యువరాజ్‌ సింగ్‌ ఇంట్లో చోరీ, ఇపుడు ఎందుకు వైరల్‌?! | Sakshi
Sakshi News home page

యువరాజ్‌ సింగ్‌ ఇంట్లో చోరీ, ఇపుడు ఎందుకు వైరల్‌?!

Published Mon, Feb 19 2024 3:53 PM

75000 cash jewellery stolen at Yuvraj Singh Panchkula home Police registers case - Sakshi

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తల్లి ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. పంచకులలోని మానసా దేవి కాంప్లెక్స్‌లోని తమ ఇంట్లో నగదు, నగలు మాయమైనట్లు యువరాజ్ తల్లి షబ్మాన్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పంచకుల ఇంటి నుంచి  సుమారు 70వేల విలువైన నగదు, నగలు చోరీకి గురయ్యాయని, తన ఫిర్యాదులో వెల్లడించారు.

ఈ ఘటన ఆరు నెలల క్రితమే జరిగినప్పటికీ, ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఇదే వార్త హల్‌చల్ చేస్తోంది. యువరాజ్ తల్లి, షబ్నమ్ సింగ్ ఇప్పటికే పోలీసులలో కేసు నమోదు చేశారు. హౌస్ కీపింగ్ సిబ్బంది, సాకేత్డికి చెందిన లలితా దేవి,బీహార్‌కు చెందిన వంట మనిషి సిల్దార్ పాల్‌పై అనుమానాలు లేవనెత్తారు.దీనిపై విచారణ ఇంకా కొనసాగుతోంది. 

తాజాగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు చేయడంతో  యువరాజ్‌ సింగ్‌ ఇంట్లో చోరీ ఘటన మళ్లీ వైరల్‌ అవుతోంది. ఫోన్‌లో వ్యక్తిగత సమాచారం ఉందని, దుర్వినియోగం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

యువరాజ్ సింగ్ తల్లి ఫిర్యాదు మేరకు  గతేడాది సెప్టెంబర్ ఈ చోరీ జరిగింది. తమ సిబ్బందిలోఇద్దరు ఇంటి నుంచి వెళ్లిన ఆరు నెలలకే దొంగతనం జరిగిందని ఆమె పేర్కొన్నారు.  గురుగ్రామ్‌లో ఉంటున్న సమయంలో నిందితులు  తమ ఇంటిని విడిచిపెట్టినట్లు ఫిర్యాదులో తెలిపారు.  కాగా యువరాజ్ సింగ్  మాజీ నటి , మోడల్ అయిన హాజెల్ కీచ్‌ను  2016, నవంబరులో పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు కుమారుడు ఓరియన్‌,  కుమార్తె ఆరా ఉన్నారు. 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement