4వ అంతస్తు నుండి కిందపడిన జాలరి మృతి | - | Sakshi
Sakshi News home page

4వ అంతస్తు నుండి కిందపడిన జాలరి మృతి

Nov 18 2026 12:38 AM | Updated on Nov 18 2026 12:38 AM

తిరువొత్తియూరు: ఎన్నూరు సమీపంలోని ఎర్నావూర్‌ సునామీ నివాస సముదాయం 13వ బ్లాక్‌లో కుమార్‌ ( 47) నివసిస్తున్నారు. ఈయన ఒక జాలరి. సోమవారం రాత్రి కుమార్‌ 4వ అంతస్తులో ఉన్న తన ఇంటి డాబాపైకి నిద్రించడానికి వెళ్లారు. అర్ధరాత్రి నిద్రలేచినప్పుడు, ఆయన ప్రమాదవశాత్తు పైఅంతస్తు నుండి జారి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనను చుట్టుపక్కల వారు రక్షించి స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు కుమార్‌ అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై ఎన్నూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఢిల్లీలో శివకుమార్‌తో

ఎందుకు మాట్లాడలేదు?

– సీఎంను ప్రశ్నించిన డీఎంకే

సాక్షి, చైన్నె : ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం విజయ్‌, మేఘదాతు డ్యామ్‌ నిర్మాణ అంశంపై కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో ఎందుకు చర్చించలేద ని డీఎంకే న్యాయ వ్యవహారాల సంయుక్త కార్యదర్శి పరంధామన్‌ ప్రశ్నించారు. చైన్నెలోని డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై పలు విమర్శలు గుప్పించారు. సీఎం విజయ్‌, విద్యాశాఖ మంత్రి రాజ్‌మోహన్‌ ఢిల్లీలో కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌, కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీలతో కలిసి ఒకే కార్యక్రమంలో పాల్గొన్నారని పరంథామన్‌ గుర్తుచేశారు. ఆ సందర్భంలో మేఘదాతు డ్యామ్‌ నిర్మించవద్దని డిమాండ్‌ చేసే ధైర్యం సీఎంకు లేకుండా పోయిందని ఆయన ఆరోపించారు. ఇటీవల బెంగళూరులో జరిగిన మెట్రో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ సమక్షంలోనే కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ మాట్లాడుతూ, ఎవరు అడ్డుకున్నా కేంద్ర ప్రభుత్వ సహకారంతో మేకెదాటు డ్యామ్‌ ను పూర్తి చేసి తీరుతామని ప్రకటించారని పరంథామన్‌ గుర్తు చేశారు. అలాగే, 50 ఏళ్ల నాటి కావేరీ ట్రిబ్యునల్‌ తీర్పును పునర్‌ సమీక్షించాలని మాజీ ప్రధాని దేవెగౌడ కూడా కోరుతున్నారని ఆయన ప్రస్తావించారు. సింధు జలాల ఒప్పందం తరహాలోనే కావేరీ జలాల తీర్పును కూడా పునర్‌ పరిశీలించాలని కర్ణాటక సుప్రీంకోర్టులో వాదిస్తోందని, ఇది తమిళనాడుకు పెను ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం విజయ్‌ మౌనం ఇలాగే కొనసాగితే కావేరీ డెల్టా ప్రాంతాలు ఎడారిగా మారే ప్రమాదం ఉందన్నారు. అంతకుముందు ఇదే అంశంపై సీనియర్‌ నేత దురైమురుగన్‌ స్పందిస్తూ, తమిళనాడు అనుమ తి లేకుండా కర్ణాటక ఒక్క బకెట్‌ కావేరీ నీటిని కూడా అడ్డుకోలేదని వ్యాఖ్యానించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement