తల్లి జీవితం ఇలాగే ఉంటుంది: బాలీవుడ్‌ నటి | Drishyam Actress Ishita Dutta Opens Up On Motherhood, Says Life Changed Completely After Becoming A Mom | Sakshi
Sakshi News home page

Ishita Dutta: ఇల్లంతా చిందరవందర.. ఎప్పటికీ పూర్తవని పనులు!

Mar 1 2026 10:00 AM | Updated on Mar 1 2026 10:28 AM

Actress Ishita Dutta Says Mom Life is Messy

తెలుగు చిత్రం చాణక్యుడుతో వెండితెరకు హీరోయిన్‌గా పరిచయమైంది ఇషితా దత్తా. తర్వాత మాత్రం బాలీవుడ్‌లోనే సెటిలైంది. దృశ్యం, దృశ్యం 2, దేదే ప్యార్‌ దే 2 వంటి హిందీ చిత్రాల్లో తళుక్కుమని మెరిసింది. రిష్తాన్‌ కా సౌధాగర్‌: బాజీగర్‌ సీరియల్‌ చేసే సమయంలో నటుడు వస్తల్‌ సేత్‌తో ప్రేమలో పడింది. 2017లో అతడిని పెళ్లి చేసుకుంది. వీరికి 2023లో బాబు జన్మించగా 2025లో పాప పుట్టింది.

తల్లి జీవితం ఇంతే..
తల్లయ్యాక తన జీవితమే మారిపోయిందంటోంది ఇషితా దత్తా. ఈమేరకు సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టింది. చిక్కుల జుట్టు, ఇంట్లో ఎక్కడపడితే అక్కడ బొమ్మలు.. ఎప్పటికీ పూర్తవని పనులు.. అవి కాకుండా సంబంధం లేని ప్రదేశాల్లో కూడా స్టిక్కర్లు.. తల్లి జీవితం ఇలాగే ఉంటుంది. కానీ ఇందులో స్వచ్ఛమైన ఆనందం దాగి ఉంది అని రాసుకొచ్చింది. ఇకపోతే ఇషిత తన పిల్లల ఆటలు, అలకలకు సంబంధించిన వీడియోలను అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఉంటుంది.

చదవండి: సన్యాసం తీసుకున్న హీరోయిన్‌.. 25 ఏళ్ల తర్వాత రీఎంట్రీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement