కొరుక్కుపేట: ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన నిధులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలి. స్థానిక ప్రభుత్వ ప్రతినిధుల కార్యకలాపాలను అడ్డుకోకూడదు. చైన్నె నగరంలో మౌలిక సదుపాయాల పనులు అమలు జరగాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ తరపున మంగళవారం కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. జిల్లా కార్యదర్శి సెల్వ నేతత్వంలో ఈమేరకు కార్యకర్తలు నినాదాలు చేశారు.
పెరుమాళ్ ఆలయ ప్రదక్షిణ
సేలం: విష్ణుపతి శకం ప్రారంభానికి గుర్తుగా భక్తు లు ఈరోడ్ కోటలోని పెరుమాళ్ ఆలయం చుట్టూ 27 సార్లు ప్రదక్షిణ చేశారు. కోరికలు తీరాలని మొక్కుకున్నారు.


