రూ.400 కోట్ల సినిమా.. ఎట్టకేలకు తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్ | Hanuman Ansh Telugu release date announced by Hombale Films | Sakshi
Sakshi News home page

Hanuman Ansh Telugu Release: రూ.400 కోట్ల హనుమాన్ అంశ్.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?

Oct 2 2026 12:33 PM | Updated on Oct 2 2026 12:44 PM

Hanuman Ansh Telugu release date announced by Hombale Films

చిన్న సినిమాగా వచ్చిన బాక్సాఫీస్ షేక్ చేసిన మూవీ హనుమాన్ అంశ్. బాలీవుడ్‌లో మాత్రమే తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. కేవలం రూ.2 కోట్లతో ఈ మూవీని నిర్మించగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. నీమ్ కరోలి బాబా జీవితం ఆధారంగా విశాల్‌ చతుర్వేది దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

హిందీలో హిట్‌ కావడంతో తెలుగులోనూ రిలీజ్ చేయాలని భావించారు. దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమా తెలుగు రైట్స్‌ సొంతం చేసుకున్నారని టాక్ వినిపించింది. కానీ ఆ తర్వాత రిలీజ్‌ తేదీని మాత్రం ప్రకటించలేదు. దీంతో తెలుగు రిలీజ్‌ వాయిదా పడింది.

తాజాగా ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేయనున్నట్లు హోంబలే ఫిల్మ్స్‌ ప్రకటించింది. రిలీజ్ డేట్‌ను ఖరారు చేస్తూ పోస్టర్‌ రిలీజ్ చేసింది. ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 9న విడుదల చేయనున్నట్లు హోంబలే ఫిల్మ్స్‌ అనౌన్స్ చేసింది. అదే రోజు వెంకటేశ్ నటించిన ఆదర్శ కుటుంబం కూడా విడుదల కానుంది. కాగా.. 1900-1973 మధ్య జీవించిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, హనుమాన్‌ భక్తుడు నీమ్‌ కరోలి బాబా(మహరాజ్‌జీ) జీవితమే ఈ హనుమాన్ అంశ్.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement