సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా | Son Of Movie Telugu OTT Streaming Now | Sakshi
Sakshi News home page

OTT: తండ్రి-కొడుకుల ఎమోషనల్ మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్

Apr 15 2026 1:21 PM | Updated on Apr 15 2026 1:50 PM

Son Of Movie Telugu OTT Streaming Now

ఈ వారం ఓటీటీల్లోకి యూత్, ఉస్తాద్ భగత్ సింగ్, సంభవం అధ్యాయం ఒన్ను, టోస్టర్, దో దివానే షెహర్ మే తదితర సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటితో పాటు పోచమ్మ, మట్కా కింగ్ సిరీస్‌లు కూడా అందుబాటులోకి రానున్నాయి. వీటన్నింటిపైనా బజ్ బాగానే ఉంది. ఇవి కాకుండా ఇప్పుడో తెలుగు చిత్రం సడన్‌గా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో చూడొచ్చు?

(ఇదీ చదవండి: ఓటీటీలో రాధిక సూపర్ హిట్ సినిమా.. తెలుగు రివ్యూ)

సాయి సింహాద్రి, మీరా రాజ్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'సన్నాఫ్'. సీనియర్ నటుడ వినోద్ కుమార్ కీలక పాత్ర చేశారు. తండ్రి కొడుకుల ఎమోషనల్ స్టోరీతో ఈ సినిమా తీశారు. ఫిబ్రవరి 27న థియేటర్లలో రిలీజ్ కాగా ఇదొచ్చిన సంగతి కూడా ప్రేక్షకులకు తెలియలేదు. కంటెంట్ కావొచ్చు, స్టార్స్ లేకపోవడం వల్ల జనాలు దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడీ చిత్రం నెలన్నర తర్వాత ఆహా ఓటీటీలోకి ఏ మాత్రం హడావుడి లేకుండా వచ్చేసింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లోకి రానుంది.

'సన్నాఫ్' విషయానికొస్తే.. భార్య చనిపోవడంతో వెంకట్రావ్(వినోద్ కుమార్) తన కొడుకు ఆనంద్(సాయి సింహాద్రి)ని అల్లారుముద్దుగా పెంచుకుంటాడు. మరోవైపు చదువులో ఫెయిల్ అవుతూ, అను(మీరా రాజ్) అనే అమ్మాయితో ఆనంద్ ప్రేమలో ఉంటాడు. పెళ్లికి పెద్దలు ఒప్పుకొంటారు. కానీ నిశ్చితార్థం రోజు పనిపాటా లేని తన కొడుక్కి మీ అమ్మాయిని ఎలా ఇస్తారు? అని రచ్చ చేసి కార్యక్రమాన్ని ఆపేస్తాడు. దీంతో అవమానం తట్టుకోలేని ఆనంద్.. తండ్రి నుంచి వారసత్వంగా దక్కాల్సిన ఇల్లు, ఆస్తి కోసం కోర్టుకెక్కుతాడు. తర్వాత ఏం జరిగింది? ఆస్తి ఇవ్వడానికి ఆనంద్‌కి తండ్రి పెట్టిన కండీషన్ ఏంటి? ఆనంద్ చివరకు ఏం తెలుసుకున్నాడనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: పోలీస్ కేసు.. యాంకర్ విష్ణుప్రియకే కలిసొచ్చింది!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement