ఇచ్చిన లంచం చాలదు. ఇంకా ఇస్తే ఆన్లైన్ చేస్తాను అంటూ తిప్పుతున్నాడు.. అంటూ మురగడాం గ్రామానికి చెందిన గొట్టాపు నరసమ్మ వాపోయింది. ఆమె బుధవారం విలేకరులకు అందించిన వివరాల ప్రకారం.. మురగడాం గ్రామానికి చెందిన గొట్టాపు నరసమ్మకు తండ్రి అక్కేన శివుడునాయుడి మరణానంతరం భూమి సర్వే నంబర్ 122–సబ్ డివిజన్ 2లోని 1.05 ఎకరాల భూమిని ఫోతీకేసు కింద ఆమె పేరున మార్చారు. భూమిని ఆన్లైన్ చేసేందుకు 5నెలల క్రితం వీఆర్వో సాంబమూర్తికి రూ.వెయ్యి చెల్లించారు. అప్పటినుంచి తిప్పుతున్న వీఆర్వో ఇచ్చిన డబ్బులు చాలవని.. మరికొంత ఇస్తే చేయిస్తానంటున్నాడు. దిక్కుమొక్కు లేని తన భూమిని తన పేరున వన్‌బీకి జారీ చేసేందుకు ఇన్ని ఇబ్బందులు పెడితే అధికారుల చుట్టూ ఎలా తిరుగుతానని నరసమ్మ కన్నీరుమున్నీరైంది. భూముల్ని ఆన్లైన్ చేయడంలో ఎకరాకు రూ.వెయ్యి వంతున బలిజిపేట రెవెన్యూ సిబ్బంది వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. పెదపెంకి జన్మభూమి గ్రామ సభలో దత్తి మురళి అనే రైతు డబ్బులు ఇస్తే తప్ప ఆన్లైన్ కావడం లేదని ఆరోపించడం తెలిసిందే. ఆన్‌లైన్‌కు డబ్బులు ఇస్తే తప్ప చేయటం లేదని అజ్జాడ గ్రామ సభలో ఆరోపించారు. డబ్బులిస్తేనే ఆన్లైన్ నా తల్లి సన్యాసమ్మ పేరున ఉన్న భూమిని ఆన్లైన్ చేసేందుకు అజ్జాడ వీఆర్వో డబ్బులు ఇమ్మన్నారు. డబ్బులు ఇవ్వకపోతే ఆన్లైన్ చేయరా? అని అడిగాను. డబ్బులిస్తేనే చేస్తానంటున్నారు. – ప్రదీప్, అజ్జాడ ఫిర్యాదు చేస్తే చర్య నా దృష్టికి ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. సంబంధిత వీఆర్వోపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాను. డబ్బు ఎవరు తీసుకున్నారో తెలిస్తే చర్యలుంటాయి. –బీవీ లక్ష్మి, తహసీల్దార్, బలిజిపేట -
ఇస్తారా.. ముంచేస్తారా?!
‘సారు నీ కాళ్లు మొక్కుతా.. పైసాపైసా పోగుచేసుకుని మీ మీద నమ్మకంతో జమచేసిన. రెండెళ్లయింది ఇస్తామని.. ఇంకా ఇస్తలేరు. చెప్పులరిగేలా తిరుగుతున్నా పట్టించుకుంటలేరు. మా బాధను అర్థం చేసుకోండి.. మా డబ్బులు మాకు ఇయ్యుండ్రి’.. అంటూ జిల్లా కేంద్రంలోని వెల్ఫేర్ బిల్డింగ్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో నిత్యం బాధితుల మొరలు వినిపిస్తున్నాయి. సాక్షి, కామారెడ్డి టౌన్/కామారెడ్డి: వందలాది మంది బాధితులు తాము జమ చేసుకున్న డబ్బుల కోసం కంపెనీ కార్యాలయానికి బారులు తీరుతున్నారు. ఖాతాదారులకు డబ్బులు చెల్లించాల్సిన సమయం ఏడాది దాటి నా, ఖాతాదారులు కాళ్లవేళ్లా పడినా డబ్బులు ఇవ్వడం లేరు. కంపెనీ పేరు తో మరో చోట పెట్టుబడులు పెట్టామని, డబ్బులు వచ్చాకే ఇస్తామని తేల్చి చెబుతున్నారు. దీంతో తమ డబ్బులు ఇస్తారా.. ముంచేస్తారా.. అన్న సందేహంలో ఖాతాదారులు అందోళనకు గురవుతున్నారు. బారులు తీరుతున్న బాధితులు చిట్టీల పేరుతో వందలాది మంది ఖాతాదారుల నుంచి ఐదేళ్లలో రూ.కోట్ల డబ్బులు కట్టించుకున్న వెల్ఫేర్ కంపెనీ చెల్లింపుల్లో పాల్పడుతున్న మోసాలు ఇటీవలే వెలుగులోకి వచ్చాయి. దీంతో బాధితులు తమ డబ్బుల కోసం బారు లు తీరడం పెరిగింది. సిబ్బంది మా త్రం తమ దగ్గర డబ్బులు లేవంటున్నా రు. ‘అవసరమైతే తాళం వేసి బయట పంచాయితీ పెట్టుకుందాం.. అప్పుడు మీ డబ్బులు పూర్తిగా రావు మీ ఇష్టం’.. అనే రీతిలో సమాధానాలిస్తున్నారు. మేం ఇచ్చిన్నప్పుడే తీసుకుంటేనే డబ్బులు వస్తాయి. లేకుంటే ఏం చేసుకుంటారో చేసుకోండని సమాధానం ఇస్తున్నారని ఖాతాధారులు వాపోతున్నారు. రాసిచ్చిన తేదీల్లోనే రావాలని దబాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మకం పేరిట నట్టేట ముంచుతున్నారని ఆగ్రహిస్తున్నారు. పేదలనే టార్గెట్ చేశారు కూలీలు, బీడీ కార్మికులు, చిరుద్యోగులనే కంపెనీ టార్గెట్‌గా చేసుకుంది. భారీ మొత్తంలో కమీషన్లు ఇచ్చి 50కిపైగా ఏజెంట్లను నియమించుకుంది. ఒక్కో ఏజెంట్ ద్వారా 40కి పైగానే కస్టమర్లను రాబట్టారు. మా కంపెనీలో ప్రతి నెల చొప్పున మూడేళ్లు డబ్బులు పోగుచేసి మరో రెండేళ్లు ఆగితే కస్టమర్లకు రెండింతలు ఇస్తామని ఆశ చూపించారు. ఒక్కో కస్టమర్ నుంచి నెలకు కనీసం రూ.300 నుంచి గరిష్టంగా రూ.10 వేల వరకు కట్టించుకున్నారు. ఇలా రూ.2.50 కోట్లకు పైగానే వసూలు చేసినట్లు సమాచారం. ఈ డబ్బుతో కామారెడ్డితో పాటు ఇతర ప్రాంతాల్లో వెంచర్లు, ఇతర వ్యాపా రాల్లో పెట్టుబడులు పెట్టారు. సుమారు 500 మందికిపైగా ఖాతాదారులు కంపెనీకి బాధితులుగా ఉన్నట్లు తెలిసింది. దీంట్లో ఎక్కువగా నిరుపేదలే ఉన్నారు. కంపెనీ కార్యాలయానికి బాధితులు వస్తుండడంతో వెల్ఫేర్ మోసాలు ఒక్కోక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ విషయమై కామారెడ్డి బ్రాంచ్ ఏరియా మేనేజర్ లక్ష్మీనారాయణను ‘సాక్షి’ వివరణ కోరగా.. ఇక్కడి ఇబ్బందులను, ఖాతాదారుల కష్టాలను కంపెనీ ఎండీకి తెలిపామని, పైనుంచి డబ్బులు వస్తేనే చెల్లిస్తామని, మా చేతుల్లో ఏమి లేదని సమాధానమిచ్చారు. చెప్పులరిగేలా తిరుగుతున్నా.. మా ఊరి ఏజెంట్ నమ్మించి మూడేళ్లు డబ్బులు కట్టించుకున్నాడు. ఐదేళ్ల తర్వాత ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఇయ్యలే. ఆర్నెళ్లుగా చెప్పులరిగేలా తిరుగుతున్నా. కాళ్లు మొక్కుతా అన్నా కనికరిస్తలేరు. మాలాంటి పేదోళ్లను మోసం చేస్తున్నారు. మా డబ్బులు మాకు వెంటనే ఇయ్యాలే. – బాలవ్వ, రామారెడ్డి మండలం -
అదే గ్యాంగ్.. మరో క్రైమ్!
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెం.10లో బుధవారం పట్టపగలు కత్తులతో బెదిరించి వాహనం దోచుకెళ్లిన ముఠా గురువారం కూడా పంజా విసిరింది. చోరీ వాహనం పైనే సంచరిస్తూ పాతబస్తీలోని బహదూర్‌పుర ప్రాంతంలో మరో దోపిడీకి యత్నించింది. ఈ నేరమూ పట్టపగలే జరగడం గమనార్హం. ప్రాథమిక ఆధారాలను బట్టి తమిళనాడుకు చెందిన ముఠాగా అనుమానిస్తున్న పోలీసులు దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. జూబ్లీహిల్స్ ఉదంతం మాదిరిగానే బహదూర్‌పుర యత్నమూ ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం. బుధవారం ‘న్యూ’... గురువారం ‘ఓల్డ్’... బంజారాహిల్స్ రోడ్ నెం.12లో ఉన్న బాలాజీ డిస్ట్రిబ్యూటర్స్ కార్యాలయంలో ఆఫీస్ బాయ్‌గా పని చేస్తున్న యాదగిరి నుంచి ముగ్గురు దుండగులు బుధవారం ఉదయం బైక్, సెల్ఫోన్లు, పర్సు లాక్కెళ్లారు. ఈ ఉదంతం న్యూ సిటీలోని జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లో చోటు చేసుకుంది. గురువారం ఇదే ముఠా ఓల్డ్ సిటీలో ఉన్న బహదూర్పు ప్రాంతంలో పంజా విసిరింది. అక్కడి ప్రధాన రహదారిపై ఉన్న ఎస్బీఐ వద్దకు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అదే బైక్‌పై వచ్చిన దుండగుల్లో ఇద్దరు వాహనంతో బయటే వేచి ఉండగా... మరొకరు బ్యాంకు లోపలకు వెళ్లి నగదు లావాదేవీలు చేస్తున్న వారిని దాదాపు అర్ధగంటకు పైగా గమనించాడు. ఈ దృశ్యాలు బ్యాంకులో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. రూ.70 వేలు దోపిడీకి యత్నం... రామ్నాస్‌పురాకు చెందిన విద్యార్థి అబ్దుల్లా రూ.70 వేల నగదు డిపాజిట్ చేసేందుకు బ్యాంకుకు వచ్చాడు. అప్పటికే బ్యాంక్‌లో డిపాజిట్లు స్వీకరించే సమయం మించిపోవడంతో అధికారులు నగదు తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో అబ్బుల్లా డబ్బుతో తిరిగి వెళ్తుండగా, ఇతడి వెనుకే బ్యాంక్ నుంచి బయటకు వచ్చిన దుండగుడు మిగిలిన ఇద్దరినీ కలిశాడు. ముగ్గురూ కలిసి అబ్దుల్లాను వెంబడించారు. అక్కడి పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లే మలుపు వద్ద అబ్దుల్లా బైక్‌ను అడ్డుకున్నారు. కత్తితో బెదిరించి నగదును లాక్కునేందుకు ప్రయత్నించగా, అబ్దుల్లా ప్రతిఘటిస్తూ గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకునే లోగా దుండగులు ఫలక్‌నుమ వైపు పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు గురువారం సాయంత్రం కేసు నమోదు చేసుకున్నారు. షెల్టర్, డబ్బు లేవా? సిటీలో వరుస నేరాలకు పాల్పడుతున్న ఈ ముఠాకు ఇక్కడ షెల్టర్, వారి వద్ద నగదు లేకపోవచ్చునేని పోలీసులు భావిస్తున్నారు. రాత్రి రైల్వేస్టేషన్లు, బస్టాపుల్లో తలదాచుకుని పగటిపూట నేరాలకు పాల్పడుతున్నారని అంచనా వేస్తున్నారు. వీరు రెండు ఉదంతాల్లోనూ కేవలం డబ్బులు మాత్రమే డిమాండ్ చేయడాన్ని బట్టి వీరి వద్ద నగదు కూడా లేకపోవచ్చునని తెలిపారు. బుధవారం నేరుగా జూబ్లీహిల్స్ రోడ్ నెం.10 నేరం చేసిన తర్వాత వీరి కదలికలు రసూల్‌పుర చౌరస్తా వరకు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఆ తర్వాతి ప్రాంతం గోపాలపురం పోలీసుస్టేషన్ పరిధిలోకి వస్తుంది. అయితే బుధవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయంతో ఆ ఠాణా పరిధిలోని సీసీ కెమెరాలు పని చేయలేదు. దీంతో వీరి కదలికలను పూర్తిగా కనిపెట్టలేకపోయారు. గురువారం పాతబస్తీ ఉదంతం నేపథ్యంలో ఆ పరిసరాల్లోని అన్ని సీసీ కెమెరాల ఫీడ్‌ను అధ్యయనం చేస్తున్నారు. ‘గోప్యతే’ వారికి కలిసి వస్తోందా? ఈ గ్యాంగ్ నేరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. రెండు ఉదంతాలూ ఓ రోజు ఆలస్యంగానే వెలుగులోకి వచ్చాయి. ఇది కూడా దుండగులకు కలిసి వస్తున్న అంశంగా మారిందనే వాదన వినిపిస్తోంది. జూబ్లీహిల్స్‌లో దోపిడీ చేసిన వాహనంపై ముగ్గురు ప్రయాణిస్తూ బహదూర్‌పుర వరకు వచ్చారు. నిబంధనల ప్రకారం ట్రిపుల్ రైడింగ్ ఉల్లంఘనే అయినప్పటికీ కనీసం ట్రాఫిక్ పోలీసుల కంట్లోనూ వారు పడకపోవడం గమనార్హం. మొదటి నేరం జరిగినప్పుడే వాహనం వివరాలు, దుండగుల కవళికలు, వస్త్రధారణ, ప్రవర్తనలపై పోలీసులు విస్త్రృత స్థాయిలో ప్రచారం చేయడంతో పాటు ట్రాఫిక్ పోలీసులను అప్రమత్తం చేస్తే దుండగులు దొరకడమో, రెండో నేరం జరగకపోవడమో అయ్యేది. పోలీసుల గోప్యతను తమకు అనువుగా మార్చుకున్న ముఠా వరుసపెట్టి సవాల్ విసురుతోంది. ఏఎన్పీఆర్ వ్యవస్థ అమలైతే... ప్రస్తుతం ట్రాఫిక్ విభాగం ఐటీఎంఎస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. ఏర్పాటు తుది దశలో ఉన్న ఈ వ్యవస్థలో ఆటోమేటెడ్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ (ఏఎన్పీఆర్) విధానం కూడా ఉంది. సాఫ్ట్వేర్ ఆధారంగా పని చేసే ఇందులో ఓ వాహనం నెంబర్‌ను ఫీడ్ చేస్తే... నగరంలోని ఏ సీసీ కెమెరా ముందుకైనా ఆ వాహనం వస్తే తక్షణం గుర్తించి, కంట్రోల్ సెంటర్లోని సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. జూబ్లీహిల్స్ నేరం జరిగిన వెంటనే ఆ వాహనం నెంబర్‌ను ఇందులో పొందుపరిస్తే దుండుగుల ఎక్కడ సంచరించినా తెలిసే ఆస్కారం ఉంటుంది. ఐటీఎంఎస్ ఇంకా ఏర్పాటు దశలోనే ఉండటం సైతం ఈ నేరగాళ్ళకు కలిసి వచ్చే అంశంగా మారింది. ఇలాంటి అత్యాధునిక వి«ధానాలు ప్రస్తుతం లేకపోవడం, నేరాలపై గోప్యత పాటించడంతో దుండగులు రెచ్చిపోతున్నా పోలీసులు చోద్యం చూడాల్సి వచ్చింది. అదే బైక్.. అదే డ్రస్సు ప్రాథమికంగా సేకరించిన సమాచారం, వారి ముఖ కవళిక ఆధారంగా దక్షిణాదికి చెందిన ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితులను విచారించగా, నిందితులు ‘పైసే పైసే’ అంటూ సైగలతో డబ్బు డిమాండ్ చేసినట్లు తెలిపారు. యాదగిరితో మాత్రం కొన్ని మాటలు మాట్లాడారు. తనకు తెలుగు, హిందీ, ఇంగ్లీషు వచ్చని, దుండగులు వినియోగించింది ఈ మూడూ కాదని చెప్పాడు. దీంతో వీరు తమిళనాడుకు చెందిన గ్యాంగ్‌గా భావిస్తున్నారు. బుధవారం దోపిడీ సమయంలో దుండగులు ధరించిన వస్త్రాలే గురువారమూ ధరించారు. జూబ్లీహిల్స్‌లో దోపిడీ చేసిన ఎఫ్‌జెడ్ బైక్ (టీఎస్ 09 ఈడబ్ల్యూ 8970) బహదూర్‌పురలో వాడారు. -
బ్యాంక్ మెసెంజర్ చేతివాటం.. నగదు విత్ డ్రా ..!
సాక్షి, రాజమండ్రి: బ్యాంక్ ఆఫ్ ఇండియా మెసెంజర్ చేతివాటం ప్రదర్శించాడు. ఖాతదారుల ఫోర్జరీ సంతకాలతో నగదు విత్ డ్రా అయిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కొత్తపేట మండలంలోని వానపల్లిలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న బ్యాంక్అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
హైదరాబాద్ లో భారీ దోపిడీ
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బషీర్‌బాగ్‌లో ఆదివారం భారీ దోపిడి జరిగింది. కమిషనర్ కార్యాలయం వెనుకవైపు ఉన్న స్కైలైన్ రోడ్డులో ఇవాళ సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన ముగ్గురు వ్యాపారులు వ్యాపారం నిమిత్తం నగరానికి వచ్చారు. వారు నగదు సంచులతో వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేసి ...ఆ బ్యాగులతో క్షణాల్లో అక్కడి నుంచి మాయమయ్యారు. తమవద్ద ఉన్న రూ. 1.26 కోట్ల నగదు చోరీకి గురైందని బాధితులు సంకేత్, స్వప్నిల్, సంగప్పలు నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజి సాయంతో దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
హైదరాబాద్‌లో భారీ దోపిడీ
-
చేతికి దొరికితే చాలు సినీ ఫక్కీలో..
సాక్షి, చెన్నై: సందు దొరికితే చాలు.. గుడినీ గుడిలో లింగాన్నీ మింగేసే ఘనులున్న ఈ రోజుల్లో.. తనకు దొరికిన రూ. 40లక్షలను ఇన్స్పెక్టర్ ‘గాంధీ’ సంబంధీకులకు అప్పగించి పేరు నిలుపుకున్నాడు. ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. వివరాలివి.. శుక్రవారం రెండు కార్లు ఢీ కొన్న ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మృతుల్లో విరుదునగర్ జిల్లా ముత్తు నాయకన్ పట్టికి చెందిన వ్యాపార వేత్త క్రిస్టోఫర్(70) కూడా ఉన్నారు. ఆయన ప్రయాణించిన కారులో రూ. 40 లక్షలు ఉండటాన్ని తిరుమంగళం ఇన్స్పెక్టర్ గాంధీ గుర్తించారు. ఆ మొత్తాన్ని భద్ర పరిచారు. ఇన్స్పెక్టర్ ఆదివారం ముత్తునాయకన్ పట్టికి వెళ్లి మృతుడు క్రిస్టోఫర్ కుమార్తె మేరికి రూ. 40 లక్షలను అప్పగించారు. తండ్రి వ్యాపార నిమిత్తం తీసుకెళ్లిన ఆ సొమ్ము పోయిందనుకున్నామని.. అయితే, ఇన్స్పెక్టర్ తీసుకొచ్చి ఇవ్వడం అభినందనీయమని మేరి అన్నారు. చేతికి దొరికితే చాలు సినీ ఫక్కీలో కాజేసే పోలీసులు ఉన్న ఈ కాలంలో తన పేరుకు తగ్గట్టు గాంధీ తన ఔదార్యాన్ని చాటుకోవడంతో ముత్తు నాయకన్ పట్టి ప్రజలు ఆయన్ను అభినందనల్లో ముంచెత్తారు. -
భారీగా బంగారం, నగదు పట్టుబడింది
నోట్ల రద్దు అనంతరం విమానశ్రయాల్లో భారీగా నగదు, బంగారం పట్టుబడింది. దేశవ్యాప్తంగా ఉన్న విమానశ్రయాల్లో సీఐఎస్ఎఫ్ చేసిన తనిఖీల్లో డిమానిటైజేషన్ కాలం నుంచి ఇప్పటి వరకు రూ.87 కోట్లకు పైగా నగదు, రూ.2600 కేజీల బంగారం, ఇతర విలువైన మెటల్స్ పట్టుబడినట్టు తాజా డేటాలో వెల్లడైంది. గతేడాది నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత పెద్ద ఎత్తున్న నగదు, బంగారం తరలిపోవచ్చని ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో దేశంలో నగదు, బంగారం ఎక్కడికీ తరలిపోకుండా విమానాశ్రయాల్లో తనిఖీలు చేపట్టాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ సీఐఎస్ఎఫ్ను ఆదేశించింది. ఎలాంటి అనుమానిత నగదు, ఇతర విలువైన వస్తువులున్న వెంటనే స్వాధీనంలోకి తీసుకోవాలని అలర్ట్ చేసింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న 56 సివిల్ ఎయిర్‌పోర్టుల్లో సీఐఎస్ఎఫ్ డేగా కన్ను మాదిరి తనిఖీలు నిర్వహించింది. ఈ క్రమంలో 2016 నవంబర్ 8 నుంచి 2017 నవంబర్ 7 వరకు రూ.87.17 కోట్ల అనుమానిత నగదును, రూ.1,419.5 కేజీల బంగారాన్ని, 572.63 కేజీల వెండిని గుర్తించినట్టు సీఐఎస్ఎఫ్ డేటా తెలిపింది. దీనిలో ఎక్కువగా ముంబై ఎయిర్‌పోర్టులో రూ.33 కోట్లకు పైగా అనుమానిత నగదును గుర్తించినట్టు పేర్కొంది. ఎక్కువ మొత్తంలో బంగారం ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషన్ ఎయిరపోర్టులో దొరికినట్టు డేటా వెల్లడించింది. 266 కేజీలకు పైగా వెండిని జైపూర్ ఎయిర్‌పోర్టులో స్వాధీనం చేసుకున్నట్టు సీఐఎస్ఎఫ్ అధికారులు చెప్పారు. చట్టం ప్రకారం తదుపరి విచారణ కోసం ఈ మొత్తాలన్నింటిన్నీ ఆదాయపు పన్ను శాఖకు అప్పగించామని సీఐఎస్ఎఫ్ అధికార ప్రతినిధి చెప్పారు. సీఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యురిటీ ఫోర్స్. ఎయిర్‌పోర్టుల్లో వీరు తమ సేవలను అందిస్తూ ఉంటారు. -
సినీ ఫక్కీలో కథ చెప్పాడు.. కానీ !
సాక్షి, చెన్నై: ఓ తండ్రికి జల్సాల మీద ఉన్న ప్రేమ కొడుకు మీద లేకుండా పోయింది. విలాసాల కోసం చేసిన అప్పులను తీర్చేందుకు కన్న కొడుకును కిడ్నాప్ చేసి చివరికి పోలీసులకు దొరికిపోయాడు. ఈ సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది. వివరాలివి.. చెన్నైలో పురసై వాక్కం కెల్లిస్ బారక్ రోడ్డుకు చెందిన రవికుమార్ పోరూర్‌లో ట్రావెల్స్ నడుపుతున్నాడు. ఆయన డ్రైవర్ కావడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లి, అక్కడ జల్సాలు చేస్తుండేవాడు. దీంతో రూ. 5 లక్షల మేరకు అప్పులయ్యాయి. అప్పులు తీర్చేమార్గం లేక.. అప్పులను తీర్చే మార్గం లేక, చివరికి తన బిడ్డనే కిడ్నాప్ చేయాలని పథకం వేశాడు ఆ తండ్రి. ఐనావరంలోని ఓ నర్సరీ స్కూల్లో ఎల్కేజీ చదువుతున్న కుమారుడు కనీష్(4)ను దిగబెట్టేందుకు మంగళవారం రవికుమార్ బైక్‌పై ఇంటి నుంచి వెళ్లాడు. కాసేపటి తర్వాత ఆటోలో వచ్చిన గుర్తు తెలయని వ్యక్తులు తనపై దాడి చేసి కనీష్ను ఎత్తుకెళ్లినట్టు, తన తండ్రి పరమశివం, భార్య తమిళ్ ఇలైక్యాకు రవి ఫోన్‌చేసి చెప్పాడు. మరి కాసేపటి తర్వాత మళ్లీ ఫోన్‌చేసి, ఐదు లక్షలు డిమాండ్ చేస్తున్నారన్నారు. సినిమాలో మాదిరి కథ చెప్పాడు.. ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేయకుండా, తాము చెప్పిన చోటుకు రావాలని ఆ వ్యక్తులు బెదిరించినట్లు పేర్కొన్నాడు. దీంతో ఆందోళన చెందిన పరమశివం, ఇలైక్యాలు ఇంట్లో ఉన్న నగదు, నగలను ఆగమేఘాలపై ఓ చోట కుదవ పెట్టి రూ. 5 లక్షలు తీసుకున్నారు. ఈ మొత్తాన్ని సాయంత్రం రవికుమార్‌తో కలిసి కారులో కిడ్నాపర్లు చెప్పిన ప్రదేశానికి బయలు దేరారు. అయితే, మార్గ మధ్యలో రవికుమార్ తనను మాత్రమే కిడ్నాపర్లు రమ్మన్నారని చెప్పి తండ్రి, భార్యలను దించేశాడు. రవికుమార్ చర్యలను అనుమానించిన వారిద్దరూ పోలీసులను ఆశ్రయించారు. రహస్య విచారణ.. జాయింట్ కమిషనర్ మనోహర్ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగి రహస్యంగా విచారణ చేపట్టింది. అర్ధరాత్రి సమయంలో తానేదో సినీ ఫక్కీలో శ్రమించి కనీష్ను రక్షించి తీసుకొచ్చినట్లు రవికుమార్ ఇంటికి చేరాడు. అప్పటికే ఇంటి వద్ద మాటేసిన పోలీసులు అతడ్ని తమదైన స్టైల్లో విచారంచడంతో బండారం బయట పడింది. పెరంబూరు సమీపంలోని తన స్నేహితుడి ఇంట్లో కనీష్ను బంధించి, చిత్ర హింసలు గురి చేసినట్లు తేలింది. తన తండ్రి, భార్య వద్ద రూ.5 లక్షలు రాబట్టటం లక్ష్యంగా రవికుమార్ రచించిన నాటకం బట్టబయలయింది. దీంతో అతడిని పోలీసులు బుధవారం కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. -
రైతుల ఖాతాల్లో .. నగదు మాయం
మడకశిర: పలువురు రైతుల ఖాతాల్లోని పంటనష్టపరిహారం సొమ్ము మాయమైంది. అమాయక రైతులను ఏటీఎం కేంద్రం వద్ద అపరిచిత వ్యక్తులు ఏమార్చి.. ఏటీం కార్డు మార్పు చేసి.. అనంతరం ఖాతాల్లోంచి డబ్బు కాజేశారు. వివరాలిలా ఉన్నాయి. మడకశిరలోని ఏడీసీసీ బ్యాంకులో నియోజకవర్గంలోని పలువురు రైతులకు ఖాతాలు ఉన్నాయి. పంటనష్టపరిహారం డబ్బు ఇటీవల రైతుల ఖాతాల్లో జమ అయ్యింది. అయితే ఈ డబ్బును బ్యాంకులో డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పించలేదు. ఏటీఎం కేంద్రాలకు వెళ్లి తీసుకోవాలని బ్యాంకు అధికారులు సూచించారు. అమరాపురం మండలం నిద్రఘట్టకు చెందిన రైతు నాగేంద్ర తన ఖాతాలో జమ అయిన మొత్తాన్ని డ్రా చేసుకునేందుకని ఈ నెల 24న మడకశిరలోని ఓ ఏటీఎం కేంద్రానికి వెళ్లాడు. అక్కడ పక్కనే ఉన్న అపరిచిత వ్యక్తి సాయంతో రూ.2వేలు డ్రా చేయించుకున్నాడు. ఆ వ్యక్తి రైతును ఏమార్చి వేరొక ఏటీఎం కార్డు ఇచ్చి పంపించాడు. అనంతరం పిన్ నంబర్ గుర్తు పెట్టుకుని రూ.28వేలను అదే రోజు డ్రా చేసేశాడు. ఇదే తరహాలోనే మడకశిర మండలం డి.అచ్చంపల్లికి చెందిన సుబ్బరాయప్ప ఖాతా నుంచి కూడా రూ.4800, గుడిబండ మండలం కేఎన్ పల్లికి చెందిన హనుమంతప్ప ఖాతా నుంచి రూ.20 వేల నగదును ఎవరో డ్రా చేసేశారు. బాధిత రైతులు శుక్రవారం ఏడీసీసీ బ్యాంకు వద్దకు వచ్చి మేనేజర్ గోపాల్‌రెడ్డి వద్ద తమ గోడు వెల్లబోసుకున్నారు. అనంతరం ఎస్ఐ లింగన్నను కలిసి తాము మోసపోయిన తీరును వివరించి ఫిర్యాదు చేశారు. ఎస్ఐ ఆదేశాల మేరకు ఏఎస్ఐ బాబు ఏడీసీసీ బ్యాంకుకు వెళ్లి బాధిత రైతుల ఖాతాలను పరిశీలించారు. అపరిచితులు కర్ణాటక, ఎస్బీఐ ఏటీఎంల ద్వారా డబ్బు డ్రాచేసుకున్నట్లు తెలుస్తోందన్నారు. -
లక్కీడ్రా పేరిట ఘరానా మోసం..
హైదరాబాద్: ప్రజలకు ఆశ చూపించి కొందరు వారి వద్ద నుంచి లక్కీ డ్రా పేరిట నగదు వసూలు చేస్తున్నారు. ఈ విధమైన సంఘటన నగరంలో కేపీహెచ్బీలో చోటుచేసుకుంది. వివరాలివి.. కొందరు డైమండ్ ఎంటర్ప్రైజెస్ పేరుతో ఒక సంస్థను ప్రారంభించారు. లక్కీడ్రా పేరుతో ప్రజలకు ఆశ చూపించి 800 మంది వద్ద నుంచి దాదాపుగా రూ. 20 లక్షల నగదు వసూలు చేశారు. భారీగా నగదు సేకరించిన డైమండ్ ఎంటర్ప్రైజెస్ బోర్డు తిప్పేసింది. విషయం తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మోసానికి పాల్పడిన ముగ్గురి నిర్వాహకులను అరెస్టు చేసి, రిమాండ్ తరలించారు. -
టికెట్ బుకింగ్: ఓ షాకింగ్ అధ్యయనం
సాక్షి, న్యూఢిల్లీ: డిజిటల్ ఇండియా , నగదు రహిత లావాదేవీలంటూ ఒకవైపు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యల్ని చేపడుతోంటే.. రైల్వే టికెట్ బుకింగ్స్‌కు సంబంధించి ఓ షాకింగ్ అధ్యయనం వెలుగులోకి వచ్చింది. కేంద్రం డిజిటల్ లావాదేవీలను భారీగా ప్రోత్సహిస్తున్నప్పటికీ, ఇప్పటికీ చాలా మంది వినియోగదారులు నగదు ద్వారానే టికెట్లు కొనుగోలు చేశారని అధ్యయనం వెల్లడించింది. దేశీయంగా రైలు టికెట్లలో కొనుగోళ్లలో యాభై శాతం లావాదేవీలు నగదు ద్వారా జరుగుతున్నాయని తాజా అధ్యయనం తేల్చింది. వెబ్ ఆధారిత సంస్థ రైల్ యాత్రి నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. టికెట్ల బుకింగ్ విషయంలో డిజిటల్‌గా కంటే.. ఏజెంట్లపైనే ఎక్కువ ఆధారణపడుతున్నారని తెలిపింది. అందుకే నగదు కొనుగోళ్ళు భారీగా నమోదవుతున్నాయిని వివరించింది. దేశవ్యాప్తంగా 25 నగరాల్లో 50 వేల మంది ప్రయాణీకులు, 800మంది ట్రావెల్ ఏజెంట్ల ద్వారా ఈ సర్వే నిర్వహించింది. 65 శాతంమంది ప్రయాణీకులు డిజిటల్ పేమెంట్స్‌పై మొగ్గుచూపుతున్నప్పటికీ 50 శాతం మంది నగదు చెల్లింపులు చేస్తున్నారని సర్వే చెప్పింది. భారతదేశంలో ముఖ్యమైన వినియోగదారుల విభాగం వారి అవసరాలు సంక్లిష్టం ఎక్కువగా ఉన్నప్పుడు ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారని పేర్కొంది. ముఖ్యంగా సరఫరా-డిమాండ్ అసమానతలు, ఇతర అనిశ్చితుల కారణంగా డిజిటల్ టికెట్ బుకింగ్ ధోరణి క్షీణిస్తోందని రైల్ యాత్రి కో-ఫౌండర్, సీఈవో మనీష్ రాఠి వ్యాఖ్యానించారు. గత ఐదు సంవత్సరాల్లో రైలు టికెట్ల 80 శాతానికిపైగా పెరిగితే, అనేక సంవత్సరాలుగా ట్రావెల్ ఏజెంట్ల కమిషన్ ఫీజు రూ. 20- 40 రూపాయలుగా ఉందని అధ్యయనం పేర్కొంది. దీంతోపాటు డిజిటల్ పేమెంట్స్‌కు ఊతమిచ్చేలా గట్టి చర్యలు తీసుకోవాలని కూడా ఈ అధ్యయనం సూచించింది. -
మళ్లీ నగదు దిశగా సీన్ రివర్స్
ముంబై: దేశంలో పెద్ద నోట్లను రద్దు చేసిన రెండు నెలల్లోనే, అంటే ఈ ఏడాది జనవరి నాటికల్లా మహారాష్ట్రలోని థానె జిల్లా, ధసాయ్ గ్రామం నూటికి నూరుపాళ్లు నగదు రహిత లావాదేవీలు జరుపుతున్న గ్రామంగా ప్రసిద్ధికెక్కింది. దేశంలోనే రెండవ, మహారాష్ట్రలో మొట్టమొదటి నూటికి నూరుపాళ్ల డిజిటల్ గ్రామంగా దేశంలోని పత్రికలన్నీ కోడై కూశాయి. ప్రస్తుతం సీన్ పూర్తిగా రివర్స్ అయింది. గ్రామంలో 20 శాతం మంది కూడా నగదురహిత లావాదేవీలు నిర్వహించడం లేదు. 80 శాతం మందికిపైగా మళ్లీ నగదు లావాదేవీలను నిర్వహిస్తున్నారు. అసలు గ్రామంలో పనిచేస్తున్న డిజిటల్ లావాదేవీల మషిన్లే 25 శాతానికి మించి లేవు. మళ్లీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకోవడం కోసం ధసాయ్ గ్రామంలో మధ్యలోవున్న హార్డ్‌వేర్, స్టేషనరీ షాపులోకి మీడియా ప్రతినిధులు వెళ్లగా, షాపు యజమాని ప్రవీణ్ గోలప్ ఏం కావాలని అని ప్రశ్నించారు. కార్డ్ స్వైపింగ్ మషిన్ లేదా అని ప్రశ్నించగా, ఉందిగానీ పని చేయడం లేదని చెప్పారు. ఏది ఒక్కసారి చూపించండి అడగ్గా, అది ఎక్కడ ఉందో కనుక్కోవడానికి ఆయనకు, ఆయన సహాయకుడికి 45 నిమిషాలు పట్టింది. చివరకు బాణాసంచా బాక్సుల వెనక వారికి ఆ మషిన్ దొరికింది. తానూ ఈ మషన్ను గత డిసెంబర్ నెలలోనే తీసుకున్నానని, ఫిబ్రవరి నెల వరకు బాగానే పనిచేసిందని, ఆ తర్వాత పనిచేయడం మానేసిందని చెప్పారు. వినియోగదారులందరు నగదు చెల్లింపులకే ఇష్టపడుతుండడంతో తాము కూడా స్వైపింగ్ మషన్ను మరమ్మతు చేయించాలనుకోలేదని, అందుకనే మూలకు పడేశామని చెప్పారు. నగరంలోని షాపుల్లో 20 శాతానికి మించి స్వైపింగ్ మషిన్లు పనిచేయడం లేదని తెలిపారు. మరో స్టీలు షాపునకు వెళ్లగా, పేటిఎం ద్వారా లావాదేవీలు నిర్వహిస్వూ వచ్చామని, ఇప్పుడు వినియోగదారులు నగదు చెల్లింపులే కోరుకుంటున్నారని చెప్పారు. అసలు తమ దుకాణాలకు వచ్చే వినియోగదారుల వద్దనే 25 శాతానికి మించి క్రెడిట్ కార్డులు ఉండవని, ఉన్నవారు కూడా ఇక్కడ ఇంటర్నెట్ సౌకర్యం సక్రమంగా లేకపోవడం వల్ల ఎవరూ ఉపయోగించడం లేదని ఆయన చెప్పారు. స్టేషనరీ షాపుల నుంచి బ్యూటీ పార్లర్ల వరకు ఇప్పుడు అందరూ మళ్లీ నగదు లావాదేవీలే నిర్వహిస్తున్నారు. వినియోగదారులందరి వద్ద డిబెట్ కార్డులు లేకపోవడం, ఉన్నవారు కూడా యూజర్ చార్జీలకు భయపడడం, నెటవర్క్ సమస్యలు నగదు లావాదేవీలకు కారణమని షాపుల యజమానులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రజలెవరూ కూడా బ్యాంకులకు వెళ్లి డబ్బులు డిపాజిట్ చేయాలని కోరుకోవడం లేదని వారన్నారు. ఏటీఎంలు సరిగ్గా పనిచేయకపోవడం, బ్యాంకుల వద్దకు వెళ్లి క్యూలో నిలబడి డబ్బులు డ్రా చేసుకోవాలా? అన్న ఇబ్బందితో వారు బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేయడానికి ఇష్టపడడం లేదు. ధసాయ్ షహర్ వ్యాపారి అసోసియేషన్ కార్యాలయానికి వెళ్లి వాకబు చేయగా, ప్రతి వంద మంది వ్యాపారుల్లో 70 మంది వ్యాపారులు స్వైపింగ్ మిషన్లు తీసుకున్నారని, ఇప్పుడు వారిలో 25 శాతానికి మించి వాడడం లేదని చెప్పారు. బ్యాంక్ ఆఫ్ బరోడా వారు ఉచితంగా స్వైపింగ్ మషన్లను ఇవ్వడంతో అప్పుడు ఎక్కువ మంది తీసుకున్నారని తెలిపారు. మరో నలుగురు చిన్న వ్యాపారులను ప్రశ్నించగా వారు ఆ నాటి నుంచి ఈ నాటి వరకు నగదు లావా దేవీలే నిర్వహిస్తున్నామని, తామెన్నడూ డిజిటల్ లావా దేవీలు నిర్వహించలేదని చెప్పారు. -
డబ్బులు తీసుకోకుండా ఓటు వేయండి
మంత్రి ఆదినారాయణరెడ్డి వివాదాస్పద వ్యాఖ్య ముద్దనూరు : జమ్మలమడుగు నియోజకవర్గాన్ని నంద్యాల కన్నా మెరుగ్గా అభివృద్ధి చేస్తా.. అయితే డబ్బులు తీసుకోకుండా ఓటు వేయాలని మార్కెటింగ్‌శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ముద్దనూరులో జలసిరికి హారతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గంలో పేదలందరికీ రేషన్‌కార్డులు, పింఛన్లు, గ్యాస్ కనెక్షన్లు, పక్కాగృహాలు మంజూరు చేస్తాం..నంద్యాలతో పాటు అభివృద్ధి చేస్తాం. అయితే డబ్బులు తీసుకోకుండా ఓటు వేయండి.. అభివృద్ధి చేయలేకపోతే వచ్చే ఎన్నికల్లో నాకు ఓటు వేయొద్దు అని ప్రజలతో అన్నారు. నియోజకవర్గంలో ఫ్యాక్షన్ తగ్గిందన్నారు. గండికోట ప్రాజెక్టులోకి ఈ ఏడాది తగినన్ని నీరు వస్తే ముద్దనూరు మండలంలోని పలు చెరువులకు కూడా నీటి సరఫరా చేస్తామని తెలిపారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే గంగాదేవిపల్లె ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టామని, ఈ పథకం మంజూరు కోసం గ్రామస్తులంతా కలసి వస్తే ముఖ్యమంత్రికి వద్దకు తీసుకెళ్తానని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకంలో పనిచేసిన తమకు ఇంతవరకు కూలి డబ్బులు అందలేదని కూలీలు మంత్రికి విన్నవించారు. ఇంకుడు గుంతలు నిర్మించుకోమని అధికారులు చెప్పారని, ఇప్పటివరకు పూర్తయిన ఇంకుడు గుంతలకు బిల్లులు చెల్లించలేదని ఫిర్యాదు చేశారు.ఇరిగేషన్ ఎస్ఈ గోపాల్‌రెడ్డి, ఈఈ వెంకట్రావు, డీఈ రాజన్‌బాబు, ఏఈ జాన్సన్, డ్వామా ఏపీడీ మొగిలిచెండు సురేష్, ఎంపీపీ కళావతి, ఎంపీటీసీ సభ్యులు రదారెడ్డి, అపర్ణ, రాజు, రామలక్ష్మి పాల్గొన్నారు. -
స్టేట్ బ్యాంకు ఏటీఎంలో భారీ చోరీ
సాక్షి, మదనపల్లి : చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణం నక్కలదిన్నే తండాలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. ఏటీఎంలో క్యాష్ చాంబర్‌ను గ్యాస్ కట్టర్‌తో కోసి డబ్బు ఎత్తుకెళ్లారు. ఈ విషయం శనివారం మధ్యాహ్నం ఆలస్యంగా వెలుగుచూసింది. ఏటీఎంలో ఉంచిన నగదు రూ. 22లక్షలు చోరీకి గురయ్యాయని ఎస్బీఐ బ్రాంచి మేనేజర్ కెఎస్ఆర్ మూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గార్డు, సీసీ కెమెరా ఇద్దరూ ఏటీఎం కేంద్రం వద్ద లేకపోవటంతో ఈ ఘటనకు పాల్పడిందెవరనేది తెలియడం లేదు. శనివారం సాయంత్రం పోలీసులు ఘటన స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. -
ఇదేమి బాదుడు
– నగదు రహిత లావాదేవీలపై సర్వీస్ చార్జీలు – 0.75 నుంచి 2 శాతం వరకూ వసూళ్లు – ఆర్టీసీ టిక్కెట్లు బుక్ చేసినా బాదుడే – నగదు రహిత లావాదేవీలపై ప్రజల విముఖత – ఏటీఎంలలో నగదు నిల్వలు నిల్ సాక్షి, రాజమహేంద్రవరం: రూ. వెయ్యి, రూ. 500 నోట్ల చెలామణి రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించిన నగదు రహిత లావాదేవీలపై ప్రస్తుతం విముఖత వ్యక్తమవుతోంది. నగదు రహిత లావాదేవీలపై సర్వీస్ చార్జీలు వసూలు చేయడమే ఇందుకు కారణం. పెట్రోలు కొనుగోలు మినహా ఇతర అన్ని సేవలు, వస్తు కొనుగోళ్లపై ఆయా డెబిట్, క్రెడిట్ కార్డుల బ్యాంకులు సర్వీస్ చార్జీలు వసూలు చేస్తున్నాయి. డిసెంబర్లో పెద్ద నోట్లు రద్దు తర్వాత రెండు నెలలపాటు ఏటీఎం విత్‌డ్రాలు, నగదు రహిత సేవలపై కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సర్వీస్ చార్జీలు రద్దు చేసిన ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థ బ్యాంకులు తరువాత అంతకుముందులాగే సర్వీస్ చార్జీలు వసూలు చేయడం ప్రారంభించాయి. లావాదేవీల మొత్తం ఆధారంగా 0.75 శాతం నుంచి 2 శాతం వరకూ సర్వీస్ చార్జీలు వేస్తున్నారు. ఫలితంగా వినియోగదారులు నగదు రహిత సేవలపై విముఖంగా ఉన్నారు. ఆర్టీసీ టిక్కెట్లు కొన్నా బాదుడే... పెట్రోలు మినహా ఇక ఏ సర్వీస్ పొందినా, ఏ వస్తువు కొనుగోలు చేసి కార్డు ద్వారా నగుదు చెల్లిస్తే మాత్రం సర్వీస్ చార్జీ చెల్లించుకోవాల్సిందే. చివరకు ఆర్టీసీ టిక్కెట్లు నగదు రహిత లావాదేవీ రూపంలో కొనుగోలు చేసినా సర్వీస్ చార్జీ బాదుడు సరేసరి. రూ.2000 లోపు నగదు రహిత లావాదేవీలపై 0.75 శాతం ఆపై గరీష్టంగా 2 శాతం సర్వీస్ చార్జీ రూపంలో బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. ఉదహరణకు రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్ టిక్కెట్లు రూ.600 అనుకుంటే దానిపై రూ.5 (0.75శాతం) సర్వీస్ చార్జీ అదనంగా తీసుకుంటున్నారు. ఏదైనా రూ.30,000 విలువైన ఎలక్ట్రానిక్ వస్తువు కొనుగోలు చేసి నగదు కార్డుల ద్వారా చెల్లించాలంటే రూ. 600 (2 శాతం) సర్వీస్ చార్జీ అవుతుందని ఆయా దుకాణాల క్యాష్ కౌంటర్లో ముందుగానే చెబుతున్నారు. దీంతో కొనుగోలుదారులు కార్డుల ద్వారా చెల్లించాలన్న తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నారు. అప్పటికప్పుడు ఏటీఎంల వద్దకు పరిగెడుతున్నారు. ఏటీఎంలలో కనిష్టంగా రూ. 20,00, గరిష్టంగా రూ.40,000 వస్తున్నాయి. ఒకసారి ఏటీఎం నుంచి విత్‌డ్రా చేస్తే బ్యాంకులకు చెల్లించాల్సిన సర్వీస్ చార్జీ రూ.30లోపు ఉంటోంది. అన్ని బ్యాంకులు తమ కార్డుదారులకు నెలకు ఐదుసార్లు లావాదేవీల వరకు ఎలాంటి సర్వీస్ చార్జీలు వేయడంలేదు. రూ.30,000 మొత్తం నగదు రహితంగా చెల్లిస్తే రూ.600 సర్వీస్ చార్జీ అవుతుంది. అదే ఏటీఎం నుంచి విత్‌డ్రా చేస్తే రూ.30 లేదా అసలే చార్జీ ఉండదు. దీంతో ప్రజలు తాము కొనుగోలు చేసిన వస్తువుల చెల్లింపులను నగదు రూపంలో ఇచ్చేందుకే మొగ్గుచూపుతున్నారు. ఏటీఎం.. ఎనీ టైం నో మనీ... వస్తువులు కొనుగోలు చేసిన తర్వాత నగదు కోసం ఏటీఎంల వద్దకు పరిగెడుతున్న ప్రజలకు ఏటీఎంల వద్ద నో క్యాష్, ఆవుట్ ఆఫ్ ఆర్డర్ వంటి బోర్డులు దర్శనమిస్తున్నాయి. కొన్ని ఏటీఎంలో ఆయా బ్యాంకులు పెడుతున్న నగదు కొద్ది గంటల్లోనే అయిపోతోంది. జిల్లాలో 811 ఏటీఎం కేంద్రాలు ఉన్నాయి. వీటిలో అధికారిక లెక్కల ప్రాకారం దాదాపు 60 శాతం ఏటీ ఎంలలో మాత్రమే నగదు నిల్వలు ఉంటున్నాయి. వీటిలో కూడా 24 గంటలూ నగదు ఉండే ఏటీఎంలు 10 శాతం కూడా లేవు. బ్యాంకుల వద్ద ఉన్న ఏటీఎంలలో మాత్రమే 24 గంటలు నగదు ఉంటోంది. జిల్లాలో ప్రతి రోజు అన్ని బ్యాంకులు దాదాపు రూ.500 కోట్ల లావాదేవీలు జరుపుతున్నాయి. ఇందులో ఆర్టీజీఎస్, నెఫ్ట్ ద్వారా జరిగే లావాదేవీలు దాదాపు 70 శాతంగా ఉన్నాయి. వస్తు,సేవలకు ప్రజలు నగదు రహిత లావాదేవీలు దాదాపు 10 శాతం జరుగుతున్నాయి. సర్వీస్ చార్జీలు లేనప్పుడు 75 శాతం నగదు రహితమే.. పెద్దనోట్ల రద్దు సమయంలో సర్వీస్ చార్జీలు ఎత్తివేసినప్పుడు ప్రతి రోజు మేము చేసే వ్యాపారంలో 75 శాతం కార్డుల ద్వారానే నగదు తీసుకున్నాం. ప్రస్తుతం సర్వీస్ చార్జీలు వసూలు చేస్తుండడతో వ్యాపారంలో కనీసం 10 శాతం కూడా కార్డుల ద్వారా లావాదేవీలు జరగడం లేదు. రెండు శాతం సర్వీస్ చార్జీలు అని కస్టమర్లకు చెప్పడంతోనే నగదు తెస్తామంటూ ఏటీఎంల వద్దకు వెళుతున్నారు. – రత్నాకర్, శ్రీ కంప్యూటర్ వరల్డ్, రాజమహేంద్రవరం. సేవలకు సర్వీస్ చార్జీలు తప్పనిసరి పెద్దనోట్ల రద్దుకు ముందు నుంచే నగదు రహిత లావాదేవీలపై సర్వీస్ చార్జీలు ఉన్నాయి. పెద్దనోట్ల రద్దు అనంతరం రెండు నెలలపాటు కేంద్రప్రభుత్వం రద్దు చేసింది. అనంతరం యథాతథంగా సర్వీస్ చార్జీలు వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ టిక్కెట్లు నగదు రహిత లావాదేవీల ద్వారా కొనుగోలు చేస్తే నామమాత్రపు సర్వీస్ చార్జీలు వేస్తున్నారు. జిల్లాలో దాదాపు 60 శాతం ఏటీఎంలు పని చేస్తున్నాయి. కొన్ని ఏటీఎంలలో నగదు పెట్టిన కొద్ది గంటల్లోనే అయిపోతున్నాయి. – సుబ్రమణ్యం, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్, కాకినాడ. -
మళ్లీ నోట్ల కిరికిరి
⇒ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నగదు కొరత ⇒ బ్యాంకుల్లో డబ్బుల్లేవు.. ఏటీఎంలన్నీ ఖాళీ ⇒ అరకొరగా నగదు పంపిణీ చేస్తున్న ఆర్బీఐ ⇒ నోట్ల రద్దు తర్వాత పాత నోట్ల డిపాజిట్లు రూ.80 వేల కోట్లు ⇒రాష్ట్రానికి వచ్చిన కొత్త నోట్లు రూ.49 వేల కోట్లే ⇒ మే నుంచి కొత్త నోట్ల సరఫరా పూర్తిగా బంద్ ⇒ నగదు జమలు తగ్గిపోయాయంటున్న బ్యాంకర్లు ⇒ డబ్బులివ్వకుండా ఖాతాదారులను తిప్పిపంపుతున్న వైనం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న నగదు కొరత తీవ్రతకు ఇది మచ్చుతునక మాత్రమే. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. ఎనభై శాతానికిపైగా ఏటీఎంలు పనిచేయటం లేదు. నేరుగా బ్యాంకులకు వెళ్లి డబ్బులు డ్రా చేసుకోవాలనుకున్నా.. నగదు లేదనే సమాధానమే వినిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దుకు ముందు సగటున రోజుకు రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు నగదు లావాదేవీలు నిర్వహించిన బ్రాంచీల్లోనూ ఇప్పుడు పదో వంతు నగదు లావాదేవీలు జరగడం లేదు. దీంతో సాధారణ జనంతోపాటు ఉద్యోగులు, వ్యాపారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఖరీఫ్ సీజన్ మొదలుకావడంతో రైతులను నోట్ల కష్టాలు వెంటాడుతున్నాయి. నోట్ల కొరత సమస్యపై వారం కింద రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు.. ఆర్బీఐ, బ్యాంకు అధికారులతో సమావేశమై సమీక్షించినప్పటికీ పరిస్థితిలో మార్పేమీ రాలేదు. ఆర్బీఐతోనే అసలు పేచీ! గతేడాది నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత రాష్ట్రంలో రూ.80 వేల కోట్లకు పైగా పాత రూ.500, రూ.1,000 నోట్లు బ్యాంకుల్లో జమయ్యాయి. కానీ అంత మొత్తానికి సరిపడా కొత్త నోట్లను ఆర్బీఐ ఇప్పటికీ సరఫరా చేయలేకపోయింది. ఇప్పటివరకు తెలంగాణకు పంపిణీ చేసిన కొత్త నోట్లు కేవలం రూ.49 వేల కోట్లేనని ఆర్బీఐ వర్గాలు చెబుతున్నాయి. ఇక మే నెల నుంచి అయితే కొత్త నోట్ల పంపిణీని పూర్తిగా నిలిపివేసింది. రోజువారీ లావాదేవీల్లో భాగంగా బ్యాంకులకు వచ్చే నగదునే అన్ని బ్యాంకులకు సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. దీంతో నోట్ల సమస్య మళ్లీ తీవ్రమైంది. బ్యాంకుల నుంచి తమకు ఆశించినంత నగదు రావడం లేదని.. అందుకే ఏటీఎంలు, బ్రాంచీలకు సరిపడేంత నగదు ఇవ్వలేకపోతున్నామని ఆర్బీఐ అధికారులు చెబుతున్నారు. ఆర్బీఐకి లేఖ రాసిన ప్రభుత్వం నోట్ల కొరతను అధిగమించేందుకు తెలంగాణకు సరిపడేంత నగదు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి రిజర్వుబ్యాంకుకు లేఖ రాసింది. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత మార్చి నెలలో పరిస్థితి కుదుటపడిందని, ఏటీఎంలు సైతం వినియోగంలోకి వచ్చాయని అందులో పేర్కొంది. అయితే ఏప్రిల్ నుంచి మళ్లీ నోట్ల మొదలైందని.. క్రమంగా ఏటీఎంలన్నీ మూతపడ్డాయని వివరించింది. మే నెల నుంచి ఈ సమస్య మరింత తీవ్రమైందని.. దీని పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆర్బీఐకి విజ్ఞప్తి చేసింది. డిజిటల్ లావాదేవీలు పెరిగినప్పటికీ నగదు కొరతతో అన్ని వర్గాలూ ఇబ్బందులకు గురవుతున్నాయని వివరించింది. డబ్బు జమ చేసేవారేరీ? బ్యాంకుల్లో రోజువారీ నగదు జమలు గణనీయంగా పడిపోయాయని, అందుకే తాము రిజర్వుబ్యాంకుకు నగదును పంపలేకపోతున్నామని బ్యాంకర్లు చెబుతున్నారు. డబ్బులు డ్రా చేసుకునేందుకే తప్ప.. జమ చేసేందుకు వచ్చే ఖాతాదారుల సంఖ్య సగానికిపైగా తగ్గిపోయిందని ఇటీవలి సమీక్షలో అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. బ్యాంకుల్లో డబ్బులు జమ చేసినా, డ్రా చేసినా కూడా చార్జీల మోత మోగిపోతుందనే ప్రచారమే అందుకు కారణమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఆర్బీఐ ఒక్కో బ్యాంకు బ్రాంచీకి రోజుకు మూడు నాలుగు లక్షలకు మించి నగదు ఇవ్వడం లేదని బ్యాంకర్లు ఫిర్యాదు చేశారు. దీంతో ఖాతాదారులకు డబ్బులు ఇవ్వలేకపోతున్నామని.. ఏటీఎంలో లక్ష రూపాయలు అందుబాటులో ఉంచితే అరగంటలో ఖాళీ అవుతున్నాయని నివేదించారు. మొత్తంగా ఆర్బీఐ, బ్యాంకుల మధ్య సమన్వయ లోపంతో నగదు కొరత మరింత పెరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వం అంచనాకు వచ్చింది. ‘సార్.. నాకు అత్యవసరంగా లక్ష రూపాయలు కావాలి. ఆస్పత్రిలో బిల్లు కట్టాల్సి ఉంది. బ్యాంకులో ఏడాది కింద రూ. లక్షన్నర ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. ఇదిగో బాండ్ కూడా తెచ్చాను. డబ్బులివ్వండి..’ – ఓ ఖాతాదారుడి అభ్యర్థన. ‘అత్యవసరమున్నా మీరడిగిన డబ్బులివ్వలేం. ఆస్పత్రికి వెళ్లి వాళ్ల ఖాతా వివరాలు తీసుకురండి. ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తాం. ఆర్బీఐ మా బ్యాంకుకు రోజుకు రూ.3 లక్షలకు మించి ఇవ్వడం లేదు’ – బంజారాహిల్స్ ఎస్బీఐ కార్పొరేట్ బ్రాంచి సమాధానమిది. -
బోర్ కొట్టి.. డాడీ మనీ అంతా ధ్వంసంచేశాడు!
న్యూఢిల్లీ : చిన్న పిల్లల్ని ఇంట్లో ఒంటరిగా విడిచిపెట్టి వెళ్తే ఎంత ప్రమాదమో మరోసారి రుజువైంది. అయితే ఈసారి కాస్త భిన్నంగా, తండ్రికి షాకిచ్చేలా ఓ చైనా పిల్లోడు అల్లరిఅల్లరి చేశాడు. బోర్ కొట్టిన ఆ పిల్లోడు ఇంట్లో తండ్రి దాచిన పెట్టిన లక్షల కొద్దీ నగదును ధ్వంసం చేశాడు. చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్ క్వింగ్డావోలోని గావ్ అనే వ్యక్తికి ఇంటికి వెళ్లగానే ఓ టెర్రిబుల్ సర్ ప్రైజ్ ఎదురైంది. తన ఐదేళ్ల కొడుకు తాను దాచిపెట్టిన నగదునంతా ముక్కలు ముక్కలుగా చించేసి, కనిపించాడు. మొత్తం 50వేల యువాన్లు అంటే 4,70,000 మేర నగదు ధ్వంసం చేశాడు. వెంటనే వాటిని తీసుకుని గావ్ బ్యాంకు వద్దకు ఎక్స్చేంజ్ కోసం పరిగెత్తినా లాభం లేకపోయింది. బ్యాంకు వారు కూడా వాటిని తీసుకోవడానికి నిరాకరించారు. సింపుల్ గా ఆ చిరిగిపోయిన నోట్లను ఎక్స్చేంజ్ గా తీసుకోవడానికి సమ్మతించమని చెప్పేశారు. కొంచెం అతికిపెట్టి తీసుకొచ్చినా వాటిని తీసుకుంటామని బ్యాంకు వారు తెలిపారు. బిజినెస్ కోసం క్రెడిటార్ల దగ్గర్నుంచి రావ్ ఈ నగదును తీసుకొచ్చాడు. అయితే ఈ విషయంలో తన కొడుకుని తప్పు పట్టాల్సినవసరం లేదని, తన కొడుకు చాలా చిన్నవాడని, అతను ఏమి చేస్తున్నాడో తనకే తెలియదని తండ్రి చెప్పాడు. -
గ్యాస్ లీకై తాటాకిల్లు దగ్ధం
వెంకట్రామన్నగూడెం (తాడేపలి్లగూడెం రూరల్) : గ్యాస్ లీకై తాటాకిల్లు దగ్ధమైన ఘటన మండలంలోని వెంకట్రామన్నగూడెంలో శుక్రవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని జయ మహంకాళి పౌల్ట్రీ ఎదురుగా బత్తుల శ్రీనివాసరావు నివాసముంటున్నాడు. రోజూ మాదిరిగానే గురువారం రాత్రి పనులు ముగించుకుని ఇంటిల్లిపాది నిద్రించారు. శుక్రవారం తెల్లవారు జామున గ్యాస్ లీకై మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల వారు చూసి కేకలు పెట్టారు. ఈ హడావుడికి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు లేచి బయటకు పరుగులు తీశారు. అప్పటికే ఇంటితో పాటు బీరువాలోని రూ.2.50 లక్షల నగదు, ఇతర సామగ్రి, ఇంటి ఆవరణలోని పల్సర్ మోటారు సైకిల్ పూర్తిగా దగ్ధమయ్యాయి. మొత్తం ఆస్తినష్టం సుమారు రూ.6.50 లక్షలు ఉంటుందని బాధితుడు శ్రీనివాసరావు వాపోయాడు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఇన్చార్జి ఫైరాఫీసర్ వి.భాస్కర్‌రాజు ఆధ్వర్యంలో మంటలను అదుపు చేశారు. -
పైసలివ్వందే పని జరగదు!
- రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి చేపలు – డాక్యుమెంట్ రైటర్లే బాసులు – అందినకాడికి దండుకుంటున్న వైనం – ఏసీబీ వలలో చిక్కిన కాకినాడ రిజిస్ట్రార్ బాలప్రకాశ్ – గతంలో ఇక్కడ డీఐజీగా పని చేసిన వైనం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్.. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే శాఖల్లో ఇదీ ఒకటి. రెవెన్యూ ఏ స్థాయిలో వస్తుందో అదే స్థాయిలో అక్రమాలూ సాగుతున్నాయి. ప్రతి పనికీ ఓ రేటు కట్టి వసూలు చేస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్లు, ప్రైవేట్ వ్యక్తుల సాయంతో ‘మాఫియా’ను తలపిస్తున్నారు. ఇక్కడ డీఐజీగా పని చేసిన బాలప్రకాశ్ కాకినాడలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల వలలో పడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన గతంలో ఇక్కడ డీఐజీగా పని చేశారు. ఆ సమయంలోనే అవినీతి ఆరోపణలు వచ్చాయి. అప్పట్లోనే ఏసీబీ వల పన్నినా తప్పించుకుని బదిలీపై వెళ్లిపోయారు. అనంతపురం టౌన్ : జిల్లాలోని రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాలు అవినీతి, అక్రమాలకు నిలయంగా మారాయి. ఇక్కడ పైసలివ్వందే పని జరగదన్న విమర్శలు ఎప్పట్నుంచో ఉన్నాయి. జిల్లాలో అనంతపురం, హిందూపురం రిజిస్ట్రేషన్ జిల్లాలు ఉన్నాయి. అనంతపురం పరిధిలో గుత్తి, గుంతకల్లు, కళ్యాణదుర్గం, కణేకల్లు, పామిడి, రాయదుర్గం, శింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, యాడికి, అనంతపురం, అనంతపురం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, హిందూపురం పరిధిలో బుక్కపట్నం, చిలమత్తూరు, చెన్నేకొత్తపల్లి, ధర్మవరం, హిందూపురం, కదిరి, మడకశిర, పెనుకొండ, తనకల్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. అనంతపురం, అనంతపురం రూరల్, ధర్మవరం, గుత్తి, గుంతకల్లు, రాయదుర్గం, తాడిపత్రి, బుక్కపట్నం, చిలమత్తూరు, కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. వీటి పరిధిలోనే 250 నుంచి 300 మంది వరకు డాక్యుమెంట్ రైటర్లు పని చేస్తున్నారు. మెజార్టీ రైటర్లు వృత్తినే నమ్ముకొని ఉండగా.. కొందరు మాత్రం ‘వసూల్ రాజా’లుగా తయారవుతున్నారు. అధికారులను మచ్చిక చేసుకుని అందినకాడికి దండుకుంటున్నారు. పారిశ్రామికంగా పేరొందిన హిందూపురం ప్రాంతం బెంగళూరుకు సమీపంలో ఉండటంతో ఇక్కడి భూముల ధరలు రెట్టింపు స్థాయిలో ఉన్నాయి. అనంతపురంలోనూ ఇదే పరిస్థితి. మిగిలిన పట్టణ ప్రాంతాల్లోనూ సామాన్యులు భూములు, స్థలాలు కొనలేని పరిస్థితులు ఉన్నాయి. అలా వెళ్తేనే పని జరిగేది..! రిజిస్ట్రేషన్ ఫీజును 7.5 శాతంగా పభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు చలానా తీస్తే అవసరమయ్యే స్టాంప్ పేపర్లను సరఫరా చేస్తారు. కానీ డాక్యుమెంట్ రైటర్లు చలానాకు పది శాతం వరకు అధికంగా పెంచేసి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇవి కాకుండా కార్యాలయ ఖర్చుల పేరుతో మరో రూ.వెయ్యి తీసుకుంటున్నారు. డాక్యుమెంట్లు తయారు చేసినందుకు రూ.1000 నుంచి రూ.1500 అదనంగా ఇవ్వాలి. ఇవన్నీ ఇవ్వకుంటే పని సజావుగా సాగనివ్వరు. కార్యాలయాల్లో అధికారులకు ఇవ్వాలని చెబుతూ నేరుగా వసూళ్లకు పాల్పడుతున్నారు. అధికారులు కూడా డాక్యుమెంట్ రైటర్ల ద్వారా వెళ్లినవారికే పనిచేస్తున్నారు. అధికారులు, రైటర్లు, స్టాంప్‌వెండర్లు కలిసి నిలువునా దోచుకుంటున్నా..పట్టించుకునే వారు కరువయ్యారు. కార్యాలయాల్లో ప్రజల సౌకర్యార్థం హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. అవి ఎక్కడా కనిపించడం లేదు. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు, ప్రజలకు వెసులుబాటు కలిగేలా ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని తెచ్చినా ఫలితం లేకుండాపోతోంది. ఇక స్టాంపు వెండర్ల అక్రమాలకు సైతం చెక్ పడటం లేదు. అవసరాన్ని బట్టి అసలు ధరకంటే 20 శాతం అదనంగా వసూలు చేస్తున్నారు. అప్పుడు తప్పించుకుని..! స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ అనంతపురం డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ)గా పని చేసిన బాలప్రకాశ్ బుధవారం కాకినాడలో రూ.40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఏడాది క్రితం ఈయన్ను కమిషనర్ అండ్ ఐజీ (హైదరాబాద్) కార్యాలయానికి బదిలీ చేశారు. ఆ తర్వాత రివర్షన్పై కాకినాడ జిల్లా రిజిస్ట్రార్‌గా పోస్టింగ్ ఇచ్చారు. తాజాగా ఏసీబీకి దొరికారు. ఆయన రూ.3 కోట్లకు పైగా అక్రమాస్తులు కల్గివున్నట్లు గుర్తించారు. ఆయన మన జిల్లాలో పని చేసిన సమయంలోనూ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. అవినీతి ఆరోపణలున్న అధికారులపై విచారణ జరగకుండా చూడటం, ఫిర్యాదులొస్తే ఆ విషయాన్ని సదరు అధికారులకు చెప్పి వసూళ్లకు పాల్పడటం వంటివి చేసినట్లు తెలుస్తోంది. అప్పుడే ఏసీబీ అధికారులు దృష్టి సారించగా.. ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిపోయారు. -
ఓటర్లకు ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషిన్లు!
► ఆర్కేనగర్లో అభ్యర్థుల లీలలు ► నగదు ముట్టిందా అనేందుకు కోడ్ భాష.. స్వామికి దండం పెట్టుకున్నారా! ► అమ్మ భౌతికకాయం బొమ్మతో ప్రచారం ► పన్నీర్‌కు వాసన్ మద్దతు సాక్షి ప్రతినిధి, చెన్నై: సవాలక్ష నిబంధనల అతిక్రమణకు అనంతకోటి ఉపాయాలు ఉన్నాయని ఆర్కేనగర్ ఎన్నికలు రుజువు చేస్తున్నాయి. నగదు పంపిణీని అడ్డుకునేందుకు అధికారులు అవస్థలు పడుతుండగా కోడ్ భాషతో అభ్యర్థులు తమ పనికానిచ్చేస్తున్నారు. ఆర్కేనగర్లో సుమారు రెండు లక్షల ఓటర్లుండగా, ఒక్కో ఓటుకు రూ.4వేలు నుంచి రూ.10వేల వరకు చెల్లిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నగదు ప్రవాహాన్ని అడ్డుకునేందుకు 35 మంది పరిశీలకులు, 10 ప్లయింగ్ స్క్వాడ్ల ను, ఆదాయ పన్ను శాఖ అధికారులను ఎన్నికల కమిషన్ నియమించింది. వీరుగాక పెద్ద సంఖ్యలో పోలీసులు, పారా మిలటరీ దళాలు తిరుగుతున్నాయి. అయినా బుధవారం ఒక్కరోజునే లక్ష మంది ఓటర్లకు నగదు పంపిణీ సాగినట్లు తెలుస్తోంది. అయితే నోటు తీసుకున్నా తమకే ఓటు వేస్తారని గ్యారంటీ ఎముందని అభ్యర్థులకు అనుమానం పట్టుకుంది. ఆధ్యాత్మిక భావాలు అధికంగా ఉండే తమిళ ప్రజలు సెంటిమెంట్‌కు కట్టుబడి ఉంటారు. అందుకే నగదును అందజేసే ముందు భగవంతుని బొమ్మలపై ప్రమాణం చేయించుకుంటున్నారు. వారి వారి మతాలను అనుసరించి ఓటు కోసం ఒట్టు వేయించుకుంటున్నారు. నగదు పంపిణీ సక్రమంగా జరిగిందా లేక కార్యకర్తలు నొక్కేసారా అనే అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు మరో బృందం పర్యటిస్తోంది. వీరు ఓటర్ల వద్దకు, టీ దుకాణాల వద్ద గుంపులుగా ఉండేవారి వద్దకు వెళ్లి ‘స్వామికి దండం పెట్టుకున్నారా’ అని ప్రశ్నించగా పెట్టుకున్నాం అని బదులిస్తే నగదు ముట్టినట్లు. డబ్బులు అందనివారు ‘ ఎక్కడయ్యా స్వామి...ఎలా దండం పెట్టుకునేది’అని సమాధానం చెబుతున్నారు. ఇదిలా ఉండగా, కొందరు ఓటర్లకు వాషింగ్ మెషీన్, ఫ్రిజ్ తదితర వస్తువుల కూపన్లు పంచుతున్నారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఇదే మాటలు వినపడడంతో అధికారులు కోడ్ భాషను కనుగొన్నారు. శీర్కాళి నియోజకవర్గ అన్నాడీఎంకే ఎమ్మె ల్యే భారతి తన అనుచరులతో వస్తుండగా అధికారులు ఆయన కారును ఆపి తనిఖీలు చేశారు. అయితే ఏమీ దొరకలేదు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో ధన ప్రవాహం ఎన్నికల కమిషన్‌ను ఊపిరి తీసుకోనివ్వడం లేదు. ఇప్పటికే అధికారుల బృందాలతో ఆర్కేనగర్ నిండిపోగా, తాజాగా మరో ఉన్నతాధికారి ఢిల్లీ నుంచి చెన్నైకి చేరుకున్నారు. అమ్మ భౌతికకాయం బొమ్మ, శవపేటిక ప్రచారం ఇదిలా ఉండగా, అమ్మ మరణానికి శశికళ, ఆమె కుటుంబీకులే కారణమని ప్రజలు అనుమానిస్తుండగా, దీన్ని అవకాశంగా తీసుకున్న పన్నీర్‌సెల్వం వర్గం ఆర్కేనగర్లో చిత్రమైన ప్రచారం చేసింది. ఒక జీపుపై అమ్మ భౌతికకాయాన్ని పోలిన బొమ్మను శవపేటిలో ఉంచి ప్రచారం నిర్వహించడం కలకలం రేపింది. ఈనెల 12వ తేదీన ఆర్కేనగర్లో పోలింగ్ జరగనుండడంతో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచార వేగం పెంచారు. అయితే అన్నాడీఎంకేలోని రెండు చీలిక వర్గాల అభ్యర్థులు దినకరన్, మధుసూదనన్ ఒకరి కొకరు గట్టిపోటీ ఇస్తున్నారు. అయితే విచ్చలవిడిగా నగదును వెదజల్లుతూ ఓటర్లను ప్రలోభపెట్టడంలో దినకరన్ ముందున్నరానే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలకు తగ్గట్లుగా నగదు బట్వాడా చేస్తూ అన్నాడీఎంకే, డీఎంకే కార్యకర్తలు పట్టుపడుతున్నారు. భారీ మొత్తం నగదు స్వాధీనమైంది. ఈ పరిస్థితిలో ఢిల్లీలోని ప్రధాన ఎన్నికల కమిషన్ కార్యాలయం ఆదాయపన్ను శాఖకు చెందిన ఐఆర్ఎస్ అధికారి విక్రమ్ భాద్రాను ప్రత్యేక అధి కారిని నియమించగా ఆయన గురువారం ఉదయం చెన్నైకి చేరుకున్నారు. ఈ అధికారి అభ్యర్థులపైనే గాక ఆర్కేనగర్లో పనిచేసే అధికారులపై కూడా నిఘాపెట్టే అధికారాలను ఈసీ కల్పించింది. ఆర్కేనగర్లో ఎన్నికల విధులు నిర్వహించే అన్నిశాఖల అధికారులు విక్రమ్ బాద్రా కనుసన్నల్లో నడుచుకోవాల్సి ఉంది. ప్రజలు, పార్టీ నుంచి వచ్చే ఫిర్యాదులను సైతం స్వీకరించి నేరుగా ఢిల్లీకి పంపి వాటిపై ఆయనే నిర్ణయం తీసుకుంటారు. ఇదిలా ఉండగా, ఎన్నికల అధికారులతో కూడిన ఫ్ల్లయింగ్ స్క్వాడ్ బృందాల్లో రాజకీయ పార్టీల ప్రతి నిధులను కూడా చేర్చాలని ఆలోచిస్తున్నట్లు ప్రధాన ఎన్నికల అధికారి రాజేష్ లఖానీ చెప్పారు. నగదు బట్వాడాపై మారుమూల సందుల్లో సైతం నిఘా పెంచేందుకు ద్విచక్రవాహనాల పోలీసు దళాలు గురువారం రం గంలోకి దించినట్లు చెన్నై పోలీసు కమిషనర్ కార్తికేయన్ తెలిపారు. కాశిమేడు ప్రాంతంలో ఓటర్లకు నగదు పంచుతున్న డీఎంకే కార్యకర్త కరుణానిధిని అరెస్ట్ చేశారు. దినకరన్ ఓటమికి ఏడపాడి కుట్ర: స్టాలిన్ ఆర్కేనగర్ ఎన్నికల్లో దినకరన్ గెలిచినట్లయితే తన సీఎం సీటుకు ముప్పు తప్పదని సీఎం ఎడపాడి పళనిస్వామి భయపడుతున్నారని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షులు స్టాలిన్ అన్నారు. ఆర్కేనగర్ పార్టీ నేతలతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీఎం సీటును కాపాడుకునేందుకు దినకరన్ ఓటమికి ఎడపాడి పాటుపడుతున్నారని వ్యాఖ్యానించారు. తమిళ మానిల కాంగ్రెస్ అధ్యక్షుడు జీకేవాసన్ గురువారం పన్నీర్‌సెల్వం అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. -
ఇలాగైతే దివాలాయే
నగదు రహితంతో చిరు వ్యాపారుల ఇక్కట్లు వర్తక సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఆవేదన రాజమహేంద్రవరం సిటీ : నగదు రహిత లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం చిరు వ్యాపారుల పాలిట శాపంగా మారే ప్రమాదం ఉందని పలువురు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ది రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బూర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు ఆధ్యక్షతన నగరంలో పలు సంఘాల ప్రతినిధులతో చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. చిరు వ్యాపారుల హక్కులు కాపాడుతానని ప్రధాని మోదీ ఇచ్చిన హామీ తుంగలో తొక్కారని కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చే నూతన విధానం ద్వారా పీజీ డిగ్రీ పొందిన వారు మాత్రమే బిల్లు బయటకు తీసే అవకాశం ఉంటుందన్నారు. ఏ మాత్రం చదువు లేని వారు వ్యాపారాలను మూసుకోవాల్సిన దుస్థితి నెలకొనే ప్రమాదం ఉందని పలు సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కొత్తగా ప్రవేశపెట్టిన విధానంతో దేశవ్యాప్తంగా రెండు కోట్ల మంది చిరు వ్యాపారుల కుటుంబాలు రోడ్డున పడనున్నాయని పలువురు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసి ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ పథకాన్ని రూపొందించి నిధుల సమీకరణ కోసం చిరు వ్యాపారులు, ప్రజలపై ఒత్తిడి తీసుకు రావడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం చిరు వ్యాపారులకు వ్యతిరేకంగా తీసుకు వచ్చిన విధానాలను నిరసిస్తూ ఏప్రిల్ 16న రాజమహేంద్రవరం కేంద్రంగా వివిధ జిల్లాల వర్తక ప్రతినిధులతో సమావేశం నిర్వహించేందుకు తీర్మానించారు. ఫెడరేషన్ ఆఫ్ చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ కన్వీనర్ అశోక్‌కుమార్ జైన్, జిల్లా ఫెడరేషన్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ నందెపు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గ్రంధి వెంకటేశ్వర్రావు,ç కార్యదర్శి కాలేపు రామచంద్రరావు, హోల్‌సేల్ క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దొండపాటి ప్రవీణ్‌కుమార్, కాలేపు వెంకట వీరభద్రరావు, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
నగదు కొరతపై రైతుల ఆగ్రహం
- ఏపీజీబీకి తాళం వేసి నిరసన – సర్దిచెప్పిన సీఐ శ్రీనివాసులు డోన్ టౌన్ : నగదు కొరతపై రైతులు, ఖాతాదారులు కన్నెర్ర చేశారు. ఎప్పుడొచ్చినా డబ్బుల్లేవు.. బ్యాంక్ సేవా కేంద్రాలకు వెళ్లాలంటూ బ్యాంకు అధికారులు చెబుతున్నారని మండిపడ్డారు. వారి తీరుకు నిరసనగా ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ డోన్ ప్రధాన శాఖను సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో ప్రజలు తాళం వేశారు. విషయం తెలుసుకున్న సీఐ శ్రీనివాసులు గౌడ్, ఎస్ఐ జయశేఖర్‌గౌడ్ బ్యాంక్ వద్దకు చేరుకొని సీపీఐ నేతలు రంగనాయుడు, సుంకయ్యలతో చర్చించారు. ఆ తర్వాత బ్యాంక్ మేనేజర్ కళ్యాణశాస్త్రీని పిలిపించి ఖాతాదారులకు డబ్బు చెల్లించలేకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బ్యాంక్‌లో నగదు కొరత తీవ్రంగా ఉందని మేనేజర్ వారి దృష్టికి తెచ్చారు. కమిషన్ కోసం కక్కుర్తి... ప్రధాన బ్యాంక్ శాఖలో చెల్లింపులు నిలిపివేసి సేవా కేంద్రాలకు ఖాతాదారులను వెళ్లమనడం, కమిషన్లు దండుకునేందుకేనని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి రంగనాయుడు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుంకయ్య, పట్టణ అధ్యక్షుడు నక్కి శ్రీకాంత్ ఆరోపించారు. బ్యాంక్ కరస్పాండెండ్ (బీసీ) కేంద్రాల్లో రూ.వెయ్యికి రూ.150 నుంచి రూ.200 కమిషన్ కింద ఏజెంట్లు వసూలు చేస్తున్నారని వారు ఆరోపించారు. బ్యాంక్‌లో నగదు నిల్వలు లేకపోతే.. నోటీస్ బోర్డు అంటించి రైతులకు నచ్చజెప్పి పంపించాలని సీఐ శ్రీనివాసులు గౌడ్, ఎస్ఐ జయశేఖర్ గౌడ్ మేనేజర్‌కు సూచించడంతో వివాదం సద్దుమణిగింది. -
అలజడి
- నగదు లావాదేవీలపై రూ.2 లక్షల పరిమితి - అంతకు మించితే నగదు రహితమే.. - కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంపై వాణిజ్య వర్గాల ఆందోళన - చిరు వ్యాపారాలకు నష్టమేనని ఆవేదన - నేడు వర్తక నేతల సమావేశం సాక్షి, రాజమహేంద్రవరం : అమ్మకందార్లను, కొనుగోలుదార్లను పన్ను పరిధిలోకి తెచ్చేలా కేంద్ర ప్రభుత్వం నగదు లావాదేవీలపై రూ.3 లక్షల పరిమితి విధించిన సంగతి తెలిసిందే. దీనిని తాజాగా రూ.2 లక్షలకు కుదించింది. దీనిపై వ్యాపార వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ నిర్ణయంవల్ల చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారని వ్యాపార సంఘాల ప్రతినిధులు ఆవేదన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం నేపథ్యంలో.. సోమవారం రాజమహేంద్రవరం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యాన దాదాపు 70 వర్తక సంఘాల ప్రతినిధులు సమావేశం కానున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయ ప్రభావం, దాని అమలులో వ్యాపారులు ఎదుర్కొనే ఇబ్బందులు, చిరువ్యాపారులు ఎంతమేర నష్టపోతారన్న అంశాలపై చర్చించనున్నారు. జిల్లాలో దాదాపు 15వేల మంది వ్యాపారులు అమ్మకం పన్ను పరిధిలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పన్ను చెల్లించేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అదే సమయంలో ఇప్పటికే పన్ను చెల్లిస్తున్న వారి పన్ను స్లాబ్ మారనుంది. రూ.2 లక్షలు దాటిన లావాదేవీలు నగదు రహితంగా చేయాలన్న నిబంధనతో అమ్మకంపై తప్పనిసరిగా పన్ను చెల్లిచాల్సి వస్తుంది. ఈ నిర్ణయంవల్ల చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. గ్రామాలు, పట్టణాల్లో కిరాణా, ఇతర వ్యాపారాలు చేస్తున్నవారు అరకొర ఆదాయంతో కుటుంబాలు పోషించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో వీరందరూ పన్ను పరిధిలోకి రానున్నారు. అలాగే ఏడాదిలో ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ నగదు లావాదేవీలు ఏదైనా ఒక సందర్భంలో రూ.2 లక్షలు దాటితే, అధికారులు లెక్కల్లో అది తేలితే, అమ్మకందారుడు జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఏదేమైనా కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల చిరు వ్యాపారులు తీవ్రంగా దెబ్బతింటారన్న ఆందోళన వర్తక వర్గాల్లో నెలకొంది. చిరు వ్యాపారులు దెబ్బతింటారు కేంద్రం నిర్ణయంవల్ల చిరు వ్యాపారులు దెబ్బతింటారు. చిరు వ్యాపారుల సంఖ్య బాగా తగ్గిపోతుంది. ఈ నిర్ణయం వల్ల కార్పొరేట్ సంస్థలకు మేలు జరుగుతుంది. రోజుకు నాలుగైదొందలు సంపాదన వచ్చేవారు ప్రతి రోజూ దాదాపు రూ.5 వేల వ్యాపారం చేయాల్సి ఉంటుంది. ఏడాదికి నగదు లావాదేవీలపై రూ.2 లక్షల పరిమితి విధించడంవల్ల చిరు వర్తకులు వ్యాపారాలు మానుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. - బూర్లగడ్డ సుబ్బారాయుడు, అధ్యక్షుడు, చాంబర్ ఆఫ్ కామర్స్, రాజమండ్రి అమలులో అనేక ఇబ్బందులుంటాయి గ్రామీణ రైతులు లేదా ఇతరులు ఏదైనా శుభకార్యాన్ని పురస్కరించుకుని బంగారం కొంటారు. ఇది రూ.2 లక్షలకు మించి ఉంటుంది. ఆ సమయంలో నగదు కాకుండా చెక్కు, డీడీ ఇవ్వాలని అడిగితే వారికి ఆ సదుపాయం ఉండదు. బంగారం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉన్నా నగదు లావాదేవీల పరిమితితో సాధ్యం కాదు. ఇది ఇబ్బందికరమే. - కడియాల శ్రీనివాస్, అధ్యక్షుడు, సువర్ణ వర్తక సంఘం, రాజమహేంద్రవరం -
దొంగల బీభత్సం
హన్మకొండ: వరంగల్ అర్బన్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. హన్మకొండ మండలం కాకతీయ యూనివర్సిటీ సమీపంలోని విష్ణుపూరి వీధిలో సోమవారం రాత్రి నాలుగు ఇళ్లలో చోరీకి పాల్పడిన దొంగలు అందినకాడికి ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచరాణ చేపడుతున్నారు. సుమారు 25 తులాల బంగారు ఆభరణాలతో పాటు పెద్ద ఎత్తున నగదు చోరీకి గురైనట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.