పోలీస్ కేసు.. విష్ణుప్రియకే కలిసొచ్చింది! | Anchor Vishnupriya Instagram Subscribers Content Issue | Sakshi
Sakshi News home page

Anchor Vishnupriya: నెగిటివ్ పబ్లిసిటీని కూడా వాడేస్తున్న విష్ణుప్రియ

Apr 15 2026 11:17 AM | Updated on Apr 15 2026 11:24 AM

Anchor Vishnupriya Instagram Subscribers Content Issue

సబ్‌స్క్రిప్షన్ పేరిట యాంకర్ విష్ణుప్రియ, ఇన్ స్టాలో తన అర్థనగ్న వీడియోలు, అసభ్యకర ఫొటోలు పోస్ట్ చేస్తుందని ఆరోపిస్తూ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్.. విజయవాడలో పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేయడం లాంటి అంశాలతో ఈమె గత కొన్నిరోజుల నుంచి వార్తల్లో నిలుస్తోంది. అయితే తనపై వస్తున్న నెగిటివ్ పబ్లిసిటీని కూడా అనుకూలంగా వాడేస్తుండటం ఇక్కడ ఆశ్చర్యపరుస్తోంది.

(ఇదీ చదవండి: అంతా రెండో భాగంలోనే.. 'రామాయణ'పై యష్ కామెంట్స్)

షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్ ప్రారంభించిన విష్ణుప్రియ.. తర్వాత టీవీ షోలకు యాంకర్‌గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. బిగ్‌బాస్ షోకి వెళ్లొచ్చింది గానీ అదేమంత ఈమెకు కలిసి రాలేదు. అయితే ఇన్ స్టాలో సబ్‌స్క్రిప్షన్ పేరిట నెలకు రూ.399కు అసభ్యకర ఫొటోలని పోస్ట్ చేస్తుందనే ఆరోపణలు ఈమెపై వచ్చాయి. ఈ వివాదం జరిగే సమయానికి ఈమెని 1892 మంది అలా సబ్‌స్క్రైబ్ చేసుకుని ఉండగా.. పోలీసు కేసు హడావుడి మూలంగా ఇప్పుడు ఆ సబ్‌స్కైబర్స్ సంఖ్య దాదాపు 5 వేలకు చేరింది.

చూస్తుంటే ఈ నెగిటివ్ పబ్లిసిటీ, పోలీసు కేసు లాంటివి విష్ణుప్రియకే ప్లస్ అయిందేమో అనిపిస్తుంది. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగానని బాధపడాలో, తనకు ఆదాయం తెచ్చే సబ్‌స్క్రైబర్స్ పెరిగారని ఆనందపడాలో తెలియని అయోమయ స్థితిలో ఈమె ఇప్పుడు ఉంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో ఈమెకు ఇన్ స్టా ద్వారా రూ.7 లక్షల ఆదాయం వస్తుండగా.. ఇప్పుడు అది ఏకంగా రూ.17 లక్షలకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: పేరు వాడుకోవాలంటే రూ.112 కోట్లు ఇవ్వమన్నారు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement