breaking news
Scam
-
ముత్యమూ కాదు, వజ్రమూ కాదు.. ప్రజల సొమ్ము దోచుకున్న దొంగ రామోజీ రావు..!
-
పీవీ సింధూ పోస్టుకి, డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాకూ తేడా తెలీదు
-
సైబర్ ముఠాల ఆన్లైన్ దోపిడీకి కేంద్రం చెక్
దేశంలో నిత్యం విస్తరిస్తున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గూగుల్‌కు చెందిన ప్రముఖ డెవలపర్ వేదిక ‘ఫైర్‌బేస్’ ఆధారంగా పనిచేస్తున్న వందలాది మోసపూరిత ఖాతాలను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ఐటీ, టెలికాం మంత్రిత్వ శాఖ గూగుల్‌ను ఆదేశించింది. లాభదాయకమైన అప్లికేషన్లు, ఆన్లైన్ సేవలు, నకిలీ బ్యాంకింగ్ యాప్‌ల పేరుతో సాగుతున్న ఒకే రకమైన స్కామ్ ప్యాటర్న్‌ను భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు గుర్తించిన అనంతరం ఈ చర్యలు వేగవంతమయ్యాయి.మోసం సాగిందిలా..సైబర్ నేరగాళ్లు గూగుల్ ఫైర్‌బేస్ అందించే ఉచిత, చవకైన క్లౌడ్ డేటాబేస్ వసతులను ఆసరాగా చేసుకున్నారు. నిజమైన యాప్‌లుగా నమ్మించేలా డిజైన్ చేసి అమాయక వినియోగదారుల వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్, ఓటీపీలను సేకరించడానికి ఈ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించారు. అధునాతన విశ్లేషణ ద్వారా ఒకే నెట్వర్క్ లేదా ఒకే రీతిలో పంపుతున్న డేటా ట్రాఫిక్‌ను గుర్తించిన ప్రభుత్వ విభాగాలు, ఈ అక్రమ నెట్వర్క్ వెనుక ఉన్న వందలాది ఫైర్‌బేస్ ప్రాజెక్ట్‌లను, డెవలపర్ ఖాతాలను నిలిపేయాలని ఆదేశించాయి.ప్రభుత్వ ఆదేశాలు.. గూగుల్ స్పందనదేశ ప్రజల డిజిటల్ భద్రత, ఆర్థిక డేటా రక్షణ నేపథ్యంలో మోసపూరిత ప్రాజెక్టులతో సంబంధం ఉన్న అన్ని ఖాతాలను, వాటి సర్వర్ లింకులను వెంటనే బ్లాక్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై స్పందించిన గూగుల్ తమ ప్లాట్‌ఫామ్‌ల దుర్వినియోగాన్ని ఎంతమాత్రం సహించేది లేదని, భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన ఖాతాలను ఇప్పటికే తొలగించే ప్రక్రియ ప్రారంభించామని వెల్లడించింది. డిజిటల్ విప్లవంతో పాటు పెరుగుతున్న సైబర్ బెదిరింపులను తిప్పికొట్టేందుకు గూగుల్, మెటా.. వంటి టెక్ దిగ్గజాలు తమ వేదికలపై మరింత కఠినమైన నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.ఇదీ చదవండి: ఆకాశమే హద్దుగా బంగారం ధర.. -
జగన్ ను ఆపే దమ్ము వాళ్లకు లేదు.. నేను జగన్ మనిషిని అనుకుంటే తప్పేంటి..
-
కొంచెం కూడా సిగ్గులేకుండా.. లోకేష్ ను కాపాడుకోవడానికి మరింత దిగజారుతావా చంద్రబాబు..
-
కొంచెం సీక్రెట్ గా చేయాలంటా.. DSC స్కాం పై మరో సంచలనం ఆడియో వైఎస్ జగన్ మాస్ ర్యాగింగ్
-
అసెంబ్లీ సాక్షిగా అబ్బా కొడుకులే నిజం ఒప్పుకున్నారు... లైవ్ లో వీడియో ప్లే చేసి ఏకిపారేసిన జగన్
-
లోకేష్ కాదు 'లీకేష్'! ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా..
-
14 రోజులైంది పేర్ని నాని ఛాలెంజ్ చేసి.. ఏం భయమా..
-
అడ్డంగా బుక్కయ్యారు.. తండ్రీకొడుకులకు CBI ఫీవర్
-
ఎందుకు పారిపోతున్నావ్ లోకేష్? చర్చకు రా లోకేష్!
-
అసెంబ్లీ సాక్షిగా ఆ ఇద్దరు దొరికిపోయారు
-
DSC అక్రమార్కుల డైవర్షన్ ప్లాన్!
-
డీఎస్సీ అక్రమాలు.. లోకేష్ ప్రకటనతో ఇరుకున పడ్డ ప్రభుత్వం!
సాక్షి, అమరావతి: డీఎస్సీ అక్రమాల విషయంలో కూటమి ప్రభుత్వం అడ్డంగా బుక్కైంది. ఎలాంటి అవకతవకలు జరగలేదని నిన్నటిదాకా బుకాయిస్తూ వస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్.. ఇప్పుడు, ఇవాళ అసెంబ్లీ వేదికగా అన్ని తప్పులనూ అంగీకరించారు!. అంతేకాదు.. స్పోర్ట్స్ కోటా జీవోను మళ్లీ రద్దు చేసిన ప్రభుత్వం.. రిటెన్ టెస్ట్ పెడుతూ జీవో నెంబర్ 56ను రిలీజ్ చేయడం గమనార్హం. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇచ్చిన లోకేష్.. గతంలో క్రీడాకారిణి పీవీ సింధుకు రాత పరీక్ష లేకుండా ఉద్యోగం ఇచ్చిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. అదే విధానంలో స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు కూడా రాత పరీక్ష లేకుండా నియామకాలు చేపట్టినట్లు వివరించారు. అయితే పీవీ సింధు వంటి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణి, సాధారణ క్రీడా సర్టిఫికెట్ల ఆధారంగా దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఒకటేనా? అనేనా ప్రశ్న మొదలైంది.జీవోల్లో మార్పులు.. స్పోర్ట్స్ కోటా నియామకాలపై వివాదం నేపథ్యంలో ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో 47ను రద్దు చేసి.. కొత్తగా జీవో 56ను తీసుకొచ్చింది. తాజా నిబంధనల్లో రాత పరీక్షను తప్పనిసరి చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ మార్పు కూడా డీఎస్సీ ప్రక్రియలో గందరగోళానికి దారితీసినట్లైంది. తద్వారా అవకతవకలను కప్పిపుచ్చుకునే ప్రయత్నమేనని స్పష్టమవుతోంది.నవీన్ వ్యవహారంపైనా ప్రశ్నలుఎస్ఈఆర్టీ ఉద్యోగి నవీన్‌కు టాప్ ర్యాంక్ రావడం, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలపై కూడా అసెంబ్లీలో చర్చ జరిగింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కాలేదని, అందుకే ఉద్యోగం ఇవ్వలేదని గతంలో ప్రభుత్వం కోర్టుకు వివరించింది. అయితే ఇవాళ శాసన సభలో లోకేష్ మాట్లాడుతూ.. కోర్టులో ప్రభుత్వం ఇచ్చిన వివరణకు విరుద్ధంగా ప్రకటన చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగి కావడంతో ఎన్ఓసీ తీసుకోలేదని లోకేశ్ పేర్కొన్నారు. ఎన్వోసీ అంశంపై తాము రిజక్ట్ చేయలేదని సెక్రటరీ కోన శశిధర్ గతంలో చెప్పారు. అలా.. ఈ రెండు ప్రకటనల నడుమ మధ్య బోలెడు వ్యత్యాసం ఉంది. ఒకరికే అవకాశం ఇచ్చారా?ఇక ఎస్ఈఆర్టీ, డీఎస్సీ కన్వీనర్ ఒకే వ్యక్తికి ఇచ్చిన అంశాన్ని కూడా లోకేష్ ప్రస్తావించారు. దీనిపై ప్రభుత్వం తరఫున లోకేశ్ వివరణ ఇస్తూ.. అలా ఇవ్వకూడదని చట్టంలో ఎక్కడా లేదని సమర్థించుకున్నారు. దీంతో నియామక ప్రక్రియలో పారదర్శకతపై అనుమానాలు ఉన్నాయి.అవును.. అక్రమాలు జరిగాయ్స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై వచ్చిన ఆడియో లీక్ అంశాన్ని కూడా లోకేష్ సభలో ప్రస్తావించారు. దీనిపై శాప్ ఫిర్యాదు చేసిందని, సంబంధిత వ్యక్తిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.అయితే ఈ పరిణామాలన్నీ డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో లోపాలను బయటపెడుతున్నాయి. మెరిట్ అభ్యర్తుల్ని పట్టించుకోకుండా తమకు నచ్చినవాళ్లకే స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారని వైఎస్సార్సీపీ తొలి నుంచి చెబుతోంది. డీఎస్సీ అక్రమాలపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ శాసన మండలిలో ఇవాళ గట్టిగా గళం వినిపిస్తోంది. ఈ తరుణంలో.. వైఎస్సార్సీపీ గైర్హాజరు అయిన శాసనసభలో లోకేశ్ ప్రకటన చేయడం, అవకతవకలు జరగలేదంటూనే తప్పులు అంగీకరించడంతో సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లైంది. -
ఎగ్జామ్ స్కాంలపై మోదీ సర్కార్‌కు బాబా రామ్‌దేవ్ హెచ్చరిక
హరిద్వార్: భారతీయ జనతాపార్టీకి వీర విధేయుడుగా భావించే యోగా గురు బాబా రామ్‌దేవ్ తాజా వ్యాఖ్యలు నెట్టింట సంచలనంగా మారాయి. విద్యా, నియామక పరీక్షల అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేస్తున్న ఆందోళనలకు రామ్‌దేవ్ మద్దతుగా నిలవడమేకాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేయడం విశేషం. కేంద్రం త్వరగా ఈ 'ఘప్లా' ( స్కాంలను)ను సరిదిద్దకపోతే, ఈ ఆందోళన మరింత తీవ్రరూపం దాల్చవచ్చని, ప్రభుత్వం ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని హితవుపలికారు. లేకపోతే తాను కూడా నిరసన చేపట్టాల్సి రావచ్చని వ్యాఖ్యానించారు.80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హరిద్వార్‌లోని పతంజలి యోగపీఠ్ వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి కీలక హెచ్చరికలు చేశారు. పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయులు, నీరు, విద్యుత్ వంటి ప్రాథమిక సౌకర్యాల కొరతపై విద్యార్థులు నిరసన గురించి ప్రస్తావించారు. ప్రభుత్వ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియపై అవినీతి, ధనబలం ప్రభావం చూపుతున్నాయని కూడా ఆ సందర్భంగా ఆయన ఆరోపించారు.దేశంలో అంతటా గందరగోళం నెలకొని ఉంది. తమ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరని పిల్లలు ఫిర్యాదు చేస్తున్నారు. విద్యుత్, నీరు, మరుగుదొడ్లు వంటి ప్రాథమిక సౌకర్యాలు కొరవడ్డాయి. కొన్నిచోట్ల మోసాలు విచ్చలవిడిగా జరుగుతుండగా, మరికొన్నిచోట్ల ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగ ఇంటర్వ్యూలలో అవినీతి 99 శాతం వరకు ఉంది. కుల, మత ప్రాతిపదికన ఎంపికలు జరుగుతున్నాయి. ఇది రాజ్యాంగ విరుద్ధం, అత్యంత అభ్యంతరకరమైనదని రామ్‌దేవ్ మండిపడ్డారు.వారికి సిగ్గుండాలిభారత పౌరులమని చెప్పుకుంటూనే, రాజకీయ కారణాలతో లేదా కులం పేరుతో ఒకరిపై ఒకరు ద్వేషం, కక్ష పెంచుకునే వారిని ఖండిస్తున్నా అన్నారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, దళితులు, ఆదివాసీలు, అటవీ ప్రాంత వాసులు, అలాగే హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు... ఇలా ఒకరి రక్తం కోసం మరొకరు తహతహలాడుతున్నట్లుగా, పరస్పర శత్రుభావంతో నిలబడటం ఎంత దారుణంమని ఆవేదన వ్యక్తంచేశారు.ఒకవైపు 'సత్యమేవ జయతే', 'యతో ధర్మస్తాతో జయః' అని బోధిస్తూనే, మరోవైపు కోటి రూపాయల లంచం తీసుకున్న తర్వాతే నియామకాలు జరుగుతుండటంపై ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. అందరూ నిరసనలు ప్రారంభిస్తే దేశం ఎలా నడుస్తుంది? అందుకే, ఇకనైనా పద్ధతులను మార్చుకోండి; లేకపోతే, ఆందోళన మరింత తీవ్రమవుతుందని మోదీ సర్కార్‌ను హెచ్చరించారు.అలాగే నిరసనలు హింసాత్మకంగా కాకుండా, రాజ్యాంగ పరిధిలోనే ఉండాలని చెబుతూ, హింసకు, అరాచకానికి దూరంగా ఉండాలని జెన్ జెడ్ నిరసనకారులను రామ్‌దేవ్ కోరారు. స్కాములు జరుగుతున్నాయనేది కాదనలేని సత్యమన్నారు. భారతీయుల మధ్య పెరుగుతున్న శత్రుత్వాన్ని కూడా రామ్‌దేవ్ ఖండించారు. వివిధ కులాలు, వర్గాలకు చెందిన ప్రజలు ఒకరికొకరు వ్యతిరేకంగా నిలబడటం ప్రారంభించారని ఆయన అన్నారు. యువత తమ హక్కుల కోసం పోరాడేటప్పుడు చట్టాన్ని, రాజ్యాంగాన్ని అనుసరించాలని, హింసను విడనాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా 2011లో ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో తాను చేసిన అవినీతి వ్యతిరేక నిరసనను ఆ యోగా గురువు ప్రస్తావించారు. ఇదీ చదవండి: 24 గంటల్లో 1.6 లక్షల ఫాలోవర్స్ : సీజేపీ తరహాలో డీజేపీ సంచలనం -
మండలిలో బొత్స పై నోరు పారేసుకున్న మంత్రి అచ్చెన్నాయుడు
-
డీఎస్సీ అక్రమాలపై దద్దరిల్లిన ఏపీ శాసన మండలి
సాక్షి, అమరావతి: ఏపీ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు.. వాయిదాల పర్వంతో మొదలైంది. కూటమి ప్రభుత్వంలో మెగా డీఎస్సీ పేరిట జరిగిన అక్రమాలపై శాసనమండలి దద్దరిల్లింది. ఈ అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చిన ప్రతిపక్ష వైఎస్సార్సీపీ.. చైర్మన్ తిరస్కారంతో చర్చకు పట్టుబట్టింది. ‘‘ప్రభుత్వం అంటే అందరికీ న్యాయం చేయాలి. కానీ, మూడు లక్షల మందిని డీఎస్సీ రిక్రూట్మెంట్ పేరిట మోసం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాల్సిందే. స్పోర్ట్స్ కోటా పేరుతో వాళ్లకు నచ్చినవాళ్లకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ఈ అక్రమాలపై సభలో చర్చ జరగాల్సిందే. ఏపీపీఎస్సీపై కూడా చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం’’ అని విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ తరుణంలో ప్రభుత్వం వర్గాల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో.. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని నినాదాలు చేశారు. పరీక్షలు రాయకుండా ఉద్యోగాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అంటూ ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో మండలిని చైర్మన్ కాసేపు వాయిదా వేశారు. మంత్రుల అసహనండీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రుల అసహనం వ్యక్తం చేశారు. విపక్ష నేతకు మైక్ ఎలా ఇస్తారంటూ మంత్రి నాదెండ్ల మనోహర్, మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజును ప్రశ్నించారు. మరో మంత్రి అచ్చెన్నాయుడు విపక్ష నేత బొత్సపై నోరు పారేసుకున్నారు. బొత్సను ఉద్దేశించి దద్దమ్మ అంటూ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా.. గొడ్డలి పార్టీ అంటూ వైఎస్సార్సీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. -
వాహనాల భద్రత ప్రాజెక్టు ముసుగులో మరో భారీ స్కామ్.. కమీషన్ల ‘వాహనం’!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వాహనాల భద్రత ప్రాజెక్టు.. ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ముసుగులో మరో భారీ స్కామ్‌కు రంగం సిద్ధమైంది! బస్సులు, లారీలు, ఇతర ప్రైవేట్ వాహనాల కోసం అంటూ వెహికల్ లొకేషన్ అండ్ ట్రాకింగ్ డివైస్ (వీఎల్టీడీ) ప్రాజెక్టును తెరపైకి తేవడంతోపాటు ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆర్టీజీఎస్, స్టేట్ డేటా సెంటర్లను పక్కనబెట్టి ప్రత్యేకంగా రూ.25 కోట్లతో కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఏర్పాటుకు ప్రభుత్వ పెద్దలు పచ్చ జెండా ఊపారు. ఇందులో వాటాల వసూలుకు సిద్ధమయ్యారు. సీఎంవో అండదండలతో మహిళా నేత ‘చిన్న’ పావులు కదిపి ముడుపుల ‘ప్రసాదం’ పంచుకునేందుకు ఏర్పాట్లు చేశారు! ఈ ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని రెండేళ్లకు ఒకసారి రూ.110 కోట్లు చొప్పున కాజేసేందుకు పక్కాగా స్కెచ్ వేశారు.బయట ఒక్కో వీఎల్టీడీ ధర రూ.2,500 మించదు. అలాంటిది దాని ధర ఏకంగా రూ.పది వేలకు పెంచేయడం అవినీతి వ్యవహారాలకు నిదర్శనంగా నిలుస్తోంది. వీఎల్టీడీలను సరఫరా చేసే సంస్థతో బేరసారాలు జరిపిన కీలక మంత్రి.. ఒక్కో డివైజ్‌కు రూ.2 వేల చొప్పున కమీషన్ చెల్లించేందుకు అంగీకరించిన రెండు సంస్థలకే పనులు దక్కేలా టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించారు. దాంతో ఆ రెండు సంస్థలు మాత్రమే అర్హత సాధించే నిబంధనలతో ఏ క్షణమైనా టెండర్ నోటిఫికేషన్ జారీకి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. టెండర్ల వెనుక గోల్మాల్.. వీఎల్టీడీ పరికరాల కొనుగోలు వెనుక భారీ కుంభకోణం దాగి ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి మార్కెట్లో ఒక్కో పరికరం ధర రూ.2,500 మాత్రమే ఉంది. తయారీ సంస్థలు ఇదే ధరకు మైనింగ్ కంపెనీలు, ప్రైవేట్ వాహన సముదాయాల నిర్వహణ సంస్థలకు సరఫరా చేస్తున్నాయి. అయితే కమీషన్లు దండుకోవడమే లక్ష్యంగా పరికరం ధరను ఏకంగా నాలుగు రెట్లు (రూ.10 వేలు) పెంచి టెండర్లలో చూపించారు. ఆ లెక్కన దాదాపు రూ.550 కోట్ల అంచనాలతో 5.50 లక్షల పరికరాల కొనుగోలుకు టెండర్లు పిలుస్తున్నారు. ఒక్కో పరికరంపై రూ.2 వేలు చొప్పున కమీషన్ రూపంలో ఏకంగా రూ.110 కోట్లు కాజేసేందుకు పక్కాగా స్కెచ్ వేశారు. వాహనదారులు కేవలం రూ.2,500 విలువైన పరికరానికి రూ.10 వేలు చెల్లించాల్సి వస్తోందిఇప్పటికే ఉన్న వ్యవస్థలను పక్కనపెట్టి..వీఎల్టీడీ ప్రాజెక్టులో భాగంగా కమాండ్ కంట్రోల్ సిస్టమ్, వీఎల్టీడీ పరికరాల కోసం మొత్తం రెండు టెండర్లు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ (ఆర్టీజీఎస్), స్టేట్ డేటా సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. వివిధ శాఖల నుంచి ప్రతిరోజూ గిగాబైట్ల కొద్దీ డేటా ఈ వ్యవస్థలకు చేరుతుంది. వీటిని కాదని వీఎల్టీడీ ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా రూ.25 కోట్లతో కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఏర్పాటు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఇంకా ప్రత్యేకంగా మరో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఎందుకు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. డీఐఎంటీఎస్, డిజిటాజ్కు అనుకూలంగా టెండర్ నిబంధనలు వాహనాల కదలికలను పసిగట్టేందుకు జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) పరికరాలు ఎప్పటి నుంచో అందుబాటులో ఉన్నాయి. అయినా సరే వాహనాల భద్రత, అత్యవసర సమయంలో ఆచూకీ తెలుసుకోవడం, ప్రమాదాల సమయంలో వేగంగా స్పందించడం కోసం అంటూ కొత్తగా వీఎల్టీడీ ప్రాజెక్టును కొత్తగా తెరపైకి తీసుకొచ్చారు. తొలిదశలో రాష్ట్రంలో 5.50 లక్షల భారీ వాహనాలకు వీటిని అమర్చాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందుకోసం ఏపీఎస్ ఆర్టీసీకి టెండర్ల బాధ్యత అప్పగించారు. ఈ క్రమంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ టెండర్ ముసాయిదాను అనుకూల కాంట్రాక్టర్లకు చేరవేసి నిబంధనలు ఇష్టారాజ్యంగా మారుస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లను నిర్వహిస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు పాల్గొనేందుకు వీలులేని రీతిలో నిబంధనలు రూపొందించినట్లు చెబుతున్నారు. కమీషన్ల కోసం డీఐఎంటీఎస్, డిజిటాజ్ లాంటి సంస్థలకు అనుకూలంగా టెండర్ నిబంధనలు మారుస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం సుమారు రూ.5 కోట్ల మేర చేతులు మారినట్లు సమాచారం.ఏఆర్‌ఏఐలో 70కిపైనే గుర్తింపు పొందిన సంస్థలు దేశంలో 70కి పైగా వీఎల్టీడీ పరికరాల తయారీదారులు ఇప్పటికే ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) వద్ద ధ్రువీకరణ పొందారు. వీరందరికీ ఏఐఎస్–140 ధ్రువీకరణ ఉంది. నిబంధనల ప్రకారం ఈ ధ్రువీకరణ కలిగిన తయారీదారులు మాత్రమే వీఎల్టీడీ పరికరాలు సరఫరా చేయాలి. అయితే కేవలం రెండు లేదా మూడు సంస్థలు మాత్రమే అర్హత పొందేలా టెండర్లో నిబంధనలు చేర్చినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరికరం కొనుగోలుతోనే వాహన యజమానిపై భారం ఆగదంటున్నారు. పరికరం అమర్చే సమయంలో ఎంవీవో, ఆర్టీవోల నుంచి ధ్రువీకరణ పేరుతో అదనంగా మరో రూ.రెండు వేల దాకా భారం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఫలితంగా వాహనదారుడిపై మొత్తం రూ.14 వేల వరకు భారం పడే అవకాశాలున్నాయి. కమీషన్ల కోసం రెండేళ్లకోసారి.! వాహనదారులు రెండేళ్లకోసారి వీఎల్టీడీ పరికరాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ లెక్కన రెండేళ్లకోసారి వీటి కొనుగోలు పేరిట కమీషన్లు దండుకునే కార్యక్రమంకొనసాగనుంది. వీటి కొనుగోలు, టెండర్ల ప్రక్రియ వెనుక అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తమ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.వీటికి జవాబిస్తారా?⇒ వీఎల్టీడీ టెండర్ ముసాయిదా గోప్యంగా ఉండాల్సిన సమయంలో కొన్ని ప్రైవేట్ సంస్థలకు ఎలా చేరింది? ⇒ టెండర్ షరతులను నిర్దిష్ట సంస్థలకు అనుకూలంగా ఎందుకు మార్చారు? ⇒ ఏఐఎస్–140 ధ్రువీకరణ ఉన్న 70కి పైగా సంస్థలకు అర్హత ఉన్నా.. కేవలం రెండు మూడు సంస్థలకే అవకాశం కలి్పంచే నిబంధనలు ఎందుకు? ⇒ మార్కెట్లో రూ.2,500కే లభ్యమయ్యే పరికరానికి రూ.10 వేల నుంచి రూ.14 వేల వరకు ఎందుకు ఖర్చు చేయాలి? ⇒ ఇప్పటికే ఆర్టీజీఎస్, స్టేట్ డేటా సెంటర్ ఉన్నప్పుడు మరో రూ.25 కోట్లతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎందుకు? ⇒ ఒక్కో పరికరానికి రూ.2,000 చొప్పున అదనపు ధ్రువీకరణ ఖర్చు ఎందుకు? ⇒ పనిచేస్తున్న పరికరాలను రెండేళ్లకోసారి మార్చే నిబంధన ఎందుకు? ⇒ పరికరాల కొనుగోలు, అమరిక, ధ్రువీకరణ ప్రక్రియ మొత్తాన్ని స్వతంత్ర సంస్థతో ఆడిట్ చేయిస్తారా? ⇒ టెండర్ ప్రక్రియకు సంబంధించిన ఫైళ్లు, నోట్ ఫైళ్లు, సాంకేతిక కమిటీ సిఫార్సులు, బిడ్డర్లతో జరిగిన సమావేశాల వివరాలను బహిర్గతం చేస్తారా? -
అమరావతి ఎప్పటికీ పూర్తి కాదు: అంబటి రాంబాబు
సాక్షి, గుంటూరు: అమరావతి పేరిట అడ్డగోలు నిర్మాణాలు.. వాటిపై వ్యయాలు, చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రకటనలపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతి పేరుతో భారీగా ఖర్చు చూపిస్తూ అడ్డగోలుగా దోచుకుంటున్నారని.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా, అప్పులు సైతం చేస్తున్నారని చేస్తున్నారన్నారు. శుక్రవారం గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.ఏడేళ్లలో అమరావతికి చంద్రబాబు చేసిందేమీ లేదని అంబటి రాంబాబు అన్నారు. ఇప్పుడు అద్భుత నగరం నిర్మిస్తున్నామంటూ ప్రచారం చేసుకుంటున్నారని.. ఇది మార్కెటింగ్ తప్ప మరొకటి కాదన్నారు. అమరావతి అనేది ఎప్పటికీ పూర్తి కాదన్నారు. మరోవైపు ఖర్చులను భారీగా పెంచుతున్నారని మండిపడ్డారు. ‘‘అమరావతి అంటే అద్భుత నగరం కాదు.. అవినీతి, దోపిడీకి కేంద్రం’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.రోడ్ల నిర్మాణంపై ప్రశ్నలుఅమరావతిలో రోడ్ల నిర్మాణ వ్యయాలపై అంబటి రాంబాబు అనుమానాలు వ్యక్తం చేశారు. కిలోమీటర్ రోడ్డుకు రూ.180 కోట్ల వరకు ఖర్చు చూపిస్తున్నారన్నారు. దేశంలోనే కాదు.. ప్రపంచంలోని ఏ దేశంలోనూ రోడ్ల కోసం ఇంత భారీగా ఖర్చు చేయరని అన్నారు. 21.77 కిలోమీటర్ల రోడ్డుకు రూ.1,519 కోట్లు చంద్రబాబు ఖర్చు చేస్తున్నారని.. రూ.100 కోట్లలో పూర్తయ్యే పనులను అంచనాలు పెంచి రూ.356 కోట్లకు తీసుకెళ్లారని విమర్శించారు. చదరపు మీటర్ రోడ్డుకు రూ.10 లక్షలు ఖర్చు చేయడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.రైతుల పరిస్థితిపై ప్రశ్నలురాజధాని కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతుల పరిస్థితిపైనా అంబటి ప్రశ్నలు లేవనెత్తారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చారా? లే అవుట్లు అందించారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పొలాలు ఇచ్చినందుకు రైతులు బాధపడే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు.‘‘అద్దాల భవనాల పేరుతో వేల కోట్లు’’అమరావతిలో అద్దాల భవనాలు, భారీ నిర్మాణాల పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని అంబటి అన్నారు. తాత్కాలిక స్టీల్ బ్రిడ్జి కోసం రూ.80 కోట్లు ఖర్చు చేయడం ఏంటని ప్రశ్నించారు. అమరావతిలో చదరపు అడుగు ధర రూ.20 వేల నుంచి రూ.22 వేల వరకు పెరిగిందని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని నిర్మాణం ఎలా సాధ్యమని ప్రశ్నించారు.‘‘బాబు, లోకేశ్‌లకు చెప్పే ధైర్యం ఉందా?’’అమరావతిలో జరుగుతున్న వ్యయాలపై ప్రజలు, మేధావులు ఆలోచించాలని అంబటి రాంబాబు కోరారు. అప్పులు తీసుకువచ్చి వాటిలోనూ కమీషన్లు దండుకుంటున్నారంటూ చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్‌పై మండిపడ్డారు. వైఎస్సార్సీపీ లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని సవాల్ చేశారు. అమరావతి పేరుతో జరుగుతున్న దోపిడీని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. -
చాట్బాట్ల 'వలపు' వల
సాక్షి, హైదరాబాద్ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంమానవ జీవితాన్ని ఎంతగా సులభతరం చేస్తోందో, అంతేస్థాయిలో నేరగాళ్లకు కొత్త ఆయుధంగా మారుతోంది. ముఖ్యంగా ఇంటర్నెట్లో జరిగే మోసాలు ఇప్పుడు మరింత ప్రమాదకరమైన మలుపు తిరిగాయి. ఇప్పటివరకు కేవలం మనుషులు మాత్రమే చేసే ఆన్లైన్ ప్రేమ మోసాల్లోకి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రవేశించింది. చాట్‌జీపీటీ, జెమినై, క్లాడ్ వంటి ఆధునిక చాట్బాట్లు మనుషుల కంటే అత్యంత ప్రభావవంతంగా బాధితుల నమ్మకాన్ని చూరగొంటుండటం ఆందోళన కలిగిస్తోంది. ఏఐకే రేటింగ్స్భారత్కు చెందిన అమృత విశ్వవిద్యాపీఠం, ఇటలీకి చెందిన ఫోస్కారి విశ్వవిద్యాలయం, ఆ్రస్టేలియాలోని మెల్బోర్న్ వర్సిటీ, ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకులు సంయుక్తంగా ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. సాధారణ మనుషులకు, కృత్రిమ మేధ చాట్బాట్లకు మధ్య ఒక నియంత్రిత పోటీని ఏర్పాటు చేశారు. ఈ సంభాషణల్లో పాల్గొన్న బాధితులకు తాము ఒక యంత్రంతో మాట్లాడుతున్నామా లేదా మనిషితో మాట్లాడుతున్నామా అనే విషయం తెలియదు.చివరకు ఫలితాలను విశ్లేషించగా మానవ నేరగాళ్ల కంటే ఏఐ చాట్బాట్లు అత్యంత ప్రతిభావంతంగా మనుషులను అనుకరిస్తూ వారి నమ్మకాన్ని గెలుచుకున్నట్లు తేలింది. సాధారణంగా ఒక మానవ నేరగాడు చాట్ చేసిన తర్వాత ఏదైనా అప్లికేషన్ డౌన్లోడ్ చేయమని కోరితే 18 శాతం మంది మాత్రమే అంగీకరించారు. కానీ అదే అభ్యర్థన ఏఐ చాట్‌బాట్ నుంచి వచ్చినప్పుడు 50 శాతం మంది అంగీకరించి ఆ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. దీనిని బట్టి మనుషుల కంటే ఎక్కువగా కృత్రిమ మేధకే ప్రజలు నమ్మకపు రేటింగులు ఇచ్చారని పరిశోధకులు గుర్తించారు. విస్తరిస్తున్న మోసాల నెట్వర్క్ సాధారణంగా ప్రేమ మోసాలు అనేవి చాలాకాలం నుంచి సాగుతున్న నేరాలు. నేరగాళ్లు నకిలీ ఖాతాలను సృష్టించి, వారాలు లేదా నెలల తరబడి రోజూ బాధితులతో మాట్లాడుతూ నమ్మకాన్ని పెంచుకుంటారు. ఆ తర్వాత ఏదైనా అత్యవసర పరిస్థితి అని చెప్పి లేదా నకిలీ డిజిటల్ కరెన్సీ పెట్టుబడుల పేరుతో డబ్బులు గుంజుతారు. అయితే మానవ నేరగాళ్లకు సమయం, శ్రమ పరిమితులు ఉంటాయి. కానీ ఏఐకి అటువంటి పరిమితులు ఏవీ లేవు. ఏఐ సహాయంతో నేరగాళ్ల నెట్‌వర్క్‌లు ఒకే సమయంలో వేలాది మంది బాధితులతో సంభాషణలు సాగించగలవు. ఇవి ఏమాత్రం అలసట లేకుండా, నిరంతరాయంగా స్పందించగలవు. సంభాషణల శైలి చాలా సహజంగా ఉండటం వల్ల ప్రస్తుత భద్రతా వ్యవస్థలు కూడా వీటిని గుర్తించలేకపోతున్నాయి. కేవలం చివరి దశలో బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసే సమయంలో మాత్రమే మానవ నేరగాళ్లు రంగంలోకి దిగుతున్నారు. ఇది నేరగాళ్లకు తమ మోసాలను ప్రపంచవ్యాప్తంగా భారీగా విస్తరించడానికి వీలు కల్పిస్తోంది.మానవ అక్రమ రవాణా.. ఈ సాంకేతికత కేవలం ఆర్థిక మోసాలకే పరిమితం కాలేదు. అంతర్జాతీయంగా జరిగే మానవ అక్రమ రవాణాకు కూడా సాధనంగా మారుతోంది. విదేశాల్లో భారీ జీతాలతో కూడిన ఉద్యోగాలు ఇస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చే నకిలీ ప్రకటనల వెనుక పెద్ద ముఠాలు ఉంటున్నాయి. ఇవి కూడా కృత్రిమ మేధను ఉపయోగించి వివిధ భాషల్లో ఆకర్షణీయ సందేశాలను తయారు చేస్తున్నాయి. ఈ మాయలో పడి ఏటా లక్షలాది మంది మోసపోతున్నారు.జాగ్రత్త పడటం ఎలా? తక్కువ నైపుణ్యాలున్న ఉద్యోగాలకు అసాధారణ రీతిలో భారీ జీతాలు ఆఫర్ చేయడం, ఉద్యోగ వివరాలు స్పష్టంగా లేకపోవడం, వెంటనే చేరాలని ఒత్తిడి చేయడం వంటివి మోసాలకు ప్రధాన సంకేతాలు. తెలియని వ్యక్తులతో ఆన్లైన్ సంభాషణలు జరిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా తక్కువ సమయంలోనే ఎక్కువ నమ్మకాన్ని కలిగిస్తూ, ఆ తర్వాత ఆర్థిక సహాయం, పెట్టుబడుల గురించి మాట్లాడితే అనుమానించాలి. -
రొమాన్స్ స్కామ్!
పెళ్లి కోసమై వలలో పడెనే పాపం పసివాడు...అని పాడుకోవచ్చునేమో! ఇది పెళ్లిళ్ల పేరయ్యల కాలం కాదు. వివాహాలకు సంబంధించి చాలా మంది మాట్రిమోనియల్ వెబ్సైట్లపై ఆధారపడుతున్న కాలం. దీన్ని ఆసరాగా చేసుకొని మాట్రిమోనియల్ స్కామ్స్ జరుగుతున్నాయి. జీవిత భాగస్వామి కోసం వెదుక్కునే క్రమంలో కొందరు సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. ఏఐ సాంకేతికత వల్ల మాట్రిమోనియల్ మోసాలను కనిపెట్టడం కష్టంగా మారింది. రొమాన్స్ స్కామ్ ప్రొఫైల్స్ విషయంలో భారతదేశం ప్రపంచంలోనే మూడవ స్థానంలో ఉంది! సైబర్ మోసగాళ్లు మాట్రిమోనియల్ సైట్లను విరివిగా ఉపయోగిస్తున్నారని నివేదికలు తెలియజేస్తున్నాయి...ఒక మాట్రిమోనియల్ ప్లాట్‌ఫామ్ నుంచి ముప్పై అయిదేళ్ల సాప్ట్వేర్ ఇంజినీర్ నీరజ్‌కు ఆసక్తికరమైన రిక్వెస్ట్ వచ్చింది. తనను తాను క్వాలిఫైడ్ ఆర్కిటెక్ట్ అని పరిచయం చేసుకున్న ఆమె తన పేరు రీతిక అని చెప్పింది. కొన్ని వారాలపాటు ఇద్దరూ మాట్లాడుకున్నారు. తన కుటుంబం, తాను చేసే ఉద్యోగం, మ్యారేజ్ ప్లాన్స్ గురించి వివరంగా చెప్పింది. ఈ క్రమంలోనే ఫారెక్స్ ట్రేడింగ్ (ఫారిన్ ఎక్సే ్చంజ్ ట్రేడింగ్)లో ‘సేఫ్ రిటర్న్స్’ గురించి ప్రస్తావించింది. ‘మీరు ఇన్వెస్ట్ చేస్తే నేను సహాయం చేస్తాను’ అని కూడా చెప్పింది. ఆమె చెప్పిన ట్రేడింగ్ ప్లాట్ఫామ్లోకి వెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు అది చట్టబద్ధమైన ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ అనే నమ్మకం వచ్చింది. డ్యాష్‌బోర్డ్‌లో ప్రాఫిట్స్ కనిపించాయి. ‘ఫరవాలేదు. ఇన్వెస్ట్ చేయవచ్చు’ అనే నమ్మకాన్ని కలిగించాయి.ఆ తరువాత ఏమైందంటే...ఆ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ చేశాడు నీరజ్. కొంత లాభాలు వచ్చిన తర్వాత తన డబ్బును విత్‌డ్రా చేసుకోవాలనుకున్నాడు. అయితే ఆ ట్రేడింగ్(?) ప్లాట్‌ఫామ్ స్పందించడం మానేసింది. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రీతిక అనే పేరుతో ఎవరూ లేరని, ఆ ఫొటోగ్రాఫ్‌లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో సృష్టించారని, వీడియో కాల్స్‌ను ఏఐ టూల్స్‌తో మానిప్యులేట్ చేశారని, గుర్తింపు పత్రాలను ఫోర్జరీ చేశారనే విషయం దర్యాప్తులో బయటపడింది. డజన్ల కొద్దీ నకిలీ మాట్రిమోనియల్ ప్రొఫైల్స్‌ను నిర్వహిస్తున్న ఒక నెట్వర్క్ స్కామ్ ఇది అని తేలింది.నమ్మకాన్ని క్యాష్ చేసుకుంటున్నారునకిలీ మాట్రిమోనియల్ ప్రొఫైల్స్, నకిలీ ఫారెక్స్ ఇన్వెస్ట్మెంట్ పథకం ద్వారా సూరత్‌కు చెందిన కొందరిని మోసం చేసిన సైబర్ మోసాల ముఠా సభ్యులను ఇటీవల గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఒక వైద్యుడు కూడా ఉన్నాడు! మ్యాట్రిమోనీ ప్లాట్‌ఫామ్‌లు సైబర్ నేరగాళ్లకు ఆకర్షణీయమైన కేంద్రాలుగా మారాయి. మాట్రిమోనియల్ ప్లాట్‌ఫామ్‌లకు నమ్మకం అనేది ప్రధానం. ఆ నమ్మకాన్నే ఆధారంగా చేసుకొని మోసగాళ్లు చేతివాటం చూపుతున్నారు. తమ జీవితభాగస్వామి గురించి వెదుకుతున్నప్పుడు కుటుంబ నేపథ్యం నుంచి వృత్తి వివరాల వరకు షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ సమాచారం మోసగాళ్ల చేతికి చిక్కడం వల్ల దుర్వినియోగం అవుతోంది.నకిలీ పేర్లు, దొంగిలించిన ఫొటోల స్థాయిని దాటి రొమాన్స్ స్కామ్స్ చాలా ముందుకువెళ్లాయి. సంభాషణలు నమ్మశక్యంగా, సహజంగా ఉండడానికి ఇమేజ్ ఎడిటింగ్, వాయిస్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. జనరేటివ్ ఏఐ ద్వారా రొమాన్స్ స్కామ్స్‌ని కన్విన్సింగ్‌గా చేయడం సులువైంది. తక్కువ టైమ్‌లోనే వీలైనంత ఎక్కువ మందిని మోసం చేయవచ్చు.ఆ తరువాతే...‘గతంతో పోల్చితే మోసాలను గుర్తించడం కష్టమవుతుంది. ప్లాట్‌ఫామ్‌లు తమ ధ్రువీకరణ ప్రక్రియను బలోపేతం చేయాలి. తద్వారా మోసాలు జరగకుండా చేయవచ్చు’ అంటున్నారు నిపుణులు. గతంలో మాదిరిగా ‘వెంటనే మోసం చేయాలి–డబ్బులు దండుకోవాలి’ అని తొందరపడడం లేదు సైబర్ నేరగాళ్లు.‘తగిన సమయం వెచ్చించాలి. నమ్మకాన్ని పెంచుకోవాలి. ఆ తరువాతే డబ్బులు దండుకోవాలి’ అనే పాలసీని అనుసరిస్తున్నారు. మోసపోతే...→ చాట్ రికార్డులు, స్క్రీన్ షాట్లు, చెల్లింపు రసీదులు, మొబైల్ నంబర్లు, ఇ–మెయిల్ ఐడీలు, ప్రొఫైల్ లింక్‌లతో సహా అన్ని ఆధారాలను భద్రపరచండి.→ వీలైనంత త్వరగా సైబర్‌క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేయాలి. లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి.→ నకిలీ ప్రొఫైల్ గురించి మాట్రిమోనియల్ ప్లాట్‌ఫామ్‌కు తెలియజేయండి. తద్వారా ఇతరులు మోసాల బారిన పడకుండా చూడవచ్చు.ఇలా అయితే అనుమానించాల్సిందే!→ నకిలీ లేదా ఏఐ రూపొందించిన ప్రొఫైల్‌ను గుర్తించే హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకూడదు. → వ్యక్తిగత వివరాలు తక్కువగా ఉన్న ప్రొఫైల్, అసాధారణంగా, అతి వివరాలు ఉన్న ప్రొఫైల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. → కొత్తగా పరిచయం అయిన వ్యక్తి సాధారణ ప్రశ్నలకు కూడా అస్పష్టమైన, పొంతన లేని సమాధానాలు ఇస్తే అనుమానించాలి. → లైవ్ వీడియో కాల్స్‌ను నిరాకరిస్తే, వ్యక్తిగతంగా కలవడానికి ‘నో’ చెబితే అనుమానించాల్సిందే. → పరిచయం అయిన కొద్దికాలంలోనే డబ్బు, బహుమతులు, వ్యక్తిగత సమాచారం అడిగినా, ‘ఇన్వెస్ట్ చేయండి’ అని సలహా ఇచ్చినా...వీటిని ప్రమాద సంకేతాలుగా పరిగణించాలి → కస్టమ్స్ చార్జీలు, వీసా సమస్యలు, వైద్య ఖర్చులు... మొదలైన వాటి పేర్లతో డబ్బు దండుకోవడానికి ప్రయత్నిస్తుంటారు → ఆన్లైన్ సంభాషణల ఆధారంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోకూడదు. -
లోకేష్ లవ్ చేసిన వాళ్లకి DSCలో 'L' లెటర్స్.. చంద్రశేఖర్ సెటర్లు..
-
కూన రవికుమార్, భరత్ బండారం బయటపెట్టిన వరుదు కళ్యాణి
-
పొంతనలేని వ్యాపారాలు.. అంతులేని మోసాలు
సాక్షి, విజయవాడ: మాషా అల్లాహ్ పేరిట పక్కా ప్లానింగ్‌తోనే పసుపులేటి అంకుశం మోసాలకు పాల్పడ్డాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడ సత్యనారాయణపురం కేంద్రంగా రూ.100 కోట్ల మేర దండుకుని ఆ తరువాత కంపెనీని మూసివేసిన విషయం విదితమే. కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన బాధితులు తమ నుంచి రూ.కోట్ల వసూలు చేసి ఉడాయించిన పసుపులేటి అంకుశం నుంచి డబ్బులిప్పించి న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటున్నారు.సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో సోమవారం సాయంత్రం నాటికి 630 మందికి పైగా బాధితులు ఫిర్యాదులు చేసినట్లు సమచారం. బాధితులు విజయవాడ కలెక్టరేట్లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్కు హాజరై తమకు న్యాయం చేయాలని కలెక్టర్ లక్ష్మీశ ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. ‘మీరు మోస పోయారు. ఇంత డబ్బులు ఇస్తాం అంటే నమ్మారు? కేసు నమోదు చేశారు కదా.. చూద్దాం’ అంటూ కలెక్టర్ చెప్పడంతో బాధితులు తిరుగుముఖం పట్టారు. కలెక్టర్ నుంచి ఆశించిన మేర భరోసా లభించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. భార్యతో కలిసి బీచ్‌లో రీల్స్.. మాషా అల్లాహ్ సంస్థ ఎండీ పసుపులేటి అంకుశం ఏజెంట్లు, కస్టమర్ల నుంచి డబ్బులతో జల్సాలు చేశాడు. భార్యతో కలిసి బీచ్‌లో స్టెప్పులు వేస్తూ రీల్స్ చేశాడు. బీర్ బాటిల్ చేతపట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చాడు. స్విమ్మింగ్ పూల్‌లో అమ్మాయిలతో కలిసి బీరు తాగుతూ విలాసంగా గడిపేవాడు. వీటన్నింటినీ రీల్స్ చేసి సుమ అంకుశం (ఇన్‌స్టా ఐడీ) పేరిట సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కార్యాలయంలో పని చేసే సిబ్బందిని సైతం ట్రిప్పులకు తీసుకెళ్లాడు. నిన్న మొన్నటి వరకు తమకు డబ్బులు చెల్లించాలంటూ బాధితులు పంపించిన వాట్సాప్ మెస్సేజులు చూసిన అంకుశం పరారీలో ఉన్నాడని, వెతుకుతున్నామని పోలీసులు చెబుతున్నారు. ఆ సామాజిక వర్గాన్నే టార్గెట్ చేశాడా? పసుపులేటి అంకుశం అత్యంత పకడ్బందీగా స్కాం చేశాడు. అతను ఏర్పాటు చేసిన సంస్థ పేరు మాషా అల్లాహ్. ఇలా పెట్టడం వెనుక ఒక సామాజికవర్గాన్ని టార్గెట్ చేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాధితుల్లో సైతం కడప, కర్నూలుకు చెందిన ముస్లిం మైనారిటీ సామాజిక వర్గం వారే అధికంగా ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వందలది మంది నుంచి రూ.100 కోట్ల మేర వసూలు చేసి మోసం చేసిన అంకుశంనకు రాజకీయ పలుకుబడి ఉందని పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లిన బాధితులను పోలీ సులు సైతం చిత్ర విచిత్ర ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.జీఎస్టీ క్లెయిమ్ చేసి.. రూ.కోట్లు కాజేసి..సత్యనారాయణపురంలోని ఓ నాలుగు అంతస్తుల భవంతిని పసుపులేటి అంకుశం అద్దెకు తీసుకుని మాషా అల్లాహ్ సంస్థను ప్రారంభించాడు. ఇక్కడి నుంచే కార్యకలాపాలన్నీ నడిపించాడు. సంస్థ సిబ్బందికి కూడా అనుమానం రాకుండా తన ఫ్యామిలీ చిత్తూరులో ఉందని నమ్మించాడు. మాషా అల్లాహ్ సంస్థ పేరిట జీఎస్టీ క్లెయిమ్ చేసుకున్నాడు. ముందు నుంచే ఎక్కడా తన వ్యక్తిగత విషయాలు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాడు. సంస్థలో ఎక్కువ మందిని చేరి్పంచిన వారికి గోల్డ్ కాయిన్ ఆఫర్ అంటూ తాయిలాలు ఎరచూపాడు. సోషల్ మీడియాలో ఏజెంట్ల ద్వారా తన బిజినెస్‌ను ప్రమోట్ చేసుకున్నాడు. స్కీమ్–1 నుంచి 4 వరకు స్క్రబ్, గ్రీన్ ప్యాడ్ మిషన్, సోనాలి రకం నాటుకోళ్ల పెంపకం, వాల్నట్స్ బిజినెస్ అంటూ ఒకదానికి ఒకటి పొంతన లేని వ్యాపారాలు ప్రారంభించాడు. ఏ బిజినెస్ అయినా ముందు రూ.30 వేలు, తరువాత రూ.లక్ష డిపాజిట్ కట్టాలని షరతు విధిస్తాడు. ఏజెంట్లు సైతం గుడ్డిగా నమ్మి... వారు కట్టడమే కాకుండా మరి కొంత మందితో డబ్బులు కట్టించారు. -
మా జగనన్న సీఎం అయ్యాక.. ఫస్ట్ ఓపెన్ చేసేది DSCఫైలే.. పేర్ని కిట్టు వార్నింగ్
-
ఉత్తర కుమారుడి ఛాలెంజ్ లు ఎందుకు? నీకు దమ్మూ, ధైర్యం ఉంటే లోకేష్‌కు కొడాలి నాని మాస్ వార్నింగ్
-
యువగళంలో నీతో ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చావంటే నీ నీచమైన బుద్ది ఇప్పుడే అర్థమైంది
-
ప్రభుత్వానికి పరాభవం తప్పదు... పదింతలు అనుభవిస్తారు
-
చంద్రబాబు సర్కార్ పిరికిపంద చర్య
సాక్షి, అమరావతి: డీఎస్సీ అక్రమాలను నిలదీస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలు కూటమి ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడిని పెంచాయి. అయితే ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ర్యాలీలను అడ్డుకోవడం, నేతలను అదుపులోకి తీసుకోవడం.. పలు చోట్ల లాఠీఛార్జీలు చేయడంపై వైఎస్సార్సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నిరసనలను అడ్డుకోవడం చంద్రబాబు ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు.డీఎస్సీ నియమకాల్లో జరిగిన అవినీతికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయడం, ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ అభ్యర్థులు, డీఎస్సీ సంఘాలతో వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పలుచోట్ల పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదంటూ అడ్డుకునే ప్రయత్నం చేశారు.పులివెందులలో లాఠీఛార్జ్.. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నియోజకవర్గంలో పోలీసులు దౌర్జన్యకాండకు పాల్పడ్డారు. పులివెందులలో ఆర్డీవోకు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన వైఎస్సార్సీపీ శ్రేణులపై లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో పలువురికి గాయాలు కాగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు వినిపించాయి. అంతకు ముందు.. ఎంపీ అవినాశ్‌రెడ్డికి ర్యాలీ నిర్వహించడానికి వీల్లేదంటూ పోలీసులు నోటీసులు అందించారు.చీపురుపల్లిలో బొత్సకు అడ్డంకులుచీపురుపల్లిలో నిర్వహించాల్సిన నిరసన కార్యక్రమానికి వెళ్తున్న సీనియర్ నేత, మండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణను పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉన్నప్పటికీ పోలీసులు అడ్డుకోవడం సరికాదని బొత్స మండిపడ్డారు. రోడ్డుపైనే ఆయన ఆందోళన చేపట్టారు. కొడాలి నాని హౌస్ అరెస్ట్‌మాజీ మంత్రి కొడాలి నానిని గుడివాడ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. డీఎస్సీ అంశంపై నిరసనల్లో పాల్గొనకుండా ముందస్తుగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ పరిణామంపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు మండిపడుతున్నారు.అటు రాజమండ్రిలోనూ మాజీ ఎంపీ భరత్ ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతుండగా.. పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై ఆయన మండిపడ్డారు. విశాఖలో అరెస్టులువిశాఖపట్నంలోని మారియట్ సెంటర్ వద్ద నిరసనకు ప్రయత్నించిన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. కేకే రాజు సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.విజయవాడలో దేవినేని ర్యాలీకి అడ్డంకులువిజయవాడలో దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనుమతి లేదంటూ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ శ్రేణులు బారికేడ్లు దాటేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.అవనిగడ్డలోనూ అడ్డగింతఅవనిగడ్డలోనూ వైఎస్సార్సీపీ నేతల నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల సమస్యలపై గొంతెత్తే హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించింది.తిరుపతిలో భూమన కరుణాకర్‌రెడ్డి నేతృత్వంలో.. గన్నవరంలో వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో ర్యాలీలు జరుగుతున్నాయి. నెల్లూరు, కర్నూల్, అనంతపురం, అవనిగడ్డ.. ఇలా పలు చోట్ల వైఎస్సార్సీపీ ర్యాలీలు నిర్వహించకుండా పోలీసులు అడ్డుపడుతున్నారు. నిరసన తెలియజేస్తున్న వాళ్లపైకి లాఠీ ప్రయోగిస్తున్నారు.‘శాంతియుత నిరసనలకు ఎందుకు అభ్యంతరం?’డీఎస్సీ అంశంపై శాంతియుతంగా ర్యాలీలు నిర్వహిస్తే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, దాన్ని అడ్డుకోవడం సరికాదని అన్నారు. -
అనంత పోలీసుల దౌర్జన్యం.. రోడ్డుపైనే పెద్దిరెడ్డి బైఠాయింపు
సాక్షి, అనంతపురం: ఏపీలో దగా డీఎస్సీపై ప్రజాపోరు కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ ఆధర్వ్యంలో పోరాటం ఉధృతమైంది. అయితే శాంతియుతంగా నిర్వహిస్తున్న ర్యాలీలను మాత్రమే కాదు.. ఈ దౌర్జన్యకాండను నిలదీస్తున్న వైఎస్సార్సీపీ నేతలను సైతం పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం తాడిపత్రి నియోజకవర్గం ముచ్చుకోట వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాడిపత్రిలో ఇవాళ యువత ర్యాలీకి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఏర్పాట్లు చేశారు. అయితే పోలీసులు మాత్రం అధికార టీడీపీ కార్యక్రమం ఉందంటూ ఆ ర్యాలీని అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాడిపత్రికి బయల్దేరారు. మార్గమధ్యంలో ముచ్చుకోట వద్ద పోలీసులు ఆయన్ని అడ్డుకోవడంతో.. ఆయన రోడ్డుపైనే బైఠాయించి ఆయన నిరసన తెలియజేశారు. పోలీసులను నిలదీసిన పెద్దిరెడ్డిశాంతియుతంగా నిర్వహించే కార్యక్రమాలను ఎలా అడ్డుకుంటారని పోలీసులను పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీసులతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు.. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది.డీఎస్సీ అంశంపై ప్రభుత్వంపై విమర్శలుసాక్షితో మాట్లాడిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. వైఎస్సార్సీపీ ర్యాలీలను అడ్డుకోవడం దుర్మార్గమని ఆరోపించారు. “మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ ఎందుకు జరపడం లేదు? మంత్రి లోకేశ్ కనుసన్నల్లోనే డీఎస్సీలో అక్రమాలు జరిగాయి. నైతిక బాధ్యతగా ఆయన రాజీనామా చేయాలి” అని డిమాండ్ చేశారు.హైవేపై బైఠాయింపుపోలీసుల తీరుకు నిరసనగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు అనంతపురం-తాడిపత్రి హైవేపై బైఠాయించారు. పోలీసుల వ్యవహారశైలిపై నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నేతలు వెంకటరెడ్డి, విశ్వేశ్వర్‌రెడ్డి కూడా పోలీసుల తీరును తప్పుబట్టారు. శాంతియుత కార్యక్రమాలను అడ్డుకోవడం సరికాదని మండిపడ్డారు. -
Watch Live: DSC అక్రమాలపై కదం తొక్కిన YSRCP
-
నువ్వేం మంత్రివయ్యా! పేకాటలో గెలిస్తే గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చేస్తారా..?
-
క్వాంటమ్ వ్యాలీలో సిండికేట్ స్కామ్!
సాక్షి, అమరావతి: రాజధాని పనుల టెండర్లలో అక్రమాలు యధేచ్ఛగా సాగుతున్నాయి. క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్ల నిర్మాణ పనుల్లో కుమ్మక్కుతో స్కామ్‌కు పునాదులు పడ్డాయి. చదరపు అడుగుకు రూ.1,348.06 చొప్పున అదనపు ప్రయోజనం చేకూర్చుతూ.. ప్రజాధనాన్ని దోచిపెడుతూ ముఖ్యనేత సిండికేట్ కాంట్రాక్టు సంస్థ ఎల్ అండ్ టీకే ట్విన్ టవర్ల పనులను ప్రభుత్వం కట్టబెట్టింది. ట్విన్ టవర్ల నిర్మాణ పనులకు రూ.958.40 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి.. రెండేళ్లలో పూర్తి చేసి, మరో మూడేళ్లు నిర్వహించాలనే నిబంధనతో ఏజీఐసీఎల్ (అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్) టెండర్లు నిర్వహించింది. కాంట్రాక్టు విలువ కంటే 4.60 శాతం అధిక ధరకు అంటే రూ.1,002.49 కోట్లకు కోట్ చేసిన ఎల్ అండ్ టీ ఎల్–1గా నిలిచింది. అదే సంస్థకు పనులు అప్పగించడానికి అనుమతి ఇవ్వాలంటూ ఏజీఐసీఎల్ చేసిన ప్రతిపాదనపై ఈనెల 4న సీఆర్డీఏ 64వ సమావేశం ఆమోదముద్ర వేసింది. సీఆర్డీఏ కమిషనర్ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీని వల్ల ఖజానాపై రూ.44.09 కోట్లు అదనంగా భారం పడుతుంది. ఇక మరో రూ.178.1 కోట్లను జీఎస్టీ, సీనరేజీ, మెరిట్, తదితర పన్నుల రూపంలో రీయింబర్స్ చేస్తామని ప్రభుత్వం టెండర్లో పేర్కొంది. అంటే.. ఈ పనుల కాంట్రాక్టు విలువ రూ.1,180.59 కోట్లకు చేరుకుంది. 4.83 ఎకరాల్లో ట్విన్ టవర్స్రాజధాని అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కనే పిచ్చుకలపాలెం వద్ద క్వాంటమ్ వ్యాలీలో 4.83 ఎకరాల్లో ట్విన్ (జంట) టవర్ల నిర్మాణ పనులను ఏజీఐసీఎల్ చేపట్టింది. ఒక్కో టవర్‌ను బీ+జీ+47 అంతస్తులతో నిర్మించాలని నిర్దేశించింది. బీ+జీ నుంచి నాలుగో అంతస్తు వరకూ ఒక్కో అంతస్తును 5 మీటర్లు.. అక్కడి నుంచి 47వ అంతస్తు వరకూ ఒక్కో అంతస్తు 4.2 మీటర్ల ఎత్తుతో నిర్మించాలని నిర్ణయించారు. పార్కింగ్ ఏరియాతో పాటు ఒక్కో టవర్ నిర్మిత ప్రాంతం 1,53,708 చదరపు మీటర్లు. రెండు టవర్ల నిర్మిత ప్రాంతం 3,48,406 చదరపు మీటర్లు (37,50,210 చదరపు అడుగులు). అంటే ఒక్కో చదరపు అడుగు నిర్మాణానికి నిర్ణయించిన కాంట్రాక్ట్ విలువ రూ.3,148.06. అదీ కేవలం పునాదులు, పిల్లర్లు, బీమ్‌లు, లిప్ట్‌లు, షాప్్టలతో కూడిన భవనం మాత్రమే. ఈ స్థాయి నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.1,800లకు మించి వ్యయం కాదని ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంటే.. చదరపు అడుగుకు రూ.1,348.06 చొప్పున అదనంగా చెల్లించేలా కాంట్రాక్టు పనులు అప్పగించినట్లు వెల్లడవుతోంది. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. -
ఏపీలో కొనసాగుతున్న టీడీపీ రాక్షస క్రీడ
సాక్షి, అమరావతి: డీఎస్సీ అవకతవకలపై వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కూటమి ప్రభుత్వానికి వణుకు పుట్టిస్తున్నాయి. నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేశ్ రాజీనామా చేయాలని, అలాగే సీబీఐతో దర్యాప్తు చేయించాలనే డిమాండ్లకు ఇటు డీఎస్సీ అభ్యర్థులు, సంఘాలు కూడా మద్దతు ప్రకటిస్తున్నాయి. దీంతో కూటమి పెద్దలు ఏం చేయాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో దుష్ట రాజకీయానికి తెర తీశారు. ఏపీవ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో.. ఇవాళ రెండో రోజు కూడా పలు చోట్ల దీక్షను భగ్నం చేసే కుట్రలు కొనసాగుతున్నాయి. ఓవైపు పోలీసుల రూపంలో ఆటంకాలు కలిగిస్తున్న కూటమి ప్రభుత్వం.. మరోవైపు టీడీపీ గూండాలతో దౌర్జన్యకాండకు దిగుతోంది. ఈ రాక్షస క్రీడపై వైఎస్సార్సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. డీఎస్సీ వ్యవహారంపై దెందులూరు నియోజకవర్గం మాదేపల్లిలో వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్ష చేపట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిని పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటికే పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారని ఆ పార్టీ నేతలు తెలిపారు. మాదేపల్లిలో ఏర్పాటు చేసిన దీక్షా టెంట్‌ను టీడీపీ గూండాలు తొలగించారని తెలుస్తోంది. ఆపై వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించగా.. అబ్బయ్య చౌదరి నేలపై బైఠాయించి నిరసన కొనసాగించారు.తునిలో ఎండలోనే దీక్షలుకాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న రిలే దీక్షల టెంట్లను పోలీసులు తొలగించారు. రాత్రి కార్పొరేషన్ బ్యాంక్ సమీపంలో ఏర్పాటు చేసిన టెంట్‌ను, అనంతరం ఉదయం జియో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మరో టెంట్‌ను తొలగించినట్లు తెలిపింది. టీడీపీ నేతల సూచనతోనే పోలీసులు ఈ పని చేశారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. అయితే టెంట్లు తొలగించినా వెనక్కి తగ్గేది లేదని వైఎస్సార్సీపీ శ్రేణులు స్పష్టం చేశాయి. ఎండలోనే బైఠాయించి తమ నిరసన కొనసాగిస్తున్నారు.విజయవాడ వెస్ట్‌లో ఉద్రిక్తత!విజయవాడ వెస్ట్‌లో వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న రిలే దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ నేత బుద్ధా వెంకన్న దీక్షా ప్రదేశానికి చేరుకుని వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా నినాదాలు చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న కార్యకర్తలను రెచ్చగొట్టి గొడవ సృష్టించే ప్రయత్నం చేశారు. నిన్న మల్లాది విష్ణు ఆధ్వర్యంలో జరిగిన దీక్ష వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నది తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా అక్కడికి రావడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. మహిళలపై దాడులు జరగ్గా.. బోండా అనుచరుడు ఒకడు జుగుప్పాసకంగా వ్యవహరించాడు. మహిళా జర్నలిస్టుల మీద దాడి జరుగుతున్నా కూడా.. పోలీసులు చూస్తూ ఉండిపోయారు.కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా.. టీడీపీ శ్రేణులు ఎంత బరితెగించినా వైఎస్సార్సీపీ శ్రేణులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవినీతి, అవకతకవలకు నారా లోకేశ్ కచ్చితంగా రాజీనామా చేయాలని, జాతీయ దర్యాప్తు సంస్థతో ఈ వ్యవహారంపై విచారణ జరిపించాల్సిందేనని పట్టుబడుతోంది. -
చంద్రబాబును ఇమిటేట్ చేస్తూ... నువ్వు నీ అన్న అందగాళ్లే..
-
1000కోట్ల భారీ సైబర్ స్కాం ప్రధాన నిందితుడు అరెస్ట్. బయటపడ్డ సంచలన విషయాలు..!
-
అరాచక ప్రదేశ్‌లో బాబు సర్కార్.. నూకలు చెల్లాయ్
సాక్షి, కృష్ణా/తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ అక్రమాల ఆరోపణలపై కొనసాగుతున్న రాజకీయ వేడి మరింత పెరిగింది. గురువారం విజయవాడలో వైఎస్సార్సీపీ దీక్షా శిబిరంపై జరిగిన దాడి ఘటనను ప్రస్తావిస్తూ మాజీ మంత్రి పేర్ని నాని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బాబు ప్రభుత్వానికి నూకలు చెల్లాయని, తప్పుడు పనులు, రౌడీయిజానికి ప్రజలు త్వరలోనే సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు.కృష్ణాడెల్టాకు సాగునీరు ఇవ్వాలని కోరుతూ అవనిగడ్డలో పులిగడ్డ ఆక్విడెక్ట్ వేదికగా మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ నిరాహారదీక్ష చేపట్టారు. ఈ దీక్షకు సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి పేర్నినాని అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘బోండా ఉమా అధికార మదంతో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు శిబిరంపై దాడి చేశారు. దీక్షా శిబిరంలో కోడిగుడ్లు విసరడం, షామియానాలు ధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. అధికార పార్టీ నేతలు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారు అని మండిపడ్డారు.“బోండా ఉమా లాంటి వంద మంది రౌడీలను పోగేసుకుని చంద్రబాబు, లోకేష్ శునకానందం పొందొచ్చు. కానీ ఆ ఆనందం ఎన్నో రోజులు ఉండదు. మీ పాపాలన్నీ శిశుపాలుడి పాపాల మాదిరిగా లెక్కిస్తున్నారు” అంటూ పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు.ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఇంటికొచ్చి కొడతామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారన్న ఆయన.. “మీ చేతనైంది చేసుకోండి.. ఎంతమందిని కొడతారో చూస్తాం” అంటూ సవాల్ విసిరారు. దాడులతో తమకు జరిగే నష్టం ఏమీ లేదని, ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని అన్నారు. ఈ క్రమంలో బోండా ఉమాను ఉద్దేశించి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “మీ కార్యకర్తలే మీ ఇళ్లకు వచ్చి ప్రశ్నించకుండా చూసుకోండి” అంటూ హెచ్చరించారు. అధికార దర్పంతో చేసే చర్యలకు ప్రజలు తగిన సమాధానం చెబుతారని పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్‌ను అరాచక ప్రదేశ్‌గా మార్చారు: లేళ్ల అప్పిరెడ్డిఇటు విజయవాడ ఘటనపై తాడేపల్లిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కూడా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను అరాచక ప్రదేశ్‌గా మార్చారని, అక్రమాలు, అన్యాయాలకు కేంద్రంగా మారిందని ఆరోపించారు. డీఎస్సీ అక్రమాలపై శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై దాడులు చేయడం దారుణమని అన్నారు. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలోనే ఎమ్మెల్యే బోండా ఉమా దాడులకు దిగారని ఆరోపించారు. దీక్షా శిబిరంలో మహిళలు, విద్యార్థులపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు.ఆందోళనకారులపై మూత్రం పోశారనే ఆరోపణలను ప్రస్తావిస్తూ.. ఇది అత్యంత నీచమైన చర్య అని విమర్శించారు. పోలీస్ కమిషనర్ కార్యాలయానికి సమీపంలోనే ఘటన జరగడం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతోందని అన్నారు. దాడి చేసిన వారిని వదిలి.. మల్లాది విష్ణును అరెస్ట్ చేశారని, పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తుందని, అందుకే తమ కార్యకర్తలు సంయమనం పాటిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో బెదిరింపులు, దాడులకు భయపడబోమని స్పష్టం చేశారు.డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలికితే న్యాయపోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. -
లోకేశ్ ఆదేశాలు.. పోలీసులు సమక్షంలో రెచ్చిపోతున్న టీడీపీ గూండాలు
డీఎస్సీ-2025 నియామకాల్లో అవకతవకలు, పేపర్ లీకేజీ వ్యవహారాలపై వైఎస్సార్సీపీ పోరుబాట చేపట్టింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసన దీక్షలను అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దించింది కూటమి ప్రభుత్వం. అయినప్పటికీ పలు జిల్లాల్లో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.. YSRCP DSC Porubata Updatesఏపీలో జంగిల్రాజ్వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్షలను భగ్నం చేసేందుకు కూటమి సర్కార్ యత్నంపోలీసుల సమక్షంలోనే కొనసాగుతున్న దౌర్జన్యకాండవైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడుతున్న టీడీపీ గూండాలుకీలక నేతలు దీక్షా శిబిరాలకు వెళ్లకుండా అడ్డగింతపోలీసుల సమక్షంలోనే దీక్షా టెంట్లను పీకేస్తున్న టీడీపీ శ్రేణులుఅడ్డుపడుతున్న వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులుపలు నియోజకవర్గాల్లో తీవ్ర ఉద్రిక్తతలువిజయవాడలో అమానుషం.. అత్యంత నీచంగా వ్యవహరించిన బోండా ఉమా అనుచరులుదీక్షా శిబిరం పైనుంచి మూత్రం పోసిన బోండా అనుచరుడుమహిళలపై సైతం దాడులకు పాల్పడుతున్న టీడీపీ రౌడీలుబోండా ఉమా దౌర్జన్యం.. దాడికి యత్నండీఎస్సీ పరీక్షల్లో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ముత్యాలపాడులో వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైసీపీ కార్యకర్తలు దీక్షల్లో పాల్గొన్నారు. దీక్ష శిబిరాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ధ్వంసం చేశారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వైస్సార్సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. టీడీపీ నాయకులు గుడ్లు విసిరి దాడులకు పాల్పడ్డారు. అనంతపురం జిల్లా యాడికిలో ఉద్రిక్తతడీఎస్సీ అక్రమాలపై యాడికి మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ నేతలు చేపట్టిన నిరసన దీక్ష ఉద్రిక్తతకు దారితీసింది. దీక్షా శిబిరాన్ని టీడీపీ నేతలు తొలగించారు. జేసీ వర్గీయుల కవ్వింపు చర్యలతో పాటు దౌర్జన్యం జరిగిందని తెలిపింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారని పేర్కొంది. ఈ ఘటనను వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్రంగా ఖండించారు.ఏలూరు జిల్లాలో.. డీఎస్సీ-2025 అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కైకలూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఏలూరు రోడ్డులో నిర్వహించిన దీక్షలకు జిల్లా అధ్యక్షుడు, కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో యువజన, విద్యార్థి విభాగాల నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. డీఎస్సీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు చెల్లించాలని, నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేశారు.పులివెందులలో.. కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో అక్రమాలు జరిగాయని వైఎస్సార్ జిల్లా పులివెందులలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద నాలుగు రోజుల పాటు దీక్షలు కొనసాగనున్నాయి. దీక్షలో కూర్చున్న డీఎస్సీ అభ్యర్థులు, వైఎస్సార్సీపీ నాయకులకు పూలమాలలు వేసి పార్టీ నేత వైఎస్ మధురెడ్డి దీక్షలను ప్రారంభించారు.రేపల్లెలో ఉద్రిక్తత..డీఎస్సీ స్కామ్‌కు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రేపల్లె తాలూకా సెంటర్లో వైఎస్సార్సీపీ నిరసన దీక్ష చేపట్టింది. నియోజకవర్గ సమన్వయకర్త పీటా మోహన్‌కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పీటా మోహన్‌కృష్ణను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.అనంతపురం జిల్లాలో.. మెగా డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ఈ దీక్షల్లో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. డీఎస్సీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని, నిరుద్యోగులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా పార్టీ నేతలు డిమాండ్ చేశారు.శ్రీ సత్యసాయి జిల్లాలో..డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ధర్మవరంలో వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన దీక్షల్లో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు. డీఎస్సీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు.ఎన్టీఆర్ జిల్లాలో జెన్‌జీ నిరసనలుతిరువూరు నియోజకవర్గ కేంద్రం బోసుబొమ్మ సెంటర్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఏపీ జెన్-జెడ్ రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. యువజన, విద్యార్థి విభాగాల నాయకులు, పార్టీ నేతలు దీక్షలో పాల్గొన్నారు. నియోజకవర్గ ఇన్చార్జి నల్లగట్ల స్వామిదాస్ పూలమాలలు వేసి దీక్షలను ప్రారంభించారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని, స్పోర్ట్స్ కోటాలో అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగులకు రూ.3 వేల భృతి అందించాలని డిమాండ్ చేశారు.వైఎస్సార్ జిల్లాలో..2025లో జరిగిన డీఎస్సీ అక్రమాలపై జమ్మలమడుగులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మైలవరం మండలానికి చెందిన విద్యార్థులు దీక్షలో పాల్గొనగా, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వారికి సంఘీభావం తెలిపారు. డీఎస్సీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు.ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న దీక్షలు.. నేటి నుండి వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్షలురాష్ట్రమంతటా అన్ని నియోజకవర్గాల్లో కొనసాగుతున్న దీక్షలుడీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని.. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ఇప్పటికే పలు రూపాల్లో నిరసనలు తెలిపిన వైఎస్సార్సీపీకలెక్టర్లకు వినతి పత్రాలు, నిరసన ప్రదర్శనలు, టౌన్ హాలు సమావేశాలుఈరోజు నుండి 9 వరకు నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలుప్రభుత్వం స్పందించకుంటే 10న పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలకు నిర్ణయంనంద్యాల జిల్లాలో.. ఆత్మకూరు ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్ష చేపట్టింది. దీక్షలో శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలు, అమలు కాని నిరుద్యోగ భృతి, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని శిల్పా చక్రపాణిరెడ్డి డిమాండ్ చేశారు.నెల్లూరు జిల్లాలో..కోవూరులో వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి రాష్ట్ర పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, ఆయన కుమారుడు రజిత్‌రెడ్డి దీక్షలో కూర్చున్నారు. మెగా డీఎస్సీ స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలని, డీఎస్సీ లీకేజీ వ్యవహారంలో మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి వెంటనే అందించాలని కోరారు.తిరుపతిలో భూమన నేతృత్వంలో దీక్షలు..మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలో వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట భూమన కరుణాకరరెడ్డి, భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన దీక్షల్లో నిరుద్యోగులు, పార్టీ యువజన, విద్యార్థి విభాగాల నాయకులు పాల్గొన్నారు. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆధారాలతో సహా వెల్లడించినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా యువత రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారని, డీఎస్సీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.గురజాలలో పోలీసుల ఓవరాక్షన్డీఎస్సీ స్కాంపై లోకేష్ రాజీనామా చేయాలని బ్రహ్మనాయుడు సర్కిల్లో రిలే దీక్ష దీక్షకు సిద్ధమైన వైఎస్సార్సీపీ యువజన విద్యార్థి విభాగందీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేస్తే ఊరుకోమని హుకుం జారీ చేసిన పోలీసులుకనీసం దీక్ష శిబిరం ఏర్పాటు కూడా చెయ్యనివ్వని పోలీసులుదీక్ష శిబిరానికి సంబంధించిన టెంటును వెనుక పంపిచేసిన పోలీసులుబాపట్ల జిల్లా వేమూరులో.. అమృతలూరులో పోలీసుల ఓవరాక్షన్డీఎస్సీ స్కాంపై లోకేష్ రాజీనామా చేయాలని దీక్ష చేయడానికి రెడీ యువజన విభాగ నాయకులుదీక్షా శిబిరాన్ని తొలగించడానికి ప్రయత్నించిన పోలీసులుఅడ్డుకున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు.. ఉద్రిక్తతమాచర్లలో దీక్షకు అడ్డంకులుపల్నాడు జిల్లా మాచర్లలో డీఎస్సీ అక్రమాలపై నిరసనగా దీక్ష చేపట్టేందుకు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సొంత స్థలం వద్ద శిబిరం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే పోలీసులు అక్కడికి చేరుకుని ఏర్పాట్లను అడ్డుకున్నారు. “మా సొంత స్థలంలో దీక్ష చేసుకుంటాం.. దానికి కూడా అనుమతి లేదా?” అంటూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసులను ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నప్పుడు తమ దీక్షను మాత్రమే ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు.గుంటూరులో టెంట్ తొలగింపుగుంటూరు జిల్లాలోనూ డీఎస్సీ వ్యవహారంపై నిరాహార దీక్షలకు వైఎస్సార్సీపీ నేతలు సిద్ధమయ్యారు. పొన్నూరులో తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్షా శిబిరం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారని ఆ పార్టీ నేతలు తెలిపారు. శిబిరానికి వేసిన టెంట్‌ను పోలీసులు తొలగించారని మండిపడ్డారు. కనిగిరిలోనూ ఉద్రిక్తతమార్కాపురం జిల్లా కనిగిరిలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఏర్పాటు చేసిన రిలే దీక్ష శిబిరాన్ని పోలీసులు తొలగించారు. పట్టణంలో సాధారణంగా ధర్నాలు నిర్వహించే ప్రదేశంలోనే టెంట్ ఏర్పాటు చేశామని, అయినప్పటికీ డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు వచ్చి తొలగించారని పేర్కొన్నారు. డీఎస్సీ అక్రమాలపై శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ప్రయత్నిస్తున్న జెన్‌జీ విద్యార్థులను అడ్డుకోవడం సరికాదని వైఎస్సార్సీపీ కనిగిరి ఇన్చార్జి ధద్దాల నారాయణ యాదవ్ విమర్శించారు.డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ రణభేరిడీఎస్సీ-2025 నియామకాల్లో పారదర్శకత లేదంటున్న వైఎస్సార్సీపీ.. విద్యార్థులు, డీఎస్సీ అభ్యర్థులు, వివిధ సంఘాలతో కలిసి ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయించింది. పార్టీ నేతలు ఈ పోరాటానికి మద్దతు ప్రకటించారు. ఈ నెల 10న విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించేందుకు కూడా సిద్ధమయ్యారు.మరోవైపు.. ఈ నిరసనల నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం అప్రమత్తమై పోలీసులను రంగంలోకి దించడం గమనార్హం. నిరసనలను అణచివేసేందుకు అధికార యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నారని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. -
లోకేష్ కాసుకో.. GEN-J రెడీ.. నువ్వు ఎలా రాజీనామా చెయ్యవో చూస్తాం వంగవీటి నరేంద్ర సవాల్
-
Vijayawada: నారా లోకేష్ పై దండయాత్ర
-
యాపిల్ యాప్ స్టోర్ ఇండియా హెడ్‌పై కేసు
సాక్షి, హైదరాబాద్: ట్రేడింగ్ స్కామ్‌లో రూ. 12.7 లక్షలు కోల్పోయిన ఓ రిటైర్డ్ ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు యాపిల్ యాప్ స్టోర్స్ ఇండియా హెడ్‌ను నిందితుడిగా చేర్చారు. సోమాజీగూడకు చెందిన బాధితుడు ఇన్‌స్ట్రాగామ్ ద్వారా జే–బారా మొబైల్ ట్రేడింగ్ యాప్ ప్రకటనకు ఆకర్షితుడై యాప్ ప్రతినిధిగా చెప్పుకున్న సోనల్ జగన్నాథ్ నాయక్‌ను ఫోన్లో సంప్రదించాడు. యాప్ స్టోర్‌కు సంబంధించిన ఓ లింకును వాట్సాప్ ద్వారా పంపిన నాయక్.. ఆ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలని బాధితుడికి సూచించాడు.అలాగే జూలియస్ బేర్ దలాల్ వ్యూ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూపులోనూ బాధితుడిని చేర్చాడు. దాని అడ్మిన్‌గా ఉన్న కునాల్ సుమయ అనే మహిళ బాధితుడికి పెట్టుబడులపై సలహాలు ఇచ్చింది. దీంతో బాధితుడు దశలవారీగా మొత్తం రూ. 12.7 లక్షలు పెట్టుబడి పెట్టగా యాప్‌లో ఆయన పెట్టుబడి విలువ రూ. 25.42 లక్షలకు పెరిగినట్లు చూపింది. కానీ పెట్టుబడి లక్ష్యాన్ని చేరుకోలేదంటూ ఆ ట్రేడింగ్ ఖాతాను నిందితులు బ్లాక్ చేశారు. ఆ తర్వాత కునాల్ సుమయ సహాయకురాలినని చెప్పుకున్న సోనాల్ జగన్నాథ్ నాయక్ అనే వ్యక్తి.. తాము డిమాండ్ చేసిన మొత్తం చెల్లించాలని డిమాండ్ చేయడంతో తాను మోసపోయినట్లు బాధితుడు గుర్తించాడు.వెంటనే సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. ఇందులో యాపిల్ ప్లే స్టోర్ పైనా ఆరోపణలు చేశారు. సదరు ట్రేడింగ్ యాప్ అందులో ఉన్నందునే తాను నమ్మానని పేర్కొన్నాడు. దీంతో యాపిల్ స్టోర్ హెడ్‌ను సైతం పోలీసులు నిందితుడిగా చేర్చారు. మరోవైపు రూ. 29.,25 లక్షలు కోల్పోయి ఖైరతాబాద్‌కు చెందిన ఓ సేల్స్‌మన్ ఇచ్చిన ఫిర్యాదుతో నమోదైన మరో కేసులోనూ జగన్నాథ్ నాయక్, కునాల్ నిందితులుగా ఉన్నారు. -
పాత నాణేలు కొనేస్తామంటూ.. మహిళా ఎన్నారైకి బిగ్ షాక్!
సాక్షి, హైదరాబాద్: పాత నాణేలను భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేస్తామంటూ ఇన్‌స్ట్రాగామ్ ద్వారా ప్రచారం చేసిన ఓ ముఠా నగరానికి చెందిన ప్రవాస భారతీయురాలి నుంచి రూ.71.8 లక్షలు కాజేసింది.అమెరికాలో నివసిస్తున్న ఓ మహిళ (73) జనవరిలో ఇన్‌స్టాలో.. పురాతన నాణేలు కొంటామనే ప్రకటన చూశారు. 1947 జార్జ్–6 కింగ్ ఎంపరర్ నాణెం ఫొటో, ఓ ఫోన్ నంబర్‌ను కేటుగాళ్లు పోస్టు చేశారు. నాణెం విలువ రూ.27 లక్షలుగా పేర్కొన్నారు. దీంతో ఎన్నారై మహిళ తన వద్ద ఉన్న మూడు 1947 జార్జ్–6 నాణేలు, రెండు 20 పైసల ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‘ నాణేల ఫొటోలు పంపారు.మోసగాళ్లు ఒక్కో 1947 నాణెం విలువ రూ.27 లక్షలుగా, ఒక్కో 20 పైసల నాణెం విలువ రూ.12 లక్షలుగా ఖరారు చేస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. రకరకాల పేర్లతో పలు దఫాలుగా రూ.71,80,950 వసూలు చేసినా వేధింపులు ఆపలేదు. దీంతో ఆమె నగరానికి చెందిన వ్యక్తికి జీపీఏ ఇచ్చి సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేయించడంతో కేసు నమోదైంది. -
డీఎస్సీ స్కామ్‌పై పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
సాక్షి, అమరావతి: డీఎస్సీ స్కామ్, నిరుద్యోగ యువతకు జరుగుతున్న అన్యాయం, ఫీజుల బకాయిల చెల్లింపు వంటి ప్రజా సమస్యలపై పార్టీ చేపట్టిన ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతం చేయాలని వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు నిచ్చారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్లమెంటు పరిశీలకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు(కో–ఆర్డినేషన్), రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు (కో–ఆర్డినేషన్), అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులకు సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో దిశానిర్దేశం చేశారు. జూలై 31న జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించడం నుంచి ప్రారంభించి, టౌన్‌హాల్ సమావేశాలు, రిలే నిరాహార దీక్షలు, భారీ ర్యాలీల వరకు పార్టీ ప్రకటించిన కార్యాచరణను విజయవంతం చేయాలన్నారు. డీఎస్సీ అంశం ప్రతి విద్యార్థి, ప్రతి నిరుద్యోగ యువకుడికి సంబంధించినదని, అందుకే ఇది కేవలం పార్టీ కార్యక్రమంగా కాకుండా యువత ఉద్యమంగా మారాలన్నారు. కాలేజీలు, యూనివర్సిటీలు, కోచింగ్ సెంటర్లు అన్ని చోట్లా విద్యార్థులను చైతన్యపరచాలన్నారు. డీఎస్సీ అభ్యర్థులను నేరుగా కలుసుకొని టౌన్‌హాల్ సమావేశాలు, రిలే నిరాహార దీక్షలు, ర్యాలీల్లో భాగస్వాములను చేయాలన్నారు. బాధితులే మాట్లాడేలా వేదిక కల్పిస్తే ఉద్యమానికి మరింత బలం వస్తుందని సజ్జల స్పష్టం చేశారు.ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలిటౌన్హాల్ సమావేశాలు కేవలం పార్టీ సమావేశాలుగా కాకుండా సమాజ చర్చలుగా కనిపించాలన్నారు. విద్యావేత్తలు, రిటైర్డ్ అధ్యాపకులు, సామాజిక కార్యకర్తలు, వివిధ సంఘాల ప్రతినిధులు, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగ యువత పాల్గొనేలా చూడాలన్నారు. రిలే నిరాహార దీక్షల సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు, స్కిట్ల ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు. అలాగే, ఎస్ఐఆర్ ప్రక్రియ, ఏఎస్డీ జాబితాలు, అన్మ్యాప్డ్ ఓటర్లు, ఫారమ్6, ఫారమ్7, డూప్లికేట్ ఓట్ల అంశాలను ప్రతి నియోజకవర్గంలో జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. బీఎల్వోలతో సమన్వయం కొనసాగిస్తూ అవసరమైతే అభ్యంతరాలు దాఖలు చేయాలన్నారు. -
ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ కుంభకోణంపై జెన్‌జీ వార్...
-
కదిలిన YSRCP యువత.. లోకేష్ వెన్నులో వణుకు.. రాజీనామా చేస్తాడా..?
-
చంద్రబాబులో టెన్షన్.. ఏపీలో యువత తిరుగుబాటు.. లోకేష్ రాజీనామా?
-
అసలు మెగా DSC స్కామ్ ఎలా బయటపడిందంటే.. విద్యార్థుల కళ్ళు తెరిపించే వీడియో..
-
ఢిల్లీ సీన్ రిపీట్.. జగన్ కు సవాల్ విసరడం కాదు.. దమ్ముంటే డిబేట్ కు రా
-
జగన్ ప్రశ్నకు సమాధానం చెప్పే ధైర్యం లేదు..! నీకు మంత్రి పదవి అవసరమా..?
-
YSRCP LIVE : YSRCP భారీ ర్యాలీ..
-
నైతిక బాధ్యతతో లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి
-
Dsc పరీక్షలో అవకతవకలు జరిగాయి.. స్కామ్ ని పిన్ టూ పిన్ వివరించిన నాగార్జున యాదవ్
-
ధర్మేంద్ర ప్రధాన్ సంగతి ఓకే.. పేపర్ లీకేష్ లోకేష్ రాజీనామా ఎప్పుడు?
-
నందుతో మాట్లాడితే చెప్పిన మొదటి మాట ఇదే!
-
దొరికినంత దోచుకో.. తోటి పోలీసుల సొమ్ముతో కారు, బంగ్లా..!
దొరికినంత దోచుకో.. దోచుకుంది దాచుకో..కారు, బంగ్లా తీసుకో.. లైఫు నీదే కుమ్ముకో.. ఓ సినిమా పాటలోని అర్థాన్ని కానిస్టేబుల్ రవి తన జీవితాన్ని అన్వయించుకున్నాడు. ఎంచక్కా తోటి సిబ్బంది సొసైటీ ఖాతాల్లోని డబ్బులతో జల్సా చేస్తున్నాడు. కడప అర్బన్: శాంతిభద్రతలను కాపాడుతూ, సమాజంలో నేరాలను అరికట్టాల్సిన పోలీస్ శాఖలోనే ఒక పెద్ద అవినీతి తిమింగలం తిష్టవేసింది. తోటి సిబ్బంది దాచుకున్న రక్తాన్ని, కష్టార్జితాన్ని నమిలి మింగేసింది. జిల్లా పోలీస్ కో–ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో ఏకంగా రూ.1,07,00,000 (కోటి ఏడు లక్షలు) నిధులు నిలువునా స్వాహా అయిన వైనం జిల్లావ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ భారీ దందా బయటపడి రోజులు గడుస్తున్నా.. ఉన్నతాధికారులు విచారణ పేరిట కాలయాపన చేయడం, బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక పెద్ద తలకాయల హస్తం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. పిల్లల చదువుల కోసం పెడితే.. బినామీ ఆస్తులకు వాడుకున్నారు! గతంలో కడప ఎస్పీగా పనిచేసిన మనీష్ కుమార్ సిన్హా హయాంలో పోలీసులు తమ అత్యవసర అవసరాల కోసం ఈ కో–ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని ఏర్పాటు చేసుకుని సభ్యత్వం తీసుకున్నారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, అనారోగ్యం వంటి అత్యవసర సమయాలలో ఈ సొసైటీ నుంచి లోన్లు తీసుకుని, మరలా వాయిదాల పద్ధతిలో కట్టుకునేలా నిబంధనలు పెట్టుకున్నారు. ఈ వ్యవహారం పద్ధతి ప్రకారం జరిగి ఉంటే ఎవరికీ నష్టం కలిగేది కాదు. కానీ, ఈ సొసైటీ వ్యవహారాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలిగిన వి.రవి (పీసీ 3275) ఈ భారీ నిధులను స్వాహా చేసినట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇతనికి కొంతమంది ఉన్నతాధికారులు, సిబ్బంది తమ వంతు సహకారాన్ని అందించినట్లు తెలుస్తోంది. కానిస్టేబుల్ రవి 2020 సంవత్సరానికి ముందు సాధారణ జీవితాన్ని గడిపేవాడని, సొసైటీ ఏర్పాటైన తర్వాత వచ్చిన డబ్బుతో ప్రస్తుతం కడప నగరంలో ఒక భారీ భవనాన్ని నిర్మించుకున్నాడని, ఒకే ఫ్యాన్సీ నంబర్ కలిగిన ద్విచక్ర వాహనం, లగ్జరీ కారు కొనుగోలు చేయడం ఆ కానిస్టేబుల్ అవినీతి పలుకుబడికి పరాకాష్టగా మారిందని తోటి సిబ్బంది మండిపడుతున్నారు. ఆర్టీఐ కానిస్టేబుల్‌పై ఎస్పీ సీరియస్? సొసైటీలో కొన్నేళ్లుగా జరుగుతున్న అక్రమాలపై అనుమానం వచ్చిన ఒక బాధిత కానిస్టేబుల్.. ధైర్యంగా ముందుకొచ్చి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయడంతో ఈ గోల్మాల్ బాగోతం వెలుగులోకి వచ్చింది. అయితే, ఆర్టీఐ ప్రకారం తనకు వివరాలు తెలియజేయాలని దరఖాస్తు చేసుకున్న సదరు కానిస్టేబుల్ పై ప్రస్తుత జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ సీరియస్ అయినట్లు సమాచారం. దాదాపు రెండు నెలల క్రితం బాధితుడైన ఆ కానిస్టేబుల్ నేరుగా ఎస్పీని కలిసి తనకు పూర్తి వివరాలు కావాలని, తమ సొమ్ము తమకు ఇప్పించాలని కోరారు. సదరు కానిస్టేబుల్ విజ్ఞప్తిని స్వీకరించి, విచారిస్తామని చెప్పి రెండు నెలల పైగా గడుస్తున్నా.. ఇప్పటివరకు ఏమాత్రం విచారణ చేయకపోవడం గమనార్హం. మా డబ్బు మాకు వచ్చేదెప్పుడు? ఆధారాలతో సహా ఎస్పీ గారికి ఫిర్యాదు చేసినా విచారణ ఎందుకు నత్తనడకన సాగుతోంది? మాకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది? అని బాధిత కానిస్టేబుళ్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తోటి సిబ్బంది కష్టార్జితాన్ని కాజేసిన పీసీ రవి, అతనికి సహకరించిన వారిపై ఎస్పీ ఆధ్వర్యంలో సమగ్రంగా ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని, అతను స్వాహా చేసిన డబ్బును వెనక్కి ఇప్పించేలా కృషి చేయాలని పోలీసు సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు. భవిష్యత్తులో డిపార్ట్మెంట్లో ఇలాంటి అవినీతి అక్రమాలకు తావులేకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, సామాజిక కార్యకర్తలు కోరుకుంటున్నారు. -
వీసా స్కాం ఇంకా ఆగలేదు..! అసలు UKలో ఏం జరుగుతుందంటే?
-
పార్లమెంట్‌ను తాకిన ఏపీ మెగా డీఎస్సీ స్కామ్!
సాక్షి, న్యూఢిల్లీ: ఆంద్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై వైఎస్సార్సీపీ పార్లమెంట్లో ఆందోళన వ్యక్తం చేసింది. టీచర్ల నియామకాల్లో అక్రమాలు జరిగాయని చెబుతూ.. ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో విచారణ జరపాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదా తీర్మాన నోటీసులు ఇచ్చింది.రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గురువారం వాయిదా తీర్మాన నోటీసు ఇవ్వగా.. లోక్‌సభలో ఎంపీ గురుమూర్తి ఇదే అంశంపై నోటీసు అందించారు. మెగా డీఎస్సీలో జరిగినట్లు చెబుతున్న అవకతవకలపై ఉభయ సభల్లోనూ తక్షణ చర్చ చేపట్టాలని వారు కోరారు.16 వేల టీచర్ పోస్టుల భర్తీలో అక్రమాలు!ఏపీలో సుమారు 16 వేల టీచర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని వైఎస్సార్సీపీ అంటోంది. రిక్రూట్మెంట్ ప్రక్రియను ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో నిర్వహించారని, దీనిపై అనుమానాలు ఉన్నాయని పేర్కొంది. టీచర్ల నియామకాల్లో నిబంధనలు పాటించలేదని, అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది.స్పోర్ట్స్ కోటాలో మరీ దారుణంస్పోర్ట్స్ కోటా పేరుతో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానంలో పేర్కొంది. డబ్బులు తీసుకుని స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు ఇచ్చారనే ఫిర్యాదులు ఉన్నాయని పేర్కొన్నారు. నిజమైన అర్హులకు అవకాశాలు దక్కలేదని అన్నారు.మెరిట్ జాబితాలపై ప్రశ్నలుగతంలో మాదిరిగా జిల్లా వారీగా మెరిట్ జాబితాలను విడుదల చేయలేదని వైఎస్సార్సీపీ అంటోంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థుల్లో కొందరిని కూడా ఎంపిక చేయలేదని పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు అవసరమని, పారదర్శకత కోసం సీబీఐ విచారణ జరపాలని వైఎస్సార్సీపీ ఎంపీలు డిమాండ్ చేశారు.ఏపీలో మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై రాజకీయంగా దుమారం కొనసాగుతోంది. చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌లు పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నియామక ప్రక్రియ ఏ దశలోనూ సజావుగా సాగలేదని.. పైగా అర్హులకు తీవ్ర అన్యాయం జరిగిందని వైఎస్సార్సీపీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చంద్రబాబు ప్రభుత్వంపై మీడియా సమావేశంలో ఇదివరకే ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. -
రూ.25 లక్షల కార్ లోన్ తీసుకుని.. కారే అమ్మేసిన మోసగాడు
కర్ణాటక: నగరంలో రూ. 25 లక్షల బ్యాంకు రుణంతో కారు కొని, దానిని అక్రమంగా వేరొకరికి అమ్మేసిన రుణగ్రహీత ఉదంతమిది. వివరాలు.. మధు మోహన్ అనే వ్యక్తి సరస్వతీపురంలోని ఎస్బిఐ బ్యాంక్ శాఖ నుంచి రూ. 25 లక్షల రుణం తీసుకున్నాడు. ఆ తర్వాత అతను ఆ రుణాన్ని తిరిగి చెల్లించలేదు. దీంతో, రుణాన్ని వసూలు చేయడానికి బ్యాంకు సిబ్బంది మధు మోహన్ ఇంటికి వెళ్లినప్పుడు, అతను అందుబాటులో లేడు. పైగా కారును బ్యాంకు నుంచి అనుమతి తీసుకోకుండా, రవాణా అధికారుల నకిలీ సంతకాలతో రికార్డులను తారుమారు చేశాడు, ఆ కారును షకీబ్ మన్సూర్ అనే వ్యక్తికి అమ్మినట్లు తేలింది. దోషులపై చర్యలు తీసుకోవాలని బ్యాంకు సిబ్బంది సరస్వతీపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
UK వీసాలు, ఉద్యోగాలు... నందూస్ కు మించిన పెద్ద స్కాం...? బయటపడ నిజాలు
-
ఏపీలో వీసా స్కామ్.. రోడ్డున పడ్డ 700మంది బాధితులు
సాక్షి,కృష్ణ: ఇటీవల నందూస్ వరల్డ్ వీసా స్కామ్ మరువక ముందే తాజాగా మరో వీసా స్కామ్ వెలుగులోకి వచ్చింది. యూకేలో ఉద్యోగాలు, స్పాన్సర్షిప్ వీసాల పేరుతో నిరుద్యోగులను నమ్మించి కోట్లాది రూపాయలు వసూలు చేసిన ‘ఫ్లైయింగ్ బోర్డర్స్ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ’మోసం తాజాగా విజయవాడలో బయటపడింది. సుమారు 700 మంది బాధితుల నుండి ఈ సంస్థ భారీగా డబ్బులు వసూలు చేసి ముంచేసిందని బాధితులు లబోదిబోమంటున్నారు.ఓ యూట్యూబ్ ఛానల్లో వచ్చిన ప్రకటనలు, ప్రమోషనల్ వీడియోలను నమ్మి తాము హైదరాబాద్ బేగంపేట, విజయవాడ పరిసరాల్లో ఉన్న ఫ్లైయింగ్ బోర్డర్స్ కన్సల్టెన్సీని సంప్రదించామని బాధితులు తెలిపారు. ఈ సంస్థ నిర్వాహకులు సౌజన్య, ఆమె భర్త శ్రీనివాస్ తమను నమ్మించారని పేర్కొన్నారు.యూకేలో స్కిల్డ్ వర్క్ వీసాపై ఉద్యోగం ఇప్పిస్తామని, కుటుంబ సభ్యులను కూడా డిపెండెంట్లుగా తీసుకెళ్లొచ్చని నమ్మబలికారు. అక్కడ ఉద్యోగం, వసతితో పాటు పోస్ట్ ల్యాండింగ్ సపోర్ట్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. మొత్తం ప్రక్రియకు రూ.12 లక్షలు ఖర్చవుతుందని, ముందుగా రూ.6 లక్షలు, యూకే వెళ్లిన తర్వాత మిగిలిన రూ.6 లక్షలు చెల్లించాలని ఒప్పందం చేసుకున్నారు. వీరి మాటలు నమ్మి చాలామంది అప్పులు చేసి రూ.3 లక్షల నుండి రూ.12 లక్షల వరకూ చెల్లించారు. రిక్రూట్మెంట్ లైసెన్స్ లేకుండానే వీరు ఈ కన్సల్టెన్సీని నడుపుతున్నట్లు బాధితులు గుర్తించారు.డబ్బులు కట్టించుకున్న తర్వాతే వీరు అగ్రిమెంట్లు చూపించారని, అందులో ఉద్యోగ హామీ గురించి స్పష్టంగా లేదని బాధితులు వాపోయారు. మౌఖికంగా మాత్రం 100శాతం జాబ్ వస్తుందని నమ్మించారు. తీరా డబ్బులు కట్టాక వీసాలు రాకపోవడంతో నిలదీస్తే బాధితుల ఫోన్ నెంబర్లను బ్లాక్ చేశారు. లక్ష రూపాయలు మాత్రమే తిరిగి ఇస్తామని తేల్చి చెప్పారు.న్యాయం కోసం హైదరాబాద్ బేగంపేటలోని కార్యాలయానికి వెళ్లి వివరణ కోరగా.. నిర్వాహకులు బాధితులపైనే ఉల్టా న్యూసెన్స్ కేసులు పెట్టించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా బాధితులపై సివిల్ సూట్లు దాఖలు చేసి, డబ్బులు అడిగితే రాజకీయ నాయకుల పేర్లు చెప్తూ బెదిరింపు కాల్స్ చేస్తున్నారని ఆరోపించారు.తమను నిలువునా ముంచిన ఫ్లైయింగ్ బోర్డర్స్ సంస్థ యజమాని సౌజన్య, ఆమె భర్త శ్రీనివాస్ విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేయాలని, వారి బ్యాంక్ ఖాతాలను తక్షణమే సీజ్ చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని తమడబ్బును తమకు తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. -
ఇన్వెస్టర్లూ ‘బాస్’తో జాగ్రత్త.. సెబీ హెచ్చరిక
కృత్రిమ మేధస్సు (AI), డీప్‌ఫేక్ టెక్నాలజీని అడ్డం పెట్టుకుని జరుగుతున్న సైబర్ మోసాలపై భారత మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) దేశంలోని కంపెనీలు, పెట్టుబడిదారులను అప్రమత్తం చేశాయి. ముఖ్యంగా "బాస్ స్కామ్" పేరుతో పెరుగుతున్న కొత్త తరహా మోసాలపై శుక్రవారం సెబీ ప్రత్యేక హెచ్చరిక జారీ చేసింది.సెబీ వివరాల ప్రకారం.. సైబర్ నేరగాళ్లు AI సాయంతో కంపెనీల సీఎండీలు, సీఈఓలు లేదా ఇతర ఉన్నతాధికారుల గొంతును క్లోన్ చేయడం, డీప్‌ఫేక్ వీడియోలు రూపొందించడం, అలాగే ఈ-మెయిల్, వాట్సాప్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వారిలా నటించి ఫైనాన్స్ విభాగాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. "అత్యవసరం", "రహస్యంగా ఉంచాలి" అంటూ వెంటనే నిధులు బదిలీ చేయాలని ఒత్తిడి తెచ్చి కోట్ల రూపాయలు కాజేసే ప్రయత్నాలు పెరుగుతున్నాయని సెబీ పేర్కొంది. కొన్ని సందర్భాల్లో మాల్వేర్ ఫైళ్లను పంపి ఉద్యోగుల పరికరాలను హ్యాక్ చేసి, వారి ఖాతాల నుంచే నకిలీ చెల్లింపు ఆదేశాలు పంపుతున్నట్లు కూడా వెల్లడించింది.ఇదే సమయంలో ఎన్ఎస్ఈ కూడా పెట్టుబడిదారులకు ప్రత్యేక సూచనలు జారీ చేసింది. ఫిషింగ్ లింకులు, నకిలీ ఎన్ఎస్ఈ వెబ్సైట్లు, క్లోన్ ట్రేడింగ్ యాప్‌లు, సోషల్ మీడియా పెట్టుబడి గ్రూపులు, తప్పుడు స్టాక్ సిఫార్సుల ద్వారా మోసాలు పెరుగుతున్నాయని హెచ్చరించింది. అధికారిక వెబ్సైట్లు, యాప్‌ల ద్వారానే ట్రేడింగ్ సేవలను ఉపయోగించాలని, అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయొద్దని, OTPలు లేదా లాగిన్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించింది. -
చంద్రబాబు మాట లెక్క చేయని టీడీపీ ఎమ్మెల్యేలు
-
Wangchuk: ఏదైనా జరిగితే కేంద్రానిదే బాధ్యత!
ప్రముఖ విద్యావేత్త, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్ష 18వ రోజుకు చేరుకోవడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దాదాపు 9 కిలోల బరువు కోల్పోయిన ఆయన ప్రస్తుతం 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఏ క్షణమైనా ఆయన పరిస్థితి విషమించొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వాంగ్చుక్కు ఏదైనా జరిగితే అందుకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తీవ్ర హెచ్చరిక చేసింది.రాజ్యసభ సభ్యుడు సాకేత్ గోఖలే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు బహిరంగ లేఖ రాస్తూ.. వెంటనే వాంగ్‌చుక్‌తో చర్చలు జరపాలని, విద్యార్థుల ఆందోళనను ప్రభుత్వం వినాలని కోరారు. ఆయనకు ఏదైనా జరిగితే మాత్రం ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ఇదిలా ఉండగా.. వాంగ్చుక్కు రాజకీయ మద్దతు క్రమంగా పెరుగుతోంది. పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ ఫోన్లో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. టీఎంసీ ఎంపీలు మహువా మొయిత్రా, సాగరికా ఘోష్ జంతర్‌మంతర్‌కు వెళ్లి సంఘీభావం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా మద్దతు ప్రకటించకపోయినప్పటికీ.. ఆ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ వాంగ్చుక్కు బహిరంగ లేఖ రాస్తూ.. దీక్షను విరమించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నిరసనకారులతో చర్చలు జరపాలని ప్రభుత్వానికి సూచించారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ (ఎస్పీ), సీపీఎం, సీపీఐ తదితర పార్టీలు కూడా ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించాయి. ఇటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఆయనకు సంఘీభావం తెలుపుతున్నారు. అసలు ఈ దీక్ష ఎందుకు?జూన్ 28 నుంచి ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద వాంగ్‌చుక్ నిరాహార దీక్ష చేస్తున్నారు. నీట్ (NEET), సీబీఎస్ఈ (CBSE) పరీక్షల్లో జరిగిన అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న లోపాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆయనతో పాటు నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షల వ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకురావాలని కోరుతున్నారు. అయితే వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్షపై కేంద్రం ఇప్పటిదాకా స్పందించలేదు. అయితే మొదటి నుంచి ఈ ఉద్యమాన్ని కేంద్రం రాజకీయ ప్రేరేపితమని అభివర్ణిస్తూ.. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిరసనకారులను "అశాంతి సృష్టించే శక్తులు"గా వ్యాఖ్యానించారు. ఎవరీ సోనమ్ వాంగ్‌చుక్?లడఖ్‌కు చెందిన సోనమ్ వాంగ్‌చుక్ ప్రముఖ ఇంజినీర్, విద్యావేత్త, పర్యావరణవేత్త. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా సంస్కరణలకు కృషి చేసిన ఆయనకు 2018లో ప్రతిష్ఠాత్మక రామన్ మెగసెసే అవార్డు సైతం లభించింది. హిమాలయ ప్రాంతాల్లో నీటి సంరక్షణ కోసం రూపొందించిన 'ఐస్ స్తూపాలు' ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఆయన జీవితం, ఆలోచనల ఆధారంగానే బాలీవుడ్ చిత్రం '3 ఇడియట్స్'లోని ఫున్సుఖ్ వాంగ్డూ పాత్ర(అమీర్ ఖాన్ పోషించిన పాత్ర) రూపుదిద్దుకుంది. ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆయన చేపట్టిన ఈ నిరాహార దీక్ష దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వాంగ్‌చుక్ ఆరోగ్యంపై ఆయన భార్య గీతాంజలి ఆంగ్మో కూడా ఆందోళన వ్యక్తం చేశారు. లడఖ్‌లో గతంలో 21 రోజుల పాటు నిరాహార దీక్ష చేసినప్పటికీ అక్కడి చల్లటి వాతావరణం కారణంగా ఇంతగా బలహీనపడలేదని, ఢిల్లీలోని వేడి, తేమ వల్ల శరీరంపై తీవ్ర ప్రభావం పడుతోందని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఉప్పు, నీటితోనే దీక్ష కొనసాగిస్తున్నారని.. వైద్యుల సూచనలు ఉన్నప్పటికీ వెనక్కి తగ్గే ఆలోచన లేదని వెల్లడించారు. ఇదిలా ఉండగా.. వాంగ్‌చుక్ ఆరోగ్యం మరింత క్షీణించకుండా బలవంతంగా ఆహారం అందించాలని, దీక్ష విరమింపజేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ఓ ప్రజాహిత వ్యాజ్యం (పిల్) కూడా దాఖలైంది. అయితే తాను స్వచ్ఛందంగా చేపట్టిన నిరాహార దీక్షను కొనసాగిస్తానని వాంగ్‌చుక్ స్పష్టం చేస్తున్నారు. -
"హలో..నేను దివ్య మాట్లాడుతున్నాను": కట్ చేస్తే..రూ. 21 కోట్ల స్కాం
"హలో... నేను దివ్య మాట్లాడుతున్నాను" అనే మెసేజ్‌తో మొదలైన ఒక సాధారణ వాట్సాప్ సందేశం, భారతదేశంలోని అతిపెద్ద క్రిప్టోకరెన్సీ పెట్టుబడి మోసానికి తెర తీసింది. ఈ స్కాం కారణంగా గ్వాలియర్‌కు చెందిన 70 ఏళ్ల చార్టర్డ్ అకౌంటెంట్ రూ. 21 కోట్లకు పైగా నష్టపోయారు. అసలేం జరిగిందంటే..మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన 70 ఏళ్ల సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్ (CA) ,మధ్యప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ చీఫ్ రిటర్నింగ్ ఆఫీసర్ అశోక్ విజయవర్గీయకు భారీ టోకరా ఇచ్చిన వైనం కలకలం రేపింది. ఈ నకిలీ క్రిప్టోకరెన్సీ స్కామ్‌లో చిక్కుకుని ఏకంగా రూ. 21.06 కోట్లు కోల్పోయారు. మోసం ఎలా జరిగింది?ఒకే ఒక్క వాట్సాప్ మెసేజ్‌తో మొదలైన ఈ మోసం, దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్న బ్యాంక్ ఖాతాల నెట్వర్క్ ద్వారా సాగింది. 2025 డిసెంబర్లో విజయవర్గీయకు ఒక ఇండియన్ నంబర్ నుండి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అందులో అవతలి వ్యక్తి తన పేరు "దివ్య" అని, తాను ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్‌నని పరిచయం చేసుకుంది.క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలోనే ఊహించని లాభాలు వస్తాయని ఆమె నమ్మబికింది. ఆ తర్వాత కమ్యూనికేషన్ మొత్తం అమెరికా కంట్రీ కోడ్ (+1) ఉన్న ఒక వర్చువల్ నంబర్‌కు మారింది. బాధితుడితో ఒక నకిలీ ట్రేడింగ్ పోర్టల్‌లో అకౌంట్ తెరిపించారు. మొదట ఆయన సరదాగా పెట్టిన చిన్న పెట్టుబడులపై లాభాలు వస్తున్నట్లు స్క్రీన్‌పై చూపించారు. నమ్మకం కలిగించడానికి జనవరి 7న రూ. 1.88 లక్షల లాభాన్ని నేరుగా ఆయన HDFC బ్యాంక్ ఖాతాకు జమ చేశారు. అంతే ఈ డబ్బు చేతికి అందడంతో విజయవర్గీయ ఆ ప్లాట్‌ఫారమ్ నిజమైనదేనని నమ్మారు. ఆ తర్వాత ఆయన విడతల వారీగా కోట్లాది రూపాయలు బదిలీ చేశారు. అంతేకాదు విజయవర్గీయను నమ్మి ఆయన స్నేహితులు, వ్యాపార భాగస్వాములు కూడా ఇందులో పెట్టుబడులు పెట్టారు. ఆ నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్పోర్టల్లో ఆయనకు రూ. 33.25 కోట్ల లాభం వచ్చినట్లు చూపించారు.తీరా బాధితుడు ఆ లాభాన్ని విత్‌డ్రా చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు వారి అసలు రంగు బయటపడింది. నిందితులు ఆ లావాదేవీని బ్లాక్ చేశారు. పైగా ఆ డబ్బు రావాలంటే రూ.10.84 కోట్లు ఇన్కమ్ టాక్స్ కట్టాలని, ఆ తర్వాత "రిస్క్ మార్జిన్" కింద మరో రూ. 1 కోటి కట్టాలని చెప్పి మరికొంత డబ్బు లాగారు. చివరకు తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ పోలీసులను ఆశ్రయించారు. ఆయన నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ , '1930' హెల్ప్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయడంతో, పోలీసులు వివిధ బ్యాంక్ ఖాతాలలో ఉన్న దాదాపు రూ.2 కోట్లను సకాలంలో ఫ్రీజ్ చేయగలిగారు.అశోక్ విజయవర్గీయఇదీ చదవండి: రూ. 2 కోట్ల బంగారం పేస్ట్ : తమిళనాడు జంట అరెస్ట్దీనిపై గ్వాలియర్ సైబర్ సెల్ విచారణ చేపట్టింది. ప్రాథమిక విచారణ ప్రకారం, నిందితులు పోలీసులు లేదా బ్యాంకులు డబ్బును ఫ్రీజ్ చేయకుండా ఉండేందుకు అత్యంత సంక్లిష్టమైన, నాలుగు అంచెల బదిలీ వ్యవస్థను ఉపయోగించారు. మొత్తంగా 20,049 లావాదేవీల ద్వారా డబ్బు దేశవ్యాప్తంగా పంపిణీ అయింది.Layer 1లో బాధితుడి నుండి నేరుగా డబ్బులు స్వీకరించిన 77 బ్యాంక్ ఖాతాలను పోలీసులు గుర్తించారు.Layer 2లో ఆ 77 ఖాతాల నుండి నిధులు 493 ఖాతాలకు బదిలీ అయ్యాయి.Layer 3లో : అక్కడి నుండి దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 12,700 ఖాతాలకు డబ్బును చిన్న చిన్న మొత్తాలుగా విడగొట్టి పంపారు.Layer 4లో చివరిగా దాదాపు 7,500 లావాదేవీల ద్వారా ఆ డబ్బును ఏటీఎంల (ATMs) ద్వారా విత్‌డ్రా చేయడం, షాపింగ్ వోచర్లు, క్యాష్ వోచర్లుగా మార్చడం లేదా తిరిగి USDT వంటి క్రిప్టోకరెన్సీల్లోకి మార్చడం చేశారు. ఇదీ చదవండి: ‘ఫున్సుఖ్ వాంగ్డూ’ చనిపోవడం ఇష్టం లేదు : 3 ఇడియట్స్ నటుడి భావోద్వేగంఈ నెట్వర్క్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ వంటి అనేక రాష్ట్రాలకు విస్తరించింది. ఈ ఖాతాలలో చాలా వరకు "మనీ మ్యూల్స్" (కమిషన్ ఆశతో తమ ఖాతాలను సైబర్ నేరగాళ్లకు వాడుకోవడానికి ఇచ్చే ఇంటర్మీడియరీలు) ఖాతాలు అయి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.ఇది దేశంలోనే జరిగిన అతిపెద్ద మోసాలలో ఒకటి సైబర్ సెల్ డిఎస్పీ సంజీవ్ నయన్ శర్మ ప్రకటించారు. USDT ట్రేడింగ్ పేరుతో సీనియర్ CAను మోసం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న వేలాది ఖాతాల ద్వారా ఈ నిధులను మళ్లించారని తెలిపారు. గుర్తుతెలియని నిందితులపై సమాచార సాంకేతిక చట్టం (IT Act) సెక్షన్ 66D, సహా పలు సెక్షన్ల కింద కింద కేసు నమోదు చేశారు.ప్రస్తుతం సైబర్ టీమ్స్ నిందితులు ఉపయోగించిన నకిలీ యుఆర్ఎల్లు (URLs), ఐపీ అడ్రస్‌లు మరియు వాట్సాప్ నంబర్లను ట్రాక్ చేస్తూ నిందితుల కోసం గాలిస్తున్నారు.ఇదీ చదవండి: ఆ సమయంలో ఒంటెలకు ఆహారంగా పాములు..ఎందుకు? -
ఆ నేరగాడు చిక్కినట్టేనా!
ఎనిమిదేళ్లుగా ఎన్నికల రుతువులో రాజకీయ పక్షాలు పరస్పరం బురద చల్లుకోవడానికి పనికొచ్చే అంశంగా మిగిలిపోయిన మహదేవ్ యాప్ స్కాంలో ఎట్టకేలకు సూత్రధారుల్లో ఒకడైన సౌరభ్ చంద్రశేఖర్ ఒమన్ పోలీసులకు ఇటీవల చిక్కడం కీలక పరిణామం. ఛత్తీస్‌గఢ్ కేంద్రంగా పలు రాష్ట్రాల్లో అమాయక పౌరులనుంచి రూ. 6,000 కోట్లు అపహరించిన ఈ యాప్ మన ఆర్థికవ్యవస్థ బలహీనతకు ఆనవాలు. ఈ సొమ్మంతా బ్యాంకుల ద్వారానే నేరగాళ్లకు చేరడం చిన్న విషయం కాదు. పలు రాజకీయ పక్షాల నాయకులు, బాలీవుడ్ ప్రముఖులు, ఉన్నతాధికారుల ప్రమేయంతోనే ఆ యాప్ వేల కోట్లు కొల్లగొట్టిందని జనం చెప్పుకోవటమే తప్ప అందుకు సాక్ష్యాధారాలు లేవు. సీబీఐ, ఈడీ వంటి సంస్థలు అనేకచోట్ల దాడులు చేశాయి. కొంతమందిని అరెస్టు చేశాయి. ఛత్తీస్‌గఢ్ అప్పటి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు భూపేష్ బాఘెల్‌కు రూ. 508 కోట్లు ఇచ్చానంటూ 2023 నవంబర్‌లో అక్కడి అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ కేసులో అరెస్టయిన ఆసిమ్ దాస్ అనే వ్యక్తి అంగీకరించాడని ఈడీ ప్రకటించినా... రాజకీయ దుమారం రేగటం మినహా జరిగిందేమీ లేదు. ఆ వెంటనే కాంగ్రెస్ నేతలు తమ వంతుగా బీజేపీ నాయకులపై ఆరోపణలు చేశారు. తనతో బలవంతంగా ఆ మాట చెప్పించారని ఆ నిందితుడు కోర్టుముందు వాంగ్మూలం ఇవ్వడంతో అది కాస్తా చల్లారింది. ఈలోగా ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకొచ్చింది. పూర్వాశ్రమంలో ఒక జ్యూస్ సెంటర్ యజమాని అయిన సౌరభ్ చంద్రశేఖర్ ఎవరి ప్రమేయమూ లేకుండా ఎదిగాడంటే ఎవరూ నమ్మరు.మహదేవ్ యాప్ కొల్లగొట్టిన మొత్తం రూ. 6,000 కోట్లు అంటున్నా అంతకు మించి ఉండొచ్చు కూడా. ప్రపంచమంతా అబ్బురంగా మాట్లాడుకునే బూర్జ్ ఖలీఫాలో అత గాడికి పలు ఫ్లాట్లు ఉన్నాయని చెబుతారు. ఇవిగాక వేరే దేశాల్లో విలాసవంతమైన భవంతులు, హోటళ్లు, వందల కోట్లలో నడిచే ఇతర వ్యాపారాలు సరేసరి. చదువుసంధ్యలు పెద్దగాలేని, మూడు పదులు కూడా దాటని సౌరభ్ స్వల్పకాలంలోనే ఇంత కొల్లగొట్ట డానికి ఊతమిచ్చింది మనుషుల్లోని దురాశ, వ్యవస్థల నిరాసక్తత. ఎన్నికల్లో ఎవరు నెగ్గుతారన్న ఆసక్తి, రేసు గుర్రాల్లో ఏది విజేతగా నిలుస్తుందనే అంచనాలు మహదేవ్ యాప్‌కి పెద్ద మేత. మ్యాచ్ ఫిక్సింగ్‌లు సరేసరి. అరెస్టులూ, పరస్పర ఆరోపణలతో ఇంత దుమారం రేగినా... 2023లో ఆ యాప్‌ను నిషేధించినా, మొన్న ఏప్రిల్‌లో జరిగిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొత్త డొమైన్లతో ఆ యాప్ రెండు చేతులా కోట్ల రూపాయలు దండుకుంది. బుకీల ద్వారా పాలకపక్షంగా రాబోతున్న దెవరో, రెండో స్థానంలో ఉండబోయే పక్షానికి ఎన్ని స్థానాలొస్తాయో కాకరేపడం, బెట్టింగ్‌లు జోరందుకోవటం, సొమ్ములు కొల్లగొట్టడం, దక్షిణాఫ్రికా, కెన్యా, బ్యాంకాక్,హాంకాంగ్లనుంచి దీన్నంతా చక్కబెట్టడం ఈ దొంగల నిర్వహణాశైలి. సౌరభ్ పెళ్లికే రూ. 200 కోట్లు ఖర్చయిందనీ, బాలీవుడ్ ప్రముఖులు, ఇతర సెలబ్రిటీలు ప్రదర్శనలిచ్చారనీ సీబీఐ ఆరాలో తేలింది. ఇప్పుడు సౌరభ్‌ను పట్టుకున్న ఒమన్‌తో మన దేశానికి నేరస్థుల అప్పగింత ఒప్పందం ఉంది. కానీ ఇక్కడికి రప్పించాలంటే అతనిపై ఉన్న కేసులు, సాక్ష్యాధారాలు, కోర్టు రికార్డులు సమర్పించాలి. ఒప్పందం పరిధిలోకి అవి వస్తాయో రావో అక్కడి న్యాయ స్థానాలు తేల్చాలి. రెండేళ్ల క్రితం యూఏఈలో అరెస్టయినా ఆ దేశంతో నేరస్థుల అప్పగింత ఒప్పందం లేకపోవటంతో విడుదలయ్యాడు. సౌరభ్ సహచరుడు రవి ఉప్పల్ ఆచూకీ లేకుండాపోయాడు. అతగాడు వనౌటులో ఉన్నాడని మన నిఘా సంస్థలు అంచనా వేస్తున్నా, నిర్ధారణగా తేల్చలేకపోయాయి. జూదం దగ్గర మొదలైన దర్యాప్తు... హవాలా రాకెట్, నకిలీ కంపెనీలు, విదేశీ సంస్థల్లో పెట్టుబడులు, స్థిరాస్తులు వగైరాలన్నీ బయటపడ్డాక దాని విస్తృతి పెరిగింది. ఇలాంటి ఆర్థిక నేరగాళ్ల ఆచూకీ రాబట్టడంలో, ఇక్కడికి రప్పించడంలో వ్యవస్థలు విఫలం కావటంవల్ల ఇలాంటివారు మరింత మంది పుట్టుకొస్తున్నారు. సౌరభ్‌ను సత్వరం తీసుకు రాగలిగితేనే నేరగాళ్లలో భయం ఏర్పడుతుంది. అతగాడే కాదు... రకరకాల పేర్లతో పలు రాష్ట్రాల్లో అనేకానేక సంస్థలు వెలుస్తున్నాయి. జనాన్ని నిలువుదోపిడీ చేస్తున్నాయి. దీనికి అడ్డుకట్టవేయడం తక్షణ కర్తవ్యం. -
ఇండియాకి రాగానే నందు దంపతులకు ఎదురయ్యేది ఇదే!
-
మరో 'మాస్టర్' స్కామ్!
సాక్షి, అమరావతి: అమరావతి రాజధాని హైటెక్ రియల్ ఎస్టేట్ స్కామ్‌లో మరో అంకం మొదలైంది. స్పోర్ట్స్ సిటీ నిర్మాణం పేరుతో రెండో విడత ఇప్పటికే ఏడు గ్రామాల్లో 20,494 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ (భూసమీకరణ) కింద సీఆర్డీఏ సమీకరిస్తోంది. ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, స్మార్ట్ ఇండస్ట్రీస్‌తోపాటు భవిష్యత్‌లో 43 గ్రామాల్లో 1.54 లక్షల ఎకరాలకు రాజధానిని విస్తరించేందుకు ప్రణాళిక రచించింది. రెండో విడత సమీకరిస్తున్న గ్రామాలతోపాటు ఎయిర్‌పోర్టు, భవిష్యత్‌లో రాజధాని విస్తరించే 43 గ్రామాల్లోనూ మాస్టర్ ప్లాన్ తయారీ కోసం ఈ ఏడాది జనవరిలో టెండర్లు పిలిచింది. ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో వాటిని రద్దు చేసి.. ఫిబ్రవరిలో టెండర్లు పిలిచింది. వాటిని ఇటీవల ఆమోదించింది. మాస్టర్ ప్లాన్ తయారీ పనులను సింగపూర్‌కు చెందిన సుర్బానా–జురాంగ్ కన్సార్షియంకు రూ.45.14 కోట్లకు కట్టబెట్టింది. 2015లో 53,748 ఎకరాలలో రాజధాని మాస్టర్ ప్లాన్ తయారీ బాధ్యతలను ఇదే కన్సార్షియంకు రూ.12.32 కోట్లకు అప్పగించడం గమనార్హం. ఈ మాస్టర్ ప్లాన్ లోపం వల్ల విద్యుత్ లైన్లు మార్చేందుకు రూ.1,480 కోట్లకుపైగా రాష్ట్ర ఖజానాపై భారం పడింది.. అయినా సరే రెండో విడత రాజధాని మాస్టర్ ప్లాన్‌నూ అదే సంస్థకు ప్రభుత్వం అప్పగించడం వెనుక కారణం ఏమిటన్నది బహిరంగ రహస్యమే. 11 ఏళ్లుగా ప్రాథమిక దశ దాటని రాజధాని..రాజధానిపై ముందే వందిమాగధులు, బినామీలకు లీకులు ఇచ్చి ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి రైతుల నుంచి కారుచౌకగా భూములు కాజేసిన తర్వాత 2015లో గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల పరిధిలో రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అప్పట్లో 53,748 ఎకరాల్లో (217.23 చదరపు కిలోమీటర్లు) రాజధాని నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో ప్రభుత్వ, అటవీ భూమిపోనూ 34,390 ఎకరాలను రైతుల నుంచి భూసమీకరణ ద్వారా సమీకరించింది. పల్లపు ప్రాంతం.. కొండవీటివాగు, పాలవాగు వరద ప్రభావిత ప్రాంతమైన ఆ భూమిలో రాజధాని నిర్మించడానికి కనీస మౌలిక సదుపాయాల కల్పనకే ఎకరానికి రూ.2 కోట్లు చొప్పున రూ.లక్ష కోట్లు అవసరం అవుతుందంటూ అప్పట్లో కేంద్రానికి సీఎం చంద్రబాబు డీపీఆర్ సమర్పించారు. కానీ.. 11 ఏళ్లవుతున్నా ఇప్పటికీ రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వలేదు. 2014–19 మధ్య రాజధాని నిర్మాణానికి రూ.5,500 కోట్లు వ్యయం చేసినా.. శాశ్వత నిర్మాణం ఒక్కటంటే ఒక్కటీ కట్టలేదు. తాత్కాలిక నిర్మాణాల ముసుగులో కాంట్రాక్టర్లతో కలిసి భారీ ఎత్తున దోచుకున్నారని.. షాపూర్జీ పల్లోంజీ నుంచి సీఎం వ్యక్తిగత కార్యదర్శి కమీషన్లు తీసుకుని ఐటీ శాఖకు పట్టుబడటాన్ని బట్టి చూస్తే రాజధాని నిర్మాణంపై చంద్రబాబు సర్కార్‌కు ఎంత చిత్తశుద్ధి ఉందన్నది అప్పట్లోనే స్పష్టమయ్యిందని ఆర్థిక నిపుణులు ఎత్తిచూపుతున్నారు. విజయవాడ–గుంటూరు మధ్య 1400 ఎకరాల్లోనే రాజధాని పూర్తయ్యేది..ఇక 2024, జూన్ 12న మళ్లీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. అధికారంలోకి వచ్చి ఇప్పటికి 25 నెలలు పూర్తయింది. రాజధాని నిర్మాణ పనుల కోసం రూ.47,387 కోట్లు అప్పు తెచ్చి.. సుమారు రూ.60 వేల కోట్ల అంచనాతో పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. కానీ.. నిర్దేశించిన లక్ష్యం మేరకు పనులు సాగడం లేదని అధికారవర్గాలే చెబుతున్నాయి. తొలి విడత సమీకరణ కింద భూములు ఇచ్చిన రైతులకు పదేళ్లలో అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని, ఆ పదేళ్లు కౌలు చెల్లిస్తామని సీఆర్డీఏ చట్టం ద్వారా హామీ ఇచ్చారు. కానీ.. ఆ మేరకు హామీ అమలు చేయలేదు. దాంతో రైతులకు కౌలు చెల్లింపును మరో ఐదేళ్లు పొడిగించారు. ప్రస్తుతం అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, లోక్‌భవన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల క్వార్టర్స్సహా అన్ని ప్రభుత్వ భవనాలను నిర్మిస్తున్నది కేవలం 1,375 ఎకరాల్లోనే. రైతులకు ప్లాట్లు కేటాయించగా మిగిలిన భూములను అస్మదీయులు, బినామీలకు చెందిన సంస్థలకు అత్తెసరు ధరలకు కట్టబెడుతున్నారనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. విజయవాడ–గుంటూరు మధ్య కోల్‌కత–చెన్నై జాతీయ రహదారికి సమీపంలో 1500 ఎకరాలను 2015లోనే సేకరించి.. అందులో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, అన్ని ప్రభుత్వ భవనాలను రూ.5 వేల కోట్లతో పూర్తి చేసే అవకాశం ఉండేదని నిపుణులు చెబుతున్నారు. అదే జరిగి ఉంటే 2017 నాటికే రాజధాని పూర్తయ్యేదని.. ఈ పాటికి విజయవాడ–గుంటూరు కలిసిపోయి మహానగరంగా రూపాంతరం చెందేదని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్‌గా మారేదని తేల్చిచెబుతున్నారు. తొలి విడతకు మూడింతలు పెద్దగా..రాజధాని 29 గ్రామాలకే పరిమితమైతే చిన్న మున్సిపాల్టీగా మిగిలిపోతుందని.. భూముల ధరలు పెరగాలంటే ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని.. అందుకోసం రెండో విడత భూసమీకరణ తప్పదని సీఎం చంద్రబాబు తెగేసిచెప్పారు. అందులో భాగంగా పల్నాడు జిల్లా అమరావతి మండలంలో నాలుగు గ్రామాలు, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో మూడు గ్రామాలు... వెరసి ఏడు గ్రామాల్లో స్పోర్ట్స్ సిటీ కోసం 20,494 ఎకరాల్లో (82.9 చదరపు కిలోమీటర్లు) భూసమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, స్మార్ట్ ఇండస్ట్రీస్, భవిష్యత్ అవసరాల కోసం గుంటూరు జిల్లాలో గుంటూరు, మంగళగిరి, మేడికొండూరు, పెదకాకాని మండలాలు, తాడికొండ, పల్నాడు జిల్లాలో అమరావతి, ఎడ్లపాడు, పెదకూరపాడు మండలాల్లో 43 గ్రామాల్లో 1,54,853.43 ఎకరాలకు (626.67 చదరపు కిలోమీటర్లు) రాజధాని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 50 గ్రామాల్లో 709.57 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ రూపొందించే పనులను సింగపూర్ సంస్థలకు అప్పగించింది. ఇందులో ఏడు గ్రామాల్లోని 20,494 ఎకరాలను తొలుత భూసమీకరణ చేసి.. ఆ తర్వాత అవసరమైనప్పుడు మిగతా భూమిని విడతల వారీగా సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. రహదారులు, వరద నీటి నియంత్రణ, మురుగునీటి వ్యవస్థ, విద్యుత్ సౌకర్యం వంటి మౌలిక సదుపాయాల కల్పన.. ఆ పనులకు జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తీసుకోవడంతో పాటు ఇంకా ఇతర మార్గాల ద్వారా ఆర్థిక వనరుల సమీకరణ అవకాశాలను అన్వేషిస్తూ మాస్టర్ ప్లాన్ రూపొందించాలని నిర్దేశించింది. స్పోర్ట్స్ సిటీ పేరుతో బినామీలకే భూసంతర్పణఉమ్మడి రాష్ట్రానికి అపద్ధర్మ సీఎంగా 2004, మే 13 వరకూ చంద్రబాబు ఉన్నారు. అప్పట్లో క్రీడల అభివృద్ధి పేరుతో హైదరాబాద్‌లో 850 ఎకరాల భూమిని (ప్రస్తుతం ఆ భూమి ధర రూ.లక్ష కోట్లు) బిల్లీ రావుకి అప్పటికప్పుడు ఏర్పాటుచేసిన ఐఎంజీ భారత్ అనే సంస్థకు కట్టబెట్టేశారని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ భూకేటాయింపులను రద్దు చేసి రూ.లక్ష కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిని పరిరక్షించారని ప్రశంసిస్తున్నారు. అమరావతి రాజధానిలోనూ స్పోర్ట్స్ సిటీని 2,500 ఎకరాల్లో నిర్మిస్తామని మంత్రి నారాయణ పలు సందర్భాల్లో చెప్పారు. స్పోర్ట్స్ సిటీ ముసుగులో బిల్లీ రావు వంటి బినామీలకే వేలాది ఎకరాల భూములను కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నారనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. రాజధానికి అత్యంత సమీపంలో గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఇప్పటికే ఉంది. ఆ ఎయిర్‌పోర్టుకూ రాజధానికి అనుసంధానం చేస్తూ వెస్ట్రన్ బైపాస్ నిర్మాణం కూడా పూర్తయింది. ఇక రాజధానికి కొత్తగా ఎయిర్‌పోర్టు అవసరం లేదు. కానీ.. ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు కోసం ఐదు వేల ఎకరాల భూమి అవసరమని మంత్రి నారాయణ పదే పదే చెబుతున్నారు. అందుకోసం మరో విడత భూసమీకరణ చేసి.. ఆ భూమిని మరో బినామీకి కట్టబెడతారనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. హైటెక్ రియల్ ఎస్టేట్ స్కామ్ కోసం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తూ.. రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారంటూ నిపుణులు, మేధావులు, రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి రాష్ట్రం..రాజధాని కోసం ఇప్పటికే సమీకరించిన 53,748 ఎకరాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికే ఎకరానికి సగటున రూ.2 కోట్ల చొప్పున రూ.లక్ష కోట్లు అవసరమని 2016–18 మధ్య కేంద్రానికి ప్రభుత్వం డీపీఆర్‌లు పంపింది. గతేడాది ఏప్రిల్ 16న రాజధాని తొలి దశ నిర్మాణానికే రూ.77,249 కోట్లు అవసరమని 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుత ధరల ప్రకారం 1.75 లక్షల ఎకరాల్లో రాజధానిని విస్తరించాలంటే మౌలిక సదుపాయాల కల్పనకే ప్రస్తుత ధరల ప్రకారం రూ.3.50 లక్షల కోట్లు అవసరం. ఇటీవల బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట 53 వేల ఎకరాల్లో రాజధాని అభివృద్ధికి వందేళ్ల సమయం పడుతుందని ప్రభుత్వం వెల్లడించింది. తొలి దశ రాజధాని నిర్మాణం పూర్తయ్యే సరికి వ్యయం రూ.లక్షల కోట్లకు చేరుతుందని అధికారవర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ఈ లెక్కన రాజధానిని 1.75 లక్షల ఎకరాలకు విస్తరించే పనులు పూర్తి కావాలంటే ఇంకెన్ని వందలేళ్లు పడతాయి? ఇంకెన్ని రూ.లక్షల కోట్లు వ్యయం అవుతుంది? ఇంకెన్ని రూ.లక్షల కోట్లు అప్పు తేవాలని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని రాజధాని నిర్మాణం పేరుతో తెచ్చే అప్పులు పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి నెడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఆంధ్రప్రదేశ్‌లో మరో కుంభకోణానికి తెరతీసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం... ల్యాప్‌టాప్‌ల కొనుగోలులో దోపిడీకి స్కెచ్
-
మధ్యప్రదేశ్‌లో మరో భారీ స్కాం!
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ అవినీతి, దోపిడీకి కేంద్రంగా మారిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఒక కుంభకోణం మరువకముందే మరో కుంభకోణం వెలుగుచూస్తోందని విమర్శించారు. తాజాగా రాష్ట్రంలో ఇథనాల్ తయారీ పేరిట రూ.1,200 కోట్ల భారీ బియ్యం కుంభకోణం జరిగిందని ఆరో పించారు. ఈ మేరకు తన సామాఇజక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఖర్గే తీవ్ర విమర్శలు గుప్పించారు. పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులు, గర్భిణులు, కిశోర బాలికల కోసం వినియోగించాల్సిన బియ్యాన్ని లాభాల కోసం పక్కదారి పట్టించారని ఖర్గే మండిపడ్డారు. సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రైస్ మిల్లర్లు, ఇథనాల్ మాఫియాకు అప్పగించారని ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే ఈ అవినీతి దందా సాగుతోందని విమర్శించారు. ప్రభుత్వ యంత్రాంగం, అధికార పార్టీ నేతల కుమ్మక్కుతో ప్రజల హక్కుగా దక్కాల్సిన పౌష్టికాహారాన్ని దోచుకుంటున్నారని దుయ్యబట్టారు.ముఖ్యమంత్రి చుట్టూ ఉజ్జయిని భూస్కామ్తాజా బియ్యం కుంభకోణం కంటే ముందు ఉజ్జయినిలో భారీ భూ కుంభకోణం వెలుగుచూసిందని ఖర్గే గుర్తుచేశారు. ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, హైవే కారిడార్ రానున్నాయని ప్రతిపాదించిన ప్రాంతాల్లోనే ముందస్తు సమాచారంతో అక్రమంగా భూముల కొనుగోళ్లు జరిగాయని ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పాత్రపైనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ప్రతి శాఖలోనూ దోపిడీ సాగుతోందని, బీజేపీ నేతలు తమ జేబులు నింపుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని విమర్శించారు.అవినీతికి మోడల్‌గా మధ్యప్రదేశ్గతంలో సంచలనం సృష్టించిన వ్యాపం కుంభకోణం నుంచి మొదలుకొని, లెక్కలేనన్ని పేపర్ లీకేజీలు, అవినీతి వ్యవహారాలు వెలుగుచూస్తున్నా రాష్ట్రంలో దోపిడీ ఆగలేదని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు మధ్యప్రదేశ్‌ను పూర్తిగా ‘అవినీతి మోడల్’గా మార్చేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటిలాగే మౌనం వహిస్తున్నారని విమర్శించారు. నరేంద్ర మోదీ, అమిత్ షాలు తమ అధికార అహంకారంతో ప్రజా జీవితంలో ఉండాల్సిన జవాబుదారీతనం అనే భావనను కాలరాశారని ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
టీటీడీ ఉద్యోగాల పేరిట భారీ మోసం..రూ.5 కోట్లకు పైగా టోకరా!
తిరుపతి క్రైం: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఓ వ్యక్తి నిరుద్యోగులను నమ్మించి కోట్ల రూపాయలు వసూలు చేశాడు. టీటీడీ నకిలీ లోగో, ఈవో స్టాంపులతో దొంగ నియామకపత్రాలు అందించి మోసం చేశాడు. దీనిపై బాధితులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... కిరణ్‌కుమార్‌రెడ్డి అనే వ్యక్తి కొద్దిరోజుల క్రితం తిరుపతిలోని కొందరు నిరుద్యోగులను కలిసి తనను న్యాయవాదిగా పరిచయం చేసుకున్నాడు. టీటీడీలో ఉన్న అన్యమత ఉద్యోగుల స్థానంలో కొత్తగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నారని నమ్మించాడు. టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం జీఎం సుబ్రహ్మణ్యం తనకు బాగా తెలుసునని, ఆయన ద్వారా ఆ ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆశలు కల్పించాడు. జూనియర్ అసిస్టెంట్‌తోపాటు ఇంకా రకరకాల పోస్టులు ఇప్పిస్తానని ఒక్కొక్కరి నుంచి రూ.15 లక్షల నుంచి రూ.50లక్షల వరకు వసూలు చేశాడు. నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి.. మోసగాడు డబ్బులు తీసుకున్న అనంతరం టీటీడీ నకిలీ లెటర్ హెడ్, ఈవో స్టాంపు, సంతకంతో కూడిన అపాయింట్మెంట్ లెటర్లు అందించాడు. అయితే, ఉద్యోగాల్లో చేరిక (జాయినింగ్) ప్రక్రియ కొనసాగుతోందంటూ కొంతకాలం ఆగాలని చెప్పాడు. చాలారోజులు ఎదురు చూసిన బాధితులకు అనుమానం వచ్చి టీటీడీలో ఉద్యోగ నియామకాల గురించి ఆరా తీయగా... ఎటువంటి పోస్టులు భర్తీ చేయలేదని తేలింది. దీంతో తాము మోసపోయామని ఇద్దరు బాధితులు శుక్రవారం తిరుపతి ఈస్ట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఒక యువకుడికి జూనియర్ అసిస్టెంట్ పోస్టు వచ్చినట్లు ఇచ్చిన నకిలీ అపాయింట్మెంట్ లెటర్ తామిద్దరం, తమకు తెలిసిన మరికొందరు కలిపి రూ.కోటి వరకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అసలు కిరణ్‌కుమార్‌రెడ్డి ఎవరు? ఏం చేస్తుంటారు? టీటీడీ నకిలీ లోగో, లెటర్ హెడ్, ఈవో స్టాంప్ తయారు చేయడం, దొంగ నియామకపత్రాలు అందించడం, పెద్ద ఎత్తున ఆరి్థక లావాదేవీలు సాగించడం వెనుక ఇంకా ఎవరి ప్రమేయం అయినా ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. కాగా, 25 మంది వరకు బాధితులు ఉంటారని, వారి నుంచి కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. -
నేను తప్పు చేయలేదు...అంతా నందు భర్తే చేశాడు!
-
అయోధ్య విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్..!
-
లొంగిపోతే మంచిది.. కీలక సాక్ష్యాలను బయటపెడుతున్న మాజీ ఉద్యోగులు
-
మళ్ళీ కలుద్దాం... మీరు ఎప్పుడూ కలవరు.. ఇది గ్యారంటీ కారణం ఇదే
-
నందు మాయం.. ఇక దొరకరు... కనిపించరు..! ఎక్కడికి వెళ్లారంటే
-
కొత్త డ్రామానా..? సంచలన వీడియో రిలీజ్ చేసిన 'నందుస్ వరల్డ్' నందన
-
బయటపడ హెరిటేజ్ ఫుడ్స్ లీలలు బట్టబయలు!
-
కేసు ఏమైంది? లండన్ లో నందూస్ కపుల్ ఎంజాయ్..!
-
కోట్లు కొట్టేసి UKలో హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు
-
నందు లగ్జరీ లైఫ్ వెనుక డార్క్ సీక్రెట్! ఎవరికీ తెలియని నిజాలు ఇవే
-
అయోధ్య విరాళాల స్కామ్ : మాజీ ట్రస్టీకి బిగుస్తున్న ఉచ్చు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్య రామాలయంలో (Ayodhya Ram Temple) విరాళాల కుంభకోణంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కుంభకోణంలో కొనసాగుతున్న సిట్ దర్యాప్తులో నిందితులు దొంగలించిన సొత్తును వాష్‌రూమ్‌ల్లో దాచి పెట్టిన విషయం కలకలం రేపుతోంది. నిందితుల సమాచారంతో ఈ స్కామ్‌లో రామ్ మందిర్ ట్రస్ట్ మాజీ ట్రస్టీ అనిల్ మిశ్రా పాత్రపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. నిందితుడు అవినాష్ మిశ్రాను (శుక్లా) పోలీసులు విచారించినప్పుడు అనిల్ మిశ్రా పేరు పలుమార్లు ప్రస్తావనకు వచ్చింది. విరాళాల లెక్కింపు ప్రక్రియలో అనిల్ మిశ్రా కూడా పాల్గొనేవారని సమాచారం.అరెస్ట్ అయిన ఎనిమిది మంది నిందితుల్లో ఒకరైన అవినాష్ శుక్లా పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించాడు. దొంగిలించిన కోట్లాది రూపాయల నగదును గుడి వెలుపలికి తీసుకెళ్లే ముందు తాత్కాలికంగా వాష్‌రూమ్‌లలో (మరుగుదొడ్లలో) దాచినట్లు ఒప్పుకున్నాడు. విరాళాలు లెక్కించే గది ఒక తాళంచెవి చంపత్ రాయ్ అనుచరుడైన టిన్నూ యాదవ్ వద్ద ఉండగా, రెండో తాళంచెవి బ్యాంక్ ఉద్యోగుల వద్ద ఉండేదని నిందితుడు తెలిపాడు.నిందితులకు ఆలయ ప్రాంగణంలోని సిసిటివి (CCTV) కెమెరాల స్థానాలపై పూర్తి అవగాహన ఉంది. అందుకే నిఘా సిబ్బంది తమ కదలికలను సరిగ్గా గమనించకపోవడాన్ని ఆసరాగా చేసుకుని, కెమెరాల కంటికి చిక్కకుండా ఒకరికొకరు కవర్‌గా నిలబడి డబ్బును దొంగిలించేవారని శుక్లా వివరించాడు. దొంగిలించిన సొమ్ముతో భూములు, ఇళ్లను కొనుగోలు చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసులు వీరి ఆర్థిక లావాదేవీలు, ఆస్తులపై దృష్టి సారించారు.లెక్కింపు గది తాళాలు - బ్యాంక్ సిబ్బంది కుమ్మక్కు:అరెస్ట్ అయిన నిందితుల్లో 'టిన్నూ యాదవ్' (రామశంకర్ యాదవ్) అత్యంత కీలకమైన వ్యక్తిగా తేలాడు. విరాళాలు లెక్కించే గది ఒక తాళంచెవి టిన్నూ యాదవ్ వద్ద ఉండగా, రెండో తాళంచెవి బ్యాంక్ సిబ్బంది వద్ద ఉండేది. కేవలం లోపలి వ్యక్తులే కాకుండా, బ్యాంక్ సిబ్బందితో కూడా కుమ్మక్కై ఈ దొంగతనానికి పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నారు. దొంగిలించిన సొమ్ములో టిన్నూ యాదవ్‌తో పాటు సదరు బ్యాంక్ ఉద్యోగులు కూడా వాటాలు పంచుకున్నట్లు సమాచారం.కాగా విరాళాల లెక్కింపు ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన ఆలయ ట్రస్టీ అనిల్ మిశ్రా, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్‌లు ఈ అవకతవకలపై ప్రశ్నలు తలెత్తడంతో గత వారం తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ కుంభకోణం వ్యవహారంలో యూపీ ప్రభుత్వం జూన్ 13న ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. ఈ SIT విచారణ ప్రారంభించడానికి ముందే పోలీసులు రూ. 58 లక్షలను రికవరీ చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది. ఇదీ చదవండి: కేతన్ హత్య కేసులో మరో ట్విస్ట్ : రూ. 10 కోట్ల డిఫమేషన్ -
దుబాయ్, బెంగళూరులో ఆస్తులు... షాకింగ్ నిజాలు బయటపెట్టిన నందు స్నేహితులు!
-
దోపిడీతో అడ్డంగా దొరికిపోయారు.. అయ్యో ఇప్పుడెలా
-
అమరావతిపై నేను చేసిన వీడియోలు అన్ని డిలీట్ అయిపోయాయి..
-
మీ తండ్రిని జైలులో పెడితే... పారిపోయింది నువ్వు మిస్టర్ లోకేశ్..!
-
అయోధ్య విరాళాల స్కామ్.. కీలక సభ్యుల రాజీనామా
లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కోట్లాది మంది భక్తులు సమర్పించిన కానుకలు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణల నేపథ్యంలో.. అయోధ్య రామమందిర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్‌రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా కూడా బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ పరిణామం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.దర్యాప్తులో భాగంగా ఇప్పటికే చంపత్‌రాయ్ వ్యక్తిగత డ్రైవర్ టిన్ను యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితో పాటు మరో ఎనిమిది మందిని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. ఈ కేసులో అనుకల్ప్ మిశ్రా, లవ్కుష్ మిశ్రా, అవినాష్ శుక్లా, టిన్ను యాదవ్, మనీష్ యాదవ్ తదితరుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 306, 316(5), 317(4), 317(5), 61, 3(5) కింద కేసులు నమోదు చేసి సిట్ దర్యాప్తు కొనసాగిస్తోంది.దర్యాప్తు సంస్థల ప్రాథమిక అంచనాల ప్రకారం.. రామమందిరానికి భక్తులు సమర్పించిన రూ.200 కోట్లకు పైగా విరాళాలు గల్లంతైనట్లు ఆరోపణలు ఉన్నాయి. హుండీల్లో పడిన నగదు, విలువైన కానుకల నిర్వహణలో తీవ్ర అవకతవకలు జరిగినట్లు విచారణలో వెలుగులోకి వస్తున్నట్లు సమాచారం.ఈ కేసులో మరింత సంచలనంగా మారిన అంశం.. సీసీటీవీ ఫుటేజీ మాయమవడం. అలాగే ఆలయ హుండీల తాళాలు అధికారిక ట్రస్ట్ ప్రతినిధుల వద్ద కాకుండా అనధికార వ్యక్తుల వద్ద ఉన్నట్లు సిట్ గుర్తించింది. దీంతో విరాళాల నిర్వహణ వ్యవస్థపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భక్తులు విశ్వాసంతో సమర్పించిన డబ్బు, కానుకలను అంతర్గతంగా ఉన్నవారే దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు కేసుకు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చాయి.ప్రస్తుతం అరెస్టయిన నిందితులను సిట్ అధికారులు ముమ్మరంగా విచారిస్తున్నారు. విరాళాల సొమ్ము ఎక్కడికి మళ్లింది? ఇందులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది? ట్రస్ట్‌లోని మరికొందరికి ఈ వ్యవహారంతో సంబంధాలు ఉన్నాయా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.దేశంలో అత్యంత పవిత్ర క్షేత్రాల్లో ఒకటైన అయోధ్య రామమందిరంలో భక్తుల విశ్వాసానికి ప్రతీకగా సమర్పించిన విరాళాలే అక్రమాలకు గురయ్యాయన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. ట్రస్ట్‌లో ఇద్దరు కీలక సభ్యుల రాజీనామా, పలువురు అరెస్టులు, భారీ విరాళాల మాయంపై ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారింది. ప్రస్తుతం ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు ఫలితాలపైనే అందరి దృష్టి నెలకొంది.యోగి ఏమన్నారంటే.. అయోధ్య విరాళాల చోరీ కేసుపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం స్పందించారు. "అయోధ్య మన విశ్వాసానికి ప్రతీక. అయోధ్యపై నిరాధార ఆరోపణలు చేయొద్దు.. శ్రీరాముడిని గౌరవించడం నేర్చుకోండి. సిట్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ముందే చెప్పాం. ఇప్పుడు నివేదిక వచ్చింది.. చర్యలు కూడా ప్రారంభమయ్యాయి" అని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించిన ఆయన.. "ఈరోజు ఆరోపణలు చేస్తున్నవారే ఒకప్పుడు శ్రీరాముడి ఉనికినే ప్రశ్నించారు. అయోధ్య ఉద్యమాన్ని మొదటి నుంచే వ్యతిరేకించారు. 'జై శ్రీరామ్' నినాదాలు చేసిన వారిపై లాఠీచార్జీలు, కాల్పులు జరిపారు. రామనవమి వేడుకలను అడ్డుకునేందుకు, కావడ్ యాత్రను నిషేధించేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ దేశాన్ని దోచుకోవడమే కాకుండా ముక్కలు చేసింది. ఎవరి వద్దైనా ఆధారాలు ఉంటే వాటిని సిట్‌కు అందించాలి. రామభక్తుల విశ్వాసంతో చెలగాటం ఆడొద్దు" అని యోగి అన్నారు. -
ఇండియాకు నందుస్ వరల్డ్ కపుల్
-
16 రాష్ట్రాల్లో సీబీఐ భారీ దాడులు : ఇద్దరు అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్లు సాగించే 'డిజిటల్ అరెస్ట్' (Digital Arrest) మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దేశవ్యాప్తంగా ఒక భారీ ఆపరేషన్ చేపట్టింది. 'ఆపరేషన్ చక్ర-VI' (Operation Chakra-VI) పేరుతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 16 రాష్ట్రాల్లోని 80కి పైగా ప్రాంతాల్లో సీబీఐ అధికారులుదాడులు నిర్వహించారు. ఈ దాడుల అనంతరం కోల్‌కతాలో ఒకర్ని, చెన్నైలో మరొకరిని అధికారులు అరెస్ట్ చేశారు.సుదీర్ఘ ఆపరేషన్‌లో భాగంగా సీబీఐ ప్రత్యేక బృందాలు గురువారం దేశంలోని 16 రాష్ట్రాలలో 80కి పైగా ప్రదేశాలలో సమన్వయంతో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించాయి. తెలంగా, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ మహారాష్ట్ర, హర్యానా, తమిళనాడు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, అస్సాం, పశ్చిమ బెంగాల్, మణిపూర్, కర్ణాటక, ఒడిశా తదితర ప్రాంతాల్లో ఈ దాడులు చేపట్టింది. నకిలీ (షెల్) కంపెనీలను ఏర్పాటు చేసి, సైబర్ నేరాల సొమ్మును మళ్లించడానికి వీలుగా 'మ్యూల్ బ్యాంక్ ఖాతాలను' (మరోకరి పేరిట తెరిచే ఖాతాలు) నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను చెన్నై, కోల్‌కతాలలో సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు 200 కంటే ఎక్కువ డిజిటల్ అరెస్ట్ స్కామ్ కేసులలో భాగస్వామ్యమై, దేశవ్యాప్తంగా విస్తరించిన ఒక పెద్ద నేరపూరిత నెట్‌వర్క్‌ను పూర్తిగా నిర్మూలించడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం. -
హెచ్చరిక.. వెలుగులోకి కొత్త స్కామ్!
ఇండియన్ సైబర్‌క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ 'బాస్ స్కామ్' అనే కొత్త రకమైన సైబర్ మోసంపై హెచ్చరిక జారీ చేసింది. ఈ మోసంలో సైబర్ నేరగాళ్లు కంపెనీల్లో ఉన్న సీఈఓలు, ఉన్నతాధికారుల పేరుతో నటిస్తూ ఆర్థిక లావాదేవీలు చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు.మోసగాళ్లు సాధారణంగా ఈమెయిల్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించి, తాము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) లేదా ఇతర నియంత్రణ సంస్థల నుంచి మాట్లాడుతున్నామని నమ్మించే ప్రయత్నం చేస్తారు. కంపెనీ ఏదో నియమం ఉల్లంఘించిందని లేదా తక్షణమే సెక్యూరిటీ అప్డేట్ అవసరమని చెప్పి అత్యవసర పరిస్థితి ఉన్నట్లు భయపెడతారు.ఇలా నమ్మిస్తూ ఒక జిప్ ఫైల్ పంపిస్తారు. దాన్ని ఓపెన్ చేసిన వెంటనే కంప్యూటర్లో మాల్వేర్ ఇన్స్టాల్ అవుతుంది. ముఖ్యంగా విండోస్ కంప్యూటర్లను టార్గెట్ చేస్తూ, ఆ సిస్టమ్‌ను హ్యాక్ చేసి, ఆఫీసు వాట్సాప్ వెబ్ అకౌంట్లను కూడా నియంత్రణలోకి తీసుకుంటారు. దీని ద్వారా నేరగాళ్లు నిజమైన సీఈఓ అకౌంట్లా నటించి ఫైనాన్స్ విభాగానికి డబ్బు ట్రాన్స్ఫర్ చేయమని ఆదేశాలు పంపుతారు.కొన్ని సందర్భాల్లో వారు కాంటాక్ట్ లిస్ట్‌ను కూడా మార్చి, దానిలో ఒక నెంబర్‌ను సీఈఓ పేరుతో సేవ్ చేస్తారు. దీంతో ఆ నెంబర్ నుంచి వచ్చిన మెసేజ్ నిజమైనదే అని ఉద్యోగులు నమ్మే అవకాశం ఉంటుంది. ఈ విధంగా భారీ మొత్తంలో డబ్బును మోసపూరిత ఖాతాలకు బదిలీ చేయించుకుంటారు.ఫైనాన్స్ విభాగాలు ఈ మోసానికి ఎక్కువగా గురవుతున్నాయని ఇండియన్ సైబర్‌క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ తెలిపింది. ఎందుకంటే వారు తరచుగా సీనియర్ మేనేజ్మెంట్ ఆదేశాలను నేరుగా పాటిస్తారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రతి సంస్థ కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.ఇలాంటి స్కామ్ నుంచి బయటపడటానికి ముందుగా నిర్దారించుకోవడం మంచిది. ఏదైనా ఎమర్జెన్సీ డబ్బు ట్రాన్స్ఫర్ అభ్యర్థన వచ్చినప్పుడు, అది నిజమా కాదా అని తప్పనిసరిగా ఫోన్ కాల్ లేదా ప్రత్యక్షంగా ధృవీకరించుకోవాలి. అనుమానాస్పద ఫైళ్లను ఎప్పుడూ డౌన్లోడ్ చేయకూడదు. అలాగే అధికారిక సంస్థలు వాట్సాప్ ద్వారా సాఫ్ట్వేర్ అప్డేట్లు పంపవనే విషయం తప్పకుండా గుర్తుంచుకోవాలి.అంతే కాకుండా.. సిస్టమ్‌లలో సెక్యూరిటీ పాలసీలు అమలు చేయడం, వాట్సాప్‌లో లాగిన్ అయిన పరికరాలను తరచూ చెక్ చేయడం, యాంటీ మాల్వేర్ సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్గా ఉంచడం అవసరం. ఈ తరహా సైబర్ మోసాలు జరిగితే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని లేదా జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని ఇండియన్ సైబర్‌క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ప్రజలకు సూచించింది. -
నా దగ్గర ఉన్న ఫ్రూఫ్స్ సజ్జనార్ కి పంపితే.. 24 గంటల్లో నందు స్టోరీ క్లోజ్.!
-
నమ్మితే నట్టేట మునిగినట్టే !
గ్లోబల్ షేర్ మార్కెట్పేరుతో సరికొత్త మోసం తెరపైకి వచ్చింది. రూ.వేలల్లో పెట్టుబడి పెడితే వారం రోజుల వ్యవధిలోనే రూ.లక్షల్లో లాభం ఉంటుందని ప్రకటనలతో ఊరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖుల ఫేక్ వీడియోలతో సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం ముమ్మరం చేశారు. అనంతపురం సిటీ: షేర్ మార్కెట్లలో ఏదో ఒక స్కామ్ బయటపడుతూనే ఉంది. గతంలో మోసగాళ్లు కోల్డ్ కాల్స్‌పై ఆధార పడగా, ప్రస్తుతం పెరిగిన సాంకేతికతను అందిపుచ్చుకుని సామాజిక మాధ్యమాలు, ఏఐ వీడియోలతో పెట్టుబడిదారులను పెడదోవ పట్టిస్తున్నారు. సులువుగా డబ్బు సంపాదించాలనుకుంటున్న యువతనే లక్ష్యంగా సాగుతున్న ఈ మోసాలు తారాస్థాయికి చేరుకున్నాయి. సెబీ కఠిన చర్యలు తీసుకుంటున్నా.. దేశీయంగా స్టాక్ మార్కెట్ మోసాల నియంత్రణకు సెబీ సంస్థ కఠిన చర్యలు తీసుకుంటున్నా... సరికొత్త స్కామ్‌లు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇటీవల షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య ఎక్కువ కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏడాది క్రితం ఇదే సమయంలో సంచలనం రేకెత్తించిన పంప్ అండ్ డంప్ స్కామ్ మరోసారి తెరపైకి వచ్చింది. దేశీయంగా ప్రముఖుల ఫేక్ వీడియోలతో పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నాలూ ఊపందుకున్నాయి. ఆర్థిక మోసాల్లో భాగంగా ముందుగా స్కామర్లు తక్కువ ధర ఉన్న పెన్నీ స్టాక్స్‌ను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి, వాటి విలువను కృత్రిమంగా పెంచేస్తారు. ఆ తర్వాత స్టాక్ గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత ఉన్నఫళంగా మొత్తం విక్రయించి స్టాక్ నుంచి బయటపడిపోతారు. ఇది తెలిసే లోపు స్టాక్ భారీగా పతనమై చిన్న పాటి పెట్టుబడిదారులు మొత్తం సొమ్ము నష్టపోవాల్సి వస్తుంది. ఆకట్టుకునేలా ఏఐ వీడియోలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, విప్రో ప్రేమ్‌జీ, ఇన్ఫోసిస్ సుధానారాయణమూర్తి తదితర ప్రముఖుల ఫేక్ వీడియోలతో పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రకటనలు ఊపందుకున్నాయి. ఇందులో రూ.22 వేలు ఒక్కసారి పెట్టుబడి పెడితే... ఎలాంటి పని చేయకపోయినా వారం రోజుల తర్వాత రూ.5.50 లక్షలు అందుతుందని స్వయంగా వారు మాట్లాడుతున్నట్లుగా వీడియోలను రూపొందించడం గమనార్హం. ఈ వీడియోల పట్ల ఆకర్షితులైన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు ఎంతో ఆశతో పెట్టుబడులు పెట్టారు. వారం రోజుల తర్వాత కూడా ఎలాంటి మార్పు లేకపోవడంతో తాము మోసపోయినట్లుగా నిర్ధారించుకుని, పెట్టుబడి వెనక్కు తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆ మొత్తం కూడా వెనక్కు రాకపోవడంతో ప్రస్తుతం లబోదిబో మంటున్నారు. ఈ లెక్కన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మోసపోయిన వారి సంఖ్య వందల్లో ఉంటుందని సమాచారం. -
ఏఐ తెచ్చిన పెళ్లి సంబంధం.. జేబుకు పెట్టింది పెద్ద కన్నం!
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వెలుగుచూసిన ఒక విస్తుపోయే మ్యాట్రిమోనియల్ మోసం కలకలం రేపుతోంది. కృత్రిమ మేధస్సు (ఏఐ), అధునాతన ఎడిటింగ్ టూల్స్ సాయంతో నకిలీ పెళ్లికూతుళ్ల ప్రొఫైళ్లను సృష్టించి, పెళ్లికాని యువకులను నిలువునా ముంచేస్తున్న ఒక కేటుగాళ్ల ముఠాను కాన్పూర్ పోలీసులు రట్టు చేశారు. కేవలం ఫోటోలు, మాయమాటలతో నమ్మిస్తూ, ఒక బాధితుడి నుంచే ఏకంగా నాలుగు లక్షల రూపాయల వరకు వసూలు చేసిన ఈ గ్యాంగ్ ఉదంతం డిజిటల్ యుగంలో జరుగుతున్న సరికొత్త నేరాలకు అద్దం పడుతోంది.డేటా చోరీ.. మాయమాటల వలపోలీసుల దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం.. ఈ ముఠా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల నుంచి పెళ్లికాని యువకుల వ్యక్తిగత డేటాను సేకరించేది. ఆ తర్వాత తాము నడుపుతున్న కాల్ సెంటర్ల ద్వారా టెలికాలర్లతో మ్యారేజ్ కౌన్సిలర్లుగా ఫోన్లు చేయించేవారు. ‘మీ ప్రొఫైల్‌కు తగ్గ పర్ఫెక్ట్ మ్యాచ్ దొరికింది’ అంటూ మధురమైన గొంతుతో యువకులను నమ్మించేవారు. ఇంటర్నెట్ నుండి సాధారణ మహిళల ఫోటోలను డౌన్లోడ్ చేసి, వాటిని ఏఐ టూల్స్ ద్వారా అత్యంత ఆకర్షణీయమైన ప్రొఫైళ్లుగా మార్చి బాధితులకు పంపేవారు.విడతల వారీగా దోపిడీఈ గ్యాంగ్ ‘పర్ఫెక్ట్ రిష్తా’, ‘షాదీ మ్యాచ్’, ‘షాదీ మ్యాచ్ ఇండియా’ వంటి నకిలీ వెబ్సైట్ల ద్వారా తమ కార్యకలాపాలు సాగించింది. బాధితులు ఆ అందమైన అమ్మాయిల ఫోటోలను చూసి నిజమేనని నమ్మిన తర్వాత అసలు దోపిడీ మొదలయ్యేది. మొదట రిజిస్ట్రేషన్ ఫీజు, ఆ తర్వాత ప్రొఫైల్ యాక్టివేషన్ చార్జీలు, సంబంధం ఖాయం చేయడానికి ఫీజు, చివరికి అమ్మాయితో మాట్లాడించడానికి లేదా ముఖాముఖి భేటీ ఏర్పాటు చేయడానికి అంటూ రకరకాల పేర్లతో లక్షలాది రూపాయలు గుంజేవారు. ఏడాది కాలంలో ఇలా వేలాది మందిని ముంచినా, ఒక్కరికి కూడా పెళ్లి చేయలేదు.పోలీసుల మెరుపు దాడి.. నిందితుల అరెస్ట్ఒక బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కాన్పూర్ పోలీస్ కమిషనర్ రఘువీర్ లాల్ ఆదేశాల మేరకు, ఐపీఎస్ అధికారిణి అంజలి విశ్వకర్మ నేతృత్వంలో ప్రత్యేక బృందం మూడు చోట్ల ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించింది. ఈ కేసులో రంజిత్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయగా, లీగల్ సలహాదారుడిగా ఉన్న అమిత్ కుమార్, జాగ్రతి సహా మరికొందరు పరారీలో ఉన్నారు. ఘటనా స్థలం నుండి డజన్ల కొద్దీ మొబైల్ ఫోన్లు, రిజిస్టర్లు, బ్యాంకు పత్రాలు, ఏటీఎం కార్డులు, కంప్యూటర్ సిస్టమ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఇది కూడా చదవండి: నీట్ వివాదం వేళ 19 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య -
‘ఈ–స్టాంపు’ల కుంభకోణం దర్యాప్తు పురోగతి ఏంటి?
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ఆయన కంపెనీ ఎస్ఆర్సీ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వేల కోట్ల రూపాయల భారీ ‘ఈ–స్టాంప్’ కుంభకోణానికి పాల్పడిందంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు పురోగతి పూర్తి వివరాలను (స్టేటస్ రిపోర్ట్) తమ ముందుంచాలని సీఐడీ దర్యాప్తు అధికారిని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి నైనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతక్రితం పిటిషనర్ మాజీ ఎంపీ తలారి రంగయ్య తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ‘ఇది రూ.2,500 కోట్ల కుంభకోణం. ఎంతో పలుకుబడి కలిగిన ఎమ్మెల్యే సురేంద్రబాబుది ఇందులో కీలక పాత్ర. ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ గత ఏడాది అక్టోబర్ 7న హైకోర్టులో ఈ పిల్ దాఖలు చేశాం. ఆ మరుసటి రోజే ప్రభుత్వం కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించింది. అయితే సీఐడీ ఇప్పటి వరకు ఏం చేసిందో తెలియడం లేదు’ అని వివరించారు.ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి ఈ సందర్భంగా స్పందిస్తూ కుంభకోణంపై మూడు కేసులు నమోదయ్యాయని ధర్మాసనానికి తెలిపారు. 14వేల లావాదేవీలు జరిగాయని, మొత్తం రికార్డులను జప్తు చేశామని పేర్కొంటూ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదిక రాగానే సంబంధిత కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేస్తామని తెలిపారు. పిల్ వివరాలుఅనంతపురం జిల్లా, కళ్యాణదుర్గంలో బోయ యర్రప్ప.. ‘బాబు మీ సేవా కేంద్రం’ నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రం లైసెన్స్ భార్య భార్గవి పేరు మీద ఉంది. అయితే ఇప్పటి వరకు యర్రప్ప 15,851 ఈ–స్టాంపులను తారుమారు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబుతో కలిసి భారీ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారు. తద్వారా ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల నష్టం కలిగించారు. ఎమ్మెల్యేకు చెందిన ఎస్ఆర్సీ ఇన్ఫ్రా కంపెనీ బెంగళూరులో ఉన్నప్పటికీ, కళ్యాణదుర్గం మీ సేవా కేంద్రం నుంచి తక్కువ విలువ కలిగిన ‘ఈ–స్టాంపు’లను కొనుగోలు చేసి, వాటిని ఎక్కువ విలువ కలిగిన ఈ స్టాంపులుగా మార్చి పలు బ్యాంకుల్లో భారీ ఆర్థిక లావాదేవీలు నిర్వహించింది.ఈ భారీ కుంభకోణంపై స్టాంప్స్ ఐజీ, డీజీపీ, జిల్లా ఎస్పీకి పిటిషనర్ ఫిర్యాదు చేశారు. పిటిషనర్ ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని సీరియస్ ఫ్రాండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) నుంచి డీజీపీకి లేఖ వెళ్లింది. అయినా ఎవ్వరినుంచీ స్పందనలేదు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై సీబీఐ, ఈడీ, ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తునకు ఆదేశించడంతో పాటు, దర్యాప్తుపై రాజకీయ ప్రభావం లేకుండా ఉండేందుకు దర్యాప్తును హైకోర్టు స్వయంగా పర్యవేక్షించాలని కోరుతూ పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు.36 గంటలు ఎలా పని చేయిస్తున్నారు?పీజీ వైద్య విద్యార్థుల పనిగంటలపై హైకోర్టు ఆందోళనవారి ఉపశమనం కోసం ఏం చేస్తున్నారో చెప్పండిరాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశంసాక్షి, అమరావతి: ప్రభుత్వ, బోధనాసుపత్రుల్లో పీజీ వైద్య విద్యార్థుల సుదీర్ఘ పనిగంటల పట్ల హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. నిరంతరాయంగా వారి చేత 36 గంటలు ఎలా పని చేయిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అత్యవసర పరిస్థితుల్లో వారు ఏకంగా 72 గంటలు ఏకబిగిన పనిచేస్తున్న విషయాన్ని కూడా హైకోర్టు ప్రస్తావించింది. అసాధారణ పని గంటల నుంచి పీజీ వైద్య విద్యార్థులకు ఉపశమనం కలిగించేందుకు ఏ చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరుకు చెందిన ప్రముఖ వైద్యులు ఆలా వెంకటేశ్వర్లు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) తాజా విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది ఠాకూర్ యాదవ్ వాదనలు వినిపిస్తూ, ‘నిబంధనల ప్రకారం పీజీ వైద్య విద్యార్థులు 12 గంటలకు మించి పని చేయడానికి వీల్లేదు. అత్యవసర పరిస్థితుల్లో 24 గంటలకు మించి సేవలు అందించాల్సిన అవసరం లేదు. నిబంధనలకు అనుగుణంగా పనిగంటలు అమలయ్యేలా ఆదేశాలు ఇవ్వండి’ అని విన్నవించారు. -
ఉతికారేసిన లక్ష్మి పార్వతి, దమ్ముంటే రా...
-
Viral Video: ఇరికించిన బాధితులను బెదిరిస్తున్న నందుస్ కపుల్..
-
రూ. 14 వేల నుంచి రూ. 10 లక్షల స్కాం : ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వార్నింగ్
నీట్ యూజీ (NEET UG-2026 రీ-ఎగ్జామ్‌కు సమయం సమీపిస్తున్న వేళ, పేపర్ల లీక్‌పై పలు వార్తలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం టెలిగ్రామ్‌పై తాత్కాలికంగా నిషేధం విధించినంత మాత్రాన సరిపోతుందా? మిగిలిన యాప్‌లను ఎలా నియంత్రిస్తారు? అంటూ పరీక్ష వ్యవస్థపై, భద్రతపై అనేక సందేహాలు, విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పరీక్షకు ముందే క్వశ్చన్ పేపర్లు ఇస్తామంటూ ఆన్లైన్లో జరుగుతున్న మోసాల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి. కామకోటి హెచ్చరించారు. నీట్ రీ-ఎగ్జామ్‌కు సంబంధించి ఎలాంటి పేపర్ లీక్ కాలేదని, ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మి మోసపోవద్దని ఆయన స్పష్టం చేశారు.సోషల్ మీడియాలో పంచుకున్నఒక వీడియో సందేశంలో, జూన్ 21న జరగబోయే రీ-ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లు లీక్ అయ్యాయంటూ టెలిగ్రామ్ (Telegram) ఛానెళ్లలో వస్తున్న ప్రకటనలను నమ్మవద్దని ఆయన కోరారు. పరీక్ష ఒత్తిడిలో ఉన్న విద్యార్థులే టార్గెట్‌గా, అబద్ధపు వాగ్దానాలతో ఈ కేటుగాళ్లు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.రూ. 14 వేల నుండి రూ. 10 లక్షల దాకాకొన్ని టెలిగ్రామ్ ఛానెళ్లు లీకైన పేపర్లు ఇస్తామంటూ విద్యార్థుల నుండి రూ. 14వేల రూ. 25వేలవరకు డిమాండ్ చేస్తున్నాయని కామకోటి తెలిపారు. మరికొన్ని కేసుల్లో ఏకంగా రూ. 10 లక్షల వరకు కూడా డిమాండ్ చేసినట్లు రిపోర్టులు వచ్చాయన్నారు.టెలిగ్రామ్ ఛానెళ్లలో పేపర్ లీక్ అయినట్లు చూపే స్క్రీన్షాట్లు, వీడియోలు ఎలా సృష్టిస్తారో ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వివరించారు. ఛానెల్ అడ్మిన్లు పాత మెసేజ్‌లను ఎడిట్ చేసి, ఒరిజినల్ డేట్ (పాత తేదీ) మారకుండానే అందులో కొత్త కంటెంట్‌ను పెట్టగలరు.దీనివల్ల పరీక్షకు ముందే పేపర్ షేర్ చేసినట్లు తప్పుగా కనిపిస్తుంది.జూన్ 21న పరీక్ష ముగిసిన తర్వాత కూడా ఇలాంటి ఎడిట్ చేసిన స్క్రీన్షాట్లు, తప్పుడు పోస్టులు మళ్లీ వచ్చే అవకాశం ఉందని, కాబట్టి వాటిని ఫార్వార్డ్ చేయవద్దని, ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ఆయన హెచ్చరించారు. ఒక్కసారి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే, వాటిని తిరిగి రాబట్టడం అసాధ్యమని కామకోటి చెప్పారు. అలాగే అపరిచిత వ్యక్తులతో అడ్మిట్ కార్డ్‌లు (Admit Cards), ఫోన్ నంబర్లు లాంటి వ్యక్తిగత వివరాలను షేర్ చేయొద్దని స్కామర్లు దీన్ని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇదీ చదవండి: ఒక్క రీల్‌కు రూ. 76 లక్షలు, లంచ్‌కి 20 లక్షలు : ఎలా?విద్యార్థులు కేవలం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారిక వెబ్సైట్ , ఛానెళ్ల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలి. ఫేక్ మెసేజ్‌లు, ఫార్వార్డ్ మెసేజ్‌ల పట్ల అప్రతమత్తంగా ఉండాలన్నారు. ఒకవేళ ఇలాంటి సైబర్ మోసాలు లేదా అనుమానాస్పద మెసేజ్‌లు కనిపిస్తే, వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.ఇదీ చదవండి: అఫ్గాన్‌లో సోలో ట్రిప్, భారతీయ మహిళ భావోద్వేగం, దురంధర్ నటుడు కూడా!To every NEET candidate and parent - please watch this. A few minutes that could save you serious money and stress this week.Scammers on Telegram were running two rackets targeting you:1️⃣ Channels demanding ₹14,000 to ₹25,000 - some even ₹10 lakh - claiming they'll send you… pic.twitter.com/aqpickJLAv— National Testing Agency (@NTA_Exams) June 16, 2026 -
నాలుగు కంపెనీలకు COS రద్దు.. ఎందుకంటే ?
-
మాకు CCTV ఫ్యూటేజ్ చూపించండి అంటే వాళ్ళు చెప్పిన సమాధానం..
-
టీచర్స్ స్కామ్.. అభిషేక్ బెనర్జీపై ప్రశ్నల వర్షం
సాక్షి, కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన భారీ అవినీతి స్కామ్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ లోతైన విచారణ జరుపుతుంది. ఈ అంశంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీని ఈ రోజు (సోమవారం) అధికారులు విచారించారు. కోల్‌కతాలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా నిన్న ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసులో అధికారులు అభిషేక్ బెనర్జీని దాదాపు ఎనిమిదిన్నర గంటల పాటు విచారించారు.మనీ లాండరింగ్, ఆర్థిక లావాదేవీలు ,నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాల్లో ఆయన పాత్రపై ఈడీ అభిషేక్ బెనర్జీని సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. డబ్బుకు బదులుగా ఉద్యోగాలు ఇప్పించేందుకు ఒక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారని ఆరోపిస్తోంది. ఈనెట్‌వర్క్ ద్వారా, అర్హులైన అభ్యర్థుల కంటే లంచాలు చెల్లించిన వ్యక్తులకే ప్రాధాన్యత లభించిందని దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది. స్కామ్ నేపథ్యంపశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్, పశ్చిమ బెంగాల్ ప్రాథమిక విద్యా మండలి ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో గ్రూప్-సి, గ్రూప్-డి సిబ్బందితో పాటు ప్రైమరీ, సెకండరీ, హయ్యర్ సెకండరీ ఉపాధ్యాయుల నియామకాల కోసం పరీక్షలు నిర్వహించారు. అయితే, అర్హత గల అభ్యర్థులను పక్కన పెట్టి, పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుని అర్హత లేని వారికి, తక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చారనేది ప్రధాన ఆరోపణ. అక్రమాల కోసం OMR షీట్ల తారుమారు చేశారని కొందరు ఖాళీ పేపర్లు వదిలినా వారికి ఉద్యోగాలు వచ్చాయని, అధికారిక అర్హత లేకపోయినా, అక్రమ మార్గాల్లో వందలాది మందికి నకిలీ సిఫార్సు లేఖల ద్వారా నియామక పత్రాలు అందజేశారు. అర్హులైన అభ్యర్థుల పేర్లను వెనుకకు నెట్టి, లంచాలు ఇచ్చిన వారి పేర్లను మెరిట్ లిస్ట్‌లో పైకి చేర్చారని ఆరోపణలున్నాయి. దీంతో ఈ స్కామ్‌పై కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణ ప్రారంభించాయి. పశ్చిమ బెంగాల్ మాజీ విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీని, ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీని ED అరెస్ట్ చేసింది. అర్పితా ముఖర్జీ నివాసాల నుంచి సుమారు రూ. 50 కోట్లకు పైగా నగదు, భారీగా బంగారం, ఆస్తుల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకోవడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. -
వేరే దేశానికి జంప్.! లాయర్ చెప్పిన షాకింగ్ నిజాలు
-
నందూస్ వరల్డ్ కేసులో అదిరిపోయే ట్విస్ట్.. మోసం వెనుక అసలు కారణం..?
-
నందూస్ వరల్డ్ స్కామ్.. ఎక్కడికి పారిపోయినా UK గవర్నమెంట్ వాళ్ళని వదిలిపెట్టదు..
-
నందూస్ స్కాం మిస్టరీ..! బయటపడుతున్న కీలక సీక్రెట్స్
-
నందూస్ స్కాం మిస్టరీ..! బయటపడుతున్న కీలక సీక్రెట్స్
-
అసలు ఆధారాలు ఏమైనా ఉన్నాయా..? అడ్వకేట్ బాల షాకింగ్ కామెంట్స్!
-
ఏ క్షణమైనా అరెస్ట్ పరారీలో నందుస్ ఫ్యామిలీ
-
నందూస్ వరల్డ్‌పై భారీ ఆరోపణలు, తవ్వే కొద్దీ బయటకొస్తున్న మోసాలు
-
భర్తది ఏం లేదు... మాస్టర్మెండ్ నందునే?
-
బిగ్ ట్విస్ట్! పరారీలో నందుస్ ఫ్యామిలీ!
-
DSC స్కామ్ లో లోకేష్ అడ్డంగా ఇరుక్కుపోయాడు.. బాబులో టెన్షన్..
-
డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా అతిపెద్ద స్కామ్
స్పోర్ట్స్ కోటా అన్నది పెద్ద కుంభకోణం. నిజంగా కష్టపడ్డ క్రీడాకారులకు అన్యాయం జరిగింది. జీవో నంబర్ 4, జీవో నంబర్ 47లతో చంద్రబాబు, ఆయన కొడుకు ముందుగానే వేసిన ‘స్కామ్‌ల పాలసీ స్కెచ్’ ఇది. గతంలో ఎప్పుడూ జరగని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఎవ్వరూ డీఎస్సీ పరీక్ష, టెట్ రాయాల్సిన అవసరం లేకుండా, బ్యాక్ డోర్ ద్వారా వారిని లోపలికి తీసుకున్నారు. దీనికోసం కొత్త జీవోలు తెచ్చారు. అనుకున్న వారితో పోస్టులు నింపాక, మళ్లీ పాలసీ మార్చారు. స్పోర్ట్స్ కోటాను 2% నుంచి 3%కు పెంచి బ్యాక్ డోర్ ద్వారా లోపలికి తీసుకున్నారు. కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఆధారంగా.. అదీ పతకాలు లేకపోయినా పర్వాలేదు.. పాల్గొంటే చాలంటూ ఉద్యోగాలు ఇచ్చేలా నిబంధనను మార్చారు. ఇందుకోసం జీవోల జారీకి ముందుగానే వసూళ్ల కార్యక్రమం మొదలైపోయింది. కొన్ని పోస్టులకు అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత ఐదేళ్లలో డిగ్రీ పూర్తి చేసి సర్టిఫికెట్ ఇవ్వొచ్చని మినహాయింపు ఇవ్వడం దారుణం. స్పోర్ట్స్‌లో ఆటగాళ్ల ప్రతిభను చూడలేదు.. ఫలితాలు చూడలేదు.. బ్యాకప్ సర్టిఫికెట్స్ లేవు.. ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ కాలేజీ, ఇంటర్ యూనివర్సిటీ క్రీడల్లో పార్టిసిపేట్ చేసిన సర్టిఫికెట్స్లోనూ పోస్టులు ఇచ్చేశారు. ఆయా గేమ్స్‌లో పాల్లొన్నట్లు సర్టిఫికెట్స్ కూడా వాళ్లే ఇచ్చారు. ఇలా బాల్ బాడ్మింటన్‌లో 48 మందికి, ఖోఖోలో 49 మందికి, జూడోలో 39 మందికి, సాఫ్ట్ బాల్లో 38 మందికి, ఫెన్సింగ్‌లో 13 మందికి ఉద్యోగాలు వచ్చాయి.డీఎస్సీ స్కామ్‌కు సంబంధించి ఆధారాలు సహా ఫ్యాక్ట్స్, ఫిగర్స్ ఇంత క్రిస్టల్ క్లియర్‌గా కన్పిస్తున్నప్పుడు ప్రభుత్వం సరైన సమాధానం చెప్పకపోగా, ఎదురుదాడి చేస్తూ అబద్ధాన్ని కప్పిపుచ్చుకునే కార్యక్రమం చేస్తోంది. పోలీసులు, అధికారులు వీళ్ల మనుషులే.. సీఎం కుమారుడు నారా లోకేశ్ విద్యా శాఖ మంత్రి. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వ విచారణలో న్యాయం ఎలా జరుగుతుంది? థర్డ్ పార్టీ ఎంక్వైరీ జరగాలి. సీబీఐతో విచారణ జరిపించాలి. ప్రభుత్వం ఇన్ని తప్పులు చేస్తున్నప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అలాగని నిర్దాక్షిణ్యంగా నలిపేస్తే ఆటోమేటిక్‌గా కోట్ల మంది కాక్రోచ్లు వస్తారు. -వైఎస్ జగన్సాక్షి, అమరావతి : డీఎస్సీలో మోసపోయిన ప్రతి విద్యార్థి ఒక కాక్రోచ్ (బొద్దింక)గా మారి చంద్రబాబును కాటేస్తారని.. ఈ జెన్ జెడ్, జెన్ ఆల్ఫా కాలంలో విద్యార్థులను ఎవరూ నియంత్రించలేరని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఆపేకొద్దీ ఇంతింతై, వటుడింతై అన్నట్లు దగాపడ్డ యువత కాక్రోచ్లై బాబును కాటేయడం ఖాయమని నిప్పులు చెరిగారు. గురువారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. స్పోర్ట్స్ కోటా రూపంలో చంద్రబాబు సర్కారు డీఎస్సీలో భారీ స్కామ్ చేసిందని, దొడ్డిదారిన తమ వారికి ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి జీవోల పేరిట స్కామ్‌కు స్కెచ్ వేశారని మండిపడ్డారు. డీఎస్సీ పరీక్ష రాయకుండానే, ఎటువంటి డిగ్రీ అర్హత లేకుండానే.. ఆటల్లో ఎటువంటి ప్రతిభ కనపర్చకుండానే మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లిష్, హిందీ టీచర్లుగా చంద్రబాబు సర్కారు వందలాది మందిని నియమించేసిందని ఎత్తి చూపారు. జిల్లా, కాలేజీ, విశ్వవిద్యాలయ స్థాయి పోటీల్లో పతకాలు గెలవకపోయినా కేవలం పాల్గొన్నారని వీళ్ల ఎమ్మెల్యేలు, ఎంపీలు అధ్యక్షులుగా ఉన్న క్రీడా సంఘాల చేత సర్టిఫికెట్లు ఇప్పించి ఉద్యోగాలు ఇచ్చేశారని ఆధార సహితంగా వివరించారు. ఇందుకోసం జీవో నంబర్ 4, జీవో నంబర్ 47లను తీసుకొచ్చిన చంద్రబాబు సర్కారు.. నియామక ప్రక్రియ పూర్తికాగానే వాటిని రద్దు చేసి, కొత్త జీవోలు తీసుకొచ్చిందని నిప్పులు చెరిగారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలు పక్కా సాక్ష్యాలతో కనపడుతున్నా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రశ్నించిన వారిపై ఎదురు దాడికి దిగుతోందని, మొత్తం డీఎస్సీ నియామక ప్రక్రియపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీలో దగాపడ్డ అభ్యర్థులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, ప్రభుత్వం దిగిరాకపోతే వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కమిషన్ వేసి మోసపోయిన విద్యార్థులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమాలపై వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..నిజమైన క్రీడాకారులకు అన్యాయం» ‘‘స్పోర్ట్స్ కోటా అన్నది ఇంకో పెద్ద కుంభకోణం. ప్రతిభ ఉన్న వారికే కాదు, నిజంగా కష్టపడ్డ క్రీడాకారుడికి కూడా అన్యాయం జరిగింది. జీవో నంబర్ 4, జీవో నంబర్ 47లతో చంద్రబాబు, ఆయన కొడుకు ముందుగానే వేసిన ‘స్కామ్‌ల పాలసీ స్కెచ్’ ఇది. గతంలో ఎప్పుడూ జరగని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఎవ్వరూ డీఎస్సీ పరీక్ష రాయాల్సిన అవసరం లేకుండా, ఒక బ్యాక్ డోర్ పెట్టి.. దాని ద్వారా వారిని లోపలికి తీసుకున్నారు. దీనికోసం కొత్త జీవోలు తెచ్చారు. పని అయిపోయాక, అనుకున్న వారితో నింపాక, మళ్లీ పాలసీ మార్చారు. తెచ్చిన జీవోలను తీసేశారు. » గతంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏ రిక్రూట్‌మెంట్‌లోనైనా క్రీడాకారులకు 2% రిజర్వేషన్ ఉంది. అయితే ఆ ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్‌లో మిగతా అభ్యర్థులతోపాటు వీరు కూడా ఎగ్జామ్స్ రాసి కచ్చితంగా క్వాలిఫై కావాలన్న నిబంధన ఉండేది. అలాంటి నిబంధనను చంద్రబాబు మొత్తం మార్చేశారు. » స్పోర్ట్స్ కోటాను 2% నుంచి 3%కు పెంచి బ్యాక్ డోర్ ద్వారా లోపలికి తీసుకువచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా కొత్త జీవోలు నంబర్ 4, జీవో నంబర్ 47 తీసుకొచ్చారు. గతంలో జీవో నంబర్ 74 ప్రకారం డీఎస్సీ తప్పకుండా ఉత్తీర్ణత కావాలి. ఈ నిబంధనను రద్దు చేస్తూ స్పోర్ట్స్ కోటా రెండు శాతం నుంచి మూడు శాతానికి పెంచారు. డీఎస్సీ ఎగ్జామ్ రాత పరీక్ష లేకుండా కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఆధారంగా ఇచ్చేలా నిబంధనను మార్చారు.» ఇంగ్లిష్, హిందీ, మాథ్స్, సోషల్ సైన్స్ సబ్జెక్టులకు డీఎస్సీ ఎగ్జామ్ రాయకుండానే ఉద్యోగాలిచ్చారు. ఇందుకోసం జీవోలు జారీకి ముందుగానే వారి దగ్గర నుంచి వసూళ్ల కార్యక్రమం మొదలైపోయింది. ఆ తర్వాత జీవోలు జారీ చేయడం మొదలు పెట్టారు. ఇంకా కొన్ని పోస్టులకు అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత ఐదేళ్లలో డిగ్రీ పూర్తి చేసి సర్టిఫికెట్ ఇవ్వొచ్చని మినహాయింపు ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా అంటే నిజమైన ఆటగాళ్ల ప్రతిభకు గౌరవం. దీన్ని ఉద్యోగాల దళారీ వ్యవస్థగా ఈ ప్రభుత్వం మార్చేసింది. డీఎస్సీ 2025 ప్రక్రియ ముగియగానే స్పోర్ట్స్ కోటాలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎత్తివేస్తూ ఆయా శాఖలు నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని జారీ చేసిన జీవో నెం.23 క్రీడాకారుల పేరుతో చేస్తున్న స్కామ్స్పోర్ట్స్లో ఆటగాళ్ల ప్రతిభను చూడలేదు.. ఫలితాలు చూడలేదు.. బ్యాకప్ సర్టిఫికెట్స్ లేవు.. ఎటువంటి పతకాలు, సర్టిఫికెట్స్ లేకుండా కేవలం ఆటల్లో పాల్గొన్నట్లు సర్టిఫికెట్ ఉంటే చాలు ఉద్యోగాలు ఇచ్చేశారు. ఆ స్పోర్ట్స్ కూడా ఏమిటంటే ఇంటర్ డిస్ట్రిక్ట్ (అంతర్ జిల్లా), ఇంటర్ కాలేజీ, ఇంటర్ యూనివర్సిటీ క్రీడల్లో పాల్గొంటే చాలు. అక్కడ కూడా మెడల్స్ అవసరం లేదు. కేవలం పార్టిసిపేట్ చేసిన సర్టిఫికెట్స్‌తో పోస్టులు ఇచ్చేశారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఆయా గేమ్స్‌లో పాల్లొన్నట్లు సర్టిఫికెట్స్ కూడా వాళ్లే ఇచ్చారు. బాల్ బాడ్మింటన్‌లో 48 మందికి, ఖోఖోలో 49 మందికి, జూడోలో 39 మందికి, సాఫ్ట్‌బాల్‌లో 38 మందికి, ఫెన్సింగ్‌లో 13 మందికి.. కేవలం ఆయా గేమ్స్‌లో పాల్గొన్నందుకే ఉద్యోగాలు వచ్చాయి. ఇందులో సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు టీడీపీ నేత, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్. జూడో అసోసియేషన్ ప్రెసిడెంట్ లోకేశ్ తోడల్లుడు, విశాఖ ఎంపీ భరత్. అంటే వీళ్లే పాల్గొన్న వారికి సర్టిఫికెట్స్ ఇస్తారు.. వీళ్లే ధ్రువీకరిస్తారు. క్రీడల్లో పాల్గొంటే చాలు ఉద్యోగంవివిధ కాలేజీల మధ్య ఆటల పోటీల్లో పాల్గొన్నందుకు 99 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇందులో పతకాలు, ట్రోఫీలు రాని 86 మందికి ఉద్యోగాలు ఇచ్చేశారు. వీళ్లకు పతకాలు రాలేదు, చెప్పకోదగ్గ టోర్నమెంట్లలో విజయాలు లేవు. జస్ట్ పార్టిసిపేట్ (పాల్గొన్నారు) చేశారంతే. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఇచ్చిన జాబితా చూస్తే.. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి 37, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి 31, నాగార్జున యూనివర్సిటీ నుంచి 28, ఆది కవి నన్నయ యూనివర్సిటీ నుంచి 19, రాయలసీమ యూనివర్సిటీ నుంచి 15, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి 14, యోగి వేమన వర్సిటీ నుంచి 7, డాక్టర్ అంబేడ్కర్ యూనివర్సిటీ నుంచి 4, సంస్కృత యూనివర్సిటీ నుంచి 2, మిగతా యూనివర్సిటీల నుంచి ఒక్కో సర్టిఫికెట్ ఉన్నాయి. ఇంటర్ కాలేజియేట్ పోటీల్లో.. అంటే వివిధ కాలేజీల మధ్య జరిగే పోటీల్లో పాల్గొన్న 99 మందికి టీచర్ ఉద్యోగాలు దక్కాయి. మెడల్స్, ట్రోఫీలు రాకపోయినా కేవలం పార్టిసిపేట్ చేసినందుకే 86 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీలకు సంబంధించి 59 మందికి ఉద్యోగాలు వస్తే, అందులో పార్టిసిపేట్ చేసినందుకే 18 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. జిల్లా తరఫున ఆడితే చాలు.. గెలుపుతో సంబంధం లేకుండా, డీఎస్సీ పరీక్షలు రాయాల్సిన వసరం లేకుండా కేవలం పార్టిసిపేట్ చేసినందుకు టీచర్ ఉద్యోగం ఇచ్చేశారు.నా పక్కనే ఉన్న (వైఎస్ జగన్ పక్కన కూర్చున్నారు) పోలవరానికి చెందిన గిరిజన క్రీడాకారుడు నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ అనిగి దుర్గయ్యకు ఉద్యోగం రాలేదు. 1:1 నిష్పత్తిలో కాల్ లెటర్ వచ్చిన తర్వాత కూడా ఇవ్వలేదు. డేటా అప్‌లోడ్‌లో సిల్వర్ మెడల్ అని రాయడంతో ఇవ్వలేదంటున్నారు. గోల్డ్ మెడల్ వచ్చినవాడు ఎవడైనా సిల్వర్ మెడల్ అని రాస్తాడా? అయినా ఆటల్లో పాల్గొంటేనే ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు, ఇక్కడ ఏదో మెడల్ వచ్చినా ఎందుకు ఇవ్వలేదు? ఆయన 2002లో విశాఖ, హైదరాబాద్‌లో జరిగిన నేషనల్ గేమ్స్‌లో ఫస్ట్ ప్లేస్ గోల్డ్ మెడలిస్ట్. తర్వాత సీనియర్స్ నేషనల్స్, జార్ఖండ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్, యూత్ స్పోర్ట్స్ కలకత్తాలో మూడు గోల్డ్ మెడల్స్ వచ్చాయి. అయినా ఉద్యోగం ఇవ్వలేదు.అయినా ఇంటర్ కాలేజీ, ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ యూనివర్సిటీ ఆటల్లో పాల్గొంటేనే ఇస్తున్నావు కదా.. అదే జాతీయ స్థాయిలో పతకం సాధించినవాడికి ఎందుకు ఇవ్వలేదు? ఇదెక్కడి న్యాయం? నిజంగా ఇది కచ్చితమైన క్రీడాకారులకు జరిగిన అవమానం కాదా? ఇది క్రీడాకారుల పేరుతో చేస్తున్న స్కామ్ కాదా? ముందు తన వాళ్లకు ఉద్యోగాలు వచ్చే విధంగా జీవో నంబర్ 4, జీవో నంబర్ 47 తీసుకొచ్చి గేట్లు తెరిచాడు. వాళ్ల వాళ్లకి ఉద్యోగాలు ఇచ్చేశాక జీవో నంబర్ 23, జీవో 25, జీవో 56లతో పాత జీవోలను రద్దు చేస్తూ గేట్లు మూసేశారు. ఇదిస్కాం కాకపోతే ఏమిటి స్వామీ?నీ బుద్ది పుట్టినప్పుడు జీవోలు ఇస్తున్నావు.. నీ బుద్ది పుట్టినట్లు జీవోలు రద్దు చేస్తున్నావు. ఇవి అంత మంచి జీవోలు అని నువ్వు అనుకున్నట్లయితే జీవో నంబర్ 4, జీవో నంబర్ 47ని ఎందుకు రద్దు చేశావు చంద్రబాబూ? సెలక్టయిన అభ్యర్థుల జాబితా పరిశీలిస్తే ఇంకో ఆశ్చర్చకరమైన విషయం కనిపిస్తోంది. ఇంటర్ కాలేజీ, ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ యూనివర్సిటీల్లో కేవలం పాల్గొన్నందుకు 270 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. వీళ్లకు పతకాలు లేవు, చెప్పుకోదగ్గ టోర్నమెంట్స్‌లో పాల్గొనలేదు. కేవలం పార్టిసిపేట్ చేశారంతే.ఒక్కో ఉద్యోగానికి రూ.15–20 లక్షలు» స్పోర్ట్స్ కోటా పోస్టులను ఒక్కొక్కటి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బేరసారాలు చేసినట్లు వీడియోలు కూడా బయటకు వచ్చాయి (ఆ వీడియో, ఆడియోను ప్రదర్శించారు). ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లోగోను డీపీ (డిస్ప్లే పిక్చర్)గా పెట్టుకొని ఒక అభ్యర్థితో జరిగిన సంభాషణ కూడా బయట పడింది. విషయం బయటకు రాగానే నామమాత్రంగా కేసు నమోదు చేసి, స్టేషన్ బెయిల్‌తో వదిలేశారు. » ఇవన్నీ చూస్తుంటే స్పోర్ట్స్ కోటా పేరుతో జరిగింది పారదర్శక నియామక ప్రక్రియ కాదు. ఇది ఒక వ్యవస్థీకృత స్కామ్ అని ప్రజలు భావిస్తున్నారు. ఆ కేసులో చేసిన విచారణ శూన్యం. ఏ విషయాలు కూడా బయటకు రాకుండా దాచిపెట్టారు. దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ గమనించండి. వీడియో కాల్ చేసిన వ్యక్తి ఫోన్ నంబర్ చాలా స్పష్టంగా ఉంది. పోలీసులు తల్చుకుంటే ఆ నంబర్ ఎవరిదో నిమిషాల్లో కనిపెట్టేస్తారు. కానీ, ఎఫ్ఐఆర్ కాపీలో ఆ నంబర్ ఎవరిదో చెప్పకుండా, పేరు కూడా తెలపకుండా అనుమానిత వ్యక్తి అని మాత్రమే రాశారు. ఆ అనుమానిత వ్యక్తి చాలా ముఖ్యమైన వ్యక్తి. దీంతో ఆ కేసు ప్రక్రియ కూడా చాలా ఆలస్యం చేశారు. » ఇలా ఎందుకు అయ్యిందంటే.. ఉన్నతాధికారులతో సంప్రదింపుల వల్ల ఆలస్యం అయ్యిందంట. దీని అర్థం ఈ వీడియో కాల్ ఆషామాషీది కాదని, అనుమానిత వ్యక్తి చాలా ముఖ్యమైన వ్యక్తి అని తేలిపోతుంది. స్పోర్ట్స్ కోటాలో టీచర్ ఉద్యోగాల భర్తీ వ్యవహారం వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. మరో పక్క ఎమ్మెల్యేలు, ఎంపీలే డీల్ చేస్తున్నారు.. అది వేరే విషయం అనుకోండి. ఇంకా అన్నింటి కంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? బలమైన సెక్షన్లు పెట్టి గట్టిగా విచారణ చేయకుండా, కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. ఇది అన్నింటికంటే దారుణం. కోట్లాది కాక్రోచ్‌ల్లో నేనూ ఒకడినవుతా... కాక్రోచ్ పార్టీనా, ఇంకోటా అనేది పక్కన పెడితే.. వీళ్లంతా యువత. వీళ్లకు న్యాయం చేయకపోతే గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు? గవర్నమెంట్ ఇన్ని తప్పులు చేస్తున్నప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. జెన్ జీ ఇందులో భాగమే. వారి ఆశలను నువ్వు నిర్దాక్షిణ్యంగా నలిపేస్తే ఆటోమేటిక్‌గా, కోట్ల మంది కాక్రోచ్లు వస్తారు. అందులో నేనూ ఒకడినవుతా.ఇది జెన్‌జెడ్ కాలం» చంద్రబాబూ.. ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఇది జెన్‌జెడ్, జెన్ ఆల్ఫా కాలం. దేన్నీ నువ్వు ఆపలేవు. నువ్వు ఆపేకొద్దీ ఇంతింతై, వటుడింతై అన్నట్లు పెరుగుతుంది. దగాపడ్డ యువత నిన్ను విడిచిపెట్టదు. నీకు తగిన గుణపాఠం తప్పకుండా చెప్తారు. కాక్రోచెస్ లేస్తాయి. ఇన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టే మేం సీబీఐ దర్యాప్తునకు పట్టుబడుతున్నాం. లోతుగా వెళ్తే మరిన్ని విషయాలు తప్పకుండా బయటకు వస్తాయి. » విద్యా శాఖ మంత్రిగా సాక్షాత్తు చంద్రబాబు కొడుకు ఉన్నాడు కాబట్టి, ఈ తప్పులపై విచారణ చేయడానికి చంద్రబాబు ముందుకు రాడు సరికదా, ఎదురుదాడి చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే వారం రోజుల క్రితం డీఎస్సీ అభ్యర్థులంతా నా వద్దకు వచ్చినప్పుడు వారికి ఒక్కటే చెప్పాను. వారి తరఫున న్యాయ పోరాటం చేస్తానని. ఒకవేళ అప్పటికీ కాకపోతే, మేం అధికారంలోకి రాగానే ఒక కమిషన్ వేసి, రీ వెరిఫై చేసి, అన్యాయం జరిగిన వారికి న్యాయం చేస్తాం. తప్పు చేసిన వారిని శిక్షిస్తాం అని చెప్పా. » రేపు (శుక్రవారం) రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నిరసనగా ర్యాలీలు నిర్వహిస్తున్నాం. దగాపడ్డ రైతులు, మహిళలు, నిరుద్యోగులు, పిల్లలు.. ఇలా దగాపడ్డ ప్రతి వర్గాన్ని కలుపుకొంటూ ప్రజల తరఫున నియోజకవర్గ స్థాయిలో ఈ ర్యాలీలు జరుగుతున్నాయి. చంద్రబాబు వెన్నుపోట్లను, దగాను, స్కామ్‌లను, మోసాలను గట్టిగా ప్రశ్నిస్తూ నిరసన తెలుపుతాం. దీంతోపాటు డీఎస్సీ అక్రమాల కారణంగా అన్యాయమైపోయిన వారికి సంఘీభావంగా ఈ నిరసన ర్యాలీలు చేపడతాం. » ఎవర్నీ వ్యక్తిగతంగా విమర్శించాలనో.. ఎవరినో ఎత్తిచూపాలనో కాదు. ప్రతి విషయంలో ఆధారాలతో సహా ఫ్యాక్ట్స్, ఫిగర్స్‌తో వివరించడం జరిగింది. ఇంత క్రిస్టల్ క్లియర్‌గా కన్పిస్తున్నప్పుడు సరైన సమాధానం చెప్పకపోగా, ఎదురుదాడి చేస్తూ అబద్ధాన్ని కప్పిపుచ్చుకునే కార్యక్రమం చేస్తే అది ఏరోజుకైనా దేవుడు, ప్రజలు హర్షించరు. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు మొట్టికాయలు వేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఎంక్వైరీలో న్యాయం ఎలా జరుగుతుంది? పోలీసులు, అధికారులు వీళ్ల మనుషులే. సీఎం కుమారుడు నారా లోకేశ్ విద్యా శాఖ మంత్రి. అలాంటప్పుడు న్యాయం ఎలా జరుగుతుంది? థర్డ్ పార్టీ ఎంక్వైరీ జరగాలి. సీబీఐ లాంటి ఎంక్వైరీ సంస్థ దర్యాప్తుతోనే న్యాయం, ధర్మం జరుగుతుంది. -
ఆఫీసులన్నీ క్లోజ్, నందుస్ భార్యాభర్తలు ఎక్కడ?
-
Gen-Z అన్నీ చూస్తోంది... బాబూ జాగ్రత్త...
-
అమ్మ.. రమనందనా.. తప్పించుకుందాం అనుకున్నావా?
-
15 లక్షలు ఇస్తే జాబ్ మీ చెల్లికి ఇస్తాం.... సంచలన ఆడియో లైవ్ లో ప్లే చేసి..!
-
చెవులో పువ్వులు.. కాకమ్మ కథలు, ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావయ్యా చంద్రబాబు...
-
స్కాం కాకపోతే ఆ జీవోలు ఎందుకు రద్దు చేశారు?
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ పోస్టుల్లో సర్దుబాటు ఎవరి కోసం చేశారని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నిలదీశారు. డీఎస్సీ రిక్రూట్మెంట్ కుంభకోణంపై పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన ప్రెస్మీట్లో మాట్లాడారు. దుర్గయ్య నేషనల్ మెడలిస్ట్ (పక్కనే ఉన్నారు). డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో 1:1 రేషియోలో దుర్గయ్యకు కాల్ లెటర్ వచ్చింది. సర్టిఫికెట్లు సరిగా ఉన్నా ఉద్యోగం రాలేదు. స్పోర్ట్స్ కోటా అనేది పెద్ద స్కాం. స్పోర్ట్స్‌మెన్‌కు అన్యాయం చేశారు. చంద్రబాబు లోకేష్ కలిసి స్కీమ్‌ను స్కామ్ చేశారు.. చరిత్రలో లేని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష రాయనక్కర్లేదని జీవో ఇచ్చారు. జీవో నెంబర్ 74 చూస్తే స్పోర్ట్ కోటా పోస్టుల అంశం తెలుస్తుంది. స్పోర్ట్స్ కోటా వాళ్లు డీఎస్సీకి ఉత్తీర్ణత సాధించాల్సిందే. స్పోర్ట్స్ సర్టిఫికెట్ చూపించి సబ్జెక్ట్ టీచర్లుగా ఉద్యోగాలిచ్చేందుకు జీవోలు తెచ్చారు. కొన్ని పోస్టులకు డీఎస్సీ పరీక్ష లేదు. డిగ్రీ కూడా అక్కర్లేదట. ఉద్యోగం వచ్చిన ఐదేళ్లలో డిగ్రీ పాస్ కావొచ్చట. క్రీడాప్రతిభతో సంబంధం లేదు.. జస్ట్ ఆటలో పాల్గొంటే చాలట. నేషనల్ గోల్డ్‌మెడలిస్ట్ అయిన దుర్గయ్యకు ఉద్యోగం ఎందుకు రాలేదు. నిజమైన క్రీడాకారులకు అన్యాయం జరిగిందిబ్యాక్డోర్ ద్వారా ఉద్యోగాలిచ్చే ప్రయత్నం చేశారు. కొన్ని పోస్టులకు డిగ్రీ కూడా అవసరం లేదన్నారు. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల వ్యవస్థను దళారి కేంద్రంగా మార్చారు. మెడల్స్‌తో సంబంధం లేకుండా.. ఆటల్లో పాల్గొన్నట్లు సర్టిఫికెట్లు చూపించినవాళ్లకు ఇచ్చారు. ఆ సర్టిఫికెట్లు కూడా వాళ్లే ఇచ్చారు. జూడో అసోషియేషన్ గౌరవ అధ్యక్షుడు లోకేశ్ తోడల్లుడు భరత్. సాఫ్ట్‌బాల్ అసోషియేషన్ అధ్యక్షుడు కూన రవికుమార్. వీళ్లే సర్టిఫికెట్లు ఇస్తారు. వీళ్లే ఉద్యోగాలు ఇస్తారు. గోల్డ్‌మెడల్ అనే వ్యక్తి.. సిల్వర్ మెడల్ అని అప్లోడ్ చేశారట. ఆటల్లో పాల్గొన్న వారికే ఉద్యోగాలు ఇచ్చినప్పుడు.. మెడల్ వచ్చిన వారికి ఇవ్వరా?.. నిజమైన క్రీడాకారులకు ఇది అవమానం కాదా?. క్రీడాకారుల పేరుతో జరిగిన స్కామ్ కాదా ఇది? తమ వాళ్లకు ఉద్యోగుల వచ్చేలా జీవో నెంబర్ 4, జీవో 47 తెచ్చారు. వాళ్లకు ఉద్యోగం ఇచ్చి.. జీవో 23, 25, 26తో గేట్లు మూసేశారు.అసలు మీరిచ్చిన జీవో నెంబర్ 4, 47 ఎందుకు రద్దు చేశారు. ఇది స్కామ్ కాకపోతే ఇంకేంటి? కేవలం పాల్గొన్నందుకే 270 మందికి ఉద్యోగాలిచ్చారు. ఉద్యోగాలు ఇచ్చినవారికిఎలాంటి మెడల్స్ రాలేదు. ఇంటర్ కాలేజీ స్పోర్ట్స్‌లో 99 మంది టీచర్ ఉద్యోగాలొస్తే.. మెడల్ రాకపోయినా పాల్గొనందుకే 86 మందికి ఉద్యోగాలు ఇచ్చారు అని వైఎస్ జగన్ లెక్కలతో సహా వివరించారు.డీఎస్సీలో ఒక్కో ఉద్యోగాన్ని రూ.15.26 లక్షలు అమ్ముకుంటున్న బేరసారాల వీడియో బయటకు వచ్చింది. ప్రభుత్వ డీపీ లోగో ఉంది. పైగా ఆ వీడియోలో కాల్ చేసిన నెంబర్ స్పష్టంగా కనిపిస్తుంది. అయినా తూతు మంత్రంగా కేసులు పెట్టారు. స్టేషన్‌బెయిల్ ఇచ్చి బయటకు వదిలేశారు. ఆ వ్యక్తి ఎంత ముఖ్యమైన వ్యక్తో ఇక్కడే అర్థమవుతుంది. ఈ ఆధారం చాలదా స్కామ్ జరిగిందని చెప్పడానికి అని వైఎస్ జగన్ అన్నారు. -
నందు కేసులో కొత్త ట్విస్ట్.. రాజీనామాపై అనేక అనుమానాలు..!
-
చంద్రబాబే పోలీస్.. చంద్రబాబే లాయర్
సాక్షి,తాడేపల్లి: డీఎస్సీ పరీక్ష పేపర్ తయారీ దగ్గరి నుంచి.. ఫలితాల వెల్లడిదాకా ప్రతీ దశలోనూ నిబంధలను మీరి ప్రవర్తించారని.. ఇక్కడే అవకతవకలు జరిగాయని స్పష్టమవుతోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. మెగా డీఎస్సీ స్కామ్‌పై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారాయన.డీఎస్సీ మాత్రమే కాదు, ఏ పరీక్షకైనా పేపర్ తయారీ, ప్రశ్నలు అప్లోడ్ చేయడం, డిజిటల్ నిర్వహణ ఇవన్నీకూడా అత్యంత గోప్యంగా జరగాలి. కానీ ఈ ప్రభుత్వంలో ఆ రహస్య ప్రక్రియకు పూర్తిగా తూట్లు పొడిచారు. డీఎస్సీ క్వశ్చన్ పేపర్లను SCERT (State Council of Educational Research and Training) తయారు చేస్తుంది. పరీక్ష నిర్వహణను డీఎస్సీ కన్వీనర్ చూస్తారు. కాని ఈ చంద్రబాబు ప్రభుత్వం ఆ కన్వీనర్‌ను పక్కనపెట్టి, క్వశ్చన్ పేపర్ల తయారీ.. నిర్వహణ, ఈ రెండు కీలక బాధ్యతలను కూడా SCERT డైరెక్టర్‌కు అప్పగించింది. డీఎస్సీ పరీక్షల్లో పారదర్శకతను దెబ్బతీసింది, అక్రమాలకు ఉద్దేశపూర్వకంగానే ఆజ్యం పోసింది. ఇక్కడ నుంచే మొదలైంది స్కెచ్..రహస్యంగా జరగాల్సిన ప్రశ్నాపత్రం తయారీ, అప్లోడింగ్ పని పనిని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో చేయించారు. ఎక్కడైనా పరీక్షల ఫలితాలను పారదర్శకంగా ప్రకటిస్తారు. కానీ బాబు పెట్టిన డీఎస్సీ మాత్రం ఎక్కడా డిస్ప్లే లేదు. సెలెక్టెడ్ అభ్యర్థులకు మాత్రమే మెసేజ్‌లు పంపారు. మార్కులు, కటాఫ్, ర్యాంకులు ఎక్కడా డిస్ప్లే చేయలేదు. ఆన్లైన్ పేరుతో మొత్తం ప్రక్రియ సెంట్రలైజ్ చేశారు. 1:1 రేషియోలో కాల్ లెటర్లు పంపారు.. .. నవీన్ అనే వ్యక్తి మెరిట్ సాధించాడు. అతను సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రాలేదని ఉద్యోగం ఇవ్వలేదట. మెరిట్ లిస్టులో పేరు తీసేసి, ఆ కేండిడేట్ డేటాను మాయం చేసి, కాల్‌లెటర్ ఇవ్వనప్పుడు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఎలా వస్తాడు?. నిజంగా మెరిట్ వస్తే ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు. తప్పు జరగకపోతే నవీన్ డేటా ఎందుకు తొలగించారు. అంటే తప్పు జరిగినట్లు ఒప్పుకున్నట్లే కదా. మీరు చెప్పేవి కాకమ్మ కబుర్లు కావా? అందుకే కదా అతను కోర్టుకు పోయింది?. ఒక కేండిడేట్‌కు ఫస్ట్ ర్యాంకు వస్తే, అందులోనూ గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం వస్తే, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రాడా?. మీరు ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నారు. చంద్రబాబు చెబుతున్న కారణాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. పేపర్ లీక్ దాచిపెట్టడానికి నానా అగచాట్లు పడుతున్నారు. పేపర్ తయారీలో ఎవరెవరు ఉన్నారు? డిజిటల్ యాక్సిస్ ఎవరి చేతుల్లో ఉంది. పేపర్ ఎంత మందికి లీక్ అయింది.. ఎంత ముడుపులు చేతులు మారాయి? ఇవి తేలాలి కదా?. అన్నీ తేలాలి. ఇలాంటి తప్పులు ఇంకెన్నో, అందుకే మేం సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాం.రాష్ట్రంలో చంద్రబాబు పోలీస్.. ఆయనే లాయర్. అధికారం మీదే.. అధికారులు రిపోర్ట్ చేసేది మీకే. అధికారంలో ఉన్నది ఆయనే.. ఇక నిజాలు ఎలా బయటకు వస్తాయి? న్యాయం ఎలా జరుగుతుంది?. రాష్ట్రంలో వ్యవస్థల మీద ఎవరికైనా నమ్మకం ఉందా?. అందుకే సీబీఐ విచారణ కోరుతున్నాం. చంద్రబాబు కొడుకు విద్యాశాఖ మంత్రి కాబట్టే థర్డ్ పార్టీ ఏజెన్సీ వస్తేనే నిజాలు బయటకు వస్తాయి అని వైఎస్ జగన్ అన్నారు. -
చంద్రబాబు తొలి సంతకమే పెద్ద మోసం.. స్కామ్: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ రిక్రూట్మెంట్లో ఎన్నో అక్రమాలు జరిగాయని.. ఆ అవకతవకలు దిగ్భ్రాంతికి గురి చేశాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. ఈ అంశంపై గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పాలనంతా దగా, స్కాములు, అబద్దాలు, మోసాలే. వెన్నుపోటు, మోసానికి ప్యాంట్, షర్ట్ వేస్తే అది చంద్రబాబే. మెగా డీఎస్సీ పేరుతో పెద్ద స్కామ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం పేరుతో డ్రామాలు చేశారు. ఇది కూడా పెద్దమోసమే. లక్షల మంది నమ్మకాన్ని చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్ వమ్ము చేశారు. ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బ తీశారు. ఇంత ఘోరంగా రిక్రూట్మెంట్ ఏపీ చరిత్రలోనే జరగలేదు. వాస్తవంగా మా హయాంలో 6,100 పోస్టులకు నోటిఫికేషం ఇచ్చాం. వాటిని భర్తీ చేయకుండా రిక్రూట్మెంట్ ఆలస్యం చేశారు. ఆ నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. ఇదీ చంద్రబాబుగారి మొదటి సంతకం పరిస్థితి. మెగా డీఎస్సీ అని చంద్రబాబు ఒకటే డబ్బా కొట్టుకున్నారు. నీకు నువ్వుగా సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకుంటే ఎలా? అసలు రికార్డు ఏంటో ఇప్పుడు చెప్తా అంటూ వైఎస్ జగన్ అసలు రికార్డు చెప్పుకొచ్చారు.. 👇 👉16 వేల పోస్టులకే ఇన్ని స్కామ్‌లు, లీకులు కనిపిస్తున్నాయి. మెగా డీఎస్సీలో మెగా అంటే ఏంటో అర్థం కావడం లేదు. అసలు దీనిని అలా పిలవడానికి అర్హతే లేదు. వైఎస్సార్సీపీ హయాంలో లక్షల మంది ఉద్యోగ పరీక్షలు రాస్తే.. ఒక్క తప్పు జరగలేదని జగన్ గుర్తు చేశారు.👉రాష్ట్ర చరిత్రలో కాని, దేశ చరిత్రలో కాని ఎప్పుడూ లేని రీతిలో ఒకే ఏడాది, ఒకే నోటిఫికేషన్‌తో, ఒకే టైంలో 1లక్షా 3౦వేల ఉద్యోగాల భర్తీ జరిగిందీ అంటే.. అది వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాత్రమే. అదీ రికార్డు అంటే. గ్రామ స్వరాజ్య సాధన, సుపరిపాలన లక్ష్య సాధన దిశగా ఆరోజు మేం వేసిన గొప్ప అడుగు, ఉద్యోగాల చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. ఎవ్వరూ బద్దలు కొట్టలేని ఓ రికార్డు. 👉మే 30, 2019న నేను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తే, ఆ తర్వాతి యాభై రోజుల్లోనే అంటే జులై 19న జీవో ఇచ్చాం. జులై 25 - 27 మధ్య నోటిఫికేషన్లు ఇచ్చాం. జులై 27 నుంచి ఆగస్టు 10వరకూ అప్లికేషన్లు తీసుకున్నాం. సెప్టెంబరు 1 నుంచి 8వరకూ పరీక్షలు నిర్వహించాం. 👉మొత్తం 2,800 సెంటర్లలో 19లక్షల మంది పరీక్షలు రాశారు. ఎక్కడా ఒక్క తప్పుకూడా జరగకుండా, ఎలాంటి లోపం లేకుండా, అందరి విశ్వాసాన్ని నిలబెడుతూ, 1.౩ లక్షల కొత్త ఉద్యోగాలు, శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం. ఉద్యోగాలు పొందిన వాళ్లంతా ఇవాళ ప్రజలకు వారి గ్రామంలోనే, మన ఇంటికే సేవలు అందిస్తున్నారు. అక్టోబరు 2, గాంధీ జయంతి నాటికి మొత్తం ప్రక్రియను పూర్తిచేశాం. అంటే నాలుగు నెలల్లోనే, అత్యంత పారదర్శకంగా, ఒక తప్పు జరక్కుండా, ఎలాంటి లోపం లేకుండా ఒక చరిత్ర సృష్టించాం.కానీ, మెగా డీఎస్సీ పేరుతో మీరు నిర్వహించిన 16వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చూస్తే ఎంతమంది ఆవేదనతో ఉన్నారు? మీరు చేసిన గోల్మాల్ వ్యవహారాలతో ఎంతమంది కన్నీళ్లు పెడుతున్నారు? ఎంతమంది రోదిస్తున్నారు? అని చంద్రబాబును వైఎస్ జగన్ నిలదీశారు. -
రూ.2,400 కోట్ల భారీ స్కాం.. అడ్డంగా బుక్కైన సన్నీ లియోన్
-
నందుస్ వరల్డ్ చీకటి రహస్యాలు
-
కేంద్ర నివేదికతో చంద్రబాబు అవినీతి బట్టబయలు..!
-
నందు ఎంత రాక్షసి అంటే .. ప్రెగ్నెంట్ తో ఉన్నా
-
నందూస్ ఫ్యామిలీ పరార్ ?
-
LIC పెట్టుబడుల వివాదం.. స్పందించిన రాజేష్ మెహతా
ఇటీవల వివాదాలలో చిక్కుకున్న ఆభరణ వర్తక కంపెనీ రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ కౌంటర్లో బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) పెట్టుబడులపై వాడి, వేడి చర్చకు తెరలేచింది. ఈ నేపథ్యంలో అసలు ఎల్ఐసీ ఆఫీస్ ఎక్కడుందో కూడా తనకు తెలియదని రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ చైర్మన్ రాజేష్ మెహతా తాజాగా వ్యాఖ్యానించారు.కంపెనీలో ఎల్ఐసీ పెట్టుబడులు నిన్నటివి లేదా ఏడాది క్రితం చేసినవి కాదని పేర్కొన్నారు. సుమారు రెండు రెండు దశాబ్దాల కాలంలో చేపట్టిన పెట్టుబడులివని తెలియజేశారు. ఓపెన్ మార్కెట్ ద్వారా షేర్లు కొనుగోలు చేసినట్లు వివరించారు. వెరసి కంపెనీ షేర్ల కొనుగోలు విషయంలో తానకుగానీ లేదా ఇతర ప్రమోటర్లకుగానీ ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు.కంపెనీ ప్రమోటర్లు ఎవరూ ఎల్ఐసీకి వాటా విక్రయించలేదని వెల్లడించారు. ఇదేవిధంగా ఎల్ఐసీకి ఎలాంటి షేర్ల కేటాయింపునూ చేపట్టలేదని తెలియజేశారు. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌లో బీమా దిగ్గజం చేపట్టిన పెట్టుబడులతో కంపెనీ లేదా ప్రమోటర్లకు ఎలాంటి లబ్ది చేకూరలేదని స్పష్టం చేశారు. ఎల్ఐసీ పెట్టుబడి నిర్ణయాలలో తమకు ఏ విధమైన సంబంధమూలేదని, ఈ విషయాలు తెలియవని వివరించారు. పూర్తిగా వాణిజ్య ధృక్పథంతో ఎల్ఐసీ తీసుకున్న సొంత నిర్ణయాలేనని పేర్కొన్నారు. 10.8 శాతం వాటాప్రస్తుతం రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌లో ఎల్ఐసీ వాటా 10.8 శాతంగా నమోదైంది. తొలి దర్యాప్తులో భాగంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కంపెనీ అక్రమ ఆదాయ నమోదుపై సీరియస్ అయ్యింది. రాజేష్ మెహతాను సెక్యూరిటీల మార్కెట్ల నుంచి నిషేధించింది. ఈ అంశంలో సెబీ దర్యాప్తు కొనసాగుతోంది. కాగా.. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ షేరు సోమవారం సైతం 5 శాతం పతనమై రూ. 94.5 వద్ద ఫ్రీజయ్యింది. మూడు రోజుల్లో 14 శాతం క్షీణించింది.అయితే.. తనకున్న అవగాహన ద్వారా ఈ ధరలోనూ ఎల్ఐసీ నష్టపోయి ఉండదని భావిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ నష్టపోయి ఉంటే అవతలి పక్క మరొకరు లాభపడి ఉండాలని, ఇది సాధారణ పబ్లిక్ వాటాదారులేనని మెహతా వ్యాఖ్యానించారు. ఈ అంశంపై తొలిసారి మాట్లాడుతున్నానని, ఒకవేళ ఇప్పుడు ఎల్ఐసీ విక్రయిస్తుంటే కామన్ పబ్లిక్ కొనుగోలు చేస్తుంటారని, తద్వారా లబ్ది పొందుతారని, అంతేతప్ప కంపెనీ లేదా ప్రమోటర్ లాభపడరని వివరించారు. ఈ అంశాన్ని వ్యతిరేకించేవారు సాధారణ వాటాదారులు లాభపడటాన్ని వ్యతిరేకిస్తున్నట్లేనని వ్యాఖ్యానించారు. -
నందు దంపతులకు జైలు శిక్ష? న్యాయవాది సంచలన కామెంట్స్
-
వీళ్ళు చేసిన మొదటి తప్పు అదే.. నందుస్ స్కాం పై సంచలన నిజాలు
-
నందూస్ ఫ్యామిలీ మాస్టర్ ప్లాన్.. అసలు నిజం ఇదేనా?
-
నందుతో ఫోన్ లో... షాకింగ్ నిజాలు బయటపెట్టిన జైపాల్ రెడ్డి!
-
నందుస్ భార్యాభర్తలకు UK గవర్నమెంట్ బిగ్ షాక్!
-
వాట్సాప్‌లో ‘బొద్దింకల పార్టీ’: క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళీ!
లుథియానా: సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త మోసానికి తెరలేపారు. ‘వ్యవస్థను మారుద్దాం, ఉద్యమంలో భాగస్వాములుకండి’ అంటూ వస్తున్న నకిలీ వాట్సాప్ సందేశాలను నమ్మి ఇప్పటికే పలువురు బాధితులు డబ్బులు పోగొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్‌లోని లుథియానా పోలీసులు ఒక అధికారిక వీడియోను విడుదల చేస్తూ, ఈ సైబర్ ఉచ్చులో పడవద్దంటూ ప్రజలను అప్రమత్తం చేశారు.నకిలీ మెంబర్షిప్ ఈ కుట్రలో భాగంగా సైబర్ కేటుగాళ్లు యువతను, సామాజిక మార్పును కోరుకునే వారిని టార్గెట్ చేస్తున్నారు. ‘దేశ ప్రయోజనాల కోసం చేరండి’, ‘అవినీతిపై గళమెత్తండి’ అనే ఆకర్షణీయమైన నినాదాలతో వాట్సాప్, సోషల్ మీడియాలో నకిలీ లింకులను పంపుతున్నారు. ఈ సందేశాలతో పాటు వచ్చే ఫిషింగ్ లింక్‌ను క్లిక్ చేయగానే, వినియోగదారుల వ్యక్తిగత వివరాలు దొంగిలించడమే కాకుండా మొబైల్లో హానికరమైన మాల్వేర్ ఇన్స్టాల్ అవుతుందని ఉత్తరప్రదేశ్ పోలీస్ సైబర్ సెక్యూరిటీ సలహాదారు రాహుల్ మిశ్రా పేర్కొన్నారు.లింక్ నొక్కితే జరిగే నష్టం ఏంటి?సాధారణంగా కేవలం లింక్‌ను క్లిక్ చేయడంతోనే నేరుగా డబ్బులు కట్ కావు. కానీ, ఆ లింక్ ఓపెన్ చేయగానే వచ్చే నకిలీ వెబ్సైట్లలో ఓటీపీ, బ్యాంక్ వివరాలు, లేదా యూపీఐ పిన్ నమోదు చేయమని అడుగుతారు. ఆ వివరాలను పూరించిన వెంటనే క్షణాల్లో అకౌంట్లు ఖాళీ అవుతాయి. ముఖ్యంగా విద్యార్థులు, రాజకీయల్లొ ఆసక్తి ఉన్నవారు, డిజిటల్ అవగాహన తక్కువగా ఉన్న సీనియర్ సిటిజన్లే లక్ష్యంగా ఈ మోసాలు సాగుతున్నాయి. ఏదైనా అధికారిక సంస్థ పేరుతో వచ్చే సందేశాల యూఆర్ఎల్, డొమైన్ స్పెల్లింగులను జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా ఈ నకిలీ లింకులను గుర్తించవచ్చు.పొరపాటున క్లిక్ చేస్తే ఏం చేయాలి?ఒకవేళ మీరు పొరపాటున ఆ లింక్‌ను క్లిక్ చేసి, మీ బ్యాంకింగ్ వివరాలను పంచుకుంటే అస్సలు ఆందోళన పడకుండా వెంటనే అప్రమత్తం కావాలి. ఆలస్యం చేయకుండా వెంటనే మీ బ్యాంక్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి డెబిట్/క్రెడిట్ కార్డులను, యూపీఐ సేవలను బ్లాక్ చేయించుకోవాలి. మీ నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లను వెంటనే మార్చాలి. ఎలాంటి అనుమానాస్పద లావాదేవీలు జరిగినా తక్షణమే జాతీయ సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ ‘1930’ కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలి లేదా సమీపంలోని సైబర్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాలి.ఇది కూడా చదవండి: 50 శాతం మార్జిన్‌తో ‘బొద్దింక’ వ్యాపారం! -
నందూస్ అక్రమాలపై జైపాల్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ
-
ఇది కాదు వేరే అకౌంట్ ఇస్తా దానికి రూ.25 లక్షలు సెండ్ చేసి... బయటపడ్డ షాకింగ్ నిజాలు
-
నందు భర్త ఆడవాళ్లకు నరకం చూపించాడు! చచ్చిపోతామన్నా పట్టించుకోలేదు
-
నందూస్ వరల్డ్ కపుల్స్.. ఇలా దొరుకుతాం అని అనుకోలేదు..!
-
నందుస్ వరల్డ్ మధుకర్ సంచలన ఆడియో లీక్
-
నందూస్ వరల్డ్ బాధితుడి ఆవేదన..జాబ్ తో పాటు వీసా ఇస్తామని
-
టీటీడీలో తెరపైకి మరో కొత్త వివాదం
-
నమ్మించి మోసం చేశారు..! పెళ్లి కోసం దాచుకున్న డబ్బులన్నీ..
-
ఇప్పుడు మాకు చావే దిక్కు వాళ్ల వల్ల UKలో అడుక్కు తింటూ బతికాం
-
యూట్యూబర్ నందు ఫ్యామిలీకి లుక్ అవుట్ నోటీసులు!
-
మమల్ని ఎలా మోసం చేసారంటే..! నందుస్ వరల్డ్ బాధితులు చెప్పిన సంచలన నిజాలు
-
వాళ్లు మమ్మల్ని ఇలానే మోసం చేశారు.. నందుస్ వరల్డ్ బాధితులు
-
ఇరుక్కున్న యూట్యూబ్ దంపతులు..!
-
రూ. 15.15 లక్షల కోట్ల స్కాం : దలాల్ స్ట్రీట్‌లో ప్రకంపనలు
సాక్షి, ముంబై: భారతదేశంలోని అతిపెద్ద లిస్టెడ్ సంస్థలలో ఒకటి, ప్రముఖ బంగారు శుద్ధి మరియు ఆభరణాల తయారీ సంస్థ రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ (Rajesh Exports) భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. రూ. 15.15 లక్షల కోట్ల మేర భారీ ఆర్థిక అవకతవకలు జరిగినట్టు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) ఆరోపించింది. ఈ మేరకు జూన్ 3న జారీ చేసిన ఒక మధ్యంతర ఉత్తర్వులో సెబీ రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ , దాని ప్రమోటర్-చైర్మన్ రాజేష్ మెహతాలను సెక్యూరిటీల మార్కెట్లోకి ప్రవేశించకుండా నిషేధించింది. ఐదు ఆర్థిక సంవత్సరాల పాటు భారీ ఆర్థిక అవకతవకలు జరిగాయని రెగ్యులేటర్ వెల్లడించింది. ఈ ఆదేశాలు దలాల్ స్ట్రీట్‌లో ప్రకంపనలు సృష్టించాయి. దీని షేర్ బాగా పడిపోయింది. చివరికి కొనేవాళ్లు లేక లోయర్ సర్క్యూట్‌లోకి జారుకుంది.బెంగళూరు కేంద్రంగా ఉన్న ఈ సంస్థ, ప్రపంచ బంగారు దిగ్గజంగా పేరు సంపాదించింది. ఆర్థిక సంవత్సరం FY21 నుంచి FY25 మధ్య కాలంలో, కంపెనీ తన విదేశీ అనుబంధ సంస్థల (ముఖ్యంగా స్విట్జర్లాండ్‌కు చెందినవాల్కంబి SA) ద్వారా రూ. 15.15 లక్షల కోట్ల మేర (కన్సాలిడేటెడ్ రెవెన్యూలో దాదాపు 99.8 శాతం) తప్పుడు ఆదాయాన్ని చూపించిందని సెబీ ప్రాథమిక దర్యాప్తులో తేలింది.దర్యాప్తు అధికారులు కోరిన అనేక కీలక పత్రాలను కంపెనీ అందించడంలో విఫలమైందని సెబీ తెలిపింది. ఫోరెన్సిక్ ఆడిటర్‌కు కస్టమర్ రికార్డులు, వెండర్ వివరాలు, ముఖ్యమైన అనుబంధ సంస్థల ఆర్థిక నివేదికలు సమర్పించలేదనీ, పొంతన లేని ఆదాయ వ్యవయాల వివరాలు, దర్యాప్తునకు సహకరించకపోవడం లాంటి వాటిని రెగ్యులేటర్ ఎత్తి చూపింది. ఈ ఆదాయ ఆరోపణలతోపాటు ఆఫ్రికాలో ఉన్న బంగారు గనుల ఆస్తులలో రూ. 1,035 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు వచ్చిన నివేదికను కూడా సెబీ ప్రశ్నించింది.ఎల్ఐసీకీ తప్పని ముప్పురాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌లో సుమారు 10.8% వాటాను కలిగి ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అతిపెద్ద వాటాదారులలో ఒకటి. తాజా స్కాం కారణంగా వాటాదారుల సంపదలో రూ. 12,726 కోట్ల వరకు నష్టం వాటిల్లవచ్చని సెబీ అంచనా వేసింది. ఈ ప్రభావం ప్రమోటర్లు, నియంత్రణ సంస్థలకే పరిమితం కాలేదు. పరోక్షంగా సంబంధం ఉన్న లక్షలాది మంది సాధారణ పెట్టుబడిదారులను కూడా ప్రభావితం చేయనుంది.ఇప్పటికే కెనరా బ్యాంక్ పోరాటంమరోవైపు రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ ఏకకాలంలో రుణదాతల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటోంది. బ్యాంకుకు చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ. 509 కోట్ల రుణాల చెల్లింపులో విఫలం కావడంతో కెనరా బ్యాంక్ ఈ కంపెనీకి ఉన్న తన రుణాన్ని ఒత్తిడికి గురైన ఆస్తిగా (స్ట్రెస్డ్ అసెట్) వర్గీకరించింది. ఫలితంగా, ఈ రుణదాత వేలం ప్రక్రియ ద్వారా ఒత్తిడికి గురైన ఈ రుణాన్ని విక్రయించేందుకు చర్యలు ప్రారంభించింది. బ్యాంకింగ్ సమస్య సెక్యూరిటీస్ మార్కెట్ విచారణకు భిన్నమైందే అయి నప్పటికీ, ఈ రెండూ కలిసి కంపెనీకి రెండు వైపుల సంక్షోభాన్ని సృష్టించాయి. సెబీ ఉత్తర్వు మధ్యంతరమైనదని గమనించడం ముఖ్యం. నియంత్రణ సంస్థ తన తుది తీర్పును ఇంకా వెలువరించలేదు.రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ , రాజేష్ మెహతాలకు తమ వాదన వినిపించుకునేందుకు, ఆరోపణలపై ప్రతిస్పందించేందుకు అవకాశం ఉంది. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నందున తుది ఫలితం రావడానికి సమయం పట్టవచ్చు.ఒకవేళ ఇది రుజువైతే, భారతదేశ కార్పొరేట్ రంగంలో ఇప్పటివరకు చూసిన అతిపెద్ద స్కాంలలో ఒకటిగా నిలుస్తుంది. భారతదేశ కార్పొరేట్ పాలనా వ్యవస్థకు ఈ కేసు గుణపాఠంగా నిలవవచ్చు. పెట్టుబడిదారులకు ఇదొక తీవ్ర హెచ్చరిక. కంపెనీ ఎంత పెద్దదైనా, ఎంత గౌరవనీయమైనదైనా సరే, రిటైల్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడి మూలధనంలో గణనీయమైన భాగాన్ని ఒకే కంపెనీ స్టాక్‌లో కేంద్రీకరించే విషయంలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉంటూ, కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లు, స్టాక్ ఎక్స్ఛేంజ్ డిస్క్లోజర్లు, రెడ్ ఫ్లాగ్‌లను పర్యవేక్షించాలి అంటున్నారు నిపుణులు.ఇదీ చదవండి: ఆస్తికోసం వ్యాపారవేత్త కుటుంబం దారుణ హత్య, ఆ తర్వాత షాకింగ్ ఘటన -
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీలో అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్.
-
మా ఉద్యోగాలు అనర్హులకు ఇచ్చేశారు.. మా జీవితాలను రోడ్డున పడేశారు
-
లోకేష్ గుట్టురట్టు.. పరీక్ష లేకుండానే టీచర్ పోస్టులు.. మెగా DSCలో లీకులు
-
అన్నా నువ్వే మాకు దిక్కు... బాధపడకు అమ్మా.. ఎలా న్యాయం జరగదో నేనూ చూస్తా..!


