క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Nov 18 2026 12:38 AM | Updated on Nov 18 2026 12:38 AM

వైభవంగా శ్రీవళ్లి దేవసేనా సమేత శివసుబ్రహ్మణ్యం

కొరుక్కుపేట: ^ðlO¯ðl² ´ë™èl-^é-MýS-Í-õ³-r, ¿ýæçÜ-Ð]l-Ķæ$ůŒS Ò«¨ÌZ° MýSí³ÌS ѯé-Ķæ$MýS §ólÐ]l-Ýë¦-¯]l…ÌZ° Ð]lãÏ §ólÐ]l-õܯé çÜÐól$™èl } ÕÐ]l-çÜ${º-çßæÃ׿ÅÝëÓ-Ð]l¬ÌS ÐéÇMìS } çÜP…«§ýl-çÙíÙt ÌS„>-Æý‡a¯]l ç³NfË$ OÐðl¿ýæ-Ð]l…V> °Æý‡Ó-íßæ…-^éÆý‡$. D¯ðlÌS 9Ð]l ™ól© ¯]l$…_ D ¯ðlÌS 17Ð]l ™ól© Ð]l$…VýS-âýæÐé-Æý‡Ð]l¬ Ð]lÆý‡MýS$ Ðólyýl$-MýSË$ ÝëV>Ƈ$$. Æøþ E§ýlĶæ$… 7 VýS…॥-ÌSMýS$ {ç³™ólÅMýS AÀõÙ-MýS…, ÝëĶæ$…{™èl… 7 VýS…॥-ÌSMýS$ ©´ëÆ>-«§ýl¯]l ™èl¨-™èlÆý‡ ÑÔóæçÙ ç³NfË$ OÐðl¿ýæ-Ð]l…V> °Æý‡Ó-íßæ…-^éÆý‡$. A…§ýl$ÌZ ¿êVýS…V> ÝùÐ]l$ÐéÆý‡… Æ>{† , } Ð]lãÏ-§ólÐ]l õܯé çÜÐól$™èl } ÕÐ]l-çÜ${º-çßæÃ׿ŠÝëÓÐ]l¬ÌSÐé-ÇMìS MýSâêÅ-×-Z-™èlÞÐ]l… OÐðl¿ýæ-Ðø-õ³™èl…V> °Æý‡Ó-íßæ…-^éÆý‡$. ò³§ýlªçÜ…QÅÌZ ´ëÌŸY¯]l² ¿ýæMýS$¢Ë$ ÝëÓÑ$ÐéÇ MýS´ë-MýS-sê-„ýS-Ð]l¬ÌSMýS$ ´ë{™èl$-ÌS-Ķæ*ÅÆý‡$. Ð]l$…VýSâýæ-ÐéÆý‡… Æ>{† ^èl…§ýl-¯é-ÌS…-M>Æý‡…™ø Ðólyýl$-MýSË$ çœ$¯]l…V> Ð]l¬W-Ô>Ƈ$$. C…§ýl$ÌZ ^ðl¯]l²ç³#Ç §ólÐé…VýS çÜ…çœ$ M>Æý‡ÅÐ]l-Æý‡Y…, BÌSĶæ$ «§ýlÆý‡Ã-MýSÆý‡¢Ë$ ´ù§ýlÌS ÒG‹Ü MýS–çÙ~Ð]lÊÇ¢, ´÷¯ól²Ç íÜ. Æ>«§é-MýS–-çÙ~¯ŒS, C…M> Ķæ*Æ>Õ Æ>Ð]l$-MýS–çÙ~ Ôðæsìæt ´ëÌŸY-¯é²Æý‡$.

రూ. 1.50 కోట్ల వ్యయంతో పునరుద్ధరణ పనులు

– పర్యాటక కేంద్రంగా మారిన పల్లికరనై సరస్సు

కొరుక్కుపేట: చైన్నెలోని పల్లికరనైలో ఉన్న నారాయణపురం చెరువు సుమారు 32 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ చెరువును పునరుద్ధరించి, సుమారు రూ. 1.5 కోట్ల అంచనా వ్యయంతో స్విమ్మింగ్‌ పూల్‌గా మార్చే పనులు జరుగుతున్నాయి. 750 మీటర్ల పొడవున నడక మార్గం, ప్రహరీ గోడ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని అధికారులు తెలిపారు. పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకోనున్న నారాయణపురం సరస్సును మంగళవా రం ఉదయం షోలింగనల్లూరు ఎమ్మెల్యే ఎల్‌. ఎ. శరవణన్‌, చైన్నె కార్పొరేషన్‌ దక్షిణ జిల్లా డిప్యూటీ కమిషనర్‌, ఉన్నతాధికారులతో కలిసి సందర్శించి పరిశీలించారు. వచ్చే జనవరిలో పడవ సముదాయాన్ని నిర్మించే పని ప్రారంభమవుతుందన్నారు.

భార్య, ప్రియుడిని కొడవలితో నరికి చంపిన భర్త

సాక్షి, చైన్నె: అరుప్పుకోట్టై సమీపంలోని పాలయంపట్టి కోతనార్‌ కాలనీకి చెందిన శరవణకుమార్‌ (27) ఇటుక బట్టీలో కూలీగా పనిచేస్తున్నా డు. ఇతనికి పొన్నళగు (21)తో ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, అదే ప్రాంతంలోని యాదవ్‌ వీధి కి చెందిన ఆనందరాజ్‌ (30) కూడా ఇటుక బట్టీ లో పనిచేస్తున్నాడు. ఆనందరాజ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పని ప్రదేశంలో ఏర్పడిన పరిచ యం కారణంగా ఆనందరాజ్‌, పొన్నళగు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలుసుకున్న శరవణకుమార్‌ తన భార్యను, ఆనందరాజ్‌ను పలుమార్లు మందలించాడు. అయినప్పటికీ వారిద్దరూ తమ తీరు మార్చుకోకపోవడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో మనస్తాపం చెందిన శరవ ణకుమార్‌ భార్యకు దూరంగా ఉంటూ వస్తున్నా డు. సోమవారం రాత్రి పొన్నళగు తన ముగ్గురు పిల్లలను అమ్మమ్మ ఇంటికి పంపించి, రాత్రి 10.30 గంటల సమయంలో ఆనందరాజ్‌ను తన ఇంటికి పిలిపించుకుంది. అదే సమయంలో అర్ధరాత్రి సమయంలో అక్కడికి వచ్చిన శరవణకుమా ర్‌, ఇంట్లో తన భార్య ఆనందరాజ్‌తో కలిసి ఉండటాన్ని చూసి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. పక్క నే ఉన్న రాయిని తీసుకుని వారిపై విసరడంతో పాటు, కొడవలితో ఇద్దరినీ విచక్షణారహితంగా నరికాడు. తీవ్ర గాయాలపాలైన పొన్నళగు, ఆనందరాజ్‌ అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం ఇంటికి బయట గడియ పెట్టి వెళ్లిపోయిన శరవణకుమార్‌, మంగళవారం ఉదయం అరుప్పుకోట్టై టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయి జరిగిన విషయాన్ని వెల్లడించాడు.

టాస్మాక్‌ దుకాణం ముందు ప్రభుత్వ బస్సు ఆపి..

– మద్యం కొన్న కండక్టర్‌ డిస్మిస్‌ – డైవర్‌ సస్పెన్షన్‌

తిరువొత్తియూరు: తెన్కాసి జిల్లా శంకరన్‌కోవిల్‌ నుండి తిరువేంగడం మీదుగా కోవిల్‌పట్టికి రోజూ అనేక ప్రభుత్వ బస్సులు నడుస్తుంటాయి. ఈ క్రమంలో టీఎన్‌ 72 ఎన్‌ 2826 నంబర్‌ గల కొత్త సీఎన్‌జీ బస్సును కూడా నడుపుతున్నారు. సోమ వారం రాత్రి శంకరన్‌కోవిల్‌ నుండి బయలుదేరిన ఆ బస్సు తిరువేంగడంలో ప్రయాణికులను ఎక్కించుకుని బయలుదేరింది. ఈ బస్సులో గణేశమూర్తి డ్రైవర్‌గా, ముత్తయ్య కండక్టర్‌గా విధుల్లో ఉన్నారు. బస్సు బయలుదేరిన కొద్దిసేపటికే కోవిల్‌పట్టి రోడ్డులోని తిరువేంగడం నిమ్మకాయల మార్కెట్‌ సమీపంలో ఉన్న టాస్మాక్‌ దుకాణం వద్ద ఆగింది. అనంతరం బస్సు వెనుక ద్వారం వద్ద కండక్టర్‌ నిలబడి ఉండగా, ఎదురుగా ఉన్న మద్యం దుకాణం నుండి వచ్చిన ఒక వ్యక్తి మ ద్యం బాటిల్‌ తీసుకువచ్చి కండక్టర్‌కు ఇచ్చాడు. ఆ తర్వాత ప్రభుత్వ బస్సు అక్కడి నుండి వెళ్లిపోయింది. దీనిని ఆ ప్రాంతంలో నిలబడి ఉన్న కొందరు వీడియో తీశారు. ఆ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్‌ అవుతున్నాయి. ఈ దృశ్యాలను చూసిన సామాజిక కార్యకర్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై రవాణా సంస్థ అధికారులు విచారణ జరిపి సంబంధిత బస్సు డ్రైవర్‌, కండక్టర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.ఇదిలా ఉండగా, రవాణా సంస్థ అధికారులు విచారణ జరిపి, సంబంధిత బస్సులో విధుల్లో ఉన్న డ్రైవర్‌ గణేశమూర్తిని సస్పెండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement