తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వారసుడు జేసన్ సంజయ్ తొలిసారి దర్శకుడిగా మారి తీసిన సినిమా 'సిగ్మా'. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించారు. టాలీవుడ్‌కి చెందిన సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా హీరోహీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతమందించాడు. ఈరోజే(అక్టోబరు 02) థియేటర్లలోకి వచ్చింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బుధవారం చైన్నెలో మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో టీమ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.. తమిళంలో నేను చేసిన తొలి చిత్రమిది. నాకు చాలా ముఖ్యమైన చిత్రం అని చెప్పింది. సందీప్ కిషన్ మాట్లాడుతూ.. జేసన్ సంజయ్ దర్శకత్వం వహించిన తొలి సినిమాలో నేను హీరోగా నటించడం సంతోషంగా ఉంది. కమర్షియల్ అంశాలతో సిగ్మా ఉంటుంది. సంజయ్ నాకు మంచి ఫ్రెండ్. విదేశాల్లో చదువుకున్నా, 24 ఏళ్ల వయసులో మంచి తమిళ చిత్రాన్ని ఎలాంటి టెన్షన్ లేకుండా తెరకెక్కించాడు. జేసన్ దర్శకుడు అయ్యాడు కానీ ఆయనలో మంచి నటుడు ఉన్నాడు. కచ్చితంగా పెద్ద హీరో అవుతాడు. ఈ చిత్రాన్ని ముఖ్యమంత్రి విజయ్ చూస్తారా అని అడుగుతున్నారు. ఆయన్ని చూడొద్దని ఎవరైనా చెప్పగలరా, చూస్తే చాలా సంతోషం అని చెప్పుకొచ్చాడు.


