కీలక నిర్ణయాలకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం | union cabinet key decisions sep 30 | Sakshi
Sakshi News home page

కీలక నిర్ణయాలకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం

Sep 30 2026 3:57 PM | Updated on Sep 30 2026 4:07 PM

union cabinet key decisions sep 30

ఢిల్లీ: కేంద్ర క్యాబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఢిల్లీలో స్మార్ట్ ట్రాఫిక్‌కు కేంద్ర క్యాబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఢిల్లీలో ట్రాఫిక్ నిర్వహణను మరింత సమర్థవంతంగా మార్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రూ.1,789.52 కోట్ల అంచనా వ్యయంతో ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ (ITMS) అమలుకు ఆమోదం తెలిపింది. 

ఢిల్లీలోని 42 ప్రధాన ట్రాఫిక్ కారిడార్లను మూడు దశల్లో 24 నెలల్లో ఈ వ్యవస్థ పరిధిలోకి తీసుకురానున్నారు. ఏఐ ఆధారిత అడాప్టివ్ ట్రాఫిక్ సిగ్నల్స్, రియల్‌టైమ్ ట్రాఫిక్ సమాచారం, ఆటోమేటెడ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అందుబాటులోకి తెస్తారు. అంబులెన్సులు, అత్యవసర వాహనాలకు గ్రీన్ కారిడార్ సౌకర్యం కల్పించనున్నారు. ట్రాఫిక్ జామ్‌లు, ప్రమాదాలను రియల్‌టైమ్‌లో గుర్తించి వేగంగా స్పందించేలా వ్యవస్థను రూపొందించనున్నారు. రాంగ్ రూట్, స్పీడింగ్, రెడ్‌లైట్ జంపింగ్, హెల్మెట్, సీట్‌బెల్ట్ ఉల్లంఘనలను టెక్నాలజీతో గుర్తించనున్నారు.

కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు

  • రబీ సీజన్ కు పంటల మద్దతు ధర పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం
  • 2027-28 మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి ఆరు రబీ పంటల కనీస మద్దతు ధరలను (MSP) పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది
  • కుసుమకు అత్యధికంగా క్వింటాల్‌కు రూ.675, ఆవాలు-రాప్‌సీడ్‌కు రూ.413 చొప్పున పెంచింది
  • మసూర్‌ పప్పుకు రూ.390, బార్లీకి రూ.136, శనగకు రూ.83, గోధుమకు రూ.25 పెంపు లభించింది
  • పెరిగిన ధరలతో గోధుమ MSP రూ.2,610, శనగ రూ.5,958, మసూర్ రూ.7,390, ఆవాలు రూ.6,613, కుసుమ రూ.7,215, బార్లీ రూ.2,286కు చేరింది
  • రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యమని కేంద్రం వెల్లడి
  • గ్రీన్ ఎనర్జీ కారిడార్‌-3కు కేంద్ర కేబినెట్ ఆమోదం
  • రూ.1,86,405 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ పథకం ద్వారా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 135 గిగావాట్ల వరకు పునరుత్పాదక విద్యుత్‌ను గ్రిడ్‌లోకి అనుసంధానం
  • 50 గిగావాట్ అవర్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్‌ ఏర్పాటు  
  • 2032-33 ఆర్థిక సంవత్సరం నాటికి పథకాన్ని పూర్తి చేయాలని లక్ష్యం
  • కేంద్ర ఆర్థిక సాయం రూ.54,082 కోట్లు
  • విద్యుత్ ప్రసార ఖర్చులను తగ్గించడంతో పాటు పునరుత్పాదక ఇంధన వినియోగం పెంచేందుకు ఈ పథకం దోహదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement