ప్రముఖ సినీ నటుడు ప్రియదర్శి ఈరోజు ఉదయం మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ప్రియదర్శి ఆయన సినీ ప్రయాణం, భవిష్యత్ ప్రాజెక్టులపై కొద్దిసేపు ఆత్మీయంగా మాట్లాడారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్రలో ప్రియదర్శి జీవించారని ఆయన కొనియాడారు.
కేసీఆర్ హావభావాలు, నడక, మాట తీరును పట్టుకోవడం చాలా కష్టమని.. కానీ, ఆ పాత్రలో ప్రియదర్శి పరకాయ ప్రవేశం చేసి అత్యంత సహజంగా నటించారని ప్రశంసించారు.
ఆ పాత్ర ద్వారా ప్రియదర్శి ప్రజలకు చాలా బలంగా కనెక్ట్ అయ్యారని అభినందించారు. ప్యారడైజ్ సినిమా బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.


