అభిమానులకు విజయ్- రష్మిక ప్రత్యేక విందు.. వీడియో వైరల్ | Vijay and Rashmika lunch with Fans After Grand Wedding | Sakshi
Sakshi News home page

Vijay and Rashmika: అభిమానులకు విజయ్- రష్మిక ప్రత్యేక విందు.. వీడియో వైరల్

Mar 4 2026 2:44 AM | Updated on Mar 4 2026 2:44 AM

Vijay and Rashmika lunch with Fans After Grand Wedding

టాలీవుడ్ కొత్త జంట విజయ్ దేవరకొండ- రష్మిక తమ గ్రాండ్‌ వెడ్డింగ్‌ అభిమానులతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇటీవల సొంతూరుకి వెళ్లిన కొత్త జంట సత్యనారాయణవ్రతం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. తమ సొంతవారితో ఈ వేడుక జరుపుకోవడం ఆనందంగా ఉందని నూతన దంపతులు తెలిపారు.

తాజాగా విజయ్- రష్మిక అభిమానుల కోసం ప్రత్యేకంగా లంచ్ ఏర్పాటు చేశారు. వారికి స్వయంగా భోజనాలు వడ్డించారు. అనంతరం వీరిద్దరు వారితో పాటే కలిసి భోజనం చేశారు. విజయ్‌కి రష్మిక భోజనం తినిపిస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. టాలీవుడ్ కొత్త జంట విజయ్ దేవరకొండ- రష్మిక ఇటీవలే ‍వివాహబంధంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో అత్యంత సన్నిహితులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. ఈనెల 4న హైదరాబాద్‌లో వీరి గ్రాండ్ రిసెప్షన్‌ వేడుక జరగనుంది. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement