breaking news
srinivasa mangapuram
-
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ కూతురి ఎంట్రీ.. ఫస్ట్ లుక్ రిలీజ్
తెలుగు వెండితెరకు కొత్త హీరోయిన్ పరిచయం అవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టండన్ కూతురు రాషా తడానీ టాలీవుడ్లో కథానాయికగా ఎంట్రీ ఇస్తోంది. ఘట్టమనేని జయకృష్ణ (ఘట్టమనేని రమేశ్‌బాబు తనయుడు) హీరోగా పరిచయం అవుతున్న సినిమా 'శ్రీనివాస మంగాపురం'. ఈ మూవీలో రాషా హీరోయిన్గా నటిస్తోంది. ఫస్ట్ లుక్శుక్రవారం (జనవరి 30న) ఈ సినిమా నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అందులో రాషా కుర్తీలో క్యూట్‌గా కనిపిస్తోంది. తన పాత్ర పేరును మంగ అని ప్రకటించారు. ఆర్ఎక్స్ 100, మంగళవారం సినిమాల ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు.హిందీలో..వైజయంతి మూవీస్, ఆనంది ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు జీవీకే ప్రకాశ్ సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే హీరో జయకృష్ణకు ఇదే తొలి సినిమా కాగా రాషా తడానీ మాత్రం హిందీలో ఆజాద్ సినిమాలో నటించింది. ఇందులో ఉయ్ అమ్మా.. అనే పాటలో అద్భుతంగా స్టెప్పులేసి జనాల్ని విపరీతంగా ఆకట్టుకుంది. Marking a beautiful beginning ✨ Presenting #RashaThadani as ‘MANGA’ to Telugu Cinema from #SrinivasaMangapuram ❤️🔥Get ready to witness her enchanting performance on the big screens soon 🫶An @DirAjayBhupathi FilmA @gvprakash Musical#JayaKrishnaGhattamaneni @AshwiniDuttCh… pic.twitter.com/zYdxmCCsfM— Vyjayanthi Movies (@VyjayanthiFilms) January 30, 2026 -
హీరోగా అన్న కొడుకు.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మహేశ్
సూపర్‌స్టార్ మహేశ్ బాబు కుటుంబం నుంచి మరో హీరో వస్తున్నాడు. కొన్నిరోజుల క్రితమే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అధికారిక ప్రకటన రాగా ఇప్పుడు మహేశ్ చేతుల మీదుగానే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అలానే చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: 'రాజాసాబ్' తొలిరోజు కలెక్షన్ అన్ని కోట్లా?)మహేశ్ కుటుంబం నుంచి త్వరలో చాలామంది వారసులు.. ఇండస్ట్రీలోకి రాబోతున్నారు. వాళ్లలో తొలుత జయకృష్ణ లాంచ్ కాబోతున్నాడు. ఇతడు మహేశ్ అన్న రమేశ్ బాబు కొడుకు. 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి తీస్తున్న 'శ్రీనివాస మంగాపురం' మూవీతో జయకృష్ణ హీరోగా పరిచయం కానున్నాడు. రషా తడానీ హీరోయిన్. కొన్నాళ్ల క్రితమే షూటింగ్ మొదలు కాగా తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. బులెట్‌పై గన్ పట్టుకుని ఉన్న లుక్ బాగుంది.ఇందులోనే మోహన్ బాబు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారనే రూమర్ కొన్నిరోజుల క్రితం వచ్చింది గానీ గ్లింప్స్, టీజర్, ట్రైలర్ లాంటివి వస్తే ఆయన ఉన్నారా లేదా అనేది క్లారిటీ రానుంది. ఈ ఏడాదిలో మూవీ థియేటర్లలోకి రానుంది. ఎప్పుడు ఏంటనేది త్వరలో చెబుతారు. జయకృష్ణ కాకుండా మహేశ్ కొడుకు గౌతమ్, కూతురు సితార. అలానే రమేశ్ బాబు కూతురు భారతి. మహేశ్ సోదరి మంజుల కుమార్తె జాన్వీ కూడా త్వరలో తెరంగేట్రం చేయనున్నారు.(ఇదీ చదవండి: ఒక్కో డైరెక్టర్ ఒక్కోలా షాకిచ్చారు.. లేటెస్ట్గా 'రాజాసాబ్')Happy to unveil the first look of #SrinivasaMangapuram… 🤗🤗🤗Wishing #JayaKrishnaGhattamaneni the very best on his debut.A strong team and an interesting beginning… all the best to the entire team 👍🏻👍🏻👍🏻@DirAjayBhupathi #RashaThadani@gvprakash @AshwiniDuttCh @gemini_kiran… pic.twitter.com/Iw5B67hltq— Mahesh Babu (@urstrulyMahesh) January 10, 2026 -
పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సీజేఐ
తిరుచానూరు/చంద్రగిరి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ బుధవారం కుటుంబ సమేతంగా తిరుపతి జిల్లాలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం ఎదుట వారికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జిల్లా జడ్జి వీర్రాజు, టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్, తదితరులు పూర్ణకుంభంతో సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి ధ్వజస్తంభానికి మొక్కుకున్న అనంతరం జస్టిస్ చంద్రచూడ్ దంపతులు కుంకుమార్చన సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం ఆశీర్వాద మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి అమ్మవారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం సీజేఐ కుటుంబసమేతంగా చిత్తూరు జిల్లా శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం ఎదుట ఆయనకు వైవీ సుబ్బారెడ్డి, అనిల్ కుమార్ సింఘాల్ స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు సాంప్రదాయ బద్ధంగా స్వాగతించారు. ధ్వజస్తంభానికి మొక్కుకున్న అనంతరం జస్టిస్ చంద్రచూడ్ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు శేషవస్త్రం అందజేసి వేదాశీర్వాదం చేశారు. సీజేఐకి చైర్మన్, ఈవోలు స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం సీజేఐ దంపతులు ఆలయంలో గోపూజలో పాల్గొని గోవు, దూడకు గ్రాసం తినిపించారు. -
ఉగాదికి ముందే పంచాంగం
సాక్షి, తిరుమల: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలో కొలువుదీరిన కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 14 నుంచి 23వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరపనున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 11, 25 తేదీల్లో వయోవృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శనం కల్పిస్తామని ఆయన వెల్లడించారు. ఈ నెల 12, 26వ తేదీల్లో 5 సంవత్సరాల్లోపు చంటిబిడ్డల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనానికి అనుమతి కల్పిస్తాని పేర్కొన్నారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా సేవా టిక్కెట్లు పొందాలని సూచించారు. టీటీడీ వెబ్సైట్లో టికెట్లు లేనట్లయితే ఇతర సైట్లలో ఉన్న టికెట్లు నకిలీవిగా భావించాలని తెలిపారు హెచ్చరించారు. ఇక నకిలీ వెబ్సైట్లు నిర్వహిస్తున్న 19 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. కాగా తెలుగు పండుగ ఉగాదిని పురస్కరించుకుని మార్చి మొదటి వారంలోనే భక్తులకు పంచాగాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. -
నేడు స్వామివారి గరుడోత్సవం
-
మోహిని అవతారంలో ఊరేగిన శ్రీవారు
తిరుపతి: శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్సిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీవారు మోహిని అవతారంలో ఊరేగారు. సాయంత్రం స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రుడైన గరుత్మంతుడి వాహనంపై ఊరేగనున్నారు. గరుడ సేవ కోసం తిరుపతిలోని గోవిందరాజుల స్వామి ఆలయం నుంచి మధ్యాహ్నం శోభాయాత్రగా బయలుదేరి వెంకన్నకు లక్ష్మీహారం సమర్పించనున్నారు. కాగా, భక్తుల గోవింద నామ స్మరణ మధ్య ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. -
కల్యాణ వెంకన్నకు బంగారు ఆభరణాలు
-
కల్యాణ వెంకన్నకు బంగారు ఆభరణాలు
చంద్రగిరి: చిత్తూరు జిల్లా శ్రీనివాసమంగాపురంలో వెలసిన కల్యాణ వేంకటేశ్వరస్వామి వారికి గురువారం సుమారు కిలోన్నరకు పైగా బరువున్న (రూ. 42 లక్షల విలువ) బంగారు ఆభరణాలు కానుకగా అందాయి. హైదరాబాద్‌కు చెందిన నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ఏవీఎస్ రాజు, సుగుణ దంపతులు గురువారం స్వామివారికి బంగారు కఠి, వరద హస్తాల ఆభరణాలను టీటీడీ జేఈవో శ్రీనివాస్‌రాజు అందజేశారు. -
చెట్టును ఢీ కొన్న ఆటో: ఒకరు మృతి
చిత్తూరు జిల్లా శ్రీనివాస మంగాపురం వద్ద ఆదివారం ఆటో చెట్టును ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 9 మంది గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. క్షతగాత్రలను మరింత మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించాలని వైద్యులు సూచించారు. దాంతో పోలీసులు వారిని తిరుపతికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అధిక వేగంతో ఆటోను నడపడం వల్లే ఆ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.


