హ్యాపీ పార్టీ | Rashmika Mandanna and Vijay Deverakonda Sangeet: The Night They Danced As One | Sakshi
Sakshi News home page

హ్యాపీ పార్టీ

Mar 4 2026 12:40 AM | Updated on Mar 4 2026 12:40 AM

Rashmika Mandanna and Vijay Deverakonda Sangeet: The Night They Danced As One

విజయ్‌ దేవరకొండ, రష్మికా మందన్నా వివాహం ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. కాగా, పెళ్లికి ముందు జరిగిన వేడుకల్లో సంగీత్‌కి సంబంధించిన ఫొటోలను మంగళవారం విజయ్‌–రష్మిక సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘‘ఆ రోజు (సంగీత్‌ని ఉద్దేశించి) సాయంత్రం కన్నీళ్లు వచ్చేంతవరకూ నవ్వుతూనే ఉన్నాం. మా పాదాలు నొప్పి పుట్టేంతవరకు డ్యాన్స్‌ చేశాం. అందరి స్పీచ్‌లతో భావోద్వేగానికి గురయ్యాం.

మా కళ్లు చమర్చేలా సంభ్రమాశ్చర్యాలతో మంచి మనుషులతో గడిపిన బిగ్‌ హ్యాపీ పార్టీ ఇది’’ అని ‘ఎక్స్‌’లో విజయ్‌ దేవరకొండ పేర్కొన్నారు. ‘‘ఆ రోజు సాయంత్రం నేను, విజ్జు ఒకరినొకరం సర్‌ప్రైజ్‌ చేసుకోవాలనుకున్నాం. ఫ్యామిలీ మమ్మల్ని సర్‌ప్రైజ్‌ చేయాలనుకుంది. మా ఫ్యామిలీ మెంబర్స్‌ స్వేచ్ఛగా డ్యాన్స్‌ చేయడం మాకు సంతోషాన్నిచ్చింది. ఆ రోజు రాత్రి నేను, విజయ్‌ బాగా డ్యాన్స్‌ చేశాం’’ అని పేర్కొన్నారు రష్మిక. ఇదిలా ఉంటే... తమ ఫ్యాన్స్‌ కోసం విజయ్‌–రష్మిక ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. ఈ ఇద్దరూ స్వయంగా వడ్డించడంతో పాటు అభిమానులను ఆత్మీయంగా పలకరించి, వారితో కలిసి భోజనం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement