సాక్షి, ముంబై: పూణేకు చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసుకు సంబంధించి సరికొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. కాబోయే భార్య సియా గోయల్‌తో మూడు ముళ్ల వేడుక కోసం ఎదురుచూస్తున్న కేతన్ ఈ ఏడాది జూన్ 18న పూణే సమీపంలోని లోహగఢ్ కోట వద్ద ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. ఈ కేసులో పోలీసులు ఫియాన్సీ సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్‌ను ప్రధాన నిందితులుగాకేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో దాదాపు 5300 పేజీల చార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. ఇందులో కొన్ని ముఖ్యమైన అంశాలను పొందుపరిచ్చారు.
తమ ప్రేమకు నిదర్శనంగా సియా పేరుతో పర్మినెంట్ టాటూ వేయించుకున్నాడట. సియా గోయల్ పుట్టినరోజు (జూన్ 19) సందర్భంగా ఆమెను సర్‌ప్రైజ్ చేయడానికి కేతన్ తన మెడపై సియా పేరును పర్మినెంట్ టాటూగా వేయించుకున్నాడు. అంతేకాదు అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలని కేతన్ కుటుంబం టుంబ సభ్యులు ఆమె కోసం ముందే 28 రకాల డ్రెస్సులు, 15 జతల బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేసింది. కానీ ఇంతలోనే విషాదం చోటు చేసుకుంది.
ఛార్జ్‌షీట్ వెల్లడించిన సంచలన విషయాలు
కుటుంబ సభ్యులూ అంతా సవ్యంగానే ఉందని భావించినా, తెరవెనుక మాత్రం వేరే పథకం నడిచినట్లు పోలీసులు తెలిపారు. వడ్గావ్ మావల్ సెషన్స్ కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ ప్రకారం, సియాకు కేతన్‌ను వివాహం చేసుకోవడం ఇష్టం లేదని, ఆమె చేతన్ చౌదరితో సంబంధం కలిగి ఉందని తేలింది. అంతేకాదు కేతన్‌ను బెంగళూరుకు తీసుకెళ్లి కాళ్లు విరగొట్టాలని పథకం వేసినా, స్నేహితుడు వ్యతిరేకించడంతో ఆ ప్లాన్ మార్చుకున్నారు. చివరికి లోహగఢ్ కోటకు తీసుకెళ్లి హత్య చేసే ప్లాన్ అమలు చేశారు. తమ ప్లాన్‌ను అమలుకోసం, నేరాన్ని తప్పించుకునేందుకు, నిందితులు క్రైమ్ సినిమాలు, పాడ్‌కాస్ట్‌లు వినడంతో పాటు ChatGPTని కూడా ఉపయోగించినట్లు పోలీసులు ఆరోపించారు. ఒక మహిళ ఫొటోతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కూడా సృష్టించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు.
ఇదీ చదవండి: సియా మాజీ లవర్ వెలుగులోకి : ఫ్రెండ్ చెప్పిన షాకింగ్ విషయాలు
కాగా ఇరు కుటుంబాల అంగీకారంతో కేతన్ అగర్వాల్, సియాల నిశ్చితార్థం ఫిబ్రవరిలో జరుగగా, నవంబర్‌లో జైపూర్‌లో వివాహం జరగాల్సి ఉంది. కుటుంబంలోని ఏకైక కుమారుడి పెళ్లికోసం కేతన్ కుటుంబం భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేసుకుంది. కానీ కేతన్ దారుణ హత్య వారి కలల్ని ఛిద్రం చేసింది.
ఇదీ చదవండి: అక్రమ ఆస్తుల పుట్ట : కోట్ల ఆస్తి, నగలు, నగదు, 48 లగ్జరీ వాచెస్


