తొమ్మిదేళ్ల వయసులో వచ్చిన సాధారణ జలుబు ఆమె జీవితాన్నే తలకిందులు చేసింది. సూచించిన పెన్సిలిన్ మందు ఇచ్చిన రియాక్షన్ జీవితాన్నే అంధకారం చేసింది. అయినప్పటికీ అంతకు మించి ఏదో చేయాలి, తన కంటూ గుర్తింపు కావాలని ఆరాటపడింది. అలా అత్యంత కఠినతరమైన సీఏ కోర్సుని ఎంచుకుని సక్సెస్ అందుకుంది. ఇంత ఘనత సాధించినా.. ఉద్యోగాలిచ్చేందుకు ఒక్క కంపెనీ ముందుకు రాలేదు. కానీ ఆమె అజేయమైన ఆత్మవిశ్వాసం స్నేహితురాలి రూపంలో సాయం వెతుక్కుంటూ వచ్చి ఉద్యోగం ఇచ్చింది. ఇక అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూసుకోనంత సక్సెస్ అందుకోవడమే కాదు ఇప్పుడు ఆ రంగంలో ఆమెనే బాస్ కావడం విశేషం.
ఆ ధీర వనితే రజనీ గోపాలకృష్ణ తొమ్మిదేళ్ల వయసులో వచ్చిన సాధారణ జలుబు చూస్తుండగానే తన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని అనుకోలేదేమె. ఆ తర్వాత ఆ చిన్నారికి సూచించిన పెన్సిలిన్ మందు తీవ్రమైన అలెర్జీలకు దారితీసి..నెమ్మదిగా కంటిచూపునే దూరం చేసింది. దాంతో ఆమె ప్రాథమిక గ్రాడ్యుయేషన్‌కి మించి చేయాలని స్ట్రాంగ్ నిర్ణయించుకుంది. కేవలం బీకామ్ పూర్తి చేస్తే ఆశించిన ఉద్యోగం లభించిందని నిర్ణయించుకునే ఇలా డిసైడ్ అయ్యింది.
అర్థవంతమైన ఉపాధిని పొందేలా అవకాశాలను మెరుగుపరుచుకునేలా ఏదైనా చేయాలని భావించే అత్యంత కఠినతరమైన సీఏని ఎంచుకుంది. తన కంటి చూపు తగ్గిపోతున్న తరుణంలోనే తను సీఏ ప్రస్థానం మొదలైందని అంటోందామె. తన ఇంటర్ ప్రిపరేషన్ సమయంలో రెండో కన్ను కూడా పనిచేయడం మానేసిది. దాంతో ఏడేళ్లు గ్యాప్ తీసుకుని మళ్లీ 2002లో తిరగి వచ్చింది. ఈసారి సాంకేతిక సహాయకులు (స్క్రైబ్స్) మార్పుతో వచ్చింది.
అప్పట్లో స్టడీ మెటీరియల్స్ సాఫ్ట్ కాపీలు అందుబాటులో లేవు, కాబట్టి ఆమె పుస్తకాలను స్కాన్ చేసి వాటిని మార్చుకున్నారు. అలా 2003 కల్లా సీఏ పూర్తి చేసిన భారత తోలి అంధ మహిళగా చరిత్ర సృష్టించిది. ఇంత సాధించిన ఉద్యోగాలిచ్చేందుకు ఎవరు ముందుకు రాలేదు. చేతిలో సీఏ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ..అవకాశాలన్ని మూసుకుపోతున్నట్లు అనిపించింది. అయితే ఒక స్నేహితురాలు ఆమె రెజ్యూమ్‌ని పంపడంతో చివరకు ఆమెకు ఉద్యోగం లభించింది. ఆమె బెంగళూరులో కమ్యూనిటీ కోఆర్డినేటర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది.
ఒక పక్క ఉద్యోగం చేస్తూనే సామాజికి సేవలు కూడా అందించింది. ముఖ్యంగా తనలా దృష్టిలోపంతో బాధపడుతున్న విద్యార్థులకు మద్దతునిచ్చింది. ఆ తర్వాత కార్పొరేట్ అకౌంటింగ్ పని కోసం ఇన్ఫోసిక్ మారినప్పుడూ మరింత ఉన్నతమైన దాని వైపుకి ఆకర్షితురాలై ఎన్జీవో రంగానికి మారింది. అలా సీనియర్ ఫైనాన్స్ మేనజర్ అయ్యారు. ఆ పదవి, అందులోని నైపుణ్యం ఆమెను సామాజిక మార్పు తీసుకోరావాలనే ఆమె ఆశయానికి సరిగ్గా సరిపోయింది.
ప్రస్తుతం ఆమె ఆదాయపు పన్ను చట్టం, ఎఫ్‌సీఆర్‌ఏ కార్మిక చట్టాలకు సంబంధించిన రూల్స్‌ని దాతలకు నివేదించేలా రూపకల్పన చేయడం, గ్రాంట్ సైకిల్ నిర్వహణ, ఆర్థిక సామర్థ్యం పెంపు వంటి అంశాలను కలిగి ఉంటుంది. ఆమె చాణక్య విశ్వవిద్యాలయంలోని ఫైనాన్స్ కమిటీలో గౌరవ సభ్యురాలిగా పనిచేస్తోంది. అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌తో కలిసి భారతదేశవ్యాప్తంగా పౌర సమాజ సంస్థలకు శిక్షణ ఇస్తోంది.
వరించిన పురస్కారాలు..
ఆమె పట్టుదలకు గుర్తింపుగా 2014లో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. 2018లో మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ ఆమెకు ఫస్ట్ లేడిస్ అవార్డుని ప్రదానం చేసింది. వీటి తోపాటు అనేక రాష్ట్రాస్థాయి గౌరవాలను పొందారు. అంతేగాదు డాక్టర్ రంగస్వామి అకాడమీ ఫర్ ఫిస్కల్ రీసెర్చ్ అడ్ ది సోసైటీ ఆఫ్ ఆడిటర్స్ ప్రచురించిన 'నైటింగేల్స్ 2.0: హౌ ఎలెవెన్ ఉమెన్ షోడ్ గ్రిట్, గట్స్ & గంప్షన్' అనే పుస్తకంలో ఆమె గురించి ప్రస్తావించడం విశేషం.
చివరగా ఆమె అందరిలోనూ వైకల్యాన్ని చూసే తీరు మారాలని నొక్కి చెబుతోంది దివ్యాంగులు కొన్ని చేయలేకపోవచ్చు. కానీ వాళ్లు అసాధారణ పద్ధతిలో తమ ప్రతిభను చాటుకోగలరని గుర్తించండి చాలు. ఎల్లప్పుడూ జాలి చూపిస్తూ..దయతో బతికేలా చేయొద్దు..సాధారణ వ్యక్తుల్లా చూడకపోయినా..కనీసం మాకు సామర్థ్యం ఉందని గుర్తించండి చాలు అని అంటోంది రజనీ గోపాలకృష్ణ.
ఇదీ చదవండి: వేద విద్య నేర్చుకుంటూనే.. ఇస్రో శాస్త్రవేత్త రేంజ్‌కి!)


