ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడు హీరోగా పరిచయం అవుతున్నాడు. కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు జయకృష్ణ శ్రీనివాస మంగాపురం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.
ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాలో రవీనా టాండన్ కూతురు రాషా తడానీ హీరోయిన్‌గా నటిస్తోంది.
కృష్ణ జయంతి సందర్భంగా ఈరోజు సినిమాలోని పాత్రలను పరిచయం చేశారు. ఈ చిత్రం జులై 9న థియేటర్లలో విడుదల కానుంది.


