సెప్టెంబర్ 30న ఫ్లైదుబాయ్ FZ1073 విమానంలో జరిగిన ఘటన నేపథ్యంలో సదరు విమాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌కు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే విమాన సర్వీసులను ఫ్లై దుబాయ్ తాత్కాలికంగా నిలిపివేసింది. అధికారుల దర్యాప్తు పూర్తయ్యే వరకు ఇజ్రాయెల్‌కు విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ఫ్లైదుబాయ్ ప్రకటించింది.
ప్రయాణికులు, సిబ్బంది, విమాన కార్యకలాపాల భద్రత, సంక్షేమమే తమకు అత్యంత ప్రాధాన్యమని సంస్థ స్పష్టం చేసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు వెలుగులోకి తీసుకురావడానికి వీలుగా ఈ తాత్కాలిక సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని పేర్కొంది.
అసలేం జరిగింది?
భారత కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం దుబాయ్-టెల్‌అవీవ్ మధ్య ప్రయాణిస్తున్న విమానంలో పైలట్, కో-పైలట్ మధ్య కాక్‌పిట్‌లో ఘర్షణతో ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో కో-పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. అనంతరం విమానం ఒక్కసారిగా ఎత్తు కోల్పోయింది. ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం కేవలం 30 సెకన్లలో దాదాపు 14 వేల అడుగుల మేర కిందికి పడిపోయింది. విమానంలోని ప్రయాణికులకు పరిస్థితి అర్థమయ్యేలోపే కాక్‌పిట్ నుంచి అరుపులు వినిపించాయి. ఇదే సమయంలో గాయపడిన కెప్టెన్ మచ్చర్ కాక్‌పిట్ తలుపు తెరిచారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వెళ్లే అవకాశం ఏర్పడింది.
🚨 BREAKING: A pilot aboard Flydubai flight FZ1073 from Dubai to Tel Aviv attacked the other pilot and attempted to seize control of the aircraft in terror attack.
The plane, carrying 174 Israeli passengers, plunged 14,000 feet before the situation was brought under control and… pic.twitter.com/FAgyt7dOpK— Combat Antisemitism Movement (@CombatASemitism) September 30, 2026
‘‘విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించాడు’’
ఈ దాడికి సంబంధించి సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. కో-పైలట్ విమానం వ్యవస్థలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రయాణికుడు యానివ్ తెలిపిన వివరాల ప్రకారం.. మచ్చర్ కాక్‌పిట్ తలుపు తెరిచి కుప్పకూలిన తర్వాత ప్రయాణికులు లోపలికి వెళ్లి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విమానంలో ఉన్న మరో సెట్ పైలట్లు కాక్‌పిట్‌లోకి చేరుకుని విమానాన్ని కంట్రోల్ చేయగలిగారు. అటు నుంచి సౌదీ అరేబియాలోని టబుక్‌కు మళ్లించారు. అక్కడ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.
ఆసుపత్రిలో చికిత్స.. పరిస్థితి నిలకడగా
కాక్‌పిట్ ఘటనలో తీవ్రంగా గాయపడిన మచ్చర్‌ను సౌదీ అరేబియాలోని టబుక్ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు చికిత్స కొనసాగుతోంది. భారత రాయబార కార్యాలయం, జెడ్డాలోని కాన్సులేట్ ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులతోనూ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.
ఇదీ చదవండి: ‘భారత్ గర్విస్తోంది’.. స్మిట్ మచ్చార్ ధైర్యానికి మోదీ ఫిదా!


