సినీ ఇండస్ట్రీలో ప్రేమ, ఆప్యాయతలే కాదు గొడవలు, ఈగోలు కూడా ఉంటాయి. కొన్నిసార్లు బాహాబాహీ అని కొట్టుకుంటే మరికొన్నిసార్లు మాత్రం సోషల్ మీడియా వేదికగా బయటపెడుతుంటారు. 'కాంతార' హీరో రిషభ్ శెట్టి, నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ మధ్య ఇలానే కోల్డ్ వార్ నడుస్తున్నట్లు ఉంది. మూవీకి ఏడాది పూర్తయిన సందర్భంగా ఇదికాస్త బయటపడింది. ఇంతకీ ఏమైంది?
(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా.. ట్రైలర్ రిలీజ్)
2022లో కన్నడలో మాత్రమే రిలీజైన ఓ చిన్న సినిమా 'కాంతార'. తర్వాత వారాల్లో తెలుగు, హిందీలోనూ థియేటర్లలోకి వచ్చి అద్భుతం సృష్టించింది. రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అందరినీ ఔరా అనిపించింది. గతేడాది అక్టోబరులో దీని సీక్వెల్ 'కాంతార ఛాప్టర్ 1' వచ్చింది. ఇది కూడా వందల కోట్ల రూపాయలు వసూళ్లు సాధించి ఆశ్చర్యపరిచింది. అంతా బాగానే ఉంది. కాకపోతే సీక్వెల్ రిలీజైన కొన్నాళ్లకు రిషభ్ శెట్టి.. నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ని అన్ ఫాలో చేయడం చర్చనీయాంశమైంది.
ఈగో సమస్యలా లేదంటే సృజనాత్మక విభేదాలా అనేది తెలియదు గానీ హోంబలే నిర్మాణ సంస్థ, రిషభ్ శెట్టి మధ్య ఏదో గొడవ జరిగి అది ఇంకా సమసిపోలేదనిపిస్తుంది. ఎందుకంటే మూడు రోజుల క్రితం తొలి భాగానికి నాలుగేళ్లు పూర్తయిందని, అలానే నిన్న(అక్టోబర్ 02) సీక్వెల్‌కి ఏడాది పూర్తయిందని రిషభ్, హోంబల్ సంస్థ.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కానీ ఎక్కడా ఒకరి గురించి ఒకరు మెన్షన్ చేయలేదు. హోంబలే సంస్థ అయితే హీరోకి బదులు పులి ఫొటోతో ఉన్న పోస్టర్ రిలీజ్ చేసింది. ఇదంతా చూసిన అభిమానులు.. సమస్య ఇంకా ముగిసిపోలేదా అనేది మాట్లాడుకుంటున్నారు. ఇది ఇలానే కొనసాగితే 'కాంతార' ప్రపంచం నుంచి మూడో భాగం రావడం కష్టమే!
(ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్ బుగ్గ గిల్లిన అభిమాని.. వీడియో వైరల్)
Kantara Chapter 1 — One Year.
The biggest challenge was to bring this prequel to an audience that had already showered Kantara with immense love. To give a prelude , go deeper into its roots, and tell a story that carries the soul of the land was both a responsibility and a… pic.twitter.com/cAQ7txWHqm— Rishab Shetty (@shetty_rishab) October 2, 2026
Kantara – A Legend.
Four years since Kantara came to life on the big screen. The rest is history. Awards and appreciation started pouring in from everywhere, but the love you all showered on the film remains unmatched.
It was never just a film I made. It was a world I lived in,… pic.twitter.com/KtYcKBVoum— Rishab Shetty (@shetty_rishab) September 30, 2026
ಒಂದು ವರ್ಷ ಕಳೆದರೂ, ಆ ಅನುಭವ ಇನ್ನೂ ಹಸಿರಾಗಿದೆ. ❤️
ನಮ್ಮ ಮಣ್ಣಿನ ಕಥೆಯನ್ನು ನಿಮ್ಮ ಹೃದಯದ ಕಥೆಯನ್ನಾಗಿಸಿದ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಧನ್ಯವಾದಗಳು.
1 YEAR of Divine Blockbuster #KantaraChapter1 ❤️🔥
A divine journey celebrating our roots, culture and traditions, made truly special by audiences across the… pic.twitter.com/H4UtMzl8xf— Hombale Films (@hombalefilms) October 2, 2026


