స్వామియే శరణం! | - | Sakshi
Sakshi News home page

స్వామియే శరణం!

Nov 18 2026 12:38 AM | Updated on Nov 18 2026 12:38 AM

● అయ్యప్ప భక్తుల దీక్షలు ప్రారంభం ● ఆలయాల కిట కిట ● మాలలధారణ

సాక్షి, చైన్నె : కార్తీక మాసం ప్రారంభంతో మంగళవారం రాష్ట్రంలోని భక్తులు అయ్యప్ప మాలలను ధరించారు. అయ్యప్ప ఆలయాలు భక్తులతో కిట కిటలాడాయి. మాలలు ధరించి భక్తులు స్వామియే.. శరణం అయ్యప్ప అన్న నామస్మరణను మా ర్మోగించారు. వివరాలు.. కార్తీక మాసంలో అయ్య ప్ప మాలధారణతో భక్తులు దీక్షలు చేపట్టడం జరుగుతున్న విషయం తెలిసిందే. శబరి మలైలోని అయ్యప్ప ఆలయం తెరచుకోవడంతో 41 రోజుల దీక్షతో స్వామి దర్శనానికి వెళ్లేందుకు రాష్ట్రంలోని భక్తులు సిద్ధమయ్యారు. శబరి మలైకు వెళ్లి స్వామి వారిని దర్శించడం కోసం అయ్యప్ప మాలలను ధరించి భక్తితో ముందుకు సాగే విధంగా ఉరకలు తీస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కార్తిక మాసం సోమవారం ప్రారంభం కావడంతో భక్తు లు అయ్యప్ప మాలలను ధరించే పనిలో పడ్డారు. ఉత్తర చైన్నెలోని అయ్యప్ప ఆలయం, మహాలింగపురం , రాజమలై పురంలోని అయ్యప్ప ఆలయం తదితర చైన్నెలోని పలు చోట్ల ఉన్న అయ్యప్ప ఆలయాలలో వేకువ జాము నుంచే ప్రత్యేక పూజ లు జరిగాయి.

అయ్యప్ప శరణం

చైన్నెతో పాటూ కన్యాకుమారి, తిరుచెందూరు , తిరునల్వేలి తామర భరణి నదీ తీరం, కోయంబత్తూరుతో పాటుగా రాష్ట్రంలోని పలు జిల్లా, నగర ,మండల కేంద్రాలు, గ్రామాలలోని అయ్యప్ప ఆలయాలలలో భక్తులు తరలి వచ్చి పూజలతో తులసి, రుద్రాక్ష మాలలు ధరిస్తున్నారు. కొందరు అయితే, మాలు ధరించకుండానే 41 రోజుల పాటూ దీక్షతో పూజల్లో నిమగ్నం అవుతున్నారు. అలాగే రోజూ అయ్యప్ప ఆలయలలో గణపతి హోమం, అభిషేకా ది ప్రత్యేక పూజలు జరగనున్నాయి. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇక, తిరువళ్లూరులోని అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో మాలలు ధరించారు. తొలి రోజు అయ్యప్ప ఆలయాలన్నీ భక్తులతో కిట కిటలాడాయి. శబరి మలై వైపుగా వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక రైలు సేవలకు సైతం దక్షిణ రైల్వే ఏర్పాట్లు చేపట్టింది. ఇదిలా ఉండగా కార్తిక మాసం ఆరంభంతో కాయగూరలకు సైతం అమాంతంగా రెక్కలు వచ్చాయి. భక్తులు అయ్యప్ప దీక్షను చేపడుతుండటంతో శాఖ హారంపై దృష్టి పెట్టే వాళ్లు అధికం. ఈదృష్ట్యా, సోమవా రం నుంచి అన్ని రకాల కాయగూరల ధరలు పెరగడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement