Son Of Movie
-
సన్ ఆఫ్ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
‘సన్ ఆఫ్’ వస్తోన్న రెస్పాన్సే నా సక్సెస్ : సాయి సింహాద్రి
సాయి సింహాద్రి హీరోగా నటించి, నిర్మించిన సినిమా ‘సన్ ఆఫ్’. బత్తుల సతీష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 27న విడుదలైంది. ఈ చిత్రం సక్సెస్‌మీట్‌లో సాయి సింహాద్రి మాట్లాడుతూ–‘‘యూఎస్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఉన్న నేను సినిమా రంగంపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చాను. ఏడాదిన్నర పాటు ఇక్కడే ఉంటూ ఒడిదొడుకులు ఎదుర్కొంటూ సినిమాను పూర్తి చేశాను. ‘సన్ ఆఫ్’ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనే నా సక్సెస్’’ అని చెప్పారు.హీరోయిన్ మీరా రాజ్ మాట్లాడుతూ ‘మంచి ఎమోషనల్ బాండింగ్ ఉన్న ‘సన్ ఆఫ్’లో తండ్రీ కొడుకుల మధ్య కనెక్టింగ్ చేసే మంచి రోల్లో నటించటం నటిగా నాకు మంచి గుర్తింపునిచ్చింది’ అన్నారు. ‘‘ఈ సినిమాలోని తండ్రీ కొడుకుల ఎమోషనల్ బాండింగ్, సంఘర్షణ కాన్సెప్ట్ నాకు నచ్చడంతో రిలీజ్‌కి ముందుకు వచ్చాను’’ అని చెప్పారు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శోభారాణి. -
తండ్రీ, కొడుకుల ఎమోషనల్ కథ.. సన్ ఆఫ్ మూవీ రివ్యూ
టైటిల్: సన్ ఆఫ్దర్శకుడు.. బత్తుల సతీష్ నిర్మాణ సంస్థ.. సైన్మా బ్యానర్విడుదల తేదీ.. ఫిబ్రవరి 27, 2026సాయి సింహాద్రి హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం సన్ ఆఫ్. ఈ మూవీని బత్తుల సతీష్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో వినోద్ కుమార్, మీరా రాజ్ కీలక పాత్రల్ని పోషించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 27న రిలీజైంది. తండ్రీకొడుకుల సెంటిమెంట్‌తో వచ్చిన ఈ చిత్రం ఆడియెన్స్‌ని ఆకట్టుకుందో లేదో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..వెంకట్రావు (వినోద్ కుమార్) తన భార్య చనిపోవడంతో అన్నీ తానై తన కొడుకు ఆనంద్ (సాయి సింహాద్రిని చూసుకుంటాడు. అయితే కొడుకు మాత్రం ఎప్పుడూ కూడా తండ్రీ ఆశలకు భిన్నంగా ప్రతీ సారి చదువుల్లో ఫెయిల్ అవుతూ ఉంటాడు. ఇక ఊర్లోనే అను (మీరా రాజ్)తో అతనికి చిన్నతనం నుంచి లవ్ ఉంటుంది. అను, ఆనంద్ ఆ ప్రేమకు అందరూ ఒప్పుకుంటారు. కానీ ఎంగేజ్మెంట్ టైమ్‌కి వెంకట్రావు అడ్డం తిరుగుతాడు. పనీ పాట లేని గాలికి తిరిగే తన కొడుకు ఎలా నచ్చాడు? అసలు ఈ పెళ్లికి ఎలా ఒప్పుకున్నారు? అంటూ అందరి ముందు వెంకట్రావ్ పరువు తీస్తాడు. దీంతో వారసత్వంగా రావాల్సిన ఆస్తిని, ఇంటిని తనకు ఇప్పించండి అంటూ కన్న తండ్రి మీదే ఆనంద్ కేసు వేస్తాడు. ఆ తరువాత ఏం జరిగింది? ఆస్తిని ఇచ్చేందుకు తండ్రి పెట్టిన కండీషన్ ఏంటి? చివరకు జీవితం విలువ, బరువు, బాధ్యతల గురించి ఆ కొడుకు తెలుసుకుంటాడా? తన ప్రేమను గెలిపించుకుంటాడా? అన్నదే స్టోరీ.ఎలా ఉందంటే..తండ్రీ కొడుకుల నేపథ్యంలో గతంలో చాలా కథలు వచ్చాయి. సన్ ఆఫ్ కథ కూడా ప్రేక్షకులకు కొత్తగా చూసిన ఫీలింగ్ కలగదు. కానీ ప్రస్తుతం ఉన్న యువతరానికి మేసేజ్ ఇచ్చేలా ఉంటుంది. ఎలాంటి బాధ్యత లేకుండా గాలికి తిరిగితే యువకుడి జీవితంలో ఎదురయ్యే సమస్యలు, కష్టాల్ని చక్కగా ఈ కథలో చూపించాడు. జీవితంలో ప్రేమ, బంధాలు,బరువు,బాధ్యతల గురించి యువత తెలుసుకోవాల్సిన అవసరముందనే కాన్సెప్ట్‌తో తీసిన సన్ ఆఫ్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా తండ్రీకొడుకుల మధ్య ఉండే దూరం.. హీరో గాలి తిరుగుడు, హీరోయిన్‌తో ప్రేమ ఇలా సరదాగా సాగుతూ ఉంటుంది. కథలో అసలు సంఘర్షణ, టర్నింగ్ పాయింట్ అంతా కూడా ఇంటర్వెల్ బ్లాక్‌కి వస్తుంది.కోర్ట్‌లో వినిపించే వాదనలు, తండ్రీ పెట్టే కండీషన్‌తో కథలో ఆసక్తి పెరుగుతుంది. ఆ తరువాత సెకండాఫ్‌లో బిడ్డను పెంచేందుకు ఆనంద్ పడే కష్టాలు, ఎమోషనల్ ట్రాక్‌తో కంటతడి పెట్టిస్తాయి. కథ చివర్లో వచ్చే ట్విస్ట్ అందరినీ షాక్‌కు గురి చేస్తుంది. అయితే చివరకు ఓ పూర్తి సంతృప్తికరమైన సినిమాని చూశామనే ఫీలింగ్ ప్రేక్షకుడికి కలిగేలా చేస్తుంది.ఎవరెలా చేశారంటే..సాయి సింహాద్రి ఆనంద్ అనే పాత్రలో ఒదిగిపోయాడు. తొలి సినిమా అన్న ఫీలింగ్ లేకుండా అన్ని రకాల ఎమోషన్స్ పండించాడు. ఇక తండ్రి పాత్రలో వినోద్ కుమార్ మెప్పించారు. కొత్త హీరోయిన్ మీరా రాజ్.. అను అనే పాత్రలో అద్భుతంగా నటించింది. మిగిలిన పాత్రల్లో అందరు కూడా తమ పరిధి మేర మెప్పించారు. సాంకేతికంగా చూసుకుంటే సంగీతం, విజువల్స్ ఈ చిత్రానికి ప్రధాన బలం. ఫీల్ గుడ్ మ్యూజిక్‌తో సాగే పాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. గ్రామీణ వాతావరణాన్ని తెరపై మరింత అందంగా చూపించారు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. -
‘సన్ ఆఫ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘సన్ ఆఫ్’లో మంచి కంటెంట్ ఉంది.. పెద్ద హిట్ అవ్వాలి: కోన వెంకట్
బత్తుల సతీష్ దర్శకత్వంలో సాయి సింహాద్రి హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘సన్ ఆఫ్’. ఈ మూవీని ఫిబ్రవరి 27న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాట్రైలర్, పాటలను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్బంగా నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్లో ప్రముఖ రైటర్, నిర్మాత కోన వెంకట్, సముద్ర, వి.ఎన్ ఆదిత్య, రామ సత్య నారాయణ రాజు, తదితరులు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం నిర్వహించిన ఈవెంట్లో.. ప్రముఖ రైటర్, నిర్మాత కోన వెంకట్ మాట్లాడుతూ .. ‘సినిమాలోని నటీనటులు, టెక్నికల్ టీంను బట్టి ఆ మూవీ మీద ఓ ఇంప్రెషన్ ఏర్పడుతుంది. ఈ మూవీకి కాస్ట్ అండ్ క్రూ బాగా సెట్ అయింది. సాయి ఈ మూవీ కోసం హీరో అయి నిర్మాత అయ్యాడా?.. నిర్మాత అయ్యాక హీరోగా మారాడా? తెలీదు. కానీ ఈ సినిమాలో మాత్రం మంచి కంటెంట్ ఉంది. ప్రతీ శుక్రవారం పదుల సంఖ్యలో చిత్రాలు వస్తున్నాయి. ఇలాంటి కంటెంట్ ఉన్న చిత్రాలు హిట్ అయితే ఇంకా చాలా మంది కొత్త వాళ్లు తెలుగు చిత్ర పరిశ్రమలోకి వస్తారు. ‘సన్ ఆఫ్’ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.హీరో, నిర్మాత సాయి సింహాద్రి మాట్లాడుతూ .. ‘నేను ఎన్నో కథల్ని విన్నాను. సతీష్ బత్తుల చెప్పిన ‘సన్ ఆఫ్’ కథ నాకు చాలా నచ్చింది. యాక్టింగ్ పట్ల శిక్షణ తీసుకున్నాను. ఈ సినిమాకి నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఇలా ప్రతీ ఒక్కరూ నాకు సపోర్ట్ చేశారు. ‘సన్ ఆఫ్’ ఫిబ్రవరి 27న రిలీజ్ కాబోతోంది. ఫ్యామిలీ మెంబర్స్, స్నేహితులతో కలిసి ఈ మూవీని చూడండి. అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. కన్నీరు కార్చకుండా మాత్రం థియేటర్ నుంచి బయటకు వెళ్లలేరు’ అని అన్నారు.


