మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రామాయణం’లో రావణుడి పాత్రలో నటిస్తున్న కేజీఎఫ్ (KGF) స్టార్, యష్‌కి సంబంధించి ఒక ఆసక్తికర విషయం నెట్టింట సందడిగా మారింది. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ విడుదల తరువాత యష్‌పై క్రేజ్ మరింత పెరిగింది. సోషల్ మీడియాలో సౌత్ సూపర్ స్టార్ యష్‌కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే. ఇన్‌స్టాగ్రామ్‌లో 14 మిలియన్లకు (1.4 కోట్ల) పైగా ఫాలోవర్లు ఉన్నారు. అయితే యష్ కేవలం ఒక్కరిని మాత్రమే ఫాలో అవుతారని మీకు తెలుసా?
అవును ఈ కన్నడ హీరో తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలో అయ్యేది కేవలం ఒకే ఒక్కరిని. ఇటీవల ఒకటీవీ షోలో యష్ తన రాబోయే చిత్రాలతో పాటు వ్యక్తిగత జీవిత విశేషాలను కూడా పంచుకున్నారు. ఆ సమయంలో, ప్రేక్షకుల మధ్య కూర్చున్న ఒక అమ్మాయి యష్‌ను ఒక ప్రశ్న అడిగింది. “మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో 14 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు, కానీ మీరు కేవలం ఒక్క వ్యక్తిని మాత్రమే ఫాలో అవుతారు. ఎవరా వ్యక్తి, మీ జీవితంలో వారి విలువ ఏమిటి?” అన్న ప్రశ్నకు యశ్ ఇచ్చిన సమాధానం అతని లక్షలాది అభిమానుల హృదయాలను గెలుచుకుంది.
దీనికి సమాధానంగాయష్ నవ్వుతూ, “ఆమె నా భార్య” ఎంతో ప్రేమగా బదులిచ్చారు. ఇది విన్న స్టూడియో మొత్తం చప్పట్లతో మారుమోగింది. "ఆమె నా భార్య మాత్రమే కాదు, నా జీవితంలో ఉన్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్ కూడా. ఒకవేళ నేను తనని కూడా ఫాలో అవ్వకుండా జీరో పెడితే నాకు ఇబ్బందులు తప్పవు" అని సరదాగా వ్యాఖ్యానించారు. "నిజం చెప్పాలంటే, ఆమె నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి. మేమిద్దరం కలిసి ఎదిగాము. ఆమె నాకు భార్యగా దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆమె నా జీవితానికి బలమైన ఆధారం." అంటూ చెప్పారు.
ఇదీ చదవండి: 24 గంటల్లో 1.6 లక్షల ఫాలోవర్స్ : సీజేపీ తరహాలో డీజేపీ సంచలనం
రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముని పాత్రలో, సాయి పల్లవి సీతగా, రవి దూబే లక్ష్మణునిగా, యశ్ రావణునిగా కనిపించనున్నారు. ఇక సన్నీ డియోల్ హనుమంతుని పాత్రను పోషిస్తున్నారు. 'రామాయణం మొదటి భాగం' విదేశాలలో నవంబర్ 6, 2026న, భారతదేశంలో నవంబర్ 8, 2026న విడుదల కానుంది. 'రామాయణం: రెండవ భాగం' 2027 దీపావళికి థియేటర్లలోకి రానుంది. 'రామాయణం'తో పాటు, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో మూవీ 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్'. ఈ చిత్రంలో యష్ ద్విపాత్రాభినయం చేయనున్నారు. యష్‌తో పాటు, కియారా అద్వానీ, తారా సుతారియా, హుమా ఖురేషి, నయనతార మరియు రుక్మిణి వంటి కథానాయికలు కూడా ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ప్రేక్షకులు ఈ చిత్రం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. చివరకు, ఈ చిత్రం ఆగస్టు 26న థియేటర్లలో విడుదల కానుంది.
ఇదీ చదవండి: ఎగ్జామ్ స్కాంలపై మోదీ సర్కార్‌కు బాబా రామ్‌దేవ్ హెచ్చరిక
కాగా యష్ రాధికా పండిట్ 2007లో 'నంద గోకుల' అనే కన్నడ సీరియల్ సెట్స్‌లో మొదటిసారి కలుసుకున్నారు. ఈ పరిచయం ప్రేమగా మారి, 2016 డిసెంబరులో వివాహం చేసుకున్నారు. వీరికి ఐరా, యథర్వ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.


