బాలీవుడ్ బ్యూటీ బర్త్ డే.. శ్రీనివాస మంగాపురం టీమ్ స్పెషల్ వీడియో | Bollywood actress Rasha Thadani birthday special video goes viral | Sakshi
Sakshi News home page

Rasha Thadani: రషా తడానీ బర్త్ డే.. మూవీ టీమ్ స్పెషల్ వీడియో

Mar 16 2026 4:36 PM | Updated on Mar 16 2026 4:47 PM

Bollywood actress Rasha Thadani birthday special video goes viral

ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం 'శ్రీనివాస మంగాపురం'. ఈ మూవీకి  అజయ్‌ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి రవీనా టాండన్‌ కూతురు రషా తడానీ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమాతో నటి రాషా థడాని టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది. ఇందులో మంగ అనే పాత్రలో అభిమానులను మెప్పించనుంది. ఇప్పటికే 'ఉయి అమ్మ' అనే సాంగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇవాళ బాలీవుడ్ బ్యూటీ రషా తడానీ బర్త్‌ డే కావడంతో మేకర్స్ ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. ఈ మూవీ సెట్‌లో రషా నటన, హవభావాలతో కూడిన వీడియోను పోస్ట్ చేశారు. అందరూ కలిసి రషాకు హ్యాపీ బర్త్ డే విష్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ లవ్ అండ్ యాక్షన్ డ్రామాలో మోహన్ బాబు ఇందులో ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్నిచందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు.
 

 

 

Advertisement
 
Advertisement
Advertisement