సాక్షి, బెంగళూరు: దుర్మార్గురాలైన ఒక భార్య చేతిలో భర్త, ఒక చిన్నారి బలైపోయిన ఘటన సంచలనం రేపుతోంది. ప్రియుడితో కలిసి భర్తను, నాలుగేళ్ల కుమారుడి దారుణంగా హత్య చేసిన ఘటన కర్ణాటకలోని ఉత్తర బెంగళూరులోని చిక్కబానావర ప్రాంతంలో చోటుచేసుకుంది ఈ ఘటన. తండ్రీ కొడుకుల మరణంపై అభినందన్ మృతదేహంపై గాయాలుండటంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆరా తీయగా హత్య కుట్ర కోణం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం హరిణి అనే మహిళ ఈ ఘాతుకానికి పాల్పడింది. తన భర్త, కుమారుడు స్పందించడం లేదంటూ హరిణే స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించింది. అయితే ప్రేమికుడు వినయ్‌తో కలిసి భర్త అభినందన్‌ను హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.
తమ రహస్య బంధం తెలిసిందని హత్యకు ప్లాన్
2021లో వీరు వివాహం చేసుకున్నారు. విబేధాల దాదాపు రెండేళ్లుగా వారు వేర్వేరు గదుల్లో నిద్రిస్తున్నారు. అయితే 2024 డిసెంబరులో హరిణికి వినయ్ స్నాప్‌చాట్ (Snapchat) ద్వారా పరిచయయ్యాడు. ఆ పరిచయం కాలక్రమంలో సన్నిహితంగా మారింది. తన భార్య మరో వ్యక్తితో మాట్లాడుతోందన్న అనుమానం వచ్చింది అభినందన్‌కు. ఈ విషయంపై ఆ దంపతుల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. దీంతో హత్యలకు సుమారు 15 రోజుల ముందు, ఆమె కాల్ వివరాల రికార్డులను (CDR) కోరుతూ అతను పోలీసులను ఆశ్రయించాడు. అప్పుడే వినయ్ సహాయంతో అతన్ని చంపాలని హరిణి నిర్ణయించుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
సమయంకోసం ఎదురు చూస్తున్న తరుణంలో స్వల్ప విషయంలో దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో హరిణి గరిటెతో అభినందన్‌పై దాడి చేసింది. ఆ తర్వాత ఎవరి గదుల్లో వాళ్లు నిద్రపోయారు. ఇదే అదనుగా భావించిన ఆమె వినయ్‌ను ఇంటికి పిలిపించి, ఇద్దరూ కలసి అభినందన్‌పై దాడి చేసి ఊపిరి ఆడకుండా చేసి చంసేశాడు. ఈ దాడి సమయంలో నిద్రలేచిన వారి కుమారుడు యదువీర్‌ను కూడా దిండుతో ఊపిరి ఆడకుండా చేసి మట్టుబెట్టారు. హరిణిని అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ వివరాలు వెలుగు చూశాయి. అనుమానం రాకుండా ఉండేందుకు ఇంట్లోని రక్తం మరకలను శుభ్రం చేశారని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాకుండా, వినయ్ ఇంటికి వచ్చిన సమయంలో సీసీటీవీ కెమెరాలను ఆపివేసి ఉంటారని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇదీ చదవండి: ‘‘మా శవాలను తీసుకెళ్లండి’’ : భార్యాబిడ్డల్ని హతమార్చి, నావికుడు సూసైడ్
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు పరారీలో ఉన్న ప్రియుడు వినయ్ కోసం గాలిస్తున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం స్వగ్రామానికి తరలించారు. వినయ్ ఆచూకీ లభ్యమైన తరువాత అతని విచారించిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: 14 ఏళ్ల ఐటీ జాబ్ వదిలి వ్యాపారం : ఇపుడు కోట్లలో ఆదాయం
ఇదీ చదవండి: 14 మిలియన్ల ఫాలోవర్లు : కానీ యష్ ఫాలో అయ్యేది ఆమె ఒక్కర్నే!


