మోనాలిసా భోస్లేకు భారీ ఊరట : తండ్రికి మొట్టికాయలు | Court Relief For Viral Kumbh Girl In Date Of Birth Row | Sakshi
Sakshi News home page

మోనాలిసా భోస్లేకు భారీ ఊరట : తండ్రికి మొట్టికాయలు

Oct 1 2026 2:45 PM | Updated on Oct 1 2026 2:56 PM

Court Relief For Viral Kumbh Girl In Date Of Birth Row

మహా కుంభమేళాలో రుద్రాక్షలు అమ్ముతూ వైరల్‌ అయిన మోనాలిసా భోస్లే (Monalisa Bhosle)కు భారీ ఊరట లభించింది. ఆమె బర్త్ సర్టిఫికెట్, ఇతర ధ్రూవీకరణ పత్రాలుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ  తండ్రి దాఖలుచేసిన  పిటిషన్‌పై జారీ చేసిన ఉత్తర్వులను మధ్యప్రదేశ్ హైకోర్టు పక్కన పెట్టింది. ఆగమేఘాల మీద ఆమె జనన ధృవీకరణ  పత్రం కోసం అంత కష్టపడాల్సిన అవసరం లేదని తండ్రికి హితవు  చెప్పింది.  

మోనాలిసా భోస్లేకు ఎలాంటి సరైన విచారణ లేదా వాదన వినిపించే అవకాశం ఇవ్వకుండా ఆమె పుట్టిన తేదీని మార్చడం చట్ట విరుద్ధమని హైకోర్టు పేర్కొంటూ మహేశ్వర్ చీఫ్ మున్సిపల్ ఆఫీసర్ మార్చి 31న జారీ చేసిన ఉత్తర్వులను ఇండోర్ బెంచ్ బుధవారం రద్దు చేసింది. మధ్యప్రదేశ్ హైకోర్టుకు చెందిన ఇండోర్ బెంచ్ కొట్టేసింది. ఆమె వినకుండా ఇటువంటి తీవ్రమైన పరిణామాలతో అధికారులు నిర్ణయం తీసుకోలేరని తీర్పు చెప్పింది. కేవలం  తండ్రి మాటల ఆధారంగా ఇచ్చారని, ఈ కొత్త ఉత్తర్వులు కూతురి వాదన వినలేదని కోర్టు తప్పుబట్టింది. కుటుంబసభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా నటుడు ఫర్మాన్ ఖాన్‌ను వివాహం చేసుకున్న తర్వాతే ఆమె తండ్రి ఈ మార్పు కోసం అన్ని ప్రయత్నాలు చేశారని జస్టిస్ గజేంద్ర సింగ్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అసలు వివాదం ఏమిటి? 
ఆమె వివాహం సమయం నాటికి బర్త్ సర్టిఫికెట్ , ఇతర ధ్రూవీకరణ పత్రాలతో (జనవరి 1, 2008)  ప్రకారం మేజర్‌ కానీ. తండ్రి దరఖాస్తు మేరకు మున్సిపల్ అధికారులు దీనిని డిసెంబర్ 30, 2009కి మార్చారు. అలా జరిగితే ఆమె వివాహం నాటికి మైనర్ (16 ఏళ్లు) అవుతుంది.  అయితే ఏ పుట్టిన తేదీ సరైనదో కోర్టు ప్రస్తుతం తేల్చలేదు. ఆమెకు తగిన విచారణ అవకాశం కల్పించి, దరఖాస్తును పునఃపరిశీలించాలని అధికారులను ఆదేశించింది. అలాగే ఈ తీర్పు వివాహాన్ని చట్టబద్ధం చేయదని లేదా ఆమె భర్తపై ఉన్న క్రిమినల్ కేసులను కొట్టేయదని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: హెలికాప్టర్‌ క్రాష్‌ : ప్రముఖ వ్యాపారవేత్త, భార్య దుర్మరణం

కాగా  ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన 2025 మహా కుంభమేళాలో  పూసలు, దండలు అమ్ముతూ ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన మోనాలిసా భోస్లే   ఈ ఏడాది  మార్చి 11 తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను కేరళలోని తిరువనంతపురంలో మతాంతర వివాహం చేసుకుంది. దీంతో  ఈ వివాదం తెరపైకి వచ్చింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఆమె భర్తపై పోక్సో (POCSO) కేసు కూడా నమోదైంది.

ఇదీ చదవండి: మీరట్ బ్లూ డ్రమ్ కేసు : కోర్టు సంచలన తీర్పు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement