బలపడుతున్న టీవీకే – కాంగ్రెస్‌ బంధం | TVK Congress bond getting stronger | Sakshi
Sakshi News home page

బలపడుతున్న టీవీకే – కాంగ్రెస్‌ బంధం

Nov 18 2026 8:15 AM | Updated on Nov 18 2026 8:15 AM

సాక్షి, చెన్నై: తమిళగ వెట్రి కళగం ఆధ్వర్యంలో నిర్వ హించనున్న విద్యా పురస్కారాల ప్రదానోత్సవ రెండో దశ వేడుకకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాం«దీని సీఎం  విజయ్‌ ఆహ్వానించినట్లు సమాచారాలు వెలువడ్డాయి. రాహుల్‌ గాంధీ సమయ కేటాయింపును బట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని టీవీకే  వర్గా లు యోచిస్తున్నాయి. టీవీకే, కాంగ్రెస్‌ మధ్య ఉన్న పొత్తును మరింత బలోపేతం చేసే దిశగా ఈ కీలక అడుగు పడుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా  అసెంబ్లీ ఎన్నికల అనంతరం టీవీకే  , కాంగ్రెస్‌ పారీ్టల మధ్య పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. 

ఆ తర్వాత సీఎం  విజయ్‌ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌ అగ్ర నేతలు  సోనియా గాంధీ, రాహుల్‌ గాందీలను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం చెన్నై పర్యటనకు వచ్చిన రాహుల్‌ గాంధీ కూడా విజయ్‌ నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. అయితే, మధ్యలో కాంగ్రెస్‌ చేపట్టిన కొన్ని ఆందోళనలకు టీవీకే నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదనే ప్రచారం జరిగింది. ఈ ఊహాగానాలకు తెరదించుతూ, సోమవారం రాత్రి ఢిల్లీలో  జరిగిన సోనియా గాంధీ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం  విజయ్‌ పాల్గొని, రాహుల్‌ గాంధీ పక్కనే కూర్చుని ఆత్మయంగా ముచ్చటించారు. 

సోనియా గాంధీ ప్రసంగాన్ని కూడా విజయ్‌ ఎంతో శ్రద్ధగా ఆలకించారు. దీంతో ఇరు పార్టీల మధ్య సమన్వయం మరింత పెరిగి, పొత్తు తదుపరి దశకు చేరుకుందని నాయకులు స్పష్టం చేస్తున్నారు.అదే సమయంలో ప్రియాంక గాంధి విజయ్‌ను ప్రత్యేకంగా పలకరించడం, తన ఇంట్లో 22 సంవత్సరాలుగా పనిచేస్తున్న మహిళను విజయవద్దకు తీసుకెళ్లి మరీ పోటో తీయించడం వంటి పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.  

విద్యా పురస్కారాల వేడుక వాయిదా? 
ఇటీవల చెన్నైలో టీవీకే  తరఫున విద్యా పురస్కారాల మొదటి దశ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఢిల్లీ  పుస్తకావిష్కరణ వేడుక సందర్భంగా, రెండో దశ పురస్కారాల ప్రదానోత్సవానికి రావాల్సిందిగా విజయ్‌ స్వయంగా రాహుల్‌ గాం«దీని కోరినట్లు సమాచారాలు వెలువడ్డాయి. దీనిపై త్వరలోనే మంత్రులు బుస్సీ ఆనంద్, అధవ్‌ అర్జున ఢిల్లీ వెళ్లి రాహుల్‌ గాం«దీని కలిసి అధికారిక ఆహా్వన పత్రికను అందించనున్నారు. వాస్తవానికి ఈ రెండో దశ కార్యక్రమం బుధవారం  జరగాల్సి ఉన్నప్పటికీ, రాహుల్‌ గాంధీ రాక కోసం దీనిని వాయిదా వేస్తున్నట్లు పార్టీ వర్గాలు «పేర్కొంటుండటం గమనార్హం.  రాహుల్‌ గాంధీ సమయం ఖరారైన తర్వాతే కొత్త తేదీని ప్రకటించనున్నారు.

 గతంలో రాహుల్‌ చెన్నై వచ్చినప్పుడే ఇరువురు నేతలు కలిసి ఒక ఉమ్మడి కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. ఒకవేళ విజయ్, రాహుల్‌ గాంధీ ఒకే వేదికపై నుంచి విద్యార్థులకు పురస్కారాలు అందిస్తే, అది రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారుతుందని టీవీకే  వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రానికి చెందిన కొందరు కాంగ్రెస్‌ నేతలు టీవీకే పై విమర్శలుచేస్తున్నా, టీఎన్‌సీసీ అధ్యక్షుడు మాణిక్యం ఠాకూర్‌తో పాటుగా కీలక పెద్దలు విజయ్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇందుకు కారణం, రాహుల్, విజయ్‌ మధ్య బంధం మరింత బలపడి ఉండటమేనని టీఎన్‌సీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. 

త్వరలో రాహుల్, విజయ్‌ ఇద్దరు ఒకే వేదికగా విద్యాపురష్కారాల ప్రదానోత్సవంలో పాల్గొనే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈపరిణామాల నేపథ్యంలో ఆనంద్, ఆధవ్‌ బుధవారం ఢిల్లీ పయనం అవుతుండటం ప్రాధాన్యతకు దారి తీసింది. ఈ ఇద్దరు వేర్వేరుగా అధికారిక కార్యక్రమాల నిమిత్తం ఢిల్లీ వెళ్తున్నారని టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి.అ దేసమయంలో ఈ కార్యక్రమాల తదుపరి కాంగ్రెస్‌ పెద్దలను కలిసి ఆహ్వానం పలికే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement