పూణేతో సహా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో, పూణే రూరల్ పోలీసులు ఇటీవల కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. జూన్ 18న లోహ్‌గడ్ కోట వద్ద ఫియాన్సీ చేతిలోదారుణ హత్యకు కేతన్ అగర్వాల్ కేసులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఛార్జ్‌షీట్‌లోభాగంగా నమోదు చేసిన కేతన్ తండ్రి అనుబంధ వాంగ్మూలం ప్రకారం కేతన్ అగర్వాల్ మృతి చెందడానికి నెలల ముందే అగర్వాల్ కుటుంబం కేతన్, సియా గోయల్ వివాహం కోసం ఘనంగా ఏర్పాట్లు చేసుకున్నారు. తమ ఫ్యామిలీలో ఏకైక కొడుకు కావడంతో పెళ్లి చాలా ధూం ధాంగా చేయాలని ప్లాన్ చేశారు. బట్టలు, ఆభరణాల కోసం లక్షలు ఖర్చుచేశారు. రాజస్థాన్‌లోని ఒక లగ్జరీ రిసార్ట్‌ను కూడా బుక్ చేశారు. కానీ సియా ప్లాన్ మాత్రం మరోలా ఉంది. ఎంగేజ్‌మెంట్ తరువాత ప్రియుడితో కలిసి ఆమెను ఎలా హతమార్చాలా అని ఆలోచించింది. చివరికి తన ప్లాన్‌ను పక్కాగా అమలు చేసింది.
దర్యాప్తు అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో విశాల్ అగర్వాల్ మాట్లాడుతూ.. కేతన్, సియాల వివాహ సంబంధాన్ని గోయల్ కుటుంబం గురించి తెలిసిన ఒక బంధువు సూచించినట్లు తెలిపారు. ఫిబ్రవరి 11, 2026న పూణేలోని 'ది వెస్టిన్' (The Westin) హోటల్‌లో రెండు కుటుంబాలు మొదటిసారి కలుసు కున్నాయి, అక్కడే కేతన్, సియాల రోకా వేడుక కూడా జరిగింది. దీంతో కేతన్ చాలా హ్యాపీ ఫీలయ్యాడని తెలిపారు. ఈ సందర్భంగా సియాకు దాదాపు రూ. 7-8 లక్షల విలువైన 28 డ్రెస్సెస్‌ను బహుమతిగా ఇచ్చినట్లు ఆయన వాంగ్మూలంలో పేర్కొన్నారు.
ఫిబ్రవరి 19న పూణేలోని 'రిట్జ్-కార్టన్' (Ritz-Carlton) లో కేతన్, సియాల నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థ సమయంలో అగర్వాల్ కుటుంబం సియాకు దాదాపు రూ. 80 లక్షల విలువైన ఆభరణాలను బహుమతిగా ఇచ్చింది. ఎంగేజ్‌మెంట్ కూడా పూర్తి కావడంతో వెడ్డింగ్ ఏర్పాట్లలో మునిగిపోయామని చెప్పారు.
రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఒక రిసార్ట్‌ను షార్ట్‌లిస్ట్ చేశామని, వివాహ వ్యయం అంచనా సుమారు రూ. 4-5 కోట్లు ఉంటుందని చెప్పారు. రిసార్ట్ యజమానికి చెక్ రూపంలో రూ. 25 లక్షల అడ్వాన్స్ అమౌంట్ కూడా చెల్లించినట్లు ఆరోపించారు. కానీ తన బిడ్డతో హత్యతో తమ కలలన్నీ కల్లలైపోయాయనీ, తీరని విషాదంలో మునిగిపోయామని కన్నీటి పర్యంతమయ్యారు.
ఇదీ చదవండి: విషాదం : భార్య టార్చర్, అత్తమామలు అల్లుణ్ని కాల్చి చంపేశారు
కాగా 26 ఏళ్ల కేతన్‌ను అతని కాబోయే భార్య సియా, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి, చేతన్ సహచరుడు రితేష్ హాంగే కలిసి నెలల తరబడి పథకం పన్ని ఉద్దేశపూర్వకంగా హత్య చేశారని పూణే రూరల్ పోలీసులు ఆరోపించారు. వడ్గావ్ మావల్ కోర్టులో దాఖలు చేసిన 5,053 పేజీల ఛార్జ్‌షీట్‌లో సాక్షుల వాంగ్మూలాలు, ఫోటోలు, వాట్సాప్ చాట్‌లు, కాల్ రికార్డులు, మొబైల్ ఫోన్ డేటా , టెక్నికల్ అనాలిసిస్ ఉన్నాయి.
ఇదీ చదవండి: ఫేక్ ఎక్స్‌పీరియన్స్‌తో బురిడీ, నెలకు రూ. 2.80 లక్షలు..కట్ చేస్తే
సియా స్నేహితురాలిగా చెప్పుకునే "మహి" (Mahi) అనే నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఉపయోగించి కేతన్‌ను లోహ్‌గడ్ కోటకు రప్పించారని దర్యాప్తు అధికారులు ఆరోపిస్తున్నారు. సియా పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సర్ప్రైజ్ ఇచ్చేందుకు కోటకి వెళ్లేలా ఆ ఖాతా కేతన్‌ను ఒప్పించిందని పోలీసులు ఆరోపించారు. చివరకు సియా, చేతన్‌లు కలిసి కేతన్‌ను లోయ వైపు నెట్టివేసి చివరి దాడికి పాల్పడ్డారని దర్యాప్తుదారులు ఆరోపిస్తున్నారు.ఈ హత్యకు ముందు జరిగిన ప్రయత్నాలు, లొకేషన్ల రెక్కీ, డిజిటల్ సెర్చ్‌ల గురించి కూడా ఛార్జ్‌షీట్‌లో వివరంగా పొందుపరిచారు. ఇవి ముందస్తు ప్రణాళికను సూచిస్తున్నాయని పోలీసులు తెలిపారు. విచారణ సమయంలో ఈ ఆరోపణలు రుజువు కావాల్సి ఉంది.
ఈ కాలంలోనే ఆ కుటుంబానికి మరో తీవ్ర విషాదం కూడా ఎదురైంది. కేతన్ మరణంతో సతమతమవుతున్న సమయంలోనే తన తండ్రి దేవిచంద్ అగర్వాల్ కూడా మరణించారని, దీనివల్ల కేతన్, అతని తాత ఇద్దరి మరణాలను స్వల్ప వ్యవధిలో భరించాల్సి వచ్చిందని విశాల్ తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రూ. 336 కోట్ల స్కామ్ : భారతీయుడికి 11 ఏళ్ల శిక్ష


