‘స‌న్ ఆఫ్‌’ వ‌స్తోన్న రెస్పాన్సే నా స‌క్సెస్ : సాయి సింహాద్రి | Sai Simhadri Made Interesting Comments About Son Of Movie At Success Meet, Deets Inside | Sakshi
Sakshi News home page

‘స‌న్ ఆఫ్‌’ వ‌స్తోన్న రెస్పాన్సే నా స‌క్సెస్ : సాయి సింహాద్రి

Mar 1 2026 9:08 AM | Updated on Mar 1 2026 12:06 PM

Sai Simhadri Talk About Son Of Movie At Success Meet

సాయి సింహాద్రి హీరోగా నటించి, నిర్మించిన సినిమా ‘సన్‌ ఆఫ్‌’. బత్తుల సతీష్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 27న విడుదలైంది. ఈ చిత్రం సక్సెస్‌మీట్‌లో సాయి సింహాద్రి మాట్లాడుతూ–‘‘యూఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా ఉన్న నేను సినిమా రంగంపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చాను. ఏడాదిన్నర పాటు ఇక్కడే ఉంటూ ఒడిదొడుకులు ఎదుర్కొంటూ సినిమాను పూర్తి చేశాను. ‘సన్‌ ఆఫ్‌’ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనే నా సక్సెస్‌’’ అని చెప్పారు.

హీరోయిన్ మీరా రాజ్ మాట్లాడుతూ ‘మంచి ఎమోష‌న‌ల్ బాండింగ్ ఉన్న ‘స‌న్ ఆఫ్’లో తండ్రీ కొడుకుల మ‌ధ్య క‌నెక్టింగ్ చేసే మంచి రోల్‌లో న‌టించ‌టం న‌టిగా నాకు మంచి గుర్తింపునిచ్చింది’ అన్నారు.

 ‘‘ఈ సినిమాలోని తండ్రీ కొడుకుల ఎమోషనల్‌ బాండింగ్, సంఘర్షణ కాన్సెప్ట్‌ నాకు నచ్చడంతో రిలీజ్‌కి ముందుకు వచ్చాను’’ అని చెప్పారు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ శోభారాణి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement