నగదు కోసం ఆశ.. సొంత సోదరుడితోనే పెళ్లి !

Sister Wedded With Brother For Cash Scheme In Up - Sakshi

లక్నో: ఇప్పటికే పెళ్లైన ఒక సోదరి ఈసారి ఏకంగా తన సొంత సోదరుడినే వివాహం చేసుకుంది. అయితే ఇది సీరియస్‌గా కాదు. ఓ స్కీమ్‌ కింద ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వమిచ్చే నగదు కోసం ఆశపడి వారిద్దరు ఉత్తుత్తి పెళ్లి చేసుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌జిల్లాలోని లక్ష్మిపూర్‌ బ్లాక్‌లో ఈ వింత ఘటన జరిగింది. మొత్తం 38 జంటలు సామూహిక వివాహాల్లో పాల్గొంటే అందులో అన్నా చెల్లెలు పాల్గొని పెళ్లి తంతు కానిచ్చేశారు. అగ్ని సాక్షిగా ఏడడుగులు నడిచారు.

పెళ్లి సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన కానుకలను తీసుకున్నారు.  నగదు వస్తుందని మధ్యవర్తులు  చెప్పడం వల్లే వారు ఈ పెళ్లికి సిద్ధపడినట్లు తెలిసింది. అయితే ఈ బోగస్‌ పెళ్లి  విషయాన్ని అధికారులు కనిపెట్టారు. అన్నాచెల్లెళ్లకు ఇచ్చిన బహుమతులు తిరిగి తీసుకుంటున్నామని, వారికి రావాల్సిన నగదు బహుమతిని కూడా ఆపివేస్తున్నామని బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ చెప్పారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కాగా, యూపీలో ముఖ్యమంత్రి సామూహిక వివాహ్‌ యోజన కింద పెళ్లికూతురు బ్యాంకు ఖాతాలో రూ.35వేలు ప్రభుత్వం వేస్తుంది. వీటికి తోడు పెళ్లి కోసం మరో 16 వేల ఖర్చుపెడుతుంది. ఈ మొత్తం నుంచి కొత్త జంటకు కానుకలు ఇస్తారు. ఆర్థికంగా వెనుకబడిన పేదల కోసం ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాన్ని అమలు చేస్తోంది. 

ఇదీ చదవండి.. 10 పాయింట్లలో బీహార్‌ గొప్పతనం 

Election 2024

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top