టీడీపీ ఎమ్మెల్యే భారీ స్కాం.. బాగోతం బట్టబయలు | Kalyandurg TDP MLA Surendra Babu Huge Stamp Duty Scam | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్యే భారీ స్కాం.. బాగోతం బట్టబయలు

Jun 24 2025 11:55 AM | Updated on Jun 24 2025 1:25 PM

Kalyandurg TDP MLA Surendra Babu Huge Stamp Duty Scam

సాక్షి, అనంతపురం: కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అవినీతి బాగోతం బట్టబయలైంది. భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. ఎస్ఆర్ కన్‌స్ట్రక్షన్ సంస్థలో ఎమ్మెల్యే సురేంద్ర బాబు భాగస్వామిగా ఉన్నారు.. ఆ సంస్థ అక్రమ మార్గాల్లో రూ.920 కోట్ల రుణాలు పొందింది. స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టి భారీగా రుణాలు పొందిన ఎస్‌ఆర్‌సీ సంస్థ. నకిలీ పత్రాల ద్వారా యూనియన్ బ్యాంక్ నుంచి 900 కోట్లు, టాటా క్యాపిటల్స్ నుంచి 20 కోట్ల రుణాలు పొందింది. బ్యాంకులను మోసగించిన వైనంపై ఆర్బీఐ, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విచారణ చేపట్టాయి.

కళ్యాణదుర్గం టీడీపీ నేత ఎర్రప్ప అలియాస్ మీ సేవ బాబు ద్వారా వ్యవహారాన్ని నడిపిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు.. విషయం బయటపడటంతో తామే మోసపోయామంటూ ఎమ్మెల్యేకు చెందిన కాంట్రాక్టు సంస్థ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే సురేంద్ర బాబు అనుచరుడు ఎర్రన్న అలియాస్ మీసేవ బాబు సహా ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే సురేంద్ర బాబు స్టాంప్ డ్యూటీ స్కాంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

తెల్గీ కుంభకోణం తరహాలో భారీ కుంభకోణానికి పాల్పడిన టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని కళ్యాణదుర్గం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎంపీ తలారి రంగయ్య డిమాండ్ చేశారు. కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో వెలుగు చూసిన స్టాంప్ డ్యూటీ స్కాంపై ఈడీ, సీబీఐ, ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖలకు ఫిర్యాదు చేస్తానని ఆయన పేర్కొన్నారు. సురేంద్ర బాబుకు చెందిన ఎస్ఆర్ కన్‌స్ట్రక్షన్ సంస్థ వందల కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టిందని.. విషయం బయటపడేసరికి ఓ కార్యకర్త పై కేసు నమోదు చేయించి చేతులు దులుపుకునే కుట్రలు జరుగుతున్నాయని మాజీ ఎంపీ తలారి రంగయ్య మండిపడ్డారు. 

కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు భారీ స్కామ్

Advertisement
 
Advertisement
Advertisement