breaking news
bithday
-
మోదీ జీవితంతో మా వందే
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్ వెండితెరకు రానుంది. ‘మా వందే’ పేరుతో రూపొందనున్న ఈ సినిమాలో మోదీ పాత్రలో మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ నటించనున్నారు. క్రాంతికుమార్ సీహెచ్. రచన, దర్శకత్వంలో వీర్ రెడ్డి .ఎం నిర్మించనున్నారు. బుధవారం (సెప్టెంబరు 17) మోదీ పుట్టినరోజు సందర్భంగా ‘మా వందే’ప్రాజెక్ట్ని ప్రకటించారు. వీర్ రెడ్డి .ఎం మాట్లాడుతూ– ‘‘మోదీగారి వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని ఘటనలు, విశేషాలను ఎంతో సహజంగా మా సినిమాలో చూపించబోతున్నాం. సమాజం కోసం ఎన్నో ఆకాంక్షలు గల బాలుడి నుంచి దేశ ప్రధానిగా మోదీ ఎదిగిన క్రమాన్ని చూపిస్తాం. అంతర్జాతీయ ప్రమాణాలు, సాంకేతిక విలువలు, వీఎఫ్ఎక్స్తో ‘మా వందే’ని పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లిష్లోనూ నిర్మిస్తాం. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్ప బలం గొప్పదనే సందేశం ఈ కథలో కీలకం. మోదీ ప్రపంచనాయకుడిగా ఎదగడం వెనక ఆయన మాతృమూర్తి హీరాబెన్ ప్రేరణ ఎంతో ఉంది’’ అని చె΄్పారు. ఈ చిత్రానికి కెమెరా: కేకే సెంథిల్ కుమార్, సంగీతం: రవి బస్రూర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: గంగాధర్ .ఎన్ ఎస్, వాణిశ్రీ .బి, లైన్ ప్రొడ్యూసర్: టీవీఎన్ రాజేశ్. -
దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు
చిట్టినగర్: విజయవాడ కనకదుర్గమ్మను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం దర్శించుకున్నారు. చంద్రబాబు తన 67వ జన్మదినం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబుకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ఎంపీ అమ్మవారి సేవలో పాల్గొన్నారు.