రూ. 336 కోట్ల స్కామ్‌ : భారతీయుడికి 11 ఏళ్ల శిక్ష | Indian gets jail in US for fraud check how American dream of Delhi man collapsed | Sakshi
Sakshi News home page

రూ. 336 కోట్ల స్కామ్‌ : భారతీయుడికి 11 ఏళ్ల శిక్ష

Sep 28 2026 4:56 PM | Updated on Sep 28 2026 6:41 PM

Indian gets jail in US for fraud check how American dream of Delhi man collapsed

అమెరికాలో అడుగుపెట్టి అసాధారణ విజయాలు సాధించాలనుకున్న ఓ భారతీయుడి డాలర్‌ డ్రీమ్స్‌ కటకటాల  వెనక్కి పీడ కలగా  మిగిలిపోతోంది.  అమెరికాలో 35 మిలియన్ డాలర్ల పాన్జీ స్కామ్ చేసిన భారతీయుడికి భారీ షాక్‌ తగిలింది.  ఇన్వెస్టర్ల నుంచి సుమారు రూ. 336 కోట్లుకి పైగా భారీ మెసానికి పాల్పడిన ఢిల్లీకి చెందిన సిద్ధార్థ్ జవహర్ (38) కి 11  ఏళ్ల జైలు  శిక్ష ఖరారైంది.   ప్రముఖ ఎన్‌ఎఫ్‌ఎల్ (NFL) స్టార్ ట్రావిస్ కెల్స్‌తో సహా అనేకమంది ప్రముఖులను మోసగించిన ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి.

2005లో 21 ఏళ్ల వయసులో ఢిల్లీ నుంచి అమెరికా వెళ్లిన సిద్ధార్థ్ జవహర్ (Siddharth Jawahar).. టెక్సాస్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించారు. ఆ తర్వాత 'స్విఫ్టార్క్ క్యాపిటల్' (Swiftarc Capital) పేరిట ఒక ఇన్వెస్ట్‌మెంట్ సంస్థను ప్రారంభించి ఫైనాన్స్, వెంచర్ క్యాపిటలిజం రంగాల్లో ఎదిగా డు. ఆండీ రోడిక్ ఫౌండేషన్ బోర్డులో స్థానం సంపాదించి, మంచి గౌరవనీయమైన దాతగా కూడా పేరు పొందాడు. కట్‌ చేస్తే.. అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు 11 ఏళ్ల జైలు శిక్ష విధించడంతో పాటు, బాధితులకు రూ.300 కోట్లకుపైగా( 31.35 మిలియన్ డాలర్లు) నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.

స్కామ్‌కు తెరలేచిందిలా..

2016 , జూలై నుంచి డిసెంబర్ 2023 మధ్య కాలంలో వివిధ ఇన్వెస్టర్ల నుంచి 35 మిలియన్ డాలర్లకు పైగా సేకరించిన సిద్ధార్థ్,  అందులో కేవలం 28 శాతం మాత్రమే (సుమారు 10 మిలియన్ డాలర్లు) పెట్టుబడిగా పెట్టారు. మిగతా డబ్బును విలాసవంతమైన జీవితం, ప్రైవేట్ జెట్ ప్రయాణాలు, లగ్జరీ హోటళ్లు, ఖరీదైన అపార్ట్‌మెంట్ల కోసం దుర్వినియోగం చేశారు. పాత ఇన్వెస్టర్లకు డబ్బు చెల్లించడానికి కొత్త ఇన్వెస్టర్ల నిధులను వాడుతూ పాన్జీ స్కామ్‌ను నడిపారు.

బాధితుల్లో చాలామంది ప్రముఖులు
ఈ మోసంలో మొత్తం 64 మంది బాధితులు ఉండగా.. వారిలో సింగర్ టేలర్ స్విఫ్ట్ భర్త, ప్రముఖ ఎన్‌ఎఫ్‌ఎల్ (NFL) ఆటగాడు ట్రావిస్ కెల్స్ కూడా ఉన్నారు. అలాగే ఎన్‌బీఏ (NBA) ఆటగాళ్లు గ్యారీ హారిస్, టిమ్ హార్డవే జూనియర్, మేసన్ ప్లమ్లీ తదితరులు కూడా ఈ మోసానికి బలయ్యారు.

దాతృత్వ ముసుగులో మోసాలు
ఆండీ రోడిక్ ఫౌండేషన్ బోర్డు సభ్యుడిగా కొనసాగుతూ, అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా సిద్ధార్థ్ మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ దాతృత్వ ముసుగే సెలెబ్రిటీలు మరియు ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి అతనికి సహకరించింది.

అరెస్ట్ -శిక్ష
చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్న ఇతని నేర చరిత్రను గుర్తించిన అధికారులు.. మోసాలకు పాల్పడినట్లు తేలడంతో అరెస్ట్ చేశారు. జనవరిలో వైర్ ఫ్రాడ్ ఆరోపణలను అంగీకరించిన సిద్ధార్థ్‌కు సెప్టెంబర్ 15న. విచారణను తప్పుదారి పట్టించడానికి సాక్ష్యాలను ధ్వంసం చేయడం, ఐఫోన్‌ను రిమోట్‌గా వైప్ చేయించడం వంటి అక్రమాలకు కూడా ఆయన పాల్పడినట్లు ప్రాసిక్యూటర్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement