డైరెక్టర్ తాగొచ్చి నన్ను కౌగిలించుకుంటావా? అని అడిగాడు: స్వర భాస్కర్ | Swara Bhasker Recalls Uncomfortable Encounter With Director | Sakshi
Sakshi News home page

Swara Bhasker: 'తాగొచ్చి నన్ను కౌగిలించుకుంటావా అన్నాడు'

Oct 2 2026 1:19 PM | Updated on Oct 2 2026 1:21 PM

Swara Bhasker Recalls Uncomfortable Encounter With Director

తను వెడ్స్ మను’, ‘రాంజనా’ వంటి సినిమాలతో బాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ స్వర భాస్కర్. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న ముద్దుగమ్మ 2023లో ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం రైజ్ అండ్ ఫాల్ సీజన్-2 రియాలిటీ షోలో సందడి చేశారు. ఆమె తొలి ఎపిసోడ్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 

తాజాగా తన కెరీర్‌లో ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె పంచుకున్నారు.  'తను వెడ్స్ మను' సినిమా విజయం తర్వాత దురదృష్టకర సంఘటన జరిగిందని చెప్పుకొచ్చారు. ఒక దర్శకుడు మా ఇద్దరిని కలిసి ఒక రొమాంటిక్ సన్నివేశానికి రిహార్సల్ చేయమని ఇబ్బందికి గురిచేశాడని తెలిపింది.  దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ అప్పటికే సగం బాటిల్ తాగేసి కనిపించారు. మద్యం తాగుతున్న వాళ్లముందు 20 ఏళ్ల యువతి రిహారస్ ఎలా చేయాలని భయమేసిందని వెల్లడించింది. ఎలాగోలా అక్కడి నుంచి పరుగెత్తుకుంటూ వచ్చేశానని స్వర భాస్కర్ తెలిపింది.

అయితే ఇది అక్కడితో ముగియలేదని స్వర భాస్కర్ తెలిపింది. ఆ డైరెక్టర్‌ రాత్రి మద్యం సేవించి తన గది వద్దకు వచ్చారని వెల్లడించింది. నన్ను కౌగిలించుకుంటావా? అని అడిగాడని చేదు అనుభవాన్ని పంచుకుంది. అప్పుడు నేను చేయలేను సార్.. దయచేసి ఇక్కడి నుంచి వెళ్లండి.. నాకు చాలా భయంగా ఉందని చెప్పానని తెలిపింది. ఆ సమయంలో తాను తీవ్ర అసౌకర్యానికి గురిచేశాడని స్వర భాస్కర్ తన బాధ వ్యక్తం చేసింది.

'తను వెడ్స్ మను' తర్వాత తాను ఒక పెద్ద ప్రాజెక్ట్ చేసే సమయంలో దర్శకుడి నుంచి తనకు సందేశాలు, కవిత్వం రావడం మొదలయ్యాయని స్వర భాస్కర్ పేర్కొంది. ఒక దర్శకుడు నటుడిని ప్రేమించాలని పదేపదే నొక్కి చెప్పేవారని ఆమె తెలిపింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement