మధ్య మాటల సమరం
సాక్షి, చైన్నె : మధురైకు చెందిన ఎంపీ వెంకటేషన్, మధురై ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ జీఆర్ స్వామినాథన్‌ల మధ్య వక్తిగత మాటల దాడి తీవ్ర చర్చకు దారి తీసింది. పరస్పరం తగ్గేది లేదన్నట్టు గా విమర్శలకు దిగారు. చైన్నెలో జరిగిన మహా పెరియవ పుస్తకావిష్కరణ సభలో జస్టిస్ స్వామినాథన్ మాట్లాడుతూ.. పెరియార్ గ్రంథాలయంలోని నకి లీ పుస్తకాలను తొలగించి, వాటి స్థానంలో మహా పెరియవ పుస్తకాలను పెడితేనే ఆ అవకతవకల పాపం తొలగిపోతుందని వ్యాఖ్యానించారు. దీనిపై ఎంపీ వెంకటేశన్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. గ్రంథాలయ కొనుగోళ్లలో అవినీతి జరిగితే చట్టప్రకారం శిక్షించడం న్యాయమూర్తుల పని.. పాపపుణ్యాల గురించి చెప్పడం జ్యోతిష్యుల పని అంటూ విమ ర్శించారు. ఇది కాస్త న్యాయమూర్తి, ఎంపీ మధ్య మాటల యుద్దాన్ని తారాస్థాయికి చే ర్చింది. కోయంబత్తూరులోని పెరియార్ విజ్ఞాన కేంద్రం, గ్రంథాలయ పుస్తకాల కొనుగోలులో అవకతవకల గురించి జస్టిస్ స్వామినాథన్ స్పందిస్తూ, చైన్నె నుంచి మదురై వెళ్లే పాండియన్ ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు తాను స్టేషన్‌కు వెళ్లినప్పుడు, ఎంపీ వెంకటేశన్ ఖరీదైన మెర్సిడెస్–బెంజ్ కారులో దిగడం చూశానని పేర్కొన్నారు. ఆయన వేసుకున్న బూ ట్లు, చొక్కా అన్నీ బ్రాండెడ్ కంపెనీలవేనని, తాను స్లీపర్ క్లాస్‌లో ప్రయాణిస్తుంటే కమ్యూనిస్ట్ నాయకుడైన ఆయన ఫస్ట్ క్లాస్ ఏసీలో వెళ్లారంటూ వ్యాఖ్యానించా రు. కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు అయి ఉండి కూడా ఒక కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ తరహాలో ఖరీదైన కారు లో తిరుగుతూ, ఇంత వైభవంగా జీవిస్తున్నారని ఆయ న వ్యాఖ్యానించారు. కేవలం పుస్తకాల ద్వారా వచ్చే రాయల్టీలతోనే ఆయన ఇంతటి విలాసవంతమైన జీవితాన్ని గడపగలరో లేదో తనకు తెలియదంటూ జస్టిస్ స్వామినాథన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.దీనికి ఎదు రు దాడిగా ఎంపీ వెంకటేషన్ తీవ్రంగానే దాడి చేయ డం ఈ ఇద్దరి మధ్య వివాదం చర్చకు దారి తీసింది.
వ్యక్తిగత దాడి తగదు..
తన విలాసవంతమైన జీవనశైలిపై మద్రాస్ హైకో ర్టు మదురై బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ జి.ఆర్. స్వామినాథన్ చేసిన వ్యాఖ్యలకు మదురై ఎంపీ, కమ్యూనిస్ట్ నేత వెంకటేశన్ ఘాటుగా బదులిచ్చా రు. తన ఎక్స్ ఖాతాలో ఆయన పేర్కొంటూ, ‘‘నేను ఒక కమ్యూనిస్టును అయినందుకు ఎంతో గర్వపడుతున్నాను. ప్రశ్నించే తత్వాన్ని నాకు కమ్యూనిజమే నేర్పింది. రైల్వే స్టేషన్‌కు నేను వచ్చిన కారు గురించి విమర్శలు చేశారు. వాస్తవాలను సరిచూసుకోకుండా కేవలం ౖపైపెన చూసి చేసే ఇలాంటి వ్యాఖ్యలు పక్షపాతాన్ని బయటపెట్టడమే కాకుండా, నీచమైన వ్యక్తిగత దాడులుగా మారుతాయి.’’ అని మండిపడ్డారు. ‘‘అసలు నాకు సొంత కారే లేదు. ఇక రైలు ప్రయాణం విషయానికొస్తే, ఒక పార్లమెంట్ సభ్యుడిగా నాకున్న అధికారిక హక్కు మేరకే ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణిస్తున్నాను. ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణించినంత మాత్రాన ఒకరి అభిప్రాయం తప్పు అయిపోదు.. అలాగే స్లీపర్ క్లాస్‌లో ప్రయా ణించినంత మాత్రాన ఒకరి అభిప్రాయం ఒప్పు అయిపోదు’’ అని హితవు పలికారు.ఒక వ్యక్తికి సమాజంలో దక్కే గౌరవం అతని ఆలోచనలు, చేత ల ద్వారా వస్తుందన్నారు. నిరాడంబరత అనే సూ త్రంతో నడిచే పార్టీలో పెరిగినవాడిగా, వేసుకునే చొక్కా లేదా ప్రయాణించే తరగతి గురించి ప్రశ్నిస్తే బాధ్యతాయుతంగా సమాధానం చెప్పడం తన కర్తవ్యంగా పేర్కొన్నారు. అయితే, వస్త్ర తనిఖీ చేసే వారి రాజకీయ, తాత్విక నేపథ్యం కూడా ఇక్కడ ముఖ్యమే నని పేర్కొంటూ, సద్గుణం, హేతుబద్ధత కోసం జరిగే పోరాటంలో తాము ఎల్లప్పుడూ గర్వంగా నిలబడతామన్నారు. గత వారం చైన్నెలో జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో తాను సరదాగా చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి, తన విధులను ఎలా నిర్వర్తించాలో ఆయన సూచిస్తున్నట్లుగా ఎంపీ వెంకటేశన్ మండి పడటం గమనార్హం. ఒక ఎంపిని జస్టిస్ వ్యక్తిగతంగా దాడి చేయడాన్ని సీపీఎం రాష్ట్రకార్యదర్శి పి షణ్ముగంసైతం తీవ్రంగా ఖండించారు.


