తొమ్మిదేళ్లకే సంపాదిస్తున్న సన్నీ లియోన్ కూతురు | Sunny Leone Daughter Nisha Latest Invention | Sakshi
Sakshi News home page

Sunny Leone Daughter: కూతురు గురించి గొప్పగా చెప్పిన సన్నీ

Mar 3 2026 8:24 PM | Updated on Mar 4 2026 1:06 PM

Sunny Leone Daughter Nisha Latest Invention

ఒకప్పుడు శృంగార తారగా గుర్తింపు తెచ్చుకున్న సన్నీ లియోన్.. చాన్నాళ్ల క్రితమే వాటిని పక్కనబెట్టేసింది. ఓ వైపు ఫ్యామిలీ, మరోవైపు సినిమాలు చేస్తూ బతికేస్తోంది. రీసెంట్ టైంలో అయితే సన్నీ పెద్దగా సోషల్ మీడియాలో కనిపించట్లేదు. తాజాగా బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ యూట్యూబ్ వీడియోలో కనిపించింది. సన్నీ ఇంటికి వెళ్లిన ఫరా ఖాన్.. చాలాసేపు ముచ్చటించింది. మిగతా వాటి సంగతేమో గానీ తన కూతురు గురించి సన్నీ లియోన్ చెప్పిన ఓ విషయం మాత్రం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

(ఇదీ చదవండి: యాంకర్ సుమ కూతురిని చూశారా? ఇప్పుడెలా ఉందంటే)

డేనియల్ వెబర్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత సన్నీ లియోన్.. లాతుర్‌కి చెందిన నిషా అనే పాపని దత్తత తీసుకుంది. తర్వాత సన్నీ దంపతులకు కవల అబ్బాయిలు పుట్టారు. నిషాకి ఇప్పుడు తొమ్మిదేళ్లు. అయితే ఈ వయసులోనే తన కూతురు.. బూ బాక్స్ అనేదాన్ని కనిపెట్టిందని సన్నీ బయటపెట్టింది. దీనికి అధికారికంగా పేటెంట్ హక్కులు కూడా తీసుకున్నామని స్పష్టం చేసింది.

సన్నీ లియోన్ మాట్లాడుతూ.. 'బూ బాక్స్' అనేది టూ ఇన్ వన్ టిష్యూ హోల్డర్. సాధారణంగా టిష్యూని ఉపయోగించిన తర్వాత ఓ డస్ట్ బిన్‌లో పడేస్తాం. లేదంటే ఎక్కడ పడితే అక్కడ వేస్తాం. ఇది గమనించిన నిషా.. టిష్యూ బాక్స్ పక్కనే చిన్న చెత్త బుట్ట కలిపి ఉండేలా దీన్న డిజైన్ చేసింది. అంటే టిష్యూ వాడుకున్న తర్వాత పక్కనే ఉన్న బిన్‌లో పడేయొచ్చు. దీంతో శ్రమ తగ్గుతుంది. ఇల్లు శుభ్రంగా ఉంటుంది.

అయితే దీన్ని తయారు చేయడం వెనక ఓ కారణముంది. ముంబైలోని దుమ్ము వల్ల నిషాకు ఎప్పటికప్పుడు అలర్జీ వచ్చేది. దానికోసం టిష్యూలు వాడి ఇంట్లో ఎక్కడపడితే అక్కడ పడేసేసరికి తిట్టేదాన్ని. అప్పుడు నిషాకు ఈ ఆలోచన వచ్చింది. ఓ టిష్యూ బాక్స్‌కు ప్లాస్టర్‌తో డిస్పోజబుల్ కప్ అతికించి నాకు చూపించింది. అదే ఇప్పుడు ఓ కమర్షియల్ ప్రొడక్ట్‌గా మారి నిషాకు డబ్బులు కూడా తెచ్చిపెడుతోంది. చిన్న వయసులోనే స్వశక్తి డబ్బు సంపాదిస్తోంది అని సన్నీ లియోన్ గర్వంగా చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: మా బాడీ పార్ట్స్ జూమ్ చేసి ఫొటోలు.. 'కాంతార' హీరోయిన్ ఫైర్)

Advertisement
 
Advertisement
Advertisement